My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, October 08, 2007

Take care of your parents. THEY ARE PRECIOUS.

Venkatesh Balasubramaniam (who works for IIT) describes how his gesture of booking an air ticket for his father, his maiden flight, brought forth a rush of emotions and made him (Venkatesh) realize that how much we all take for granted when it comes to our parents.

"My parents left for our native place on Thursday and we went to the airport to see them off. In fact, my father had never traveled by air before, so I just took this opportunity to make him experience the same. In spite of being asked to book tickets by train, I got them tickets on Jet Airways. The moment I handed over the tickets to him, he was surprised to see that I had booked them by air. The excitement was very apparent on his face, waiting for the time of travel. Just like a school boy, he was preparing himself on that day and we all went to the airport, right from using the trolley for his luggage, the baggage check-in and asking for a window seat and waiting restlessly for the security check-in to happen. He was thoroughly
enjoying himself and I, too, was overcome with joy watching him
experience all these things.

As they were about to go in for the security check-in, he walked up to me with tears in his eyes and thanked me. He became very emotional and it was not as if I had done something great but the fact that this meant a great deal to him.

When he said thanks, I told him there was no need to thank me. But later, thinking about the entire incident, I looked back at my life. As a child, how many dreams our parents have made come true. Without understanding the financial situation, we ask for cricket bats, dresses, toys, outings, etc. Irrespective of their affordability, they have catered to all our needs. Did we ever think about the sacrifices they had to make to accommodate many of our wishes? Did we ever say thanks for all that they have done for us? Same way, today when it comes to our children, we always think that we should put them in a good school.
Regardless of the amount of donation, we will ensure that we will have to give the child the best, theme parks, toys, etc. But we tend to forget that our parents have sacrificed a lot for our sake to see us happy, so it is our responsibility to ensure that their dreams are realized and what they failed to see when they were young. It is our
responsibility to ensure that they experience all those and their life is complete.

Many times, when my parents had asked me some questions, I have actually answered back without patience. When my daughter asks me something, I have been very polite in answering. Now I realize how they would have felt at those moments.

Let us realize that old age is a second childhood and just as we take care of our children, the same attention and same care needs to be given to our parents and elders. Rather than my dad saying thank you to me, I would want to say sorry for making him wait so long for this small dream. I do realize how much he has sacrificed for my sake and I will do my best to give the best possible attention to all their wishes.

Just because they are old does not mean that they will have to give up everything and keep sacrificing for their grandchildren also. They have wishes, too.

Take care of your parents. THEY ARE PRECIOUS."
(an email forward)
________________________________________

Labels:

Sunday, October 07, 2007

Do we need Green Card/Life in India,US

Do we need Green Card?
J. EDEN ALEXANDER

A lively conversation between two Indian engineers attracted my attention as I was waiting at the Charles de Gaulle airport in Paris for our connecting flight to Chennai recently. One of them was exultant about getting his Green Card, while the other was lamenting over the inordinate delay in its issue.

Their love for this sacred card was obvious. It looked as though their life would become empty without it. I was rather pained to see their blind infatuation for this enchanting card. The question that I asked myself repeatedly was “Is life in America as attractive as these young men think?”

Darker side

After visiting the U.S. four times during the past six years, I am fully convinced that Americans do not enjoy any better life than ours in India. Life there too has its darker side.

It is a well known fact that 9/11 changed American history and its life. No one knows the real objectives. But under the guise of finding out weapons of mass destruction (that did not exist), Iraq was shattered to pieces. The Americans lost their serenity and peace of mind from the day their forces stepped into Iraq.

To fight terrorism, Mr. Bush has brought the life of every one in the U.S. under constant threat. Every small incident such as a boiler burst or a power failure is viewed with suspicion. Security is kept beefed up at all times at all places.

The biggest tragedy is that a passenger cannot carry his toothpaste or liquid medicines beyond a small (inadequate) quantity even in domestic flights in the U.S. with the advent of liquid bombs.

We know what happened in New Orleans. The incidents of rape and looting created more devastation than the hurricane itself when Katrina struck. The Bush administration could only be a silent spectator simply sitting and watching the chaos and lawlessness. On the other hand, not one such incident was reported in India when the tsunami destroyed our coastal villages.

Instead, our deep-rooted values evoked compassion and sympathy for the fellow countrymen and every Indian in relief work exhibited selfless and sacrificial service throughout. New Orleans showed the real colour of America in times of distress. I fail to understand why our people are so crazy about American life most of which is glamorous, hollow and empty.

Misconceptions

Despite employing our software engineers for their survival, the Americans seem to have a very poor opinion about us. Once, as I stood singing ‘Silent Night’ on a Christmas Eve Service in a church in the U.S., watching the lyric projected on a white screen, an American youth next to me whispered with surprise, “How long have you been here?” “For the past two months,” I replied. His next question was painful. “How did you learn English so quickly?”

I waited for the service to be over and told him in unambiguous terms: “Almost all the primary schools in India start teaching English from LKG. No one from India comes to the U.S. to learn English.” He felt sorry for having had a misconception about the Indians. There are many more Americans who have numerous delusions like this.

I am not against our young engineers going to the U.S. to earn, but only averse to their unfounded love for settling in a foreign land leaving their own motherland. The lawlessness among the American children who kill their own classmates in schools should make them think twice before they venture to bring up their own kids in such a country.

(The Hindu,23:09:2007)
__________________________________________

Life in India,US

SUDHEER MARISETTI

This is in response to the article “Do we need Green Card?” (Open Page, September 23). I am a 41 year old Indian, who lived in the United States for 18 years and returned with my family to live in Hyderabad one and a half years ago. Based on this background I wish to highlight what is good about living in India and the U.S.

The U.S. is not as difficult a place to live in after 9/11 as portrayed in the article. Even though people in New York do live a little in apprehension (I lived and worked for 15 years in the New York metro area), they are as resilient and tough as Indians in Mumbai and Hyderabad after the regular bomb blasts that we encounter here in India.

Regarding the writer’s reference to school children killing their classmates, we see a constant stream of juvenile crime in India more often than in the U.S. I see constant news about young children kidnapping other kids for ransom in India and eventually killing their victims, I see students committing suicides over ragging (hazing), examinations, relationships.

The tragedy of Hurricane Katrina in New Orleans was indeed a black spot in the history of U.S. public administration, so are the atrocities of America overseas such as in Vietnam (My Lai massacre), Iraq, Chile (Allende), Iran (Shah and Mossadeh), and other incidents. But I found that country learning from its mistakes. We see equally tragic and shameful events here such as the recent collapse of a flyover in Hyderabad, the constant barrage of news of corruption, rapes of tribal women by the police in Andhra Pradesh, and many more to add.

It is true that most Indians crave for U.S. permanent residency (Green Card) but for very good reasons. Here are some:

* People respect law and order. You cannot jump red lights, cheat on legal agreements, hold money from tax authorities (black money) as we do in India.

* You are left alone irrespective of what ethnic group you belong to or what colour your skin is as long as you are a law abiding citizen.

* You are respected for what you are, not for what community you belong to in the U.S.

* You play by the rules and your life is easy, and without hassles.

* You don’t have to bribe to get simple things done.

* You get uninterrupted power, clean water, roads without potholes, high-speed internet services as long you pay your taxes and bills on time.

I returned to India and believe India to be a good place to live in for different reasons from what the writer has listed. Here are a few of them:

* An Indian is always an alien within a foreign culture irrespective of how many years he lives there.

* The love and affection we get from our people is touching. It does not mean Americans don’t have such feelings. They do but they show them differently. I am used to Indian display of emotions.

* We are very accommodative. Recently I had to travel on a train without a berth and only a ticket for seating. The passengers made it easy for me to do that without problems.

* We may be poor, disorganised but we are a country that will survive. We know how to survive without power, water, roads, police. If ever there is a collapse of human civilisation, it will be countries like India that will survive, not the developed western world.

India is a better place for Indians with education, connections, belonging to the right community, and money. It is still a struggle for many lower-middle and lower classes. For those of us who belonged to these sections, America gave us a break and lifted us to upper strata and now we return to enjoy the newly found status. India has a long way to go before there are equal opportunities for every one. Till then Indians should travel abroad, develop themselves economically and intellectually. Even if a small fraction of them returns to India, it is going to benefit us all.

(The Hindu,07:10:2007)
________________________

Labels:

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

పల్స్‌ పోలియో కన్నా పెద్ద సమస్య?
'పర్స్‌' పోలియో

*బంగారం ధర పెరిగినా, తగ్గినా తేడా ఏమిటి?
పెరిగినా, తగ్గినా ఇంటాయనకే కన్నీళ్లు. అందులో తేడా ఏమీ లేదు.

*మన దేశంలోనే ఎక్కువమంది ఆరోగ్యవంతులు ఉన్నారట! నమ్మమంటారా?
నమ్మక తప్పదు. 'చచ్చినంత' ఒట్టు!!

*నా కవి మిత్రుడొకడు వ్యాపారం పెట్టాడు. అతడి భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు?
'టపాలు తక్కువ, తిరుగు టపాలు ఎక్కువ'గా సాగిపోతుంది.

* కొంత కాలం నుంచి చిన్న హోటల్‌ పెట్టుకొని వంట మాస్టర్‌ మొదలుకొని అన్ని పనులూ నేనే చేసుకుంటున్నాను. అయినా ఎవరూ హోటల్‌ గడప తొక్కడం లేదు. ఎందుకో?
మీరు 'చెమటోడ్చి' కష్టపడటం కళ్లారా చూసి ఉంటారు. పూర్‌ 'కష్ట'మర్లు
తినగతినగ వేము తీయనుండు అంటారు. ఎదురుదెబ్బలు తినగతినగ...
కొత్త వ్యాపారాలు పుట్టుకొచ్చున్‌..

* నగరాలకు గ్రామీణుల వలస ఆగాలంటే
సిటీలనిండా 'ఫ్త్లె ఓవర్‌'లు కడితే సరి. బతుకుంటే బలుసాకు తినొచ్చు అనుకుని వాళ్లే రావడం మానేస్తారు.

* ఎంత కష్టపడ్డా వ్యాపారంలో తొలిమెట్టు మీదే ఉన్నాను. మీ సలహా
అక్కడ ఉంటేనే బెటర్‌! పైకి వెళ్తే ఎప్పుడయినా ఒక 'మెట్టు' దిగి రావాల్సిందే కదా! అది ఎంత అవమానకరం చెప్పండి.

* వ్యాపారానికి నమ్మకం ముఖ్యమా? అమ్మకం ముఖ్యమా?
నమ్మకంతో అమ్మడం ముఖ్యం. ఎటొచ్చీ నమ్మితే అమ్మగలం. నమ్మనివ్వరు. అమ్మితే నమ్మగలం. అమ్మనివ్వరు.

* నిర్మాణాత్మకంగా పని చేయాలని ఉంది. ఏం చేయమంటారు?
కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పెట్టండి. మీరు అనుకున్నట్టు 'నిర్మాణాత్మకం'గా సాగుతుంది.

*అయినవాళ్లలో కలిసి వ్యాపారం చేస్తే?
కాని వాళ్లు లేని లోటు తీరుతుంది.

* నా ఫ్రెండొకడు నాదగ్గర అప్పు తీసుకుని 'చెక్కిస్తాను చెక్కిస్తాను' అని చెప్పి పెన్సిల్‌ చెక్కిచ్చాడు. ఇప్పుడేం చేయాలి?
ఇంకా నయం. ఎక్కడికీ చెక్కేయకుండా అదైనా చేశాడు. సంతోషించండి. 'మాట' మీద నిలబడ్డ అతడి పెన్సిల్‌తో రాసుకు పూసుకు తిరగడమే మీరు చేయాల్సింది.

* మన దేశంలో వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే?
పంట పొలాలు రాజకీయ నాయకులకు తప్ప ఇంకెవరికీ ఉండకూడదు.
(Eenadu, 07:10:2007)
____________________________

Labels:

పుస్తక సమీక్ష

సుప్రసిద్ధ పాతిక
'బాధల ముళ్లు గుచ్చుకుని బతుకు పచ్చి గాయమై'నా సాహితీ సేద్యాన్ని కొనసాగించిన సహవాసి మిగిల్చి వెళ్లిన చివరి ఫలం 'నూరేళ్ల తెలుగు నవల'. కావ్యాలు, ప్రబంధాల మత్తు వదిలించి, వాస్తవికత కొరడాతో పాఠకులను నిద్రలేపిందని నవలకు పేరు. ఏ అవలక్షణాలను ఈసడించి ఈ ప్రక్రియ వెుదలైందో అందులోనూ అవి జొరబడినై. లేదంటే ఈ వందేళ్లుగా రాసినవన్నీ ఉత్తమ నవలలే కావాలి. కోకొల్లలుగా ఉత్పత్తి అవుతున్న వాటికి భిన్నంగా, ఉరిమి, చిల్చి, చెండాడి... తన తరం పాఠకులనే కాదు, రాబోయే తరాలనూ ప్రభావితం చేయగలిగే రచనలను 'తెలుగునాడి'లో పరిచయం చేస్తూ వచ్చారు సహవాసి. నవలను తెలుగునేలకు ఆహ్వానించిన కందుకూరి 'రాజశేఖర చరిత్ర'తో వెుదలై, మట్టివాసనతో గుబాళించే వాసిరెడ్డి సీతాదేవి 'మట్టిమనిషి'తో ముగిసే ఈ పుస్తకంలో మాలపల్లి, వేయిపడగలు, మైదానం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, చదువు, అల్పజీవి, ప్రజలమనిషి, పెంకుటిల్లు, బలిపీఠం, మైనా, అంపశయ్య, హిమజ్వాల లాంటి పాతిక ఆణిముత్యాలనూ ఆయా రచయితల జీవితవిశేషాలనూ అందించారు. 'వెన్న పడుతుండగా పగిలిపోయిన చల్లకుండ కళ్ల ముందు ఆడుతుంది' అని బాధపడ్డారు దుర్భర దారిద్య్రంతో మూడు పదుల వయసులోనే కన్నుమూసిన మంచి-చెడూ రచయిత 'శారద'ను తలుచుకుంటూ. 'వస్తు, శిల్పాలు రచనలో చాలా సన్నిహితంగా కలిసిపోవటం ఉన్నత విలువలు కలిగిన సాహిత్య లక్షణం...' అంటారు బాపిరాజు 'నారాయణరావు' పరిచయంలో. ఇది అన్ని పుస్తకాలకూ వర్తించే వ్యాఖ్య. తెలుగు నవలా సముద్రంలో ఒక్కసారీ మునకలేయని వారికి, ఏం చదవాలో సూచించే దిక్సూచి ఈ పుస్తకం. ఆ అలవాటు ఉన్నవారికి కొత్త వెలుగులు చూపించే దీపపు కాంతి.
నూరేళ్ల తెలుగు నవల(1878-1977);
రచన : సహవాసి
సంపాదకుడు : డి.వెంకట్రామయ్య;
పేజీలు : 230; వెల : రూ.100/-
ప్రతులకు : నవోదయ, కాచిగూడ, హైదరాబాద్‌-27.
- షేర్‌షా
(EenaaDu, 07:10:2007)
______________________________________

Labels: ,

చరిత్రలో ఈవారం

అక్టోబరు 8

1932: భారత వైమానిక దళం(ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌) స్థాపన. ఆ సందర్భంగా ఏటా ఈ రోజును భారత వైమానిక దళ దినోత్సవంగా జరుపుకొంటారు.
2005: పాకిస్థాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 08:50:38 నిమిషాల ప్రాంతంలో పాక్‌ఆక్రమిత కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 7.3గా నవోదైన దాని తీవ్రతకు దాదాపు 74వేల మంది మరణించారు. సుమారు లక్ష మంది నిరాశ్రయులయ్యారు.


1967: బొలీవియాలో గెరిల్లా యుద్ధ కార్యకలాపాలు నడుపుతున్న క్యూబా విప్లవ యోధుడు చేగువేరా అమెరికన్‌ గూఢచార సంస్థ సి.ఐ.ఎ. ఏజెంట్‌ రోడ్రిగ్జ్‌ ఫిలిప్స్‌ నేతృత్వంలోని బృందానికి పట్టుబడ్డాడు. ఆ రాత్రికే వారు 'చే'ను సమీపంలోని 'లా హిగువేరా' గ్రామానికి తరలించారు. మర్నాడు మధ్యాహ్నం(అక్టోబరు 9) ఒంటిగంటా పదినిమిషాలకు గ్రామంలోని స్కూలు భవనంలో మారియో టెరాన్‌ అనే బొలీవియన్‌ సార్జెంటు చేగువేరాను కాల్చిచంపాడు. అనంతరం మృతదేహాన్ని హెలికాప్టర్‌లో సమీప పట్టణమైన వ్యాలీగ్రాండ్‌కు తరలించి అక్కడి ఓ ఆసుపత్రిలో విలేకరులకు ప్రదర్శించారు. అలా మూడురోజులపాటు అక్కడే ఉంచి చే రెండుచేతుల్నీ తొలగించారు(అందుకు స్పష్టమైన కారణాలేంటో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు). ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని గుర్తుతెలియని ప్రదేశానికి పంపారు. అక్టోబరు 15న చే మృతి గురించి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌క్యాస్ట్రో అధికారికంగా ప్రకటించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వ్యాలీగ్రాండ్‌ ప్రాంతంలో చేతులు లేని ఓ అస్థిపంజరం బయటపడింది. పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్‌ అధికారులు అవి చే తాలూకూ ఆనవాళ్లే అని నిర్ధరించారు. చివరకు 1997 అక్టోబరు 17న శాంటాక్లారా(క్యూబా)లో సైనికలాంఛనాలతో ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపింది.

అక్టోబరు 9
ప్రపంచ తపాలా దినోత్సవం. 1874కు ముందు వరకూ తపాల సేవల నిమిత్తం ప్రతిదేశం ఇతర దేశాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వచ్చేది. అంతకన్నా సులభంగా... ఒక అంతర్జాతీయ తపాలా సంస్థను స్థాపిస్తే బావుంటుందని అమెరికా పిలుపునిచ్చింది. ఆ మేరకు 1874, అక్టోబరు 9న 'జనరల్‌ పోస్టల్‌ యూనియన్‌' సంస్థ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌ నగరంలో లాంఛనంగా ఏర్పాటయింది. 1878లో దాని పేరును 'యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ (యు.పి.యు.)'గా మార్చారు. 1969 నుంచి ఏటా అక్టోబరు 9ని ప్రపంచ తపాలా దినోత్సవంగా నిర్వహించాలని నిశ్చయించారు. భారతదేశం సహా 190కి పైగా దేశాలకు యు.పి.యు.లో ప్రస్తుతం సభ్యత్వం ఉంది.
1874: వాడి-సికింద్రాబాద్‌ రైల్వేలైనుతో నిజాం రాష్ట్ర సొంతరైల్వే వ్యవస్థ ఏర్పాటైంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అప్పుడు ఏర్పడిందే.
2004: అఫ్గానిస్థాన్‌లో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.

అక్టోబరు 10
1930: శాండర్స్‌ హత్యకేసు తదితర నేరారోపణలపై భగత్‌సింగ్‌ ఆయన సహచరులు సుఖదేవ్‌, రాజగురులకు
కోర్టు ఉరిశిక్ష విధించింది.దాదాపు 5 నెలల తర్వాత 1931, మార్చి 23న ఆ శిక్షను అమలుపరిచారు.

అక్టోబరు 12
1850: ప్రపంచంలోనే తొలి వైద్యకళాశాల అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రారంభమైంది.
1901: అమెరికా అధ్యక్షుడు థియోడర్‌ రూజ్వెల్ట్‌ 'వైట్‌హౌస్‌' పేరును అధికారికంగా ప్రకటించాడు. అంతకు ముందు దాన్ని 'ఎగ్జిక్యూటివ్‌ మ్యాన్షన్‌'గా పిలిచేవారు.
1999: ప్రపంచ జనాభా 600కోట్లకు చేరుకుంది.
2005: మన దేశంలో సమాచారహక్కు చట్టం అమల్లోకి వచ్చింది.

అక్టోబరు 13
1542: మొఘల్‌చక్రవర్తి అక్బర్‌ జననం.
1792: అమెరికా అధ్యక్షభవనం శ్వేతసౌధ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
1884: 'గ్రీన్‌విచ్‌ మీన్‌ టైం' గణన ప్రారంభం.

అక్టోబరు 14
1956: లక్షలాది దళితులతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ బౌద్ధమతాన్ని స్వీకరించారు.

(Eenadu, 07:10:2007)

_______________________________

Labels:

కృణ్వంతో విశ్వమార్యం

- పారుపల్లి వెంకటేశ్వరరావు

సౌజన్యం, సత్యనిరతి, సదాచరణగల జ్ఞానులు పూజనీయులు. అటువంటి వారికి వర్తించే పదం ఆర్యులు. వారు ఏమతం వారైనా, ఏజాతివారైనా, ఏదేశం వారైనా, ఏఖండంవారైనా, ఆర్య పదం అటువంటి జ్ఞానులకు వర్తిస్తుంది. కుల, మత, భేదాలతో పనిలేదు. స్త్రీ, పురుష విచక్షణ లేదు. ఆర్యపదం గౌరవవాచకం, సంస్కారగుణ సూచకం!

కారణజన్ములుగా మన పురాణాలు, కావ్యాలు కీర్తించే మహామనీషులు, మహా రుషులు, విశ్వమానవ సమాజాన్ని ఆర్యమయం చేయటానికి ధర్మశాస్త్రాలు రచించారు. ఆ శాస్త్రాల ద్వారా, విశ్వమానవాళికి మహత్తరమైన సందేశాలు అందించారు.

''కృణ్వంతో విశ్వమార్యం'' (విశ్వాన్ని ఆర్యమయం చేద్దాం) అన్న ప్రబోధ వాక్యం ఆ మహనీయులు ప్రవచించిందే!

స్వామి వివేకానంద ప్రపంచ మానవాళికి అటువంటి సందేశం అందించటం కోసం అమెరికాలో జరిగే విశ్వమత మహాసభలో పాల్గొనాలని బయలుదేరాడు. అరవై రోజులు ఓడలో సముద్రయానం చేసి 1893 జులై ఆఖరికి అమెరికా చేరాడు.

ఆ మహాదేశంలో వివేకానందకు ఎవరూ తెలిసినవారు లేరు. ప్రయాణ సమయంలో ఆయనకు ఒక సంస్కారవంతురాలైన అమెరికన్‌ మహిళ పరిచయమైంది. ఆ మహిళ స్వామీజీని పరిపూర్ణ జ్ఞాని అని గుర్తించింది. సంపన్నురాలైన ఆమె స్వామీజీకి సగౌరవంగా ఆతిథ్యమిచ్చింది. అంతేగాక హార్వర్డు యూనివర్సిటీలో గ్రీకు భాషాచార్యుడుగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జె.హెచ్‌.రైట్‌కి స్వామి వివేకానందుని పరిచయం చేసింది. ఆయన సుదీర్ఘ సంభాషణ జరిపిన తరవాత స్వామీజీ తత్వజ్ఞాన ప్రతిభకు, విద్వత్తుకు ఆకర్షితుడై అమితంగా అభిమానించాడు.

విశ్వమత మహాసభలో పాల్గొనటానికి యోగ్యతా పత్రాలు వివేకానందకు లేవు. ఆ సంగతి స్వామీజీ రైట్‌తో అనగా ఆ ప్రొఫెసర్‌, స్వామీజీ! మిమ్మల్ని యోగ్యతా పత్రాలు అడగటం సూర్యుణ్ని ప్రకాశించటానికిగల హక్కును అడగటమే అన్నాడు. ఆ ప్రొఫెసర్‌ రైట్‌ సాయంతో స్వామి వివేకానందకు యోగ్యతాపత్రాలు లభించాయి. 1893 సెప్టెంబరు 11 తేదీన చికాగోలో కొలంబస్‌ హాలులో విశ్వమత మహాసభ ప్రారంభమైంది.

విశ్వ వేదిక మీద తనకు కేటాయించిన సమయం రాగానే వివేకానంద వేదికపై నిలిచి-

అమెరికా దేశపు సోదరీ సోదరులారా! అంటూ ప్రసంగం ప్రారంభించాడు. అక్కడ సమావేశమైన ఆరువేల మంది శ్రోతలు- వివేకానంద ఆత్మీయ సంబోధన వినగానే ఆనంద పరవశులై లేచి నిలబడి సుదీర్ఘ కరతాళ ధ్వనులు చేశారు. వేదికపైకి ఒక నవీన మతప్రవక్త వచ్చి సందేశం అందించబోతున్నాడన్నట్లు హర్షాన్ని వ్యక్తపరచారు.

ఒక దేశానికో ఖండానికో, జాతికో మతానికో కాక మొత్తం ప్రపంచ మానవుల హృదయాల్లో స్నేహ సౌభ్రాత్రాలు, సౌశీల్యాలు నెలకొల్పాలన్నదే స్వామి వివేకానంద సదాశయం, సందేశం!

ఆయన ప్రసంగం విన్న అమెరికా ప్రజలు ఆ అనర్గళ వాక్ప్రవాహానికి, అద్భుత మేధాశక్తికి ఆశ్చర్యం చెందారు. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అమెరికా దేశ పత్రికలు ''దివ్యప్రేరిత మహావక్త'' అని ప్రశంసించాయి.

ప్రపంచంలో రెండు రకాల మహోన్నత సంస్కృతులు ఉన్నాయని వివేకానంద కనుగొన్నారు. ఒకటి, సనాతన భారతీయ సంస్కృతి. దీనివలన ఆసియా ఖండమంతా ప్రభావితమైంది. రెండు, పురాతన గ్రీకు సంస్కృతి. దీనివలన పాశ్చాత్య ప్రపంచమంతా ప్రభావితమైంది. రెండూ మానవజాతికి మేలు చేకూర్చేవే!

పాశ్చాత్య సంస్కృతిలోని శ్రేష్టత, భారతీయ సంస్కృతిలోని శ్రేష్టత- రెండూ స్వామీజీలో జీర్ణమయ్యాయి. ఈ రెండు సంస్కృతులలోని శ్రేష్టతలు సంలీనమైతే అది పరిపూర్ణ విశ్వసంస్కృతిగా భాసిల్లుతుంది. ఈ విశిష్ట సత్యాన్ని వివేకానంద విశ్వమానవాళికి ఎలుగెత్తి చాటారు. ''కృణ్వంతో విశ్వమార్యం'' అన్న సంస్కృత వాక్యానికి వివేకానంద సందేశం అనుగుణంగా ఉంది.
(Eenadu, 07:10:2007)
_______________________________

Labels: ,

శృంగార ఘటికులు

నవరసాల్లో శృంగారానిదే అగ్రస్థానం. సృష్టికి మూలం శృంగారమే. ఒకప్పటి కవులు శృంగారమే ప్రధానంగా కావ్యాలు రాసేవారు. శృంగార శాకుంతలం, శృంగార నైషధం- అంటూ గ్రంథనామాల్లో సైతం హుషారును జోడించేవారు. అటువంటి కావ్యాలను అంకితం పుచ్చుకోవాలని అప్పటి ప్రభువులూ ముచ్చటపడేవారు. ప్రజలూ ఆసక్తిగా చదివేవారు. శృంగార వర్ణనలు లేని కావ్యాలు ఉప్పులేని పప్పులా చప్పగా ఉంటాయని నిరసించటమూ జరిగేది. ఈ వైనాలన్నీ తెలిసినవాడు కాబట్టే కవి చౌడప్ప, ''పది నీతులు పది బూతులు పది శృంగారములు గల్గు పద్యములు సభం జదివినవాడే యధికుడు గదరప్పా...'' అని ఏ సంకోచం లేకుండా ఖండితంగా చెప్పేశాడు. దైనందిన జీవితంలో వరసైనవాళ్ళ సరససల్లాపాల్లో శృంగారం తొణికిసలాడుతూనే ఉంటుంది. అసభ్యతకు తావులేని శృంగారమే ఆస్వాదయోగ్యమైనప్పటికీ వర్ణనల్లో శృంగారం శ్రుతిమించటం మామూలే. ''మకరధ్వజుని కొంప నొక చెంప కనిపింప చీరకట్టినదయా చిగురుబోడి'' వంటి పద్యాలు ఆ కోవలోకే వస్తాయి. అటువంటి పద్యాలవల్లే శ్రీనాథుడు శృంగార శ్రీనాథుడుగా ప్రసిద్ధికెక్కాడు! ఎందరో హాజరైన ఆ పార్టీ రంజుగా సాగుతోంది. అర్ధరాత్రి దాటింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌తో పాటు పార్టీలో పాల్గొంటున్న ఓ అందమైన యువతి కిటికీ దగ్గరకు వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ, ''చూశారా వీనస్‌ నక్షత్రాన్ని. ధగధగా ఎలా మెరుస్తోందో... అందుకే వీనస్‌ను అందాలకు అధిదేవత అంటారు'' అంది. ''అది వీనస్‌ కాదు. జూపిటర్‌'' అన్నాడు ఐన్‌స్టీన్‌. అందుకా యువతి చప్పట్లు చరుస్తూ ''మీరు నిజంగా చాలా గొప్పవారండీ... ఇంత దూరాన్నుంచి చూస్తూ కూడా నక్షత్రాల సెక్సును సైతం కరెక్టుగా కనిపెట్టేస్తున్నారు'' అంది.

ప్రపంచంలోని ఎన్నో భాషల్లో శృంగారమే ప్రముఖ స్థానం వహిస్తోంది. బాల్జాక్‌ రాసిన శృంగారపూరితమైన కథలు డి.హెచ్‌. లారెన్సు, చలం వంటి వారు రాసిన నవలలు ఈనాటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. శృంగార సంబంధ సామెతలు అనేకం తెలుగులో ప్రచారంలో ఉన్నాయి.
బావా అని పలకరిస్తే రావా అని కొంగు పట్టుకున్నాడట, మోహభ్రమను చిక్కి మొనగాడు నీల్గడా, యోగికీ రోగికీ భోగికీ నిద్ర ఉండదు, బ్రమసి బాపనయ్య దగ్గరకు పోతే వద్దేబాబూ వర్జ్యం ఉందన్నాడట వంటి సామెతలు అడపాదడపా వినపడుతూనే ఉంటాయి. ఆ అమ్మడు తన ప్రియుడికి టెలిగ్రాం ఇవ్వటానికి పోస్టాఫీసుకు వచ్చింది. ''సరే...'' అని ఒక్క ముక్కరాసి కౌంటర్‌లో ఉన్న బాబుకు ఇచ్చింది. ఆ కాగితం చూసిన కౌంటర్‌బాబు ''మరో మూడు నాలుగు మాటలు రాసినా అంతే చార్జి అవుతుందమ్మా!'' అన్నాడు. ''అవుననుకోండి... సరే సరే అని మూడుసార్లో నాలుగు సార్లో రాస్తే నేను మరీ తొందర పడిపోతున్నానని నా బాయ్‌ ఫ్రెండు అనుకోడూ...'' అందా అమ్మాయి కొంచెం సిగ్గుపడుతూ. ప్రేమ, శృంగారాల ప్రకటనల దగ్గరకొచ్చేసరికి కొన్ని అప్రకటిత హద్దులూ ఉంటాయి.

ఈ కబురు వింటే తన పాత డైలాగును మార్చి ''మన వాళ్ళు గొప్ప ఘటికులోయ్‌'' అని ఉండేవాడు గిరీశం పంతులు. 26 దేశాల్లో సాగించిన ఇటీవలి అధ్యయన ఫలితాల ప్రకారం
వాత్సాయన కామసూత్రాలకు పుట్టినిల్లయిన భారతదేశ వాసులే భేషయిన శృంగార జీవితాన్ని అనుభవిస్తున్నారు. రకరకాల భంగిమల్లో శృంగారంలో పాల్గొంటూ సంతృప్తికర ఆనందానుభూతి పొందుతున్నారు. సర్వేలో పాల్గొన్న పదిమంది భారతీయుల్లో ఏడుగురు తాము శృంగారంలో పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తున్నామని స్వర్గసుఖాలను రుచి చూస్తున్నామని చెప్పారు. ప్రేమికుల దేశంగా పేరుపొందిన ఫ్రాన్సు వంటి దేశాలు ఈ విషయంలో వెనకబడిపోయాయి. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 68శాతం తాము చక్కని శృంగార జీవితాన్ని అనుభవిస్తున్నామంటే బ్రిటన్‌లో 38శాతం, ఫ్రాన్సులో 36శాతం మాత్రమే ఆ విధంగా చెప్పగలిగారు. గ్రీకులు మెక్సికన్లు మాత్రం తమ శృంగార జీవితం సంతృప్తికరంగానే ఉన్నట్లు వెల్లడించారు. పడక గదిలో తమకు ఏం కావాలో సహచరులు, ఎలా సహకరించాలో చెప్పడంలో 74శాతం భారతీయులు ఎటువంటి బిడియాన్నీ కనబరచటం లేదు. ప్రపంచంలో సగటున 58శాతం మాత్రమే అలా నిస్సంకోచంగా చెప్పి పడకగదిలో సుఖాలను పొందగలుగుతున్నారు. ప్రియులు ప్రియురాళ్ళ విషయంలో భారతీయులది సంయమన మార్గం. భారతీయ పురుషులకు సగటున ఆరుగురు ప్రియురాళ్ళు ఉండగా, మహిళలకు ఇద్దరు ప్రియులు ఉంటున్నారు. అదే బ్రిటన్‌లో పురుషులకు 16మంది ప్రియురాళ్ళు, మహిళలకు 10మంది ప్రియులు ఉంటున్నట్లు సర్వేలో తేలింది. భారతీయులు పడకగదులను అలంకరించుకోవటంలోను ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. ఇటీవలి కాలంలో కామోద్దీపనను కలగజేసే కృత్రిమ పరికరాలను ఉపయోగించటమూ ఎక్కువైనట్లు తేలింది. శృంగారాన్ని సర్వతోముఖంగా అనుభవించి ఆనందించటానికి ప్రపంచంలోని మిగతా దేశాల వారికంటె భారతీయులే ముందున్నారని సర్వేలో తేలిపోయింది. ''ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే, అనురాగపుటంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం'' అని మహాకవి అననే అన్నారు కదా!
(Eenadu, 07:10:2007)
__________________________________

Labels: