సమాజానికి అద్దం
'సాహిత్యంలో సమాజం ప్రతిబింబించాలి. అదీ సహజంగా వాస్తవికంగా ఉండాలి. అప్పుడే ఆ సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. స్ఫూర్తిగా నిలుస్తుంది'... సరిగ్గా ఈ అభిప్రాయంతో అల్లుకున్నవే ఇనాక్ సృజించిన కథానికా సంపుటులు 'కట్టడి', 'కొలుపులు'. భిన్న పత్రికల్లో విభిన్న సందర్భాల్లో ప్రచురితమైన ఈ కథానికలన్నీ సమాజంలో కనిపించే సమస్యల్నీ సంఘర్షణనీ ఎత్తి చూపించేవే. పోలింగుబూత్‌కు వచ్చి ఓటు వేయలేనివారి నిస్సహాయస్థితిని 'సగం ప్రజాస్వామ్యం'లో, బాలకార్మిక సమస్యని 'లేబరోళ్లు'లో, ఆడపిల్లని కనే తీరతాను అన్న యువతి ధైర్యాన్ని 'పిల్లని కంటాను'లో చూడవచ్చు. నిమ్నకులాలు, బడుగుల సమస్యల్ని తాకిన 'కులవృత్తి', 'పోలే', 'విముక్తి'... వంటివన్నీ ఈ కోవకు చెందినవే. 'మా అమ్మే'లో మనవరాలిని తల్లిగా భావించిన తాతనీ, 'రాధారాధన'లో యువతీయువకుల మధ్య ఉన్న ఆకర్షణనీ, 'తాతా కారు కావాలి'లో పిల్లల ఆటవస్తువుల్లో వచ్చిన మార్పునీ సున్నితంగా సృజించారు. సంభాషణా శైలి ఎక్కడా ఆగదు. కవితాత్మకంగా హాయిగా సాగిపోతుంది.
కట్టడి;
పేజీలు: 214; వెల: రూ.74/-
కొలుపులు;
పేజీలు: 185; వెల: రూ.69/-
రచన: ఆచార్య కొలకలూరి ఇనాక్
ప్రతులకు: జ్యోతి గ్రంథమాల, 4/282, న్యూ సర్వోదయనగర్
మీర్‌పేట, హైదరాబాద్-500 079.
- సాహితి
(Eenadu, 28:10:2007)
_____________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home