పుస్తక సమీక్ష
సరదా 'నీతి'
సినీ రంగం రంగుల ప్రపంచం. ఓ సినిమా తీయాలంటే ఎన్నో వ్యయప్రయాసలు. తెరవెనుక మరెన్నో 'మతలబులు'! వాటన్నింటినీ 'ఇనగా ఇనగా ఒక వూరు...' అంటూ వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు రావి కొండలరావు. ఒక ధనవంతుడు తన కుమార రత్నంతో సినిమా తీయాలనుకుంటాడు. ఆ పని చేసేందుకు ఓ మహాశయుడు తోడవుతాడు. ఈయన 'చిత్రలాభము' గురించి తన అనుభవాలు జోడించి చిత్రోపదేశం చేయడం వెుదలెడతాడు. ఆ తరవాత చిత్రభేదము, చిత్రఖేదము, చిత్రవోదము... ఇలా సాగుతుందీ (సి)నీతి చంద్రిక. కథనం వ్యంగ్యమైనా కథ మాత్రం వాస్తవం!
(సి)నీతి చంద్రిక
రచన: రావి కొండలరావు; పేజీలు: 72; వెల: రూ.35/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- భరద్వాజ్
------------------------------------------------------
ఆంగ్లసాహిత్య పరిచయం
మాలతీచందూర్ శైలిలో ఆత్మీయత పాలెక్కువ. ఎవరో బాగా ఎరిగినవారు కబుర్లు చెబుతున్నట్టు చకచకా సాగిపోతుంది. మనది కాని సాహిత్యం గురించి, మనది కాని వాతావరణం గురించి చెబుతున్నప్పుడూ ఆదే ప్రవాహం. దాదాపు మూడు దశాబ్దాలుగా 'పాత కెరటాలు' శీర్షికతో ఆమె 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వసాహిత్యంలోని ఒక ఇంగ్లిషు నవలని పరిచయం చేస్తున్నారు. వాటినే ఇప్పుడు రెండు సంకలనాలుగా తీసుకొచ్చారు. జెన్‌ట్రెహె 'మదర్ సుపీరియర్' నుంచి ఆర్థర్‌హెయిలీ 'ఎయిర్ పోర్ట్' దాకా దాదాపు యాభై నవలల్ని సంక్షిప్తంగా పరిచయం చేశారు. ఆంగ్ల సాహిత్యం గురించి ఎంతోకొంత తెలుసుకోవాలనుకునే తెలుగు పాఠకులు చదివితీరాల్సిన పుస్తకాలివి.
మాలతీ చందూర్ నవలా మంజరి-1; పేజీలు: 232; వెల: రూ.125/-
మాలతీ చందూర్ నవలా మంజరి-2; పేజీలు: 240; వెల: రూ.125/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- అభి (ఈనాడు, 07:09:2008)
___________________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home