ఫన్‌కర్ ఫటాఫట్
* నా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే ఏ వ్యాపారం మేలు?
పూలు, పళ్లవ్యాపారం.
* కాసులో తేడావస్తే..
అంతా తిర'కాసు'
* ఇన్ని చెబుతున్నారు కదా... మీరేం చేస్తారు?
'జవాబు'దారీగా ఉంటాను.
* చాలామంది తమ షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టుకుంటారు. అయినా కొంతమందికి నష్టాలొచ్చి అప్పుల పాలైపోతుంటారు ఎందుకు?
పేరు పెట్టుకునే వాళ్లను దేవుడు బాగానే చూసుకుంటాడమ్మా. ఎటొచ్చీ 'నామం' పెట్టేవాళ్లనే ఒక పట్టుపడతాడు.
* గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడం ఎక్కడన్నా జరుగుతుందా?
పౌల్ట్రీ పరిశ్రమలో సహజమే.
* కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు. దీనిని ఆపే మార్గమేమిటి?
'బఫే'ను అలవాటు చేసుకోండి! కూర్చునే అవసరం ఉండదు
* డబ్బుకోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నా. ఇంతకీ నేనేం చేస్తున్నానంటారు?
యోగా మాస్టర్ అయి ఉంటారు. అందుకే రోజూ శీర్షాసనం తప్పట్లేదేమో మీకు.
* వడ్డీ వ్యాపారం చేద్దామనుకుంటున్నా. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెబుదురూ?
'వడ్డి'చ్చేవాడు మనవాడు అవునో కాదో చూసుకుంటే చాలు.
* 'గొడ్డు' చాకిరీ చేస్తున్నాను. మంచిదేనా?
'పాడి' పరిశ్రమకయితే మంచిదే
* గుడికి, కర్మాగారానికి తేడా ఏమిటి?
గుడి మంత్రముగ్ధం చేస్తుంది. కర్మాగారం యంత్రముగ్ధం చేస్తుంది. అయితే రెండు చోట్లా ఎవరి 'కర్మ'కు వారే బాధ్యులు సుమా!
* పొదుపు సొమ్ము భద్రంగా ఉండాలంటే, ఆ డబ్బును ఎందులో పెట్టమంటారు?
నా జేబులో వద్దులెండి.
* నాకు వడ్డీ లేకుండా కోటి రూపాయలు అప్పు కావాలి. ఎవరిస్తారో కొంచెం చెబుదురూ?
నేను ఎదురుచూస్తోంది కూడా అ'ప్పిచ్చి'వాడి కోసమే నాయనా. అసలు కూడా తిరిగి ఇవ్వనక్కర్లేకుండా కోట్లు ఇచ్చేవారు ఎక్కడ దొరుకుతారా? అని వెతుక్కుంటూ ఇప్పటికే 50000 రూపాయలు తగలేశాను.
* దేవుడికి ఈమేల్ ఐడీ ఉంటుందంటారా?
దేవుడికి ఈమేల్ ఐడీ ఎందుకు చెప్పండి? 'ఫిమేల్' ఐడీ ఉంటే చాలు. భార్యల పేరుతోనే కదా వాళ్లకి గుర్తింపు వచ్చింది. సీతాపతి, ఉమాపతి, రాధాకృష్ణ... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు
* సాధారణంగా తీర్చని వాళ్లకే బ్యాంకులు అప్పులు ఇస్తాయి ఎందుకో చెప్పగలరా?
- జోగిపర్తి ప్రసాద్, బుచ్చిరెడ్డిపాలెం
తీర్చేవారికి ఇస్తే 'రుణానుబంధం' అప్పటికప్పుడు తెగిపోతుంది. కదా!అందుకే ఇవ్వరు.
(Eenadu, 28:10:2007)
______________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home