My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, November 10, 2007

Marriage












(An email forward)
_________________________________________

Labels:

గేట్స్‌ను మించిన మేనేజ్‌మెంట్‌ మేధావి సీకే ప్రహ్లాద్‌


న్యూఢిల్లీ: కోయంబత్తూర్‌ కృష్ణారావు ప్రహ్లాద్‌ ఎవరో ఎరుగుదురా? పోనీ... సి.కె.ప్రహ్లాద్‌ అంటే తెలుసా? ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మేనేజ్‌మెంట్‌ మేధావి. వ్యాపార వ్యూహాల రచనలో ఈ భారతీయుడు తాజాగా మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మాజీ ఛైర్మన్‌ అలాన్‌ గ్రీన్‌స్పాన్‌లనే మించి ఎదిగారు. సన్‌టాప్‌ మీడియా వెలువరించిన ఈ సంవత్సరపు థింకర్స్‌ 50 జాబితాలో అగ్రస్థానాన్ని ప్రహ్లాద అలంకరించారు. ఆయన క్లయింట్లలో అల్‌స్థోమ్‌, ఏటీ &టీ, సిటీకార్ప్‌, కొడాక్‌, ఒరాకిల్‌, ఫిలిప్స్‌, క్వాంటమ్‌, రెవ్లాన్‌, యూనిలీవర్‌ వంటి దిగ్గజ బహుళ జాతి కంపెనీ (ఎంఎన్‌సీ)లు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న ప్రహ్లాద్‌ 'ద నెక్ట్స్‌ ప్రాక్టీస్‌'కు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా. ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ లీవర్‌ లిమిటెడ్‌, వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ల డైరెక్టర్ల బోర్డులో సభ్యుడు. థింకర్స్‌ 50 జాబితాకు ప్రహ్లాద కాక మరో ముగ్గురు భారతీయులు ఎంపికయ్యారు. వారు సీఈఓ కోచ్‌ రాం చరణ్‌ (22వ స్థానం), టక్‌ బిజినెస్‌ స్కూలుకు చెందిన విజయ్‌ గోవిందరాజన్‌, హార్వర్డ్‌కు చెందిన రాకేశ్‌ ఖురానా. వర్జిన్‌ గ్రూపునకు చెందిన రిచర్డ్‌ బ్రాన్సన్‌ 9వ స్థానం పొందారు.

కోయంబత్తూరులో ఓ న్యాయమూర్తి, సంస్కృత పండితుడి ఇంట జన్మించిన ప్రహ్లాద్‌కు మరో ఎనిమిది మంది తోబుట్టువులు ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌లో భౌతిక శాస్త్రం చదివారు. పంతొమ్మిదో ఏటనే చెన్నైలోని యూనియన్‌ కార్బైడ్‌ బ్యాటరీ కర్మాగారంలో ప్రహ్లాద్‌ను మేనేజర్‌గా తీసుకున్నారు. నాలుగేళ్లు పనిచేసిన తరువాత అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం-ఏ)కు వెళ్లారు. పొరుగున ఉన్న విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినితో ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు ప్రయాసపడ్డాక ఆమె పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని హార్వర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లారు. ఎమ్మెన్సీల యాజమాన్యంపై పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నారు స్వదేశానికి తిరిగి వచ్చి ఐఐఎంఏలో పాఠాలు చెప్పారు. తరువాత మళ్లీ అమెరికాకు వెళ్లిపోయారు. గత పదేళ్లుగా అగ్రగామి పది మేనేజ్‌మెంట్‌ మేధావుల్లో ఒకరుగా తన స్థానాన్ని పదిలపరుచుకోవడం ప్రహ్లాద్‌ ప్రతిభకు నిదర్శనం. ద ఫ్యూచర్‌ ఆఫ్‌ కాంపిటీషన్‌, ద బాటమ్‌ ఆఫ్‌ ద పిరమిడ్‌ సహా పలు పుస్తకాలు రాశారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి పురస్కారం, అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు గెల్చారు.

(Eenadu, 09:11:2007)
____________________________________________

Labels:

Wednesday, November 07, 2007

A pastor's donkey

A pastor entered his donkey in a race and it won.

The pastor was so pleased with the donkey that he entered it in the race again, and once again, it won.

The local paper read: PASTOR'S ASS IN THE FRONT

The Bishop was so upset with this kind of publicity that he ordered the pastor not to enter the donkey in another race.

The next day, the local paper's headline read: BISHOP SCRATCHES PASTOR'S ASS.

This was too much for the bishop, so he ordered the pastor to get rid of the donkey. The pastor decided to give it to a nun in a nearby convent.

The local paper, hearing of the news, posted the following headline the next day: NUN HAS BEST ASS IN TOWN.

The bishop fainted. He informed the nun that she would have to get rid of the donkey, so she sold it to a farmer for $10.

Of course the following day's newspaper screamed: NUN SELLS ASS FOR $10.

The scandalized Bishop ordered the nun to buy back the donkey and lead it to the plains where it could run wild.

The next day the headlines proclaimed: NUN ANNOUNCES HER ASS IS WILD AND FREE

And the following day they buried the Bishop.


The moral of the story is:

Stop worrying about everyone else's ass and you'll be a lot happier and live longer!

(an email forward)
_______________________________________

Labels:

HOT AND COLD SEX

After his exam the doctor said to the elderly man:
'You appear to be in good health. Do you have any medical concerns you would like to ask me about?'


'In fact, I do,' said the old man.

'After I have sex I am usually cold and chilly, and then, after I have sex with her the second time, I am usually hot and sweaty.'


After examining his elderly wife, the doctor said: 'Everything appears to be fine. Do you have any medical concerns that you would like to discuss with me?'


The lady replied that she had no questions or concerns.


The doctor then said to her: 'Your husband had an unusual concern. He claims that he is usually cold and chilly after having sex with you the first time, and then hot and sweaty after the second time. Do you know why?'


'Oh that crazy old farts,' she replied. 'That's because the first time is usually in January and the second time is in August.


(an email forward)

- - - - - - - - - - -

Labels:

Tuesday, November 06, 2007

Can the word `etc.' be used with people?

The Latin expression `et cetera', which is normally abbreviated to `etc.', means `and other things' and `so on'. As writers or speakers, we use it when we don't wish to include everything on a list. For the drawing competition on Sunday, students are expected to bring their own pencil, paper, etc.' In such cases, we expect the reader/ listener to understand that the list is incomplete and that he should supply the missing information on his own. It is very common nowadays to hear people include `etc.' after the names of people as well: `I ran into Ram, Geetha, Thiru, etc. at the club yesterday.' Books on English usage suggest that such sentences are unacceptable. According to scholars, since `et cetera' ends with an `a', the word is neuter in gender; therefore, it can only be used with things and not with people. The Latin expression `et al.', meaning `and others', should be used after the names of people.

*We are expecting Sharukh et al. to be present at the meeting.

S. UPENDRAN
upendrankye@gmail.com
(The Hindu, Know your English, 06:11:2007)
___________________________________

Labels:

Sunday, November 04, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* హనుమంతుణ్ని నరకాసురుడి దగ్గరికి పంపితే ఏం చేసేవాడు?
చూసి రమ్మంటే 'పేల్చి' వచ్చేవాడు.

* సత్యభామ నరకాసురుడిని వధించకపోతే టపాకాయల పరిశ్రమ ఏమయ్యేది?
'కృష్ణా'ర్పణమయ్యేది. అప్పుడు ఆయనే ఢామ్మని నరకాసురుణ్ని ఒక చూపు చూసేవాడు.

* అందమైన అమ్మాయి కదా అని అప్పిచ్చాను. కనీసం వడ్డీ కూడా ఇవ్వడం లేదు ఎందుకు?
మీ 'అసలు' దృష్టి తెలిసాక వడ్డీ మాత్రం ఎందుకిస్తుంది?

* నాది పాప్‌కార్న్‌ బిజినెస్‌. దానికి 'ఫటాఫట్‌ కరాకర్‌' అని పేరు పెడదామనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా?
మీరు ఆ పని చేస్తే నేనెందుకు ఊరుకుంటాను. పనిగట్టుకుని వచ్చి కరకరా నమిలేస్తాను(మిమ్మల్ని కాదులెండి, పాప్‌కార్న్‌ను).

* మీ చూపు కూడా సెన్‌'సెక్స్‌' మీదేనా?
మీ సెన్‌'సెక్స్‌' పరిజ్ఞానానికి నా జోహార్లు. కాని, దాని మీదే అతిగా ఆధారపడితే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త!

* నేనూ 'ఫ్రెష్‌'లు పెట్టి లక్షలు సంపాదిద్దామనుకుంటున్నా సాధ్యమవుతుందా?
'ఫ్రెష్‌' మైండ్‌తో చేస్తే సాధ్యంకానిది ఏముంటుంది?

* ఇన్సూరెన్స్‌ బిజినెస్‌లో ఎప్పుడూ బిజీగా ఉండాలంటే?
యమధర్మరాజు 'బిజినెస్‌' బాగుండాలి.

* మీరూ, నేనూ జాయింట్‌ వ్యాపారం చేద్దాం రెడీనా?
నా 'జాయింట్స్‌' ఏమవుతాయోనన్నదే నా బెంగంతా

* 'సత్యం' రామలింగరాజును అమెరికాలో సెటిల్‌ అవమంటూ బిల్‌గేట్స్‌ ఆహ్వానం పంపాడట. అలాకాక బిల్‌గేట్స్‌నే ఇండియా వచ్చేయమంటే...
'గేట్స్‌' ఎక్కడుంటేనేం నాయనా! అమెరికా బిల్లులన్నీ మనవే అవుతాయి. ఇండియా గేట్‌ను ఇండియా 'గేట్స్‌'గా మార్చుకుంటే సరి!

* కుబేరుడ్ని కావాలంటే...?
(కు)బేరసారాలు బాగా తెలిసి ఉండాలి.

* కూరగాయల ధరలు బాగా తగ్గాలంటే?
'ఫల'హారాలు మాత్రమే చేయాలి.
(Eenadu, 04:11:2007)
_________________________________

Labels:

ఇంటింటా దివ్య శోభావళి

పండగ అంటే సందడి, సంతోషం. పండగల హడావుడి అంతా ప్రధానంగా పిల్లలదే. వారు పండగల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. పైకి అంతగా కనిపించకపోయినా పెద్దవారికీ పండగలంటే ఇష్టమే. మామూలుగా గడిచిపోయే జీవితాల్లోకి కొత్త వెలుగులు నింపుతూ, నూతన ఉత్సాహం కలిగిస్తూ ఆగమిస్తాయి పండగలు. ఈ రోజుల్లో అటువంటి ఆప్యాయతలు ఆదరణలు చాలావరకు తగ్గిపోయాయి. ఒకప్పుడు బంధువులు ఇంటికివస్తే పండగగానే భావించేవారు. వారున్న నాలుగు రోజులు కబుర్లతో, నవ్వులతో, ఎప్పటివో ముచ్చట్లు నెమరేసుకోవటంతో సంతోషంగా సందడిగా గడిచిపోయేవి. ఇప్పుడు అటువంటి వాతావరణం అంతగా కనిపించకపోయినా పండగల ప్రాముఖ్యం మాత్రం తగ్గిపోలేదు. గృహిణులకే పనిభారాన్ని ఎక్కువ చేస్తాయి పండగలు. గృహాలంకరణలతోపాటు పండగ పిండివంటలతో వారు సతమతమైపోతారు. ''పండగంటే మాటలా... ఇల్లు సర్దుకోవాలి. బూజులు దులిపి ఇల్లు కడిగి ముగ్గులు పెట్టాలి. పిండివంటల తతంగం ఉండనే ఉంటుంది'' అంటూ ఇల్లాళ్ళు ఆయాసపడిపోతారు. పుస్తకాలు చదివి వంటలు చేసే ఓ పనిమంతురాలు ''గరిట తిప్పు- వంటచేయి'' అనే పుస్తకంలో రాసిన కొత్తరకం పిండివంటను పండగ కోసమని కష్టపడి తయారుచేసింది. ఇంటికి వచ్చినవారందరికీ ఆ వంటను గురించి గొప్పగా చెబుతూ- ''రుచిచూడండి... ఎంతబాగుందో-'' అంటూ తలాకాస్తా పెట్టింది. వచ్చినవారంతా చక్కగా తిని- చాలా బాగుంది- అని మెచ్చుకొని వెళ్లిపోయారు. తీరా పండగరోజు వచ్చేసరికి ఆ పిండివంట కాస్తా పూర్తిగా అయిపోయింది. ''పండగ పిండివంట పైవాళ్ళు రుచిచూడటానికే సరిపోయింది- ఇంట్లో వాళ్ళకు పస్తే...'' అని ఆ ఇల్లాలు నిట్టూర్చింది.

పండగలన్నింటిలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. అమావాస్యనాటి కారుచీకట్లను చీల్చుతూ వెలుగులు విరజిమ్ముతూ వచ్చే పండగ దీపావళి. పండగ కన్నా ముందే టపాకాయల మోతలు ప్రారంభమవుతాయి. పిల్లలు పేల్చే బొమ్మ పిస్తోళ్ళ పేలుడు ధ్వనులు, రోలు రోకళ్ళ శబ్దాలు, నేల టపాకాయల ఢామ్‌ఢామ్‌లు దీపావళి వచ్చేస్తోందనే సంకేతాన్ని ముందే అందిస్తాయి. ''వచ్చేను వచ్చేను దీపావళీ, ముచ్చటగొలిపే పండుగ భళిరా భళీ'' అన్న ఆరుద్ర, ''ప్రతి మనిషీ ఆ రోజున రంగరంగేళీ ప్రతి మనసున పయనించును కోర్కెల డోలీ'' అనీ అన్నారు. పసివాళ్ళు కప్పగంతులు కాలుస్తూ గంతులేస్తుంటే పెద్దవాళ్ళు మురిపెం తీరా చూస్తూ ముచ్చటపడిపోతుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కాకరపూవొత్తులు వెలిగించి సంతోషిస్తుంటే బామ్మలు, అమ్మమ్మలు వట్టి వత్తులతో సరిపెట్టుకుంటారు. ఆకాశం అందుకొనే అవ్వాయిచువ్వను చూసి- ''ఏమిటిది జవరాలి చక్కటి నవ్వా...'' అని ఆశ్చర్యపోయాడో కొత్త పెళ్ళికొడుకు. పిల్లల ఉత్సాహాన్నే కాదు స్త్రీ సాహసాన్నీ శక్తినీ ప్రతిఫలింపజేస్తుంది ఈ పండగ. నరకాసురుడు లోకకంటకుడై ప్రజల్ని పీడిస్తున్నప్పుడు అతని ఆటలు కట్టించటానికి సన్నద్ధుడవుతాడు శ్రీకృష్ణుడు. కృష్ణపరమాత్మ నరకునితో యుద్ధానికి బయలుదేరితే తానూ వస్తానంటుంది సత్యభామ. నీకిది తగదని కృష్ణుడు వారించినా వినిపించుకోదు. కొంగుబిగించి ''ధనువెక్కువెట్టి గుణనిస్వనముగావించి శరము సంధించి'' నరకునితో భీకరంగా యుద్ధం చేస్తుంది. ''ధనువుదెగటార్చి మేటిరథ్యముల గూల్చి సారథిని ద్రుంచి ధ్వజమును జక్కుజేసి, రథము బొలయించివేగ తద్రధికవరుల జాలిబడజేసె సతి బాణజాలములను'' అంటూ అప్పటి సత్యభామ రణకౌశలాన్ని చక్కగా వర్ణించారో పూర్వకవి.

దీపావళి అనగానే ఇటువంటి ఉదంతాలన్నీ మదిలో కదలాడటం సహజం. ఈ ఏటి దీపావళికి మరో ప్రత్యేకతా ఉంది. మన దీపావళి గొప్పతనాన్ని కొత్తగా అమెరికా ప్రభుత్వం గుర్తించింది. మతపరంగాను, చరిత్రాత్మకంగాను ఈ పండుగకున్న ప్రత్యేక ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభఆమోదం లభించింది. అమెరికా ప్రతినిధుల సభ చరిత్రలో దీపావళిని గుర్తిస్తూ ఒక తీర్మానం ఆమోదం పొందటం ఇదే మొదటిసారి. అమెరికాలోని భారతీయ సమాజానికి చెందిన దాదాపు 20 లక్షల మంది హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు- ప్రతిఏటా ఈ పర్వదినాన్ని అయిదు రోజులపాటు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. దీపావళి విశిష్టతను అమెరికా ఇప్పుడు గుర్తించినా మనవారు ఏనాడో గుర్తించి శతాబ్దాలుగా ఈ పండగను దేదీప్యమానంగా జరుపుతున్నారు. ''దీపావళీ విశ్వరూపావళీ, నిత్యజ్యోత్స్నావళీ, వర్ణలేపావళీ, దివ్యచిత్రావళీ, పరమశిల్పావళీ, రాగవ్యాప్తావళీ'' అన్న అడివి బాపిరాజు, ''నా ఆశ ఆశయము, నా అవధి ఆనందమే దీపావళీ'' అనీ అన్నారు. అటువంటి దీపావళి రాబోతోంది. ఈ దీపావళన్నా మనుషుల్లోని స్వార్థ తిమిరావళిని పోగొట్టి వారి మనసులో సామరస్య వెలుగులు నింపే శోభావళి అవుతుందేమోనన్న చిన్న ఆశ. ఎంతయినా మనిషి ఆశాజీవి కదా!
(Eenadu, 04:11:2007)
_____________________________

Labels:

Welcome to the ' 'Stock' Market!!!!!

Once upon a time in a village, a man appeared and announced to the villagers that he would buy monkeys For Rs. 10/-

The villagers seeing that there were many monkeys around, went out to the forest and started catching them.

The man bought thousands at Rs. 10/- and as supply started to diminish, the villagers stopped their effort. He further announced that he would now buy at Rs. 20/- This renewed the efforts of the villagers and
they started catching monkeys again.

Soon the supply diminished even further and people started going back to their farms. The offer rate increased to Rs. 25/- and the supply of monkeys became so little that it was an effort to even see a monkey, let alone catch it!

The man now announced that he would buy monkeys at Rs50! However, since he had to go to the city on some business, his assistant would now buy on behalf of him.

In the absence of the man, the assistant told the villagers. Look at all these monkeys in the big cage that the man has collected. I will sell them to you at Rs35 and when the man returns from the city, you can sell it to him for Rs. 50/-

The villagers squeezed up with all their savings and bought all the monkeys.

Then they never saw the man nor his assistant, only monkeys everywhere!!!

Welcome to the ' 'Stock' Market!!!!!

(an email forward)
__________________________________________

Labels:

కలలు - ఫలితాలు

నిషికి కలలు రావటమనేది అతి సహజం. మనస్సుకు సంబంధించిన ఈ విషయం మీద ఈనాటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పూర్వకాలంలోనే కాక ఈనాడు కూడా కొన్ని రకాల కలలొస్తే కొన్ని కొన్ని ఫలితాలు ఉంటాయని అందరూ అనుకోవటం కనిపిస్తూ ఉంటుంది. ఈ కలల గురించి అగ్ని పురాణంలో కొంత వివరణ ఉంది. శుభస్వప్నాలను గురించి చెప్పటమేకాక అశుభ స్వప్నాలు వస్తే వాటివల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ కథా సందర్భంలో పేర్కొనటం కనిపిస్తుంది. కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు. సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువు. నాట్యం చేస్తున్నట్టు, నవ్వినట్టు, గీతాలను పాడినట్టు, వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించినట్టు కల రావటం మంచిది కాదు. నదిలో మునిగి కిందికి పోవటం, ఆవు పేడ, బురద, సిరా కలిసిన నీళ్ళతో స్నానం చేయటం శుభ శకునాలు కాదు. స్వలింగ సంపర్కం, దక్షిణ దిక్కు వైపునకు వెళ్ళటం, రోగ పీడితుడిగా ఉండటం, ఇళ్ళను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్ని పురాణం పేర్కొంటోంది. తైలాన్ని తాగటం, దానిలో స్నానం చేయటం, ఎర్రని పూలమాలలను ధరించటం ఎర్రని చందనాన్ని పూసుకోవటం లాంటివన్నీ చెడు కలలే. పురాణంలో పేర్కొన్న స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడ్డ కలలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది. దుస్వప్నాలు వచ్చినప్పుడు మెలకువ వచ్చాక మళ్ళీ నిద్ర పోవటానికి ప్రయత్నించాలి. దుస్వప్నాల దోష శాంతి కోసం పండిత పూజ, నువ్వులతో హోమం చెయ్యటం మంచిది. బ్రహ్మ, విష్ణు, శివ, సూర్యగణాలను పూజించటం, స్తోత్రాలు, పురుషసూక్తం లాంటి వాటిని పారాయణం చేయాలి. రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక సంవత్సర కాలం లోపల అది ఫలవంతమవుతుంది. రెండో జాములో కల వస్తే ఆరు మాసాల లోపున, మూడో జాములో వస్తే మూడు మాసాల లోపున, నాలుగో జాములో కల వస్తే పదిహేను రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వస్తూ ఉంటాయి. సూర్యోదయ సమయంలో కల వస్తే అది పది రోజులలోపే జరుగుతుంది. ఒకే రాత్రి మంచి కల, పీడ కల రెండూ వస్తే రెండోసారి వచ్చిన కలే ఫలవంతమవుతుంది. రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలకువ రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలి. అదే శుభస్వప్నమైతే నిద్రపోవటం మంచిదికాదు.

కలలో పర్వతం, భవనం, ఏనుగు, గుర్రం, ఎద్దులను ఎక్కినట్లు కనిపిస్తే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. తెల్లటి పూలతో నిండిన వృక్షాలు కనపడ్డా, కలలో తన బొడ్డు నుంచి వృక్షంకానీ, గడ్డికానీ మొలిచినట్టు, తన భుజాలు, శిరస్సు చాలా పెద్దవిగా ఉన్నట్టు, జుట్టు తెల్లపడ్డట్టు కనిపించినా అది శుభపరిణామ సూచకం.

తెల్లటి పుష్పమాల, తెల్లటి వస్త్రాలు ధరించినట్టు, సూర్యచంద్ర నక్షత్రాలను పట్టుకొన్నట్టు, ఇంద్రధనుస్సును ఆలింగనం చేసుకొన్నట్టు, పైపైకి ఎక్కుతున్నట్టు, కల వస్తే శత్రువులు నశిస్తారని సూచన. పాయసాన్ని తిన్నట్టు కలవస్తే శుభప్రదం.

ఇలా శుభ స్వప్నాల గురించి, వాటి ఫలితాల నివారణ కోసం తిల హోమంలాంటి వాటి గురించి అగ్నిపురాణం పేర్కొంది. అలాగే శుభస్వప్నాల వరుసను కూడా ఈ సందర్భంలోనే పేర్కొంది. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మేలని పరశురాముడికి పుష్కరుడు ఇలా స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. మనిషి మనుగడకు సంబంధించిన అన్ని విషయాలను, శాస్త్రాలను పురాణాలు స్పృశించాయనటానికి ఇదొక ఉదాహరణ.

-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

(Eenadu, 04:11:2007)
_______________________________

Labels: