My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, January 07, 2009

The Top Ten of everything!


































(An email forward)
_______________________________________________

Labels:

Tuesday, January 06, 2009

ఆకాశంలో అద్భుతం!


సీత జాడ వెతుకుతూ లంకలో ప్రవేశించిన హనుమంతుడికి నిద్రపోతున్న రావణాసురుడు కంటపడ్డాడు. రావణుడు ఎలా ఉన్నాడో చెబుతూ- మాషరాశి ప్రతీకాశం... మినుముల కొండలా ఉన్నాడని వాల్మీకి వర్ణించాడు. ఆ పోలికలో ఒక విశేషం ఉంది. మినుములు దేహానికి బాగా పటుత్వాన్నిస్తాయి. మినపసున్ని దానికి ఉదాహరణ. ఇనుము లోపంతోనో, కీళ్ళనొప్పులతోనో బాధపడేవారిచేత మన పెద్దలు మినుములు దానం చేయించడంలో రహస్యం అదే! అయితే మినుములు తింటే బుద్ధి క్షీణిస్తుంది. శరీర దారుఢ్యం బాగా ఉన్నవాడేగాని, సీతాపహరణం విషయంలో మాత్రం రావణుడు బుద్ధితక్కువగా ప్రవర్తించాడని అందులో ధ్వని. సముద్రాన్ని దాటేటప్పుడు చారణామార్గంలో వెళ్ళాడని హనుమ గురించి వాల్మీకి చేసిన వర్ణన యోగశాస్త్ర సంబంధిత సూచన. తిరిగి వచ్చేటప్పుడు నక్షత్రాల ప్రస్తావన- జ్యోతిషశాస్త్ర ప్రకర్ష. ఆవిధంగా శాస్త్ర పాండిత్యాన్ని కవిత్వంలో ప్రదర్శించగలవారిని పండితకవులనడం పరిపాటి. కావ్య గౌరవాన్ని శాస్త్ర పాండిత్యం అనేక రెట్లు పెంచుతుంది. వ్యాస మహర్షి భారతంలో ప్రదర్శించిన అపార శాస్త్రజ్ఞతను పండితలోకం విశేషంగా ప్రశంసించింది. భారతాన్ని సర్వశాస్త్ర సంగ్రహంగా నన్నయ వర్ణించాడు. శిశుపాలుని ఆగడాలను నారదుడి ద్వారా విని శ్రీకృష్ణుడు కుపితుడు కాగా భృకుటి ముడిపడింది. అలా ముడిపడిన కనుబొమను మాఘకవి 'ధూమకేతువులా ఉంది' అన్నాడు. తోకచుక్క ఆకారాన్ని మనం గుర్తు చేసుకుంటే- ఆ పోలికలోని సొగసు బోధపడుతుంది. తోకచుక్క వినాశకారి అని ప్రతీతి. అది కనపడితే ప్రజలు ఇప్పటికీ అశుభమని భావిస్తారు. కృష్ణుడి నుదుట పొడిచిన తోకచుక్క శిశుపాలుడి పాలిట యమపాశంగా మాఘుడు సూచించాడన్నమాట.

కావ్యంతో మాఘుడి జ్యోతిష శాస్త్ర ప్రావీణ్యం లోకానికి వెల్లడైంది. మాఘం(శిశుపాలవధ)లోని శాస్త్ర రహస్యాలను, మేఘం (కాళిదాసు మేఘసందేశం)లోని ధ్వని విశేషాలను గ్రహించేసరికి తన బతుకు తెల్లారిపోయిందన్నాడు- మల్లినాథ సూరి! సారావళిలో కల్యాణవర్మ మాదిరిగానే- శిశుపాలవధలో మాఘుడు ప్రస్తావించిన అనేక యోగాల్లో దురుధరాయోగం ప్రధానమైనది. దేవ గురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రుడు ఒకే రాశిలో చంద్రుడితో కలిసి ఉంటే ఆ జాతకుడు విశేష భాగ్యవంతుడవుతాడని జాతకాభరణంలో డుంఢిరాజు వర్ణించాడు. చంద్రునికి ఇరువైపులా అటు పన్నెండో ఇంట్లోను, ఇటు రెండో ఇంట్లోను శుభగ్రహాలుంటే అది దురుధరాయోగమని జ్యోతిష శాస్త్ర పరిభాష! శిశుపాలుడి దుండగాల గురించి చర్చిస్తూ... అటూ ఇటూ ఉద్దవుడు, బలరాములతో కృష్ణుడు వస్తుంటే- గురు శుక్రులతో కలిసిన చంద్రుడిలా ఉన్నాడంటాడు మాఘుడు. శ్రీకృష్ణుడు చంద్రవంశీయుడన్న ధ్వని అలా ఉంచి, అది శుభయోగం, కనుక వారి ఆలోచన ఫలిస్తుందని మాఘుడి సూచన. అలాగే రాజసూయ యాగసభకు వస్తుంటే కృష్ణుణ్ని భీమార్జునులు ఇరువైపులా అనుసరించారు. 'యోగం... ఉభయ గ్రహాంతర స్థితికారితం... దురుధరాఖ్యం ఇందునా...' అని మాఘుడు వర్ణించాడు. గురువు, శుక్రుడు, చంద్రుడు- ఈ శుభగ్రహ త్రయ యోగాన్ని 'శ్రేష్ఠవృత్తి యోగం' అని మరికొందరంటున్నారు. ఇదంతా జ్యోతిష శాస్త్ర పాండిత్య ప్రకర్షకు నిలువుటద్దం. మన కవుల అపార కృషికి నిదర్శనం.


జ్యోతిషం శాస్త్రమవునా కాదా, నమ్మవచ్చా లేదా- అనే వాదనను పక్కన పెడితే... పూర్వకవుల విశేష శాస్త్ర పరిజ్ఞానాన్ని, వారి కల్పనలలోని గొప్ప వూహాశాలితను మనం అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు ఉపకరిస్తాయి. ఆ మూడు శుభగ్రహాల కలయిక యోగదాయకమని జ్యోతిష శాస్త్రం చెబుతుంటే- 'అద్భుతం' అని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటీవల ఆకాశంలో సరిగ్గా అదే అద్భుతం ఆవిష్కృతమైంది. గురు శుక్ర గ్రహాలు- చంద్రుడికి ఇరువైపులా చేరి శాస్త్రజ్ఞులకు విశేష ఆసక్తి కలిగించాయి. నెలవంక వంపుతీరి నోరుగాను, ఆ గ్రహాలు రెండూ కాస్త పైన కళ్లు మాదిరిగాను కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వాస్తవానికి రాత్రిళ్ళు ఆకాశంలో మూడు నుంచి అయిదు గ్రహాలను నేరుగా చూడవచ్చు. అయితే గుర్తించడం కష్టం. ఈసారి మాత్రం గురు శుక్ర గ్రహాలు మరీ దగ్గరగా వచ్చి స్పష్టంగా కనపడ్డాయి. వచ్చే జనవరి రెండోవారం వరకు అలా కనిపించే అవకాశం ఉంది. వాటిలో బాగా కాంతిమంతమైనది శుక్రగ్రహం. రెండోది గురు గ్రహం. గురు శుక్ర గ్రహాలు అలా దగ్గరగా రావడం చాలా అరుదని, దాన్ని కంజెక్షన్‌ అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. శుభప్రదమనీ దేశానికి యోగకారకమనీ జ్యోతిష పండితులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశమనే చంద్రుణ్ని ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు భయంకర ఉగ్రవాదం రాహుకేతువుల్లా పట్టి పీడిస్తున్న తరుణంలో గురు శుక్రులు చంద్రుడికి ఇరువైపులా చేరి దురుధరాయోగమో- శ్రేష్ఠ వృత్తి యోగమో- పేరేదైనాగాని దేశానికి శుభం చేకూర్చగలిగితే అంతేచాలు... అని సామాన్యుడు గొణుక్కుంటున్నాడు. ఆకాశంలో అద్భుత దృశ్యాలను ఆసక్తిగా గమనించే యువతరానికి- వాటి వెనుక జ్యోతిష శాస్త్ర రహస్యాలుగాని, ఖగోళ శాస్త్ర విశేషాలుగాని తెలిస్తే- ఆ దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుందన్నది సత్యం.

(ఈనాడు, సంపాదకీయం, 07:12:2008)

_________________________________________________________

Labels:

దాంపత్య సౌభాగ్యం

తొలి దశలో మానవులది స్వేచ్ఛాశృంగారం. మనసైన ఆడది కంటపడితే 'తల్లో పూలు కొనిస్త... సేతులకు బందర్‌ గాజులేయిస్త... ఉప్పాడ చమ్కీ బుటా మల్లీమొగ్గల తెల్లకోక... ఇగో... ఈ మారెల్లి పట్కొస్తనే...' తరహాలో మగాడు ఎలాగోలా ప్రలోభపెట్టి తన కోరిక తీర్చుకునేవాడు. సరసత ఎరుగని మొరటువాడైతే రావణాసురుడి ఫక్కీలో పరస్త్రీలను చెరపట్టడం, బలాత్కరించడం కానిచ్చేవాడు. ఈ దశలోనే ఉద్దాలకుడనే ముని ఇంటికి వచ్చిన అతిథి- ముని భార్యతో పొందుకోరాడు. సాధ్వియైన తన తల్లిని అలా పరాయివాడు కామించడం కొడుకు శ్వేతకేతువు దుర్భరంగా తోచింది. గొప్ప తపశ్శాలియైన శ్వేతకేతువు ఉగ్రుడై 'ఇది మొదలుగా వివాహితలను పరులు కోరడానికి వీల్లేదు... మానవజాతికి ఈ రకమైన కట్టడిని నేను ఏర్పాటు చేస్తున్నాను' అని తీవ్రస్వరంతో ప్రకటించడాన్ని భారతం ఆదిపర్వం వివరించింది. అది నేపథ్యంగా భారతీయ వివాహవ్యవస్థలో ఒక స్పష్టత చోటుచేసుకుంది. కామం విషయంలో క్రమశిక్షణ మొదలైంది. భృగుని భార్య పులోమ గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను కామించిన రాక్షసుడొకడు పందిరూపంలో వచ్చి ఆమెను అపహరించబోయాడు. ఆ దురాగతాన్ని గమనించిన ఆమె కడుపులోని బిడ్డ తీవ్రక్రోధంతో గర్భం నుంచి వెలువడ్డాడు. ఆయన పేరు చ్యవనుడు. చ్యవనుడి తేజస్సుకే రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. దాంపత్య ధర్మాన్ని నిష్ఠగా కొనసాగించేవారికి రక్షణ ఎలా లభిస్తుందో, పవిత్ర వైవాహిక జీవనఫలంగా లభించే సంతతికి ఎంతటి శక్తిసామర్థ్యాలు సమకూరతాయో భారతం కథలు కథలుగా వివరించి చెప్పింది.

దాంపత్య జీవనానికి అన్యోన్య అనురాగం పునాది. పరస్పర అనురాగంతో బంధం బలపడ్డప్పుడు- భార్యావియోగం పురుషుడిలో ఎంతటి వేదనకు కారణమవుతుందో రామాయణం వివరించింది. భార్యకు ఏదైనా జరిగితే భర్తకు ఏమనిపిస్తుందో భారతం చెప్పింది. ద్రౌపదిని సైంధవుడు అపహరించుకుపోతే ఎక్కడో దూరంగా ఉన్న ధర్మజుడికి 'చేయిపెట్టి కలచినట్లయ్యెడు చిత్తంబు... తనువు నిశ్చేష్టమయ్యె...' అనిపించింది. చిక్కని అనురాగానికి చక్కని సంతానం వరంగా లభిస్తుంది. బిడ్డను చూడగానే తండ్రికి కలిగే ఆనందానుభూతిని వర్ణిస్తూ శకుంతల 'తాన తననీడ నీళ్లులలో ఏర్పడ చూచునట్లు... మహానందము పొందు...' అంది భారతంలో. హాలీవుడ్‌ అందాలతార ఏంజెలీనా జోలీ మాతృత్వపు మహానందాన్ని ఇటీవలే గొప్పగా వర్ణించి చెప్పింది. తల్లిని కావడంవల్ల తన అందం మరింత పెరిగిందంది. పండును రుచి చూడగానే చెట్టుసారం తెలిసినట్లు- పిల్లల ప్రవర్తన చూడగానే లోకం వారి తల్లిదండ్రుల దాంపత్య సారం అర్థం చేసుకుంటుంది. తమలపాకుతో నీవొకటిస్తే, తలుపుచెక్కతో నే రెండిస్తా... తరహా సరసాలు మనలో చాలామందివి. అదే బాధ! నిజానికి ఇల్లంటే ఒక గుడి. దానిలో వీలైనంత ఎక్కువసేపు గడపాలనిపించడం మంచి ఇంటి లక్షణం. దాని విషయంలో ఈ జాతి నిర్లక్ష్యం వహిస్తోంది. సత్‌సంతానం కోసమే దాంపత్య భోగం అనే సత్యాన్ని విస్మరిస్తోంది. 'కుమారసంభవ ప్రమాదమెరుగని అనవరత రతి మన సమాజం ద్రుతగతి...' అని కాళోజీ బాధపడ్డారు. కలయికలు అసమభోగాలై ఫలితాన్ని తారుమారు చేస్తున్నాయి. వేపవిత్తు నాటితే రసాల మామిడి మొలుస్తుందా మరి! చివరికి 'ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు.. ముద్ద పెట్టుమనగ గుద్దెనేడు...' అని తల్లిదండ్రులు వాపోవడం మిగులుతోంది. దాంపత్యాన్ని అద్భుతమైన ఒకానొక కళగా నిర్వహించకపోవడం వల్ల చెడు పరిణామాలివి!

దంపతుల్లో అనురాగం స్థానే అహంకారం చోటు చేసుకున్నప్పుడు, విడివిడిగా ఎవరి వ్యక్తిత్వాలకు వారు ప్రత్యేక విలువలను ఆపాదించుకున్నప్పుడు దాంపత్య సమతౌల్యం దెబ్బతింటుంది. మనిషిలో వివేకం మేలుకోవలసింది అప్పుడే! తల్లిదండ్రులైతే ఈ అవసరం మరింత ఎక్కువ. అరమరికలకు దూరంగా- ఆత్మీయత అనురాగం పునాదులుగా నిలిచిన దాంపత్యం సమాజానికి మంచి పౌరులను కానుక చేస్తుంది. దాంపత్య భాగ్యమే నిజమైన సౌభాగ్యం! సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకోవాలని మనిషి తహతహలాడితే- ఆ ఇల్లు స్వర్గం. కాకపోతే అది కేవలం మకాం. ఇంటిలోని పోరు ఇంతింత గాదయా... అనే దుస్థితి ఏర్పడితే దానికి ఇద్దరూ బాధ్యులే. తల్లిదండ్రుల బాంధవ్యాల్లో నిర్లిప్తత, నైరాశ్యం పెరిగితే అది పిల్లల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయమై మానవీయమైన తీర్పు వెలువరించింది. పిల్లలకోసమని తల్లిదండ్రులు తమలోని వైరుధ్యాలను సమీక్షించుకోవాలని కోరింది. అవగాహన లోపాల్ని అధిగమించాలంది. 'కలిసి ఉండటానికి అనుకూలమైన దారులన్నీ పూర్తిగా మూసుకుపోయాక మాత్రమే తల్లిదండ్రులు విడిపోవడం గురించి ఆలోచించాలి' అని ఆదేశించింది. భార్యాభర్తలు ఘర్షణ పడవచ్చు, విడిపోనూవచ్చు. తల్లిదండ్రులు ఆ పనిచేస్తే పిల్లలకు ద్రోహం జరుగుతుంది. విడిపోవడానికేముంది! ఒక్క కాగితమూ, రెండు సంతకాలూ చాలు. కలవడానికే మూడు ముళ్లూ, ఏడడుగులూ అవసరం. 'ఇరవై నెలల బిడ్డను నానుంచి విడాకులు వేరుచేశాయి. ఇన్నాళ్ళ నా వేదన తీరి, ఎదురుచూపులు ఫలించి దేవుడు కరుణించి అత్యున్నత న్యాయస్థానం ద్వారా నాకు అనుగ్రహం ప్రసాదించాడు' అని ఆ తల్లి నిట్టూర్చింది. అర్థం కావలసినవారికి ఆ మాటలు సరిగ్గా అర్థం అయితే అంతే చాలు!
(Eenadu, editorial, 30:11:2008)
_________________________________________


Labels:

Monday, January 05, 2009

TID BITS


The magnificent color of butterfly wings does not come from pigmentation directly on the wing, but from the tiny scales that hang on the wing like shingles on a house roof. These scales are so small they look like powder when rubbed onto the fingers.


Each King in a deck of playing cards represents a great king from history. Spades - King David; Clubs - Alexander the Great; Hearts - Charlemagne; and Diamonds - Julius Caesar.


Chewing gum was invented by a dentist, named William Semple - as a way to exercise your jaws.


111 111 111 x 111 111 111 = 12345678987654321


Our eyes can distinguish as many as 10 million distinct color variations.


There are more insects in a single square mile of fertile soil than there are people on the entire earth.


The carrots you munch on weren’t orange always. Carrots started out red, white and purple and are believed to have been grown in Afghanistan in the seventh century, with purple exteriors and yellow pulp. The Dutch developed the orange carrot and the French cultivators are said to have developed its elongated shape.


There is a word in the English language with only one vowel, which occurs six times: Indivisibility.


The deepest location on Earth is Mariana Trench, about 11km deep in the North Pacific ocean.


When glass breaks, the cracks move at speeds of more than 4,500 km/h (3,000 miles)


Earth is the only planet not named after a Roman or Greek god.


A neutron star is the strongest magnet in the universe.


The ice-cream cone was invented in 1904 at the St Louis World Fair (USA). An ice cream vendor ran out of paper cups and asked a nearby waffle stall to make some thin ones that would hold his ice-cream scoops.(An email forward)

___________________________________________________

Labels:

Present scene

In the past /At present



(An email forward)
_____________________________________________

Labels:

CONCEPT BASED ADVERTISING.





(An email forward)
____________________________________________

Labels: