My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, October 26, 2007

WISDOM OF A LITTLE GIRL !

A little girl and her father were crossing a bridge.

The father was kind of scared so he asked his little daughter, 'Sweetheart, please hold my hand so that you don't fall into the river.'

The little girl said, 'No, Dad. You hold my hand.'

'What's the difference?' Asked, the puzzled father.

'There's a big difference,' replied the little girl. 'If I hold your hand and something happens to me, chances are that I may let your hand go. But if you hold my hand, I know for sure that no matter what happens, You will never let my hand go.'

In any relationship, the essence of trust is not in its bind, but in its bond.
So hold the hand of the person who loves you rather than expecting them to hold yours. This message is too short, but carries a lot of feelings.

In short love your children and hold them, than expecting them to hold on to you.

(an email forward)
__________________________________

Labels:

Sunday, October 21, 2007

దేవుడు...నిజమా?భ్రమా?

మతం, పవిత్ర గ్రంథాల పేరిట కొనసాగుతున్న అబద్ధాలను ప్రశ్నిస్తూ రిచర్డ్‌ డాకిన్స్‌ రాసిన పుస్తకం 'ది గాడ్‌ డెల్యూజన్‌'. 'దేవుడి భ్రమలో' పేరిట ఇన్నయ్య అనువదించిన దీనిలో దేవుడి ఉనికికి సంబంధించిన అభిప్రాయాలు, నమ్మకాలు, మతం, నీతి, వ్యాపార రీతి తదితర అంశాలను చర్చించారు. 'క్రైస్తవ మతాన్ని మేధావులైన సుప్రసిద్ధులలో అధిక సంఖ్యాకులు నమ్మరు. కాని బహిరంగంగా ఆ విషయాన్ని దాచిపెడతారు. ఆదాయాలు పోతాయని వారికి భయం' అంటారు బెట్రాండ్‌ రస్సెల్‌. మతం, విజ్ఞానంపై కేంబ్రిడ్జ్‌లో టెంపుల్టన్‌ సంస్థ ఓ సమావేశాన్ని నిర్వహించి ఎంపికచేసిన సైన్స్‌ జర్నలిస్టులకు లక్షన్నర డాలర్ల చొప్పున చెల్లించిన వైనాన్ని డాకిన్స్‌ తప్పుబట్టారు. ఆ సంస్థ డబ్బు శాస్త్రీయరంగాన్ని చెడగొడుతోందంటూ నిరసన వ్యక్తం చేశారు. నిరంతరం కొనసాగుతుండే ఈ చర్చనీయాంశాలపై డాకిన్స్‌ ఓ వెబ్‌సైట్‌(వ్వ్వ్.రిచర్ద్దవ్కిన్స్.నెత్)నూ నిర్వహిస్తున్నారు.
దేవుడి భ్రమలో;
రచన: రిచర్డ్‌ డాకిన్స్‌
అనువాదం: ఇన్నయ్య;
పేజీలు: 325; వెల: రూ.200/-
ప్రతులకు: అక్షర, ప్లాట్‌ నం.46
శ్రీనగర్‌ కాలనీ, హైదరాబాద్‌.
- వెంకట్‌
(Eenadu, 21:10;2007)
___________________________________

Labels: ,

బాపు బొమ్మరిల్లు

బాపు బొమ్మ... ఎంత చూసినా తనివి తీరదు.బాపు బొమ్మ... దానికి పోలికా లేదు, సాటీ లేదు.బాపు బొమ్మంటే బాపు బొమ్మే.నవరసాలూ సంస్కృతీ సాంప్రదాయాలూ నిండు జవ్వని సోయగాలూ పురాణేతిహాసాలూ దేవుళ్లూ దేవతలూ... ఆయన కుంచెలో లేనివి లేవు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జందెమేల అన్నట్లు బాపు గురించి ఆయన బొమ్మల గురించి ఆంధ్రులకు పరిచయం చేయనక్కర్లేదు. అలాంటి అపురూపమైన బొమ్మలను అందరికీ అందుబాటులోకి తేవాలని సంకల్పించారు ఆయన అభిమాని దుర్గాప్రసాద్‌. ఎంతో శ్రమించి, కొన్నింటిని 'హరివిల్లు' పేరుతో పుస్తకంలో పొందుపరిచారు. వాటిని ఏయే సైజుల్లో అందిస్తున్నారో కూడా చివర్లో పేర్కొన్నారు. కావాల్సినవారు కొనుక్కోవచ్చు. అంతేకాదు, బొమ్మలు వేయడం నేర్చుకునేవారికోసం చిట్కాలూ ఉన్నాయి. ఇంగ్లిషులో కాకుండా తెలుగులో ఉంటే ఇంకా బాగుండేది.

హరివిల్లు
(బాపు బొమ్మలు ఫర్‌ ఇంటీరియర్‌ డెకరేషన్‌)
సేకరణ: గంధం కనకదుర్గాప్రసాద్‌
పేజీలు: 140; వెల: రూ.500/-
ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలు.
- వరలక్ష్మి
(Eenadu, 21:10:2007)
__________________________

Labels: , ,

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* మా ఫ్రెండొకడు నేనేమి చెప్పినా 'తొక్క'లో విషయం అని తీసిపారేస్తున్నాడు. ఎందుకంటారు?

బహుశా మీ ఫ్రెండ్‌ది అరటిపళ్ల వ్యాపారం అయి ఉంటుంది. అంచేత మీరేమాత్రం వర్రీ అవక అతని మాటల్ని తుంగలో 'తొక్కే'యండి
----------------------------
* నాకెప్పటినుంచో ఓ సందేహం. పసిపిల్లలు సహా అంతా టాటా చెబుతారే తప్ప బిర్లా అనరేమిటండీ?

మనది 'తాతల' నుంచి వచ్చిన సంప్రదాయం కదమ్మా! అందుకే అలా. అంతకుమించి ఎక్కువ ఆలోచించొద్దు.
----------------------------
* ఎఫ్‌ఎమ్‌ రేడియోల భవిష్యత్తు ఎలా ఉండొచ్చునంటారు?

'విను'యోగదారుల మీద ఆధారపడి ఉంటుంది.
-------------------------------
* బలానికి ఏ విటమిన్‌ మంచిది?'ఏ' విటమిన్‌ అని మాత్రం చెప్పకండి.

అన్ని విటమిన్‌లలోకి ఎం(మనీ) విటమిన్‌ ఆరోగ్యదాయకం. ఇతరుల నుంచి అడ్డగోలుగా వచ్చేట్టయితే చచ్చినవాడు కూడా ఎంచక్కా లేచి కూర్చుంటాడు.
---------------------------
* లాభాలు రావాలంటే మార్గం ఏమిటి?

చెబితే నాకేంటి లాభం?
----------------------
* నేను బెడ్‌వర్క్స్‌ చేస్తుంటాను. ఇందులోనూ పోటీ ఎక్కువైపోయింది. తట్టుకొని పైకి రావాలంటే ఏం చేయాలి.

'పరుపు' ప్రతిష్ఠలు పెంచుకోవడమే.
--------------------------
*అవసరమయినవన్నీ అప్పనంగా వస్తుంటే....

'అప్పిచ్చువాడు' పద్యం అవసరమే ఉండదు.
-------------------------
*కొంతమంది డబ్బులు లెక్కపెట్టేటప్పుడు కళ్లకద్దుకుంటారు. ఎందుకని?

తమ కళ్లను తామే నమ్మలేక
-----------------------
*మన కళ్లముందు నుంచే గుజరాత్‌కు గ్యాస్‌ తరలిపోతుందంటే చాలా కంగారుగా ఉంది.

ఏం కంగారుపడొద్దు. నాయకులు ఉన్నంతవరకు 'గ్యాస్‌'కు ఎలాంటి లోటు ఉండదు.
------------------------
*పిచ్చి తుగ్లక్‌ హయాంలో మాదిరిగా మళ్లీ తోలు నాణేలు వస్తే...?

ఎవరు 'తోలు తీస్తారో'నని గడగడ వణికిపోవలసి వస్తుంది.
-----------------------
*గిఫ్టు ఎందుకిస్తారు?

లిఫ్టు కోసం
---------------------
(Eenadu, 21:10:2007)
_____________________________

Labels:

విజయీభవ- దిగ్విజయీభవ

కాలచక్ర పరిభ్రమణంలో పండగలన్నీ సంవత్సరానికొకసారి తిరిగి వస్తూనే ఉంటాయి. తారీకు మారినా తళుకు తగ్గదు అన్నట్లుగా పండగల సందడి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుకొని కొంగ్రొత్త ఆశలు రేపుతూ కొత్త సందళ్ళను తోడు తీసుకొని వస్తూనే ఉంటాయి పండగలు. అందుకే ఆరోజులను పర్వదినాలు అంటారు. పండగల కోసం అంతా ఎంతో ఆతృతతో ఆశగా, ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటారు. పండగ రోజున ప్రతివారిలోను ఉత్సాహం, ఉల్లాసం పొంగులు వారుతూ ఉంటాయి. ముత్యాల ముగ్గుల, మామిడి తోరణాల అలంకరణలతో గృహాలు మెరిసిపోతుంటాయి. ఇల్లాళ్లు గృహాలంకరణలతోను, పిండివంటలు తయారుచేయటంలోను మునిగిపోతే పిల్లలు కొత్త బట్టలు కట్టుకొని మురిసిపోతుంటారు. దినకరుడు చల్లబడి పగటి పొద్దు తగ్గి చలిగాలి చురుకు హెచ్చటమే సంక్రాంతి పండగ వచ్చేస్తోందనే హెచ్చరికకు గుర్తు. 'పుష్యమాసంలో పూసలు గుచ్చే పొద్దుండదు' అని సామెత. సంక్రాంతి రోజుల్లో తెలుగింటి ఆడపడుచులకు క్షణం తీరిక ఉండదు. ఆ వైనాన్నే- ''ఆంధ్ర యువతులు సంక్రాంతి యవసరమున నింటముంగిట నుత్సాహ మిగురులొత్త-'' అని ప్రారంభించి -''పొంకముగ జేసినట్టి యలంకరణము గన్నులం జూడవలె చెప్పగా తరంబె'' అన్నారో కవి.

సంక్రాంతి, ఉగాది, దసరా సహా ఏ పండగ అయినా తెలుగువారి లోగిళ్ళు రకరకాల ముగ్గులతో, ఇతర అలంకారాలతో దీపాలతో వెలిగిపోతుంటాయి. పండగ రోజుల్లో ప్రకృతి సైతం వింత సొగసులను సంతరించుకొంటూ ఉంటుంది. మామిళ్ళు పూతకు రాగా, కొత్తపూవుల సింగారంతో తోటలన్నీ గుబాళిస్తుండగా, కోకిల పాటల నేపథ్యంలో వసంతునికి ప్రకృతి పలికే స్వాగతంలా వస్తుంది ఉగాది. దీపాల కాంతులు వెదజల్లే, టపాకాయల మోతలు వినిపించే శుభ్రజ్యోత్సావళి దీపావళి. భాద్రపద మాసంలో వినాయక చవితితో పండగల రాక ప్రారంభమవుతుంది. అంతకు ముందు- శ్రావణమాసంలో శనగల జోరన్నట్లు చిరుజల్లులతో వరలక్ష్మీ వ్రతాలతో శ్రావణ మాసం హడావుడి చేసి వెళ్ళిపోతుంది. శ్రావణమాసం నెలరోజులూ మహిళలకు పండగే. వినాయక చవితి సందళ్ళు ఇంకా మరుగున పడకుండానే దసరా కొలువులు ప్రారంభమవుతాయి. దసరా చాలా సరదా అయిన పండగ. ''ఇంత లేమబ్బు చిరుతున్కయేని లేదు విప్పిరేమో నిశారాజి వెల్లగొడుగు-'' అని ఓ కవీశ్వరుడు ఆశ్చర్యపోయిన విధంగా ఎండలు తగ్గి, వానలు వెనుకబడి, నిర్మలమైన ఆకాశంలో వెన్నెల వెలుగులు తళతళలాడుతుండగా శరన్నవరాత్రులు వచ్చేస్తాయి. దేవీ నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై నవమితో ముగుస్తాయి. దశమినాడు విజయదశమి పేరుతో దసరా పండగ జరుపుకుంటారు. నేడే ఆ శుభదినం.

దసరా పండగ రోజుల్లో దుర్గాదేవిని రోజుకో అవతారంతో పూజిస్తారు. మహామాయ, మహాకాళి, సరస్వతి, చండి, దుర్గ వగైరా రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. కస్తూరి కళ్ళాపులు, ముత్యాలతో ముగ్గులు గతించిన వైభవాలైపోయినా, ఈనాటికీ దసరా నవరాత్రులను యథాశక్తి ఆడంబరంగానే జరుపుకొంటున్నారు. పులివేషాలు, పిట్టలదొర వేషాలు వగైరా దసరా వేషాలు పల్లెటూళ్ళలో ప్రత్యేక ఆకర్షణగా సందడి చేస్తూ ఉంటాయి. దేవీ నవరాత్రుల్లో ఆయుధ పూజకొక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పాండవులు అజ్ఞాతవాసం చేయటానికి విరాట నగరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నగరపొలిమేరలోని శ్మశాన వాటికలో ఉన్న శమీవృక్షంపై తమ ఆయుధాలనన్నింటినీ మూటకట్టి భద్రపరిచారట. తరవాత దక్షిణ గోగ్రహణ సమయంలో, అప్పటికి అజ్ఞాతవాస కాలం ముగిసిపోవడంతో- విజయదశమిరోజున అర్జునుడు ఆయుధాలను దింపి, వాటికి పూజచేసి, గాండీవాన్ని చేతధరించి, కదనరంగంలోకి వెళ్ళినట్లు భారత కథనం. అప్పటి యుద్ధంలో విజయం విజయుణ్నే వరించిందని వేరే చెప్పక్కర్లేదు. ఈరోజుల్లోనే తెలంగాణాలో బతుకమ్మ పండగలను మహిళలు ఘనంగా నిర్వహిస్తారు. గుమ్మడి, తంగేడు, రుద్రాక్ష, గన్నేరు, బీర వగైరా వివిధ రకాల పుష్పాలను ఒక క్రమ పద్ధతిలో పేర్చి గౌరమ్మను నిల్పి అర్చిస్తారు. దసరా పండగ రోజుల్లో బతుకమ్మ పాటలు తెలంగాణా అంతటా మార్మోగుతూనే ఉంటాయి. ''అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు'' అని పాడుతూ బడిపిల్లలు విల్లంబులు ధరించి ఇంటింటికీ తిరుగుతుండటం దసరా రోజుల్లో మాత్రమే కనిపించే అపూర్వదృశ్యం. కాలం మారిపోవటంవల్ల ఈ అలవాటు చాలావరకు కనుమరుగైనా, కొన్ని పల్లెటూళ్ళలో ఇంకా పిల్లలు తమ పంతుళ్ళతో సహా విల్లంబులు పట్టుకొని- ''శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు ఆరోగ్యమస్తు మీకైశ్వర్యమస్తు, బాలుర దీవనలు బ్రహ్మదీవెనలు-'' అని దీవిస్తూ గ్రామవిహారం చేస్తూనే ఉన్నారు. వారే అన్నట్లు ''బాలుర దీవనలు బ్రహ్మదీవెనలే'' కదా!
(Eenadu, 21:10:2007)
_________________________________

Labels: