Friday, June 16, 2017
Sunday, July 20, 2014
1552- Some Telugu Movies Dubbed in to Telangana
Some Telugu Movies Dubbed in to Telangana.
1. Narasimha Naidu = Nursing Yadav
2. Parugu = Uruku
3. Akkada Ammai Ikkada Abbai = Gaada Pori Geeda Poradu
4. Siddhu from Srikakulam = Mallesh from Malkajgiri
5. Village Lo Vinayakudu = Galli Lo Ganeshudu
6. Ammailu Abbailu = Porilu Poragalu
7. Sankranthi = Bonalu
8. Anveshana = Devulaata
9. Bava Garu Bagunnara = Em Bava Manchigunnave
10. Palnati Brahma naidu = Karimnagar KCR
11. Nari Nari Naduma Murari = Pori Pori Nadimitla ND Tiwari
12. Aavida Ma Aaviday = Gadee Na Pendlame..
Labels: Cinima/ Telugu, Humour, Humour/ Telugu
Saturday, March 22, 2014
1380- '-మాతరం'
_____________________
(1)అలనాటి స్వాతంత్ర యోధుల నినాదం- 'వందేమాతరం'
(2)ఈనాటి రాజకీయ నేతల నినాదం- 'బందే'మాతరం
(3)తాగుబోతు, రౌడీముఠాల నినాదం- 'మందే'మాతరం
(4)హోటల్ యజమానుల నినాదం- 'విందే'మాతరం
(5)ఈనాటితారల నినాదం- 'నందే'మాతరం
(6)కుఱ్ఱకారు/ఫాస్ట్ కల్చర్/
ఆడుతూపాడుతూ చేసే నినాదం- 'చిందే'మాతరం
(7)ప్రతిపక్షాల నేతల నినాదం- 'నిందే'మాతరం
(8)గుక్కెడు నీళ్ళకోసం ఆడవారి నినాదం- 'బిందే'మాతరం
(ఆంధ్రభూమి, 27:06:2002)
____________________________________
Labels: Humour/ Telugu, Life/telugu, Quotes/ Telugu, satire, Telugu/ culture
Friday, June 28, 2013
1229 - నవ్వు అరవై విధాల మేలు
హాసాన్ని ఈశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయుల సంస్కృతిలో ఒక భాగం. 'కారము వాడి చూపులగు, నాకారము శ్వేతచంద్రికగు, సం/స్కారము మందహాసములు, ప్రా/కారము ప్రేమ సన్నిధి గదా!' ఆదిదేవుని ఈ సంస్తుతే ఇందుకొక అందమైన ఉదాహరణ. రావణ వధ అనంతరం అయోధ్యలో ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. సభ పరమ గంభీరంగా ఉంది. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి కిలకిలల నవ్వు! ఎవరికి వారు ఆ నవ్వుకు తమకు తోచిన భాష్యం చెప్పుకోవడం తదనంతర కథా పరిణామం. నవ్వును నిర్వచించటం, సృష్టించిన విధాత మేధకైనా మించిన పని అని చెప్పటమే ఈ కథ ఆంతర్యం. ఆంధ్ర భాగవతం నరకాసుర వధ ఘట్టంలో 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటారు పోతన. భామ మందహాసం అదే. హరిని అరిని ఆ నారి చూసే తీరులోనే భేదం అంతా. గిరిజాసుతుడి రూపాన్ని పాపం చవితి చంద్రుడు ఏ భావంతో తేరిపార చూశాడో... నిందల పాలయ్యాడు. హాసానికి, పరిహాసానికి మధ్య పలుచని మేలి తెర మూలకంగానే భారతంలోనూ సాధ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాల పాలైంది. 'నవ్వకుమీ సభ లోపల/ నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/ నవ్వకుమీ పరసతితో/ నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అని హాసపరిమితుల మీద మనకొక శతక పద్యమూ ఉంది. 'కారణము లేక నవ్వును... ప్రేరణమును లేని ప్రేమ... వృథరా!' అని శతకకారుడు ఏ కారణంతో అన్నాడో కాని- వాస్తవానికి 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు' అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.
'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని పాతకాలం మాట. శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి ఉత్తమ గౌరవమిచ్చారు ఆలంకారికులు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్భోచితంగా సంభాషణలు సాగించినా, అసందర్భంగా సంభాషణల మధ్య తలదూర్చినా, శబ్దాలు విరిచినా, పదాలు అడ్డదిడ్డంగా కూర్చినా, చేష్టలు వికృతంగా అనుకరించినా, అకటా వికటంగా ప్రవర్తించినా... ఇంకా సవాలక్ష ఏవో వంకర టింకర విన్యాసాలు ప్రదర్శించైనా, మందహాసం నుంచి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వులను రాబట్టవచ్చు. తిక్కన సోమయాజి భారతంలో- పిన్న నవ్వు, చిరు నవ్వు, అల్లన నవ్వు, అలతి నవ్వు, మందస్మితం, హర్ష మందస్మితం, ఉద్గత మందస్మితం, జనిత మందస్మితం, అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిది. కలకల నవ్వు, పెలుచ నవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటూ పెద్ద నవ్వులు మూడు. కన్నుల నవ్వు, కన్నుల నిప్పురాలు నవ్వు, ఎలనవ్వు, కినుక మునుంగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు, కటిక నవ్వు, కినుక నవ్వు అని మిగతా మరో ఎనిమిది... మొత్తం ఇరవై రకాల నవ్వులతో వివిధ పాత్రల రసపోషణ రసప్లావితంగా చేసి 'ఓహో' అనిపించారు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభోగాల గురించి కాళిదాసు మొదలు దేవరాయల వరకు, శ్రీనాథుడు లగాయతు చిన్నయసూరి దాకా అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ కోకొల్లలు. ఆ సాహిత్యం సమస్తాన్ని రామాయణ, భారత, భాగవతాదులకన్నా మిన్నగా శతసహస్రాధికమైన శ్రద్ధాసక్తులతో మనం పారాయణ చేశాం. 'ప్రపంచ నవ్వుల దినం' (మే మాసపు మొదటి ఆదివారం) ప్రత్యేకత అంతా... సుమతీ శతక కర్త చెప్పిన ఆ 'కారణం లేని నవ్వు' మహత్తుపై మరింత సదవగాహన పెంచుకోవడమే!
ఉరుకుల పరుగుల జీవితాలు, ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసిరాని నివారణ లేని పెనురోగాలు... ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్న వైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధులకు ఎన్నో అధ్యయనాలు, మరెన్నో పరిష్కారాలు. అందరికీ అందే ద్రాక్షపళ్లేనా అవి? వీలున్నంత దాకా మందుల జోక్యం లేకుండా జీవనశైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతోంది క్రమంగా. నవ్వు నాలుగు విధాల చేటన్న మాట సరి కాదు సరికదా- ఆరోగ్యానికి అరవై రకాల మేలు. చాలా అధ్యయనాల్లో ఉల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం, సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగ గురువు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించిన హాస చికిత్సా విధానం నవ్వుల దినోత్సవ నేపథ్యం. ఎలాంటి కారణం లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు... ఉద్రిక్తతల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి కలుగుతాయి. నవ్వు రక్తవాహికలను విశాలం చేస్తుంది. ఒత్తిడి కారక హార్మోన్ల ఉత్పత్తి మందగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకొంటుంది. వందలాది లాభాల్లో ఇవి కొన్నే. నిస్పృహకు, నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తి నవ్వు పది నిమిషాల వ్యాయామ లాభానికి సమానం. ముఖ సౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక సాధనం. సూదంటు రాయిలాగా మంచివారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానిదే. కారణాలు అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపక నవ్వగలగడం... ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను వెలిగించుకోగలగడం (మే మాసపు మొదటి ఆదివారం)హాస దినోత్సవ సంబరాల వెనకున్న స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తిమంతమైన మంత్రం మన పెదాల మీద ఉంది. అదే నవ్వుల క్లబ్ హాస నినాదం... హా...హా...హా!
(ఈనాడు, సంపాదకీయం, 05:05:2013)
________________________________________
Labels: Events, HEALTH, Humour/ Telugu, Life, Self development/Telugu
Tuesday, January 10, 2012
ప్రేమ Vs పెళ్లి
పావురం _ పంజరం
ఆట _ వేట
అమెరికా _ ఆఫ్రికా
తీపి _ చేదు
గొడుగు _ పిడుగు
ప్రేయసి _ రాక్షసి
సరదా _ దురద
అల _ సునామి
ఆరాధన _ ఆవేదన
చినుకు _ వణుకు
(from facebook)
_________________________
Labels: Humour/ Telugu
Friday, April 09, 2010
విశాఖపట్నం, న్యూస్‌టుడే: 'భరాగో'గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భమిడిపాటి రామగోపాలం బుధవారం విశాఖపట్నంలో గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గుండె సంబంధిత వ్యాధితో గత మూడేళ్లుగా బాధ పడుతున్న ఆయన ఆరోగ్య గత ఫిబ్రవరి నుంచి క్షీణిస్తూ వచ్చింది. విజయనగరం జిల్లా అలమండ మండలం అన్నమరాజుపేటలో 1932 ఫిబ్రవరి 6న భరాగో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సునిశిత హాస్య రచనలకు పెట్టింది పేరైన ఆయన ఎన్నో తెలుగు కథలు, నవలలతో పాటు సినిమా పాటలపై సమీక్షలు రాశారు. 160కి పైగా కథలు, మూడు నవలలు, అనేక వ్యాసాలు రచించారు_____________________________________________
- ఎర్రాప్రగడ రామకృష్ణ
ఇది విన్నవాడు మొహం పక్కకు తిప్పేసి నవ్వుకుని 'ఆహా అలాగా!' అన్నాడట.
'నువ్వేదో వేళాకోళంగా తీసుకుంటున్నట్టుంది. నేనన్నది నా ఒక్కడి అభిప్రాయం అనుకుంటున్నావేమో! మా ఆవిడ అభిప్రాయం కూడా అదే- తెలుసా!'
బాలనాగమ్మ సినిమాలో 'ఆహా నా సొగసే కని మరుడే దాసుడు కాడా' పాట గురించి తన వ్యాఖ్యానాన్ని పై చమత్కారంతో ప్రారంభించే మనిషిని హాస్యప్రియుడనో, రచయిత అయితే హాస్యరచయిత అనో ముద్ర వేయడం లోకానికి రివాజు.
భరాగోను ప్రపంచం ఆ రకంగానే భావించింది. గుర్తించింది. ఒక్కోసారి చిన్న పువ్వు ఆధారంగా ఒకానొక మహారణ్యాన్ని గుర్తు పట్టవలసిన సందర్భాల్లో- లోకం పొరబడే అవకాశాలూ ఎక్కువే ఉంటాయి. అలాంటి పొరబాటే భరాగో విషయంలోనూ జరిగింది. భరాగో తెలుగునాట హాస్యరచయితగా ముద్రపడ్డారు. పడ్డాకా- దాన్ని నిలబెట్టుకోవాలనో, చెరిపేసుకోవాలనో ఎలాంటి ప్రయత్నాలూ చేయకుండా 'కాబోసు' అనుకుని నవ్వేసుకున్నాడాయన.
ఏభై ఎనభై దశకాల మధ్య తెలుగు సాహిత్యపు స్వర్ణయుగ కాలంలో గొప్ప కథకుడిగా పేరు తెచ్చుకున్న భరాగోను హాస్యరచయితగా లోకం ముద్రవేయడంలో భరాగో సహకారం కూడా ఉండటం విశేషం. స్వరాజ్య సమరం ముగిశాక తెలుగువారి సామాజిక జీవనంలోకి స్వార్థ చింతన, సంకుచితత్వమూ చాలా వేగంగా చొరబడ్డాయి. దానికి కారణాలు ఏమిటో, మూలాలు ఎక్కడివో నిశితంగా గమనించి కథల్లో గొప్పగా చిత్రించిన రచయితల్లో భరాగో ముఖ్యుడు. తెలుగువాడి పట్ల ఆపేక్ష, అభిమానం పెంచుకున్న మనిషి కాబట్టే- మనిషిని ద్వేషించడం ఆయనకు వీలుకాలేదు.
'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' కథలో రజక వృత్తి చేసుకునే యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం లభించి, జీవనస్థాయి పెరుగుతుంది. అయినా తన పై అధికారుల ఇళ్లల్లో బట్టలు ఉతికే పని తప్పలేదు. 'పోనీ ఒకలా చెయ్యి. బట్టలు ఉతికేటప్పుడు కొంచెం మోటతనం ఉపయోగించీ, కాస్త బ్లీచింగ్ పౌడరు తగిలించీ, ఇస్త్రీ చేసేటప్పుడు మరికొంచె హీటు పెంచీ నీ నైపుణ్యం చూపిస్తే ఏమన్నా మార్పుకి అవకాశం ఉండొచ్చేమో' అన్న సలహా ఎదురవుతుంది. నిజానికి అది అతని అహాన్ని చల్లార్చే సలహాయే! కానీ, ఆ యువకుడు దాన్ని తిరస్కరిస్తాడు. 'సారీ సర్ నా స్వభావంలో ఉన్న బేసిక్ మోరల్ నన్ను అలా చెయ్యనివ్వదండి!'అని బదులిస్తాడు. భరాగోను గుర్తించవలసింది- ఆ జవాబులోనే! బేసిక్ మోరల్ అని- దేని గురించైతే రచయితగా భరాగో అభిప్రాయపడుతున్నారో అది రచయిత స్వభావంలోనే ఉంటే తప్ప అలాంటి వాక్యం అతని నుంచి ప్రవహించడం కష్టం.
ఈ రకమైన మనస్తత్వంతో తెలుగువాడి ఆత్మలోకపు దివాలాకోరుతనాన్ని చిత్రీకరించేటప్పుడు- ద్వేషానికి బదులుగా సానుభూతి, మనిషి పట్ల వాత్సల్యం, రచయిత శైలిలో హాస్య ధోరణిని ప్రవేశపెడతాయి. మెత్తగా కొట్టిస్తాయి. దానికి వ్యంగ్యమో, హాస్యమో ముసుగేసి మరీ కొట్టిస్తాయి. పైపైకి అవి హాస్యోక్తులుగా భ్రమపెట్టి నవ్విస్తాయి. వాటి పదును నిజానికి చాలా తీవ్రమైనది. హాస్య కథలుగా చలామణీ అవుతున్న ఒక ముళ్లపూడివీ, ఒక భరాగోవి నిజానికి హాస్యకథలు కావు. చాలా గడుసు కథలు. జాణ కథలు. ఈ జాతి పట్ల అపారమైన బెంగలోంచి పుట్టుకొచ్చిన బాపతువి.
అలాగే రాజకీయ క్రీనీడలపై వ్యంగ్య ధోరణిలో చిత్రించిన కథలూనూ. ఉదాహరణకు 'చేతికర్ర'. గవర్నరుగారు పర్యటనకు వస్తున్నారని అధికార యంత్రాంగం అగ్గగ్గలాడుతూ ఎన్నో ఏర్పాట్లు చేసింది. జనాన్ని తెగ కంగారు పెట్టేసింది. ఆ గవర్నరుగారి బాల్యమిత్రుడైన ఒక స్వరాజ్య సమరయోధుడు నానా అగచాట్లు పడి ఎలాగో ఆయన్ను కలుసుకోగలుగుతాడు. అయితే, పోతూ పోతూ దొరగారి చేతికర్రను పొరబాటున పట్టుకుపోతాడు. ఇక దాంతో అధికార గణం హడావుడి చూడాలి. దాన్ని స్వరాజ్య సమరయోధుడి మాటల్లోనే చెప్పాలంటే- 'ఊళ్లోకి ఫలానా వారొస్తున్నారు, కావలసిన వాళ్లు కలుసుకోవచ్చు' అని ప్రకటించినవారు... నేను కలుసుకోవాలని భోగట్టా అడిగితే దరఖాస్తు పెట్టమన్నారు. రెండు రూపాయల కోర్టు స్టాంపు అంటించమన్నారు. నేను పొరబాటున ఆయన కర్ర తెస్తే అది తీసుకోవడానికి అర్ధరాత్రి ఊళ్లో సహం మందిని నిద్రలేపారు. మీ పద్ధతులు మంచివి కావు. మార్చుకోండి. లేకపోతే దేశం పాడైపోతుంది'
ఈ కథను, ముఖ్యంగా ఈ వాక్యాన్ని మన చట్టసభల్లోని పెద్దలకు వినిపించాలనిపిస్తుంది. అంతటి పదునైన చెణుకు భరాగో సొంతం.
ఆయన కథలు చదివాకా 'హాస్య రచయిత' మాత్రమే అని ముద్రవేయడం సాహిత్య ద్రోహం. ఆయన గొప్ప కథకుడు. గుండెలో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకున్న మనిషి. జబ్‌దిల్‌హీ టూట్‌గయా... అంటూ జీవితపు ఆధారషడ్జమానికి బలంగా ఆనుకుని కథాగానాన్ని దిగంతాలు దాటించిన ఘనుడు. 'సుఖకష్టాలు' అనే పదబంధాన్ని ప్రేమించిన స్వాప్నికుడు. కష్టాలనూ, కన్నీళ్లనూ ప్రేమించి, వాటిలోని కరెంటును కథల్లోకి అనువదించి వాటిని సుఖమైన కష్టాలుగా మార్చుకున్న కష్టజీవి. ఆ క్రమంలోనే కష్టాలకు జీవితాన్ని ముడుపుకట్టి వాటి ఘాటుకు తట్టుకోలేకనూ, అలసట మరిచిపోయేందుకని-
నడిచినంత మేరా నవ్వులు విరజిమ్ముతూ నడిచాడు...
గడిపినంత సేపూ సంగీతంతో సావాసం చేస్తూ గడిపాడు...
కథలు వినిపిస్తూ తిరిగాడు...
సంకలనాలన్నాడు... చాకిరీలు నెత్తికెత్తుకున్నాడు..
'ఏమని పాడెదనో...' అని పాడుకుంటూ అనారోగ్యాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నించాడు.
- చివరికి ఓడిపోయాడు. మృత్యు దేవతను పిల్చి 'ఇట్లు తమ విధేయుడు' అంటూ లొంగిపోయాడు.
మనకు మాత్రం నవ్వుకోవడానికి బోలెడు కథలు మిగిల్చిపోయాడు. ఆ రకంగా మన మధ్యనే ఉండిపోయాడు.
(eenaaDu, 08:04:2010)
______________________________
Monday, December 14, 2009
Saturday, September 19, 2009
తెలుగువాడి వేదన

-శంకరనారాయణ
తెలుగువాడు ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని తేల్చి చెబుతాడు. చిన్న జబ్బునైనా తేలిగ్గా చూడడు. పడిశం పదిరోగాల పెట్టు అని కాస్త దూరంగా ఉంటాడు. ముక్కూమొహం చూసేటప్పుడూ జలుబు ఏమైనా ఉందా అని నిశితంగా చూడ్డం ఈమధ్య అలవాటు చేసుకున్నాడు. ఆబాలగోపాలమూ ఇదే వరస!
పూర్వకాలంలో మునులు తపస్సును 'ముక్కు మూసుకుని' ఎందుకు చేసేవారని ప్రశ్నిస్తే- 'స్వైన్‌ఫ్లూ భయంతోనే' అని తెలుగునాట చిచ్చరపిడుగులు జవాబు చెబుతున్నారు. ఈరోజుల్లో అయితే శుభ్రంగా ముక్కుగుడ్డలు వాడుకునేవాళ్లు అంటున్నారు. ప్రజలు స్వైన్‌ఫ్లూతో బాధపడుతుంటే- ప్రభుత్వం మాత్రం 'స్వయం ఫ్లూ'తో బాధపడుతోందని, ఆరోగ్యం 'యావత్తు'పోయి ఆ 'రోగం'తో బాధపడుతున్నవారు విమర్శిస్తున్నారు. మనది అపరిశుభ్ర దేశమనీ, ప్రపంచంలోని చెత్త అంతా ఇక్కడే పేరుకుంటుందనీ ఖండఖండాంతరాల్లో ఒకటే ప్రచారం! విదేశాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయనీ హోరెత్తుతుంటుంది. చిత్రమేమిటంటే, ఎయిడ్స్ మొదలుకొని స్వైన్ ఫ్లూ వరకు అన్ని జబ్బులూ విదేశాలనుంచే ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి తప్ప, ఏ జబ్బూ ఇండియానుంచి ఎగుమతి కావడంలేదు.
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని ఎప్పుడూ పాడే తెలుగువాడు వైద్యంలో చేయితిరిగినవాడే! ఆ మాటకొస్తే పైసా ఖర్చు లేని మందూ మనవాడే చెబుతాడు. 'లంఖణం పరమౌషధం' అంటాడు. మందుకు విపరీతార్థం చెప్పి 'పానా'యామం చేయగల దిట్ట తెలుగువాడే! ఎవడి ఇంట్లో వాడు వైద్యం చేసుకుంటానంటే అతగాడు ఒప్పుకోడు. ఔషధం కానిది అవనిలో లేదు అంటూనే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదంటాడు! నవ్వొచ్చిందంటే వైద్యుణ్నీ లెక్కచెయ్యడు. 'వైద్యో నారాయణో హరిః' అని అందరూ అంటుంటే, అతడు వైద్యోనారాయణో 'హరీ' అని పళ్లికిలిస్తాడు. హరీ అన్నా, టపా కట్టడమన్నా తెలుగువాడి అర్థం వేరుగా ఉంటుంది. తిక్కరేగితే చెట్టంత వైద్యుణ్నీ పట్టుకుని 'నీచేతి మాత్ర వైకుంఠయాత్ర' అనడం తెలుగువాడికే చెల్లు.
ప్రపంచంలో ఏ పిచ్చీ లేనివాడు ఎవడూ లేనట్టే, ఏ జబ్బూ లేనివాడు ఎవడూ లేడన్నది తెలుగువాడి సిద్ధాంతం.
'లేనివాడికి ఆకలిజబ్బు ఉన్నవాడికి అరగని జబ్బు' అని పాడతాడు.
వైద్యవృత్తి రహస్యాలను తెలుగువాడు ఔపోసన పట్టాడు. అందుకే 'చావుకు పెడితేకానీ లంఖణానికి తేలదు' అంటాడు. 'నినువీడని నీడ' ఎవరూ అని అడిగితే వైద్యుడు అని తెలుగువాడు ఠక్కున చెబుతాడు. 'చచ్చేదాకా వైద్యుడు వదలడు' అని చెబుతాడు. వెనకటికి రోగులు వైద్యులను చూసి భయపడేవాళ్లు. స్వైన్‌ఫ్లూ పుణ్యమా అని, ఇప్పుడు రోగులను చూసి వైద్యులు భయపడుతున్నారు. ఏ రోగివల్ల తన ప్రాణంమీదికి వస్తుందోనని తల్లడిల్లుతున్నారు.
'నేను రాను మొర్రో సర్కారు దవాఖాన'కు అనేది ప్రభుత్వ వైద్యుల గీతం కూడా అయిపోయింది.
'ఎన్నో వ్రణాలు కోసినాను, నా వ్రణం కోసినప్పుడున్నంత నొప్పి లేదే' అన్నవాడూ మన వైద్యుడే!
జబ్బులకు సైతం మానసిక బలహీనతలు అంటగట్టడం తెలుగువాడి ప్రతిభే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటాడు!
'ఇంతింతై జబ్బు ఇంతై' అనడం మనవాడికి పరిపాటి. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయిందే అని కలత చెందుతాడు. దీనికన్నా పుండుమీద కారం రాసినట్టు మాట్లాడేవారిని చూసి ఎక్కువ బాధపడతాడు.
'బాధే సౌఖ్యమనే భావన' తెలుగువాడి ఆరోగ్య వేదాంతం! నొప్పికి విరుగుడూ చెబుతాడు. 'గర్భాధానం ముచ్చట్లు లంఖణాల్లో తలచుకుంటే' ఎంత బాగుంటుంది అంటాడు. అన్నీ సాగితే రోగమంత భోగమే లేదంటాడు. 'అన్నం హితవు లేనివాణ్ని కరవేం చేస్తుంది?' అని ప్రశ్నిస్తాడు.
అంతమాత్రాన ప్రతిదానికీ లేదు, లేదంటే వూరుకోడు. ప్రత్యేకించి తన భార్య నోటివెంట లేదు అనే మాట వస్తే అస్సలు వూరుకోడు. 'పుండు మీదికి నూనె లేదంటే బూరెలొండవే పెళ్లామా' అన్నవాడూ తెలుగువాడే.
విశేషమేమిటంటే, తెలుగువాడు వైద్యుడి దగ్గరకు పోయేటప్పుడు తన జాతకం ఎలా ఉందో ఆలోచించడు. వైద్యుడి హస్తవాసి ఎలా ఉందోనని ఆరాతీస్తాడు. అదేమిటంటే 'ఆయుష్షు గల రోగి హస్తవాసి గల వైద్యుని దగ్గరకే పోతాడు' అని చెబుతాడు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వ వైద్యుల నియామకాలన్నీ హస్తవాసి పరీక్షించి ఇస్తే బాగుంటుందనిపిస్తాడు.
అలవోకగా ఆరోగ్య సూత్రాలు, ముందు జాగ్రత్తలు చెప్పడం తెలుగువాడికి అలవాటు. 'అనగా అనగా రాగం, తినగా తినగా రోగం' అంటాడు. 'రాయంగరాయంగ కరణం... పారంగ పారంగ మరణం' అని సిద్ధాంతీకరిస్తాడు. 'అరఘడియ భోగం... ఆరు నెలల రోగం' అనీ హెచ్చరిస్తాడు. అరిశె ఆరు నెలల రోగం బయటకు తెస్తుదని పరిశోధనాత్మకంగా చెబుతాడు.
తెలుగువాడు 'ఎవ్వనిచే జనించు' పద్యమే కాదు , ఎవ్వనిచే మరణించు' అన్న పద్యమూ పాడతాడు. 'ఆయువు గట్టిదైతే అన్ని రోగాలూ పోతాయి' అని ధీమాగా చెబుతాడు. 'ఆయుష్షు లేక చస్తారు కానీ ఔషధం లేక చస్తారా?' అని ఎదురు ప్రశ్నలు వేస్తాడు. ఇంతచేసీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నానంటాడు. 'కొత్త వైద్యుడి కన్నా పాత రోగి మేలు' అంటాడు. అంతవరకు సర్దుకోవచ్చు. ఎటొచ్చీ కొత్త వైద్యుల నియామకం ఎందుకు? పాత రోగులనే వెతికి పట్టి ఆసుపత్రుల్లో వైద్యులుగా నియమించాలంటాడేమోనని ఎంతమంది హడలి చస్తున్నారో ఎవరికి తెలుసు?
(ఈనాడు, ౧౯:౦౯:౨౦౦౯)
__________________________
Labels: Humour/ Telugu, pun/telugu
Wednesday, September 19, 2007
హాసం





(Andhrabhoomi,18:09:2007)(http://andhrabhoomi.net/sahiti.html)
---------------------------------
Labels: Humour, Humour/ Telugu
Wednesday, June 20, 2007
నవ్వంటే నవ్వులాట కాదు
-సోనాలినవ్వు విలువ చెప్పటానికి ''ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు'' అనే పాత పాట చరణం ఒక్కొటి చాలు. ''నీ దరహాసచంద్రికలు నిండిన నా మనస్సులో లేదు కదా లవలేశము పేదరికమ్ము'' అనే పద్యపంక్తి కూడా నవ్వు అనేది మనసుని ఎలా నింపుతుందో చెబుతుంది. ఒక్కసారి నవ్వరాదూ, ముత్యాలు ఏరుకుంటాననీ, మల్లెపూలు కోసుకుంటాననీ ప్రేయసితో చెప్పని ప్రియుడెవరుంటారు? ఆ ఒక్క మాటతో సదరు ప్రేయసి జీవితాంతం నడచి రాదూ...
ఎంత అపరిచితుడైనా (సినిమా కాదు) ఒక్కసారి నవ్వి చూడండి. వెంటనే బదులొస్తుంది. ఆత్మనీ, ప్రేమనీ, స్నేహాన్నీ అన్నింటినీ తెలియజేసేది నవ్వు ఒక్కటే. నవ్వుది జీవద్భాష, నవ్వుది అంతర్జాతీయ భాష. పసిపాప దగ్గర్నుంచీ పండు ముసలిదాకా నవ్వు ఎల్లలెరుగదు. నవ్వుతో కోటి భావాలు పలికించవచ్చు.
ఇలా నవ్వు గురించి ఎంతో చెప్పవచ్చు. రామాయణంలో నవ్వు ప్రస్తావన ఉంది, భారతంలోనూ ఉంది. (ప్రబంధ యుగంలో ఏడ్పుకి ఇచ్చిన ప్రాధాన్యం నవ్వుకి ఇవ్వలేదు.)
నవ్వు గురించి ఎంతైనా చెప్పవచ్చు కానీ నవ్వించేట్టు చెప్పటం కష్టం. ఎదుటివారిని ఇట్టే ఏడిపించవచ్చు కానీ నవ్వించటం కనాకష్టం. నవ్వించటం అంత సులభం కాదు. ఎదుటివాడికి హాస్య చతురత లేకుంటే ఇక బ్రహ్మతరమూ కాదు (బ్రహ్మ నవ్విస్తాడని అర్థం చేసుకోవద్దు). నవ్వించే ప్రతివాడి వెనకాలా ఒక విషాదం ఉంటుందన్నాడు ప్రముఖ హాస్య రచయిత ఆర్ట్ బుక్‌వాల్డ్. ప్రతి ఆనందం వెనకాలా మరొకరి దుఃఖం ఉంటుందన్నాడు బాల్జాక్. (ఈ సూత్రాలన్నీ కితకితలు పెట్టి నవ్వించేవాడికి వర్తించవు).
నవ్వు ఆరోగ్యాన్నిస్తుంది. నవ్వు బలాన్నిస్తుంది. (నవ్వుతున్నప్పుడు బలం పనికిరాదు. మనం దిండుని కూడా ఒడిసి పట్టుకోజాలం. తెలుసా!)
బాల్జాక్ చెప్పింది నిజమేననిపిస్తోంది. నాయకుల ఆనందం వెనకాల ప్రజల దుఃఖం ఉంటుంది. అవినీతీ, కాంట్రాక్టులూ, రోడ్లూ, ప్రాజెక్టులూ, సర్కారు ఇళ్లూ చూడండి... నిజమే కదూ!
''లోకమునందు ఏ మనుజుడు ఎక్కువ ఆనందము పొందును'' అని యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు. దానికి ధర్మరాజు సత్యకాలం మనిషి కనుక పారలౌకిక సమాధానమేదో ఇస్తాడు. నేనైతేనా ''ఎక్కువ కొంపలు ముంచినవాడు ఎక్కువ ఆనందము పొందును. దేశాన్ని నట్టేట్లో ముంచినవాడు బ్రహ్మానందము చెందును.'' అని ఠకీమని జవాబిచ్చేవాణ్ని, యక్షుడి బుర్ర తిరిగి స్పృహ తప్పేట్టు!
''నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు'' అని సిగ్గు తీసి చెట్టుమీద పెట్టేవాళ్లకీ పరమానందం సిద్ధిస్తుంది. లక్షలు తీసుకుని మహిళల్ని దేశాలు దాటించేవాడికున్నంత ఆనందం నీకూ నాకూ దక్కుతుందా?
'లంచం తిన్నావు' అంటే, 'రసీదు చూపెడితేనే ఒప్పుకుంటా' అనేవాళ్లకేం చెబుతాం? గాదెకింది పందికొక్కు రసీదిచ్చి బొక్కుతుందా, దొంగకుక్క రసీదిచ్చి కుండలు నాకుతుందా?
ఆనందించటం నేర్చుకోవాలని రుషులూ, సర్వసంగ పరిత్యాగులూ, ఆనందం పుష్కలంగా దొరుకుతున్నవాళ్లూ ఫ్రీగా ఉద్బోధిస్తారు. ఆ తత్వం తలకెక్కితే అంతా హాయే. దేవదాసు చెప్పినట్టు బాధే సౌఖ్యమనుకోవచ్చు, చీదరింపే సింగారమనుకోవచ్చు. అలా అనుకుంటే చాలు... ఆనందమే ఆనందం, డబ్బే డబ్బు, సౌఖ్యమే సౌఖ్యం! అనుకుంటాంకానీ, ఆనందాన్ని పొందటానికి అనేక మార్గాలున్నాయి. అందుకు సందు దొరక్క ఎదుటివాణ్ని వెక్కిరిస్తాం కాని!
సొంతంగా ఆనందించలేనివాడు ఆనందించేవాణ్ని చూసి ఆనందించటం నేర్చుకోవాలి. అలా కాకపోతే మనకు ఏడుపే మిగులుతుంది. ఆనందించేవాడు చెప్పే సూక్తి ఇది.
అలా నవ్వుకోటానికీ, ఆనందించటానికీ మనకు బోలెడు సరుకుంది. కళ్లంటూ ఉంటే చూసీ, వాక్కంటూ ఉంటే రాసీ అన్నట్టుగా చూడగలిగే భావుకత, నవ్వగలిగే సృజన ఉండాలి. అవి లేకుంటే అది ఎదుటివాడి తప్పా చెప్పండి?
కుక్క పిల్లా, సబ్బు బిళ్లా, అగ్గిపుల్లా ఏదైనా కవితామయమే అన్నట్టు ఏ పార్టీ అయినా, ఏ లీడరయినా, ఏ అధికారి అయినా వాళ్లూ, వాళ్ల చేష్టలూ, వాళ్ల మాటలూ ఆనంద రససాగరంలో ముంచి తేలుస్తాయి. వక్రీకరించి వ్యంగ్య పరచటానికి ఏ కార్టూనిస్టులో, హాస్య రచయితలో అవసరంలేదు. మన నాయకపుంగవాల (పుంగవాలే కాదు గవాలు కూడా అని మనవి) మాటల్ని వరసగా పేర్చుకుపోండి ఫకాల్న నవ్వు వస్తుంది చెకుముకి రాయితో నిప్పు పుట్టినట్టు!
పాతకాలపు జానపద సినిమాలో రాజబాబుని సిపాయిలు పట్టుకుని రహస్యాలు ''చెప్పు చెప్పు చెప్పు'' అని అడిగితే రాజబాబు వారికి చెరో చెప్పు చేతికిచ్చి బురిడీ కొట్టించి పరారై ఆనందిస్తాడు. రాజబాబు ఇద్దరు వ్యక్తుల్ని బురిడీ కొట్టిస్తేనే నవ్వు పుట్టినప్పుడు మన నాయకాగ్రేసరులు ఏకకాలంలో ఎందరినో బురిడీ కొట్టించినప్పుడు ఎంతగా ఆనందించాలి!
తెనాలి రామలింగడు అందర్నీ బురిడీ కొట్టించే కదా నవ్విస్తాడు. నసీరుద్దీన్ కానీ, బీర్బల్ కానీ అంతా బురిడీ వ్యవహారమే కదా, మరి వారికి దొరికిన మర్యాదా, గౌరవాదులు దేశాన్ని బురిడీ కొట్టించేవారికెందుకు లేవు? ఉండాలిగా!
ఇప్పుడు లైన్లోకి వచ్చారుగా... మనకు ఎంత ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, అనంతానందం దొరుకుతోందో ఎరిగారా.
కరెంటు కోతా, రైతుల ఇబ్బందులూ, ఈతిబాధలూ, అవినీతి బాధలూ, నిరుద్యోగం, మోసం, దగా, ఆక్రమణలూ, గూండాయిజం, అధిక ధరలూ ఇవన్నీ మరచి ఆనందంగా ఉండాలంటే వాటిని చూసి నవ్వటం నేర్చుకోవాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలి అన్నారు.
నవ్వు దుఃఖాన్ని మరిపిస్తుంది. నవ్వు బాధల్నించి ఉపశమింప జేస్తుంది. నవ్వులో చాలా రకాలు ఉన్నాయికానీ తేటతెల్లని నవ్వుని పోగొట్టుకోనంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా అజేయంగా నిలుస్తాం. ఈ రోజు కష్టాల్ని చూసి నవ్వుదాం, అవినీతిని చూసి అపహాస్యం చేద్దాం, గూండాయిజంపై వికటాట్టహాసం చేద్దాం, నవ్వుల కొరడాలతో బాధల వీపుల్ని బద్దలు చేద్దాం.
(Eenadu, 06:05:2007)
_____________________________________________
Labels: Humour, Humour/ Telugu
Friday, May 04, 2007
వికటించిన హాస్యం
నవరసాల్లో హాస్యానికి ప్రత్యేక స్థానం ఉంది. హాస్యరసం లేకపోతే నీరసమే మిగులుతుంది. ఇదివరకు పెళ్ళిపాటల్లో, వియ్యాలవారి సరసాల్లో, వదినా మరదళ్ళ సరాగాల్లో కావాల్సినంత హాస్యం జాలువారుతుండేది. భోజనాల సమయంలో వినిపించే పరాచికాలకు, పాటలకు పద్యాలకు అంతే ఉండేది కాదు. కాలం మారి క్యాటరింగ్ సంస్కృతి పెరిగి, బఫే భోజనాల హడావుడి ఎక్కువయ్యాక పెళ్ళిళ్ళలో డాబుదర్పాల ప్రదర్శన పెరిగింది. సరదాలు, సరస సంభాషణలు తరిగాయి. హాస్యం వల్ల మందహాసం నుంచి అట్టహాసం వరకు అనేక రకాల నవ్వులు వెల్లివిరుస్తుంటాయి. కొందరు పొదుపరులు ఎంత నవ్వొచ్చినా దాచుకొని మందహాసంతోటే సరిపెడుతుంటారు. డబ్బు విషయంలో పొదుపు మంచిదేకానీ నవ్వుల విషయంలో కాదు. హాయిగా నవ్వుతుంటేనే ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుందని డాక్టర్లూ చెబుతున్నారు. ఛలోక్తులు, చతురోక్తులు, పరాచికాలు, పరిహాసాలు వంటివన్నీ నవ్వు తెప్పించేవే. తెలుగులో ఇన్ని మాటలున్నా ఇంగ్లీషులో ఉన్న జోక్ అనే పదమే బహుళ ప్రచారంలో ఉంది. జోక్ అనే మాట వింటూనే మొహం ప్రఫుల్లమవుతుంది. ''ఆ కొత్తాయన వట్టి కాకారాయుడనీ పట్టుపరిశ్రమలో ప్రవీణుడనీ మన బాస్‌కి అప్పుడే ఎలా తెలిసిందోయ్'' అని అడిగాడో ఉద్యోగి సహచరుణ్ని. ''ఎలా ఏముంది? మన బాస్ ఇంకా జోక్ చెప్పకుండానే ఈయన పొట్ట చేత్తో పుచ్చుకొని మెలికలు తిరిగిపోతూ నవ్వటం మొదలెట్టాడు'' అని సందేహం తీర్చాడు తోటి ఉద్యోగి.''నీతులకేమి యొకించుక బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో'' అని కవి చౌడప్ప అన్నాడు. అసభ్యతను హాస్యంగా సహృదయులు అంగీకరించరు. అపహాస్యం కానంతవరకే హాస్యం రాణిస్తుంది. నైట్రస్ ఆక్సయిడ్‌ను 'లాఫింగ్ గ్యాస్' అంటారు. ఈ గ్యాస్‌ను పీలిస్తే తెరలు తెరలుగా నవ్వు పుట్టుకొస్తుందిట. హాయిగా నవ్వుకోవటానికి సరసమైన ఛలోక్తులు, జోకులు చాలు. అటువంటి గ్యాస్ పీల్చవలసిన అవసరమేమిటి? షేక్స్‌పియర్ మహాశయుడు మంచి నాటకం ఒకటి రాయాలని కూర్చున్నాడు. ఎంతసేపటికీ భావోద్వేగం కలగడంలేదు. రచన సాగటంలేదు. చేతిలో ఉన్న పెన్సిల్‌ను కొరుకుతూ కూర్చున్నాడు. కొంతసేపటికి చూస్తే పెన్సిల్ మీద పంటి గాట్లయితే చాలా పడ్డాయి కాని ఒక్క భావమూ స్ఫురించలేదు. దాంతో ''టు బైట్ ఆర్ నాట్ టు బైట్'' అనుకున్నాడు. దాంతో బుర్రలో భావం తళుక్కుమని ''టు బి ఆర్ నాట్ టు బి'' అన్న ప్రసిద్ధ డైలాగుతో రసవంతమైన 'హేమ్లెట్' నాటకం రూపుదిద్దుకొంది. కేవలం ఫక్కుమంటూ నవ్వునే తెప్పించనక్కరలేదు. మనస్సును ఆహ్లాదపరచేది హాస్యమే. తనను ఆటపట్టించాలని మాటలు విసురుతున్నవారిని అంతకంటే ఘాటైన మాటతో అవాక్కయ్యేటట్లు చేయటాన్నే రిపార్టీ అంటారు. ఓ మాస్టారు పాఠం వినకుండా అల్లరి చేస్తున్న ఓ కుర్రాడి వైపు బెత్తాన్ని పెట్టి చూపిస్తూ ''ఈ బెత్తం చివర ఓ గాడిద ఉన్నాడు'' అన్నాడు. ''ఏ చివర మాస్టారూ?'' అన్నాడా అబ్బాయి అమాయకంగా. అందుకే ఇతరులను ఆట పట్టించాలనుకునేవారు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఏ ఛలోక్తి అయినా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని తెలుసుకోవాలి!
నొప్పింపక తానొవ్వక ఫక్కున నవ్వించేదే ఛలోక్తి అంటారు. ఎంతటి గంభీరమైన వాతావరణాన్నయినా చక్కని జోక్స్ చల్లబరిచి ఆహ్లాదకరంగా మారుస్తాయి. మొహాన్ని గంటుపెట్టుకొని ధుమధుమలాడుతూ కూర్చున్నవారూ సరసమైన జోకులు విన్నప్పుడు పకపక నవ్వుతూ ప్రఫుల్లవదనులైపోతారు. సర్దార్జీల మీద జోకులు ఎన్నో ఎంతో కాలంగా ప్రచారంలో ఉన్నాయి. గడియారంలో 12 గంటలైనప్పుడు చిన్న ముల్లును ఎవరో ఎత్తుకుపోయారని ఓ సర్దార్జీ కంగారుపడ్డాడని చెప్పే- 'సర్దార్జీ బారా బజే-' వంటి జోకులు వినపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఇటువంటివాటి గురించి ఆట్టే పట్టించుకోకుండా ఉపేక్షించి ఊరుకున్నా ఇహముందు సర్దార్జీలు అలా ఊరుకోదల్చుకోలేదు. ఇటీవల ముంబాయిలోని ఓ ప్రచురణ సంస్థ 'శాంటా బాంటా ఎస్ఎమ్ఎస్ జోక్స్' అనే పేరుతో ఓ జోక్స్ పుస్తకాన్ని వెలువరించింది. ఈ పుస్తకం అట్టమీద శాంటా అనే సర్దార్జీ పింక్‌రంగు తలపాగా చుట్టుకొని ఉండగా బాంటా అనే సర్దార్ నీలంరంగు తలపాగా చుట్టుకొని ఉన్నట్లు ఉంటుంది. లోపల సర్దార్జీలకు సంబంధించిన జోక్స్ ఎన్నో ఉన్నాయి. ఒక జోక్‌లో జిరాక్స్ కాపీ చేతికి అందగానే ఓ సర్దార్‌జీ ఏం చేస్తాడు అంటే అసలుతో పోల్చి చూసుకుంటాడు అని ఉంది. ఇటువంటి జోకులు సిక్కు మతస్థులను, సర్దార్లను కించపరిచేటట్లు ఉన్నాయంటూ ఆ ప్రచురణ సంస్థపై చర్య తీసుకోవాలని సిఖ్ మీడియా అండ్ కల్చర్‌వాచ్ సంస్థ సభ్యుడు జస్మీత్‌సింగ్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ''సర్దార్లకు సిక్కు మతస్తులకు సంబంధించి అభ్యంతరకరమైన ఛలోక్తులు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికైనా వాటికి ఫుల్‌స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది'' అన్నాడు స్వర్ణజిత్ బజాజ్ అనే ఆయన. ''ప్రస్తుతం ఈ పుస్తకం ముంబాయికే పరిమితమైనా త్వరలోనే ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంది. సర్దార్లను కించపరిచే జోక్స్ ఇప్పటికే నెట్‌లో చాలా ఉన్నాయి. ఇటువంటి అవాంఛనీయమైన జోకులపై చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది'' అని కొంతమంది అంటున్నారు. ''ఇటువంటి జోకులపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చర్య తీసుకోవాలి'' అంటున్నాడు మహారాష్ట్ర మైనారిటీస్ కమిషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అబ్రహమ్ మతాయ్. నిజానికి ఒకరిని నొప్పించేవి ఛలోక్తులు కానే కావు. అటువంటి జోక్స్ వల్ల ఎవరికీ నవ్వు రాదు- వాటికి గురైనవారికి బాధ కలుగుతుంది తప్ప. జోక్స్ విసిరి అవతలివారిని నవ్వించాలని ప్రయత్నించేవారు ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది!
(Eenadu-25:03:2007)
--------------------------------------------------------------------------------
Labels: Humour, Humour/ Telugu
Monday, March 19, 2007
సర్వ మత్తు సమ్మేళనం!
- ప్రభవ లక్షన్నర 'మందు' కొట్లున్న రాష్ట్రంలో ఒక్కరోజేం ఖర్మ, నిత్యం అదోరకం ఉగాది! హైదరాబాద్ రవీంద్ర భారతిలో కవిసమ్మేళనానికి మించి, రాష్ట్రమంతా మదిరాసుర జయజయధ్వానాలు నిత్యం లాగే ఈ రోజూ మిన్నంటుతున్నాయి. సురాంధ్రలో తెలుగుతల్లి కన్నీటి సాక్షిగా మదిరకవి సమ్మేళనం జనాన్ని ఊపేస్తోంది. మహాకవుల బాణీలతో సమకాలీన సామాజిక క్షుద్రాన్ని ఆవిష్కరిస్తోంది.
మహాకవంతటి మామూలు కవి చీర్స్ చెబుతూ...
''నాకు గ్లాసులున్నాయ్...
నాకు డోసులున్నాయ్!
ఎవరని ఎంతురోనన్ను...
యేననంత మోదభీకర మదిర లోకైకపతిని'' అంటూ ప్రారంభించాడు.
అంతలోనే, 'తమ్ముడా' అంటూ కవిత్వం తూలిందోగొంతు.
''బీరు పొంగిన మత్తుగడ్డ
బ్రాంది పారిన తూలుసీమ
రాలునిచ్చట బొట్టుబొట్టు తాగిచావర తమ్ముడా!
బెల్టుషాపులు పెరిగెనిచ్చట
రంగుసారా పొంగెనిచ్చట
కాపురములే కూలెనిచ్చట
దుఃఖ భూమిది చెల్లెలా!
విపిినబంధుర మద్యవాటిక ఉప'నిషా'న్మధువొలికెనిచ్చట,
సారా తత్త్వము విస్తరించిన సారా మిద్దెరా తమ్ముడా'' అంటూ మందు కొట్టినా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసింది.
అంతవరకు మౌనంగా 'ద్రవి'స్తున్న నోరు ఒక్కసారిగా పొగలుకక్కింది...
''నేను సైతం బొక్కసానికి
బాటిలొక్కటి హారతిస్తాను!
నేను సైతం మద్య వృష్టికి
జీతమంతా ధారపోస్తాను!
నేను సైతం పుస్తెలమ్మి పస్తులుండి తాగిచస్తాను!'' అంటూ, ఒక్క దమ్ములాగి, మళ్ళీ గళం విప్పాడు కవి...
''పదండి తూలుతు
పదండి పొర్లుతు
పదండి పోదాం పై'పైకి'!
మరో బెల్ట్ షాప్
మరో బ్రాంది షాప్
మరో దుకాణం పిలిచింది!''
అంటూ ఆపి, తన తరవాతి కవి చెప్పేదానికోసం చెవి రిక్కించాడు.
''బాటిలును ప్రేమించుమన్నా
బీరు అన్నది పంచుమన్నా
ఒట్టి బాటిల్ పగలగొట్టోయ్
నిండు బాటిల్ పట్టవోయ్!
బ్రాంది రమ్ములు పొంగిపొరలే దారిలో నువ్వు తాగి పడవోయ్!
మందులోనె మత్తు గలదోయ్
తూలిపడువాడేను మనిషోయ్!
మద్యాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పబోకోయ్
ఆలినమ్మో తాళినమ్మో
తాగి ప్రభుతకు చూపవోయ్!
రాష్ట్రమంటే మట్టికాదోయ్
రాష్ట్రమంతా మందేనోయ్!''
అంటూ కర్తవ్యబోధ చేసింది.
సర్వజిత్తు నామ సంవత్సరం ఎప్పుడనేదానితో సంబంధం లేకుండా సర్వమత్తు కవిసమ్మేళనం కొనసాగుతోంది. మద్యాభ్యుదయ కవులు తమ వంతుకోసం చూస్తున్నారు- మధ్యమధ్యలో బీరు, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్నాది షడ్రుచో'ప్రేత'మైన సమ్మేళన తీర్థాన్ని చప్పరిస్తూ.
మార్చి నెల సగం గడిచిపోయింది. ఎండలు మండిపోతున్నాయ్. పల్లెల్లో పట్టణాల్లో జనం గొంతు తడవడం లేదని విమర్శ వస్తే ఎంతటి అప్రతిష్ఠ! మంచినీళ్ళు దొరకని కుగ్రామాల్లో సైతం సాఫ్ట్ డ్రింకులు, మినరల్ వాటర్ దొరుకుతున్నాయంటే... ప్రభుత్వానికి ఎంతటి అవమానం?
కాబట్టే ఎంతటి మారుమూల పల్లెల్లోనైనా, బస్సు చొరబడని కుగ్రామంలోనైనా, స్కూలూ ఆసుపత్రే లేని తండాల్లోనైనా, అడవిలోనైనా లంకలోనైనా... 'గొంతు తడిపే'ందుకు మన సర్కారు కంకణంతోపాటు నడుం కట్టింది.
పల్లెపల్లెకూ బెల్టుదుకాణాలు విస్తరించి, అక్షరాలా అవి లక్షన్నర దాటిపోయినప్పుడు... ఎవరనగలరు గొంతు తడిసే అవకాశం లేదని?
పదహారు వందలమంది ఉన్న పల్లెలో ఏడు బెల్టుషాపులున్నప్పుడు, శతాబ్దాలనాటి ఆచారాలతో ఏం నిమిత్తం? అసలు ఉగాది ఎప్పుడయితే ఏంటి? పచ్చడిని మించిన 'ఔషధం' ఉండగా ఎందుకీ 'చింత'? పండు, బెల్లం రేట్లు పెరగవచ్చుగానీ, మందురేటు పెరక్కుండా ప్రభుత్వం సకల చర్యలూ తీసుకుందా లేదా?
ఇది సామాన్యుల ప్రభుత్వమనడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా?
నీతి: రాష్ట్ర ప్రభుత్వం నీకేమిచ్చిందని కాదు... రాష్ట్ర ప్రభుత్వానికి ('మందు' తాగడం ద్వారా) నువ్వెంత ఇస్తున్నావన్నది ప్రధానం.
(EEnadu, 19:03:2007)
____________________________________________
Labels: Humour, Humour/ Telugu
Tuesday, May 16, 2006
Enzooy dis fun stuff.
Bill Gates announces that Microsoft plans to release a windows version in Telangana. Here are some Windows related terms that are proposed to be used in the Telangana version of "kitkeel rendvel కిట్కీల్ రెండ్వేల్" (Windows2000):
Just read and enjoy these core telangana words.This will change your mood.
(courtesy of -my nephew Kondal)
KEYWORDS
Microsoft windows 2000=ginta anta metha kitkeel rendvel(గింత అంత మెత్త కిట్కీల్ రెండ్వేల్)
search = dhevulaadu(దెవులాడు)
Save = bachaaiMchu (బచాఇంచు )
Save as = gitla bachaaiMchu (గిట్ల బచాఇంచు)
Save All = anni bachaaiMchu (అన్ని బచాఇంచు )
Help=nannu bachaaiMchu (నన్ను బచాఇంచు )
Find=ethku (ఎత్కు)
Find Again=malla ethku (మల్ల ఎత్కు )
Move=sarkaaiMchu (సర్కాఇంచు )
Zoom=pedhdhagachai ( పెద్దగచై )
Zoom Out=chinnagachai (చిన్నగచై )
Open=thervu (తెర్వు)
Close=muyyi (ముయ్యి )
New=koththadhi (కొత్తది )
Old=paathadhi (పాతది)
Replace=maarcheyyi (మార్చెయ్యి )
Insert= nadimitla pettu (నడిమిట్ల పెట్టు )
space=jaaga (జాగ )
Backspace=enka jaaga (ఎన్క జాగ )
Run=vurku (వుర్కు )
Print=achchu (అచ్చు)
Print Preview=choosi achcheyyi(చూసి అచ్చెయ్యి)
Copy=gatlane dhiMchu (గట్లనె దించు)
Cut=koy (కొయ్)
Paste=athki (అత్కి )
Paste Special=speshal athki (స్పెశల్ అత్కి )
Delete=theesi padey (తీసిపడెయ్ ) /"bondala vettu" (బొందల వెట్టు)(with thanks to 'Trivikram')
View=soodu (సూడు )
Tools=mutlu (ముట్లు)
Toolbar=mutla gottaM (ముట్ల గొట్టం )
Exit=igavOri (ఇగవోరి )
Compress=guMju (గుంజు )
mouse=elka (ఎల్క)
click=voththu (వొత్తు)
Double Click=malla malla voththu (మల్ల మల్ల వొత్తు )
Forward=eedakelli aadki (ఈడకెల్లి ఆడ్కి )
Scrollbar=thippudu gottaM (తిప్పుడు గొట్టం)
Errors=nee nOtla mannu vada (నీ నోట్ల మన్ను వడ )
Double Click with the left mouse button= elka chevvu voka mali
edama dhikku malla malla voththaale (ఎల్క చెవ్వు వొక మలి ఎడమ దిక్కు మల్ల మల్ల వొత్తాలె)
'This program has performed an illegal operation
*"Abort, Retry or Ignore" ? " ==== ee kaaryaM dhoMgalekkaku vaththiMdhi,jaldhi vurku,
lEkuMte malla kottu lEka marsipO (ఈ కార్యం దొంగలెక్కకు వత్తింది,జల్ది వుర్కు,లేకుంటె మల్ల కొట్టు లేక మర్సిపో )
ACCESS =dhorkavattu (దొర్కవట్టు )
ACCESS DENIED =dhorkavattaneeya (దొర్కవట్టనీయ)
Home=iMtiki vO (ఇంటికి వో)
end=konaaki (కొనాకి )
_____________________________________________________________________________________
Labels: Humour, Humour/ Telugu














