My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, July 06, 2008

'ఓం నమో వేంకటేశాయ...'

'కౌసల్యా సుప్రజా రామ...' ఆ మాధుర్యం సుప్రభాతానిదా కోకిలమ్మ ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి గొంతుదా తేల్చిచెప్పడం కష్టం. 'ఇరుండరువురం ఒండ్రాయ్‌ ఇసైందు...' తిరుపతి లడ్డూ కన్నా మధురమైన పెయ్‌ఆళ్వార్‌ కీర్తన లీలగా వినబడుతుంటుంది. 'ఓం నమో వేంకటేశాయ...' అనంతంగా సాగిపోయే అష్టాక్షరీ మంత్రోచ్చరణ నిరంతరం చెవుల్లో అమృతం పోసినట్టే ఉంటుంది. చుట్టూ పచ్చటిచెట్లు. చల్లటి వాతావరణం. ఎక్కడికక్కడ అతిథిగృహాలూ భోజనశాలలూ షాపింగ్‌ సందళ్లూ వాహనాల కోలాహలం... ఓహ్‌! అదో కొత్త లోకం. అలసిన మనసులను సేదతీర్చే అందాల లోకం. నిత్యసంకీర్తనలతో భక్తులను పరవశింపజేసే ఆనంద లోకం. అది... తిరుమల. శ్రీనివాసుడు కొలువైన సుందర తిరుమల. ...ఇది ఇప్పటి మాట. ఇంత అందమైన లోకం ఆవిష్కృతమవడానికి వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది. డెబ్భయిఐదేళ్లనాడు ఏర్పడ్డ తితిదే పాలకమండలి కృషి ఉంది. రేపటి నుంచి తిరుమలలో జరగనున్న అమృతోత్సవాల నేపథ్యంలో ఆ విశేషాలు...

తిరుమల... అంటే కేవలం ఓ దేవాలయం మాత్రమే కాదు. వందల కోట్ల రాబడి, రూ.1925 కోట్ల వార్షిక బడ్జెట్‌, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ... వెరసి అదొక మహావ్యవస్థ. ఆ వ్యవస్థ రూపుదిద్దుకునే క్రమంలో ఎన్నో మైలురాళ్లు. అడ్డంకులు. వివాదాలు. విజయాలు. ఆ చరిత్రను ఒక్కసారి తరచి చూస్తే...

ఒకప్పుడు సరైన దారి కూడా లేని ఏడుకొండల మీదుగా కాలినడకన రెండు రోజుల పాటు ఎక్కితే కానీ భక్తులకు ఆ వడ్డీకాసులవాడి దర్శనం దక్కేది కాదు. ఆ దారిలో రాళ్లూరప్పలూ జంతువులూ దొంగలూ... ఎన్నెన్ని అవరోధాలనీ! మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఎప్పుడో రాజులకాలం నాటివి రెండుమూడు దిగుడుబావులూ విశ్రాంతి మండపాలూ మాత్రం ఉండేవి. ఎక్కడపడితే అక్కడ మంచినీళ్లు దొరికేవి కావు. పోనీ కొండమీద ఊరేమైనా ఉందా అంటే అదీ లేదు. పూజారులు కూడా కిందనే ఉన్న కొత్తూరు నుంచే వెళ్లేవారు. 1870లో భక్తుల సౌకర్యార్థం మెట్లదారి నిర్మించేదాకా ఈ అవస్థలు తప్పలేదు. అప్పటికి తిరుమల కొండ హథీరాంజీ మఠాధిపతుల అధీనంలో ఉండేది.

అంతకు ముందు చరిత్ర చూస్తే... క్రీ.శ. పన్నెండో శతాబ్దం నుంచి పల్లవులూ, చోళులూ, విజయనగరరాజులు తిరుమల ఆలయానికి ఎన్నో మాన్యాలిచ్చారు. ప్రత్యేకించి రాయలవారి పాలనాకాలం తిరుమలకు స్వర్ణయుగమేనని చెప్పొచ్చు. ఆయన మరణానంతరం తిరుమలేశుని ఆలయం మహ్మదీయుల వశమైంది. వారి తర్వాత 1801నాటికి ఈస్టిండియా కంపెనీ అధీనంలోకి వచ్చింది. హిందూ మత సంస్థల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని బ్రిటిష్‌ ప్రభుత్వం 1841లో ఓ చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం తిరుమల ఆలయ నిర్వహణ బాధ్యతను ఈస్టిండియా కంపెనీ 1843లో కొండ మీదున్న హథీరాంజీ మఠానికి అప్పగించింది. ఆ తర్వాత దాదాపు 90 ఏళ్లపాటు తిరుమల వారి అధీనంలోనే ఉంది. దరిమిలా 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది. ఆ కథ ఇదీ...

ధర్మకర్తల మండలి
తిరుమల ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం 1933లో... కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా మార్చింది. అంతేకాదు, తితిదేకు ఓ ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేసి దానికి అధ్యక్షుడిని కూడా నియమించారు. ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో ఈవో ఆలయ పరిపాలన నిర్వహిస్తారని చట్టంలో పేర్కొన్నారు.

తితిదే పాలకమండలి ఏర్పాటైన తర్వాత ఏడున్నర దశాబ్దాల్లో తిరుమల అంతటా సర్వతోముఖాభివృద్ధి జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం రూ.26వేల ఖర్చుతో మెట్లమార్గాన్ని నిర్మించడంతో ఆ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మండలి. వారు తలపెట్టిన రెండో ప్రాజెక్టు ఘాట్‌రోడ్డు. అసలు, ఏడుకొండల మీదకు రోడ్డెలా వేస్తారు... అదసలు సాధ్యమయ్యే పనేనా! 1940ల్లో తిరుమల-తిరుపతి వాసులందరినీ వేధించిన ప్రశ్నలివి. 1944 ఏప్రిల్‌ పది నాటికి వారి సందేహాలూ భయాలూ పటాపంచలయ్యాయి. పెద్ద పాములా... వయ్యారాలు పోయే అమ్మాయి నడుములా... మెలికలు తిరిగే అందమైన రోడ్డు సిద్ధమైంది.

ఎద్దులబళ్లూ గుర్రబ్బళ్ల చప్పుళ్లతో ఏడుకొండలూ మారువోగాయి. అందరికీ అదో కొత్త అనుభవం. మెట్లమార్గం తర్వాత తితిదే పాలకమండలి సాధించిన రెండో విజయమిది. ఇక మూడో విజయం కొండమీదకు బస్సు. నిజానికి ఘాట్‌రోడ్డు నిర్మించిన కారణమే అది. బుడ్డబస్సుల హారన్‌వోతలు సప్తగిరులలో ప్రతిధ్వనించాయి. వెుదట్లో రెండు బస్సులే అప్‌ అండ్‌ డౌన్‌ తిరిగేవి. రోజుకు మూడు ట్రిప్పులు. ఇంకేముందీ... కొండమీదకు రాకపోకలు వెల్లువెత్తాయి. అప్పటిదాకా కనాకష్టంగా రోజుకు వందమంది మాత్రం పైకి వెళ్లేవారు. ఘాట్‌రోడ్డు పుణ్యమాని 1956 నాటికి ఆ సంఖ్య ఐదారు రెట్లు పెరిగి ఐదారొందలకు చేరుకుంది.

తర్వాతిమెట్టు... ఆర్జితసేవలు. సుప్రభాతం, అర్చన, తోమాల, అభిషేకం, కల్యాణోత్సవం తదితర సేవలను ప్రవేశపెట్టింది తితిదే. నల్లరాతిశోభతో మెరిసే తిరుమల ఆలయానికి బంగారుపూతతో పసిడి వన్నెలద్దింది. క్రమంగా బస్సుల సంఖ్య పెరుగుతుండటంతో కొండ మీదకు వచ్చే జనం సంఖ్య వేలల్లోకి చేరుకుంది. దాంతో అక్కడ వసతి కష్టమైంది. కానీ, ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. దాతల భాగస్వామ్యంతో అనేక కాటేజీలు వచ్చాయి.

ఎన్నాళ్లుగానో వేధిస్తున్న ఇంకో సమస్య తలనీలాలు. దాన్నీ పరిష్కరించారు. అంతవరకు తిరుమలలో పలుప్రాంతాల్లో ప్రైవేటు క్షురకులు తలనీలాలు తీసేవారు. ఆ పద్ధతికి స్వస్తి చెప్పి వారికంటూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒకేచోట తలనీలాలు తీసే విధానాన్ని అమలులోకి తెచ్చారు.

శ్రీవారి ఆలయంలో పరకామణి వ్యవహారాలను క్రమబద్ధీకరించి రోజూ హుండీ ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యాభివృద్ధి కోసం తిరుపతిలో ప్రాచ్య పరిశోధనా సంస్థ, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, సంగీత, నృత్య కళాశాల, బధిరుల పాఠశాల... రుయా ఆసుపత్రి, కుష్టురోగుల ఆసుపత్రి...
శతాబ్దాల తరబడి ఆధ్యాత్మిక క్షేత్రంగానే ఉండిపోయిన తిరుమలకు ఓ కొత్త ఇమేజ్‌ వచ్చింది.
అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలూ పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇన్ని కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేసిన ఘనత తొలి ఈవో చెలికాని అన్నారావుదే. అందుకే తిరుమలవాసులు నేటికీ ఆయన్ను నిత్యం తల్చుకుంటారు.

గుడిచుట్టూ...
1965-69 కాలంలో తిరుమల ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న తూర్పు మాడవీధి విస్తరణ జరిగింది.
...అని ఒక్కమాటలో చెప్తే సరిపోదు. అందుకోసం మహాద్వారానికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించడం అంత సులభంగా జరగలేదు మరి. దర్శనానికి 'క్యూ లైన్‌' విధానాన్ని అప్పుడే ప్రవేశపెట్టారు. పుష్కరిణిని సంస్కరించిందీ కొలిమి మండపాన్ని తీర్చిదిద్ది ఊంజల్‌సేవను ఏర్పాటు చేసిందీ అప్పుడే... 1969-72 మధ్యకాలంలో!

ఆ తర్వాత తిరుమలలో అశ్వని ఆసుపత్రిని నిర్మించారు. 1978 నాటికి రెండోఘాట్‌ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి. 1978-82 కాలంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్‌ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేశారు. తిరుమల ఆలయ ధ్వజస్తంభాన్ని పునరుద్ధరించడం, మాడవీధులను విస్తరించడం, అన్నదాన భవన నిర్మాణం... ఎందరికో ఉపాధినిచ్చిన అన్నమాచార్య, దాససాహిత్య, వేదరికార్డింగ్‌ ప్రాజెక్టులను నెలకొల్పడం... ఇవన్నీ ఆయన చలవే. కోకిలమ్మ ఎంఎస్‌ సుబ్బులక్ష్మి ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం నేల నలుచెరగులా వినిపించింది అప్పుడే.

ఎన్టీఆర్‌ పాత్ర...
1984-87 నడుమ తితిదే అభివృద్ధిని విశ్లేషించేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావును కచ్చితంగా ప్రస్తావించాల్సిందే. ఆయన పాత్రను విస్మరించి ఆ అధ్యాయాన్ని సమగ్రంగా వివరించలేం. పురాణపురుషుల పాత్రలతో తెలుగువారిని మెప్పించిన ఎన్టీరామారావు ఇష్టదైవం శ్రీనివాసుడే. 1983లో ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తిరుమల-తిరుపతికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. ఆయన హయాంలోనే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిర్మించారు. ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. తిరుమలలో మిరాశీ వ్యవస్థను రద్దుచేశారు. కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు. తిరుమలలో అధునాతన రోడ్లను నిర్మించారు. కాలినడకమార్గాన్ని ఆధునీకరించి పూర్తిగా పైకప్పు వేయించారు. తిరుమలకు తెలుగుగంగ నీటిని తరలించారు. కొండమీద విద్యుత్తుకోత లేకుండా విధాన నిర్ణయం తీసుకున్నారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్‌, ఎముకల సంబంధ వ్యాధుల ఆసుపత్రి బర్డ్‌, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహతి సభామందిరం తదితరాలను నిర్మించారు. ఇలా తిరుమల-తిరుపతి అభివృద్ధికి ఎన్టీరామారావు చేసిన కృషి ఎనలేనిది.
ప్రత్యక్షప్రసారాలూ సుదర్శన కంకణాలూ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవం వర్ణనాతీతం... కనులారా తిలకించాల్సిందే. శ్రీవారి బ్రహ్మోత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న అశేషభక్తులకు నేత్రపర్వం కలిగించేలా 1995లో దూరదర్శన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇది భక్తులందరికీ ఎంతో ఆనందాన్నిచ్చిన నిర్ణయం. అత్యంత సంపన్నుడైన స్వామికి జరిగే సేవలను ప్రసారం చేసేందుకు ఇతర మార్గాలెందుకు! ఆయనకోసమే ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించింది తితిదే. అదే 'శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్‌ (ఎస్వీబీసీ)'. ఈ ఛానెల్‌ ద్వారా ఈ ఏడాది నుంచే ప్రసారాలు ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తున్నాయి.

మళ్లీ ఒకసారి వెనక్కివెళ్తే...
1999-2000 నడుమ తిరుమలేశుని దర్శన విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. శ్రీవారి సులభ దర్శనం కోసం 'సుదర్శనం కంకణాల' విధానానికి రూపకల్పనచేసి అమల్లోకి తెచ్చిందప్పుడే. ఈ విధానం వల్ల భక్తులకు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన అగత్యం తప్పింది.

రైలుగోవిందం
బాలాజీ దర్శన గోవిందం... తితిదే-భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ(ఐఆర్‌సిటిసి) నడుమ కుదిరిన ఒక చక్కటి ప్యాకేజీ ఒప్పందం పేరిది. ఈ పథకంలో భాగంగా వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తితిదే. శ్రీనివాసం విడిదిగృహంలో బస నుంచి అర్చనానంతర, సెల్లార్‌ దర్శన టిక్కెట్ల వరకూ అన్నీ చక్కగా అమరుస్తోంది. వివరాలివీ...

విజయవాడ నుంచి...
విజయవాడ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం వెుదలవుతుంది. గూడూరులో భోజనం. రాత్రి తిరుపతిలోని శ్రీనివాసం విడిదిగృహంలో బస. మర్నాడు తెల్లవారుజామున నాలుగింటికి కొండపైకి తీసుకెళ్లి అర్చనానంతర దర్శనం చేయిస్తారు. అనంతరం శ్రీకాళహస్తి, అలివేలు మంగాపురం ఆలయాల సందర్శన. మధ్యాహ్న భోజనం అయ్యాక శ్రీనివాస మంగాపురం, కాణిపాకం క్షేత్రాల్లో దర్శనం. చంద్రగిరి కోట సందర్శన. రాత్రికి మళ్లీ తిరుపతి శ్రీనివాసంలో బస. మర్నాడు తెల్లవారుజామునే విజయవాడకు తిరుగుప్రయాణం. ఉదయం ఫలహారం, రెండుపూటలా భోజనం రైల్లోనే. థర్డ్‌క్లాస్‌ ఏసీ రుసుము పెద్దలకు రూ.2800, పిల్లలకు(5-11) రూ.2400. స్లీపర్‌క్లాస్‌లో అయితే పెద్దలకు రూ.2100, పిల్లలకు రూ.1950. ఇతర వివరాల కోసం 0866-2572280, 2767244 నంబర్లలో సంప్రదించవచ్చు.

సికింద్రాబాద్‌ నుంచి...
వారాంతాల్లో తిరుమలలో సెల్లార్‌ దర్శనం ఉండదు కాబట్టి సికింద్రాబాద్‌ నుంచి వారానికి ఐదురోజులు మాత్రమే ఈ ప్యాకేజీ ఉంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకూ. ఈ ఐదురోజుల్లో రోజూ రాత్రి ఎనిమిదింటికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం వెుదలవుతుంది. మర్నాడు పొద్దున్న ఆరింటికి తిరుపతికి చేరాక శ్రీనివాసంలో బస, ఫలహారం. అక్కణ్నుంచి కొండమీదకు తీసుకెళ్లి సెల్లార్‌ దర్శనం చేయిస్తారు. కొండ దిగాక మధ్యాహ్నభోజనం. అనంతరం అలివేలుమంగాపురంలో అమ్మవారి దర్శనం. సాయంత్రం మళ్లీ నారాయణాద్రిలోనే తిరుగు ప్రయాణం. ఆ రాత్రికి భోజనం రైల్లోనే. థర్డ్‌క్లాస్‌ ఏసీ రుసుము పెద్దలకు రూ.3,400, పిల్లలకు రూ.2,400. స్లీపర్‌క్లాస్‌లో పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600. పూర్తి వివరాల కోసం 040-66201263, 27702407, నంబర్లలో సంప్రదించవచ్చు.

నభూతోనభవిష్యతి...
తితిదే వెుదటి నుంచి విద్యా, వైద్య సంబంధ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తోంది. ఇదంతా సామాజిక సేవ. కానీ, ఇటీవలికాలంలో చేపట్టిన కార్యక్రమాలు విప్లవాత్మకమైనవీ ఆదర్శనీయమైనవీ. అందులో వెుదటిది, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 'కల్యాణమస్తు'. ఇప్పటివరకు మూడు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 20వేల జంటలకు వివాహాలు జరిపించింది టీటీడీ. వధూవరులకు నూతన వస్త్రాలూ మంగళసూత్రాలూ ఇచ్చి జరిపిస్తున్న ఇలాంటి కార్యక్రమం ఆలయాల చరిత్రలోనే నభూతో నభవిష్యతి.

కుమ్మరి భీముడి కుండలో అన్నం తిన్న శ్రీవారు తనకు పేదాగొప్పా తారతమ్యం లేదని తేల్చిచెప్పారన్నది ఏనాడో నిరూపితమైన సత్యం. మళ్లీ ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుని రూపొందించిన కార్యక్రమమే 'దళిత గోవిందం'. స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే అపురూపదృశ్యం. దళితగోవిందం విజయవంతమైన క్రమంలో తితిదే పాలకమండలి మరో అడుగు ముందుకేసి 'మత్స్యగోవిందం' పథకానికి శ్రీకారం చుట్టింది. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణనిచ్చి సర్వమానవ సమానత్వాన్ని చాటుతోంది.

ఇంతేనా... తిరుమలలో జరిపించినంత వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవాలను తితిదే వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న తీరు భక్తులకు కన్నుల పండుగే. ఇక, పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన వెయ్యి మంది పేద విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున ఉపకార వేతనాలు ఇవ్వాలనేది ఇటీవల తీసుకున్న నిర్ణయం.

రెండో అన్నదాన సత్రం
ప్రస్తుతం కల్యాణకట్ట ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో 1,500 మంది మాత్రమే భోజనం చేసే సౌకర్యం ఉంది. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రద్దీని తట్టుకునేందుకు వరాహస్వామి అతిథిగృహం సమీపంలో రెండో అన్నదాన సత్రాన్ని నిర్మించేందుకు సమాయత్తమైంది తితిదే. అలాగే అన్నదానానికి గతంలో ఉన్న టోకెన్‌ పద్ధతిని ఎత్తివేస్తూ ఇటీవల ప్రారంభించిన సర్వభోజనం పథకం భక్తుల ప్రశంసలందుకుంటోంది. భవిష్యత్తులో కొండమీద అసలు భోజనవ్యాపారం అన్నదే జరగకుండా దేవస్థానం ఆధ్వర్యంలోనే భక్తుల కడుపు నింపే సంకల్పంతో ప్రారంభించిందే ఈ పథకం.
ఇలా ఒకటా రెండా.. ఎన్నోఎన్నెన్నో సేవాకార్యక్రమాలు.
సృష్టిలో జరిగే ప్రతి చర్యకూ ఎక్కడో మూలం ఉంటుందన్నది ఓ థియరీ. గీతాకారుడు చెప్పిందీ అదే... కర్మసిద్ధాంతం.
జనహితం కోసం ఇన్ని శుభాలు జరగాలని రాసిపెట్టుంది కాబట్టే తిరుమల ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయమైందనీ నిత్యకల్యాణం పచ్చతోరణంగా వెలిగిపోతోందనీ భక్తుల నమ్మకం.
ఏదేమైనా కానీ... అంతిమంగా మానవకల్యాణం జరగడమే భగవత్తత్వం అయితే అందరూ కలిసి అనాల్సిన మాట... ఓం నమో వేంకటేశాయ!
- వడ్డాది శ్రీనివాస్‌,
న్యూస్‌టుడే, తిరుపతి
(ఈనాడు, 06:07:2008)
______________________________________

Labels: ,

దేశాలు...నిజాలు

నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫ్రాన్స్‌, గ్రేట్‌బ్రిటన్‌, చిలీ, అర్జెంటీనా... ఈ దేశాలన్నీ అంటార్కిటికాలో కొన్ని భూభాగాలు తమకు చెందినవనిప్రకటించుకున్నాయి.

ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం సూడాన్‌.
ఆంగ్ల అక్షరం 'ఎ'తో వెుదలయ్యే ఏ దేశం పేరైనా 'ఎ'తోనే ముగుస్తుంది... ఒక్క అఫ్గానిస్థాన్‌ పేరు తప్ప.
జాంజిబార్‌ను స్పైస్‌ ఐలండ్‌ అని కూడా అంటారు.
భూమ్మీద అతిపెద్ద ద్వీపం గ్రీన్‌ల్యాండ్‌. దాని విస్తీర్ణం 21,66,086 చ.కిమీ. జనాభా మాత్రం 56,326.
సహారా ఎడారి ప్రతి ఏడాదీ అరమైలు చొప్పున దక్షిణముఖంగా విస్తరించుకుంటూ పోతోంది.
పెరూ ఎగువభాగమే 1825లో బొలీవియా దేశంగా మారింది.అమెరికా వెుత్తం మీద ఒకే ఒక్క రాజకోట... హొనలులూలో ఉంది.

డల్లాస్‌(అమెరికా) నగరాన్ని 'ద బిగ్‌ డి' అని పిలుస్తారు.
'లాపాజ్‌'... బొలీవియా నగర రాజధాని. ఎత్తు 11,800 అడుగుల పైమాటే. ప్రపంచంలో అత్యంత ఎత్త్తెన ప్రదేశంలో ఉన్న రాజధాని నగరమిది.
అంటార్కిటికా ఖండంలో సముద్రమట్టానికి దిగువన భూభాగమన్నదే లేదు.

బీజింగ్‌(చైనా) నగరానికే తలమానికంగా భావించే అత్యున్నత స్థాయి కట్టడాలు ఆ దేశస్థులు నిర్మించినవి కావు. ఉదాహరణకు 'ఫర్‌బిడెన్‌సిటీ'ని కట్టించింది మంగోలులు కాగా 'టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌' మంచూరియన్ల ఘనత.

* ఐరోపాలో కేవలం ఒకే ఒక దేశం సరిహద్దుగా గల దేశాలు ఐదు ఉన్నాయి. పోర్చుగల్‌, డెన్మార్క్‌, శాన్‌ మారినో, వాటికన్‌ సిటీ, వెునాకో.
* అటకామా ఎడారి(చిలీ)లోని కలామా పట్టణంలో ఇంతవరకూ వర్షమన్నదే పడలేదు.
* మధ్యధరా సముద్రంలో ఉన్న అతి పెద్ద ద్వీపం సిసిలీ.
* డొమినికా, మెక్సికో, జాంబియా, కిరిబాటి, ఫిజీ, ఈజిప్ట్‌... ఈ ఆరు దేశాల జాతీయ జెండాలపైనా పక్షి చిహ్నాలుంటాయి.
* స్విట్జర్లాండ్‌ అధికారిక నామం 'కాన్‌ఫెడరేషన్‌ హెల్వెటికా'. హెల్వెటిక్‌ కాన్‌ఫెడరేషన్‌ అని కూడా సంబోధిస్తుంటారు. అందుకే ఆ దేశ అధికారిక వెబ్‌సైట్ల డొమైన్‌నేమ్‌ 'సీహెచ్‌' అని ఉంటుంది.
* 'డొమినికన్‌ రిపబ్లికన్‌' దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆ దేశాన్ని 'శాంటో డొమింగో' అని పిలిచేవారు.
* 'ఓ' అనే ఆంగ్ల అక్షరంతో వెుదలయ్యే రాజధానులు ప్రపంచంలో మూడు దేశాలకే ఉన్నాయి. అవి... అట్టావా(కెనడా), ఓస్లో(నార్వే), ఔగడౌగౌ(బుర్కినాఫాసో).
* అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతిచిన్న రాష్ట్రం 'రోడ్‌ ఐలండ్‌'. దాని పూర్తిపేరు... రోడ్‌ ఐలండ్‌ అండ్‌ ప్లాంటేషన్‌ ప్రావిన్సెస్‌.
* ప్రపంచంలోనే అత్యంత మారుమూల ఉన్న ద్వీపం(రివోట్‌ ఐలండ్‌) 'ట్రిస్తాన్‌ డా కున్హా'. సబ్‌ అంటార్కిటిక్‌జోన్‌కు ఎగువన ఉందీ ద్వీపం.


టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ నగర భూభాగం కొంత యూరప్‌లోనూ మరికొంత ఆసియా ఖండంలోనూ ఉంటుంది. మధ్యలో జలసంధి ఉంటుంది. ఈ రెండు భాగాలను కలుపుతూ రెండు వంతెనలు ఉన్నాయి. వాటిని బాస్పొరస్‌ వంతెనలుగా వ్యవహరిస్తారు. ప్రపంచంలో మరే దేశ రాజధానికీ ఇలాంటి ప్రత్యేకత లేదు.
(ఈనాడు, 06:07:2008)
________________________________

Labels:

Eat That Frog

Brian Tracy
Price: Rs 150.00

There just isn't enough time for everything on our "to-do" list – and there never will be. Successful people don't try to do everything. They learn to focus on the most important tasks and make sure they get done. There's an old saying that if the first thing you do each morning is to eat a live frog, you'll have the satisfaction of knowing that it's probably the worst thing you'll do all day. Using the "eat that frog" as a metaphor for tackling the most challenging task of your day – the one you are most likely to procrastinate on, but also probably the one that can have the greatest positive impact on your life – Eat That Frog! Shows you how to zero in on the critical tasks and organise each day. You'll not only get more done faster but get the right things done.

The author cuts to the core of what is vital to effective time management: decision, discipline, and determination. In this fully revised and updated edition, he provides brand new information on how to keep technology from dominating your time. He
details twenty-one practical steps, frog-eating rules, world-known 10/90 and 80/20 principles that will help you stop procrastinating and get more of the important tasks done – today! You will start living in the present and do things right now right here......

(The Times Of India, 4 May 2008)
__________________________________

Labels: ,

The first Bollywood-Hollywood crossover hero


.............................the first Bollywood-Hollywood crossover hero was a young lad named Sabu Dastagir who was from a mahout family in Mysore, and was cast as an elephant rider in the 1937 film Elephant Boy, based on a Rudyard Kipling story.

Sabu went on to live in the US, starring in Jungle Book (in which he predictably plays Mowgli, the junglee boy) and The Thief of Baghdad. Taking up US citizenship in 1944, he joined the US Air Force as a tail gunner, flying several dozen missions during World War II and winning the Distinguished Flying Cross. He later married the actress Marilyn Cooper, and they remained together for 15 years till he died at a young age of 39...............................

(INDIASPORA, Bollywood in Hollywood
6 Jul 2008, Chidanand Rajghatta, The Times Of India)
____________________________________

Labels:

It is ironical but true. Field Marshal Manekshaw made it to the utterly butterly hoarding, but was arrogantly ignored by those who count — at least in civil society. Our great commander-in-chief of the armed forces, President Pratibha Patil, with more than enough time on her hands, was missing. So were several other worthies. Here's a short list: Hamid Ansari, Manmohan Singh, Sonia Gandhi, L K Advani, M Karunanidhi, Surjit Singh Barnala, A K Anthony, the three chiefs of staff (army, navy, air force)... This is insulting, shocking, shabby and shameful.

Sam, as he was popularly called, was a gentleman-soldier par excellence. And for such a man to be virtually marginalised in death, says a lot about the current crop of dignitaries, most of whom are self-seeking opportunists, loyal only to themselves. This is not just about sentimentality, but basic decency. As an irate citizen pointed out via email, "Is this how we say goodbye to such a towering and inspiring hero? No wonder a commercial film like Rang De Basanti clicked — it successfully tapped into the angst of an entire generation."

Just look at the pathetic excuses now being trotted out for the no-shows. That Sam was critically ill was known to all. It was a matter of time — perhaps a few days, if not hours, for the end to come. Sufficient notice to reschedule foreign junkets and other jaunts. That none of the above thought it important enough to honour the memory of the one man who stood head and shoulders above the rest, says a lot about them....and the overall erosion of values in our society. Not that Sam would have cared a damn. He was the last one to demand such protocol. Always the bon vivant (there are enough stories about this ladies' man to inspire several books), Sam's irreverence had seen him through worse situations. It was left to the ordinary people of India to show their love for the legend. They turned up in impressive numbers to say their farewells, and display their gratitude to the man they adored. The man who put his own life on the line for them. That he was also India's only Field Marshal when in active service, makes his achievements that much more unique.

Well, he is no more. What he took with him was not just personal glory, but an entire era of grace and tradition.

More importantly, his funeral highlighted the tattered and selfish state of those in power today. 'Sweetie's (Sam's name for Indira Gandhi) daughter-in-law Sonia,was better occupied doing her math (to avoid an earlier disaster when she'd got her sums wrong), and the others were too lazy to bother going 'all the way' to Wellington (the hill station in India, not the city in New Zealand). Desperate netas were courting old foes and sleeping with the enemy — why take precious time off for a man they had no further use of? Had Sam been considerate enough to die in Delhi or Mumbai, they would have turned up for the photo op. Better still, had Sam been a Bollywood star, everybody would have 'air dashed' for the funeral.

Alas, Sam was but an old soldier... he had to fade away. Yes, those callous VVIPs will wake up now and indulge in damage control. What's the bet Sam will be up for the Bharat Ratna? The sad truth is, in people's hearts, he was a ratna already. And Sam certainly would have scoffed at the thought of being thus honoured by the very people he had such contempt for. Will a few heads roll? Yup. But not on account of Sam — who will remain 'amar', with or without that Bharat Ratna. The heads might roll for canny Amar (Singh), who is demanding his pound of flesh from Sonia and friends, so they can hang in there a little longer, when they ought to be hanging their heads in shame instead.Thank God aapro Sam isn't around to witness India's latest act of shame.
-Ms.Shobha De
(Times Of India, 06:07:2008)
______________________________

Labels:

తల్లిదండ్రులూ బహుపరాక్‌!


గొప్ప మేధావిగా పేరుగడించిన ప్రముఖ రచయిత జార్జి బెర్నార్డ్‌ షాకు ఒక విందు సమావేశంలో అందమైన సినీనటి తారసపడింది. నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి 'మనం పెళ్లిచేసుకుంటే మన పిల్లలకు మీ తెలివితేటలు, నా అందం రెండూ వస్తాయి. అందమూ, తెలివీ ఒక్కచోట చేరడం అద్భుతం కదా!' అని ప్రతిపాదించింది. షా చిన్ననవ్వు నవ్వాడు. 'మీరు చెప్పింది బాగానే ఉంది... ఆ పుట్టే పిల్లలకు మీ తెలివితేటలూ, నా అందమూ వస్తే- వారి గతి ఏమిటి?' అన్నాడు! తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏమేమి సంక్రమిస్తాయో నిర్ధారణగా చెప్పలేం. ఆడపిల్లకు తండ్రి పోలికలు, పిల్లవాడికి తల్లి పోలికలు వస్తే మంచిదంటారు. ప్రతి గొప్పవాడూ తన తల్లి గుణాలు చాలావరకు కలిగి ఉంటాడంటారు. స్త్రీ, పురుషుడు పెళ్లిచేసుకుని భార్యభర్తలవుతారు. పిల్లల్నికని తల్లిదండ్రులవుతారు. భార్యాభర్తలయ్యేది, తల్లిదండ్రులయ్యేది- ఆ ఇద్దరేగాని, భూమికల్లో మాత్రం చాలా తేడాఉంది. బాధ్యతల్లోనూ ఎంతో అంతరముంది. తల్లిదండ్రులు చెడిపోయినా, విడిపోయినా సంతానమే నష్టపోతుంది. వారి తప్పులు పిల్లలను వెంటాడతాయి, వేధిస్తాయి. పిల్లలు చిన్నవయసు వాళ్లయితే అదింకా ప్రమాదం. మనిషి స్వభావంపై బాల్యం ప్రభావం అధికమని శాస్త్రం నిరూపించింది. సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యేవారిలో ఎందరో బాల్యంలో తల్లిదండ్రుల ఆదరణకు దూరమైనవారే అనేది చేదు నిజం! అమ్మలాలన, నాన్న ఆదరణ లభించిన పిల్లలు అదృష్టవంతులు. తల్లిదండ్రులను అనుకరించడంతోనే పిల్లల ప్రవర్తన రూపుదిద్దుకుంటుంది. పూజగదిలో రోజూ దీపంపెట్టే అమ్మను ఆడపిల్ల అనుకరిస్తుంది. సిగరెట్లు కాకుండా, అగరొత్తులు వెలిగించే తండ్రిని కొడుకు అనుకరిస్తాడు. పిల్లలు బాగుపడాలని కోరుకునే తల్లిదండ్రులు ముందు తాము బాగుపడాలి. పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.

'మాతరం పితరం చైవ సాక్షాత్‌ ప్రత్యక్షదేవతామ్‌'- తల్లీతండ్రీ ప్రత్యక్ష దైవాలని మన సాహిత్యం బోధించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ- అని నూరిపోసింది. తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవాలో చెప్పినంత గట్టిగా, ఎక్కువగా పిల్లలను ఎంతబాగా చూసుకోవాలో చెప్పలేదు. సమాజమూ 'పిల్లల్ని కనడం ఎలా' అనే అంశంపై చేసినన్ని ప్రయోగాలు, పరిశోధనలు 'పెంచడం ఎలా' అనే విషయంపై చేసినట్లు కనపడదు. పెంకును తానే పగలగొట్టుకుని కోడిపిల్ల బయటకు తొంగిచూస్తుంది. టెంకను చీల్చుకుని మామిడి విత్తు స్వయంగా మెడ బయటకు పెడుతుంది. తల్లిని తీవ్రహింసకు గురిచేసిగాని, బిడ్డ బయటపడదు. 'అమ్మ' అనిపించుకోవాలని స్త్రీ దానంతటినీ పంటిబిగువున భరిస్తుంది. అందుకనే ఈ లోకం తల్లికి అత్యున్నత స్థానాన్ని కల్పించింది. 'పదిమంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యులకన్నా ఒక తండ్రి, వెయ్యిమంది తండ్రులకన్నా గౌరవనీయురాలైన ఒక తల్లి ఎంతోగొప్పది' అనడం అమ్మదనానికి అపూర్వసత్కారం! పురుషుడికన్నా స్త్రీ ఎక్కువకాలం జీవించడానికి 'అమ్మ'కావడమే ముఖ్యకారణమని సైన్సు భావిస్తోంది. గర్భం ధరించినప్పుడు- బిడ్డకు సంబంధించిన శక్తిమంతమైన మూలకణాలు(స్టెమ్‌సెల్స్‌) తల్లి ఎముక మూలగల్లోకి చేరుతున్నాయి. పిండం ఎదిగేటప్పుడు రక్తం చర్మం కండరాలు మెదడు... రూపొందేది ఈ మూలకణాల్లోంచే! వ్యాధులు బాధించినప్పుడల్లా ఈ మూలకణాలు తల్లికి రక్షణ కల్పిస్తూ, వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి. బిడ్డకు సంబంధించిన ఈ సహజ రక్షణవ్యవస్థ- ప్రసవం తరవాత తల్లి మూలగల్లోనే స్థిరపడిపోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఏభైఏళ్ల తరవాత సైతం ఆ మూలకణాలు చురుగ్గా ఉండటాన్ని లండన్‌లోని హామర్‌స్మిత్‌, ఇంపీరియల్‌ కళాశాలల పరిశోధక బృందం గమనించింది. ఇది బిడ్డవల్ల తల్లికి చేకూరే గొప్పమేలు.

మన పెద్దలు కొడుకువల్లే పురుషుడికి పున్నామ నరకం తప్పుతుందన్నారు. అపుత్రస్య గతిర్నాస్తి- పిల్లలు లేకపోతే ఉత్తమ గతుల్లేవన్నారు. పితృరుణం తీరాలంటే పుత్రులు కలగాలని భారతంలో జరత్కారుడి కథ వివరిస్తుంది. పురుషుడే తన భార్యగర్భంలోంచి పుత్రుడిగా జన్మిస్తున్నాడు కనుక తనకంటే వేరుకాడు, నా అన్యః అనే భావనలోంచే 'నాన్న' అనే పదం పుట్టిందని పెద్దల మాట. పిల్లల కోసమే తల్లిదండ్రులూ, తల్లిదండ్రులకోసమే పిల్లలూ! పిల్లల్ని సుఖంగా పెంచాలని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలని పిల్లలూ ఆలోచించాలి. అప్పుడే కుటుంబం బాగుంటుంది. ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకున్నంత బాగా పెద్దలు అర్థం చేసుకోవడం లేదని అమెరికాలోని 'చిల్డ్రన్స్‌ సొసైటీ' పరిశోధకులు భావిస్తున్నారు. 1176 మందితో వారు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం- తల్లిదండ్రుల్లో 'ఆదర్శమూర్తులు'(రోల్‌మోడల్స్‌) క్రమంగా తగ్గిపోతున్నారు. వారిలో నైతిక విలువలు క్షీణిస్తున్నాయి. పిల్లలు గొప్పవారయ్యేందుకు కావలసిన స్ఫూర్తినీ ఉత్తేజాన్నీ తల్లిదండ్రులు తమ పిల్లల్లో రగిలించలేకపోతున్నారు. వారి వ్యక్తిగత బలహీనతలు, పరస్పరం ఆధిక్యతా ప్రదర్శనలు, నిరంతరం కీచులాటలు, చివికిపోతున్న బాంధవ్యాలు, చీలిపోతున్న బంధాలు, కూలిపోతున్న కాపురాలు, పతనమవుతున్న విలువలు, పరిహసిస్తున్న కుటుంబ వ్యవస్థలు... పిల్లల్ని కలవరపెడుతున్నాయి. కఠోపనిషత్తులో వాజస్రవసుని చేష్టలను నిరసించిన అతని కొడుకు నచికేతుని మాదిరిగా- పిల్లలు తమ తల్లిదండ్రుల దుశ్చర్యలను, దిగజారుడుతనాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశోధక బృందం నాయకుడు బాబ్‌ రీటిమియర్‌- పిల్లలు మెచ్చేట్టుగా తల్లిదండ్రుల్లో మార్పురావాలని అభిప్రాయపడుతున్నారు. అమృతత్వాన్ని సిద్ధింపజేసే 'నచికేతాగ్ని విద్య' సాధించిన నచికేతుని మాదిరిగా- లోకంలో సుఖసంతోషాలతో కూడిన చక్కని కుటుంబ వ్యవస్థను ఆ పిల్లలు సాధించగలరని ఆశిద్దాం!
(ఈనాడు,సంపాదకీయం,06:06:2008)
_______________________________

Labels:

A Treasury of Urdu poetry- from Mir to fiaz- Ghazals with English renderings


ISBN: 978-81-7028-691-2
Title:A TREASURY OF URDU POETRY
Author: Kuldip Salil
Price: 250/-
Format: Hardcover
Bi-lingual
----------------------------------------------------
With the expansion of TV media in the Asian sub-continent, the understanding of Urdu language has become a necessity to enjoy ghazals, film lyrics, TV serial and stage performances.

This anthology is for the benefit of readers who are not so well versed in Urdu.This title has selections of 34 eminent poets from old masters Meer and Ghalib to modern poets Faiz and Faraz. This will help in popularising and understanding of the Urdu language( ghazals in Devanagari script, with meanings in Hindi for the difficult Urdu words) among ghazal lovers with the English rendering of the same..

A book to be acquired, savoured and to adorn one's bookshelf.

This book is published by RAJPAL&SONS, Delhi.
_____________________________________

Labels: