My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 01, 2007

4 word letters?


A young couple got married and went on their honeymoon.
When they got back, the bride immediately called her mother.
”Well", said her mother, "so how was the honeymoon?"

"Oh mama"' she replied, "The honeymoon was wonderful! So romantic"...
suddenly she burst out crying.” But, mama, as soon as we returned,
Sam started using the most horrible language -- things I'd never heard before!
I mean all these awful 4-letter words! You've got to take me home! Please mama!

"Sarah, Sarah", her mother said, "calm down!
You need to stay with your husband and work this out.
Now, tell me, what could be so awful? What 4-letter words?"

"Please don't make me tell you mama," wept the daughter.
I'm so embarrassed, they're just too awful! Come get me, please!"

"Darling, baby, you must tell me what has you so upset.
Tell your mother these horrible words!"

Sobbing, the bride said, "Oh, Mama...,
he used words like: dust, wash, iron, and cook..."

*******


Short Jokes:

PATIENT: Doc, my husband passed away only one year after marriage
DOCTOR :Lucky man,he didn't suffer long.

********

PATIENT: (on phone) I am feeling sick. When can I come and see you?
DOCTOR: How about next week.
PATIENT: And if I die by that time?
DOCTOR: Then you can always cancel the appointment.

********
(an e-mail forward)
-------------------------------------------------

Labels:

Friday, August 31, 2007

సాధించాలి






'కోరుకున్నదేదీ తనంత తానుగా నీదరికి రాదు.. శోధించి సాధించాలి'
-మహాకవి శ్రీశ్రీ

____________________________________

Labels: ,

Wednesday, August 29, 2007

అచ్చమైన నుడికి అతడే గొడుగు

గిడుగు జయంతి సందర్భంగా...
- అక్కిరాజు రమాపతిరావు
సమాజానికి, దేశానికి, జాతికి, సాహిత్యానికి గొప్ప మేలు చేసినప్పుడే ఒక వ్యక్తిని మహాత్ముడని, మహనీయుడని, మహాపురుషుడని ప్రజలు భావిస్తారు. అంతకు పూర్వం లేని కొత్త వికాసాన్ని, పరిణామాన్ని, సమాజహితాన్ని ఆ వ్యక్తి సాధించినప్పుడు ఆ జాతి జనులకు ఆయన చిరస్మరణీయుడంటాము. ఆధునిక తెలుగు భాషా సాహిత్య చరిత్రలో గిడుగు రామమూర్తి అటువంటివారిలో ప్రముఖులు.

ప్రపంచాన్ని చూసి నేర్చుకోండి అని తెలుగువారికి ప్రబోధించిన గిడుగు... భాషా శాస్త్ర విజ్ఞానాన్ని తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేశారు. తెలుగును ఆధునికీకరించడానికి బీజావాపం చేసి పంట పొలాన్ని తయారుచేశారు. ఆయన వ్యాకరణాన్ని కాదనలేదు. సంప్రదాయ సాహిత్యాన్నీ వద్దనలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవచ్చనీ చెప్పలేదు. భావ ప్రకటనలో భాషాశైలిలో తప్పులంటూ ఏమీ ఉండవు, ఉంటే మాత్రం ఏం? అనీ అనలేదు. భాష ఎదుగుదలను కాంక్షించాడు. ఆ విషయమే పండిత పామరులందరూ అర్థం చేసుకునేట్లు చెప్పాడు. ఇంటగాని, బయటగాని, ఉపన్యాసాల్లో రచయితల రచనల్లో కాని ఒక భావ ప్రకటన కోసం ఉపయోగించే పదాన్ని అది వ్యాకరణం ద్వారా సమర్థించలేమనో, నిఘంటువులో లేదనో, మాండలికమనో, గ్రామ్యమనో అనకూడదని మాత్రమే ఆయన కట్టడి చేశారు. కవి ప్రయోగం ద్వారా ఆ పదం తాలూకు ఔచిత్యమో, అనౌచిత్యమో చర్చించవచ్చు, నిర్ణయించవచ్చు. కానీ సాధుత్వమో, అసాధుత్వమో నిర్ధరించే హక్కు ఏ పండితుడికీ, ఏ విమర్శకుడికీ లేదనీ, ఉండకూడదనీ ఆయన వాద సారాంశం. డెబ్భై ఏళ్ళ కిందట ఆయన ఏమని చెప్పారో చూడండి: ''విద్యా విధానము మారవలెను. ప్రజలకు సులభముగా తెలిసేటట్టు మాతృభాషలో సమస్త శాస్త్రములు బోధించవలెను. నాజూకుగా సరసంగా సభ్యంగా ఎదుటివారి మనస్సు ఆకర్షించేట్టు మాటలాడడము, ఉపన్యసించడమూ నేర్పవలెను. ప్రజా ప్రభుత్వము బాగా ఉండవలెనంటే వక్తృత్వము బాగా వృద్ధి పొందవలెను''

వక్తృత్వం అంటే దాన్ని మాతృభాషలో కాక ఏ భాషలో వృద్ధి చేయగలుగుతారు? వ్యక్తృత్వానికి అన్య భాషల వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రజాసామాన్యంలో అది సాధ్యమా? ప్రజల సాముదాయక చర్చల వల్ల, అభిప్రాయ వినిమయం వల్ల ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందని, ప్రపంచమంతటా వర్తించే సంప్రదాయం ఇదేనని నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ కూడా అన్నారు. అసలైన ప్రజాస్వామికపు విశాల దృక్పథం ఏమంటే ప్రజల అభిప్రాయం, చర్చలు, వాదోపవాద పరిగణనం, పరిపాలనలో ప్రజల మాట ప్రాధాన్యంగా ఉండాలనీ అయన చెప్పారు. గిడుగువారు చెప్పిందీ అదే. ''గ్రీసు దేశంలో ప్రాచీన కాలంలో వాగ్మిగా ఉండటమే గొప్ప విద్యగా ఎంచుకునేవారు. నోటి మాటకే జయము. నాటక రచన కూడా ఆ దేశంలో వృద్ధి పొంది ప్రజలను విజ్ఞానవంతులనుగా చేయడానికి తోడ్పడింది. మనదేశంలో కూడా వ్రాత (లిపి) లేనికాలంలోనూ, తరువాత అచ్చు పుస్తకాలు రాని కాలంలోనూ నోటి మాట ద్వారానూ ఉపాధ్యాయుల ఉపన్యాసాల వల్లనూ విజ్ఞానం వ్యాప్తమయ్యేది. భావం స్పష్టంగా తెలియవలెనంటే భాష సుపరిచితముగా ఉగ్గుపాలతో అలవడ్డ మాతృభాష అయి ఉండాలి'' అన్నారు గిడుగువారు. ఏదైనా విషయ చర్చకుగాని, విషయ గ్రహణానికికాని, అభిప్రాయ ప్రతిపాదనకుకాని, ప్రజల ఆమోదం పొందడానికి కాని మాతృభాష ద్వారా సాధ్యపడినట్లు వలస పరిపాలన భాషామాధ్యమం ద్వారా సాధ్యమవుతుందా!

ఏ జాతి వికాసమైనా ఏ భాష అభివృద్ధి అయినా ఆ కాలపు విజ్ఞానవ్యాప్తిపైనే ఆధారపడి ఉంటుందనీ జనసామాన్యంలో విద్యనూ, విజ్ఞానాన్నీ వ్యాపింపజేయాలంటే వాఞ్మయం మించిన సాధనం లేదనీ గిడుగువారు పదేపదే ప్రబోధించారు. ప్రజలందరూ గ్రాంథిక భాషా పండితులు కాలేరు. వాడుక భాష వారికి నేర్పితే చాలును అని ఆర్తి చెందారు. 'ఆంధ్రులను విద్యావంతులను చేయడానికి నా మతము అంగీకరించేట్లయితే ఒక మాసము రోజులలో సాధ్యమవుతుంది. ముందుగా వ్యావహారిక భాషలో మీ కరపత్రాలన్నిటిని అచ్చొత్తించండి. ఆ తరువాత తెలుగు అక్షరాలూ గుణితమూ ప్రతివారికీ నేర్పడానికి గ్రామానికొక ప్రచారకుణ్ణి ఏర్పాటు చేయండి. అక్షరాలూ గుణింతమూ మామూలు తెలివితేటలుగలవాడు నేర్చుకోవడానికి వారము పదిరోజుల కన్న ఎక్కువ పట్టదు. ఎప్పుడైతే అక్షరాలూ గుణింతమూ వచ్చాయో ఆ క్షణము నుంచీ మీ కరపత్రాలు మొదలుగునవి చదువుకోగలుగుతారు. ఇంతకన్న దేశములో విద్య వ్యాపింప జేయడానికి సులభమార్గము లేదు. మీరీ పనికి పూనుకొనవలెను. ఈ విధముగా బాల్కను రాష్ట్రాలలో యుద్ధము అయిపోయిన తర్వాత చేసినారు. నేను ఆ విషయమంతా చదివినాను. బాల్కను రాష్ట్రాలలో ఆరు మాసాలలో విద్యాశూన్యత అంతాతొలగిపోయింది' అని 1935లోనే గృహలక్ష్మీ కంఠాభరణమనే వ్యాస సంకలనం పీఠికలో గిడుగువారు ప్రబోధించారు. ఆయన రచనలు, ఆయన విశ్లేషణలు పట్టభద్ర స్థాయి విద్యాబోధనలో, స్నాతకోత్తర స్థాయిలో మన విశ్వవిద్యాలయాలు పాఠ్యగ్రంథాలుగా చేయకపోవడం విచారకరం.

గిడుగువారి వ్యక్తిత్వం, ఉదార హృదయం, ఉదాత్త సంస్కారం చాలా గొప్పవి. గాంధీజీ అస్పృశ్యత నివారణానికి 25 ఏళ్ల ముందే సవరల్లో అస్పృశ్యులని భావించే పానోలను గిడుగువారు తమ ఇంట్లోకి రానిచ్చి ఆదరించారు. సవరల కోసం సొంత సొమ్ము వెచ్చించి, ఉపాధ్యాయులకు తానే జీతాలిచ్చి ఆయన పాఠశాలలు నిర్వహించారు. వాళ్లకోసం నిఘంటువులు, వాచక పుస్తకాలు, వాళ్ల పాటలు, ఆటలు తెలియజేసే పుస్తకాలు ప్రకటించాడు.అటువంటి మహానుభావులు, మార్గదర్శకులు, మహర్షులు ఏరీ ఇప్పుడు!
(eenadu, 29:08:2007)

చూడండి:

గిడుగు పిడుగు

-------------------------------------------------

Labels: ,

"సంకేత పదకోశం"

"త్రిలోకాలు, త్రికరణశుద్ధి, దుష్టచతుష్టయము, పంచప్రాణాలు, పంచాంగము, పంచద్రావుడులు, పంచమహాపాతకాలు, సప్తసముద్రాలు, సప్తర్షులు, అష్టదిగ్గజాలు, నవధాన్యాలు, దశావతారాలు, షోడశోపచారాలు, అష్టాదశ పురాణాలు", ఈవిధంగా అంకెలతో కూడిన మాటలు తెలుగువారి నోట మాటి మాటికి వినబడుతుంటాయి. త్రికరణలంటే ఏమిటి? పంచాంగానికి ఆ పేరు ఎలా వచ్చింది? సప్తర్షులు ఎవరు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఇలా అంకెలతో కూడిన మాటలకు నిలయమే- "సంకేత పదకోశం".దీని సంపాదకులు సంస్కృత పండితులూ,కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపాధ్యక్షులూ ఐన ఆచార్య రవ్వా శ్రీహరి గారు.

"సంకేత పదకోశం" అనే ఈ పుస్తకం సంఖ్యలతో ప్రారంభమయ్యే అయా శాస్త్రపదాల వివరణనిచ్చే ఒక చిన్న సంఖ్యాపద నిఘంటువు. దీనిలో వేద వేదాంగాలు, దర్శనాలు (అవైదీకమైన జైన, బౌద్ధ,చార్వాక దర్శనాలు కూడా),వ్యాకరణము,తర్కము,మీమాంస,జ్యోతిషము,అలంకారము,
పురాణేతిహాసాలు,సంగీతము, ఆయుర్వేదము, అర్థశాస్త్రము మొ// శాస్త్రములకు చెందిన 2400 పదాలకు వివరణమియ్యబడ్డాయి.సంకేత పదాలను 'ఏక ' అనే పదం నుంచి, మన సంప్రదాయం ప్రకారం 'అష్టోత్తరశతం ' వరకు ఈకోశంలో చేర్చారు.
ఇదో మంచి సంప్రదింపు గ్రంథము.

కోశ వివరాలు:
"సంకేత పదకోశము"
సంపాదకులు-ఆచార్య రవ్వా శ్రీహరి
రెండవ ముద్రణం 2002
పతంజలి పబ్లికేషన్స్
హైదరాబాదు
వెల రూ.125
----------------------------------------------------------------

Labels: ,

Tuesday, August 28, 2007

సంకేత పదాలు



(
)తాపత్రయము:n.
Triple cares, all sorts of troubles arising from worldly cares. These are divided into ఆధ్యాత్మికము, ఆధిభౌతికము and ఆధిదైవికము, that is , sorrows caused by, (1) ourselves, (2) others, & (3) by the will of God

(Ref: నిఘంటు తెలుగు ఇంగ్లీషు, చార్లస్ ఫిలిప్ బ్రౌన్)
-----------------------------------

ఆకాంక్ష;
కాంక్షతో కష్టపడడం, తపన, ఆరాటం. (చిన్నపనికి కూడా కొందరు ఎంతో తాపత్రయం పడతారు);
ఆధ్యాత్మికం, ఆధిభౌతికం ఆధిదైవికం అనే మూడు బాధలు.
(నడుపల్లి పాఠశాల నిఘంటువు, తెలుగు తెలుగు, సంపాదకుడు: ఎన్.ఎస్.రాజు)
----------------------------------------

concern, anxiety and cares ;
(lit.) the three struggles, namely sorrows caused by ourselves, by others, and by the will of God; that is
ఆధ్యాత్మికం; ఆధిభౌతికం; ఆధిదైవికం;
(
తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు, compiled by V.Rao Vemuri)
-------------------------------------

grief or sorrow of three kinds - spiritual, material and super spiritual.

(బాలసరస్వతి తెలుగు ఇంగ్లీషు డిక్షనరి, compiler: Dr.దాశరథి)

---------------------------------------------------

(
)శివ పంచాక్షరీ మంత్రం:

'నమశ్శివాయ ' (శివుడా, నీకు నమస్కారం!) అనే ఐదక్షరాలున్న మంత్రం.
-----------------------

(
ఇ)పంచవటి:
1.అశ్వత్థము, బిల్వము,వటము, ధాత్రి,అశోకము అను అయిదు వటము(మర్రిచెట్టు)ల సమాహారము.
2.దండకారణ్యమందలి యొక ప్రదేశము, ఇందు శ్రీరాముడరణ్యవాసకాలమున వసించియుండెను. ఇది యిప్పటి 'నాసిక్' అను చోటికి రెండుమైళ్ళదూరమున నున్నది.
(శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు, నాల్గవ సంపుటం)
--------------------------
1.శ్రీరాముడు అరణ్యవాసంలో కొంతకాలం నివసించిన ప్రదేశం. గోదావరి తీరాన ఉంది. ఐదు వటవృక్షాలు ఇక్కడుండంతో దీన్ని పంచవటి అన్నారు. ఈ ఐదు వృక్షాలు పూర్వం గంధర్వులు. అగస్త్యుణ్ని ఎటూ కదలకుండా చేయాలని ప్రయత్నించి అతని శాపానికిగురై వృక్షాలుగా మారారు.శ్రీరామదర్శనం వల్ల శాపవిమోచనమౌతుందని ముని చెప్తాడు.(కంబ రామాయణం)

2.గౌతమీతీరంలోని అరణ్యం. ఇక్కడ రాక్షసబాధ ఎక్కువగా ఉండేది. వనవాసంలో ఇక్కడుండమని రామలక్ష్మణులకు అగస్త్యుడు
చెప్పాడు.ఇక్కడినుంచే సీతను రావణుడు తీసికెళ్ళాడు.(రామాయణం)
(పురాతన నామకోశం, డా.బూదరాజు రాధాక్రృష్ణ)

-------------------------------

Labels:

Sunday, August 26, 2007

రెండో పురుషార్థం

- డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు
ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు. దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి ''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను. నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప. అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి చూపించాడు.

యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!'' అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలో కూలబోయే ఆ భవనంలాగే.

మనిషి ధర్మం తప్పకూడదనీ, తుది శ్వాస వరకూ దాన్ని విడిచిపెట్టరాదనీ, అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.

నీతి నిజాయతీలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డబ్బు, ఆస్తులు కూడబెట్టినవారి గతి అథోగతి కావడం మనం సమాజంలో చూస్తున్నాం.

అర్థానామార్జనే దుఃఖం ఆర్జితానాంచరక్షణే
నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్థం దుఃఖభాజనమ్‌

డబ్బు కూడబెట్టడంలో దుఃఖం, కూడబెట్టింది రక్షించుకోవడంలో దుఃఖం, అది పోయినా, ఖర్చయినా దుఃఖమే. ఇలా ఇన్ని రకాల దుఃఖాలకు కారణమైన ధనంమీద మనిషికి వ్యామోహం ఎందుకో? డబ్బును దానం చెయ్యాలి, అనుభవించాలి, ఇతరుల కోసం వినియోగించాలి. లేకపోతే నాశనం అయిపోతుంది. నిలబడదు. నాలుగు పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో రెండో పురుషార్థమైన 'అర్థం' ప్రత్యక్షంగా కనిపించేది, లౌకికమైనది. రాయబార సమయంలో శ్రీకృష్ణుడు చెప్పిన పద్యం 'అర్థం' పరమార్థాన్ని చక్కగా వివరిస్తుంది.

ఉన్నదానితో సంతృప్తి చెందక, అన్యుల ధనంకోసం అవినీతి, అక్రమ మార్గాలు అనుసరించి, దారుణ మారణహోమాలకు పాల్పడుతూ, పోరాటాలకు, కుటిల యత్నాలకు తలపడితే అటువంటివారి వంశం నిలబడదు. ధర్మమార్గంలో సంపాదించిన అర్థమే శ్రేయస్సును, శుభాన్ని కలిగిస్తుంది. అక్రమార్జన వలన అనర్థమే మిగులుతుందని శ్రీకృష్ణ భగవానుడు అర్థం గురించి వివరించిన 'పరమార్థం' సర్వకాల, సర్వావస్థలకు ఆమోదయోగ్యం, అనుసరణీయం.
(Eenadu,25:08:2007)
--------------------------------------------------------

Labels: ,

వలస వచ్చిన అదృష్టమూ

'కదిలేదీ కదిలించేదీ కవిత్వం' అని మహా కవి శ్రీశ్రీ అన్నా కవిత్వానికి అంత సీను ఎక్కడిది? మహా అయితే సభ మొదట్లో కిక్కిరిసి ఉన్నా క్షణాల్లో తుపాకీ గుండుకు కూడా మనిషి దొరకకుండా బయటకి కదిలించగలదు. అంతే. నిజానికి మనుషులను కదిలించగల శక్తి డబ్బుకు ఉంది. తెల్లవాడు వ్యాపారం కోసం ఇండియాకు వలస వచ్చినా, నల్లవాడు ఉద్యోగం కోసం ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్లినా గుండె 'డబ్బు డబ్బు' అని కొట్టుకోవడమే కారణం. పట్టా చేత పట్టుకొని కావలసిన చోటుకు జై పరమేశ్వరా అంటున్నది ఇందుకే.

'వలస వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము' అని 'ధన'సారా పాడుకుంటున్నారు. వలసలు ప్రకృతి విలాసాలు వికృతి అయిపోయాయి.

సర్వప్రాణులకు వలస సహజం. తెప్పలుగ చెరువు నిండిన కప్పలు వలస వచ్చును. పక్షులు రెక్కలు కట్టుకుని, పౌరులు 'లెక్క'లు కట్టుకుని వలస వెళ్లుదురు. విదేశాలకు వలసపోయి అక్కడి కంపెనీలు కొంటున్న మనవాళ్లకు 'లక్ష్మీ'కటాక్షం ఉన్న 'మిట్టల్‌'లదే అడుగు జాడ. అమెరికాలో ప్రత్యేకించి సిలికాన్‌ వేలీలో కొత్త పరిశ్రమ వచ్చిందంటే ఆ శ్రమ ప్రవాస భారతీయులదేనని ఇక్కడ ఆశ్రమ వాసులను అడిగినా చెప్పేయగలరు. చదువుల కోసం మన కుర్రాళ్లు విదేశాలకు వలస వెళ్తుంటే, నవ వధువులు 'అ అంటే అమెరికా' అని పల్లవి పాడుకుంటూ సప్త సముద్రాలు దాటి వచ్చే వరుని కోసం చూస్తున్నారు.ఏ మేలుకయినా ఇ-మెయిల్‌ ఉపయోగపడుతున్న ఈ రోజుల్లో వలస పెద్ద కష్టమేం కాదు. కొండ మీది కోతి అయినా చెంగు చెంగున కిందకు వలస వచ్చేస్తుంది.

కాదేదీ వలస కనర్హం ఔనౌను ఫీల్డు అనర్ఘం' అయిపోయింది.
'వెండి' తెర రంగంలో కూడా వలస 'బంగారు' పంట పండిస్తోంది. అ, ఆ, ఇ, ఈ అర్థంగాని వాడు తెలుగు పాట పాడితే గాని అందులోని రెండర్థాల కష్టాలు తెలియవు! అలాగే హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి పనికిరాదు. వైద్యానికి పెరటి చెట్టు మాదిరి. ముంబాయి ముద్దుగుమ్మలు వలస వచ్చి నటిస్తే ఆ మజాయే వేరు. ప్రాంతీయ భాషల నటీనటులు, దర్శకులు బాలీవుడ్‌కు వలస వెళ్లారంటే ధనమే ప్రధానం. డిమాండున్నా వలస రాని అమాయకులుంటారు.'రావోయి చందమామా.. మా వింతగాథ వినుమా..' అని అద్భుతమైన ఆఫర్‌ వచ్చినా, జాబిల్లి ఇక్కడికి తరలివచ్చిన దాఖలాలు లేవు. దాంతో మనిషే చంద్రుడి వద్దకు వెళ్లి వచ్చాడు. అందమైన అమ్మాయిల ముఖాలను చందమామతో పోల్చడంలో ఎంత తేడా ఉందో గ్రహించగలిగాడు. రిక్షాలో వెళ్లినంత తేలిగ్గా మనిషి అంతరిక్షానికి వలస వెళ్లే రోజూ రావచ్చునేమో.

ఎరక్క దుబాయ్‌ వెళ్లి జీవితంలో దెబ్బతిన్న వారిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. వలసలో 'వల' ఉంది అని తెలిసి బాధితులు వలవల వాపోతున్నారు. ఎంత వలసకు అంత నష్టాలా...! ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు ఆగనట్టే, కలతలు వస్తాయని వలసలు ఆగడం లేదు. డబ్బాశ మనిషిని నిలకడగా ఉండనివ్వడం లేదని ఎదురునిల్చి వాదిస్తుంటే, వారించడానికి ఇక ఏముంది?
-ఫన్‌కర్‌

(Eenadu, 25:08:2007)
----------------------------------------------------

Labels:

మేరా భారత్‌ మహాన్‌!

-ఎవరి జన్మభూమి వారికి ప్రియమైనదిగా అనిపించినా, ఏ దేశం ప్రత్యేకత దానిదే అయినా- భారతదేశం సంగతి వేరు. ఈ దేశం భోగభూమి కాదు, కర్మభూమి. అనాదిగా చరిత్రలో, గాథల్లో కర్మభూమిగా పేరుపొంది మన్ననలందుకొంది. భారతావని నాలుగు వేదాలకూ పుట్టినిల్లు. గౌతమబుద్ధుని బోధనలతో, ఆదిశంకరుల ఉపదేశాలతో, వేదఘోషలతో పులకించిన పుణ్యసీమ. ఈ దేశంలో జన్మించటమే మహద్భాగ్యం అని కవులు కీర్తిగానాలు చేశారు. ''ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో జనియించినాడవీ స్వర్గఖండమున-'' అన్న కవి, ''లేదురా ఇటువంటి భూదేవి యెందు...'' అనీ అన్నారు. తమ దేశమే ప్రపంచంలోకెల్లా గొప్పదని ఎందరో భావిస్తుంటారు. ఈ విషయంలో అమెరికన్లు, బ్రిటిష్‌వారు అగ్రస్థానంలో ఉంటారు. ఓ క్లబ్బులో ఓ అమెరికన్‌ పెద్దమనిషీ, ఇంగ్లిషాయనా మాట్లాడుకుంటున్నారు. అమెరికా పెద్దమనిషి తన దేశం ఎంత గొప్పదో వివరిస్తూ గొంతు చించుకొని అనర్గళంగా ఉపన్యసించాడు. ఇంగ్లిషాయనమాత్రం ఒక్క మాటా మాట్లాడకుండా మూతి బిగించుకొని కూర్చున్నాడు. ''అదేమిటండీ ఆ అమెరికా బాబు తన దేశ గొప్పతనం గురించి అంతగా చెబుతుంటే మీరేమి మాట్లాడరేం? మీరూ మీ దేశం ఎంత గొప్పదో నాలుగు ముక్కలు చెప్పవచ్చుకదా?'' అన్నాడు వారితోపాటే ఉన్న మూడో వ్యక్తి. ''వేరే చెప్పటం ఎందుకు? ఆ విషయం ప్రపంచమంతటికీ ముందే తెలుసు'' అన్నాడు ఇంగ్లిషాయన గంభీరంగా.

దేశాభిమానమే కాదు ప్రాంతీయాభిమానమూ సహజంగా ఉండేదే. ''మనం కృష్ణాతీరం వాళ్ళం. పేరు గొప్పే కాదు, ఎక్కడికి వెళ్ళినా పెద్దపీట వేయించుకుంటాం...'' అంటుంది రాజమ్మ అనే ఆమె మల్లాదివారి 'కృష్ణాతీరం' నవలలో. ''ఏటి ఒడ్డున పుట్టిన వాళ్ళెవరైనా అలానే అంటారు. అటు పెన్నలో వాళ్ళు, ఇటు గోదావరిలో వాళ్ళూను. అక్కడ నన్నయ, ఇక్కడ తిక్కన పుట్టుకొచ్చారు'' అని ఎదురు చెప్పినవారికి- ''ఆఁ... భారతమూ పుట్టుకొచ్చింది... మూడూళ్ళు తిరిగితేకాని ముడిపడలేదు. కృష్ణ ఒడ్డున కూర్చొని సంకల్పం చెప్పుకొని, ఒంటిచేతిమీద భాగవతం రాశాడు ఆ పేదబ్రాహ్మడు. అన్నీ నదులే కాని ఇదిరా నాయనా తేడా'' అంటుంది రాజమ్మ. తమ ప్రాంతం పట్ల గల అభిమానం ప్రతివారిచేతా ఇలానే వాదనలు చేయిస్తుంటుంది. పుట్టిన దేశంపై అభిమానం, భక్తీ అవశ్యం ఉండవలసినవే. పాశ్చాత్య నాగరికతా ప్రభావంలో పడి తమ దేశం కంటే ఇతర దేశాల్లో పరిస్థితులే బాగున్నాయని భ్రమించేవారు కొందరుంటారు. చదివింది అయిదో ఫారమే అయినా పైచదువులకు ఇంగ్లాండు వెళ్ళటమే భేషయిన పని అనుకున్న మొక్కపాటివారి పార్వతీశం బారిష్టర్‌ చదువు కోసం పడిన తిప్పలు తెలుగువారిని కడుపుబ్బా నవ్వించాయి. ఎంతయినా ఉన్న ఊరు, కన్నతల్లి, పుట్టినదేశాలకు సాటి వచ్చేవి మరొకటి ఉండవు.

దేశభక్తిలో, దేశం పట్ల మమకారంలో భారతీయులే అగ్రగణ్యులు. ఈ విషయం ఢిల్లీకి చెందిన ఏసీ నీల్సన్‌ కంపెనీ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో తేలింది. మళ్ళీ జన్మంటూ ఉంటే భారతీయులుగానే పుట్టాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం- అన్నది ప్రతి పదిమంది భారత పౌరుల్లో తొమ్మండుగురు వెలిబుచ్చిన అభిప్రాయం. సర్వేలో పాల్గొన్నవారిలో 89 శాతం తిరిగి భారతదేశంలో జన్మించాలన్నదే తమ ప్రగాఢవాంఛ అని చెప్పారు. తాము భారతీయులమని చెప్పుకోవటానికి గర్వపడతామనీ వారన్నారు. భారతీయులుగానే తిరిగి జన్మించాలని ఎందుకు అనుకుంటున్నారు అన్న నిర్వాహకుల ప్రశ్నకు వారు దీటుగానే జవాబు ఇచ్చారు. సంస్కృతీ సంప్రదాయాలకు పెట్టని కోటగా భారతదేశం విల్లసిల్లుతోందని, విదేశీ సంస్కృతుల వెల్లువ దేశాన్ని ఎంతగా ముంచెత్తుతున్నా భారతీయత చెక్కు చెదరకుండా నిలిచి ఉంటోందని, ఆ కారణంగానే వచ్చే జన్మలోను తాము భారతీయులుగానే ఉండాలని కోరుకుంటున్నామని సర్వేలో పాల్గొన్నవారిలో సగంమంది చెప్పారు. దేశంలో ఎన్నో భాషలున్నా, విభిన్న సంస్కృతులు, ప్రాంతాలు ఎన్ని ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశంలో పరిఢవిల్లుతోందని, భారతీయుల పరస్పర మమతానుబంధాలను ఆ భావమే కాపాడుతోందని, ఆ కారణంగానే తాము భారతీయులుగా ఉండటానికే ఇష్టపడతామనీ వారన్నారు. భారత్‌లో కుటుంబ వ్యవస్థ విశిష్టమైనదని, గొప్పదనీ ప్రపంచంలోని ఏ దేశంలోను ఇంతటి ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థ లేదనడంపై భిన్నాభిప్రాయాలకు తావెక్కడిది? ఇక్కడి రాజకీయ వ్యవస్థ ఘోరంగా తయారైందని విమర్శించినవారి సంఖ్య గణనీయంగానే ఉంది. పేదరిక నిర్మూలనపై మరింత శ్రద్ధ వహించాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని, విద్యారంగంపై అధిక శ్రద్ధ వహించి నిరక్షరాస్యత కనపడకుండా చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఎక్కువమంది భారతదేశంలోని జీవనమే సుఖజీవనం అని నమ్ముతూ వచ్చే జన్మలోను భారతదేశంలోనే పుట్టాలన్నది తమ కోరిక అని చెప్పారు. అందుకే అన్నారు- జననీ జన్మభూమీ స్వర్గాదపి గరీయసీ అని!
(Eenadu,25:08:2007)
---------------------------------------------

Labels: ,

జరా.. యాద్‌ కరోనా

1947 ఆగస్టు 15... అర్ధరాత్రి దాటాక మనకు స్వాతంత్య్రం వచ్చింది. అనేక పట్టణాల్లో జనం పార్కులకు వెళ్లారు.
1962లో భారత్‌-చైనా యుద్ధం జరిగింది.
మళ్లీ జనం తండోపతండాలుగా పార్కులకు వెళ్లారు.
స్వాతంత్యానికి, యుద్ధానికి, జనానికి, పార్కులకు ఏమిటి సంబంధం?
ది సమాచార సంబంధం. అప్పట్లో విశేషాలు తెలుసుకోవాలంటే పార్కుల్లో ఏర్పాటు చేసిన రేడియోల చుట్టూ చేరాల్సిందే. రేడియో అంత అపురూపమైన వస్తువు. మరి ఇప్పుడో! అది ఇంటింటికీ చేరింది. జేబుల్లోకి వచ్చేసింది. రేడియో వినేందుకు పార్కులకు వెళ్లేవాళ్లమని పెద్దలు చెబితే ఇప్పుడు పక్కున నవ్విపోతారు. ఇదొక్కటే కాదు... 60 ఏళ్లలో ఇలా ఎన్నో మారిపోయాయి. పాతవి పోయాయి. కొత్తవి వచ్చాయి. కొన్ని పూర్తిగా కొట్టుకుపోగా... మరికొన్ని అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జనజీవితంలో భాగమైన వస్తువులు, విషయాల గురించి నేటి తరానికి తెలియనే తెలియదు. అలాంటి వాటిలో కొన్ని గుర్తు తెచ్చుకుందామా?

గ్రామ్‌ఫోన్‌:
ఓహో మేఘమాలా అందాల మేఘమాలా... అంటూ రాగాలు ఆలపించి ఆలపించి 'రికార్డు' అరిగిపోయింది. ఆగిపోయింది. చల్లగా వచ్చి మెల్లగా వెళ్లిపోయింది. నాటి సంగీత ఝరిని టేప్‌ రికార్డర్‌ మింగేసింది. ఆ టేప్‌రికార్డర్‌నూ ఐపాడ్‌లు, కంప్యూటర్లు మింగేస్తున్నాయి.

బెల్‌బాటమ్‌ ప్యాంట:
అటూ ఇటూ ఓ అరమీటరు ఊడ్చేస్తుంది. కాళ్లకు చక్కగా గాలి వీస్తుంది. పాతతరం హీరోల అభిమాన వస్త్ర విశేషం. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోల్లో మాత్రమే బతికుంది. పాత ఫ్యాషన్‌న్లను కొత్తగా తవ్వుతున్నా... బెల్‌ బాటమ్‌ మాత్రం బయటపడటం లేదు.

వీసీపీ, వీసీఆర్‌:
4వీసీపీలు, వంద వీడియో క్యాసెట్లు! అద్దెకు ఇచ్చుకుంటే డబ్బులే డబ్బులు. పండగొచ్చినా పబ్బమొచ్చినా వీసీపీతో సినిమా విందు. ప్లేయర్లు పోయాయి... వీడియో క్యాసెట్లు పోయాయి. సీడీలు, డీవీడీలు వచ్చాయి.

పేజర్‌:
తొలి సంక్షిప్త సందేశ ప్రసార సాధనం. చప్పున వచ్చింది. చప్పుడు కాకుండా పోయింది. ఎస్‌ఎంఎస్‌తోపాటు మాట్లాడుకునే సదుపాయాన్నీ సెల్‌ఫోన్‌ కల్పించింది. ఫలితం... పేజర్‌ పరార్‌!

ఇంకుపెన్ను:
కలం యోధుడికి పాళీ కిరీటం. ఇంకు ఇంధనం పోస్తే పేజీలకొద్దీ ప్రయాణం. రాతకు 'రంగు'... జేబుకు హంగు. విదిలిస్తే ఓ వింత డిజైన్‌. ఇప్పుడు కదిలిస్తే... కన్నీటి 'ఫౌంటెన్‌'. ఇంకా ఇంకు పెన్ను వాడేవారికి ఇదే 'కలం సలామ్‌'.

ట్రంక్‌ కాల్‌:
మనకు, మనం మాట్లాడాలనుకునే వారికీ మధ్య 'మాటల దళారీ'. తగిలితే అదృష్టం. తగలకపోతే మన ప్రారబ్ధం. ఈ ట్రంక్‌ 'కాలం' చెల్లింది. ఫోన్‌ మీటలు పలికే ఎస్టీడీ పదనిసలు... ఏ దూర తీరానికైనా మాటల గలగలలు.

స్టీమ్‌ ఇంజిన్‌‌:
గాలి పాడే పాటకు.. ధడక్‌, ధడక్‌తో దరువు! నడకలో బరువు! ఇప్పుడు... బండి నిజం. పొగ అబద్ధం. రైలు నిజం. 'చిక్‌ బుక్‌' గతం. వేగం సంగతి పక్కనపెడితే... ఆవిరి ఇంజిన్‌ అందం ముందు డీజిల్‌ ఇంజిన్‌ దిగదుడుపే.

హిప్పీ కటింగ్‌:
చెవులు వినిపిస్తాయి. కానీ... పైకి కనిపించవు. ముంగురుల మాటున ఒద్దికగా దాగిపోతాయి. రింగు రింగులుగా వెంట్రుకలు... కాలర్‌ను కప్పేస్తాయి. యువకులను హిప్పీలను చేసిన ఈ కటింగ్‌కు ఇప్పుడు కట్‌!

కోతి కొమ్మచ్చి:
చెట్టెక్కి ఒకటే సందడి. అది కోతులది కాదు. పిల్లలది. పక్కవాడికి కాలు విరిగినా... తాను చేయి విరగ్గొట్టుకున్నా మళ్లీ కోతిలా కొమ్మ ఎక్కాల్సిందే. కొమ్మచ్చి ఆడాల్సిందే. ఇప్పుడు చెట్టూ లేదు. కొమ్మాలేదు. టీవీలు, వీడియో గేమ్‌ల ఘోషలో పల్లె ఆటలు పరార్‌!

పైసా టు పావలా:
అణా, అర్ధణా, బేడ, పైసా! కాలం చెల్లిన నాణేలు. కాలం ఉన్నా చెల్లని నాణేలు.... పావలాలు! కనిపిస్తే కాస్త చెప్పండి. వీటికోసం నాణేల సేకర్తలు చాలామంది వెతుకుతున్నారు. యాచకులకు ఇచ్చి చూసేరు... వెంటనే వెనక్కి తిప్పి..కొడతారు.

ఎర్రటోపీ:
టోపీ ఎరుపు.లాఠీ ఎరుపు. ఠాణా ఎరుపు. నెత్తుటి వర్ణంపై ఎందుకీ వలపు! ఎర్రటోపీ... పోలీసుల చేతి సంచుల్లో, సైకిల్‌ క్యారియర్‌కు మాత్రమే పరిమితమయ్యేది. దానిని పెట్టుకోవాలంటే ఎందుకో ఓ నామోషీ! ఇప్పుడొచ్చిన కొత్త టోపీ హుందాగా తలకెక్కింది. ఠాణా రంగూ మారింది

.
ాజ్‌దూత్‌:
మనం రాజు. మన బైకు 'రాజదూత'. దడదడలాడిస్తూ దారి వెంబడి వడివడిగా పరుగులు. రాజులు, రాజ్యాలూ పోయాయి. రాజ్‌దూత్‌లూ పోయాయి. ఇప్పుడు ఫోర్‌ స్ట్రోక్‌ బైక్‌లదే రాజ్యం.

మట్టి పలక:
రోజుకో పలక ఫట్‌. 'అమ్మా... పలక పగిలింది' అంటూ ఏడుపు. కొత్త పలక కొనిచ్చేదాకా కొనసాగింపు. ఇప్పుడు... ఆ మట్టి పలక పోయింది. అది పగిలినప్పుడు వినిపించే ఏడుపులూ పోయాయి. ప్లాస్టిక్‌ కాలం... ప్లాస్టిక్‌ పలకలు.

మరచెంబు:
మన వెంట నడిచి వచ్చిన ఒయాసిస్సు. దాహం తీర్చేందుకు 'మొబైల్‌ గంగమ్మ' ఇచ్చిన ఆశీస్సు. 'శంకరాభరణం' సినిమాలో హీరో హీరోయిన్లను కలిపింది. ఆపై తానే చరిత్రలో కలిసిపోయింది. ప్లాస్టిక్‌ సీసాలు, వాటర్‌ ప్యాకెట్లు వచ్చి మరచెంబు పేజీని పరపరా చించేశాయి.

కిర్రుచెప్పులు:
చేతిలో కర్ర... కాళ్లకు కిర్రుకిర్రుమంటూ చెప్పులు! అర్ధరాత్రి అపరాత్రి పొలానికి వెళ్తుంటే... కిర్రు చెప్పుల చప్పుళ్లకు పురుగూ పుట్రా ఉంటే పక్కకు తప్పుకునేవి. రైతుకు అదో భరోసా! ఇప్పుడు కొత్తకొత్త చెప్పులొచ్చాయి. కిర్రు... తుర్రో తుర్రు.

చెకుముకిరాయి:
ఇవే నిప్పురాళ్లు. వాటిమధ్య దూది పెట్టి... రాజేస్తే మంట వస్తుంది. రాళ్లను ఒకదానితో ఒకటి కొట్టికొట్టి విసుగొచ్చినా తప్పదు. అగ్గిపెట్టె వచ్చింది. రాళ్లతో తిప్పలు తప్పాయి.

తలపాగా:
ఒక్కసారి ముత్తాతగారి ఫొటో చూడండి! తలపాగా ఉండే ఉంటుంది. అది సంప్రదాయం. వేడి ప్రాంతమైన మనకు సూర్యుడి నుంచి అది రక్షణ కవచం. హుందాకు ఓ చిహ్నం. తలపాగాలు పోయి టోపీలు వచ్చేశాయి.

బాయిలర్‌:
ఇదో పొడవాటి రాగి పాత్ర. మధ్యలో చిన్నగొట్టం. ఆ గొట్టంలో బొగ్గుల నిప్పులు. సలసలకాగుతూ చుట్టూ ఉన్న నీళ్లు. టీ హోటళ్ల వద్దా ఈ బాయిలర్‌. ఇప్పుడు ఇది ఆవిరైపోయింది. దీని స్థానాన్ని హీటర్లు, గీజర్లు ఆక్రమించాయి.

పందిరి మంచం:
'చూడు నాయనా! ఇది తరతరాలుగా వాడుతున్న పందిరి మంచం...' అంటూ బామ్మగారు మనవడి శోభనం రోజు దాని చరిత్ర విప్పుతుంటారు. ఎత్త్తెన మంచం చుట్టూ అందాల పందిరి. శృంగార వేళ ఆ పందిరికి పూలు పూస్తాయి. దోమలు వస్తే తెరలు వేలాడతాయి. పందిరి మంచానిది గత వైభవం. డబుల్‌కాట్‌తో దాని నడ్డి విరిగింది.

గుండ్రాయి:
కుంకుడుకాయలు కొట్టాలంటే గుండ్రాయి. బాదంకాయ పగలగొట్టాలంటే గుండ్రాయి. చింతపండు దంచాలంటే గుండ్రాయి. మరి ఇప్పుడో... చేత్తో దంచాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వచ్చినా ఏ లారీ పిస్టన్‌లనో పట్టుకుంటున్నారు. ఇంకా గుండ్రాయి వాడే వారికి జోహారు.

భోషాణం:
నగలు, వరహాలు, విలువైన వస్త్రాలు... ఇంట్లో ఇలాంటివన్నీ దాచుకునే 'లాకర్‌' భోషాణం. చందమామ, బాలమిత్ర కథల్లో ఈ పదం తరచూ కనిపిస్తుంది. బీరువాలు, బ్యాంకు లాకర్ల రాకతో భోషాణం అటకెక్కింది.

పొడుంకాయ:
కాయంటే కాయ కాదు... ఎప్పటికీ పండుకాదు. ఇది నశ్యం దాచుకునే చిన్న డబ్బా. నశ్యం వాడేవాళ్లే తగ్గిపోయారు. ఇక పొడుంకాయకు చోటెక్కడిది.

పన్నీరుబుడ్డ్డి:
ప్రతి వేడుకల్లో ఇదో సరదా! చేతులు అడ్డుపెట్టుకుని తప్పుకుని పోతున్నా... బుడ్డిలో పన్నీరు చిలకక మానదు. వచ్చీ పోయేవారికి సువాసన అంటించక మానదు. ఇప్పుడు పెళ్లిళ్ల ముందు గిర్రున తిరుగుతూ... వాసన నీళ్లను వెదజల్లే యంత్రాలు వచ్చాయి. పన్నీరుబుడ్డీలోని అప్యాయత... యాంత్రికతతో హాంఫట్‌.

ఉట్టి:
చిన్ని కృష్ణుడి అల్లరి దీని చుట్టూనే తిరిగింది. పిల్లి శాపాలకు అతీతంగా నిలిచింది. పాలు, పెరుగు, వెన్నకు రక్షణ కల్పించింది. పల్లెల్లో అక్కడక్కడా మాత్రమే ఇది కనిపిస్తోంది. మిగిలిన చోట్ల ఇదే స్వర్గానికి ఎగిరిపోయింది.

కావిడి:
కలిమిలేములు, కష్టసుఖాలు, కావడి కుండలు! ఇదో కవిత్వం, వేదాంతం. అవన్నీ వదిలేస్తే... రెండు కుండలతో ఒకేసారి సులభంగా నీళ్లు తెచ్చుకునేందుకు కావిడే ఆధారం. కుండలు పగిలాయి. కావిడి విరిగింది.

వాణిశ్రీ కొప్పు:
అభినేత్రి వాణిశ్రీ పేరిట ఏర్పడిన ఫ్యాషన్‌. నాటి మహిళలు అనుసరించిన, వారిని అలరించిన శిరోజ కిరీటం. కొప్పు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్ప! జుట్టు లేకున్నా... రెడీమేడ్‌గా కొప్పులు సిద్ధం. ఇప్పుడు వాణిశ్రీ కొప్పు పోయింది. ఆమె పేరిటే ప్రాచుర్యం పొందిన 'ఫుల్‌ హ్యాండ్స్‌' రవికలూ ఫ్యాషన్‌ తెరపై కనుమరుగయ్యాయి.

తాటాకుబద్ద:
టంగు క్లీనరు దండగ... తాటాకుబద్ద ఉండగా! తరతరాలుగా పల్లెసీమల్లో తాటాకుబద్దే సహజమైన నాలుకబద్ద. వేప పుల్లే ఆరోగ్యకరమైన టూత్‌బ్రష్‌. మరే పేస్టూ అక్కర్లేదు. మరి ఇప్పుడో... ప్లాస్టిక్‌ టంగ్‌ క్లీనర్లు, బ్రష్షులు, పేస్టులు పల్లెపల్లెకూ చొచ్చుకుపోయాయి. తాటాకుబద్ద బద్దలయింది. వేపపుల్ల విరిగిపోయింది.

టూరింగ్‌ టాకీస్‌:
నెలకో వారానికో ఒక సినిమా! ఊర్లో ఒక చోట తెరపెట్టి... చిన్న ప్రొజెక్టర్‌తో చిత్ర ప్రదర్శన. అది చూసేందుకు ఊరిజనం తపన. లవకుశలో సీత కష్టాలు చూసి కన్నీళ్లు... గుండమ్మ కథలో గుండమ్మ ఇక్కట్లు చూసి నవ్వులు... అన్నీ తెరవెనక్కి వెళ్లిపోయాయి. టీవీలు వచ్చాయి. రవాణా సౌకర్యం పెరగడంతో పక్కనే ఉన్న టౌనుకెళ్లి సినిమా చూడటం సాధారణమైంది.

(Eenadu, 15:08:2007)

-----------------------------------------------------------------------

Labels:

Stifled by shyness?

Severe shyness can affect the quality of a person’s life



Life is wonderful So don’t watch it from the sidelines; join in


Ms. S is anxious and tense in an unfamiliar situation. She finds it difficult to speak in front of others and becomes inhibited while meeting someone new. She always feels comfortable to watch life go on from the sidelines rather than join in. These traits clearly suggest that Ms. S is shy. And her life is severely affected by her shyness.

In humans, shyness is the feeling of apprehensiveness or lack of confidence experienced in regard to social associations with others. It is most likely to occur during unfamiliar situations hindering the individual from achieving the best and disrupting interpersonal relationships. Shy individuals avoid objects they are apprehensive about. Shyness may fade with time, for example a child who is shy about facing strangers may overcome it as he grows older, becoming more socially adaptable and integrated.

Humans experience shyness in different degrees and arenas. For example, an actor may be loud and bold on stage but shy at an interview session. Shyness may manifest itself when one is in the company of some people but may disappear when in the midst of friends who are happy, jovial and outgoing. Some people experience ‘love shyness’ towards potential partners. Instinctive behavioural traits in a social situation such as smiling, a relaxed position and eye contact, which come spontaneously for some, may be alien to those who are shy.

Constant and severe shyness may affect the quality of a person’s life, activities and achievements. It may also reduce opportunities to develop or practise social skills.

Shy persons may have increased feelings of loneliness, unimportance and reduced self esteem. They also have an incredibly reduced ability to reach their full potential because of the fear of being critically judged by others. Most shy persons are anxious and may display embarrassing signs such as blushing, stammering or trembling.

Shyness has some positive aspects too. Those who are shy may do well at school, behave well and may not get into trouble, may listen attentively to others and are easily manageable at home and workplace.

Genetic factors, personality, acquired behaviour, family relations, lack of social interaction, harsh criticism and fear of failure are some of the reasons for shyness. It is true that shyness deprives one of opportunities, but it may not prevent them from achieving goals. Some of the shy celebrities are Abraham Lincoln, Albert Einstein, Eleanor Roosevelt, Thomas Alva Edison and Thomas Jefferson. Similarly Bob Dylan, Elvis Presley, Henry Fonda, Ingrid Bergman, Neil Armstrong and Sir Alec Guinness were all shy but good entertainers.

Authors such as Agatha Christie, George Bernard Shaw, Nathaniel Hawthorne and Robert Frost were all outstanding writers but remarkably shy.

If a person’s shyness is acute, he can consider professional help from a counsellor or a clinical psychologist. Treatment options include stress management, relaxation strategy, affirmation, social skill training and at times medication too.

C. P. SOMASUNDARAM

(The Hindu, Metroplus,23:08:2007)

---------------------------------------------------------------

Labels:

Tips to come up tops

Photo: K. Ananthan

STUDENTS! STAY FOCUSSED: Plan out your study schedule to achieve your goals.


The following are ‘Tips to get a good rank’. The first letter of each sentence, when combined denotes the same. paste it on your table and follow.


Try not to eat junk food in the evening, one hour before study time.

Involving in top-of-the-voice arguments before studies, discussing next day’s exciting programme disturbs your concentration.

Prepare your own notes instead of reading guides. Condensing the subject in your own way is called key-noting.

Start studying every day exactly at the same time. Apply the same principle to your eating and sleep habits also.


This is called ‘cleaning the mind-slate’. Stand still and pray for 5 minutes before starting your studies.

Organise priority and time schedule for each subject. Never avoid studying difficult/boring subjects.


Getting up early and studying in the morning enhances your memory power as the electro-magnetic path waves in the brain are in a state of tranquillity and are more composed.

Environment plays a vital role. Study in a cool and calm place. Light an incense stick. Avoid music.

Target and desire should always be the same. Your obsessive desire to watch small screen works against your target of becoming a distinguished professional.


Avoid conversing with family members or phoning to friends in the midst of your study.


Get your doubts clarified immediately and never hesitate to ask, particularly with regard to mathematics and sciences.

Organise to sandwich an uninteresting subject between two interesting subjects so that you don’t feel bored.

Obedience, discipline, time and space planning, controlling negative emotions, etc., are the characteristics of a ranker.

Differentiate between an ‘interesting’ job and a ‘useful’ one. Spending more time on interesting jobs at the cost of a useful one is called ‘laziness’.


Revise the earlier lessons whenever time permits.

Ability is not a comparative term as far as memory is concerned. Every student has the same remembrance power. Some students forget lessons because they remember ‘other’ things.

Nothing supersedes success. It’s like a room fragrance. Once you experience it, you will always like to be there. Initially it is hard to abstain from gossiping, chatting and watching TV, but once you taste the success, you enjoy the charm of being different from others.

Keep smiling. You need not forgo your smile to be a top ranker.

YANDAMOORI VEERENDRANATH

Yandamoori
@hotmail.com

(The Hindu, Education Plus, August 13, 2007)

---------------------------------------------------------------------

Labels: