My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, July 16, 2013

1234 -బోఫోర్స్ ఖత్రోచి మృతి


గుండెపోటుతో ఇటలీలో కన్నుమూత
శతఘ్నుల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా నమోదు
అరెస్టు తప్పదనుకున్న తరుణంలో భారత్ నుంచి జారుకున్న వైనం
19 ఏళ్లపాటు దర్యాప్తు చేసిన సీబీఐ
2011లో ఖత్రోచికి కేసు నుంచి విముక్తి

భారత రాజకీయాల్ని కొన్ని దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన.. ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేసిన భోఫోర్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఇటలీ వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 74 ఏళ్లు. ఇటలీలోని మిలన్ నగరంలో ఖత్రోచి శుక్రవారం మరణించారని, అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలియజేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీతోపాటు ఆయన కుటుంబానికి సన్నిహితుడిగా పేరొందిన ఖత్రోచి.. బోఫోర్స్ తుపాకుల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించాడు. భారత్‌లో అరెస్టు కాకుండా తప్పించుకొని బయటపడ్డాడు. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయటంతో.. దేశదేశాల్లో తలదాచుకున్నాడు. చివరికి 2011లో ఆయనను ఈ కేసు నుంచి ఢిల్లీ కోర్టు విముక్తుని చేసింది.

పాతికేళ్ల నేపథ్యం: భారత సైన్యానికి హోవిట్జర్ అనే పేరున్న శతఘ్నులను విక్రయించటానికి స్వీడన్ కంపెనీ ఎ.బి.బోఫోర్స్ కాంట్రాక్టు కుదుర్చుకుంది. రూ.1,437 కోట్ల విలువైన ఈ ఒప్పందం ఇరుపక్షాల మధ్య 24 మార్చి 1986న కుదిరింది. అయితే, మరుసటి ఏడాదే ఈ ఒప్పందం వెనకాల భారీ అవినీతి వ్యవహారం నడిచిందని స్వీడిష్ రేడియో వెల్లడించింది. కాంట్రాక్టును దక్కించుకోవటానికి భారత్‌లో ఉన్నతస్థాయి రాజకీయ నేతలకు, సైన్యంలోని ఉన్నతాధికారులకు బోఫోర్స్ కంపెనీ లంచాలు ఇచ్చిందని తెలిపింది. ఇది భారత్‌లో పెను సంచలనం సృష్టించింది. భోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో అవినీతి ఏమీ జరగలేదని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ లోక్‌సభలో ప్రకటించారు. కానీ, ప్రతిపక్షాలు వూరుకోలేదు. దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం లేచింది. ఫలితంగా 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ పరాజయం పాలైంది. తర్వాత సీబీఐ ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. శతఘ్నుల కాంట్రాక్టు కోసం భోఫోర్స్ కంపెనీ రూ.64 కోట్ల లంచాలు చెల్లించిందని సీబీఐ దర్యాప్తులో తేలింది. భోఫోర్స్ కంపెనీకి.. భారత రాజకీయ నేతలకు, సైన్యాధికారులకు మధ్యవర్తిగా ఖత్రోచి వ్యవహరించాడు. ఆ సంగతి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. తన అరెస్టు తప్పదని తెలిసి ఖత్రోచి 1993లో భారత్ నుంచి జారుకున్నాడు. అనంతరం జరిగిన దరాప్తులో ఖత్రోచి పాత్ర వెల్లడి కావటంతో ఆయన అరెస్టుకు సీబీఐ వారెంట్ జారీ చేసింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ కూడా రెడ్‌కార్నర్ నోటీసు విడుదల చేసింది. దీంతో ఖత్రోచి పలుదేశాలు మారుతూ వచ్చాడు. మలేసియా, అర్జెంటినా తదితర దేశాల్లో తలదాచుకున్నాడు. అయితే, ఆయా దేశాల నుంచి ఖత్రోచిని పట్టుకోవటం కోసం సీబీఐ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి, దీనికోసం సీబీఐ అంత తీవ్రంగా ప్రయత్నించలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఖత్రోచి అప్పగింత కోసం సీబీఐ న్యాయపరంగా సరైన పత్రాలను కూడా తమకు సమర్పించలేదని అర్జెంటినా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు అద్దం పడతాయి. ఏళ్లు గడిచినప్పటికీ ఈ కేసు విచారణ మాత్రం ఢిల్లీలో కొనసాగుతూ వచ్చింది. ఇతర నిందితులందరూ చనిపోయారు. ఖత్రోచి ఒక్కడే మిగిలాడు. ఈ నేపథ్యంలో సీబీఐ 2009లో భోఫోర్స్ కేసు అన్వేషితుల జాబితా నుంచి ఖత్రోచి పేరును తొలగిస్తూ, అతనిపై తాము నమోదు చేసిన అభియోగాలను ఉపసంహరించుకుంటామని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. 2011లో ఖత్రోచికి ఈ కేసు నుంచి శాశ్వతంగా విముక్తి కల్పిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 

 ________________________________________

ఖత్రోచి చరిత్ర
 వృత్తి రీత్యా చార్టడ్ అకౌంటెంట్. ఆయన 1984 నుంచి 1993 వరకు శ్నామ్ ప్రొగెట్టి సంస్థకు ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నారు.

 భార్య మరియాతో కలిసి 1993లో కౌలాలంపూర్ వెళ్లిపోయారు. అక్కడి నుంచి 2004లో మిలాన్ చేరుకున్నారు.

 బోఫోర్స్ ఒప్పందంలో కుట్రకు, మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై భారత శిక్షాస్మృతి 120బి, 420 సెక్షన్ల కింద అభియోగాలు దాఖలయ్యాయి.

__________________________________________

భాజపా సృష్టించిన భూతం ఖత్రోచి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఖత్రోచి భాజపా సృష్టించిన భూతమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీ కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు విపక్షం ఆయన పేరును పదేపదే లాగేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ శనివారం.. ఖత్రోచీ మీద ఆరోపణలను ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే ఢిల్లీ హైకోర్టు కొట్టేసిందన్నారు. భాజపా సృష్టించిన భూతం మరణం గురించి కాంగ్రెస్ ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు. సింఘ్వీ ఆరోపణలను భాజపా నేత ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. కాంగ్రెస్ ఆతిథ్యం ఇచ్చింది కాబట్టే భూతం వచ్చి కూర్చోగలిగిందని వ్యాఖ్యానించారు.

________________________________________

1233 -అందమైన ప్రతినాయకుడు

అస్సలామలేకుమ్ ఇన్‌స్పెక్టర్... అంటూ గంభీరమైన ఆ గొంతు వినిపించగానే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఇస్ ఇలాఖే మే నయే ఆయే హో సాబ్ వర్‌నా షేర్‌ఖాన్ కో కౌన్ నహీ... అనగానే ఆ చప్పట్లు కాస్త కేరింతలుగా మారిపోయాయి. కళ్లపై వాలుతున్న ఆ జుత్తును పైకి ఎగరేస్తూ కాస్త నిర్లక్ష్యంతో నిండిన చూపుని విసరగానే కరడుగట్టిన విలనిజం ఉట్టిపడింది. అందుకే... 'జంజీర్' వచ్చి నాలుగు దశాబ్ధాలైనా అందులోని షేర్‌ఖాన్ మాత్రం మన కళ్లముందు ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాడు. అలాంటి వందలాది పాత్రలకి 'ప్రాణ్'ప్రతిష్ఠ చేసిన వైనం నభూతో నభవిష్యత్ అని చెప్పొచ్చు. గర్వం, దర్పం, క్రౌర్యం, ద్వేషం, పగ... ఇలా హావభావమేదైనా సరే కళ్లతోనే పలికించిన అసమాన నటుడు... ప్రాణ్ కిషన్ సికంద్. ఓ పక్క దుష్ట పాత్రల్లో ఒదిగిపోతూనే... మరోపక్క హృదయాల్ని మెలిపెట్టే ప్రయత్నం చేసిన ఘనత ఆయన సొంతం.

ఓ కన్ను చిన్నదిగా చేస్తూ మరో కనుబొమ్మని ఎగరేస్తూ కథానాయకులకు సవాల్ విసిరితే చాలు... ఆ సన్నివేశం పండిపోవల్సిందే. దీటైన విలనిజం ఉన్నప్పుడే హీరోయిజం ఉచ్ఛస్థాయిలో కనిపిస్తుందన్నది సినిమావాళ్లు నమ్మే మాట. అందుకే హిందీలో కథలు, కథానాయకులు, సన్నివేశాలు ఇలా అన్నీ మారినా ప్రాణ్ మాత్రం మారేవారు కాదు. ధర్మేంద్ర, రిషికపూర్, అమితాబ్, రాజేష్‌ఖన్నా, దేవానంద్... ఇలా కథానాయకుడు ఎవరైనా సరే - వారికి ప్రత్యర్థిగా ప్రాణ్ ఉండి తీరాల్సిందే. దుష్టపాత్ర అనగానే దర్శకనిర్మాతలు, కథానాయకులు నిస్సందేహంగా ప్రాణ్‌వైపు మొగ్గుచూపేవారు. ఆ పాత్రలపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. ప్రతినాయకుడంటే ఇలాగే ఉండాలన్న సిద్ధాంతాన్ని మార్చిన నటుడు ప్రాణ్. హీరోల్ని మించిపోయే అందం ఆయన సొంతం. వాడైన చూపులు, గంభీరమైన స్వరంతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసేవారు.

ఆ పేరంటేనే భయం...: నాసిర్ హుస్సేన్ చిత్రం 'ఫిర్ వహి దిల్ లాయా హూ' చిత్రీకరణ జరుగుతోంది. అందులో కథానాయకుడు జాయ్ ముఖర్జీ. ప్రతినాయకుడు ప్రాణ్. షూటింగ్‌ని చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ గుంపుని నియంత్రించడం చిత్ర బృందానికి చేతకాలేదు. ఓ పక్క షాట్ రెడీ అయ్యింది. అయినా జనం మాత్రం దూరం జరగడం లేదు. ఇక చేసేదేం లేక దర్శకుడు విషయాన్ని ప్రాణ్‌కి చెప్పారు. ప్రాణ్ ఒక్కసారిగా జనం ముందుకు వెళ్లారు. తనదైన శైలిలో ఒక్క ఉరుము ఉరిమారు. అంతే... అంతటా నిశ్శబ్దం. షూటింగ్ సజావుగా సాగిపోయింది. పూర్తయ్యాక వారందరినీ పిలిచి క్షమాపణలు చెప్పారు. ఆ రోజుల్లో ప్రాణ్ ముద్ర అలా ఉండేది. తమ పిల్లలకు ఆ పేరు పెట్టడానికి కూడా తల్లిదండ్రులు వెనకాడేవారు. ఆ కరకు కంఠం, క్రూరత్వం నిండిన కదలికలు ప్రేక్షకుల్ని భయకంపితుల్ని చేసేవి. ప్రేక్షకులే కాదు... కథానాయికలు సైతం ప్రాణ్‌ని చూసి భయపడేవారు. ఆయన ఏదైనా ఓ హోటల్‌లో దిగారంటే... కథానాయికలు అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేసేవాళ్లు కాదట. అయితే ఒక్కసారి ఆయనతో పరిచయమయ్యాక మాత్రం ఆ వ్యక్తిత్వాన్ని అందరూ ఇష్టపడేవారని చెబుతుంటారు.

కంటతడి కూడా...: కేవలం ప్రతినాయక పాత్రలతోనే ప్రాణ్ సరిపెట్టుకోలేదు. క్రమంగా పరిణతి చెందిన సహాయక పాత్రల్లోకి మారిపోయారు. వినోదాన్ని పండించడంతోపాటు, కరుణరసం ఒలికించే పాత్రల్లోనూ ఒదిగిపోయారు. 'ఉప్‌కార్' చిత్రంలో మాజీ సైనికుడు మలంగ్ చాచా పాత్రలో కనిపించి ఇటు పరిశ్రమను, అటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. హృదయాల్ని ద్రవింపజేసేలా కరుణరసం ఒలికించగలనని ఆ పాత్రతో చాటిచెప్పారు. హిందీలో అడుగుపెట్టిన తొలి యేడాదిలోనే 22 సినిమాల్లో నటించారు ప్రాణ్. అందులో 18 సినిమాలు ఒకే యేడాదిలో విడుదలయ్యాయి. దేశ విభజన తర్వాత లాహోర్ నుంచి ముంబయికి మకాం మార్చాక ఆయన కెరీర్ కాస్త నెమ్మదించింది. దేవానంద్‌తో కలిసి 'జిద్దీ' సినిమా చేశాక ప్రాణ్ సినీ జీవితం మళ్లీ కళకళలాడింది. ఒక దశలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఖరీదైన నటుడిగా మారిపోయారు. రాజేష్‌ఖన్నా తర్వాత అత్యధిక పారితోషికం ప్రాణ్‌కే దక్కేదట.

విలువలున్న వ్యక్తిత్వం...: సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గడపడం ప్రాణ్ అలవాటు. ఓసారి మాత్రం ముభావంగా కూర్చుని ఆలోచిస్తూ కనిపించాడు. దర్శకుడు విషయాన్ని ఆరా తీశాడు. ప్రాణ్ సోదరుడు మరణించాడని ఆయనకి తెలిసింది. ఆ విషయం చిత్రబృందానికి తెలిస్తే పని రద్దు అవుతుందనీ దీనివల్ల నిర్మాత నష్టపోతాడనీ ప్రాణ్ ఆ విషయాన్ని మనసులోనే దాచుకొన్నాడు. యథావిధిగా చిత్రీకరణలో పాల్గొన్నారు. పూర్తయ్యాక సోదరుడి అంతిమ సంస్కారాలకు వెళ్లాడు. వృత్తిపట్ల అంత నిబద్ధత కలిగిన వ్యక్తిత్వం ఆయనది. క్రమశిక్షణ, సమయపాలన విషయాల్లో చాలా నిక్కచ్చిగా వ్యవహరించేవారని ప్రాణ్‌కి పేరుంది. చేసేవి దుష్ట పాత్రలే అయినా... సంభాషణలు మాత్రం అసభ్యంగా ఉండకూడదని రచయితలకు ముందుగానే సలహా ఇచ్చేవారట. తన సహచర నటులు సరిగ్గా నటించడం లేదని తెలిసినప్పుడు... వారి మనసుని నొప్పించకుండా తగిన సూచనలు చేసేవారట. పాత్రల్లో కాఠిన్యం కనిపించినా... ప్రాణ్‌లో వేదాంత ధోరణి ఎక్కువనీ హిందీ సినిమావర్గాలు చెబుతుంటాయి. ''జీవితమనేది ఎవరి చేతుల్లో లేదనీ, భగవంతుడిని నమ్ముకోవడమే మానవ విధి'' అని తన దగ్గరికి వెళ్లేవాళ్లకి చెప్పేవారట.
 

మన తెరపైనా...
దక్షిణాది చిత్రపరిశ్రమతోనూ ప్రాణ్‌కి అనుబంధం ఉంది. తెలుగులో 'తాండ్ర పాపారాయుడు', 'కొదమ సింహం' చిత్రాల్లో నటించారు. కన్నడలో 'హోసరాగ' అనే చిత్రంలో నటించారు. సిగార్ పైపును నోట్లో పెట్టుకొని రింగురింగులుగా పొగను వదులుతూ దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించాడు ప్రాణ్. 'తాండ్ర పాపారాయుడు'లో బుస్సీ అనే పాత్రలో నటించి మెప్పించారు. ప్రాణ్ క్రీడలపై కూడా ఎంతో అభిమానాన్ని ప్రదర్శించేవారు. బాండే డైనమోస్ ఫుట్‌బాల్ క్లబ్ పేరుతో సొంతంగా ఓ ఫుట్‌బాల్ టీమ్ కూడా ప్రాణ్‌కి ఉండేది. కపిల్‌దేవ్ ఫాస్ట్‌బౌలర్‌గా అరంగేట్రం చేసినప్పుడు అతనికి ఇంగ్లాండ్‌లో శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వచ్చిన క్రీడాభిమాని ప్రాణ్.


 




ఆయన జ్ఞాపకాలు మరువలేనివి...
''భారతీయ సినిమాకు ఆణిముత్యం లాంటివారాయన. ఆయన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారతీయ సినిమా ఓ మంచి నటుడిని కోల్పోయింది.''
- డా||డి.రామానాయాడు, నిర్మాత
''తాండ్ర పాపారాయుడు సినిమాలో బుస్సీ పాత్ర పోషించిన ప్రాణ్‌తో 20 రోజుల పాటు కలిసి పనిచేశాను. ఆయనకు వేరే వసతి సౌకర్యం ఏర్పాటు చేసినా మాతోపాటు కలిసే ఉన్నారు. కలివిడిగా, నిరాడంబరంగా ఉండే ఆయన జ్ఞాపకాలను ఎన్నటికీ మరువలేను''
- కృష్ణం రాజు, నటుడు
''కొదమ సింహంలో ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. దేశం గర్వించే నటుడాయన. ప్రతినాయకుడిగానే కాదు, సహాయ నటుడిగానూ చిరస్మరణీయమైన పాత్రల్ని పోషించారు''
- చిరంజీవి, నటుడు, కేంద్ర పర్యాటక సహాయమంత్రి(స్వతంత్ర)
''ఆయన్ని జెంటిల్మెన్ విలన్ అని పిలుచుకోవాలి. సెట్లో ఆయన అంత వినమ్రంగా ఉండేవారు. ఆయనతో 'కొదమ సింహం' సినిమాకి పనిచేశా. మా సొంత నిర్మాణ సంస్థలో తీసిన సినిమా అది. ఆయన కాంబినేషన్‌లో సీన్ రావడానికి టైమ్ పట్టేది. అయినా సరే మేకప్ వేసుకొని గంటలకొద్దీ నిరీక్షించేవారు. 'మీ కోసమే కదా పనిచేస్తున్నా. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు కెమెరా ముందుకు రావడం నా విధి'' అనే వారు. నిర్మాతల గురించి కూడా ఆలోచించడం సంతోషంగా అనిపించింది''
- కైకాల సత్యనారాయణ
''భారతీయ సినిమా విలనిజంలో ప్రాణ్ ఓ శిఖరంలాంటివారు. ఆయన స్థాయికి చేరుకోవడానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఆయన నటించిన చిత్రాల్లో 'జంజీర్' గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలో ఇప్పుడు నేను నటించడం గర్వంగా ఉంది. మా సినిమాని చూపించి ఆయన ఆశీస్సులు పొందాలనుకొన్నాను. కానీ కుదరలేదు. ప్రాణ్ నటనను ఆదర్శంగా తీసుకొని నేను ఈ స్థాయికి చేరుకొన్నాను''.
- శ్రీహరి
''చిత్రసీమ ఓ గొప్ప నటుణ్ని కోల్పోయింది. బాలీవుడ్‌కే తలమానికం ప్రాణ్. ఆయనతో కలిసి 'జంజీర్'(1973), 'డాన్'(1978), 'కాలియా'(1981) చిత్రాల్లో నటించాను. ఆ సమయంలో నేను ఎంతో నేర్చుకున్నా''
- అమితాబ్ బచ్చన్
''భారతీయ సినిమా చరిత్రలో ఓ అధ్యాయం ప్రాణ్. పాత్రల్లో ఒదిగిపోయి నటించడం ఎలాగో ప్రతి ఒక్కరూ ఆయన్ను చూసి నేర్చుకోవచ్చు''
- షారుఖ్ ఖాన్
''ప్రతినాయకుడి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు ప్రాణ్. విలన్ అంటే ఇలానే ఉండాలి అనే మాటకు నిలువెత్తు రూపం ఆయన. యావత్తు భారతీయ ప్రేక్షకులందరికీ ఆయన మరపురానిప్రతినాయకుడు''
- కబీర్ బేడీ
''హిందీ చిత్రసీమకు ఆయన ఒక వరం. బాలీవుడ్ స్వర్ణయుగం అనిచెప్పుకొనే రోజుల్లో ఆయన నటించిన సినిమాలు ఎంతో మందికి మార్గదర్శకం''
- కరణ్ జోహార్
''ప్రతినాయకుడికి నిర్వచనం ప్రాణ్. ఆయన 'జంజీర్' సినిమాలో పోషించిన విలన్ పాత్రను నేను ఇప్పటి 'జంజీర్'లో పోషించడం ఎంతో గర్వంగా ఉంది''
- సోనూ సూద్
''ఆయన చేసిన సినిమాలన్నీ చూశాను. విలన్ పాత్రల్లోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు''
- అర్జున్ రామ్‌పాల్
''ఈ లోకంలో ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా''.
- బొమన్ ఇరానీ
''ఈ రోజుల్లో ప్రతినాయకులు... నాయకులకు దీటుగా ఉన్నారంటే దానికి కారణం ప్రాణ్. అందుకు ఆయనకు తలవంచి నమస్కరిస్తున్నా''
- మనోజ్ బాజ్‌పాయ్
''హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకున్న ప్రతినాయకుడు ప్రాణ్. ఆయన మన మధ్యన లేకపోవడం బాధాకరం''
- అనుపమ్ ఖేర్
''చిత్రసీమలో లెజెండ్ ప్రాణ్. ఆయన నటించిన 'జంజీర్'కు రీమేక్‌గా వస్తున్న తాజా 'జంజీర్'లో నేను నటించడం ఆనందంగా ఉంది. కానీ నేడు ఆయన ఈ లోకంలో లేనందుకు ఎంతో బాధపడుతున్నాను''
- ప్రియాంక చోప్రా

(ఈనాడు సినిమా , 15:07:2013)
______________________________

Labels: , , , ,

1232 -Bose Corporation founder, Amar Gopal Bose passes away

'Amar Gopal Bose was the Apple of the audio world' 
 Economic Times‎ 




 Bose died on July 12, 2013 at the age of 83 in Wayland, Massachusetts

Amar Gopal Bose (November 2, 1929  – July 12, 2013) was an Indian American academic and entrepreneur. An electrical engineer and sound engineer, he was a professor at the Massachusetts Institute of Technology (MIT) for over 45 years. He was also the founder and chairman of Bose Corporation. In 2011, he donated a majority of the company to MIT in the form of non-voting shares to sustain and advance MIT’s education and research mission.
 
In 2007 he was listed in Forbes 400 as the 271st richest man in the world, with a net worth of $1.8 billion. In 2009, he was no longer on the billionaire list, and returned to the list in 2011, with a net worth of $1.0 billion.



Early life and education

Bose was born and raised in Philadelphia, Pennsylvania to Noni Gopal Bose and an American mother, Charlotte. His father was an Indian and Bengali freedom revolutionary who, having been imprisoned for his political activities, fled Calcutta in the 1920s in order to avoid further persecution by the British colonial police. His mother, Charlotte, is described as an American schoolteacher of French and German ancestry, but Bose described her as "more Indian than me. She was a vegetarian and deeply interested in Vedanta and Hindu philosophy."


Bose first displayed his entrepreneurial skills and his interest in electronics at age thirteen when, during the World War II years, he enlisted school friends as co-workers in a small home business repairing model trains and home radios, to supplement his family's income.
 
After graduating from Abington Senior High School in Abington, Pennsylvania, Bose enrolled at the Massachusetts Institute of Technology, graduating with a BS (Bachelor of Science) in Electrical Engineering in the early 1950s. Bose spent a year in Eindhoven, Netherlands, in the research labs at NV Philips Electronics; and a year as a Fulbright research student in New Delhi, India, where he met his future wife, whom he later divorced. He completed his PhD in Electrical Engineering from MIT, writing a thesis on non-linear systems under the supervision of Norbert Wiener and Yuk-Wing Lee.

 

Career

Following graduation, Bose became an Assistant Professor at the Massachusetts Institute of Technology. During his early years as a professor, Bose bought a high-end stereo speaker system in 1956 and he was disappointed to find that speakers with impressive technical specifications failed to reproduce the realism of a live performance. This would eventually motivate his extensive speaker technology research, concentrating on key weaknesses in the high-end speaker systems available at the time. His research on acoustics led him to invent a stereo loudspeaker that would reproduce, in a domestic setting, the dominantly reflected sound field that characterizes the listening space of the audience in a concert hall. His focus on psychoacoustics later became a hallmark of his company's audio products.
 
For initial capital to fund his company in 1964, Bose turned to angel investors, including his MIT thesis advisor and professor, Dr. Y. W. Lee. Bose was awarded significant patents in two fields that continue to be important to the Bose Corporation. These patents were in the area of loud speaker design and non-linear, two-state modulated, Class-D, power processing. The company Bose founded now employs more than 9,000 people worldwide and produces products for home, car, and professional audio, as well as conducting basic research in acoustics and other fields. Bose never made his company public, and since the company was privately held Bose was able to pursue risky long-term research. In a 2004 interview in Popular Science magazine, he said: "I would have been fired a hundred times at a company run by MBAs. But I never went into business to make money. I went into business so that I could do interesting things that hadn't been done before."
 
In addition to running his company, Bose remained a professor at MIT until 2001. In 2011, Bose donated a majority of the company's non-voting shares to MIT on the condition that the shares never be sold.
 
Bose said that his best ideas usually came to him in a flash. "These innovations are not the result of rational thought; it's an intuitive idea." His son, Vanu Bose, is the founder and CEO of Vanu, Inc., a firm whose software-based radio technology provides a wireless infrastructure that enables individual base stations to simultaneously operate GSM, CDMA, and iDEN protocols for cellphone voice and data transmission.


Honors and Awards


  • Fellow, IEEE, 1972 - for contributions to loudspeaker design, two-state amplifier-modulators, and nonlinear systems.
  • Honorary member, Audio Engineering Society, 1985.
  • The 2010 IEEE/RSE Wolfson James Clerk Maxwell Award, for "outstanding contributions to consumer electronics in sound reproduction, industrial leadership, and engineering education".
  • In 2011, he was listed at #9 on the MIT150 list of the top 150 innovators and ideas from MIT. 

 ( Wikipedia, the free encyclopedia)
_________________________________________________________

Labels: , , ,