My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, February 28, 2010

పాదముద్రలు

అందాల కమలాలుగా భాసించే అమ్మాయి పాదాలు కనిపించగానే 'పదములె చాలును భామా, నీ పదపల్లవములే పదివేలు' అంటూ వయసు జోష్‌ మీద ఉన్న కుర్రకారు అప్రయత్నంగా కూనిరాగాలు తీయడం సహజమే. కాలి పట్టీల సన్నసన్నని సవ్వడితో, ఆ చిన్నారి అలాఅలా నడుస్తుంటే- ఆమె మెత్తమెత్తగా అడుగులు వేయడానికి తమ ఎడదను పరవాలనీ యువహృదయాలు తహతహలాడుతుంటాయి. 'పసుపైనా కానీవా, పదాలంటుకోనీవా, పాదాలకు పారాణై పరవశించి పోనీవా' అన్న వేటూరి పాట గుండెను చుట్టుముడుతుంది. ముందుగా ఆడపిల్ల పాదాలు చూసి, బాగున్నాయనిపించాక ఆ తరవాతే తలెత్తి ఆ అమ్మాయివంక చూసేవాళ్లూ లేకపోలేదు. తామరాకుపై మిలమిలలాడే మంచుబిందువులంత అందంగా- పాదాలమీది పట్టీలను అంటిపెట్టుకున్న చిరుమువ్వలు, అమ్మాయిలను సౌందర్యలహరుల్ని చేస్తాయి. ఆడపిల్లల అడుగుల సడి, వారి అందెల రవళి- పాటా, పల్లవిలాంటివి. మదన సంజీవని అంటూ శ్రీనాథుడు కీర్తించిన పార్వతీదేవి 'ఘల్లుఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ' కలహంస గమనాన కదలివచ్చి, 'జటలోన గంగను ధరియించియున్నట్టి జగములేలే జగదీశు' సన్నిధికి తరలివెళ్లింది. తిరువేంకటపతిని మెప్పించేలా 'చిందుల పాటల సిరిపొలయాటల/ అందెల రవళుల నాడెనిదె' అంటూ తన అక్షరాల్లో అన్నమయ్య- మదనుని కన్నతల్లి అలమేల్మంగ నృత్యవైభవాన్ని మన కళ్లకుకట్టాడు. తల్లులిద్దరూ అయ్యలను అలా అలరిస్తే- భార్య రతీదేవి పాదాలకు స్వహస్తాలతో పారాణి దిద్దిన ముచ్చట మన్మథస్వామిది. కుమారసంభవానికి నాందిగా- పరమేశ్వరుడి తపస్సును భగ్నం చేయాలని మన్మథుణ్ని వేడుకొనేందుకు అతని మందిరానికి వచ్చిన దేవతల దూతకు కనువిందు చేసిన రమణీయ దృశ్యమది!

ఓ చిన్నోడి పిడికెడు గుండెను అమాంతం దోచుకుంది ఓ చక్కనిచుక్క. దాన్ని వాపస్‌ చేయకపోతే మానె, తన మనసునూ ఇంకా ఇవ్వని ఆ చిన్నదాన్ని- ఆమె ఇంటిదాకా దిగబెట్టే డ్యూటీని యథాప్రకారం పూర్తిచేశాడా కుర్రాడు. ఇంట్లోకి వెళ్తూవెళ్తూ ఆ చిన్నది- కుడి భుజంమీదుగా తలతిప్పి అతగాడిపై కొంటెచూపుల్ని విసిరి లోనికి తుర్రుమంది. ఆ క్షణాన, అక్వేరియంలో దూసుకుపోతూ సర్రున వెనక్కితిరిగిన రెండు నల్లని చేపపిల్లల్లా తోచిన ఆమె విశాల నేత్రద్వయం వెంటాడుతుంటే చేసేదేంలేక- 'ప్రేయసి గృహవీధి స్పృహతప్పి పడిపోయి/ ముదిత కాలిగురుతు ముద్దుగొంటి'నన్న గాలిబ్‌ కవితను తలచుకుంటూ నిట్టూర్చాడా వెర్రినాయన! డవాళ్ల పాదాలు ఒక్కోసారి కావ్యరచనకూ ప్రోద్బలమవుతుంటాయనడానికి 'పారిజాతాపహరణ' ప్రబంధమే ఉదాహరణ. తెల్లవారి నిద్రలేచాక తన తలపై రాణిగారి పాదాలుండటం చూసి ఆగ్రహించిన రాయలవారు ఆ తరవాత ఆమె ఇంటిఛాయలకే పోలేదట. భర్త తలపై భార్య కాళ్లు పెట్టడం తప్పుకాదని తెలియజెప్పడానికి నంది తిమ్మన ఆ కావ్యం రాశాడని ప్రతీతి. తనపై కినిసిన సత్యభామ ఎడమకాలితో తన శిరస్సును తన్నినా కృష్ణయ్య- 'నను భవదీయ దాసుని నెయ్యపుకిన్క బూని తాచినయది నాకు మన్ననయ' అంటూ ఆమెకు విన్నవించుకున్నాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. పైగా- 'నా శిరస్సును తాకి, కోమలమైన నీ పాదాలు కందిపోయాయికదా అన్నదే నా బాధ' అంటూ మోకరిల్లి నల్లనయ్య ఆమె అలక తీర్చాడని విన్నప్పుడు... 'మేలి ముసుగు సడలించి చూస్తేనే కద/ కాలి చెంత కనపడుతుంది చెలీ, నా వ్యధ' అన్న ఆరుద్ర 'అరబ్బీ మురబ్బా' గుర్తుకు రాకమానదు.

గడచిన అయిదేళ్లుగా మహిళల పాదాల పరిమాణం పెరుగుతోందని, వారు ధరించే పాదరక్షల సగటు సైజు అయిదు నుంచి ఆరుకు చేరిందని ఓ అధ్యయనంలో వెల్లడయింది. ఒకప్పుడు ఆరో సైజు పాదరక్షలు ధరించే మహిళల సంఖ్య అరుదుగా ఉండేదని, ఇప్పుడు అవి సర్వసాధారణమయ్యాయని వారు అంటున్నారు. ఊబకాయంవల్ల, యుక్తవయసులో పిజ్జా తదితర జంక్‌ఫుడ్స్‌ భుజించడంవల్ల హార్మోన్లలో వచ్చే మార్పులు- ఆడవారి పాదాల పరిమాణం పెరగడానికి ప్రధాన కారణమన్నది వైద్యనిపుణుల అభిప్రాయం. అంతమాత్రాన- వాటి అందం తరిగిపోతుందనుకోవడం పొరపాటే. పాదాల పరిమాణం ప్రధానం కాదు, చరిత్రలో తమ పాదముద్రలు చిరస్థాయిగా గుర్తుండేలా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవడం ముఖ్యం. స్త్రీని ఏనాడో శక్తిపీఠంపై ప్రతిష్ఠించి- 'ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తా'రన్న గురజాడ వాణిని సార్వజనీన సత్యంగా ఇప్పటికే ఎల్లెడలా ప్రతిధ్వనింప చేసిన, చేస్తున్న ఘనకీర్తి మన స్త్రీమూర్తులది. సేవానిరతిలో ఒక మదర్‌ థెరెసా, ధైర్యస్త్థెర్యాల్లో ఒక కిరణ్‌బేడి, సాహసవిన్యాసాల్లో ఒక సునీతా విలియమ్స్‌, సంగీతసామ్రాజ్యంలో ఒక ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, సాహితీలోకంలో ఒక అరుంధతీరాయ్‌- ఇలా ఎందరెందరో అధునాతన మహిళలు చెరిగిపోని రీతిలో తమవైన పాదముద్రల్ని చరిత్రకు అందించారు. ఆ స్ఫూర్తి నిరంతరం మహిళల్లో పరిఢవిల్లాలి. ఆ పరంపరను ప్రతి మహిళా అప్రతిహతంగా కొనసాగించిననాడు వసంతం నిత్యం హసిస్తూనే ఉంటుంది. గాలిబ్‌ ఓ సందర్భంలో అన్నట్లు 'ఎచట నీ పదాంకమునీక్షింతు, నచట అడవిదారియు నందనమట్లు తోచు'నని మహిళా లోకానికి యావత్‌ మానవాళి నీరాజనాలర్పిస్తుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౧౦:౦౧:౨౦౧౦)
__________________________

Labels:

SUPERB Definitions

CIGARETTE:
A pinch of tobacco rolled in paper with fire at one end and a fool at the other!

MARRIAGE:
It's an agreement wherein a man loses his bachelor degree and a woman gains her master

LECTURE:
An art of transmitting Information from the notes of the lecturer to the notes of students without passing through the minds of either

CONFERENCE:
The confusion of one man multiplied by the number present

COMPROMISE:
The art of dividing a cake in such a way that everybody believes he got the biggest piece

TEARS:
The hydraulic force by which masculine will power is defeated by feminine water-power!

DICTIONARY:
A place where divorce comes before marriage

CONFERENCE ROOM:
A place where everybody talks, nobody listens and everybody disagrees later on

ECSTASY:
A feeling when you feel you are going to feel a feeling you have never felt before

CLASSIC:
A book which people praise, but never read

SMILE:
A curve that can set a lot of things straight!

OFFICE:
A place where you can relax after your strenuous home life

YAWN:
The only time when some married men ever get to open their mouth

ETC:
A sign to make others believe that you know more than you actually do

COMMITTEE:
Individuals who can do nothing individually and sit to decide that nothing can be done together

EXPERIENCE:
The name men give to their Mistakes

ATOM BOMB:
An invention to bring an end to all inventions

PHILOSOPHER:
A fool who torments himself during life, to be spoken of when dead

DIPLOMAT:
A person who tells you to go to hell in such a way that you actually look forward to the trip

OPPORTUNIST:
A person who starts taking bath if he accidentally falls into a river

OPTIMIST:
A person who while falling from EIFFEL TOWER says in midway "SEE I AM NOT INJURED YET!"

PESSIMIST:
A person who says that O is the last letter in ZERO, Instead of the first letter in OPPORTUNITY

MISER:
A person who lives poor so that he can die RICH!

FATHER:
A banker provided by nature

CRIMINAL:
A guy no different from the other, unless he gets caught

BOSS:
Someone who is early when you are late and late when you are early

POLITICIAN:
One who shakes your hand before elections and your Confidence Later

(An email forward)
_____________________________

Labels:

WICKED WORD-The battle of bologna

By V.S. Jayaschandran

Dementors in Harry Potter suck the soul out of people. Ron Weasley is terrified of them. Weasel words in English act like Dementors. They suck the life out of sentences, like the weasel sucking the yolk out of an egg without breaking the shell.

Weasel words are misleading or evasive words. “Interestingly” at the beginning of a sentence can be a weasel word. What follows often is uninteresting. “Downsizing” is another kind of weasel word, a favourite of management morons. It bandages the wounds of job loss and masks the pain. “Collateral damage” was a more cruel one. For the Iraqi people, it was nothing short of genocide.

in a short story he wrote in
An obscure writer, Stewart Chaplin, coined the term weasel wordsThe Century Magazine in 1900. Theodore Roosevelt stole it a decade later to slam Woodrow Wilson’s writings. When accused of plagiarism, Roosevelt said he had learnt the term from a hunting guide years before Chaplin wrote the short story. Erudite hunting guides must be a species unique to America.

Union Minister Krishna Tirath weaseled out of a tight spot after printing a wrong photograph in a newspaper ad against female foeticide. The goof-up elevated a former Pakistani air chief marshal to an Indian icon. But Tirath quibbled that the “message is more important than the image”. Quibbling is a common definition of weasel words.

The goof-up gave the ad an extended life in the media. It would have got more attention if the ministry had emulated the Canadian newspaper Peterborough Examiner. The paper recently published a photograph of students at a Santa Claus parade. It showed a hunk of a boy from St Peter’s School, surrounded by buxom girls, exulting with his arms up in the air and his peter peeking out of his shorts. The editors noticed the quiet intruder only the morning after.

Mountweazel is no sexually active weasel. The New Yorker magazine found the profile of a Lillian Virginia Mountweazel in the 1975 edition of The New Columbia Encyclopedia in 2005. It said she was a designer and photographer who was born in 1942 and killed at age 31 “in an explosion while on assignment for
Combustibles magazine.” No such person ever existed. Columbia had created her as a decoy to catch copycats. If some other encyclopedia mentioned Mountweazel as a person, Columbia could confront it for plagiarism. Mountweazel now means a fictitious entry.


Germans have created several fictitious people, as if to atone for the disappearances Hitler ordered.
One of them is a diplomat called Edmund Draecke, who “was vice-consul in Bombay in 1911”. Jakob Maria Mierscheid has been a fictitious member of the German parliament since 1979. The parliament web site features him as if he were a real MP, and presents his writings and speeches. It says he breeds stone-eating lice and dome-ringed doves. Both creatures are nonexistent like him.
The Heinrich-Heine University in Dusseldorf boasts a fictitious professor, Ernst Doelle. Deemed universities in India would say this is no big deal. Many of them have fictional campuses. A school campus at Sukhna has held a fascination for General Deepak Kapoor, who likes to fantasise about war on “two fronts”, taking on Pakistan and China simultaneously. Brass hats have a tendency to deteriorate from mentors to tormentors to Dementors.

Kapoor perhaps meant bone china. Englishmen made bone china to compete with imported porcelain. The word porcelain comes from porcellana, the Italian word for cowrie shell which is smooth like china. Porcella in Italian is female piglet. The shells were called porcellana because they resembled the sow’s genitals. This should add to the allure of Bollywood’s porcelain beauties. But think of bologna, the pork sausage, when generals shoot their mouths off—for bologna is also called baloney.
wickedword09@gmail.com
(The Week)
___________________________

Labels:

వివాహమే మహాభాగ్యం

జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది ఉపనిషత్‌ వాక్యం.
ఋషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో,
దేవతల రుణాన్ని యజ్ఞాలతో,
పితృరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని పెద్దల ఉవాచ
.
తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడానికి వివాహాన్ని ధార్మిక సంస్కారంగా ఆచరించే సంప్రదాయం మనది.
'పెళ్లి అనేది ఓ విచిత్ర వలయంలాంటిది. అందులో ఉన్నవారు బయటపడాలని తహతహలాడుతుంటారు. వెలుపల ఉన్నవారు లోనికి వెళ్లాలని ఉబలాటపడుతుంటారు' అని ఓ మేధావి చమత్కరించాడు కానీ, భారతీయ సంస్కృతిలో పాటించాల్సిన నాలుగు ధర్మాల్లో గృహస్థాశ్రమమూ ఒకటి. ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగిడే పొదరిల్లు అది! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు పడగనేల వెర్రితనము...' అన్న వేమన కూడా కామి కానివాడు మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పాడు. ఆ పురుషార్థాన్ని ప్రసాదించేది గృహస్థాశ్రమమే. సుఖదుఃఖాల్లో, కలిమిలేముల్లో సహభాగస్వాములై భార్యాభర్తలు సాగించే సంసారయాత్రకు స్నేహదీపమే దిక్సూచి కావాలి. 'మాయ, మర్మములేని నేస్తము/మగువలకు, మగవారికొక్కటె/' అంటూ 'బ్రతుకు సుకముకు రాజమార్గము'ను నిర్దేశించాడు వైతాళికుడు గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...' అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయతాహస్తాన్ని అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యానికి పట్టం కట్టాల్సింది పురుషుడే.

'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల,్‌ భార్య ఎర్తు' అంటూ కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే సెట్టు పలకడం సున్నా అన్నాడు.
భార్యాభర్తల సాహచర్యం-
సమశ్రుతి చేసిన ఆ పేటికలో బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా తరంగితం కావాలి.
దాంపత్యమంటే-
మూడు ముడులతో పెనవడిన రెండు ఆత్మలు ఒక్కటై వాగర్థాలవలె కలిసి ఉండటం! మనుగడకు మూలమంత్రమైన మమతను గుండె నిండుగా నింపుకొని జీవన మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం! అలకలు-అనునయాలు; విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్‌ కోపాలు-కిలకిల నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు... ఆ వీణ మెట్లపై పల్లవించే గానానికి సప్తస్వరాలై ఊపిరులూదడం!
దాంపత్యమంటే-
ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులే, సప్తాశ్వాలుగా వారి జీవనరథం మలిసంధ్యలోనూ సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే ఆకాంక్షలూరే రెండు గుండెలు- కోరికలు తీరి, ఆఖరి మజిలీకి చేరుకున్నాక 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి వెళ్లాలని...' నిరీక్షిస్తూ ఆర్ద్రమవుతుంటాయి. శృంగార అవసరాల్లేని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే అనురాగమనే రాగలత శోభాయమైనది. లోకోత్తర సౌరభాలతో వెల్లివిరిసేది. పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళిక' అన్నది ముళ్లపూడి రమణీయ భాష్యం.

ఇతర దేశాల్లో మాదిరి కాకుండా మన సమాజంలో కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది వివాహబంధమే. స్త్రీ, పురుషుల మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ-పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు వంటివాటివల్ల వివాహబంధాలు తెగిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిన రోజులివి. కాలానుగుణంగా విలువలూ మారుతుండటంతో- వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేనివారినీ తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది వివాహబంధమేనని తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి పట్టం కట్టేదే. పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని ఇంతకుముందరి అధ్యయనాలు పేర్కొనగా- స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసిక స్వాస్థ్యం చేకూరుస్తుందని తాజాగా వెల్లడయింది. విడాకులు, లేదా జీవిత భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళలకన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగిపోతారని చెబుతున్న పరిశోధకులు- పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్నవారికన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటున్నారు. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ పరస్పర నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ, పురుషులు వివాహబంధంతో ఒక్కటై బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండదు. ఏ తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం రసవంతమే!
(ఈనాడు, సంపాదకీయం, ౦౩:౦౧:౨౦౦౧౦)
___________________________________

Labels:

WICKED WORD- Wrong side of the blanket

By V.S. Jayaschandran

Humans hunt for a superconducting metallic rock in the movie Avatar. They call it unobtanium. This word mates ‘unobtainable’ and the ‘-nium’ ending of rare elements. Engineers at a warplane workshop in California found it difficult to obtain titanium from Russia in the 1950s. So they dubbed it unobtanium in jest. Today the word means anything essential that is out of reach.

Unobtanium entered science fiction before the Sanskrit word avatar did. Neal Stephenson introduced avatar in his novel Snow Crash in 1992. He also coined the word metaverse in the novel. But many readers remember the book for vagina dentata, an anti-rape device worn by the character Yours Truly. Its teeth inject a numbing drug into any invasive object to render it limpdick—another humdinger of a word heard in Avatar.

Avatars fascinated the scientist J.B.S. Haldane, who took Indian citizenship in the 1950s. He saw a parallel between Vishnu’s ten avatars and Darwin’s theory of evolution—how life began in water (Matsya avatar) and became amphibian (Kurma), animal on land (Varaha), half-man half-beast (Narasimha), proto human (Vamana), small-brained man (Parasurama) and then fully developed man (Rama, Balarama, Krishna and Kalki).

Haldane was Aldous Huxley’s model for Shearwater in the novel Antic Hay. Huxley describes Shearwater as “the biologist too absorbed in his experiments to notice his friends bedding his wife”. Haldane and Huxley were friends. Haldane conceived the idea of test-tube babies in his book Daedalus. Huxley borrowed it for his Brave New World, where children are born without both parents. They are created in hatcheries and conditioned in sleep.

Deve Gowda slept through his prime ministership. Now he has woken and spoken. He called B.S. Yeddyurappa a “bloody bastard”. But bastards in politics were not always despised. Even official documents described William the Conqueror as William the Bastard. Ramsay MacDonald, the first Labour prime minister, was also a love child. So was Alexander Hamilton, one of America’s founding fathers.

Australians should rename their country as Hindu Kush. The name of the mountain range means Hindu killer. Numerous Indians died while crossing it in winter. But don’t call Australians bastards for the attacks on Indians. The word has no sting Down Under. An Australian cricketer used it against the Bodyline bowler Harold Larwood. When the English captain Douglas Jardine went to the Aussie camp to complain, the Aussie vice-captain Vic Richardson asked his team mates: “OK, which of you bastards called Larwood a bastard, instead of this bastard?”

Rahm Emanuel, the White House chief of staff, has a celebrated foul tongue. Obama joked about it at a roast in 2005: “As a young man he had a serious accident with a meat slicing machine. He lost part of his middle finger, and this rendered him practically mute.” Obama harped on it on Mother’s Day last year: “This is a tough holiday for Rahm,” he said. “He’s not used to saying the word ‘day’ after ‘mother’.”

Obama loves the word screw-up, which is no profanity. He uses it as mea culpa. He said “screw-up” three times as president. The provocation the second time was the gatecrashing of his first state dinner for Manmohan Singh two months ago. Singh has no such gift of the gab and sticks to safe words. He described India as a slow elephant at the Pravasi Divas.

The sluggish elephant needs some gingering up. This was a treatment the horse got in the past. A piece of ginger was pushed up its rear to make it sprightly. The word ginger comes from the Sanskrit sringaveram, meaning horn-shaped body. Sringa is related to sringara—the rasa that makes you horny and tempts you to produce bastards.
wickedword09@gmail.com
(The Week)
__________________________

Labels:

గెలుపు పిలుపు


'గెలుపూ ఓటమికి మధ్య పోటీ పెడితే ఓటమే ముందు గెలుస్తుంది' అని చైనా సూక్తి. ప్రతి విజయానికీ వెనక ఓ ఓటమి ఉంటుంది. బావి తవ్వేవాడి చేతికి తొలుత మట్టే అంటుకుంటుంది. శరీరం తప్ప మరే ఆధారం లేని జీవజాలానికి పోరాడటం, ఎలాగైనా బతకాలనే ఆరాటం మినహా గెలుపూ ఓటములూ పట్టవు. కష్టపడి కట్టుకున్న గూడు చెదిరిందని సాలీడు ఏనాడైనా ఆత్మాహుతి చేసుకుందా? ఎండలు మండిపోతుంటే మళ్ళీ చినుకులు పడి చెరువులు నిండేదాకా కప్పలు బండల మధ్య రోజులు గడుపుతాయికానీ, గుండెలు పగిలి చావవు. శీతోష్ణాలూ, రాత్రింబవళ్ళు, చీకటి వెలుగులూ మాదిరే గెలుపూ ఓటములు! రాయిని రాతితో కొట్టి ఎవరూ నేర్పకుండానే నిప్పును పుట్టించినప్పటినుంచీ, చంద్రమండలం మీది నీటి జాడలు పట్టుకున్న దాకా అసలు ఓటమంటే తెలియకుండానే నెట్టుకొచ్చాడా మనిషి? అమ్మ కడుపులో పడిన క్షణంనుంచే మనిషికి పరీక్షలు మొదలవుతాయి. ఒలింపిక్సు పరుగుపందెంలో మొదట వచ్చిన విజేత కూడా బుడిబుడి అడుగుల వయసులో ఎన్నోసార్లు తడబడి పడిపోయే ఉంటాడు. 'పరుగాపక పయనించవె తలపుల నావ/ కెరటాలకు తలవంచితె దొరకదు తోవ...' అని ఓ సినీకవి అన్నదీ- కష్టాల వారధి దాటినవాళ్లకే అవరోధాల దీవిలోని 'ఆనంద నిధి' సొంతమవుతుందని చాటడానికే. 'మనిషి ఎన్ని శాస్త్రాలు చదివి పుణ్యకార్యాలు ఆచరించినా ప్రాణం ముందు అవన్నీ తృణప్రాయమే'నన్నది మహర్షి యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన జీవనసూత్రం. ప్రాణం అంత తీపి కనకనే అమృతం కోసం దాయాది వైరాన్ని సైతం పక్కనపెట్టి క్షీరసాగరమథనానికి పూనుకున్నారు దేవదానవులు. సాక్షాత్‌ మృత్యుస్వరూపుడైన యమధర్మరాజే దండంతో ప్రాణాలు హరించటానికి వచ్చినా శివలింగాన్ని పట్టుకుని వదలలేదు మార్కండేయుడు!

పెద్దలు 'జాతస్య మరణం ధ్రువమ్‌' అన్నారని చేతి గీతలను చేజేతులా చెరిపేసుకోవాలనుకోవడం పిరికితనమే అవుతుంది. మన ప్రమేయంతో మనం పుట్టామా... మన ప్రమేయంతోనే పోవటానికి? తల్లి తొమ్మిదినెలలు మోసి జన్మనిస్తే తండ్రి పందొమ్మిదేళ్లు కంట్లో పెట్టుకుని పెంచిన శరీరం ఇది. మన ఆటపాటలకు, ముద్దు ముచ్చట్లకు, సుఖసంతోషాలకు వాళ్ల జీవితాలను చాదితే చేవదేరిన దేహం ఇది. 'ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు భూతాలు. వాక్‌ పాణి పాద పాయూపస్థలనే అయిదు కర్మేంద్రియాలు, త్వక్‌చక్షు శ్రోత జిహ్వాఘ్రాణాలనే అయిదు జ్ఞానేంద్రియాలు... మనోబుద్ధి చిత్తాహంకారాలనే అంతఃకరణ చతుష్టయంతో కలిసి పందొమ్మిదిమంది దేవతల ఆవాసం మనిషి శరీరం' అని ప్రశ్నోపనిషత్తు పేర్కొంది. అది శాస్త్రోక్తమైనదా, కాదా అనే వాదనను పక్కనపెట్టినా నేటి సామాజిక జీవనరంగంలో ఏ వ్యక్తి జీవితమూ ఉలిపికట్టె మాదిరి ఒంటరిగా సాగేటందుకు వీలులేనిది. 'పుటక'నీది, చావునీది, బతుకంతా దేశానిది' అంటూ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌కు ప్రజాకవి కాళోజీ నివాళులర్పించారు. మన బతుకంతా దేశానిది అనిపించుకునేంతగా కాకపోయినా అది- కనీసం మన కన్నవారిది, మనం కన్నవారిది, మనల్ని నమ్ముకుని బతుకుతున్నవారిది అని అయినా ఒప్పుకొనితీరాలి! తిండికి బిడ్డ ఒక్కపూట పాలుమాలితే- పాలు కుడిపిన తల్లి రొమ్ము ఎలా తల్లడిల్లిపోతుందో తెలుసా! ఆకాశంలో అకాల చుక్క పొద్దువుతాడని కాదుగా కన్న తండ్రి కండల్ని చాది బిడ్డను చెట్టంతవాణ్ని చేసిందీ! 'నాతి చరామి' అని ఇచ్చిన హామీని నమ్మి ఓ బిడ్డకు తల్లిగా మారిన పిచ్చితల్లి 'అమ్మా! నాన్నేడే!' అని ఆ బిడ్డ అడిగితే బదులేమి చెబుతుంది?

పంట పొలాలు ఎండిపోయాయనో, ప్రేమించిన పిల్లకి వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయిందనో, ఉద్యోగం వూడి బతుకూ పరువూ బజార్న పడ్డాయనో, స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలి షేర్లు 'బేర్‌' మన్నాయనో, అభిమాన కథానాయకుడి సినిమా మొదటి ఆటకు టిక్కెట్లు దొరకలేదనో, మార్కులు నూటికి నూరు రాలేదనో, ఇష్టమైన ప్రజానాయకుడు హఠాత్తుగా పోయాడనో, క్రికెట్‌ ట్వంటీ20లో మనవాళ్ళు ఓడిపోయారనో, నిరాహారదీక్షలకు కూర్చున్న ప్రజాప్రతినిధులు నిమ్మరసం తాగారనో, తాగలేదనో ప్రాణాలు నిష్కారణంగా తీసుకునే ధోరణులు సమాజంలో క్రమక్రమంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిరుడు 1.22లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 14,224 మంది బలవన్మరణం పాలయ్యారు. స్వహననమే సమస్యలకు పరిష్కారం కాదు. విసుగుకీ ఓటమికీ ఉసురు తీసుకోవటం విరుగుడు కానేకాదు. జీవన సమరాంగణంలో యోధులుగా మారి ప్రతి అడుగునూ ఓ దీక్షా శిబిరంలా మార్చుకోవాలి. ఒడుపుగా మలుపు తీసుకోవడం మరిచిపోనంతకాలం మన ప్రయాణాన్ని ఏ వంకర టింకర మలుపూ ఆపలేదని తెలుసుకోవాలి. 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది...' అనే పాట అర్థం ఒంటపట్టించుకొంటే మంచిది.
(ఈనాడు, సంపాదకీయం, ౨౭:౧౨:౨౦౦౯)
___________________________

Labels:

The phone rings. The lady of the house answers, "Yes? "
"Mrs. Ward, please."
"Speaking"
"Mrs. Ward, this is Doctor Jones at the Medical Testing Laboratory. When your Doctor sent your husband's samples to the lab, the samples from another Mr. Ward were sent as well and we are now uncertain which one is your husband's. Frankly, it is either bad or terrible."

"What do you mean?" Mrs. Ward asks.

"Well, one Mr. Ward has tested positive for Alzheimer's disease (related to memory) and the other for AIDS. We can't tell which your husband's is"


"That's terrible! Can we do the test over?" questions Mrs. Ward.

"Normally, Yes. But Medicare won't pay for these expensive tests more than once."

"Well, what am I supposed to do now?"

"The people at Medicare recommend that you drop your husband off in the middle of town. If he finds his way home, don't sleep with him.".
(An email forward)
________________________

Labels:

WICKED WORD-Lay Of The Land

By V.S. Jayaschandran
Abhishek Bachchan, all set to anchor Bingo on boob tube, must be full of beans. Bingo developed from beano, a card game using dried beans, in which players shouted “beano” to declare a winning hand. Toy salesman Edwin Lowe popularised it in New York in 1929. He called it bingo after a player exclaimed “bingo”, instead of “beano”, in her excitement.

Bangalore got its name from beans. So did the Roman consul Fabius, whose family grew the legume. Two other consuls, Lentulus and Piso, owed their names to lentils and peas. The name of the orator Cicero came from chickpeas called cicera.

Cicera became a password in the Sicilian Vespers, an Italian insurrection against French rule in 1282. The rebels killed thousands of French residents in Sicily. The six-day massacre began at the vespers, the evening prayer, on Easter. As Frenchmen tried to pass themselves as Italians, the rebels asked them to pronounce the word cicera. The French could not get it right and were slain.

Shibboleth, a more ancient killer password, meant ear of corn as well as flowing water in Hebrew. The biblical people of Gilead conquered the neighbouring Ephraim and captured the Jordan River fords. Whenever someone wanted to cross the river the men of Gilead asked him, “Are you an Ephraimite?” If he replied no, they said, “Now say shibboleth.” They killed him if he mispronounced it as sibbolleth. Ephraimites had no ‘sh’ sound. Forty-two thousand people perished for one sibilant.

Shibboleth later acquired different shades of meaning such as catchword, custom, taboo and outmoded beliefs. Wait for the HRD minister’s education reforms to throw up Kapil sibboleths.

The parsley plant came handy for Dominican president Trujillo’s soldiers in 1937. In six days they massacred 25,000 Haitians who had crossed over to the Dominican Republic. Parsley was prejil in Spanish, the local language. Haitians, whose mother tongue was not Spanish, could not pronounce it. To identify them, the soldiers held up a bunch of parsley and asked them, “What is this?” Those who answered pesi or prersil were butchered.

“Parsley is gharsley,” wrote the poet Ogden Nash about its taste. Trujillo had a ghastly end. He was assassinated in 1961. But he was a true leader who looted his country and rooted with any girl he fancied. He employed an officer in the presidential palace for an unstaunched supply of wenches. An officer on special duty in the Hyderabad Raj Bhavan most likely learnt the ropes under him.

But how I envy N.D. Tiwari! He laid down office in bed. If Gandhi intoned ‘Hey Ram’, Tiwari chanted ‘Harem’. Two girls, naked and nubile, slept on either side of Gandhi. That was the celibate’s way of testing his will-power. An unauthorised erection horrified him once in a blue moon. Tiwari is a master of three Vedas, a trivedi. Blame him not if he tested his willie power with a threesome. At 86, one needs the rope and pulley to hoist the mast.

Eighty-Sixed is a gay novel by David Feinberg, who named his hero B.J. Rosenthal. The Raj Bhavan sting had shots of BJ, which some Hindi speakers pronounce as below-job. The Japanese would mouth it as bro-job. They utter the ‘la’ sound as ‘ra’. American soldiers in the Philippines exploited this tongue trouble to catch Japanese infiltrators in World War II. They asked all suspects to say lallapalooza, which means something outstanding. While it rolled off Filipino tongues, the Japanese could only manage rarraparooza. They got shot for the blur.

Lalu Prasad says Nitish Kumar is no lallapalooza. He says Nitish wasted public money by holding a cabinet meeting on the Ratnagiri hill in Rajgir on December 29. He is right: why go for a cliff, and not a clit? After all, the word means “a little hill” in Greek.
(wickedword09@gmail.com)
(The Week)
___________________________

Labels:

మహా ప్రసాదం


చిటికెన వేలిపై గోవర్ధన గిరినెత్తి, గోవుల్ని కాపాడటానికి దాన్ని గొడుగుగా పట్టిన చిన్నిశిశువే- సకల జీవులకు తన ఛత్రచ్ఛాయలో రక్ష కల్పించేందుకు కొండంత దేవుడు కోనేటిరాయడైనాడు. తిరుమలపై కొలువుతీరాడు. 'పెద్ద కిరీటమువాడు, పీతాంబరమువాడు, వొద్దిక కౌస్తుభమణి వురమువాడు/ ముద్దుల మొగమువాడు, ముత్తేల నామమువాడు, అద్దిగో శంఖచక్రాలవాడు...' అంటూ చిగురుమోవివాడైన శ్రీవేంకటేశుని తన అక్షరాల్లో మన కళ్లకు కట్టాడు అన్నమయ్య. 'వెక్కసమగు నీ నామము- వెల సులభము, ఫలమధికము' అంటూ తనను కొలిచేవారికి ఆ స్వామి ఎంతటి కొంగుబంగారమో విశదపరచాడు. 'పాపమెంత గలిగిన బరిహరించేయందుకు/ నా పాలగలదుగా నీ నామము' అన్న ఆ సంకీర్తనాచార్యుని పలుకు మనకూ తారకమంత్రమే. అందుకే, నిత్యకల్యాణమూర్తియైు జన నీరాజనాలందుకుంటున్న 'వేంకటేశ సమోదేవో/ నభూతో న భవిష్యతి'- వేంకటేశ్వరుని మించిన మరోదైవం లేదని- పెద్దలు ఘంటాకంఠంగా చాటారు. వేదాలు శిలాకృతులై, తాపసులు తరువులై, సర్వదేవతలు మృగజాతులై, పుణ్యరాసులే ఏరులై ఆ దేవాదిదేవునికి ఆవాసమైన తిరుమల- ఇలపై నెలకొన్న వైకుంఠమేనని ప్రతీతి. 'కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ/ విరివైనదిదివో శ్రీవేంకటపు కొండ...' అంటూ పదకవితా పితామహుడు కీర్తించిన వేంకటాద్రికంటే మిన్నయైున మరో పుణ్యక్షేత్రం ఏడేడు లోకాల్లో ఎక్కడా లేదన్నది రుషివాక్కు. ఆ అయ్యను దర్శించాలన్న తపనతో, ఆర్తితో, భక్తితో, కాంక్షతో ఏడాది పొడవునా ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు నానాదిక్కులనుంచి తరలివచ్చే భక్తజన సందోహంతో నిండిపోయే తిరువీధుల్లో అనునిత్యం తిరునాళ్ల ప్రభలే, ఏడుకొండల్లో అనుక్షణం గోవిందనామస్మరణల ప్రతిధ్వనులే!

'ఈ ఓంకార తరంగిణిలో ఓలలాడి, ఈ కాంతి సముద్రంలో మునిగితేలి భక్తులు తమనుతామే మరచిపోతారు. తమ కోర్కెల్నీ మరచిపోతారు. తమ బాధల్నీ మరచిపోతారు. బాధలో పుట్టిన కన్నీటి బిందువులు ఆనందబాష్పాలుగా స్వామి పాదాలను చేరతాయి. ఆనంద స్వరూపులవుతారు. ఆనందోబ్రహ్మ! అదే బ్రహ్మోత్సవం' అంటూ- వేంకటనాథునికి ఏటా జరిగే ఆ రాజరాజోత్సవ ప్రాభవ ప్రాశస్త్యాన్ని అభివర్ణించారు ముళ్లపూడి రమణీయంగా. అంగరంగ వైభవం అన్న పదానికి అచ్చమైన అర్థతాత్పార్యాలు- అందమైన తిరువేంకటాధిపుడు అందుకునే సేవల్లోనే సాక్షాత్కరిస్తాయి. తూరుపురేకలు విచ్చుకోకముందే మొదలయ్యే సుప్రభాత సేవనుంచి అర్ధరాత్రి దాటాక శయన మంటపం చేరేవరకు స్వామికి జరిగే సేవలన్నీ కమనీయమైనవే. 'కౌసల్యా సుప్రజా రామా' అన్న సుప్రభాత గీత పఠనాలు, వేంకటేశ్వర స్తోత్రాలాపనలు, ప్రపత్తిగానాలు, మంగళాశాసనాలు, కర్పూరహారతులు, అర్చనలు, అభిషేకాలు, వస్త్రసమర్పణలు, పుష్పాలంకరణలు, నైవేద్య నివేదనలు- అన్నీ విన వేడుకే, కన వేడుకే! ఉపమించగరాని ఆ ఉన్నత రూపానికి తప్ప, ఓ పాటలో వేటూరి అన్నట్లు... 'రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు/పన్నీటి జలకాలు, పాలాభిషేకాలు/ కస్తూరితిలకాలు, కనక కిరీటాలు/ తీర్థప్రసాదాలు, దివ్యనైవేద్యాలు/ ఎవరికి జరిగేను ఇన్ని వైభోగాలు' అనిపిస్తుంది. పుష్పమాలాలంకృతుడైన వేంకటేశుని దర్శించిన క్షణాన- 'సంపంగి, చంపక పూగపన్నాగ/ పూలంగిసేవలో పొద్దంత చూడగ/ నీపైని మోహము నిత్యము సత్యమై/ అహము పోదోలురా, ఇహము చేదౌనురా...' అన్న ఆత్రేయ కవిత, మనకు తెలియకుండానే గుండె తలుపులు తడుతుంది.

అమృత మథనుడైన ఆ జగత్పతికి 'ఇదివో నైవేద్యము' అంటూ నివేదించే- పులిహోర, పొంగలి, దధ్యోదనం, చక్కెర పొంగలి వంటి అన్న ప్రసాదాలు; లడ్డు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు వంటి పిండివంటలు భక్తులకు దివ్య ద్రవ్యాలే. చేతులుచాచి వారు మహద్భాగ్యంగా స్వీకరించే దివ్య ప్రసాదాలవి. శ్రీవారి శంఖు చక్రాలను తలపించే లడ్డు, వడ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తిరుమల వెళ్లి వచ్చిన యాత్రికులు తమ బంధుమిత్రులకు, పరివారానికి ప్రధానంగా పందేరం చేసేది కొండ లడ్డూనే. కొండంత దేవుణ్ని కొండంత పత్రితో పూజించలేనట్లే, కొండ లడ్డునంతటినీ వారు సన్నిహితులకు పంచలేకపోవచ్చు. చిన్న ముక్కగానైనా, విడి పొడిగానైనా తమవారు పంచే ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారికి తామే స్వయంగా తిరుమల సందర్శించినంత దివ్యానుభూతి! తన కడకు రాలేకపోయిన తమకు తిరుమల ప్రభువే స్వయంగా ప్రసాదం పంపించి దీవించాడన్నంత బ్రహ్మానందం! మాధుర్యంలోనే కాదు, ప్రాచుర్యంలోను శ్రీవారి లడ్డు తిరుగులేనిదే. తిరుమలలోనే, అదీ తితిదేయే తప్ప ఇతరులెవరూ తయారుచేయడానికి వీల్లేకుండా దానికి పేటెంట్‌ హక్కూ ఈమధ్యే లభించింది. యాత్రికుల అవసరాలకు తగినన్ని లడ్డూలను తిరుమల-తిరుపతి దేవస్థానంవారు సరఫరా చేయలేకపోవడంతో వాటికీ ఆ మధ్య కటకట ఏర్పడింది. రోజుకు లక్షన్నర లడ్డూలు తయారు చేస్తున్నా- సరఫరా గిరాకీల మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందన్నది అధికారుల కథనం. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తితిదే ఇప్పుడు రంగంలోకి దిగింది. వెంకన్న భక్తులకు వారు కోరినన్ని లడ్డూలను అతి త్వరలోనే అందుబాటులో ఉంచనున్నట్లు చెబుతున్న అధికారులు- అయిదులక్షల లడ్డూల తయారీకి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామంటున్నారు. ఇకపై భక్తులకు కొండలరాయని లడ్డూలు కోరినన్ని లభిస్తే అంతకుమించిన మహాప్రసాదం ఏముంటుంది?
(ఈనాడు, సంపాదకీయం, ౧౩:౧౨:౨౦౦౯)
________________________________

Labels:

కాలజ్ఞానం

'కన్ను తెరిస్తే జననం- కన్నుమూస్తే మరణం- రెప్పపాటేగదా ఈ ప్రయాణం!' అన్నాడొక కవి. నిజానికి కంటిరెప్ప కొట్టుకోవడానికి జీవితకాలం అక్కర్లేదు. 'కాలపత్రంమీద కాలాతీత సిరాతో రాసినప్పుడు ఏర్పడిన చిత్రం పేరు మనిషి' అని ఆచార్య గోపి ఎంత గొప్పగా చెప్పినా అసలు చిత్రమంతా ఉన్నది అనంతంనుంచి అనంతంలోకి నిరంతరంగా సాగే కాల జీవప్రవాహంలోనే! మనిషి అందులోని ఓ అల... అతని జీవితకాలం ఆ అల లేచిపడినంత. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం రానంతవరకూ కాలం ఓ అంతుబట్టని వింత! మహాభారతంలో యక్షుడు 'సూర్యుడిని నడిపించేదెవరు?' అని అడిగినప్పుడు ధర్మరాజు సమాధానంగా చెప్పిన 'బ్రహ్మం' అంటే ఈ 'కాలం' అనే భావం. పెను విస్ఫోటన (బిగ్‌బ్యాంగ్‌) సిద్ధాంతం ప్రకారం- కాలం విశ్వంతోసహా పుట్టినది, విశ్వమున్నంత వరకూ ఉండేది. 'కాలం అతిక్రమించలేనిది' అంటుంది వాల్మీకి రామాయణం. కురుక్షేత్ర యుద్ధసమయంలో సాక్షాత్‌ శ్రీకృష్ణపరమాత్ముడంతటివాడూ, అస్తమించే సూర్యుడిని ఆపలేక సుదర్శనచక్రాన్ని అడ్డుపెట్టాడు! కాలం మనిషికి అయాచితంగా దక్కిన వరం. కోరకుండానే దొరికిన పెన్నిధి. 'టైమ్‌ ఈజ్‌ మనీ' అనటం సరికాదు. సమయమనేది నిధి మాదిరి పోగేయలేనిది. బదిలీకి కుదరనిది. తిరిగిరానిది. గడియారాన్ని కొనగలంగానీ, దానిలోని కాలాన్ని కొనగలమా? జ్ఞానార్జనకోసం తననాశ్రయించిన చంద్రునితో బృహస్పతి 'నిజానికి నాకన్నా నీవే జ్ఞానివి నాయనా!' అంటాడు. తనవద్దలేని యౌవన విజ్ఞానం చంద్రుని వద్ద ఉందని రుషి భావం.

'కాలమనేది లేకపోతే అన్ని పనులూ ఒకేసారి చేయాల్సి వచ్చేది. ఎంత ఇబ్బంది?' అని చమత్కరించాడు బెర్నార్డ్‌ షా. కాలం విలువ ఒక్కొక్కరికి ఒక్కోవేళ ఒక్కోరకంగా ఉంటుంది. ఏడాది విలువ పరీక్ష పోయినవాడికి తెలుస్తుంది. నెల విలువ నెలతక్కువ బిడ్డను కన్నతల్లికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? 'వారం' వారపత్రికలకు సర్వం. రోజు అనేది రోజుకూలీకి ఉపాధి. గంట అంటే పరీక్ష రాసే విద్యార్థికి, నిమిషమంటే ఆంబులెన్సులోని రోగికి బాగా తెలుస్తుంది. ఒలింపిక్స్‌ పరుగుపందేల్లో సెకండులో వెయ్యో వంతు తేడాతో ఓడిపోయిన క్రీడాకారులు కోకొల్లలు! వూరునుంచి వూరికి పోతూ దారిలో కారులోనే వీలున్నంతవరకు ఓ కునుకు లాగించే గాంధీగారి అలవాటు వెనక ఎంతో 'కాలప్రణాళిక' ఉండేది. పరీక్ష ముందు పెట్టి పాఠం, తరవాత నేర్పే వింత గురువు- కాలం. మామూలు మనిషికి కాలం సాపేక్షికత ఓ పట్టాన అర్థం కాదు. వివరంగా చెప్పమని వేధించేవారికి ఐన్‌స్టీన్‌ 'ఇష్టమైన వారికోసం ఎదురుచూసే వేళ క్షణమొక యుగం... వారు ఎదురుగా ఉన్నవేళ యుగమొక క్షణంగా గడవటమే సాపేక్షికత' అని సరదాగా ఉదాహరించేవాడు. ఇరవై ఏళ్ల వయసులో రోజుకు ఇరవైనాలుగు గంటలున్నా చాలని కాలం, అరవైల్లో గంటకు అరవై నిమిషాలున్నా గడవటం భారంగా అనిపించటమే సాపేక్షికత అంటారు 'థియరీ ఆఫ్‌ ఎవ్విరిథింగ్‌' నిర్మాత స్టీఫెన్‌ హాకింగ్‌.

'జారిపోయే ప్రతిక్షణాన్నీ మాలిమి చేసుకోవడంలోనే మనిషి నిజమైన ప్రజ్ఞ దాగి ఉంది' అంటున్నారు వ్యక్తిత్వ వికాసవేత్తలు. ఓ గంట హాయి కావాలంటే కునుకుతీయి. రోజంతా సుఖంగా ఉండాలంటే కొత్త ప్రదేశానికి వెళ్లు. ఏడాదంతా ఏ దిగులూ వద్దంటే ఏదైనా బ్యాంకులో నీ సంపాదన దాచుకో. అదే జీవితాంతం ఆనందంగా గడవాలంటే ఇరుగుపొరుగుతో కలిసిపో అంటుంది చైనా సూక్తి. 'ఆపన్నులనాదుకుంటే ఆ దేవుడి విలువైన సగం సమయాన్ని ఆదా చేసినట్లు' అంటారు మదర్‌ థెరెసా. 'చేద్దాంలే... చూద్దాంలే అనుకోవద్దు. 'మనిషి జీవితకాలం 60 ఏళ్లేగాని వాస్తవంగా చూస్తే 13 ఏళ్లే' అంటున్నారు 'ది రోడ్‌లెస్‌ ట్రావెల్‌' రచయిత స్కాట్‌పెక్‌. చదువు సంధ్యలకు పాతికేళ్ళు, పనిపాటలకు రోజుకు ఎనిమిది గంటల చొప్పున పన్నెండేళ్ళు; స్నానపానాలు, ఆహారవిహారాలు, ఒంట్లో బాగోలేకపోవడం వంటివాటికి మరో పదేళ్ళు పోగా- మిగిలేది 13 ఏళ్లే! మనం చేసే పనిలో ప్రతి ఎనిమిదేసి నిమిషాలకు, ఐదు నిమిషాలకు తక్కువలేకుండా రోజుకు కనీసం ఏడుసార్లు ఆటంకాలు ఏర్పడతాయని టైం మేనేజ్‌మెంట్‌ నిపుణులు అంటున్నారు. రోజూ ప్రయాణానికి అరగంట, సెల్‌ఫోన్‌లో పనికిరాని మెసేజ్‌లు చదివి తొలగించటానికి పావుగంట, టీవీ రిమోట్‌ వాడకానికి పావుగంట. అన్నింటికన్నా ముఖ్యం- అయినదానికీ కానిదానికీ అనవసరంగా వాదించి ఓడిపోవటానికో, ఓడించి ఎదుటివాడి సమయాన్ని పాడుచేయటానికో 37 నిమిషాలు మనిషి వృథాగా వాడుతున్నాడని వాళ్ళు వాపోతున్నారు. ఆవులింతకు ఆరుసెకన్లు పడుతుందని ఆపుకోలేంగానీ, ఈ అనవసరమైన కాలయాపనను అదుపు చేసుకోలేమా? 'సమయాన్ని సమయానుకూలంగా, తనకిష్టమైన రీతిలో ప్రతిభావంతంగా వాడుకునే సాధనలో సాధించే విజయమే మనిషి నిజమైన సంపద' అంటున్నారు 'రిచ్‌ డాడ్‌-పూర్‌ డాడ్‌' రచయిత కియోసాకి.
'నిన్న' చెల్లని చెక్కు, 'రేపు' చేతికిరాని డబ్బు. నేడనేదే మనం నిజంగా వాడుకునే చిల్లర! చిల్లరమల్లరగా దీన్ని వాడుకోరాదనే దానికి మించిన కాలజ్ఞానం మనిషికి ఇంకేముంటుంది?
(ఈ నాడు, సంపాదకీయం, ౦౬ :౧౨ :౨౦౦౯ )
______________________________

Labels: