My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 29, 2007

COURTESY, POLITENESS AND MANNERS:

Courtesy is consideration for the comforts and convenience of others. Politeness and manners are the practice of special little customs, which have become traditional. Manners without courtesy are insincere and empty. Courtesy without manners is sincere and kind, but clumsy. The three together are like good oil in the social machinery. They make things run smoothly and pleasantly.

GEM:
  • All doors open to courtesy.
(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)
___________________________


___________________________

Labels:

'అంధకులు ' ఎవరు?

తొలి బౌద్ధ గ్రంథాలన్ని పాళీ(ప్రాకృత) భాషలో రచించబడ్డాయి. ఈ పాళీ భాషలో ఆంధ్రులు 'అంధకులని' పిలువబడినారు. తొలి బౌద్ధ గ్రంధాలలో ఒకటైన 'సుత్తనిపాతాన్ని ' బట్టి 'అంధకరట్టం '('అంధ ' ప్రాచీనరూపం, ఆంధ్ర ' తర్వాతరూపం; అందుచేత అంధకరట్టం అంటే ఆంధ్రరాష్ట్రం) గోదావరినది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తుంది.ఈ 'సుత్తనిపాత ' గ్రంథంపైని వ్యాఖ్యానంలో అళక లేక అస్సక, ముళక జనపదాలు అంధక రాష్ట్రాలని చెప్పబడ్డాయి. వీనిలో అళక లేక అస్సక జనపదానికి పోతన(ఇప్పటి బోధన్) రాజధాని... .....అస్మక జనపదం గొదావరి, మంజీరానదుల ఉభయ తటాలను ఆవరించి, కొంత మహారాష్ట్ర దేశంలో, కొంత తెలంగాణ వాయవ్య ప్రాంతంతో కూడిఉన్న భూభాగమని చెప్పవచ్చు. ముళకదేశం గోదావరీనదికి ఉత్తరంగా వ్యాపించి ఉన్న నేటి మహారాష్ట్ర లోని ఔరంగాబాద్‌జిల్లా. అందుచేత నేటి తెలంగాణాలోని నిజమాబాద్‌జిల్లా, దానిని వెంబడించిన గోదావరిప్రాంతం కొంత, మహారాష్ట్రంలోని ఔరంగాబాదు జిల్లా(ఈ జిల్లాలోనే అజంతా బౌద్ధ గుహలున్నాయి) ఉన్నభూభాగానినే క్రీ.పూ. నాల్గు అయిదు శతాబ్దాల ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం('అంధకరట్టం ') అనేపేరు ఉండేది.

గోదావరీ ఉభయతీరాల్లో ఉన్న ఆంధ్రులు క్రమంగా కృష్ణా గోదావరినదుల మధ్యదేశాన్ని ఆక్రమించినట్లున్నారు .బౌద్ధగ్రంథాల తర్వాతనే మహాభారత రచన, దాని చివరి రూపం సంతరించుకుంది( క్రీ.శ.నాల్గవ శతాబ్దం). దానిలో ఆంధ్రులు క్రిష్ణా గోదావరీ మధ్యదేశాలలో ఉన్నట్లు చెప్పబడింది( అంధ్రకా: కృష్నా గోదావర్యో మధ్యే విద్యమానే దేశ://)

(Ref:తెలుగు చరిత్ర-సంస్కృతి; తెలుగు అకాడామి, హైదరాబాదు,1986) ________________________________
Pl. also see

TELUGU...a language sweeter than honey

_______________________________________

Labels:

Bridge across time SKYLINE

The Anna flyover was then the longest in the country and the third of its kind, writes A.Srivathsan


Early innovation: A view of the flyover near Gemini Circle in Madras the capital of the southern Indian State of Tamil Nadu, as seen in May 1973. The picture shows the construction of the flyover nearing completion.

As early as 1949, the Chennai Corporation proposed two long flyovers. One was to start from Gemini intersection and end at the Island Ground on Mount Road (Anna Salai). The other was proposed from the Traffic and Licensing office on Poonammalee High Road to the Fort station. These were daring ideas and way ahead of their times. For some reason, these serpentine flyovers were never built. However, after 25 years, a part of the original proposal was taken up and a flyover ov er the Gemini intersection was completed.

The Anna flyover was inaugurated on July 1, 1973. It was then the longest flyover in the country and the third of its kind. The two that preceded it were the ones at the Kemps Corner and the Marine Drive in Mumbai.

This 1600 feet long and 48 feet wide bridge was built in 21 months by the East Coast Construction and Industries.

The flyover was built with a bridge deck system that used multiple hollow box slabs made of pre-cast elements. The usage of hollow sections and high lateral distribution of load due to special detailing were patented design ideas and were used here for the first time.

[The Hindu, Property Plus-Chennai, 29:09:2007]
________________________________

Labels:

Friday, September 28, 2007

వాఙ్ఞయం,సారస్వతం, సాహిత్యం

గ్రంథస్ఠాలైన వాటితో పాటూ, వాక్ రూపంలో జీవిస్తున్న సంభాషణలు, ఉపన్యాసాలు,ఉత్తరాలు, ఇవన్నీ వాఙ్ఞయమనే అంటారు. దీనిలో శాస్త్రవాఙ్ఞయమనీ, కావ్య వాఙ్ఞయమనీ
రెండు రకాలుగా విభజంచవచ్చు.

లిఖితమైన లేదా గ్రంథస్థమైన భాగం సారస్వతంగా భావిస్తారు.శాస్త్రగ్రంథాలు, పంచాంగాలు,వార్తపత్రికలు, శాసనాలు ఇవి సారస్వతంగా చెప్పవచ్చు.వాఙ్ఞయంలో సారస్వతం ఒక భాగం.

సహితస్యభావఃసాహిత్యం.హితేనసహితం సాహిత్యం. ధర్మ ప్రతిపాదనం చేసేది, ప్రీతిదాయకమైనది, ఉపదేశాత్మకమైనిది సాహిత్యం.ప్రకృతి సత్యాన్ని సౌదర్యవంతం చేసి, ఆనంద పర్యవసానాలుగ చిత్రించేది సాహిత్యం.

ఈ మూడు పదాలకు ప్రయోగంలో తేడా ఉన్నా సామాన్యులు వాఙ్ఞయ,సారస్వత, సాహిత్య పదాలను పర్యాయ పదాలుగానే ఉపయోగిస్తున్నారు.

[
వాఙ్మయ దర్శిని-ఆచార్య కె.సర్వోత్తమ రావు;
తెలుగు సాహిత్య దర్శనం,క్విజ్-ఎస్.నాగేoద్రనాథ్ రావు]

_______________________________

Labels:

Wednesday, September 26, 2007

10 Easy Arithmatic Tricks

Math can be terrifying for many people. This list will hopefully improve your general knowledge of mathematical tricks and your speed when you need to do math in your head.

1. The 11 Times Trick

We all know the trick when multiplying by ten - add 0 to the end of the number, but did you know there is an equally easy trick for multiplying a two digit number by 11? This is it:

Take the original number and imagine a space between the two digits (in this example we will use 52:

5_2

Now add the two numbers together and put them in the middle:

5_(5+2)_2

That is it - you have the answer: 572.

If the numbers in the middle add up to a 2 digit number, just insert the second number and add 1 to the first:

9_(9+9)_9

(9+1)_8_9

10_8_9

1089 - It works every time.


2. Quick Square

If you need to square a 2 digit number ending in 5, you can do so very easily with this trick. Mulitply the first digit by itself + 1, and put 25 on the end. That is all!

252 = (2x(2+1)) & 25

2 x 3 = 6

625


3. Multiply by 5

Most people memorize the 5 times tables very easily, but when you get in to larger numbers it gets more complex - or does it? This trick is super easy.

Take any number, then divide it by 2 (in other words, halve the number). If the result is whole, add a 0 at the end. If it is not, ignore the remainder and add a 5 at the end. It works everytime:

2682 x 5 = (2682 / 2) & 5 or 0

2682 / 2 = 1341 (whole number so add 0)

13410

Let’s try another:

5887 x 5

2943.5 (fractional number (ignore remainder, add 5)

29435

4. Multiply by 9

This one is simple - to multiple any number between 1 and 9 by 9 hold both hands in front of your face - drop the finger that corresponds to the number you are multiplying (for example 9×3 - drop your third finger) - count the fingers before the dropped finger (in the case of 9×3 it is 2) then count the numbers after (in this case 7) - the answer is 27.


5. Multiply by 4

This is a very simple trick which may appear obvious to some, but to others it is not. The trick is to simply multiply by two, then multiply by two again:

58 x 4 = (58 x 2) + (58 x 2) = (116) + (116) =232


6. Calculate a Tip

If you need to leave a 15% tip, here is the easy way to do it. Work out 10% (divide the number by 10) - then add that number to half its value and you have your answer:

15% of $25 = (10% of 25) + ((10% of 25) / 2)

$2.50 + $1.25 = $3.75


7. Tough Multiplication

If you have a large number to multiply and one of the numbers is even, you can easily subdivide to get to the answer:

32 x 125, is the same as:
16 x 250 is the same as:
8 x 500 is the same as:
4 x 1000 = 4,000


8. Dividing by 5

Dividing a large number by five is actually very simple. All you do is multiply by 2 and move the decimal point:

195 / 5

Step1: 195 * 2 = 390
Step2: Move the decimal: 39.0 or just 39

2978 / 5

step 1: 2978 * 2 = 5956
Step2: 595.6


9. Subtracting from 1,000

To subtract a large number from 1,000 you can use this basic rule: subtract all but the last number from 9, then subtract the last number from 10:

1000
-648

step1: subtract 6 from 9 = 3
step2: subtract 4 from 9 = 5
step3: subtract 8 from 10 = 2

answer: 352


10. Assorted Multiplication Rules

Multiply by 5: Multiply by 10 and divide by 2.
Multiply by 6: Sometimes multiplying by 3 and then 2 is easy.
Multiply by 9: Multiply by 10 and subtract the original number.
Multiply by 12: Multiply by 10 and add twice the original number.
Multiply by 13: Multiply by 3 and add 10 times original number.
Multiply by 14: Multiply by 7 and then multiply by 2
Multiply by 15: Multiply by 10 and add 5 times the original number, as above.
Multiply by 16: You can double four times, if you want to. Or you can multiply by 8 and then by 2.
Multiply by 17: Multiply by 7 and add 10 times original number.
Multiply by 18: Multiply by 20 and subtract twice the original number (which is obvious from the first step).
Multiply by 19: Multiply by 20 and subtract the original number.
Multiply by 24: Multiply by 8 and then multiply by 3.
Multiply by 27: Multiply by 30 and subtract 3 times the original number (which is obvious from the first step).
Multiply by 45: Multiply by 50 and subtract 5 times the original number (which is obvious from the first step).
Multiply by 90: Multiply by 9 (as above) and put a zero on the right.
Multiply by 98: Multiply by 100 and subtract twice the original number.
Multiply by 99: Multiply by 100 and subtract the original number.


Bonus: Percentages

Find 7 % of 300. Sound Difficult?

Percents: First of all you need to understand the word “Percent.” The first part is PER , as in 10 tricks per listverse page. PER = FOR EACH. The second part of the word is CENT, as in 100. Like Century = 100 years. 100 CENTS in 1 dollar… etc. Ok… so PERCENT = For Each 100.

So, it follows that 7 PERCENT of 100, is 7. (7 for each hundred, of only 1 hundred).
8 % of 100 = 8. 35.73% of 100 = 35.73
But how is that useful??

Back to the 7% of 300 question. 7% of the first hundred is 7. 7% of 2nd hundred is also 7, and yep, 7% of the 3rd hundred is also 7. So 7+7+7 = 21.

If 8 % of 100 is 8, it follows that 8% of 50 is half of 8 , or 4.

Break down every number that’s asked into questions of 100, if the number is less then 100, then move the decimal point accordingly.

EXAMPLES:
8%200 = ? 8 + 8 = 16.
8%250 = ? 8 + 8 + 4 = 20.
8%25 = 2.0 (Moving the decimal back).
15%300 = 15+15+15 =45.
15%350 = 15+15+15+7.5 = 52.5

Also it’s usefull to know that you can always flip percents, like 3% of 100 is the same as 100% of 3.

35% of 8 is the same as 8% of 35.

_______________________________

(See:

10 Easy Arithmetic Tricks

http://listverse.com/science/10-easy-arithmetic-tricks/)

_______________________________________

Labels: ,

Monday, September 24, 2007

పక్షులు

[1]చక్రవాకము=the ruddy goose or Brahmany duck, [Anas casarca],కోకము, జక్కన పక్షి.The poetical swan, always described as being in pairs(క్షణ విరహంకూడ సహించలేనవి).


______________________________________

[2]క్రౌంచము=a kind of heron or curlew, [Ardea jaculator ]కొంచపిట్ట, ఒకవిధమగు కొంగ

[కీ.శే.బూదరాజు రాధాకృష్ణగారి "మాటల మూటలు" లోని 'పక్షి సంతతి ' అధ్యాయంనుండి ఈ క్రింది అంశం, ఆసక్తిదాయకంగా ఉందని, ఎత్తి రాయబడింది:-
"మన పరిసరాల్లో కనిపించే మరో పక్షి
కొంగ. ఈ తెలుగు మాటకు 'కొక్కెర, కొక్కెరాయి, పుల్లగొరక, గుండగి ' మొదలైన పేర్లున్నాయి. 'పెద్ద కొక్కెర, తెల్లకొక్కెర,గుడ్డికొంగ, చీకుకొక్కెర, పక్కు కొంగ, గుడి కొంగ, దోసికొంగ, సినిగలకొంగ, సంకుబుడ్డి కొంగ ' వంటి భేదాలున్నాయి.

'
కొంచ ' అనే తద్భవనామముంది. అది క్రౌంచ/క్రుంచ శబ్దభవం- అంటే వంగిన, మెలికలు తిరిగిన (మెడగలది) అనే అర్థంలోనన్నమాట.

'బకం,
సారసం, క్రౌంచం, లోహపృష్థం ' అనే సంస్కృత పదాలు పర్యాయ పదాలు.వీటిలో మొదటిదే సాధారణ పదం.సరస్సుల్లో ఉంటుంది కాబట్టి సారసమన్నారు.వంపు మెడగలది కాబట్టి క్రౌంచం.కట్టెల్లాంటి కాళ్ళున్నది కాబట్టి లోహపృష్ఠం.ష్థం బకమంటే మోసకారి, దొంగ అని విశేషార్థం.'కొంగజపం ' వల్ల ఈమాట పుట్టింది.పెద్ద కొక్కెరను బిసకంఠిక, బలాకం అంటారు. కొక్కెరను కృకణం, క్రకరం అంటారు.గుడ్డి కొంగను కోయష్టికం అంటారు.పక్కు కొంగను కహ్వ మంటారు, సంస్కృతంలో. " ]
________________________________________



[3]చకోరకము/చకోరము
=వెన్నెలపులు(గు, the bartavelle or Greek parridge: a bird much referred to in poems:corresponding to the nightingale, or turtle dove (చంద్రకిరణములకు చకోరపక్షులు ఏ విధముగా నిరీక్షించుకొనియుండునో)
____________________________________

(చాతక పక్షులు= తలకిందులుగా ఎగురుతూ వెన్నెలనో మంచు బిందువుల్నో మాత్రమే తాగి బతికే పక్షులు,వాన కోయిల )
_____________________________________

Labels:

A BRIDGE TOO FAR


The Lord surveyed the Ram Setu and said "Hanuman, how diligently and strenuously you and your vanara sena had built this bridge several centuries back. It is remarkable that it has withstood the ravages of the climatic and geographical changes over centuries. It is indeed an amazing feat especially considering the fact that a bridge at Hyderabad built by Gammon using latest technology collapsed the other day even before they could stick the posters on its pillars."

Hanuman with all humility spoke "Jai Sri Ram, it is all because of your grace. We just scribbled your name on the bricks and threw them in the sea and they held. No steel from TISCO or cement from Ambuja or ACC was ever used. But Lord, why rake up the old issue now."

Ram spoke "Well, Hanuman some people down there want to demolish the bridge and construct a canal. The contract involves lot of money and lot of money will be made. They will make money on demolition and make more money on construction. "

Hanuman humbly bowed down and said "Why not we go down and present our case? "

Ram said "Times have changed since we were down there. They will ask us to submit age proof and we don't have either a birth certificate or school leaving certificate. We traveled mainly on foot and some times in bullock carts and so we don't have a driving license either. As far as the address proof is concerned the fact that I was born at Ayodhya is itself under litigation for over half a century, If I go in a traditional attire with bow and arrow, the ordinary folks may recognize me but Arjun Singh may take me to be some tribal and, at the most, offer a seat at IIT under the reserved category. Also, a God cannot walk in dressed in a three-piece suit and announce his arrival. It would make even the devotees suspicious. So it is dilemma so to say."

"I can vouch for you by saying that I personally built the bridge."

"My dear, Anjani putra, it will not work. They will ask you to produce the lay-out plan, the project details, including financial outlay and how the project cost was met and the completion certificate. Nothing is accepted without documentary evidence in India. You may cough but unless a doctor certifies it, you have no cough. A pensioner may present himself personally but the authorities do not take it as proof. He has to produce a life-certificate to prove that he is alive. It is that complicated."

"Lord can't understand these historians. Over the years you have given darshan once every hundred years to saints like Surdas, Tulsidas, Saint Thyagaraja, Jayadeva, Bhadrachala Ramdas and even Sant Tukaram and still they disbelieve your existence and say Ramayana is a myth. The only option, I see, is to re-enact Ramayana on earth and set the government records straight once for all."

Lord smiled "It isn't that easy today. Ravan is apprehensive that he may look like a saint in front of present day politicians. I also spoke to his mama Mareecha, who appeared as a golden deer to tempt Sita maiyya when I was in the forest and he said that he won't take a chance of stepping on earth as long as Salman Khan is around."

(an email forward)
__________________________________

Labels:

Sunday, September 23, 2007

చరిత్రలో ఈ వారం

సెప్టెంబరు 23
1846: ఫ్రెంచ్‌ ఖగోళశాస్త్రవేత్త అర్బెయిన్‌ జీన్‌జోసెఫ్‌ లీ వెర్రియర్‌, బ్రిటన్‌ శాస్త్రవేత్త జాన్‌కౌచ్‌ ఆడమ్స్‌ అంచనాల మేరకు ఖగోళాన్ని పరిశోధించి నెప్ట్యూన్‌ గ్రహ ఉనికిని కనుగొన్నారు. నిజానికి అంతకు రెండు దశాబ్దాల ముందర 1612 డిసెంబరు 18న ఒకసారీ 1613లో మరొకసారీ గెలీలియో గెలీలీ నెప్ట్యూన్‌ను టెలిస్కోపులో చూశాడు. కానీ దాన్ని ఆయన గ్రహం అనుకోలేదు. ఓ స్థిర నక్షత్రం అనుకుని ఊరుకొన్నాడు. తర్వాత ఆ విషయం మరుగున పడిపోయింది. 1843లో జాన్‌కౌచ్‌ ఆడమ్స్‌ దీనిపై పరిశోధన చేసి వేరేగ్రహానికి(అదే నెప్ట్యూన్‌) సంబంధించిన కక్ష్యను యురేనస్‌ ఖాతాలో వేశారని వివరించాడు. అయితే, తన వాదనను బలపరిచే ఆధారాలు చూపించలేక మిన్నకుండిపోయాడు. 1846లో లీ వెర్రియర్‌ అదే విషయాన్ని కనుగొన్నాడు. అయితే బౌచర్‌లా ఊరుకోక బెర్లిన్‌ అబ్జర్వేటరీ డైరెక్టర్‌ గాట్‌ఫ్రైడ్‌ గల్లె సాయం అర్థించాడు. గల్లె తన వేధశాలలో టెలిస్కోపు ద్వారా సెప్టెంబరు 23న నెప్ట్యూన్‌ గ్రహాన్ని చూసి దాని ఉనికిని నిర్ధరించాడు. వెుదట్లో దాన్ని లీ వెర్రియర్‌ ప్లానెట్‌ అని పిలిచారు. జానుస్‌, హెర్షెల్‌, జార్జియన్‌ వంటి శాస్త్రవేత్తల పేర్లను పరిశీలించారు. కానీ దాన్ని కనుగొన్న వెర్రియర్‌ సూచన ప్రకారం రోమన్‌ సముద్రదేవత నెప్ట్యూన్‌ అనే పేరునే చివరకు ఖాయం చేశారు.

సెప్టెంబరు 24

622: మక్కా నుంచి బయలుదేరిన మహమ్మద్‌ ప్రవక్త యాత్ర(హిజ్రా) మదీనాకు చేరుకోవడంతో ముగిసింది.

సెప్టెంబరు 28

1838: వెుఘల్‌సామ్రాజ్యపు ఆఖరు చక్రవర్తి రెండో బహదూర్‌షా జఫర్‌ సింహాసనాన్ని అధిష్టించాడు. అప్పటికి ఆయనకు అరవైరెండు ఏళ్లు. 1857 సెప్టెంబరు 14 దాకా అధికారంలో ఉన్న బహదూర్‌ను సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో నిర్బంధించారు. ఆయన ఇద్దరు కొడుకుల్నీ మనవణ్నీ కళ్లెదుటే నరికి చంపారు. అనంతరం ద్వీపాంతరవాసం పేరిట ఆయన్ను రంగూన్‌(బర్మా)కు తరలించారు. జీవితాంతం అక్కడే ఉన్న బహదూర్‌షా చివరికి ఆ గడ్డపైనే కన్నుమూశాడు. అలా 1526లో బాబరుతో వెుదలై మూడుశతాబ్దాల పైబడి సాగిన వెుఘలుల పాలన బహదూర్‌షాతో అంతమైంది.

సెప్టెంబరు 29

1981: తమ నాయకుడు సంత్‌ భింద్రన్‌వాలేను విడుదల చేయడంతోపాటు, 5లక్షల అమెరికన్‌ డాలర్లు ఇవ్వాలనే డిమాండ్లతో ఆరుగురు ఖలిస్తాన్‌ తీవ్రవాదులు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేశారు. అందులో 111మంది ప్రయాణికులు, ఆరుగురు విమానసిబ్బంది ఉన్నారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ వైపు వెళ్తున్న ఆ బోయింగ్‌737 విమానాన్ని లాహోర్‌కు దారిమళ్లించారు. హైజాక్‌కు వారు ఉపయోగించిన ఆయుధాలు డాగర్లు. అయితే అక్కడ పాకిస్థానీ కమాండోలు పారిశుధ్యకార్మికులుగా విమానంలోకి వెళ్లి హైజాకర్లను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు.
(Eenadu, 23:09:2007)
_____________________________

Labels:

యద్భావం తద్భవతి!


- డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు
ఒక సన్యాసి, దేవుడి కోసం తపస్సు చేశాడు. అతడి దీక్ష ఫలించి దేవుడు ప్రత్యక్షమై- మూడుసార్లు అతను మనసులో ఏది తలచుకుంటే అదే జరుగుతుందనే వరమిచ్చాడు. వెంటనే ఆ సన్యాసి సకల సదుపాయాలతో ఒక రాజభవనం లాంటి భవంతి కావాలనుకున్నాడు. వెంటనే భవంతి ప్రత్యక్షమయింది. అందమైన యువతితో వివాహం జరగాలి అనుకున్నాడు. అదీ జరిగింది. ఒక్కసారిగా సంప్రాప్తించిన సుఖభోగాలకు తట్టుకోలేని ఆ వ్యక్తి 'కొంపదీసి ఇవన్నీ మాయమవుతాయా!' అనుకున్నాడు. అంతే, తక్షణం ఆ సన్యాసి తన పూర్వపు స్థితికి వచ్చేశాడు.

మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఫలితాలు అలానే ఉంటాయనేది ఈ కథలోని నీతి.

ఈ భావాన్నే శ్లోకం రూపంలో 'యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాతృశి' అన్నారు వేదాంతులు.

మృతుల్ని బతికించే మృత సంజీవనితోపాటు పిచ్చిమొక్కలు, విషపుమొక్కలు కూడా నేలతల్లినుంచే ఉద్భవిస్తాయి. అలాగే మంచి ఆలోచనలతోపాటు చెడుతలంపులకూ మానసిక క్షేత్రమే కేంద్రబిందువు. మంచి ఆలోచనలు ఆచరణలో పెడితే మానవాళికి మహోపకారం. చెడు ఆలోచన కలిగించే ఫలితాలతో మానవాళికి మారణహోమం. ఒక మంచి తలంపు మనిషికి జీవం పోస్తే ఒక చెడు ఆలోచన ప్రాణం తీస్తుంది. మంచి ఆలోచనల విలువ అపారం. అది వెలకట్టలేనిది.

ఒక వూళ్ళో పాపయ్య, పోచయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిని మించి ఇంకొకరు గొప్పవాళ్ళయిపోవాలనే దురాశతో దేవుడు ప్రత్యక్షం కావడం కోసం దీక్ష చేపట్టారు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మన్నాడు, ముందుగా పాపయ్యను. తన శత్రువు పోచయ్య ఏం కోరుకుంటాడో దానికి రెట్టింపు ఇమ్మన్నాడు పాపయ్య. తరవాత దేవుడు పోచయ్యకు ప్రత్యక్షమయ్యాడు. పాపయ్య కోరుకున్నదేమిటో తెలుసుకొని పోచయ్య తన కన్ను ఒకటి తీసెయ్యమన్నాడు. అలా తన శత్రువైన పాపయ్య రెండుకళ్ళు పోగొట్టాడు పోచయ్య. మనం చెడిపోయినా ఫరవాలేదు, తోటివాడు మాత్రం బాగుపడకూడదనే పాశవిక ఆలోచనలు ఎంతటి దుష్ఫలితాలు కలిగిస్తాయో ఈ కథ తెలియజేస్తుంది. 'చెరపకురా చెడేవు' అనే సామెత ఇలాగే పుట్టింది.

మనం ఇతరులకు ఏమి ఇస్తామో, అదే మనకు దక్కుతుంది. ఆనందం ఇస్తే ఆనందం, బాధ కలిగిస్తే బాధ. ఈ లోకం నుంచి ఏది కావాలని కోరుకుంటామో అదే లోకానికి ఇవ్వాలి. మనం కోరుకున్నదే మనకు దక్కుతుంది. 'యద్భావం తద్భవతి'. మనం శుభం జరగాలని మనసా వాచా కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. అంచేత అందరికీ మంచే జరగాలని కోరుకుందాం. సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.
సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు!
(Eenadu, 23:09:2007)
_________________________

Labels: ,

దాత మనసు

- ఎర్రాప్రగడ రామకృష్ణ
దానగుణంగల వ్యక్తులను మన పెద్దలు మూడు రకాలుగా వర్గీకరించారు. మొదటివాడు దాత. అవసరానికి ఆదుకోవాలని ఎవరైనా వచ్చి అడిగితే కాదనకుండా తృణమో పణమో ఇచ్చి పంపేవాడు దాత. రెండోవాడు ఉదారుడు. అడిగినవారి అవసరాన్ని చక్కగా గుర్తించి, అడిగినదానికన్నా కాస్త ఎక్కువ ముట్టజెప్పి మరీ పంపేవాడు ఉదారుడు.

ఇక వదాన్యుడు అనే మూడోస్థాయి వ్యక్తి- అవతలవాడు అడిగేదాకా కూడా చూడకుండా, అవసరం వచ్చిందని, లేదా ఆపద వాటిల్లిందని తెలియగానే అయాచితంగా చేతనైనంతా చేసేస్తాడు.

దానగుణం కలవాడి స్వభావం ఎలా ఉంటుందో, అలాంటి వ్యక్తికి కలిగే ఆనందం ఎలాంటిదో తెలిపే కథ ఇది. ఆ ఇంటి యజమాని ఉత్తముడు, సజ్జనుడు. ఆయనకు చాలాకాలంగా రావలసిన పెద్ద మొత్తం ఒకటి చేతికి అందేలా ఉందని తెలిసింది. దానితో ఇంటికి రిపేర్లు చేయించాలని ఆయన అనుకున్నాడు. తనకు నెక్లెస్‌ చేయించుకోవాలని భార్య ఆశపడింది. స్కూటర్‌ కొనుక్కుందామని కొడుకు అనుకున్నాడు. అనుకున్నరోజు రానే వచ్చింది. ఎదురుచూపులు ఫలించాయి.

ఇంటి యజమాని వెళ్ళి రావలసిన డబ్బు వసూలు చేసుకుని తిరిగి వస్తుండగా, అనుకోని సంఘటన ఎదురైంది. దారిలో ఒక తల్లి తన పసిబిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుని హృదయవిదారకంగా ఏడుస్తోంది. మాయదారి రోగమేదో వచ్చిందని, తన బిడ్డకు ఆపరేషన్‌ చేస్తేగాని ప్రాణం దక్కదని, తనకి సహాయం చేయమని ఆ తల్లి రోదిస్తోంది. అన్నెంపున్నెం ఎరుగని అమాయకమైన ఆ పసిబిడ్డ మొహం చూస్తే ఈ ఇంటి యజమానికి మనసు కరిగిపోయింది. ఇంటి మరమ్మతులా, ప్రాణమా అని ఒక్కక్షణం ఆలోచించాడు. చేతిలో డబ్బంతా ఆ తల్లికి ఇచ్చేశాడు. నిర్వికారంగా ఇంటికి తిరిగి వచ్చాడు.

జరిగినదంతా విని ఆయన భార్య మొదట నిరాశ పడింది. భర్తను ఏమీ అనలేదు. కొడుకుమాత్రం తండ్రిపై విరుచుకుపడ్డాడు. 'మనమేమంత ధనవంతులమని ఇలా దానధర్మాలు చేయడానికి' అంటూ తండ్రిపై అక్కసు వెళ్ళగక్కాడు. అరిచేశాడు. ఆఖరికి తల్లి జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇది జరిగిన రెండు రోజులకు పేపర్లలో ఒక వార్త వచ్చింది. రోడ్డుమీద ఆనాడు ఎదురైన స్త్రీ మోసగత్తె అనీ, ఆమె బిడ్డకు ఎటువంటి రోగమూ లేదని, ఆరోగ్యవంతురాలైన కూతుర్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ, ఆ తల్లి మోసం చేసి డబ్బు సంపాదిస్తోందని, ఎవరో ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు తల్లీబిడ్డలను అరెస్టు చేశారని- దాని సారాంశం.

అది చదవగానే కొడుక్కి పట్టరానికోపం వచ్చేసింది. తన తండ్రి చేసిన 'అపాత్రదానం' గుర్తించి, ఆవేశంతో దూసుకువచ్చాడు. అయితే అదే సమయానికి తండ్రికీ ఆ వార్త తెలిసి, రెండు చేతులూ జోడించి భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ కంట ఆనందబాష్పాలు రాలుస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్న తండ్రిని చూసి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు తల్లి చెప్పింది- ''నాయనా! ఆ పసిపిల్లకు ఏ రోగమూ లేదని తెలిసి, నీ తండ్రికి అంత ఆనందం కలిగింది. ఆమె ఆరోగ్యం కోసమే కదా డబ్బు దానం చేసినది. ఆ డబ్బు ఆపరేషన్‌కు సరిపోయేదో లేదో, ఆపరేషన్‌ జరిగినా పూర్తి ఆరోగ్యం కలిగేదో లేదో- ఆ స్థితికన్నా అసలంటూ ఎలాంటి అనారోగ్యమే లేని స్థితి ఆ పిల్లది- అనే నిజం తెలిసి నీ తండ్రి ఆనందంతో దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారయ్యా'' అని.

అది ఏస్థాయి ఆనందమో, ఆ స్థాయి ఆనందాన్ని సాధించిన మనిషిని దాత అనాలో, ఉదారుడనాలో, వదాన్యుడనాలో... ఇంకా వేరే ఏ పెద్దపదంతో పిలవాలో మీరే చెప్పండి!
(Eenadu, 20:09:2007)
______________________________

Labels: ,

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

గ్యాస్‌ వ్యాపారం మంచిదా? జ్యూస్‌ వ్యాపారం మంచిదా?
-ఎం. విజయలక్ష్మి, బోధన్‌
చెప్పేది 'గ్యాస్‌' అయినా, వినేవాడికి 'జ్యూస్‌'లా ఉంటే ఏ వ్యాపారమైనా భేషుగ్గానే ఉంటుందమ్మా.

వినాయకుడు వ్యాపారం మొదలెడితే, మనకూ ఆయనకూ తేడా ఉంటుందంటారా?
-కాశీభట్ల రాజగోపాలం, రాజోలు
కచ్చితంగా ఉంటుంది. మనమైతే నాలుగు రాళ్లు వెనకేసుకుంటాం. ఆయనైతే నాలుగు ఉండ్రాళ్లు ముందేసుకుంటాడు.

వ్యాపారులంతా ఒక్కసారిగా వేదాంతులైపోతే...
-బి. శ్రీకాంత్‌, బరంపురం
ఇక ప్రతి మాల్‌లోనూ కనిపించేవి
రుద్రాక్షమాలలే.

నేటి విలాస పురుషుడే...
-వల్లూరి గోవిందరావు, శివకోడు
రేపటి
'లాస్‌' పురుషుడు

'టైమ్‌' బాగాలేకపోతే?
- ఎన్‌. సుధాకర్‌, గంపలగూడెం.
టైటాన్‌ కంపెనీ కూడా ఘడియలు లెక్కెట్టుకోవాల్సిందే

బిచ్చగాళ్లు రిటర్న్స్‌ ఫైల్‌ చేస్తే
-ఎం.శ్రీనివాస్‌, కాకినాడ
హ్యాపీ 'రిటర్న్స్‌' చెప్పాలి. అయినా మీకు తెలియదా, ఏమిటీ...! ఆడవాళ్ల వయసు, బిచ్చగాళ్ల సంపాదన అడగకూడదు కదా!

పైకి రావాలంటే ఏ పరిశ్రమ మంచిది?
- యెండూరి రమేష్‌, తాటిపాక
'పట్టు'పరిశ్రమ

కవ్విస్తే ఏంచేస్తారు?
-ఎన్‌. గోపాలరావు, నిజామాబాద్‌
cow ఇస్తే ఎవరైనా ఏం చేస్తారు. పాలు పంచుకుంటారు లేదా పాలవ్యాపారం చేసుకుంటారు. అయినా మీ 'పాల'బడ్డప్పటి సంగతి గదా!

ఇంటర్‌ చదివాను. వ్యాపారంలో ఎలాగైనా నెట్టుకు రావాలంటే ఏం చేయాలి?
- ఎస్‌. శ్రీహర్ష, ఏలూరు
'ఇంటర్‌'నెట్టును నమ్ముకుంటే సరి!

అబద్ధాలు చెబితే వ్యాపారం దెబ్బతింటుందా?
- కె. గోపీనాథ్‌, చిత్తూరు
మీరు చెప్పేవి అబద్ధాలని ఎదుటివారికి తెలిస్తే దెబ్బతింటుంది.

ప్రపంచ బ్యాంకు తలతాకట్టు పెట్టించుకుంటుందా?
-పి. అనూరాధ, గూడూరు
'
నేతల తాకట్టు' పెట్టించుకుంటుంది.

ఎఫ్‌ఎమ్‌ రేడియోల భవిష్యత్తు ఎలా ఉండొచ్చంటారు?
-కె.రాధారాణి, సింగరాయకొండ
'విను'యోగదారుల మీద ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కంప్యూటర్‌ వ్యాపారం ప్రత్యేకత ఏమిటో?
-గోవిందవఝ్ఝల విశ్వనాథ శర్మ, ముంగండ
ఏముంది... అంతా ఒక
'సిస్టమ్‌' ప్రకారం సాగడమే.
(Eenadu, 23:09:2007)
_____________________________

Labels:

తక్కువైనా ఇబ్బందే

ఏ దేశ ప్రగతి అయినా అక్కడి ప్రజల శక్తియుక్తులపై ఆధారపడి ఉంటుంది. సహజవనరులు, సంపదలు ఎన్ని ఉన్నా ప్రజల్లో చైతన్యం, కష్టించి పనిచేసే మనస్తత్వం లోపించినప్పుడు ఏ దేశమూ అభివృద్ధి సాధించలేదు. కర్షక సోదరులు హలాలను చేతబట్టి పొలాలను దున్నుతూ విరామమెరుగక పరిశ్రమించినప్పుడే బంగారు పంటలు పండుతాయి. పాడిపంటలతో దేశం సుభిక్షంగా ఉంటుంది. కార్మికులు యంత్రాల కోరలు తోమి వాటిని పరుగులు పెట్టిస్తేనే పరిశ్రమలు వర్ధిల్లుతాయి. దేశంలో సంపద పెరుగుతుంది. అన్ని సంపదలకన్నా జనసంపదే ముఖ్యం. అందుకే- ''దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌...'' అన్నారు మహాకవి గురజాడ. దేశంలాగానే కుటుంబాలూ. ఇల్లూ వాకిళ్ళూ, సిరిసంపదలు ఎన్ని ఉన్నా సంతాన సౌభాగ్యం లేకపోతే అవేవీ రాణించవు. ఇంట్లో పిల్లలు, తోటల్లో పిట్టలు ఉంటేనే వారి సందడితో ఆయా ప్రదేశాలు కలకలలాడుతూ ఉంటాయి. ''సకలైశ్వర్య సమృద్ధులు నొకతల సంతానలాభమొకతల'' అన్నాడు శ్రీనాథ మహాకవి. భాగ్యానికి పేద అయినా సంతాన సౌభాగ్యానికి పేద కాడు కుచేలుడు. పిల్లల్ని పోషించలేక అవస్థ పడినప్పటికీ ఆ సంతానంవల్లే అదృష్టం కలిసొస్తుంది కుచేలుడికి. దరిద్రంతో బాధపడుతూ పిల్లలను పోషించటానికి వేరే మార్గం కనపడక బాధపడుతున్న కుచేలునికి తన బాల్యస్నేహితుడు శ్రీకృష్ణుడు జ్ఞాపకం వస్తాడు. కేవలం గుప్పెడు అటుకులకే ఆనందపడిపోయిన కృష్ణుడు కుచేలునికి సకలసంపదలూ ప్రసాదిస్తాడు.

పరిచయస్థులు ఎదురుపడినప్పుడు ''సుఖమె మనవారెల్ల సూరయ్యగారు అకలంక చరితులె అమిత బంధువులు'' అన్న కుశల ప్రశ్నలతో ప్రారంభించి, ''వరిపంటలేపాటి వర్షమేపాటి'' అని ఆరాలడిగి ఆ వెంటనే- ''పిల్లేది మీ చిన్న పిల్లవాడేడి...'' అని ప్రస్తావించటం పరిపాటి. పూర్వకావ్యాల్లో పురవర్ణనలే కాక అక్కడి పౌరుల వర్ణనలూ విధిగా ఉండేవి. ''ఇంద్రప్రస్థపురంబు భాసిలు రమా హేలాకళావాసమై'' అంటూ పాండవుల ఏలుబడిలో ఉన్న ఇంద్రప్రస్థపురాన్ని వర్ణిస్తాడు విజయవిలాస కావ్యకర్త. ''కడమాటు పగవానిగని చేమరచెనంచు భార్గవు మెచ్చరు బాహుజనులు, పనికిరాకొకమూల బడియెనాతని వస్తువని కుబేరుని మెచ్చరర్య జనులు...'' అంటూ ఆ నగరంలోని ప్రజల ఔన్నత్యాన్నీ విశదపరుస్తాడు. నాలుగు శతాబ్దాల క్రితం మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించినప్పుడు- ''ప్రభూ! చెరువునిండా చేపలు నిండినట్లు నా నగరమంతా మనుషులతో నిండిపోయేటట్లు అనుగ్రహించు'' అని దేవుణ్ని ప్రార్థించాడంటారు. ఇప్పుడు హైదరాబాద్‌ మనుషులతో నిండిపోవటమే కాదు, జనంతో కిటకిటలాడిపోతోంది. ప్రస్తుతం ప్రపంచం అధిక జనాభా సమస్యతో బాధపడుతోంది. ప్రతి రెండు సెకండ్లకు ప్రపంచంలో ఒక కొత్తవ్యక్తి పుట్టుకొస్తున్నట్లుగా గణాంక వివరాలు చెబుతున్నాయి. కొన్ని దేశాలు అధిక జనాభాతో సతమతమవుతుంటే మరికొన్ని దేశాలు జనం తక్కువై బాధపడుతున్నాయి.

''గర్జించు రష్యా గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, దౌర్జన్యరాజ్యం ధ్వంసించు రష్యా-'' అంటూ రెండో ప్రపంచ యుద్ధకాలంలో మహాకవి శ్రీశ్రీ నినదించారు. నాజీ నియంత హిట్లర్‌ ఆగడాలను అరికట్టటంలో రష్యన్‌ ప్రజలు చరిత్రాత్మక పాత్ర పోషించారు. తమ ధైర్యసాహసాలతో ప్రపంచ ప్రజల మన్ననలందుకొన్నారు. అటువంటి రష్యా ఇప్పుడు జనాభా తక్కువై కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. రష్యాలోని జనాభా సంవత్సరానికి ఏడు లక్షల చొప్పున తగ్గిపోతున్నట్లుగా గణాంక నిపుణులు లెక్కలు చెబుతున్నారు. ఈ పరిణామం రష్యా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువమంది పిల్లలను కనమని ప్రజలను ఉద్బోధిస్తూ అక్కడి ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెడుతోంది. 'కావాలంటే సెలవులిస్తాం, వాటితోపాటు బహుమతులూ ఇస్తాం' అంటోంది. రెండో బిడ్డ లేదా అంతకుమించి పిల్లలను కన్న తల్లులకు నగదు బహుమతులిస్తున్నారు. యుల్యానోవిక్‌ రాష్ట్ర గవర్నర్‌ సెర్జిమోరజోవ్‌ పెళ్ళయిన జంటలకు ప్రతి బుధవారాన్ని సెలవుదినంగా ప్రకటించాడు. ఆ రోజుకు 'ఫామిలీ కాంటాక్ట్‌ డే' అని నామకరణం చేశారు. రష్యన్‌ జాతీయదినం జూన్‌ 12న పిల్లలను కనే జంటలకు ప్రత్యేక బహుమతులిస్తున్నారు. ఈ బహుమతుల పథకం విశేషంగా జనాన్ని ఆకర్షించగలదని, ఫలితంగా రష్యా జనాభా గణనీయంగా పెరగగలదనీ ప్రభుత్వం ఆశపడుతోంది. 'జనాభా క్షీణత క్రమేపీ తగ్గి 2015 సంవత్సరానికల్లా స్థిరంగా ఉంటుందని మా ఆశ' అంటున్నారు రష్యా ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి. రాబోయే కాలంలో రష్యా కొత్త జనాభాతో ధగధగలాడుతుందేమో చూడాలి!
(Eenadu, 23:09:2007)
_______________________________

Labels:

'నెనరు ' అంటే ................

'నెనరు ' అంటే కృతజ్ఞత,ప్రేమ,దయ,చనవు
అనే అర్థాలను ఈ క్రింద చూపిన నిఘంటువులు రూఢి చేస్తున్నాయి.

నెనరు= 1.కృతజ్ఞత 2.ప్రేమము (శబ్దరత్నాకరము-బ.సీతారామాచార్యులు) (వాడుకతెలుగు పద కోశం-ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి)

నెనరు= gratitude;love;freedom;kindness (బాలసరస్వతి తెలుగు ఇంగ్లీషు డిక్షనరి-డా.దాశరథి)

నెనరు= affection,love.ప్రేమ. gratitude,కృతజ్ఞత.(బ్రౌన్ తెలుగు ఇంగ్లీష్ నిఘంటు)

నెనరు= ప్రేమ,స్నేహం; వలపు,మోహం; దయ,కనికరం; మచ్చిక,చనవు; ప్రేమాస్పదం; కృతజ్ఞత.(నడుపల్లి పాఠశాల నిఘంటువు-ఎన్.ఎస్.రాజు)
___________________________________
శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రకారం:-
నెనరు=
(విశేష్యము)
[1]ప్రేమము, స్నేహము
[2](స్త్రీపురుషుల) వలపు, మోహము
[3]మచ్చిక, చనవు
[4]దయ, కనికరము

(విశేషణము)
[1]ప్రియము, ప్రేమాస్పదము
[2]కృతజ్ఞుడు, విశ్వాసము కలవాడు
సీ.దీవెనల్ వినయవిధేయత తోడ( జేకొనుచును వెండియు నెనరు దొరలు.
___________________________________________
Thank=అభినందన,కృతజ్ఞత,ధన్యవాదం(ఆధునిక వ్యవహార కోశం-బూదరాజు రాధాకృష్ణ,ప్రాచీ పుబ్లికేషన్స్, హైదరాబాదు,సం.2003)+నెనరు
_______________________________

Labels: