My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, July 16, 2010

అలౌకికం

వేయి రేకలుగా విప్పారిన మానవ మేధ- సృష్టికే మారాకు తొడగడంలో ముందంజ వేస్తూనే ఉంది. జనన మరణ రహస్యాలపై నిరంతరం కొత్తకొత్త ఆవిష్కరణలకు కర్తృత్వం వహిస్తూనే ఉంది. అది- పరీక్ష నాళికల్లో శిశూదయాలకు పురుడు పోసింది. మనిషిని పోలిన మనిషిని పునఃప్రతిష్ఠించేందుకు నాందిగా క్లోనింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. కృత్రిమశ్వాస అమరికతో ప్రాణచలనంలో చేతనత్వానికి ఊపిరులూదుతోంది. జీవాధారమైన రక్తజలధారను కృత్రిమంగా రూపొందించే మార్గాలను వెదుకుతోంది. వ్యాధులు, వార్ధక్యం, మృత్యువు- ఈ మూడూ మనిషిని నిత్యం భయపెడుతూనే ఉంటాయి. వాటి బారినుంచి తప్పించుకోలేరెవరూ. అలాగని- తెలిసితెలిసీ చేతులారా వాటిని కొని తెచ్చుకోవాలనీ ఎవరూ అనుకోరు. 'తగిలి జరయు రుజయు/ దైవవశంబున నయ్యెనేని అనుభవింత్రుగాక/ యెరిగి కడగి యా రెంటిని జేకొందురయ్య యెట్టి కుమతులైన?' అంటూ తండ్రి యయాతికి తమ యౌవనాన్ని ఇచ్చేందుకు ఆయన నలుగురు కుమారులు నిరాకరించడం- 'మహాభారతం'లోని కథ. మనిషిపై ముసిరే మొండివ్యాధుల్ని ఔషధాస్త్రంతో లొంగదీసుకుంటున్న మానవ మేధస్సు ఇప్పుడు- మనిషికి శతాధిక సంవత్సరాల ఆయుష్షునిచ్చే అమృతగుళిక తయారీలో నిమగ్నమైంది. భావి తరాలకు భవ్యమైన కానుకగా అది- ఏనాటికైనా మరణానికి మరణశాసనం రాసే రోజూ రావచ్చు. అంతవరకు మృత్యువు ముందు మానవాళి తలొంచక తప్పదు. కాలానికి బాకీలాంటి జీవిత రుణం చెల్లుబడకపోతే 'జాలిలేని మృత్యువెపుడొ జప్తు చేయు'నన్న ఆత్రేయ- 'చావంటే నాకు భయంలేదు. నేనుండగా అదిరాదు. అది వచ్చినప్పుడు నేనుండను' అని చమత్కరించడంలో అంతరార్థం అదే.

కొసరు పిసరంతైనా వేయని పిసినారి దేవుడు- అసలు తూకంలోనే మోసం చేసి ఆనందాన్ని, ఆయుఃప్రమాణాన్ని తగ్గిస్తాడట! ఆ మాటే చెబుతూ 'అందమైన ఉదయాలూ స్పందించే హృదయాలూ/చందనం, చంద్రకళా, సరదాలూ స్వప్నాలూ/ ఇన్నిటినీ సమకూర్చిన పసందైన గారడీ/ చటుక్కున మడతపెట్టి చేస్తాడు టెరిబుల్‌ ట్రాజెడీ-' అని తేల్చిచెప్పాడు కవి తిలక్‌. జీవిత నాటకానికి తెరదించే ఆ విషాదయానంలో- ప్రతిప్రాణీ చివరికి చేరుకోవలసిన తుది మజిలీ మృత్యువే. అది- మనిషిని అదృశ్యరూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఏ క్షణాన, ఏ విధంగా విరుచుకుపడేదీ ఏ మాత్రం తెలియనీయకుండా మనిషి చుట్టూ తారట్లాడుతూనే ఉంటుంది. అదను చూసి మెరుపుదాడికి దిగుతుంది. గుండె స్పందనపై అది విసిరిన నిశ్శబ్దపు పంజా ధాటికి తెగిన నాడుల తీగలు- చర్మం కింద ప్రవహిస్తున్న పాటకు ఉరి పేనుతాయి. హంసగీతాలాపన హఠాత్తుగా ఆగిపోతుంది! అజంతా అన్నట్లు 'భయ విభ్రమాల మధ్య విషాద వాక్యంవలె సాగే జీవితంలో మృత్యువు ఒక్కటే నిజం' అని అందరికీ ఎరుకే. అయినా, మానవుడికి జీవితేచ్ఛ వాడదు. మృత్యుభీతీ వీడదు. బతుకు భ్రమల్లో విహరిస్తున్నాడనో, ప్రాణభయంతో వణికిపోతున్నాడనో మనిషిపై మృత్యువు దయచూపదు. అతణ్ని తరలించుకుపోకుండాను ఆగదు. మనిషితో ఆడే దాగుడుమూతల్లో దానిదే పైచేయి. ఎక్కడినుంచో వచ్చే విద్యుత్తు తళుక్కున వెలిగించే గాజుబుడ్డీ లాంటిదే దేహదీపమని వర్ణిస్తూ- 'వృద్ధాప్యంలోనో, బాల్యంలోనో, యౌవనంలోంచో/ ఎప్పుడో మన దేహం ఫిలమెంట్‌ రాలిపోతుంది' అన్నాడు 'చితి-చింత' కావ్యకర్త మోహన్‌ప్రసాద్‌.

మృత్యువంటే భయంతో పాటు, మనుషుల్లో మరణేచ్ఛా అంతర్భూతంగా ఉంటుందని, మరణాన్ని ఔదలదాల్చితే అనంతానుభూతి కలుగుతుందని ఓ ప్రముఖ రచయిత ఉవాచ. జీవిత ప్రస్థానాన తాను అంతిమంగా తిరగక తప్పని ఆఖరి మలుపు... మృత్యువంటే మనిషిలో వెరపు సహజమే. అలా భయపడినంత మాత్రాన, వేళ ముగిసిన జీవనపత్రం నేలరాలకుండా ఉండదు. మృత్యుప్రహారాన్ని మౌనంగా అతడు అనుభూతించకా తప్పదు. శ్రీశ్రీ అన్నట్లు 'మృత్యు నిశ్శబ్దాన మృదు జీవరవళి' ఆ సమయంలో అతనికి వినవస్తుందో, లేదో తెలియదుకానీ... మరణం అంచులదాకా వెళ్లి బయటపడినవారిలో కొందరు- ఆ అపస్మారక స్థితిలో తమకు కొన్ని వింత అనుభూతులు కలిగినట్లు చెప్పడం కద్దు. ఆఖరి ఘడియలకు చేరుకున్న సంధి సమయంలో- ఇష్టదైవాలు కట్టెదుట నిలిచినట్లు; శరీరం తేలిపోయినట్లు; మంచంపైనే శరీరాన్ని వదిలేసి- ఏదో వెలుగు దారి చూపుతుంటే చుక్కలలోకంలోకి వెళ్లిపోయినట్లు- ఇటువంటి అనుభూతులేవో తమను ఆవరించినట్లు వారు చెబుతుంటారు. అవన్నీ వారి భావనలు మాత్రమేనని అంటున్నారు శాస్త్రజ్ఞులు. చనిపోయేముందు మనిషి శరీరం, మెదడు తీరు ఎలా ఉంటుందన్న అంశంపై- జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన లఖ్మీర్‌ చావ్లా ఓ అధ్యయనం నిర్వహించారు. 'మరణానికి ముందు మనిషి మెదడుకు రక్తం ప్రసరించడం క్రమేణా తగ్గిపోతుంది. ప్రాణవాయువు స్థాయి పడిపోతుంది. మెదడులోని విద్యుత్‌ తరంగాలు చివరిసారిగా కంపిస్తాయి. వాటి ప్రకంపనలు అలలు అలలుగా మనిషి ఆలోచనల్ని కదిలిస్తాయి. చనిపోయేముందు తాము ఆస్వాదిస్తున్నట్లుగా- మృత్యుశయ్యపై ఉన్నవారు పలవరించే అనుభూతులన్నీ ఆ ఆలోచనల ప్రభావమే' అని చావ్లా చెబుతున్నారు. మెదడులో ముప్ఫై సెకన్లనుంచి మూడు నిమిషాలవరకు కనిపించిన ఆ విద్యుత్‌ తరంగాల అలజడి పూర్తిగా సద్దుమణగడం మృత్యువుకు సంకేతం అని ఆయన అంటున్నారు. అవసాన సమయాన మగత నిద్రలో దృశ్యాదృశ్యంగా కదలాడే భావనాచిత్రాలను అనుభూతించడం ఒక్కటేనేమో- మరో లోకంలోకి మరలిపోయే మనిషి కడకు తన వెంట తీసుకువెళ్లగలిగేది!
(ఈనాడు, సంపాదకీయం, ౧౩:౦౬:౨౦౧౦)

Labels:

GLORIOUS INSULTS

THESE GLORIOUS INSULTS ARE FROM AN ERA BEFORE THE ENGLISH LANGUAGE CHANGED TO 4-LETTER WORDS.
_______________________________
A Member of Parliament to Disraeli: "Sir, you will either die on the gallows or of some unspeakable disease."

"That depends, Sir," said Disraeli, "whether I embrace your policies or your mistress."

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
-
"He had delusions of adequacy."
- Walter Kerr
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"He has all the virtues I dislike and none of the vices I admire.

- Winston Churchill
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"I have never killed a man, but I have read many obituaries
with great pleasure."
- Clarence Darrow
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

"He has never been known to use a word that might send
a reader to the dictionary."
- William Faulkner (about Ernest Hemingway).
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

"Thank you for sending me a copy of your book;
I'll waste no time reading it." - Moses Hadas
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"I didn't attend the funeral, but I sent a nice letter
saying I approved of it."
- Mark Twain

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

"He has no enemies, but is intensely disliked by his friends.”

- Oscar Wilde
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"I am enclosing two tickets to the first night of my new play;
bring a friend... if you have one." - George Bernard Shaw to Winston Churchill

"Cannot possibly attend first night, will attend second ... if there is one."
- Winston Churchill's response
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"I feel so miserable without you; it's almost like having you here."

- Stephen Bishop
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"He is a self-made man and worships his creator."

- John Bright
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

"I've just learned about his illness. Let's hope it's nothing trivial."

- Irvin S. Cobb

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"He is not only dull himself; he is the cause of dullness in others."

- Samuel Johnson

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"He is simply a shiver looking for a spine to run up."

- Paul Keating

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"In order to avoid being called a flirt, she always yielded easily."

- Charles, Count Talleyrand
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"He loves nature in spite of what it did to him."

- Forrest Tucker

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"Why do you sit there looking like an envelope without
any address on it?"
- Mark Twain

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"His mother should have thrown him away and kept the stork."

- Mae West
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"Some cause happiness wherever they go; others, whenever they go.”

- Oscar Wilde

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"He uses statistics as a drunken man uses lamp-posts ...
for support rather than illumination."
- Andrew Lang
(1844-1912)
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"He has Van Gogh's ear for music."

- Billy Wilder
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
"I've had a perfectly wonderful evening. But this wasn't it."

- Groucho Marx
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
(An email forward)

Labels: ,

ఆనందో బ్రహ్మ

వయసుమీద ఉన్నప్పుడు మనిషి జోరు- ఇరుగట్లనూ ఒరుసుకుని ప్రవహించే వరదగోదావరి పరవళ్ల గలగలల్ని తలపించాలి. వయసే మీద పడినప్పుడు మనిషి జోష్‌- వెన్నెల కాంతుల ప్రతిఫలనంతో మెరమెరలాడే శాంతగోదారి నిండుదనపు మిలమిలల్ని మరిపించాలి. ప్రాయం శరీరానికే గానీ, మనసుకు కాదు. 'తాతగారి నాన్నగారి భావాలకు దాసులు/ నేటి నిజం చూడలేని కీటక సన్నాసులు'గా ముద్రవేయించుకుని, వర్తమాన పవన వీచికలకు తమ మనోకవాటాలు తెరవని కోడెకారు కుర్రాళ్లూ ఉంటారు. నాన్నల తాతలనాటి ఛాందసాన్ని ధిక్కరించి, రేపటి లోకం ఎలా ఉండాలో చిన్నతనానే శాసించిన శ్వేతకేతులాంటి భావి పథనిర్దేశకులూ ఉంటారు. మనుషుల్లో- వణుకు ప్రాయం వచ్చీరాగానే, ఇక తుది కునుకు తీయు కాలమే తరువాయి అన్న చందంగా గొంగళుల్లా తమలోకి తామే ముడుచుకుపోయేవారూ కొందరు ఉండవచ్చు. ఆ ఏటికాయేడు వచ్చి మీద పడుతున్నా 'ఆరు పదులు కాదు, మా వయసు పదారే'నన్నట్లుగా సీతాకోకచిలుకల్లా విహరించేవారూ ఉండవచ్చు. 'అంతములేని కాలపథమందొక ఒంటెల బారువోలె నశ్రాంతము సాగిపోవు రుతుజాలము...' అన్నాడు కవి సేనాధిపతి శేషేన్‌. మూడు కాలాలు, ఆరు రుతువుల నిరంతర చక్రచలనం ప్రకృతిసిద్ధమైన సహజ ప్రక్రియ. గడిచిపోయే ఒక్కో యేడూ మనిషి పెద్దరికానికి మరో పైమెట్టును పరుస్తుంటుంది. మంచులో తడిసిన మల్లెపువ్వంత స్వచ్ఛమైన మనసులో, ఉషాకిరణాల వెచ్చదనాన్ని పొదువుకున్న వూహలు మోసులెత్తితే, మనిషి జీవనవనిలో అనునిత్యం వసంతోత్సవమే! 'వెలుగుతో, ఇరులతో/ మరు వీచి తోడ, మరుగు విషకీల తోడ/ సుమధుర మధురమైన బ్రతుకిది... నాకు జరలేని దా యౌవనమ్మునిమ్ము' అని కాంతిగానాన్ని మీటాడు కవితాగంధర్వుడు కృష్ణశాస్త్రి. ఆరోగ్యకరమైన ఆలోచనల్ని శ్వాసించినంతకాలం మనిషి నిత్య యౌవనుడే.

బాల్యంనుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశా మానవజీవిత మహాప్రస్థానాన మనుగడ దిశలో ఓ మజిలీ. ప్రవాహంలోకి మళ్లిపోయిన నీళ్లు వెనుదిరిగి రాని విధంగానే- జీవన స్రవంతిలో దొర్లిపోయిన దినాలూ మరల మరలి రావు. వాటి తాలూకు జ్ఞాపకాలు మాత్రం- ఏరు విడిచిపెట్టి ఎక్కడికీ పోని కెరటాల్లా- మనిషి స్మృతిపథాన్ని ఎన్నటికీ వదిలివెళ్లవు. యౌవనంలో పొగరుగా, గర్వంగా, నిర్లక్ష్యంగా, దర్పంగా గడిపిన 'ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా/ ఆనందంలాంటి విచారం కలుగుతుంది' అన్న కవి తిలక్‌ పలుకులు గుర్తుకొచ్చి, హృదయం బరువెక్కుతుంది. కాలయవనిక వెనక్కి అలా కనిపించకుండా వెళ్లిపోయిన 'ప్రతి ఒక్క నిమిషం ఒక్కొక్క ఒమర్‌ఖయ్యాం/ రుబాయత్‌ పద్యాలవంటి రోజులవి, ఏవి ప్రియతమ్‌/చప్పుడు కాకుండా ఎవరు హరించారు మన పెన్నిధిని?' అన్న జవాబు దొరకని ప్రశ్న ములుకై తొలిచినప్పుడల్లా గుండెలు చెమ్మగిల్లుతాయి. గడచిన దినాల తలపోతలో ఆస్వాదించే విషాదమాధుర్యం మనిషి మనసున గిలీ రేకెత్తిస్తుంది, చక్కలిగిలీ పెడుతుంది. పరువపు ప్రాయాన- పసితనంలోని అల్లరులు, అమాయకపు ముచ్చట్లు; ముదిమి వయసులో- యౌవనపు రోజులనాటి సరదాలు, చిలిపి మురిపాలు ఎద తలుపులు తట్టినప్పుడు ఎన్ని గిలిగింతలో, ఎన్ని పులకింతలో! సందిట మంచినీళ్ల కడవను పెట్టుకుని, మరో చేతిలో కరివేపాకు రెమ్మల్ని పట్టుకుని వస్తున్న తన భార్యను కాసేపు ఆగమన్నారు తాతగారు. అలాగే నిలబడిన ఆ పండు ముత్తయిదువలో భేష్‌, ఆడతనం ఇంకా ఉందని మెచ్చుకున్నారు. నడుంమీద వయ్యారంగా చేయిపెట్టి 'చిన్నప్పుడు మా ఆవిడ అలవోకగా త్రిభంగిగా నిలిచేది. మీ అమ్మమ్మ అయిన తరవాత కడవ రొండిన పెట్టుకుంటేగాని ఆ భంగిమ రావడం లేదు'- అని మనవడితో చెబుతూ మురిసిపోయారు ఆ వయసులోనూ! 'నేను మడి' అంటూ పెద్దావిడ బిడియపడటంలో తెలుగు ఒదుగునీ; 'మనం ఒక్కుమ్మడి, రా పిల్లా' అంటూ వాత్సల్యపూరితంగా ఆ పెద్దాయన ఆమెను చేరబిలవడంలో తెలుగు చమక్కునీ- తన అక్షరాల్లో మన కళ్లకు కట్టారు మల్లాది రామకృష్ణశాస్త్రి 'మధ్యాక్కర' కథలో!

మనసుతోనే తప్ప వయసుతో నిమిత్తం లేనిది ఆనందానుభూతి. రెక్కలు విప్పుకొన్న విహంగమై మనసు విహరిస్తుంటే- పదహారేళ్ల ప్రాయమప్పుడే కాదు- పదులు అయిదూ, ఆరు దాటినవేళలోనూ వయసు బరువు ఏమాత్రం బరువు అనిపించదు. మనిషి యాభయ్యోపడిలో పడటం- జీవితభానుడు నడిమింటి ఒడిలోకి చేరుకున్నాడనడానికి, జీవననౌక మరోమలుపు తిరిగి 'అవతలిగట్టు' వైపు మళ్లుతోందనడానికి ఓ సంకేతం. వ్యాధులు, బాధలపట్ల భీతి ఆ వయసులో మనిషి మనుగడను దుఃఖభాజనం చేస్తుందన్నది చాలామంది అభిప్రాయం. అది అపోహేనని, మనిషి జీవితం యాభై ఏళ్ల వయసు వచ్చిన తరవాతినుంచే ఆనందమయంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 'అయిదు పదుల వయసు దాటినవారిలో కోపావేశాలు, మానసిక ఆందోళనలు, అప్పటివరకు వెన్నాడుతున్న ఒత్తిళ్లు క్రమేణా తగ్గిపోతాయి. వాటి స్థానే ఆనందోత్సాహాలు వారిలో పెల్లుబుకుతాయి. రోగాలు, రొష్ఠుల బారిన పడతామేమోనన్న భయసందేహాలను, ప్రతికూల భావనలను దరిచేరనీయకుండా- ఆ వయసులోనివారు సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తుంటారు' అని న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో తేలింది. వ్యాధులు, మృత్యువు వెన్నాడే ప్రమాదం ఎక్కువగా ఉన్నా- యాభైలలోనే మనిషి బాధల్నీ కష్టాల్నీ మరచిపోవడానికి, సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తుంటాడన్నది వారి పరిశోధనల సారాంశం. 'ముసలితనపుటడుగుల సడి ముంగిట వినబడెనా/ వీట లేడని చెప్పించు, వీలు కాదని పంపించు' అంటూ- వయసు పైబడుతున్నా, వృద్ధాప్యాన్ని మనసు ఛాయలకైనా రానీయకుండా ఉన్నన్నినాళ్లూ, మనిషి జీవితాన ఆనందపు తిరునాళ్లే!
(
ఈనాడు, సంపాదకీయం, ౦౬:౦౬:౨౦౧౦)
______________________________

Labels:

Incredible India

We live in a Nation ,

where Pizza reaches home faster than Ambulance & police,

Where you get car loan @ 5% and education loan @ 12%,

Where rice is Rs 40/- per kg but sim card is free,

Where a millionaire can buy a cricket team instead of donating the money to any charity,

Where the footwear, we wear ,are sold in AC showrooms, but vegetables, that we eat, are sold on the footpath,

Where everybody wants to be famous but nobody wants to follow the path to be famous,

Where we make lemon juices with artificial flavours and dish wash liquids with real lemon.

Where people are standing at tea stalls reading an article about child labour from a newspaper and say,"yaar bachhonse kaam karvane wale ko to phansi par chadha dena chahiye" and then they shout "Oye chhotu 2 chaii laao....."

Incredible India
(an email forward)
____________________________

Labels: