My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, July 21, 2007

ONE SONG IN 24 DIFFERENT LANUAGES!!!!!

Enjoy!!!!!! and do not blame if this is not correct.Just Feel It!!!!!!!!!










(Original ) HINDI
(Movie: 'GULAM' 1998)


A Kya Bolti Tu ?
A Kya Mai Bolu ?
Sun
Suna
Ati Kya Khandala ?
Kya karu Ake mai Khandala ?
Are Ghumenge, nachenge, gayenge Aish karenge or kya ?
-------------------------------------------
English :
Aye what do you say?
Aye what should I say?
Listen.
Speak on.
Coming to khandala?
What should I do, coming to khandala?
We'll roam, we'll loaf, we'll sing, we'll dance we"ll
freak, baby,what else?
------------------------------------------------
Sanskrit :
(This is too good )

Aye balike, twam katham kathisyasi
Aye balakah aham kim kathisyamh
Shrinvasi!
Shrunha
Kim twam khandaalaa agchasyasi
Aham kim kurwasyami khandaalayeh
gamisyami, bhramisyami, nryuthyami, gaayami, maja
karishma, kim karishyami?
--------------------------------------------
Oriya :
Are kana kahuchu tu?
Aye kana mu kahibi?
Sunu
Suna
Aasuchu ki Khandala?
Kana karibi? Aasiki mu khandala?
Are buliba, nachiba, gaiba, Aish kariba aau kana?
---------------------------------------------------
Sambalpuri: (Western Oriya local language.)
Are kaana karchu tui?
Are kaana mui ar karmi?
Sun
Suna
Aaibu kain khandala?
Kaana ar karmi aasikina khandala?
Are bulma, nachma, gaima, Aish karma ar kaana
---------------------------------------------------
Kannada:
Ye, Yen heltiya
Ye, yen helabeku
Kelu
Helu
Bartiya khadalakke
Yen madli nan bandu Khandalakke
Are Suttadona,Kuniyona, Maja Madona Matte yenu?
----------------------------------------------
Punjabi :
A ! ke boldi tu;
A ke mein bolan;
Sunh
Sunha
Chaldi khandala
Ki karaan ae ke mein khandala
Are Ghoomenge, Turainge, Naachenge, Gaavenge, Mauj
Karenge, Aur Ki ?
-------------------------------------------------
Gujarati :
Aye shun bole tu?
Aye hun shun bolu?
Sambhal
Sambhlaav
Aave chey su khandaalaa?
Shun karu aaviine khandaalaa?
Ghumshun, pharshun, naachshun, gaashun, majaa karshun,
beeju shun?
----------------------------------------------------
Marathi
Aye kaai tu mhantes?
Aye kaai mi mhanhu?
Aik
Aikav
Yetes kai khandaalaa?
Kai karu yevon mi khandaalaa?
Are ghumuyaa, phiruyaa, gavuyaa, nachuyaa, aish
karuyaa, aankhin kai?
-------------------------------------------------------
Kashmiri :
Heey, kya chaakh wannan
Heev, kya bhe wanneyyyy
Booz
Wanoo
Pakha telle khandalaa;
Kya karee weeteth bhe khandalaa
Pherevhey, nachevhey, geevevhey, khevevhey, eesh
karav, beyy kya?
------------------------------------------------------
Konkani :
Aye ! kitte sangta tu?
Aye ! aao kite sangu?
Saang
Saangta
Khandalaa yeta ghi?
Khandalaa yevun kithe kharche?
Bhovya, Phireya, Naachya, Gauya, maja korya, anikithe?
-------------------------------------------------------
Bengali :
Ei ki bolis tui
Ei ki ar boli
Shon
Shonaa
Jabi ki khondalaa
K! i kori giye khondalaa
Are, ghurbo, phirbo, nachbo, gaibo, maja korbo ar ki?
-------------------------------------------------------
Malayalam :
Aye yenna pariyunnu?
Aye nyan yenna parayan?
Keku
Pariyu
Varinno kh! andala?
Yendu cheyam? Nyaan vannu Khandaala?
Karangam, paadam, aadam, joli
addikam,verendha?
----------------------------------------------
Telugu :
Ey, EnTE chebutaav?
Ey,Em cheppaala?
Vinu
Cheppu
vastaavaa KhanDaalaa?
YEm ChEsEdi? vachchi KhanDaalaa.
ThirugudaaM, egurudaaM, aaDudaaM, paaDudaaM,maja
chEddaaM, marETi?

(తెలుగు:

ఏయ్, ఏంటే చెబుతావ్?
ఏయ్,ఏం చెప్పాల?
విను.
ఛెప్పు.
వస్తావా ఖండాలా?
ఏం ఛెయ్యాలి? వచ్చి ఖండాలా.
అరే,తిరుగుదాం, ఎగురుదాం, ఆడదాం, పాడదాం,మజా
చేద్దాం, మరేటి?)
---------------------------------------------
Sindhi :
Aye cha thi c! haen tu?
Aye Maan chaa chavan?
Budh
Budhai
Acheti cha khandaalaa?
Cha kandis achi maan khandaalaa?
Are Ghumandasi, phirandasi, gayendasi,
Nachandasi,aaish
kan ! dasi, byo cha?
-----------------------------------------
Magadhi : (BIHARI)
A ki bolahin tu
A kya boliyuow hum
Sun
Sunaow
Aaimahi ki khandala
Ki kariaow aake hum khandala
Gumbai, Phirbai, naachai, gaayii, aish karbai aur ki
----------------------------------------------------
Assamese:
ey ki kua tumi?
ey ki kom moi?
sun
suna
ahibi ki khandala?
ki korim aahi moi kahandalaa
are ghurim,phirim, nasim,gaam, khub phurti korim aru ki?
-----------------------------------------------
Tamil:
Enna solre
Ennatha solla
mudalla kelu,
sari sollu
Kandala variya
kandala poi enna panrathu
Vera enna .oor suthuvom aaduvom paaduvom jalsa
pannuvom
-------------------------------------------
Foreign Languages :
--------------------------------------------
German :
Was sagst du?
Was soll ich sagen?
Hor mal!
Sag mal!
Kommst Nach Khandala?
Was machen wir in Khaldala?
Wir gehen, spazieren, tanzen, singen, haben spaCx,
was noch?
---------------------------------------
Spanish :
Tu que deceas?
Yo que deseo?
Oye
Di me
Vas a tu khandaalaa?
Que haceo, yo voy en el khandaalaa?
Viajamos, vagabundeamos, bailamos, cantamos,
disfrutamos, si no.
-------------------------------
Chinese :
Ain, Chon Zuan Ho?
Ain, Chon Hee Zuano?
Sui,
Suion,
Hyuan Chon Khandala?
Chon Tsuani Hyui Hee Khandala?
Chijuan, Kajuan, Marijuan, Siuan, Samshuan
Tsuaniya Tsu Chon?
----------------------------------
Russian :
Aeich, Kov Speache niv?
Aeich, Kov miv Speache?
Nuushev,!
Nuusheva,
Comeva Kov Khandala?
Kov Sheychev Comov miv Khandala?
Rotiv, Rotrach, Balleva, Opereacha, Enjova
Sheychevin, Kov
Gobraich?
------------------------------------
French :
Aye! qu'est-ceque tu dis?
Aye! qu'est-ceque tu me vouler dire?
Entendre
Entendrez
Est-ceque tu viens a la Khandala
Qu'est-ceque je fais a aller a la Khandala ?
Promenez,! Allez, Dansez, Chantez a quelle?

(Corrected version:see the comment
Aie! qu'est-ce que tu dis?
Aie! qu'est-ce que tu me veux à dire ?
Eccoute
Ai Eccouté
Est-ce que tu viens au Khendala
Qu'est-ce que je fais venant au Khendala ?
Se Promenons ! Dançons, Chantons s'amusons n'importe quelle)
------------------------------------
Zambesi : (African)
Aye, Zwa To Zulu,
Aye, Zwa Ze Zulu,
Wahte,
Kaso,
Heliyo To Khandaalaa?
Zwa Kumi, Helithe Khandaalaa?!
Himala, Romala, Wahwahla, Infala, Kumaya Kumana, Ni

(an e mail forward)
______________________________

Labels:

Thursday, July 19, 2007

CARPE DIEM- SEIZE THE DAY!

Life is strange and so unpredictable. Some people are here one minute, and gone the next! Therefore we should not only seize the day but also the moment – Carpe Diem and Carpe Momentum. Do it now. Later never comes, there is only now.

Start your day off well. Before you get out of bed each morning, say a prayer or repeat your personal affirmation giving thanks for the day and all the positive things you will see and achieve. Make a conscious decision to make this the best day of your life and meet with pleasure, success and fun. If you believe it, it will most certainly happen. A timeless secret for lifelong success is to live each day as if it were your last.


GEMS:

  • The clock of time is wound but once,

And no man has the power to tell
Just when the hands will stop
At late or early hour.
Now is the only time you own.
Live, love, toil with a will,
Place no faith in tomorrow;
For the clock may then be still.

  • The past, the present and the future are really one- they are today.

  • Young people live in the future. Old people live in the past. Wise people live in the present.

  • Yesterday is history, tomorrow a mystery and today is a gift. That is why it is called the present. Be present minded, in light of planning (for future) and analysis (of the past).

  • Yesterday is a cancelled cheque, tomorrow is a promissory note and today is ready cash. Use it.

  • Time is like a river…. You cannot step on the same water twice, because the flow that has passed will never pass you again. Cherish every moment of your life.

  • Every man’s life lies within the present: For the past is spent and done with, and the future is uncertain.

  • We should take from the past its fires and not its ashes

  • One of these days is none of these days; today is the day to start the big job.

  • Today is the tomorrow you didn’t plan for yesterday.

  • Today’s decisions are tomorrow’s realities.

  • Now is the glorious moment, grasp it, treasure it up and hug it, utilise it to the utmost.

  • Your future is hidden in what you do daily.

  • I always remember that I have everything I need to enjoy my here and now, unless I am letting my consciousness be dominated by demands and expectations based on the dead past or the imagined future.

  • This instant is the only time there is.

  • One today is worth two tomorrows.

  • Ideas are worthless. Intentions have no power. Plans are nothing . . . unless they are followed with action. Do it now!

  • Today's action becomes tomorrow's habit.
(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)

------------------------------------------

Labels:

Tuesday, July 17, 2007

Change our vision

There was a millionaire who was bothered by severe eye pain. He consulted so many physicians and was getting his treatment done. He did not stop consulting galaxy of medical experts; he consumed heavy loads of drugs and underwent hundreds of injections.


But the ache persisted with great vigour than before. At last a monk who has supposed to
be an expert in treating such patients was called for by the millionaire. The monk understood his problem and said that for sometime he should concentrate only on green colours and not to fall his eyes on any other colours.

The millionaire got together a group of painters and purchased barrels of green colour and directed that every object his eye was likely to fall to be painted in green colour just as the monk had advised.


When the monk came to visit him after few days, the millionaire's servants ran with buckets of green paints and poured on him since he was in red dress, lest their master not see any other colour and his eye ache would come back.

Hearing this monk laughed said "If only you had purchased a pair of green spectacles, worth just a few rupees, you could have saved these walls and trees and pots and all other articles and also could have saved a large share of his fortune. You cannot paint the world green."

Let us change our vision and the world will appear accordingly. It is foolish to shape the world, let us shape ourselves first.

Let’s change our vision..!!

(an e-mail forward)
---------------------------------------------

Labels:

Monday, July 16, 2007

తెలుగులో వంద గొప్ప పుస్తకాలు

వెయ్యేళ్ళ తెలుగు సాహితీ ప్రస్థానం పిల్ల కాలువలా మొదలై, నదీ ప్రవాహమై, సాగరమై, సుసంపన్నమై మైలురాళ్ళను నెలకొల్పుతూ ముందుకు సాగుతూ ఉన్నది.అటువంటి సాగరతుల్యమైన సాహిత్యం నుంచి 'గొప్ప వంద పుస్తకాలు ఇవే ' అని తేల్చి చెప్పడం కష్టసాధ్యమైన పని. రచయితలు కొందరు విడి విడిగా ఇటువంటి ప్రయత్నంచేసారు. వాటిని గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు., కాని ఆంధ్రజ్యోతి దినపత్రిక 1999 దిసెంబర్ లో ముద్రించిన జాబితాను ఇక్కడ పొందుపర్చుతున్నాము. అప్పట్లో ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికను చూస్తున్న సీనియర్ జర్నలిస్టు, రచయిత పొనుగోటి కృష్ణారెడ్డి తెలుగులో వచ్చిన గొప్ప వంద పుస్తకాలను ఎంపిక చేయడానికి ఓ మంచి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కవులు, విమర్శుకులు, మేధావులు,పుస్తక ప్రియులనుంచి గొప్ప వంద పుస్తకాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరిపారు.వారిలో 44 మంది రచయితలు తమ అభిప్రాయాలను పంపారు. ఈ అభిప్రాయాల ప్రాతిపదికగా రూపొందించి, అంధ్రజ్యోతిలో ప్రచురించిన జాబితాను వరుసక్రమంలో ఇక్కడ ఇచ్చాము. ఈ జాబితా ఎంపికలోనూ అనేక పరిమితులున్నాయని, ఇదే సమగ్రమైన జాబితా అని చెప్పడానికి సాహసించడం లేదని అప్పట్లో సంపాదకులు ప్రకటించారు. అభిప్రాయ సేకరణలో పాల్గొన్న రచయితల వ్యక్తిగత అభిరుచి, వారికి ఉండే పరిమితుల కారణంగా కొన్ని ప్రముఖ రచనలకు ఇందులో స్థానం లభించకపోయివుండవచ్చు. అంతమాత్రం చేత ఆ రచనల ప్రాధాన్యం తగ్గిపోదు. ఆంధ్రజ్యోతి అప్పట్లో వంద గొప్ప కథలను కూడ విడిగా ఎంపిక చేసింది.అందువల్ల గొప్ప వంద పుస్తకాల జాబితాలో కథల సంపుటాల గురించిన ప్రస్తావన చేయలేదు.


1] కన్యాశుల్కం:-గురుజాడ అప్పారావు

2] మహాప్రస్థానం: - శ్రీశ్రీ

3] ఆంధ్రమహాభారతం:-కవిత్రయం

4] మాలపల్లి (సంగవిజయం):-ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు

5] చివరకు మిగిలేది (ఏకాంతం):-బుచ్చిబాబు

6] అసమర్ధుని జీవయాత్ర :-గోపీచంద్

7] దేవరకొండ బాలగంగాధర తిలక్:-అమృతం కురిసిన రాత్రి

8] కాలాతీతవ్యక్తులు:-డాక్టర్ శ్రీదేవి

9] వేయి పడగలు:-విశ్వనాధ సత్యనారాయణ

10] పింగళి సూరన:- కళాపూర్ణోదయం

11] సాక్షి:-పానుగంటి లక్ష్మినరసింహారావు

12] గబ్బిలం:-జాషువా

13] వసుచరిత్ర:-భట్టుమూర్తి

14] అతడు ఆమె::-ఉప్పల లక్ష్మనరావు

15] అనుభవాలు జ్ఞాపకాలు:-శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

16] ఆముక్తమాల్యద:- శ్రీకృష్ణదేవరాయలు

17] చదువు:-కొడవటిగంటి కుటుంబరావు

18] ఎంకి పాటలు:-నండూరి సుబ్బారావు

19] కవిత్వ తత్త్వ విచారము:- డాక్టర్ సి ఆర్ రెడ్డి

20] వేమన పద్యాలు:-వేమన

21] కృష్ణపక్షం:-కృష్ణశాస్త్రి

22] మట్టిమనిషి:-వాసిరెడ్డి సీతాదేవి

23] అల్పజీవి:-రావి శాస్త్రి

24] ఆంధ్రుల సాంఘిక చరిత్ర:-సురవరం ప్రతాప రెడ్డి

25] ఆంధ్ర మహాభాగవతం:-పోతన

26] బారిష్టర్ పార్వతీశం:-మొక్కపాటి నరసింహశాస్త్రి

27] మొల్ల రామాయణం:-ఆతుకూరి మొల్ల

28] అన్నమాచార్య కీర్తనలు:-అన్నమాచార్య

29] హంపీ నుంచి హరప్పాదాకా:-తిరుమల రామచంద్ర

30] కాశీయాత్రా చరిత్ర:-ఏనుగుల వీరాస్వామయ్య

31] మైదానం:-చలం

32] వైతాళికులు:-ముద్దుకృష్ణ

33] ఫిడేలు రాగాల దజను:-పఠాభి

34] సౌందర నందము:-పింగళి, కాటూరి

35] విజయవిలాసం:-చేమకూర వేంకటకవి

36) కీలుబొమ్మలు:-జీ.వీ. కృష్ణారావు

37] కొల్లాయి గడితేనేమి:-మహీధర రామమోహనరావు

38] మ్యూజింగ్స్:-చలం

39] మనుచరిత్ర:-అల్లసాని పెద్దన

40] పాండురంగ మహత్యం:-తెనాలి రామకృష్ణ

41] ప్రజల మనిషి:-వట్టికోట ఆళ్వారు స్వామి

42] పాండవోద్యోగ విజయములు:-తిరుపతి వేంకటకవులు

43] సమగ్ర ఆంధ్ర సాహిత్యం:-ఆరుద్ర

44] దిగంబర కవిత:-దిగంబర కవులు

45] ఇల్లాలి ముచ్చట్లు:-పురాణం సుబ్రమన్య శర్మ

46] నీలిమేఘాలు:-సంపాదకత్వం:వోల్గా

47) పానశాల:-దువ్వూరి రామిరెడ్డి

48] శివతాండవం:-పుట్టపర్తి నారాయాణాచార్యులు

49) అంపశయ్య:-నవీన్

50] చిల్లర దేవుళ్ళు:-దాశరథి రంగాచార్య

51] గణపతి:-చిలకమర్తి లక్ష్మీనరసింహం

52] జానకి విముక్తి:-రంగనాయకమ్మ

53] స్వీయ చరిత్ర:-కందుకూరి

54] మహోదయం:-కె.వి.రమణారెడ్డి

55] నారాయణరావు:-అడవి బాపిరాజు

56] విశ్వంభర:-డాక్టర్ సి.నారాయణరెడ్డి

57] దాశరథి కవిత:-దాశరథి

58] కథాశిల్పం:-వల్లంపాటి వెంకటసుబ్బయ్య

59] నేను-నా దేశం:-దర్శి చెంచయ్య

60] నీతి చంద్రిక:-చిన్నయ సూరి

61] పెన్నేటి పాట:-విద్వాన్ విశ్వం

62] ప్రతాపరుద్రీయం:-వేదం వెంకటరాయశాస్త్రి

63] పారిజాతాపహరణం:-నంది తిమ్మన

64] పల్నాటి వీర చరిత్ర:-శ్రీనాథుడు

65] రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక):-కందుకూరి వీరేశలింగం పంతులు

66] రాధికా సాంత్వనము:-ముద్దుపళని

67] స్వప్న లిపి:-అజంతా

68] సారస్వత వివేచన:-రాచమల్లు రామచంద్రారెడ్డి

69] శృంగార నైషధం:-శ్రీనాథుడు

70] ఉత్తర రామయణం;-కంకంటి పాపరాజు

71] విశ్వదర్శనం:-నండూరి రామమోహనరావు

72] అనుక్షణికం:-వడ్డెర చండీదాస్

73] ఆధునిక మహాభారతం:-గుంటూరు శేషేంద్ర శర్మ

74] అడవి ఉప్పొంగిన రాత్రి:-విమల

75] చంఘీజ్ ఖాన్:-తెన్నేటి సూరి

76] చాటుపద్య మంజరి:-వేటూరి ప్రభాకర శాస్త్రి

77] చిక్కనవుతున్నపాట:-జి.లక్ష్మీనరసయ్య, త్రిపురనేని స్రీనివాస్

78] చితి-చింత:-వేగుంట మోహనప్రసాద్

79] గద్దర్ పాటలు:-గద్దర్

80] హాంగ్ మి క్విక్:-బీనాదేవి

81] ఇస్మాయిల్ కవిత:-ఇస్మాయిల్

82] కుమార సంభవం:-నన్నె చోడుడు

83] కొయ్య గుర్రం:-నగ్నముని

84] మైనా:-శీలా వీర్రాజు

85] మాభూమి:-సుంకర,వాసిరెడ్డి

86] మోహన వంశీ:-లత

87] నగరంలో వాన:-కుందుర్తి

88] రాముడుండాడు రాజ్యముండాది:-కేశవరెడ్డి

89] రంగనాథ రామాయణం:-గోన బుద్ధారెడ్డి

90] సౌభద్రుని ప్రణయ యాత్ర:-నాయని సుబ్బారావు

91] సూత పురాణం:-త్రిపురనేని రామస్వామి చౌదరి

92] శివారెడ్డి కవిత:-శివారెడ్డి

93] సాహిత్యంలో దృక్పథాలు:-ఆర్.ఎస్.సుదర్శనం

94] స్వేచ్ఛ:-వోల్గా

95] తెలుగులో కవితావిప్లవాల స్వరూపం:-వేల్చేరు నారాయణరావు

96] కరుణశ్రీ:-జంధ్యాల పాపయ్య శాస్త్రి

97] వేమన:-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

98] తృణకంకణం:-రాయప్రోలు

99] హృదయనేత్రి:-మాలతీ చందూర్

100]
బ్రౌను నిఘంటువు:-చార్లెస్ బ్రౌను

(జర్నలిష్టు కరదీపిక,సంపాదకుడు:కట్టా శేఖర్ రెడ్డి,
న్యూ మీడియా కమ్యూనికేషన్స్, హైదరాబాద్,2006)
--------------------------------------------------------
ఈ క్రింది సైటు కూడా చూడండి::
ఈమాట » ఈ శతాబ్దపు రచనా శతం

Labels: ,

చదవాల్సిన పుస్తకాలు

..'ఈనాడు' జర్నలిజం స్కూలు, 'ఆంధ్రజ్యోతి ' జర్నలిజం కళాశాలలు- జర్నలిస్టులు కాదలచినవారు చదవాల్సిన పుస్తకాల జాబితాలను రూపొందించాయి.ఆ జాబితాలోని తెలుగు నవలలు, నాటకాలు, కథలు, కవిత్వం, వ్యాసాల పేర్లు:

నవలలు:
ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు:-'మాలపల్లి' (సంగవిజయం),
గుడిపాటి వెంకటచలం:-'మైదానం'
తెన్నేటి సూరి: -'చంఘీజ్ ఖాన్'
మొక్కపాటి నరసింహశాస్త్రి:-'బారిష్టర్ పార్వతీశం'
బుచ్చిబాబు:-'చివరకు మిగిలేది'(ఏకాంతం)
చిలకమర్తి లక్ష్మీనరసిహం:-'గణపతి '
కొడవటిగంటి కుటుంబరావు :-'చదువు'
డాక్టర్ శ్రీదేవి:-'కాలాతీతవ్యక్తులు'
గోపీచంద్:-'అసమర్ధుని జీవయాత్ర'
విశ్వనాధ సత్యనారాయణ:-'వేయి పడగలు'
బీనా దేవి:-'పుణ్యభూమీ కళ్ళుతెరు'
వాసిరెడ్డి సీతాదేవి:-'మట్టిమనుషులు'
ముప్పాళ రంగనాయకమ్మ: -'జానకి విముక్తి '
నామిని సుబ్రమణ్యం నాయుడు:-'ముని కన్నడి సేద్యం'
వడ్డెర చండీదాస్:- 'హిమజ్వాల'
నవీన్:-'అంపశయ్య'

నాటకాలు:
గురుజాడ అప్పారావు: -'కన్యాశుల్కం'
సుంకర, వాసిరెడ్డి: -'మా భూమి'

కథలు
గురుజాడ అప్పారావు: -'గురుజాడ కథలు '
కాళీపట్నం రామారావు: -'యజ్ఞంతో తొమ్మిది'
రావి శాస్త్రి:-'రావి శాస్త్రి కథలు'
చాగంటి సోమయాజులు: -'చాసో కథలు'
దేవరకొండ బాలగంగాఘధర తిలక్: -'తిలక్ కథలు'
ప్రేంచంద్ : -'ప్రేంచంద్ కథలు'
శ్రీపాదసుబ్రమన్యశాస్త్రి: -'శ్రీపాద కథలు'

కవిత్వం
శ్రీశ్రీ: -'మహాప్రస్థానం'
దేవరకొండ బాలగంగాఘధర తిలక్: -'అమృతంకురిసిన రాత్రి'
దేవులపల్లి కృష్న శాస్త్రి: -'కృష్ణ పక్షం'
నండూరి సుబ్బారావు: -'ఎంకి పాటలు'
ఆరుద్ర: -'త్వమేవాహం'
డాక్టర్ సి.నారాయణ రెడ్డి: -'విశ్వంభర'
కుందుర్తి:-'నాలోని నాధాలు'

వ్యాసాలు
పానుగంటి లక్ష్మీనరసింహారావు: -'సాక్షి వ్యాసాలు '
కొడవటిగంటి కుటుంబరావు: -'కొడవటిగంటి రాజకీయ వ్యాసాలు'
ఎబికె ప్రసాద్: -'ఎబికె సంపాదకీయాలు '
నార్ల వెంకటేశ్వర రావు: -'మూడు దశాబ్దాలు '

(జర్నలిష్టు కరదీపిక, సంపాదకుడు: కట్టా శేఖర్ రెడ్డి,2006.)
-------------------------------------------------

Labels: ,

Sunday, July 15, 2007

మనస్సు

మనస్సు ఇల్లువంటిది. ఇంట్లోని కసవును వూడ్చివేయటానికి చీపురు ఉపయోగపడినట్లే మనస్సులోని మాలిన్యాలను కడిగివేయటానికి సత్యం ఉపయోగపడుతుంది. (మనఃసత్యేన శుద్ధ్యతి). ఈ మనస్సు మనం తినే ఆహారాన్ని బట్టి ఏర్పడుతుంది. (యదన్నం తన్మనః).
భగవంతుడు మనిషిని మనస్సుతో వాక్కును కలిపి తయారుచేసినట్లు బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది. జ్ఞానేంద్రియాలను ఐదింటిని, కర్మేంద్రియాలను ఐదింటిని నియంత్రించే శక్తి ఒక్క మనస్సుకే ఉంది. ఈ మనస్సును స్థూలంగా అంతఃకరణమని పిలుస్తాం. సంకల్పిస్తే మనస్సు. ఆలోచిస్తే చిత్తం. నిశ్చయిస్తే బుద్ధి. నేను, నాది అంటే అహంకారం.

ఇలాంటి మనస్సులోనే శుభసంకల్పాలకు తగిన చోటివ్వాలని భగవంతుణ్ని ప్రార్థించాలి.
యత్ప్రజ్ఞాన ముతచేతోధృతిశ్చ
యజ్జ్యోతిరంతరమృతం ప్రజాసు
యస్మాన్న ఋతే కించన కర్మక్రియతే
తన్మేమనః శివసంకల్పమస్సు (యజుర్వేదం 34-3)

(ఏ మనస్సు జ్ఞానసాధనమో, ఏది ఆలోచనాశక్తిని కలిగి ఉంటుందో, ఏది ధైర్యానికి స్థానమో, ఏది జనుల్లో వినాశం లేని ప్రకాశమో, దేని సహాయంతో సమస్త కార్యక్రమాలు జరుగుతాయో- అలాంటి మనస్సు నాకు శుభ సంకల్పాలు కలిగించుగాక!)

ఇంద్రియాలకంటె మనస్సు, మనస్సుకంటె ఆత్మ సూక్ష్మమైనవి. మనస్సు స్వాధీనంలో ఉండటానికే యోగప్రక్రియ. ఒక మనస్సును జయిస్తే సర్వం సాధ్యమవుతుంది. కాని ఈ మనస్సు మీద ఆరుగురు శత్రువులెప్పుడూ దాడి చేస్తుంటారు. వారికే అరిషడ్వర్గమని పేరు. మానవుడు బుద్ధిశాలియైు ఈ శత్రువుల ఆట కట్టించాలని వేదం ప్రబోధిస్తుంది.

ఉలూక యాతుం, శుశులోకయాతుం
జహిశ్వయా తుముత కోకయాతుం
సుపర్ణయాతుం, ఉతగృధ్రయాతుం
దృషదేవ ప్రమృణరక్ష ఇంద్ర (రుగ్వేదం 7-104-22)

మోహం గుడ్లగూబ స్వభావం. క్రోధం తోడేలు స్వభావం. మాత్సర్యం కుక్క స్వభావం. కామం ఊరపిచ్చుక స్వభావం. మదం గరుత్మంతుని స్వభావం. లోభం గద్ద స్వభావం. రాతితో కుండను ఏవిధంగా పగలగొడతామో, ఆత్మశక్తితో ఈ మోహాదిషడ్గుణాలను ధ్వంసం చేయాలి. ఈ ఆరింటిలో కామక్రోధలోభాలు మరీ బలమైనవి. ఇవి మూడూ నరకానికి మూడు ద్వారాలుగా భగవద్గీత చెప్పింది.

మనస్సు త్రిగుణాత్మకమైంది. మనస్సు చేసే కర్మలు కూడా మూడు రకాలు. సాత్వికం, రాజసం, తామసం. ఉదాహరణకు దానమనే కర్మను తీసుకొందాం. ప్రత్యుపకారం కోరక చేసే దానం సాత్వికం. ప్రత్యుపకారం కోరి చేసే దానం రాజసం. అనర్హులకిచ్చే దానం తామసం. వీటిలో సాత్వికం ఉత్తమమైంది.

నిష్కామకర్మలే మోక్షానికి దారి చూపుతాయి. కనుకనే యజ్ఞదానతపః కర్మలను నిరంతరం ఆచరణలోపెట్టాలి. తద్వారా మనస్సు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనస్సు ఆత్మజ్ఞానానికి, ఆత్మజ్ఞానం మోక్షానికి కారణభూతమవుతాయి. లోకంలో మూడురకాల కర్మలున్నట్లే మూడురకాల సుఖాలున్నాయి. సాత్విక, రాజస, తామస సుఖాల్లో సాత్విక సుఖమే శ్రేష్ఠమైంది. మనస్సు నిర్మలత్వం చేత లభించే సుఖమే సాత్వికసుఖం.
శ్రీరామచంద్రుడొకసారి వసిష్ఠమహర్షిని సందర్శించి మోక్షానందం ఎక్కడుందని ప్రశ్నించాడు. దానికి ఆ మహర్షి మోక్షానందం ఆకాశంలోను, పాతాళంలోను, నేలమీదనూ లేదు, నిర్మలమైన మనస్సులో మాత్రమే దానికి స్థానమని సమాధానమిచ్చాడు.

న మోక్షో నభసఃపృష్ఠే,
పాతాలే నచభూతలే
మోక్షోహి చేతో విమలం
సమ్యగ్‌జ్ఞాన విబోధితమ్‌ (శ్రీవసిష్ఠగీత)
(Eenadu, 03:03;2006)
-----------------------------------------------

Labels: ,

ఆయుష్‌'పాన్‌'భవ!

'పాన్‌ తెచ్చుకొని పన్ను కట్టుకొని చల్లగ కాలం గడపాలోయ్‌ ఎల్లరు హాయిగ ఉండాలోయ్‌'
అంటూ ఆదాయపు పన్ను విభాగం వాళ్లు మెత్తగా చిలుకకు చెప్పినట్టు చెప్పినా, గట్టిగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా పన్ను ఎగవేసేవాళ్లు ఎగవేయడం మానట్లేదు. (పన్ను కట్టే వాళ్లు మాత్రం కట్టకుండా ఊరుకోవట్లేదనుకోండి.) ఏడాదికోసారి ఐటీ వాళ్లు బ'కాయితాలు' బయటపెట్టి ఇంత మంది ఇన్‌కంట్యాక్స్‌ కట్టలేదొహో అని పత్రికల్లో టముకు వేస్తుంటారు. అయినా ప్రముఖులు వచ్చేసారికి కడతామని 'మూట వరుస'క్కూడా అనరేంటబ్బా! పైపెచ్చు అసలు ఈ పర్మనెంట్‌ అకౌంట్‌ నంబరు (పాన్‌) కార్డును కనిపెట్టిన దెవరనుకుంటూ వారిని కసి తీరా తిట్టుకుంటూ కూడా ఉంటారేమో.
'ఏముంది ఈ జీవితం పంఖా కింది కాయితం' అని పాడి, జీవితంలో ఏదీ పర్మనెంట్‌ కాదని చెప్పే వేదాంతాలు సైతం పాన్‌ కార్డు మాత్రం పర్మనెంట్‌/'ఫర్మ్‌'నెంట్‌ అని ఒప్పుకోక తప్పదు. ఈమధ్యే మూణ్నెల్లు కూడా నిండని ముద్దబ్బాయి ఆయుష్‌ రంజన్‌ 'మేరా పాన్‌ మహాన్‌' అనుకుంటున్నట్టుగా 'సిరినవ్వులు' చిందిస్తుంటే పాన్‌ ముఖం చూడకుండా తప్పించుకున్నవాళ్లు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి. పన్ను కట్టడాల్లో అక్రమాలు ఉన్నట్లే 'పాన్‌' అక్రమాలూ ఉన్నాయి. 'పాన్‌లందు అసలు పాన్‌లు వేరయా ఇన్‌కంట్యాక్స్‌ రామ వినుర వేమ' అన్న పద్యం చెవికి సోకడంలేదూ. కేటు ప్రకృతి డూప్లికేటు వికృతి అయిపోయింది. డూప్లికేటు పాన్‌ కార్డులున్నోళ్లు 'ముంచోళ్లు'. మొన్న మార్చి నాటికి ఇలాంటి వాళ్లు 13 లక్షల మందికి పైగానే 'తేలారు'! ఇందులో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది డ్యూప్లికేట్‌ పాన్‌లను అధికారులు కరకర నమిలి పారేశారు. అయినా పాన్‌ల బాగోతం 'ఆనుపాన్‌లు' అంతుపట్టడం లేదు. పది లక్షల నకిలీ పాన్‌ కార్డులను పట్టుకుని చెత్తబుట్టలో పడేశామని కొన్నాళ్ల క్రితమే ప్రభుత్వం హెచ్చరించింది. అయినా నకిలీ పాన్‌ కార్డుల పరిశ్రమ వర్ధిల్లుతూనే ఉంది.

ఢక్కాముక్కీలు తింటూ రెక్కలు ముక్కలు చేసుకు, లెక్కలు కట్టుకునే వాళ్లకే పాన్‌ కార్డు అవసరం అని ఎడాపెడా సంపాయించి వెనకేసుకున్నవాళ్లు అనుకుంటుండవచ్చు. లోహ విహంగం రెక్కలు తొడుక్కుని విదేశాల్లో వాలాలన్నా, చివరికి సెల్‌ఫోన్‌ కొనాలన్నా 'పాన్‌ కార్డు ఉందా సార్‌? నంబరు ఎంత సార్‌' అని ప్రశ్నలు అడుగుతారు. పాన్‌ కార్డు లేకపోతే హ్యాపీ 'రిటర్న్స్‌' ఆఫ్‌ ద డే అనలేరు. శివుడాజ్ఞ లేకుండా చీమయినా కుట్టదంటారు. ఇప్పుడు శివుడి డ్యూటీని ఇన్‌కం ట్యాక్స్‌ శాఖ తీసేసుకున్నట్లుంది. అంతా ఇన్‌కంట్యాక్స్‌ ఇలాకాలోకి వస్తుండడంతో ఏ వ్యవహారంలో నయినా పాన్‌ కార్డు 'నిను వీడని నీడను నేనే' అంటోంది. మనిషికి అదే 'పాన్‌'చభౌతిక దేహమైపోయింది. అందువల్లనే పాన్‌'దేవో'భవ అన్న విన్నపాలు విపరీతంగా పెరిగిపోయాయి!

మనిషి ఆరోగ్యానికి 'ప్రాణాయామం' ఎంత అవసరమో, సౌభాగ్యానికి 'పానాయామం' అంత అవసరం అని ఆర్థిక యోగులు సెలవిస్తుంటే బదులు చెప్పేందుకు ఏముంది?

- ఫన్‌కర్‌
(Eenadu, 15:07:2007) -------------------------------------------------

Labels:

కోడళ్లకు కొత్త శిక్షణ

పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన మలుపు. కొత్త కోడలి హోదాలో కోటి ఊహలతో అత్తింట్లో అడుగు పెట్టిన అమ్మాయిలకు ఒక్కొక్కసారి అత్తగారి రూపంలో అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. అత్తాకోడళ్ళ మధ్య అవగాహన లోపంవల్ల ఇళ్ళల్లో అశాంతిపూరిత వాతావరణం ఏర్పడుతుంది. చిన్నచిన్న పోట్లాటలే చినికి చినికి గాలివానగామారి కుటుంబాలు విడిపోయే పరిస్థితులూ ఏర్పడతాయి. ఈ ప్రచ్ఛన్న, ప్రత్యక్ష యుద్ధాల్లో మామాకొడుకులు నలిగిపోతుంటారు. ''అరటి పూసింది అరటి కాసింది, అత్త పెట్టిన ఆరళ్ళు మరుపునకురావు, ఆరళ్ళ అత్తయిన సవతి పోరైన, తల్లిల్లు దూరమైన భరియింపలేము'' అంటూ సతీమణి సణుగుడు ప్రారంభిస్తుంది. అమ్మగారింట్లో అతిగారాబంగా పెరిగిన అమ్మాయిలు కొత్త వాతావరణంలో తొందరగా ఇమడలేరు. ఓపలేని అత్తకు వంగలేని కోడలు- అన్న సామెతగా వ్యవహారం తయారై సంసారంలో చిటపటలు ప్రారంభమవుతాయి. ''చాయ పసుపులాగ నను దెచ్చినావు సరసుడా మీ తల్లి సాధింపు చూడు, ముద్ద పసుపులాగ నన్ను దెచ్చినావు ముద్దుడా నీ తల్లి మూతిరుపు చూడు...'' అంటూ భార్యామణి ఫిర్యాదులు ప్రారంభిస్తుంది. ''అమ్మరో మాయమ్మ మముగన్న తల్లీ నీవు దెచ్చిన కోడల్ని ఏమిటన్నావు...'' అని కొడుకు అడిగితే- ''నేనేమన్నానయ్యా... పొరుగిళ్ళకు పోకన్న జగడమొద్దన్న, నడుస్తూ తల కురులు విప్పవద్దన్న, సందెకాడ దీపంబు పెట్టేటి వేళ సప్పుడు కాకుండ పెట్టిరమ్మన్న, మాపుకాడ దీపంబు మలిపేటప్పుడు మళ్ళి చూడకుండ మలిపిరమ్మన్న...'' అని తల్లి జవాబు చెబుతుంది. ఈ మాత్రానికే ఇల్లాలికి అలకెందుకో అబ్బాయికి అర్థంకాదు.
అత్తగారి అధికారం కొన్నాళ్ళు కోడలి పెత్తనం కొన్నాళ్ళు అని సామెత. ఇంట్లో పెత్తనం కోసమే అత్తా కోడళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం ఎక్కువగా జరుగుతుంటుంది. అప్పటిదాకా ఎదురులేని తన పెత్తనానికి కోడలి రాకతో కొంత బ్రేకు పడిందేమోనని అత్తగారికి అనుమానం కలుగుతుంది. దాంతో కోడలిపై అకారణ కార్పణ్యం ఏర్పడుతుంది. ''అత్త చేజారినది అడుగాటి కుండ కోడలు చేజారినది కొత్త కుండ...'' వంటి సామెతలు ఇటువంటి సందర్భాలలోనుంచి ఉద్భవించినవే. ''మా అత్తగారికి ఒంట్లో బాగుండటం లేదు. అస్సలు మాట్లాడలేకపోతోంది. మీకు వీలైతే వచ్చేవారంలో కాని వచ్చేనెలలోకాని ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూసివెళ్ళండి డాక్టరుగారూ...'' అంటూ ఓ కోడలు డాక్టరుకు ఫోను చేసింది. ''వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నారా... చాలా మంచిపని. నా వంతు విరాళంగా మా అత్తగారిని ఇస్తాను తీసుకెళ్ళండి...'' అంది మరో తెలివైన కోడలు. అత్తాకోడళ్ళ మధ్య పోట్లాటలు అనాదిగా కొనసాగుతూనే ఉన్నాయి. భర్త అజమాయిషీ తగ్గిపోయి కొడుకు అధికారం కండువా భుజాన వేసుకోగానే అత్తగారి అధికారం అటకెక్కి కోడలి పెత్తనం మొదలవుతుంది. అప్పటినుంచీ అత్తగారు కృష్ణా రామా అంటూ మూల కూర్చోక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో కోడలి గురించి కొడుకుతో ఏమి చెప్పినా చెవిటివానిముందు శంఖం ఊదినట్లే అవుతుంది.

అత్తాకోడళ్ళ మధ్య అవగాహనలోపం ఏర్పడి గృహ శాంతి కొరవడటానికి కారణాల గురించి విపులంగా అధ్యయనం చేసింది జైపూర్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థ. ఐ.టి.ఇ. అనే సంక్షిప్త నామంకలిగిన ఈ సంస్థ కొత్తకోడళ్ళకు అత్తవారింట్లో ఎలా సర్దుకుపోవాలో, అత్తలతో ఏ పేచీలు రాకుండా ఎలా నెగ్గుకురావాలో తెలియజేసే ఓ కొత్తకోర్సును ప్రారంభించింది. ఈ విషయాలపై కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు తగు శిక్షణ ఇస్తారు. అనుభవజ్ఞులైన అత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, ప్రసిద్ధి చెందిన మహిళలు, సంఘ సేవకులు తరగతులు నిర్వహించి కొత్తకోడళ్ళకు అత్తవారింట్లో ఎలా నెగ్గుకురావాలో కిటుకులు బోధిస్తారు. వంటరానివారికి పాకశాస్త్రాన్నీ నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు డిప్లొమా సర్టిఫికెట్లను ఇస్తారు. ఈ సర్టిఫికెట్లు పొందినవారు అత్తవారిళ్ళల్లో ఏ సమస్యలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించి ఆదర్శ గృహిణులుగా పేరు తెచ్చుకోగలరని సంస్థ వారు భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే ఈ డిప్లొమా కోర్సుకు అమెరికా, జర్మనీ దేశాల విశ్వవిద్యాలయాల నుంచి గుర్తింపు సాధించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ''మన దేశంలో అత్తాకోడళ్ళ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నట్లు మా అధ్యయనంలో తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే అత్తవారిళ్ళల్లో సామరస్య పూర్వకంగా ఎలా ప్రవర్తించాలో, నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కొత్తకోడళ్ళకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కోర్సును ప్రారంభించాం. కోడళ్ళకు ఇచ్చే ఈ కొత్త ట్రయినింగ్‌ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయనే మా విశ్వాసం-'' అంటున్నారు సంస్థకు చెందిన ఆశిష్‌శర్మ!
(Eenadu, 15:07:2007)
-------------------------------------------------------

Labels: