My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, October 15, 2008

మాతృదేవోభవ!


'ఎందుకొచ్చిన చదువులురా! ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళు ఏలాలా? ఉన్న చెక్కను చక్కగా సాగు చేసుకుంటూ, కడుపులో చల్ల కదలకుండా కళ్లముందు చల్లగా పడుంటే అదే పదివేలు' అనేది ఒకప్పటి గ్రామీణ భారతం. 'వద్దు వొద్దంటుంటే ఈ ఇంగిలీషు చదువులో పెట్టావ్‌! మనకీ ఇంగిలీషు చదువు అచ్చిరాదంటే విన్నావు కావు. మా పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకును ఇంగిలీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి వూష్టం వచ్చి మూడ్రోజుల్లో కొట్టేసింది' అని అగ్రహారం ఆక్రోశించేది. ఈ రకం అభివృద్ధి నిరోధక ధోరణి వెనక ఒకానొక కడుపు తీపి, మమకారపు నుడికారం ధ్వనించేవి. 'దీని చదువు మన వంశానికి చెడ్డపేరు తెస్తోంది నాన్నా! మరీ ఇన్నేసి మార్కులా! మీ జీవితంలో ఎప్పుడైనా వచ్చాయా? నా మటుకు నేను ఎప్పుడైనా తెచ్చుకున్నానా! మన వంశ సంప్రదాయానికి ఇది అప్రదిష్టకాదూ?' అని చెల్లెలి మార్కులు చూసి అన్నగారు బెంగపడటం సినీమార్కు చమత్కారం హాస్యప్రవృత్తికి అలంకారం. చదువులకయ్యే ఖర్చు చూసి బెంబేలుపడటం మరోరకం. వెంకటేశం విషయంలో అగ్నిహోత్రావధాన్లు 'మెరక పొలం సిస్తు అంతా వాడికిందయి పోతోంది. నేను వేదం ఎనభైరెండు పన్నాలూ ఒహ దమ్మిడీ పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది. ఒక్క దమ్మిడీ ఇవ్వను' అనేసి అగ్గిరాముడై పోవడం- ఈ బాపతుకిందికి వస్తుంది. క్రమంగా కాలం మారింది. చదువులపట్ల శ్రద్ధ బాగా పెరిగింది. అవసరమైతే కడుపు మాడ్చుకుని కూడబెట్టి మరీ చదువులు చెప్పించాలనే ధోరణి బలంగావ్యాపించింది. ఉన్న ఊళ్లో లేకపోతే పట్టణాలకు పంపించి అయినా పిల్లలకు పెద్దచదువులు చెప్పించడానికి తల్లిదండ్రులు తపన పడుతున్న రోజులివి. భర్తను ఊళ్ళో సేద్యానికి వదిలేసి, ఒంటరిగా పట్టణాలకు వచ్చి పిల్లలకు వండిపెడుతూ శ్రద్ధగా చదివించుకుంటున్న తల్లులు ఈ పెద్దమార్పునకు ప్రత్యక్ష ఉదాహరణలు.

ఒక జాతి ఆలోచనా విధానాన్ని ఇంత గణనీయంగా మలుపుతిప్పిందెవరు? జీవనశైలిలో బలంగా స్థిరపడిన అలవాటులో ఇంతటి పరివర్తనకు దోహదకారి ఎవరు? నెలవారీ కుటుంబఖర్చుల్లో పిల్లల చదువులదే పెద్దపద్దు కావడంలో కీలకనిర్ణయం ఎవరిది? ఇంకెవరిది- అమ్మది! భర్తతోడు బాగా అవసరమయ్యే వయసులో పిల్లల భవిష్యత్తుకు బతుకును ముడుపు కట్టి, ఒంటరిగా గడపడానికి సిద్ధపడిన అమ్మలకే చెందుతుంది- ప్రగతికి చెందిన ఈ ఘనతంతా! అవును. ఇంతటి మార్పునకు అమ్మే ప్రధాన కారణం. బాల్యంలో గోరుముద్దలు తినిపిస్తూ, దేవుణ్ని చూపించి... ఏదమ్మా అను... జేజి... జేజి అను తాత్తాత్తాత్తాత్త... అంటూ మాటలు నేర్పించిన తొలిగురువును గుర్తుతెచ్చుకోండి. ఉప్పుమూటలా బిడ్డను వీపున మోస్తూ- వంగుని, ముంగిట తెల్లని ముగ్గులు వేస్తూ- అమ్మలు నేర్పిన పాటలు గుర్తుచేసుకోండి. కోడికన్నా ముందే లేచి తాను తయారై, అన్నాలు వండి, కేరేజీలు సర్ది, పిల్లలను లేపి, వీపులు రుద్ది, బట్టలు తొడిగి, మూతులు కడిగి- వీధిలో గంట వినపడేసరికల్లా పిల్లాణ్ని ఒకవంక, పుస్తకాల బస్తా ఒక చంక ఇరికించుకుని పరుగులు తీసే అమ్మల హైరానా కళ్లారా చూడండి. పగలంతా ఇంటిపనులతో సతమతమై దీపాలవేళకు పాలో పళ్లరసమో పిల్లలచేత తాగించి చుట్టూ కూర్చోబెట్టుకుని హోంవర్కు పూర్తిచేయించే అమ్మల్ని జాగ్రత్తగా గమనించండి- అది అమ్మదనం ఎంతో ఆదరంగా అక్షరాస్యతకు సమర్పిస్తున్న నీరాజనమని అర్థమవుతుంది! చదువుల తల్లికి చందన చర్చలు ఎవరివో తెలిసి వస్తుంది! విద్యాభారతికి వెన్నెల హారతి పడుతున్న సంస్కారచిత్తం ఎవరిదో వెల్లడవుతుంది. ఆధునిక యుగంలో అమ్మ వామనరూపం ఎలా విశ్వరూపంగా విస్తరించిందో బోధపడుతుంది. జాతి జీవనాడిలో ఇంతటి అద్భుతమైన పరిణామానికి బీజం ఎక్కడిదో తెలుస్తుంది. నూరేళ్ల క్రితమే ఈ కీలకాన్ని గుర్తించిన వాడు మహాకవి గురజాడ! 'మీలాగే వాడూ జంఝాలు వొడుక్కుంటూ బతకాలని ఉందా ఏమిషి? మీకంత భారవఁని తోస్తే మావాళ్లు నాకు పసుపూ కుంకానికి ఇచ్చిన భూవంమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను' అని తెగేసి చెప్పిన వెంకమ్మ- ఈ అమ్మలందరికీ మూలపుటమ్మ!

గానంలో ఆరితేరిన గాయకుడు హెచ్చుశ్రుతిలో, పెద్దస్థాయిలో చికాకు లేకుండా పాడేందుకు వీలుగా తన రాగాలాపనకు ప్రారంభ స్వరస్థానాన్ని కుదిమట్టంగా స్థిరపరచుకుంటాడు. దాన్ని ఆధారషడ్జమం అంటారు. అమ్మను ఆధారషడ్జమంగా నిలుపుకొన్న వ్యక్తి తన జీవనరాగాలాపనలో ఎంతటి పైస్థాయిలోనూ తడబడడు. ప్రతి విజేతలోనూ అతని తల్లి లక్షణాలు కొన్ని తప్పక కనపడతాయని మనస్తత్వవేత్తలు చెప్పేదాంట్లో రహస్యమదే. 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' అని కీర్తించిన ఆదికవి మొదలు- 'ఈ లోకమనే గుడి చేరగ తొలివాకిలి అమ్మ' అని గానం చేసిన అవధాన కవి వరకు, కవులెందరో అమ్మదనానికి పల్లకీలు పట్టారు. 'లోకంలో చెడ్డకొడుకులుంటారు తప్ప చెడ్డ అమ్మలు ఉండరు' అని శంకర భగవత్పాదులు ఒక తీర్మానమే ప్రకటించారు. 'లోకంలో అమ్మలందరూ అమృతహృదయులే, జాలిగుండె కలవారే- ఎందుకంటే అమ్మలు దేవుడి ప్రతినిధులు' అన్నాడొక రచయిత. 'దేవుడు అన్నిచోట్లా ఉండటానికి వీలుకాక తన బదులుగా అమ్మను సృష్టించి అన్నిచోట్లకూ పంపించాడు' అన్న ఆంగ్లసూక్తి- మాతృదేవోభవ అనే ఆర్యోక్తికి ప్రతిధ్వనిగా అనిపిస్తుంది. అంతటిది కాబట్టి అమ్మదనం- పరంపరాగతంగా వస్తున్న అగ్రహారపు అసహనాన్ని సమన్వయ సంస్కారంతో సరిదిద్దగలిగింది. చారిత్రక విభాత సంధ్యల పెను చాదస్తపు చీకట్లను సమూలంగా తరిమేసేందుకు వీలుగా ఈ జాతి అంతస్సీమల్ని జ్యోతులతో నింపే దివిటీ కాగలిగింది. వెలుగులు పంచింది. గొప్పమలుపును సాధ్యం చేశారు అమ్మలు. అందుకే వారికి జేజేలు
(Eenadu, Editorial, 21-09-2008)
___________________________________


Labels:

LOVERS OF THE ENGLISH LANGUAGE MIGHT ENJOY THIS.

It is yet another example of why people learning English have trouble with the language. Learning the nuances of English makes it a difficult language. (But then, that's probably true of many languages.)


There is a two-letter word in English that perhaps has more meanings than any other two-letter word, and that word is 'UP.' It is listed in the dictionary as being used as an [adv], [prep], [adj], [n] or [v].


It's easy to understand UP
, meaning toward the sky or at the top of the list, but when we awaken in the morning, why do we wake UP? At a meeting, why does a topic come UP ? Why do we speak UP, and why are the officers UP for election and why is it UP to the secretary to write UP a report? We call UP our friends and we use it to brighten UP a room, polish UP the silver, we warm UP the leftovers and clean UP the kitchen. We lock UP the house and some guys fix UP the old car.
At other times the little word has a real special meaning. People stir UP trouble, line UP for tickets, work UP an appetite, and think UP excuses.

To be dressed is one thing but to be dressed
UP is special. And this up is confusing:
A drain must be opened UP
because it is stopped UP.

We open UP a store in the morning but we close it UP at night. We seem to be pretty mixed UP about UP !

To be knowledgeable about the proper uses of UP , look the word UP
in the dictionary. In a desk-sized dictionary, it takes UP almost 1/4 of the page and can add UP to about thirty definitions

If you are UP
to it, you might try building UP a list of the many ways UP is used. It will take UP a lot of your time, but if you don't give UP, you may wind UP with a hundred or more.

When it threatens to rain, we say it is clouding UP . When the sun comes out we say it is clearing UP
. When it rains, it wets UP the earth. When it does not rain for awhile, things dry UP.

One could go on & on, but I'll wrap it UP , for now ........my time is UP , so time to shut UP!

Oh...one more thing:
What is the first thing you do in the morning & the last thing you do at night?

U
P

Don't screw up. Send this on to everyone you look up
in your address book.

Now I'll shut up.


(an email forward)

____________________________


Labels:

Tuesday, October 14, 2008

‘Brain Gym Exercises’ for classroom excellence

N. C. SRIDHARAN,
U.S.-trained consultant and educationist

(The Hindu, Education Plus, Chennai, 13:10:2008)

_________________________________


Brain Gym helps in learning-related difficulties such as dyslexia, ADD, poor memory, concentration etc.



Competitive edge: With more emphasis on classroom performance, parents want to apply the best techniques to make their child intellectually superior.

In the era of perfect competition, parenting has become a full time responsibility. With more and more emphasis on classroom performance, every parent wants to apply the best known techniques to make their child intellectually superior. Today parenting has become a ‘technology’! To tap the full potential of children we need to maintain the brain well.

Over the years many techniques and tools have been invented to keep the brain fully functioning to its optimum capacity. In the recent past Brain Gym Exercises are becoming very popular all over the world.

Way back in 1969 Dr. Paul Dennison and Gail E. Dennison, educational therapists in America developed the Brain Gym exercises.

They were studying brain functions and Kinesiology. Kinesiology is a kind of self-help skill for improving general well-being of the human system.

When properly applied kinesiology will help to balance and fine-tune emotions, feelings and the mental energy. Kinesiology is about study of human movements and how it can influence the brain function and mental fitness.

While working with children who had learning difficulties, he noticed that the human body has acupressure points, which when activated will substantially improve the functioning of the brain.

One more related topic to understand the relevance of Brain Gym exercise is Neuroplasticity.

Neuroplasticity is a medical term which deals with the brain’s ability to adapt itself to the outside world. According to the principles of neuroplasticity, when we carry out certain challenging exercises, the brain matter adapts and re-arranges itself to help overcome brain related difficulties such as absent mindedness, lack of concentration etc, through increased secretion of neuropeptides.

When properly applied Brain Gym exercises helps learning related difficulties such as dyslexia, Attention Deficit Disorder (ADD), poor memory, poor organizing skill, lack of body coordination, poor concentration etc.

Simple exercises

We are aware how these parameters will affect the quality of teaching and learning. The Brain Gym exercises are very simple and can be practiced very easily.

‘Drink water’ is one such exercise. As the name indicates, it recommends that the children drink water just before the class starts. We all know that 80 per cent of the brain contains water and lack of water will lead to dehydration which will in turn affect the quality of the concentration.

‘Cross crawl’ is another interesting exercise which will integrate the Right and the Left side of the brain. This hemispherical integration is very important for planning and execution which will decide the quality of time management.

Some students cannot recall anything they read when they get into the examination due to anxiety and nervousness. ‘Hook Ups’ is a simple Brain Gym exercise which claims to calm down a person and reduces test anxiety.

‘Lazy Eights’ is another interesting exercise which claims to improve eye-muscles coordination and peripheral vision besides integrating the Right and the Left side of the brain. Brain Gym specialists claim that this exercise improves reading speed.

Some parents complain that their children find it difficult to deal with spelling, math and chemical symbols and spelling. ‘Double doodle’ is a Brain Gym exercise which will help students to overcome this problem.‘The Elephant’ is a Brain Gym exercise which improves such skills.

Brain Gym exercises are simple and easy to do activities dealing with four of the brain’s three dimensions: laterality, focus and centering. Laterality is the ability to integrate the three important pathways to learning, viz, the visual, auditory and the kinesthetic.

Focus is the ability to connect the back and the frontal lobes of the brain which will improve the quality of comprehension. Centering is the process of coordinating the top and the bottom portion of the brain which helps emotional balance and reduce the stress level.

Parental guidance

Parental care and guidance is very important to deal with the education related issues. Given the age and lack of maturity, the children may not be able to use all their resources and potential to perform at the best.

The school administration should also train their physical education teachers on new techniques such as Brain Gym so that all the students can have the benefits of the same.

____________________________

Labels:

చిన్ని చిన్ని ఆశ

ప్రాచీన ప్రాకృతగాథల్లో ఒక పచ్చిబాలింత ఉదంతం ఉంది. ఆమెది పూరిగుడిసె. బయట హోరున వర్షం. పాక పైకప్పు కొబ్బరాకు పందిరిలా ఎక్కడికక్కడ కారిపోతోంది. దుర్భరమైన తనస్థితిని తలచుకుని ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. ఒళ్ళో పసిబిడ్డ తడిసిపోతాడన్న బెంగతో తన చీరకొంగును గొడుగులా ఎత్తి పట్టుకుంది. అయినా, ఆ శిశువు తడిసిపోతూనే ఉన్నాడు- వర్షపునీటి వల్లకాదు, ఆమె కార్చే కన్నీటివల్ల- అంటాడు కవి! అనునిత్యం దుఃఖంతో నానుతూ కష్టాలతో కుదేలవుతూ, నిస్సహాయంగా కుమిలిపోయే వ్యధార్తజీవుల యథార్థజీవిత సగటు ముఖచిత్రం సరిగ్గా అలాంటిదే. బాధలతో సతమతం కావడం ఒకవైపు, వాటినుంచి పారిపోయేందుకు అనువైన దారులను వెతుక్కోవడం మరోవైపు- మానవజీవితాన్ని సంక్షోభానికి గురిచేస్తున్నాయి. 'ఔను నిజం! ఔను నిజం! జీవఫలం చేదునిజం' అన్న మహాకవి పలుకులు ఆ దుస్థితికి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు. మనిషిని నిరాశ ఆవరిస్తోంది. భయం పీడిస్తోంది. బతుకు బరువై తోస్తోంది. ఇలాంటి సమయంలో మనిషి తప్పక గుర్తుచేసుకోవలసిన ఒక అద్భుతమైన మాట పేరు- 'ఆశ'. మనిషి బతుక్కి గొప్ప చేయూత- ఆశ! కొండెక్కిపోబోతున్న దీపానికి చమురు చుక్కలాంటిది ఆశ. విడిచిపోతున్న ప్రాణాలను పట్టి నిలబెట్టేది ఆశ. 'చిగురంత ఆశ- జగమంత వెలుగు' అన్నది పరమసత్యం. సీతాన్వేషణ క్రమంలో హనుమంతుడు తిరిగితిరిగి విసిగి వేసారిపోయాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. చనిపోదామని సైతం అనుకున్నాడు. చితాం కృత్వా ప్రవేక్ష్యామి... సమిద్ధమ్‌ అరణీసుతమ్‌... అరణి సంభవుడైన అగ్నిని రగిల్చి ఆ చితిలో దేహత్యాగం చేద్దామని సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆ స్థితిలో ఎక్కడో... అంతరాంతరాల్లో చిన్న ఆశ మొలకెత్తింది. సీతమ్మ కంటపడుతుందన్న విశ్వాసం చివురించింది. బతికి యున్నచో సుఖములు బడయవచ్చు... జీవన్‌ భద్రాణి పశ్యతి... అనుకున్నాడు. తిరిగి ప్రయత్నం సాగించాడు. అద్భుత విజయం సాధించాడు. తాను బతికాడు, తోటి కపివీరుల్నీ బతికించాడు.

నేను బాగుండాలి, మీరూ బాగుండాలి అనేది చిన్నమాటేగాని- దాని ప్రభావం చాలా గొప్పది. వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లో సంచలనం థామస్‌ హేరీ 'అయామ్‌ ఓకే... యు ఆర్‌ ఓకే'కి కేంద్రవృత్తం అదే. 'ఈ సిద్ధాంతాన్ని అక్షరాలా అమలుచేస్తే ప్రతి మనిషికీ అంతులేని ఆనందం లభిస్తుంది, ఆయుర్దాయం పెరుగుతుంది' అంటాడు హేరీ. 'సర్వేజనాః సుఖినోభవన్తు' అనే ఆర్యోక్తికి భావానువాదం అది. జీవితంలోంచి మనిషి పారిపోవడాన్ని భారతీయ సారస్వతం కూడా ఎన్నడూ సమర్థించదు. ఆశావహమైన దృక్పథంతో సానుకూల వైఖరితో ముందుకు సాగాలన్నదే మన పెద్దల తీర్పు. 'కర్మాణి కుర్వన్నేవ జిజీ విషేత్‌' కర్మాచరణంతో మనిషి జీవించడాన్ని కోరుకోవాలన్నది- భారతీయ సామాజిక జీవనానికి మూలసూత్రం! క్షణశః కణశశ్చైవ విద్యామ్‌ అర్థంచ సాధయేత్‌... క్షణక్షణమూ విద్యనూ కణకణంగా డబ్బునూ సంపాదిస్తూనే ఉండాలని నిర్దేశించిన ఈ దేశం- పనినే తప్ప పలాయన వాదాన్ని ఏనాడూ బోధించలేదు. 'ఇక ఏడురోజులే బతుకుతావు' అన్నప్పుడు పరీక్షిత్తు బెంగతో ఏడుస్తూ కూర్చోలేదు. భాగవత శ్రవణం ద్వారా- చనిపోతున్నానన్న స్థితినుంచి తాను శరీరాన్ని విడిచిపెడుతున్నానన్న స్థితికి చేరాడు. మృత్యువు పట్ల కూడా సానుకూల ధోరణిని ప్రదర్శించాలన్నది భాగవత సందేశం. విజేతలెవరూ పారిపోరు. పారిపోయేవారంతా విజయానికి దూరమవుతున్నట్లు లెక్క. మాట్లాడటం సరిగా రాదని బాల్యంలో హేళనకు గురైన విన్‌స్టన్‌ చర్చిల్‌ ప్రపంచం చెవులొగ్గిన వక్త అయ్యాడు. పొట్టివాడివి, సినిమాలకు పనికిరావు పొమ్మన్న చార్లీఛాప్లిన్‌ నటనకే పాఠ్యగ్రంథం అయ్యాడు. గెలవాలన్న కోరిక కడుపులో నిరంతరం కణకణలాడుతూ ఉండటమే- ఆశావాదం, సానుకూల దృక్పథం!

సానుకూల వైఖరి, ఆశావహ దృక్పథం మనిషికి విజయాన్ని అందిస్తాయని వ్యక్తిత్వ వికాసగ్రంథాలు వివరిస్తున్నాయి. ఆశావాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల హార్వర్డ్‌కు చెందిన హెల్త్‌వాచ్‌లో ప్రచురితమైన ఒక నివేదిక- ఆయుర్దాయం పెరగడానికి సైతం ఆశావాదమే కారణమని తెలియజెప్పింది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో నిరాశావాదులకన్నా ఆశావాదులు త్వరితంగా కోలుకుంటున్నట్లు ఆ పరిశోధనలో బయటపడింది. త్వరగా నిరాశకు గురయ్యేవారిలో అధిక రక్తపోటు మూడురెట్లు ఎక్కువనీ, గుండెజబ్బుల ముప్పు రెండు రెట్లనీ తేలింది. ఫ్రెంచి విప్లవంపై తాను అద్భుతంగా రూపొందించిన రాతప్రతి ప్రమాదవశాత్తూ దగ్ధం కావడంతో- థామస్‌ కార్లయిల్‌ అంతటి గొప్ప రచయిత నిస్పృహకు లోనయ్యాడు. కుంగిపోయాడు. ఒకరోజు ఇటుక ఇటుకగా శ్రద్ధగా గోడ నిర్మిస్తున్న తాపీమేస్త్రీ పనితనం చూసి స్ఫూర్తిపొంది, రోజుకో పేజీ రాసినా చాలనుకుంటూ- ఆశావహ దృక్పథంతో తిరిగి రచన చేపట్టాడు. అది మొదటిదానికన్నా బ్రహ్మాండంగా రూపొందడం చూసి తానే ఆశ్చర్యపడి, రెట్టించిన ఉత్సాహంతో ఉద్గ్రంథాన్ని పూర్తిచేశాడు. జేజేలు అందుకున్నాడు. 'మనిషి చనిపోవచ్చుగాని- ఓడిపోకూడదు' అని పాశ్చాత్యగ్రంథాలు బోధిస్తాయి. 'నువ్వు' చనిపోవడం అనేదే ఉండదు, ఎందుకంటే నువ్వు అమృతపుత్రుడివి- అని భారతీయ తత్వశాస్త్రం ధైర్యం చెబుతుంది. నిండునూరేళ్లు చూద్దాం. జీవం తొణికిసలాడుతూ నూరేళ్లూ ఉందాం. నూరేళ్లూ సంతోషంగా ఉందాం. నూరేళ్లూ విందాం. నూరేళ్లూ మాట్లాడుతూ ఉందామని ప్రోత్సహిస్తుంది. మనిషి సర్వస్వాన్నీ కోల్పోయినా, రేపనేది ఒకటి మిగిలే ఉంటుందని తప్పక గుర్తుంచుకోవాలి!
(ఈనాడు, సంపాదకీయం, 14:09:2008)
___________________________

Labels:

The Expectant Father

There was an expectant father who had spent quite some time waiting for the offspring to arrive at his in-laws place. He was absolutely positive that his wife was going to present him with a boy.

As his leave balance had gone into the red, he told his father-in-law, "When my son comes, do not call up office and say that I have become a father of a boy. Then I'll have to shell out a lot for parties, etc. Just tell me that the clock has arrived. This will be our code for the arrival of my son."

The offspring finally arrives one day, but it's a daughter. The father-in-law now thinks, "If I tell him that the clock has not arrived, he'll misunderstand that something has happened to the baby and come rushing over." So he sends the message, "The clock has arrived, but the pendulum is missing."

(An email forward)

_________________________

Labels: