Friday, June 16, 2017
Tuesday, June 13, 2017
2147~ పాటే వెన్నెల... పదమే ఊయల...
‘అమ్మా అని నోరార పిలవరా.. ఆ పిలుపే అందరు నోచని వరమురా..’ అంటూ ‘మనుషులు మట్టిబొమ్మలు’లో బిడ్డల కోసం పరితపించే ప్రతి కన్నతల్లి ఆర్తిని అక్షరాల్లో ఆవిష్కరించారు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా..’ అంటూ అమ్మ అనే మాటకు సరికొత్త భాష్యం చెప్పారు ‘ప్రేమించు’ చిత్రంతో. తల్లి, చెల్లి, అర్ధాంగి, కూతురు... ఇలా మగవాడి కోసం తన జీవితం మొత్తం ధారబోస్తోంది మగువ. ఆ సత్యాన్ని ‘మాతృదేవత’లో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ..’తో చెప్పారు సినారె. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు.. సద్దుచేశారంటే ఉలికులికి పడతాడు..’ అంటూ చిన్ని కన్నయ్యలను అమ్మతో జోకొట్టించేశారు ‘జీవనజ్యోతి’లో.
అమ్మ గొప్పతనం గురించి చెప్పే క్రమంలో నాన్నను తక్కువ చేయలేదాయన. బిడ్డలను పూలతోటలో నడిపించేందుకు తాను ముళ్లబాటలో నడిచేందుకు సిద్ధమయ్యే తండ్రిని ‘ఓ నాన్నా నీ మనసే వెన్న.. అమృతం కన్న అది ఎంతో మిన్న..’ అని ‘ధర్మదాత’లో కీర్తించారు. ‘అనగనగా ఒక రాజు అనగనగా ఒకరాణి.. రాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్న..’ అంటూ ‘ఆత్మబంధువు’తో పిల్లలకు విలువలు నేర్పించారు. ‘చదువురాని వాడివనీ దిగులు చెందకు.. మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు..’ అంటూ నిజమైన చదువంటే ఏంటో బోధించారు.
ఇలాంటి కన్నప్రేమ గీతాలే కాదు.. కన్నె ప్రణయగీతాల్లోనూ తన చమక్కు చూపించారు సినారె.
‘వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే..’ అని ‘బందిపోటు’తో పాడించి రాకుమారిని మేడ దింపారు. ‘పూజాఫలం’లో ‘పగలే వెన్నెల జగమే వూయల..’ అంటూ వూహాలోకంలో పరవశింపజేశారు. ‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..’ అని ప్రేమ వూసుల ఆచూకీ చూపించారు ‘రాముడు భీముడు’లో. ‘ఛాంగురే బంగారు రాజా.. మజ్జారే మగరేడా.. మత్తైన వగకాడా..’ అంటూ ప్రియురాలి విరహ తాపాన్ని ‘శ్రీకృష్ణపాండవీయం’ లో కళ్లకుకట్టారు. ‘నువ్వలా ముందుంటే నిన్నలా చూస్తుంటే..’ అని ‘గూఢచారి 116’ పాడుకున్నా, ‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’ అంటూ ‘గోపాలుడు భూపాలుడు’లో పడుచు పిల్ల చిలిపిగా ఆరా తీసినా, ‘అమ్మమాట’లో ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు..’ అని కన్నెపిల్ల వాపోయినా, ‘ఎంతవారుగానీ వేదాంతులైనగానీ వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్..’ అని ‘భలే తమ్ముడు సెలవిచ్చినా, ‘చిట్టిచెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..’ అనే పాట ఇప్పటి ప్రేక్షకుల నోళ్లలోనూ నానుతున్నా.. అదంతా సినారె కలం మహత్యమే.
మెరిసే ముత్యాలు...: సినారె పాటల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సూక్తులు, జీవిత సత్యాలూ ఉన్నాయి. ‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’ అనే పాటతో మనుషులకెందుకు కులభేదమని ప్రశ్నిస్తారు ‘కర్ణ’ చిత్రంలో. ‘ఎవరికీ తలవంచకు.. ఎవరినీ యాచించకు..’ అని ఆత్మవిశ్వాసం నూరిపోస్తారు ‘నిండు సంసారం’లో.
‘మంచి మిత్రులు’లోని ‘ఎన్నాళ్లొ వేచిన ఉదయం..’ పాటలో మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని ధైర్యమిస్తాడు.
‘ఇదేనా మన సంప్రదాయమిదేనా..’ అంటూ ‘వరకట్నం’ దురాచారంపై ఎలుగెత్తి నిరసిస్తాడు.
‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు..’ అని ‘కోడలు దిద్దిన కాపురం’లో గుర్తుచేశాడు.
‘రైతు కటుంబం’లో ‘ఈ మట్టిలోనే పుట్టాము.. ఈ మట్టిలోనే పెరిగాము..’ అంటూ మట్టితో రైతు అనుబంధాన్ని ఆవిష్కరించారు.
Labels: Quotes/ Telugu, songs, Telugu language, Telugu literature, Telugu literature/personality
Thursday, January 12, 2017
Saturday, January 07, 2017
2137~ Motivating lined from Mahakavi Sri Sri
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
'స్నేహితుడొకడు మోసం చేశాడని,'
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని
ఆ సముద్రపు కెరటాలే
ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా
చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన
ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది
ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని
నీలో కసికసిగా ప్రవహిస్తుందే
ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి
వీల్లేదు..,
లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన
ఆ మానసిక భాదల
సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు
మొదలుపెట్టు...
నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే
బద్దకాన్ని వదిలేయ్... ,
నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే
సమాదానం వెతుక్కో... ,
నీ నీడ నిన్ను
వదిలేయకముందే వెలుగులోకి
వచ్చేయ్..,
మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే
చరిత్రను రాయగలవని
తెలుసుకో..
*చదివితే ఇవి పదాలు
మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.
-SriSri
Labels: Life/telugu, Quotes/ Telugu, Self development/Telugu, Telugu literature
Friday, June 12, 2015
Thursday, May 28, 2015
Monday, March 09, 2015
Friday, March 06, 2015
1879- Burra Saimadhav's punch dialogues! ( writer for movies- Krushnam vande jagadgurum, Gopala Gopala, malli malli idi rani roju)
Saturday, February 28, 2015
Wednesday, January 14, 2015
Friday, January 09, 2015
1766- Telugu Quotes
Yandamoori Virendranath
ఏదీ తనంత తానే నీ దరికి రాదు...శోధించి సాధించాలి...అదే ధీరగుణం.
Sri Sri
Sri Sri
Labels: Quotes/ Telugu
Tuesday, December 09, 2014
Thursday, November 13, 2014
Sunday, July 06, 2014
1549- సర్వ ధర్మ పరాయణం (సువర్ణ , రజత , ప్లాటినం సూత్రాలు)
పరాయణం అంటే సర్వోత్తమమైన ఆశ్రయం, గమ్యం అని అర్థం. అయనం అంటే ఆధారం, ఆశ్రయం, నివాసం, ద్వారం అని అర్థాలున్నాయి. పర-అయనం అంటే ఉత్కృష్టమైన గమ్యం, ఆశ్రయం! సర్వ ధర్మాలకు పరాయణమై, సర్వ ధర్మ మార్గాల్లో అత్యుత్తమమైన మార్గం అని చెప్పే ధర్మం ఒకటి ఉంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ఇది మహాభారతం శాంతిపర్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది.
మహా భారత యుద్ధం పూర్తయిన తరవాత, భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన వసిష్ఠ శిష్యుడు, ధర్మశాస్త్ర విశారదుడు. సర్వ విద్యలకూ ఆయన ఆశ్రయం. రేపు ఉత్తరాయణం రాగానే ప్రాణత్యాగం చేయాలని ఎదురుచూస్తున్నాడు. ధర్మరాజు బంధుమిత్ర పరివార సమేతంగా తాతగారి దగ్గరకు వెళ్ళి సుదీర్ఘమైన, అత్యద్భుతమైన ధర్మచర్చలు చేస్తాడు. ఈ చర్చల సారాంశంగా భీష్ముడు ధర్మరాజుకు ఒక్క ధర్మం బోధిస్తాడు. అది బాగా లోక ప్రసిద్ధమే అయినా తరచుగా మననం చేసుకోదగిన ధర్మం.'ధర్మ సర్వస్వ నైజ స్వరూపం' కరతలామలకంగా ఒక్క మాటలో చెబుతాను, విను' అని భీష్ముడు ఈ అతి ముఖ్యమైన ధర్మాన్ని బోధిస్తాడు. ఇతరులు ఏమేమి చేస్తే తన మనసుకు కష్టంగా ఉంటుందో, తాను ఇతరులకు అవి చేయకుండా ఉండటం గొప్ప ధర్మమార్గాల్లో అన్నిటికన్నా విశిష్టమైంది. ఇది సర్వధర్మాల సంగ్రహ రూపం.
ఒక విచిత్రమేమిటంటే ఈ ధర్మం ప్రపంచంలో ఉన్న ప్రధాన మత సంప్రదాయాలు అన్నింటిలోనూ కనిపిస్తుంది. బౌద్ధ, జైన, యూదు, పార్సీ, క్రైస్తవ, మహమ్మదీయ మతాల మత గ్రంథాలన్నింటిలోనూ ఈ సూత్రం కనిపిస్తుంది. అన్ని మత సంప్రదాయాల్లో దాదాపు ఒకే రూపంలో కనిపించే ఒకే ఒక్క ధర్మసూత్రమూ ఇదే.
'ఏ వ్యవస్థలోనూ ఇతరులను నొప్పించటమనేది న్యాయమూ ధర్మమూ కాజాలదు' అన్నాడు సోక్రటీస్. అది సత్యమే కదా?
'నువ్వు ఇతరులకు ఏం చేశావో, వాళ్లు నీకు అదే చేస్తారు, సిద్ధపడు!' అని హెచ్చరిస్తాడు సెనెకా అనే వేదాంతి.
'నీకు అప్రియంగా నువ్వు భావించేదాన్ని, ఇతరుల మీద రుద్దకు' అంటాడు కన్‌ఫ్యూషియస్ అనే చైనా దేశపు విజ్ఞాని.
'నేను ఎలాంటివాడినో ఇతరులూ సరిగా అలాంటివారే. వాళ్లు ఎలాంటివారో నేనూ సరిగ్గా అలాంటివాడినే' అనే సూత్రం గౌతమ బుద్ధుడి బోధల్లో కనిపిస్తుంది. 'అవతలివాళ్లను నీతో పోల్చుకొని వారూ నీ వంటివారే అని గమనించు. చంపవద్దు, హింసించవద్దు' అంటుంది 'ధమ్మపద' అనే బౌద్ధ మత గ్రంథం.
'ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకొంటావో వాళ్లకు నువ్వూ అదే చెయ్యి' అనేది బైబిల్ బోధించే ముఖ్యమైన ధర్మ సూత్రాల్లో ఒకటి. 'నీతోటివాడిని నీలాగే ప్రేమించు!' అని బోధిస్తుంది పాత నిబంధనల పుస్తకం.
'స్వర్గానికి వెళ్లేందుకు తేలిక మార్గం ఏదైనా తనకు బోధించ'మని ఒక శిష్యుడు మహమ్మద్ ప్రవక్తను అడిగితే, 'ఇతరులు నీకు ఏం చేస్తే బాగుంటుందో, అది నువ్వు ఇతరులకు చెయ్యి, వాళ్లు నీకు చేసేవాటిలో నీకు నచ్చనివి నువ్వు వాళ్లకు చెయ్యకు!' అన్నాడట.
ఇలా అన్నీ మతాల బోధనల్లోనూ కనిపించే ధర్మసూత్రం కనుక దీన్ని 'సువర్ణ సూత్రం'(గోల్డెన్ రూల్) అన్నారు. 'ఇతరులు నీకేది చేస్తే నీకు బాగుంటుందో, అది వాళ్లకు నువ్వు చేయి' అనేది ఈ సూత్రం సకారాత్మక రూపం.
చెయ్యవలసిన విధిని చెబుతున్నది. ఇది సువర్ణ సూత్రం. భారతంలో చెప్పినట్టు, 'ఇతరులు ఏం చేస్తే నీకు అప్రియంగా ఉంటుందో, అది వాళ్లపట్ల నువ్వు చెయ్యకు' అనేది నకారాత్మక రూపం. చేయకూడని పనిని నిషేధరూపంలో చెబుతుంది. దీన్ని 'రజత సూత్రం'(సిల్వర్ రూల్) అనటం కద్దు.
ఈ సువర్ణ సూత్రంతో విభేదించే ప్రముఖులూ ఉన్నారు. జార్జి బెర్నార్డ్ షా ఇలా చమత్కరిస్తాడు- 'ఇతరులు నీకేం చేస్తే నీకు బాగుంటుందో, అది నువ్వు వాళ్లకు చెయ్యటం ఎప్పుడూ వివేకవంతమైన మార్గం కాదు సుమా! నీకు నచ్చింది వాళ్లకు నచ్చాలని ఎక్కడుంది?'
'నిరాశావాదులు, పిడివాదులు తమకున్న విలువలు, నమ్మకాలతో ఈ సూత్రాన్ని పాటించకపోతేనే ఇతరులకు మేలు. అందుకే ఈ సువర్ణ, రజత సూత్రాలకు తోడుగా 'ప్లాటినం సూత్రం' అన్న పేరుతో ఒక కొనసాగింపు ఉంది. 'నీకేది బాగుంటుదో అది ఇతరులకు చేయడం కాదు. వాళ్లకేది బాగుంటుందో చక్కగా ఆలోచించి, అది వాళ్లకు చేయి!'
________________________________
Labels: Life/telugu, Quotes/ Telugu, Religion/telugu, Self development/Telugu
Friday, July 04, 2014
Saturday, March 22, 2014
1380- '-మాతరం'
_____________________
(1)అలనాటి స్వాతంత్ర యోధుల నినాదం- 'వందేమాతరం'
(2)ఈనాటి రాజకీయ నేతల నినాదం- 'బందే'మాతరం
(3)తాగుబోతు, రౌడీముఠాల నినాదం- 'మందే'మాతరం
(4)హోటల్ యజమానుల నినాదం- 'విందే'మాతరం
(5)ఈనాటితారల నినాదం- 'నందే'మాతరం
(6)కుఱ్ఱకారు/ఫాస్ట్ కల్చర్/
ఆడుతూపాడుతూ చేసే నినాదం- 'చిందే'మాతరం
(7)ప్రతిపక్షాల నేతల నినాదం- 'నిందే'మాతరం
(8)గుక్కెడు నీళ్ళకోసం ఆడవారి నినాదం- 'బిందే'మాతరం
(ఆంధ్రభూమి, 27:06:2002)
____________________________________
Labels: Humour/ Telugu, Life/telugu, Quotes/ Telugu, satire, Telugu/ culture
Tuesday, March 18, 2014
1373- లాభం, నష్టం & స్వార్థం:
______________
"అసలు మనిషికి నష్టం ఎందుకు కలుగుతుంది?
లాభం ఆశించటం వలన!
నువ్వు ఏదైతే నీదనుకొన్నావో, అది నీదికాకపోవటమే నష్టం. ఎక్కడైతే "స్వార్థం" లేదో అక్కడ "నష్టం" లేదు.
ఈ ప్రపంచంలో 'నిస్వార్థం' అనేది ఏదీ లేదు. సహేతుక స్వార్థం, సాధారణ స్వార్థం, నిర్హేతుక స్వార్థం అని మూడు ఉన్నాయి.
ఇద్దరికీ లాభం వచ్చే స్వార్థం సహేతుకం. కేవలం తన లాభం చూసుకోవటం సాధారణ స్వార్థం. తన లాభం కోసం అవతలివారికి అన్యాయం చేయడం నిర్హేతుక స్వార్థం."
(విజయానికి ఆరో మెట్టు- యండమూరి వీరేంద్రనాథ్)
____________________________________
Labels: Finance, Knowledge, Life/telugu, Quotes, Quotes/ Telugu, Religion





























