"సంకేత పదకోశం"
"త్రిలోకాలు, త్రికరణశుద్ధి, దుష్టచతుష్టయము, పంచప్రాణాలు, పంచాంగము, పంచద్రావుడులు, పంచమహాపాతకాలు, సప్తసముద్రాలు, సప్తర్షులు, అష్టదిగ్గజాలు, నవధాన్యాలు, దశావతారాలు, షోడశోపచారాలు, అష్టాదశ పురాణాలు", ఈవిధంగా అంకెలతో కూడిన మాటలు తెలుగువారి నోట మాటి మాటికి వినబడుతుంటాయి. త్రికరణలంటే ఏమిటి? పంచాంగానికి ఆ పేరు ఎలా వచ్చింది? సప్తర్షులు ఎవరు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఇలా అంకెలతో కూడిన మాటలకు నిలయమే- "సంకేత పదకోశం".దీని సంపాదకులు సంస్కృత పండితులూ,కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపాధ్యక్షులూ ఐన ఆచార్య రవ్వా శ్రీహరి గారు.
"సంకేత పదకోశం" అనే ఈ పుస్తకం సంఖ్యలతో ప్రారంభమయ్యే అయా శాస్త్రపదాల వివరణనిచ్చే ఒక చిన్న సంఖ్యాపద నిఘంటువు. దీనిలో వేద వేదాంగాలు, దర్శనాలు (అవైదీకమైన జైన, బౌద్ధ,చార్వాక దర్శనాలు కూడా),వ్యాకరణము,తర్కము,మీమాంస,జ్యోతిషము,అలంకారము,
పురాణేతిహాసాలు,సంగీతము, ఆయుర్వేదము, అర్థశాస్త్రము మొ// శాస్త్రములకు చెందిన 2400 పదాలకు వివరణమియ్యబడ్డాయి.సంకేత పదాలను 'ఏక ' అనే పదం నుంచి, మన సంప్రదాయం ప్రకారం 'అష్టోత్తరశతం ' వరకు ఈకోశంలో చేర్చారు.
ఇదో మంచి సంప్రదింపు గ్రంథము.
కోశ వివరాలు:
"సంకేత పదకోశము"
సంపాదకులు-ఆచార్య రవ్వా శ్రీహరి
రెండవ ముద్రణం 2002
పతంజలి పబ్లికేషన్స్
హైదరాబాదు
వెల రూ.125
----------------------------------------------------------------
Labels: Books, Telugu literature/ books
2 Comments:
chala thanks andi.
2:57 pm
ఇది చాలా విస్తృతమైన రెఫరెన్సు పుస్తకం కానీ ఇందులో అష్టాదశ కన్యలు దొరక్కపోయటం నన్ను కొంచెం నిరుత్సాహపరచింది
5:58 pm
Post a Comment
<< Home