My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, June 23, 2007

'పుంజు'కుంటే చిక్కే

యావత్‌ ప్రపంచమూ (అయో)మయ సభగా, మాయ సభగా మారిపోతున్న రోజులివి. ఇవాళ కనిపించినది రేపటికి ఏ రూపు దాలుస్తుందో ఎవరికెరుక చెప్పండి? నేనీ మాటలు ఊరకనే అనట్లేదు. 'ఏ నిమిషమ్మునకేమి జరుగునో ఎవరూహించెదరు గనుక?' లేకపోతే అప్పటిదాకా నిక్షేపంలా గుడ్లు పెడుతున్న కోడిపెట్ట కాస్తా పుంజులా మారిపోవడమేమిటి? చేపలు పట్టడానికి సెల్‌ఫోన్‌ ఉంటే చాలు అంటూ టెక్నాలజీ రొమ్ములు విరవడమేమిటి? మీరే చెప్పండి.. అందుకే ఈ ప్రపంచాన ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అంటున్నా.

ఈ వింతలు ఇలాగే సాగుతూ పోతే ఏడాదికి కోట్ల రూపాయల వ్యాపారం చేసే గుడ్ల పరిశ్రమ గతేంకావాలి చెప్పండి? పొద్దునే 'గుడ్డు లేనిదే బెడ్డు దిగనని' మారాం చేసే మారాజుల సంగతేం కావాలి? అందుకేనేమో గుడ్డు ప్రకృతి అయితే గోడు వికృతి అవుతుందని చెప్పుకోవాలేమో ఇక. పెట్టలు పుంజులుగా మారిపోతేనో, కోళ్లు ఇంగ్లిషు నేర్చుకుని లెక్కలు చేస్తేనో, సెల్‌ఫోన్లు చేపలు పడితేనో... ఇక కోళ్ల వ్యాపారులు, మత్స్యకారులు 'గుడ్డు'దుడుకులు, 'ఒడ్డు'దుడుకులు

'ఎపుడూ చెప్పలేదు వేమనగారు
అపుడే చెప్పలేదు బ్రహ్మంగారు'
ఎన్ని పాటలు పాడుకుంటే ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోతే ఆనక తీరిగ్గా 'గుడ్లు' మిటకరించాల్సిందే.

దేశంలో ప్రస్తుతం ఏడాదికి 1.61 మిలియన్‌ టన్నుల గుడ్లు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ఉత్పత్తిపరంగా చూస్తే ప్రపంచంలోనే మనది అయిదో స్థానం. ఉత్పత్తిలో మన రాష్ట్రమూ తీసిపోలేదు. ఇది సరే, ఆమధ్య ఎక్కడో చదివినట్లు గుర్తు.. 'కొక్కొరొకో' అంటూ సకల జగత్తును మేలుకొలిపే కోడి తాను కూడా తెల్లారుగట్లే లేచి ఇంగ్లిషు, లెక్కలు నేర్చుకుని మనుషులకు పోటీగా తయ్యారయిందిట. అది ఇంజినీరింగ్‌ కూడా చదివేస్తే ఇంజినీర్లకు పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. పైగా ఆ కోడి ముద్దులు పెట్టడం కూడా నేర్చేసుకుందట! ఏమో రేపో మాపో కోళ్లు కూడా ప్రేమలో పడి మొబైల్స్‌ పట్టుకుని చక్కర్లు కొడితే సెల్‌ఫోన్‌ కంపెనీలకు గిరాకీ అమాంతం పెరిగిపోదూ!

అవును, ఇంతకీ సెల్‌ఫోనంటే గుర్తుకొచ్చింది. చేపలు పట్టడానికి సెల్‌ఫోన్లు కూడా పనికొస్తాయట. కోడి విషయం ప్రకృతి ప్రేరేపితమైతే, చేపల సంగతి హై'టెక్కు'నాలజీ సృష్టించిన ఘనతే మరి. సెల్‌ఫోన్లతోనే చేపలు పట్టేసే అవకాశం వస్తే ఇక మత్స్యకారుల బతుకులేం కావాలీ, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే చిన్నాచితకా వ్యాపారుల గతేం కావాలి చెప్పండి. ఏవండీ ఇంట్లో కూరలు అయిపోయాయి. కాస్త ఆ సెల్‌ఫోను నొక్కి చేపలు పట్టి వంటింట్లో పెట్టకూడదూ అని ఇల్లాలు ఆర్డరేసే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు సుమా!

మూగ యంత్రాలు కూడా మరమనుషుల అవతారమెత్తి చెట్టంత మనిషిని పట్టుకుని బస్తీ మే సవాల్‌ అంటున్న ఈ రోజుల్లో వాటికి మూగ జీవాలు కూడా జత కలిస్తే ఇక వాడి బతుకేం కావాలి! మహాప్రస్థానం బదులు మరప్రస్థానం'మర'మరికలతో సరికొత్త గీతాలాపన చేసుకోక తప్పదేమో! తలచుకుంటేనే నీరసమొచ్చేస్తోంది. కాస్త బలం పుంజుకోవడానికి అలా వెళ్లి రెండు ఆమ్లెట్లు లాగించి వచ్చేయనా!
పడక తప్పదు. కోడిపెట్టలు చెప్పా'పెట్ట'కుండా గుడ్లు పెట్టడం మానేస్తే వ్యాపారస్తులు 'గుడ్లు' తేలేయాల్సిందే. రాసుకోవలసిందే. 'పొలాలనన్నీ హలాల దున్నీ...' అన్న పాటకు బదులు
-ఫన్‌కర్‌
(Eenadu,03:06:2007)
__________________________________________________

Labels:

మారిన దృక్పథం

దారేషణ పుత్రేషణ ధనేషణ అనే ఈషణత్రయాల వలయంలోనే మనిషి పరిభ్రమిస్తూ ఉంటాడు. పుట్టినందుకు ప్రయోజకులై ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ ముత్యాలవంటి పిల్లలను కని సుఖంగా జీవించాలని ప్రతివారూ కోరుకుంటారు. సంతానం కోసం మహిళలు మరీ ఎక్కువగా ఆరాటపడుతుంటారు. పెళ్ళయిన దగ్గరనుంచి పిల్లలకోసమే వారు కలలు కంటూ ఉంటారు. కలవరిస్తుంటారు. ''వెల్ల చీరందమ్ము వేణి అందమ్ము వెలదికేడు నెలల గర్భిణందమ్ము, పట్టుచీరందమ్ము పట్టెడందమ్ము, పణతికి పదినెలల బాలుడందమ్ము'' అనేది వారి సిద్ధాంతం. పిల్లల్లో మళ్ళీ మగపిల్లలే కావాలని కోరుకునేవారి సంఖ్యే అధికం. అబ్బాయిని కన్న అమ్మను ''మగవార్ని కన్నావు మొక్కుకున్నావు'' అని అభినందించినవారే, ఆడపిల్లను కన్న తల్లిని ''ఆడవార్ని కన్నావు అమ్ముకున్నావు'' అని నిరసించటమూ ఉంది. అందరూ అలా ఉండరు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే అని భావిస్తూ పిల్లలున్న ఇల్లే పిట్టల తోపులా సందడిగా శోభిస్తుందని నమ్ముతారు. అటువంటి ఓ ఇల్లాలు, ''కూతురు పుట్టింది కుందు పుట్టింది దండాన కోకలకు దాత పుట్టింది'' అని సంతోషించటమేకాక, ''కూతురు పెళ్ళమ్మ కొడుకు వడుగమ్మ, ఆడపడుచు సీమంతం అల్లుడి మనుగుడుపు'' అని హడావుడి పడిపోతుంది. కొడుకులు, కూతుళ్ళు, మనుమలు మనుమరాళ్ళతో సంసారం బీరపాదులా పచ్చగా కలకలలాడుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కుటుంబ నిర్వహణలో భార్యాభర్తలిద్దరూ సమానంగా పాలుపంచుకోవాలి. ''ఆ మాట నేనెప్పుడు కాదన్నాను? సంసార రథం నెట్టుకు రావటమన్నది మొగుడూ పెళ్ళాల ఫిఫ్టీఫిఫ్టీ వ్యవహారమని నాకూ తెలుసు... అందుకేగా మీరు బ్యాంకులో డబ్బు దాస్తూ ఉంటే నేను తీసి ఖర్చుచేస్తుంటాను'' అంటూ సమర్థించుకుంటుందో ఉత్తమ ఇల్లాలు.

కల్యాణమయి కాపురానికొచ్చి నెలతప్పటం నెలతలకు ఓ మధురానుభూతి. ''రుచులపై వేడ్కలేదు, సిగ్గుచే వసియింపనలవిగాదు, మేలయిన వదనమునను ధవళిమ లీలగా కనుపించెను, వనజాక్షి ఉనికి జూచి చూలాలని'' ఇంట్లోవాళ్ళే ముందుగా కనిపెడతారు. ఆపై అమ్మాయి అడిగినవన్నీ చేసిపెడతారు. కోరికలన్నీ నెరవేరుస్తారు. ''బడలిక జనించె నూర్పు సందడి రహించె, నడుముగనిపించె మిగుల నెన్నడలు గాంచె, జడిమ ప్రాప్తించె జట్టుముల్‌ సంభవించె దౌహృదము జానకీదేవి దాల్చునప్పుడు'' అంటూ సీతాదేవి గర్భిణి అయిన వైనాన్ని వర్ణించాడు కవి ఉత్తర రామాయణ కావ్యంలో. ఆ సమయంలో నీకేం కావాలో కోరుకొమ్మని రామచంద్రుడు అడిగితే ఆ తల్లి అమాయకంగా ''భాగీరథీ తీరారణ్యమునన్‌ వసించు మునీ పత్నీశ్రేణి తోడన్‌ ఫలహారంబుల్‌ గొని యొక్కనాడు మెలగన్‌ బ్రాణేశ వాంఛించెదన్‌'' అని కోరుకుంటుంది. అదే అదనుగా లోకోపవాదానికి వెరచిన రామభద్రుడు సీతమ్మను అడవుల్లో విడిచిపెట్టి రమ్మని తమ్ముణ్ని ఆదేశిస్తాడు. సీతాదేవిని రథంలో అడవిలోకి తీసుకెళ్ళిన లక్ష్మణుడు గంగానది దాటి వాల్మీకి ఆశ్రమ సమీపంలోకి వెళ్ళాక అసలు సంగతి చెబుతాడు. అంత జరిగినా సీతాసాధ్వి రామచంద్రుణ్నికాని లక్ష్మణుడినికాని పల్లెత్తి పరుషంగా ఒక్కమాట మాట్లాడదు. నిండుగర్భిణి అని కూడా చూడకుండా ప్రజావాక్య పరిపాలనకోసం శ్రీరాముడానాడు సీతమ్మను అడవులపాలు చేశాడు. నేటి మగవారు అలాకాకుండా గర్భవతులైన భార్యలకు అండదండగా తోడునీడగా తామే ఉంటూ అన్ని విధాలా ఆదుకోవాలనుకుంటున్నారు.

''అబ్బాయే పుడతాడు అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంటాడు'' అని కాబోయే తల్లులు, ''అమ్మాయే పుడుతుంది అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంటుంది'' అని కాబోయే తండ్రులు మురిసిపోవటం సహజమే. అలా ముచ్చటపడటమేకాని గర్భవతులైన భార్యలపట్ల వెనకటి తరాల మగవారు మరే విధమైన ప్రత్యేక శ్రద్ధా తీసుకొనేవారు కాదు. అదంతా ఆడవాళ్ళ వ్యవహారమని, ఇంట్లోని పెద్దవారే ఆ సంగతి చూసుకుంటారని భావించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భార్య గర్భం ధరించిన దగ్గరనుంచీ ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాల్లోను శ్రద్ధ తీసుకోవాలని ఆధునిక యువకులు భావిస్తున్నారు. పిల్లల పెంపకంలోను భార్యతో సమానంగా పాలుపంచుకుంటూ ఆమెకు తోడ్పడాలనీ ఉత్సాహపడుతున్నారు. ఇది మగవారి ఆలోచన సరళిలో వచ్చిన పెద్ద మార్పే. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అవసరమైతే ఉద్యోగాలకు సెలవు పెట్టయినా సరే ఇంటిపట్టునే ఉండాలని 75 శాతం భర్తలు అభిలషిస్తున్నారు. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గతకాలపు ముచ్చటైపోయిన ఈ రోజుల్లో మగవారి వైఖరిలో ఇటువంటి మార్పు కలగటం హర్షణీయం, వాంఛనీయం. ఉద్యోగినులైన మహిళలు గర్భవతులయినప్పుడు ప్రసూతి సెలవును ప్రత్యేకంగా మంజూరు చేస్తుంటారు. అదే విధంగా పురుషులకూ పితృత్వ సెలవు ఇచ్చే ఆచారం పాశ్చాత్య దేశాల్లో లోగడనుంచీ ఉంది. మనదేశంలోనూ మగవారికి 15 రోజులపాటు పితృత్వ సెలవు మంజూరు చేయటం ఇప్పుడు ప్రారంభించారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడూ తరవాత శిశుపోషణలోను భర్తలు శ్రద్ధ తీసుకుంటూ మాతాశిశువులకు సన్నిహితంగా ఉండటంవల్ల అనేక ప్రయోజనాలున్నాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటున్నారు. తండ్రులకూ పిల్లలతో అనుబంధం పెరుగుతుంది. పిల్లలను ఎత్తుకోవటం, ఆడించటం, నిద్ర పుచ్చటం వంటి పనులు చేస్తుండటంవల్ల తండ్రులకు, పిల్లలకు మధ్య పటిష్ఠ ఆత్మీయతానుబంధం ఏర్పడుతుంది. బాలెంతలకు తగిన విశ్రాంతి లభించి వారు త్వరగా కోలుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇన్ని లాభాలున్నప్పుడు భర్త అనే మాటకు పరిపూర్ణమైన న్యాయం చేయటం మంచిదే కదా!
(Eenadu,27:05:2007)
______________________________________

Labels:

ATTITUDE:

Ø The market for shoes: A shoe company wanted to expand its business to a country in Africa. In order to assess the level of demand for their shoes in that country, the director of the company deputed two separate teams there.After a study of 2months, one team sent a report that there was no market for shoes in that country as no one wore shoes.The other team concluded that the place had a great market potential because no one wore shoes.


Attitude is anchor to soul, stimulus to action and incentive to achievement. Things don’t change. You change your way of looking. That’s all. The meaning of things lies not in the things, but in your attitude towards them. We don’t see things as they are; we see things as we are. Attitude, more than aptitude, will determine our altitude. You’ve either got a good attitude or a bad one. The choice is up to you.

“The law of happiness states that

The quality of your life is determined by how you feel at any given moment/event. How you feel is determined by how you interpret what is happening around you, not by the events themselves.”

No one can insult or hurt you without your permission. One of the golden keys to happiness and great success is the way you interpret events which unfold before you. Highly successful people are master interpreters. People who have attained greatness have an ability which they have developed to interpret negative or dis-empowering events as positive challenges which will assist them in growing and moving even farther up the ladder of success. There are no negative experiences only experiences which aid in your development and toughen your character so that you may soar to new heights. There are no failures, only lessons.


R.E.C.A.S.T your Attitudes:

Rediscover yourself, people and situations around you for the strengths/talents/opportunities.

Exert to learn and develop.

Compete only with yourself, so that you try to be better today than what you were yesterday.

Appreciate others for all the good things that happen to you through them.

Stop complaining. Be a part of the solution, but not of the problem.

Take time to plan and organize the daily routine.


GEMS


Though I might travel afar, I will meet only what I carry with me, for every man is a mirror. We see only ourselves reflected in those around us. Their attitudes and actions are only a reflection of our own. The whole world and its condition has its counter parts within us all. Turn the gaze inward.Correct yourself and your world will change.

 • The only difference between stumbling blocks and stepping stones is the way in which you use them.

 • We are injured and hurt emotionally,

Not so much by other people
or what they say and don't say,
But by our own attitude
and our own response.

 • First, all relationships are with yourself-and sometimes they involve other people. Second, the most important relationship in your life-the one you have, like it or not, until the day you die-is with yourself.
 • The world is a looking glass. It gives back to every man a true reflection of his own thoughts.
 • Attitudes are more important than facts.
 • Life is the movie you see through your own eyes. It makes little difference what's happening out there. It's how you take it that counts.
 • Reality is what we take to be true. What we take to be true is what we believe. What we believe is based on our perceptions. What we perceive depends on what we look for. What we look for depends on what we think. What we think depends on what we perceive. What we perceive determines what we take to be true. What we take to be true is our reality.
 • He can who thinks he can, And he can't who thinks he can't. This is an indisputable law.
 • Perception is a mirror not a fact. And what I look on is my state of mind, reflected outward.
 • Our ultimate freedom is the right and power to decide how anybody or anything outside ourselves will affect us.
 • A difference, to be a difference, must make a difference.
 • It's your attitude not your aptitude that determines your altitude.
 • Naturalness is the easiest thing in the world to acquire, if you will forget yourself-forget about the impression you are trying to make.
 • If you think you can do a thing or think you can't do a thing, you're right.
 • I am the master of my fate. I am the captain of my soul.
 • Men are disturbed not by things that happen, but by their opinion of the things that happen.
 • Attitudes are the forerunners of conditions.
 • Our job is not to set things right but to see them right.
 • All personal breakthroughs begin with a change in beliefs.
 • It's not the events of our lives that shape us, but our beliefs as to what those events mean.
 • Things do not have meaning. We assign meaning to everything.
 • If you don't set a baseline standard for what you'll accept in life, you'll find it's easy to slip into behaviors and attitudes or a quality of life that's far below what you deserve.
 • Things do not change; we change.
 • There is nothing either good or bad but thinking makes it so.

ATTITUDE, ABILITY, &MOTIVATION:

Ability is what you are capable of doing.

Motivation determines what you do.

Attitude determines how well you do it.

(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)

_________________________________

Labels:

MUNNAR (Kerala)

Labels:

Friday, June 22, 2007

ఖర్చుల్లో ఉందిలే భలే బడాయి

'ఖర్చేరా అన్నిటికీ మూలం... ఖర్చులు తగ్గించుకొనుట మానవ ధర్మం...' అని 'సొ'మ్ములు తిరిగిన వాళ్లు జోరీగల్లా పోరు పెట్టినా వినకపోబట్టే, వేతన బాబులు 'అయ్యయ్యో... జేబులు ఖాళీ ఆయెనే...' అని మొత్తుకొంటున్నారు. పే స్లిప్‌లో కనిపించిన జీతం వెంటనే స్లిప్‌ అయిపోతోందని విచారంతో తల పట్టుకుంటున్నారు. ప్రేమలో పడ్డ వాళ్ల సంగతి సరేసరి. సినిమాలకు, షికార్లకు, షాపింగ్‌లకు తిరిగిన తరువాత తీరిగ్గా కూర్చుని ఖర్చులను పట్టిక వేసుకొని 'నన్ను దోచుకొందువటే ఖర్చుల దొరసానీ' అని పళ్లు కొరికితే ఫలితం ఉండదు. అంతా గత 'ధన' సేతు బంధనం చందమవుతుంది.

ఖర్చుల్ని కనిపెట్టిన వాడిని ఎంత ఖర్చయినా కాల్చి పారేయాలన్నంత కోపం వచ్చినా చేయగలిగిందేమీ లేదు. జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోయె అని దిగులు పడతాం కానీ నిద్రపోతే ఎలాంటి ఖర్చులూ దరిచేరవు... ఒక్క సమయం ఖర్చవుతుంది తప్ప. జీతమ్మున ఆసాంతం ఖర్చులకే సరిపోయె అని లబ్‌ డబ్బులాడతాం. అయితే, ఖర్చు పెట్టేవాళ్లలో రక రకాలు. సాహిబ్‌ సంపాదన బీబీ కుట్టు పనికి సరిపోవడం లేదనే పోలిక ఉంది. వెనకటికి తిండి మీద ఎక్కువ ఖర్చు చేసే వాళ్లు. ఇప్పుడు 'బండి'కి ఎంతయినా ఖర్చు చేయడానికి వెనుదీయడం లేదు. దీంతో ఖర్చులు తడిసి 'మోపెడే' కాక, తడిసి ట్యాక్సీలూ, కార్లూ కూడా అవుతున్నాయ్‌!

ఖర్చులు పెట్టడంలో తెలివితేటలు ప్రదర్శించేవాడే జీవితంలో పైకొస్తాడు. ఇతరులు పెట్టే ఖర్చు స్వీటు, తాము పెట్టే ఖర్చు చేదు అని భావించే వాళ్లూ ఉంటారు. ఖర్చుల్లో లోక కళ్యాణమూ ఇమిడి ఉంది! లంచం తీసుకొనే వాడు 'ఏదో ఖర్చులకు' అని పళ్లికిలిస్తాడు. లంచం ఇచ్చేవాడు ఖర్చులకు ఇస్తున్నాలే అని మనసుకి సర్దిచెప్పుకోలేదనుకోండి, సుఖ నిద్ర పట్టదంతే! మనిషి కన్నుమూస్తే 'ఖర్చయిపోయాడ'నడం సహజమే కదా.

ఖర్చులనేవే లేకపోతే... మనిషి కన్నా మంచి ప్రాణి దొరకదు. అవినీతీ అయిపుండదు. పక్కింటి మీనాక్షమ్మతో పోల్చుకోవడం వల్లనే ఖర్చులు పేలిపోతున్నాయి. ఖర్చులందు పెళ్లి ఖర్చులు వేరయా అని బట్టకట్టిన ఆధునిక వేమనలు అంటున్నారు. ఒకరు తొడ కోసుకుంటే, ఇంకొకరు మెడ కోసుకుంటున్నారు. ఇటువంటి ఖర్చుల బారి నుంచి కాపాడే వాడు భగవంతుడే అని నిట్టూర్చడానికి బదులు ఖర్చులకు కత్తెర వేయడంలో ప్రయత్న లోపం చేయకుండా ఉంటే... అంతా మంచికే.

- ఫన్‌కర్‌
(Eenadu,20:05:2007)
____________________________________________

Labels:

చాక్లెట్లే ముద్దు

లౌకిక జీవనంలో ముద్దుల ప్రాముఖ్యం ఎక్కువే. ఆదరం కలిగినప్పుడు, అభిమానం ముంచుకొచ్చినప్పుడు, వాత్సల్యం పొంగుకొచ్చినప్పుడు అవతలివారిని ముద్దాడటం సాధారణంగా జరిగేదే. తల్లి తన బిడ్డను వాత్సల్యంతో ముద్దాడుతుంది. ప్రేయసీ ప్రియులు పరస్పరం ప్రేమతో ముద్దులు పెట్టుకుంటారు. శృంగార శాస్త్రంలో ముద్దుల ప్రకరణే ముఖ్యమైంది. వాత్సాయనుడేకాక ఆ తరవాత అనేక మంది శృంగారశాస్త్ర ప్రవీణులూ చుంబన విశేషాలను వైన వైనాలుగా విశదీకరిస్తూ అనేక గ్రంథాలు రాశారు. హావలెక్‌ ఎల్లీస్‌ అనే ఆంగ్ల విద్వాంసుడు ముద్దులకు సంబంధించి వాటి గుట్టుమట్లను బయటపెడుతూ ఎన్నో పుస్తకాలు రాశాడు. వేమనయోగి ''పనసతొనలకన్న పంచదారకన్న, జుంటి తేనెకన్న జున్నుకన్న, చెరకు రసముకన్న చెలిముద్దు తీపిరా'' అన్నాడు. గంగానది ఒడ్డున నిష్ఠగా జపం చేసుకుంటున్న అర్జునుణ్ని చూసి ఉలూచి అనే నాగకన్య ముగ్ధురాలైపోతుంది. ఆ అందగాడి అంగాంగ వర్ణన చేస్తూ ''ముద్దాడవలదె యీ మోహనాంగుని మోము గండ చక్కెర మోవిగల ఫలంబు...'' అని ఉవ్విళ్లూరుతుంది. ఆ కోరిక తీర్చుకోవటానికే మంత్రబలంతో అర్జునుణ్ని పాతాళ లోకంలోని తన మందిరానికి తీసుకెళుతుంది. ఆపై ఉలూచి, అర్జునుల శృంగార లీలా విశేషాలే విజయ విలాస కావ్యంలో మధుర ఘట్టాలుగా రూపుదిద్దుకొన్నాయి. సృష్టిలో చుంబన ప్రక్రియను మొదటగా సర్పజాతే కనుక్కొందని స్కాట్‌ఫిజ్‌గెరాల్డ్‌ అనే ఫ్రెంచి రచయిత రాశాడు. యౌవన బింకంలో మిడిసి పడిపోతున్న ఓ నాగరాజు సుష్టుగా చిన్న చిన్న పాముల్నీ కప్పల్నీ భోంచేసి కదలలేని స్థితిలో ఉండగా తనకు ఈడుజోడయిన ఓ ఆడపాము కనపడింది. అంత పెద్దపామును గుటుక్కున మింగలేక కనీసం రుచన్నా చూద్దామనుకొని తన రెండు నాలుకలతోటీ ఆ నాగరాజు ఆడపాము శరీరాన్ని చుంబించినట్లు స్పృశించాడు. అదే సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య చుంబనక్రియ ప్రారంభం కావటానికి నాందీవాచకం పలికిందని ఆ రచయిత వెల్లడించాడు. నిజానిజాలు ఆయనకు, ఆ పాములకే తెలియాలి!

ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ''పంటనొక్కనపించు బాసచేసినగాని తేనెలూరెడి మోవియాననీయ'' అంటూ శృంగారానికీ హద్దులు నిర్ణయిస్తుందో నెరజాణ. ముద్దుల్లో కూడా ఎన్నో రకాలున్నాయి. పాశ్చాత్య దేశాల్లో ముద్దుపెట్టుకోవటం గురించి అంతగా పట్టించుకోరు. ఏ కార్యక్రమంలోనో సభల్లోనో కలుసుకున్నప్పుడు, విడిపోయేటప్పుడు ముద్దుపెట్టుకుంటారు. అది వారికి అలవాటు. భారత్‌ వంటి సంప్రదాయ దేశాల్లో అలాకాదు. బహిరంగ ప్రదేశాల్లో ముద్దుపెట్టుకోవటాన్ని ఇక్కడి వారు హర్షించరు. వివాహమయ్యేదాకా అటువంటి సరసాలకు దూరంగా ఉండాలనే భావిస్తారు. ''నన్ను మొదటిసారి ముద్దుపెట్టుకున్న సుబ్బారావునే నేను పెళ్ళి చేసుకున్నాను'' అంది సుబ్బరత్నం గొప్పగా. ''ఆ మాట నిజమే. చేసిన నేరానికి తగిన శిక్ష పడటమంటే అదే'' అంటూ నిట్టూర్చాడు సుబ్బారావు. సృష్టికర్త బ్రహ్మ అంతటివాడే ఓసారి నిగ్రహించుకోలేక తన నాలుగు ముఖాలతోటి ఒకేసారి సరస్వతిని ముద్దాడాడంటారు. అందుకా చదువులతల్లి కోపించి, ''మేలు మేలెంతయు నీవింత- లన్యాయమింతగలదె, మీమొగంబులు నాల్గు నీమాడ్కి నువ్విళులూరిన నేకాస్య నొకతె నేను జాలుదునె'' అంటూ విసుక్కొంటుంది. ఆ సమయంలో తన్మయత్వంతో ఒక మధురశబ్దం ఆమె కంఠసీమలో నుంచి వెలువడుతుంది. ఆ మధుర నాదమే కళాపూర్ణుని జన్మకు కారణమై కళాపూర్ణోదయ కావ్యం రసవంతమైన మలుపులు తిరగటానికి దోహదపడుతుంది.

చాక్లెట్‌ గొంతులో కరుగుతుంటే ముద్దుకన్నా నాలుగురెట్లు ఆనందాన్ని కలిగిస్తుందని శాస్త్రజ్ఞులు జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. వారు ముద్దులు పెట్టుకుంటూనో, చాక్లెట్లు తింటూనో ఈ ప్రయోగాలు నిర్వహించారేమో తెలియదు! యౌవన ప్రాదుర్భావ సమయంలో యువత ఎక్కువగా ముద్దుముచ్చట్లలోనే కాలం గడుపుతారనీ అందులోనే వారెక్కువ ఆనందాన్ని పొందుతారనీ అందరికీ తెలిసిందే. యువజనం చాక్లెట్లు అంటే కూడా అమితమైన ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. చాక్లెట్లు ఎక్కువగా తినడంవల్ల పళ్ళు పాడవుతాయని డాక్టర్లు చెబుతుంటారు. ఫలితాల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా పిల్లలేకాక యువజనం సైతం చాక్లెట్లు అంటే ఎంతో మక్కువ చూపుతుంటారు. అందువల్లే వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మనసుకు నచ్చిన భాగస్వామిని ముద్దుపెట్టుకోవటం కంటె చాక్లెట్లను చప్పరించటంలోనే ఎక్కువ ఆనందం కలుగుతుందా అన్న సందేహం కొందరు శాస్త్రవేత్తలకు కలిగింది. ఆ విషయాన్ని తేల్చుకోటానికే కొన్ని పరిశోధనలు నిర్వహించారు. చాక్లెట్లు తినటంవల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందనీ అందువల్ల మెదడులోని రసాయనాలు ప్రేరేపితమై మనసుకు ఎంతో సంతోషం కలుగుతుందనీ తేలింది. ఇందుకోసంగాను శాస్త్రజ్ఞులు 20 సంవత్సరాల వయసులోని 12మంది యువతీ యువకులకు హార్ట్‌మానిటర్లు తగిలించి మరీ పరీక్షలు నిర్వహించారు. నిమిషానికి 60 సార్లు కొట్టుకొనే పల్స్‌ రేటు కూడా చాక్లెట్‌ తింటున్నప్పుడు 140కి పెరిగింది. దాంతో ముద్దులకంటె చాక్లెట్లే మనిషిపై ఎక్కువ ప్రభావాన్ని చూపగలవని తేలిపోయింది. అంతమాత్రం చేత ముద్దులను తేలికచేసి చూడవలసిన అవసరమేమీలేదు. దేని మాధుర్యం దానిదే దేని ప్రత్యేకత దానిదే అని వాదించే ముద్దుల ప్రియులూ లేకపోలేదు. చక్కిలాలు తింటావా చద్దన్నం తింటావా అంటే చక్కిలాలు తింటాను చల్ది అన్నమూ తింటాను ఆనక అయ్యతో వేడన్నమూ తింటాను అన్నాడో పిడుగు. అలాగే- ముద్దులూ పెట్టుకుంటాం చాక్లెట్లూ ఆరగిస్తాం దేనిదోవ దానిదే అనే ఉభయ కళాప్రపూర్ణులకూ లోటేముంటుంది?
(Eenadu,20:05:2007)
________________________________________________

Labels:

ASSERTIVENESS:

Do you often find that others coerce you into thinking their way?

Is it difficult for you to express your positive or negative feelings openly and honestly? Do you sometimes lose control and become angry at others who don't warrant it?

A "yes" answer to any of the above questions may be an expression of a common problem known as "lack of assertiveness."

What Is Assertiveness?

Assertiveness is the ability to express yourself and your rights without violating the rights of others. It is appropriately direct, open, and honest communication which is self-enhancing and expressive.


Keep in mind that you have the following rights:

-The right to decide how to lead your life. This includes pursuing your own goals and dreams and establishing your own priorities.

- The right to your own values, beliefs, opinions, and emotions and the right to respect yourself for them, no matter the opinion of others.

- The right not to justify or explain your actions or feelings to others.

- The right to tell others how you wish to be treated.

- The right to express yourself and to say, "No," "I don't k now," "I don't understand," or even "I don't care." You have the right to take the time you need to formulate your ideas before expressing them.

- The right to ask for information or help - without having negative feelings about your needs.

- The right to change your mind, to make mistakes, and to sometimes act illogically - with full understanding and acceptance of the consequences.

- The right to like yourself even though you're not perfect, and to sometimes do less than you are capable of doing.

- The right to have positive, satisfying relationships within which you feel comfortable and free to express yourself honestly

- And the right to change or end relationships if they don't meet your needs.

- The right to change or enhance, or develop your life in any way you determine.

When you don't believe you have these rights - you may react Very passively to circumstances and events in your life. When you allow the needs, opinions, and judgments of others to become more important than your own, you are likely to feel hurt, anxious, and even angry. This kind of passive or non assertive behavior is often indirect, emotionally dishonest, and self-denying. Many people feel that attending to their legitimate needs and asserting their rights translates to being selfish. Selfishness means being concerned about only your rights, with little or no regard for others. Implicit in your rights is the fact that you are concerned about the legitimate rights of others as well.

Selfishness and Aggressiveness

When you behave selfishly, or in a way that violates the rights others, you are, in fact, acting in a destructive, aggressive manner, rather than in a constructive, assertive manner. There is a very Fine line that divides the two manners of action.

Aggressiveness means that you express your rights but at the expense, degradation, or humiliation of another. It involves being so emotionally or physically forceful that the rights of others are not allowed to surface. Aggressiveness usually results in others becoming angry or vengeful, and as such, it can work against your intentions and cause people to lose respect for you. You may feel self-righteous or superior at a particular time - but after thinking things through, you may feel guilty later.

What Assertiveness Will Not Do

Asserting yourself will not necessarily guarantee you happiness or fair treatment by others, nor will it solve all your personal problems or guarantee that others will be assertive and not aggressive.

Just because you assert yourself does not mean you will always get what you want; however, lack of assertiveness is most certainly one of the reasons why conflicts occur in relationships.

Specific Techniques for Assertiveness

Ø Be as specific and clear as possible about what you want, think, and feel. The following statements project this preciseness:

"I want to ...."

"I don't want you to …."

"Would you ….?"

"I liked it when you did that."

"I have a different opinion. I think that . . ." - "I have mixed reactions. I agree with these aspects for these reasons, but I am disturbed about these aspects for these reasons."

It can be helpful to explain exactly what you mean and exactly what you don't mean, such as "I don't want to break up over this, but I’d like to talk it through and see if we can prevent it from happening again."

Ø Be direct. Deliver your message to the person for whom it is intended. If you want to tell Jane something, tell Jane; do not tell everyone except Jane; do not tell a group, of which Jane happens to be a member.

Ø "Own" your message. Acknowledge that your message comes from your frame of reference, your conception of good vs. bad or right vs. wrong, your perceptions. You can acknowledge ownership with personalized ("I") statements such as "I don't agree with you" (as compared to "You're wrong") or "I'd like you to mow the lawn” (as compared to "You really should mow the lawn, you know"). Suggesting that someone is wrong or bad and should change for his or her own benefit when, in fact, it would please you will only foster resentment and resistance rather than understanding and cooperation.

Ø Ask for feedback. "Am I being clear? How do you see this situation? What do you want to do?" Asking for feedback can encourage others to correct any misperceptions you may have as well as help others realize that you are expressing an opinion, feeling, or desire rather than a demand. Encourage others to be clear, direct, and specific in their feedback to you.

Learning To Become More Assertive

As you learn to become more assertive, remember to use your assertive "skills" selectively. It is not just what you say to someone verbally, but also how you communicate nonverbally, with voice tone, gestures, eye contact, facial expression, and posture that will influence your impact on others. You must remember that it takes time and practice, as well as a willingness to accept yourself as you make mistakes, to reach the goal of acting assertively.

(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)

_______________________________

Labels:

Thursday, June 21, 2007

'పన్నో' లక్ష్మీ ప్రచోదయాత్‌


'అశోకుడు చెట్లు నాటించెను
రోడ్లు వేయించెను'
అని పిల్లలు అదేపనిగా బట్టీ వేస్తుంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ లేకుండా ఆ మహానుభావుడు ఇన్ని పనులు ఎలా చేయగలిగా'డబ్బా'! అని ఇప్పటి పాలకులు 'చెక్కు'న వేలేసుకోవాల్సిందే. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కున్న ప్రాధాన్యం అటువంటిది. నిన్నగాక మొన్న బచ్చన్ల ఇంటి కోడలైన 'ఐశ్వర్య'రాయ్‌ మమ్ము చూడు, మా ట్యాక్స్‌ చూడు అంటోంది మరి. బచ్చన్ల కుటుంబం (ఐశ్వర్య సహా) రూ. 15 కోట్లు పన్ను కట్టి 'హీరో'దాత్తం ప్రదర్శించింది. మరోపక్క బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో మాత్రం నేనే 'నెంబర్‌ వన్‌' అంటూ పాతిక కోట్ల పన్ను కట్టేసి సకల కళాప్రియులకి ఆదర్శప్రాయంగా నిలిచాడు. 'పన్నో' లక్ష్మీ ప్రచోదయాత్‌ అంటున్నారు జనం. ఈ ప్రపంచాన్ని కార్ల్‌మార్క్స్‌ ఉన్నవాళ్లు, లేనివాళ్లుగా విభజించాడు. కానీ ఉన్న వాళ్లను ఆదాయపు పన్ను కట్టేవాళ్లు, కట్టని వాళ్లుగా విభజించి కొత్తరకం వర్గ పోరాటం గురించి చెబితే ఇంకో రకమైన విప్లవం అదిరిపోయేది.

పన్ను దొంగలు వెన్న దొంగకు మించిన వాళ్లు. శ్రీకృష్ణ పరమాత్ముడు మన్ను తిని నోట్లో భువన భాండాలు చూపించి అదేదో గొప్పనుకున్నాడు. పన్ను దొంగలు మాత్రం పద్నాలుగు భువన భాండాలూ దిగమింగి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వాళ్లకు గూట్లో మట్టి చూపించాలని ప్రయత్నిస్తూంటారు. దాంతో ఇన్‌కమ్‌ట్యాక్స్‌ వాళ్లు సోదాయం (ఆదాయం+సోదా) కోసం దూసుకుపోతుంటారు. ఆదాయపు పన్ను వల్ల 'సేవ్‌' చేయవచ్చు సరే, 'షేవ్‌' కూడా ఎలా చేయొచ్చో ఎగవేత మహానుభావుల్ని అడిగితే కంఠోపాఠంగా చెప్పేస్తారు.

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందనేది సాంఘిక శాస్త్రం చెప్పే పాఠం. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వాళ్ల జాబు మాత్రం ఉన్నవాళ్ల జేబు చుట్టూ తిరుగుతుందనేది 'జీవ'శాస్త్రం చెప్పే పాఠం. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కలర్‌'ఫుల్‌'గా ఉండాలంటే 'బ్లాక్‌'మనీ 'వైట్‌'మనీగా మారాలని 'ధనవద్గీత' చెబుతోంది.

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విషయంలో యా(వే)తన జీవుల కష్టాలు యాతన జీవులవి. 'పెట్టని అమ్మ ఎటూ పెట్టదు... పెట్టే ముండకేమొచ్చింది' అన్నట్టు కట్టని మహానుభావులు ఎటూ కట్టరు.. కట్టేవాడికేమొచ్చింది' అన్నట్టుగా ఉంటోంది ఏలినవారి వరుస అనుకుంటూ సగటు జీవులు జేబులు తడుముకోవాల్సి వస్తోంది. ఏ చట్టం తన పని తాను చేసుకోకపోయినా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుందన్నది వాస్తవం. అందుకే 'రవి గాంచనిచో కవి గాంచున్‌ అన్న పద్యం పాతబడిపోయింది. రవి గాంచకపోయినా, కవిగాంచక పోయినా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కాంచునే కదా అన్న పంక్తి పుట్టుకొచ్చింది. అందువల్ల ఈ దేశంలో అందరికీ ట్యాక్స్‌ కట్టేంత స్థోమత నివ్వు భగవంతుడా అని ప్రార్థిద్దాం. అంతకంటే ఏం చేయగలం. మనమూ పన్నుపోటు బాధితులమే కదా.
-ఫన్‌కర్‌
(Eenadu, 13:05:2007)
_______________________________________________

Labels:

తాగిచూడు తేనీరు

''అయ్యా మీరు చల్దివణ్ణం తించారా?'' అని అడుగుతుంది బుచ్చమ్మ గిరీశాన్ని. ఆ బుచ్చమ్మ వట్టి పిచ్చమ్మ కాబట్టి అలా అడిగింది కాని అదే ఏ మధురవాణో మరొకరో అయితే అలా అడిగేవారా! ''కాఫీ పుచ్చుకుంటారా, టీ తెమ్మంటారా?'' అని షోగ్గా అడిగి ఉండేవారు. తినే పదార్థాలు, తాగే పానీయాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని మర్యాదలు పాటించాలని శ్రీపాదవారు తన ''అనుభవాలూ- జ్ఞాపకాలూ''లో రాశారు. 'మంచినీళ్లు, పానకం, పాలు, పెరుగు, మజ్జిగ, సోడా, కాఫీ, టీ ఇలాంటివేమైనా పుచ్చుకోవడం, పుచ్చుకో, పుచ్చుకున్నాను అనే అనాలి తప్ప- తాగడం, తాగు, తాగుతున్నాను' అని అనకూడదట. ఇటువంటి భాషామర్యాదలు ఈ రోజుల్లో ఎంతమంది పాటిస్తున్నారంటే చెప్పటం కష్టమే. ''అలా ఏ హోటల్‌కో పోయి కాఫీ తాగొద్దాం...'' అనో, ''ఇరానీ హోటల్‌కు పోయి చాయ్‌ తాగొద్దాం పదవోయి...'' వంటి మాటలే వినపడుతున్నాయి. ఎంత కాఫీ టీలనైనా ''పుచ్చుకుందాం...'' అంటూ మన్నిస్తూ మాట్లాడటంలేదు. అంతమాత్రం చేత కాఫీ, టీల విలువేమైనా తగ్గుతోందా? వాటి వాడకం వేసవిలో ఉష్ణోగ్రతలా పెరిగిపోతోందే తప్ప తగ్గటంలేదు. కాఫీ హోటల్‌, టీ కొట్టు లేని ఊరు ఉండదంటే ఆశ్చర్యంలేదు. ఇంటికి ఎవరొచ్చినా వెనకటి రోజుల్లో ''దాహం పుచ్చుకొంటారా?'' అంటూ మంచినీళ్లో, మజ్జిగో అందించేవారు. ఈ రోజుల్లో అలాకాదు. ఇంటికి ఎవరొచ్చినా ముందు కాఫీయో టీయో ఇవ్వటం మర్యాద!

కాఫీ టీలు జంటకవుల్లాంటివి. ఒకటి ఉన్నచోట మరొకటి ఉండనే ఉంటుంది. ఈ రెంటిలో ఏది గొప్ప అనే చిక్కుప్రశ్న వేస్తే మాత్రం సమాధానం చెప్పటం కష్టమే. రంభ, ఊర్వశిలలో ఎవరు గొప్ప అందగత్తె అన్న జటిలమైన పజిల్‌ పరిష్కరించిన ఏ విక్రమార్కునిలాంటి వాడో మళ్లీ పుట్టుకొచ్చి సమాధానం చెప్పాల్సిందేగాని- మామూలు మనిషికి సాధ్యంకాదు. దక్షిణాదిన కాఫీ ప్రాబల్యం ఎక్కువగా ఉండగా ఉత్తరాది వారికి చాయ్‌ అంటేనే ప్రాణం. ఉత్తర దక్షిణ సంస్కృతులు రెండింటినీ మేళవించుకొని వెలిగిపోతున్న హైదరాబాద్‌ వంటి నగరాల్లో కాఫీ టీలు రెండూ అప్రతిహతంగానే చలామణీ అవుతుంటాయి. మందుకీ సిగరెట్లకే కాదు, కాఫీ టీలకూ కవిత్వానికీ కూడా దగ్గర సంబంధమే ఉంది. ''మధురవాణి సాఖి హృదయేశ్వరి... పాత్రిక నింపి తెచ్చి...'' ఇచ్చిన మధువు తాగి మధురమైన మదిర కవిత్వం పారశీకపు గుబాళింపులతో రాసిన కవులున్నట్లే ఒక కప్పు కాఫీయో టీయో తాగి సిగరెట్టు దమ్ములాగుతూ అమోఘమైన కవిత్వం రాసే ఆధునిక కవులూ ఉన్నారు. శివకేశవుల్లాగా కాఫీ టీలు అభేద్యాలు అంటూ రెంటినీ సమానంగా లాగించే సవ్యసాచులూ ఎందరో. ''ఫిల్టరు మొదటి పట్టు నాకే సుమా ఒట్టు...'' అంటూ అందుకోసమే ఇంట్లో అందరికంటే ముందే లేచిపోయే ఉత్తమా ఇల్లాళ్లు ఉన్నారు. ''పక్కింటావిడ కొనుక్కున్న కాఫీ కలర్‌ చీర ఎంత బాగుందో... ఈసారి పండక్కి నేనూ అటువంటి కాఫీ కలర్‌ చీరే కొనుక్కుంటాను'' అంటూ తన నిర్ణయాన్ని వెలిబుచ్చిన శ్రీమతి హటాత్తుగా స్వరం హెచ్చించి, ''కాఫీ పొడి అయిపోయింది టీ పొడీ నిండుకున్నట్లుంది... అర్జంటుగా బజారుకు వెళ్లి రెండూ పట్రండి'' అని ఆజ్ఞాపిస్తే గురుడు పుంజాలు తెంపుకొంటూ బజారుకు పరుగెత్తక తప్పదు.

తేనీటి ఘుమఘుమలో కాఫీ పరిమళమో ముక్కు పుటాలకు సోకితే కాని తెల్లవారదు చాలా మందికి. ఇంకా పాన్పు దిగకుండానే, కళ్లు తెరవకుండానే కాఫీ గ్లాసు కోసమో టీ కప్పు కోసమో బారెడు పొడుగున చేతులు జాపే మహానుభావులు- ఎందరో. కాఫీ, టీలు జీవన స్రవంతిలో అంతగా అల్లుకుపోయాయి. ఈ రెండు పానీయాల్లో దేని రుచి దానిదే అయినప్పటికీ, ఆరోగ్య రీత్యా కాఫీ కంటె టీయే బెటరంటున్నారు డాక్టర్లు. టీకి హృదయసంబంధమైన వ్యాధులను నిరోధించే శక్తి ఉందంటారు. అది టీ డికాక్షన్‌లో పాలు కలపనప్పుడు మాత్రమే. పాలు కలిపినప్పుడు టీ అటువంటి శక్తిని కోల్పోతుంది అంటున్నారు పరిశోధకులు. ''ప్రపంచంలో మంచినీరు తరవాత మనుషులు ఎక్కువగా తాగేది టీనే. ఆ కారణంగా వ్యక్తుల ఆరోగ్యంపై టీ ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే విషయం నిగ్గుతేల్చాలని సంకల్పించాం...'' అన్న డాక్టర్‌ వెరెనా స్టాంగల్‌ మరికొందరు జర్మన్‌ శాస్త్రజ్ఞులతో కలిసి అనేక పరిశోధనలు నిర్వహించారు. ఇంగ్లాండ్‌, భారత్‌ వంటిచోట్ల టీలో పాలు కలుపుకొని సేవించే అలవాటు ఉంది. ''బ్లాక్‌ టీలో ధమనులను వ్యాకోచింపజేసే లక్షణం ఉంటుంది. అందువల్ల రక్తప్రసరణ సజావుగా సాగిపోతుంది. పాలు కలపటంవల్ల టీకి రక్తనాళాలను వ్యాకోచింపజేసే శక్తి తగ్గిపోతుంది. ఆ కారణంవల్ల రక్తప్రసరణలో లోపాలు ఏర్పడే అవకాశాలున్నాయి...'' అంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్‌ మేరియోలోపెజ్‌ అనే శాస్త్రజ్ఞురాలు. ఈ బృందం ఎంపికచేసిన 16 మంది వ్యక్తుల్లో కొందరితో బ్లాక్‌ టీని, మరికొందరితో పాలు కలిపిన టీని తాగించారు. రెండు గంటల తరవాత వారినందరినీ పరీక్షించగా పాలు కలపని టీ తాగిన వ్యక్తుల రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ సులువుగా సాగినట్లు, పాలు కలిపిన టీ తాగినవారిలో అటువంటి పరిణామం లేనట్లు తేలింది. కాబట్టి రుచుల కోసం చూడకుండా పాలు కలపని టీ తాగటమే అలవాటు చేసుకోవటం మంచిదేమో!

(Eenadu, 13:05:2007)
___________________________________________

Labels:

ASKING:

Ask to get whatever you want. It is a scientific finding of psychologists that a favourable response to ASKING is a ‘conditioned response’ developed in everybody starting in early childhood, continued constantly during all the years of schooling, and established as the principal business procedure for getting things done. People can not easily say ‘no’. That is why people will do what you ask. Asking must be friendly, courteous, reasonable and persuasive- without offensive pressure and without threatening argument.

Ø Jack and Jill were walking from a religious service.

Jack wonders whether it would be alright to smoke, while praying.

Jill replies, "Why don't you ask the Priest?"

So Jack goes up to the priest and asks, "Priest, may I smoke while I pray?"

But the priest says, "No my son, you may not. That's utter disrespect to our religion."

Jack goes back to his friend and tells him what the good priest told him.

Jill says, "I am not surprised. You asked him the wrong question.Let me try".

And so, Jill goes up to the Priest and asks, "Priest, may I pray while I smoke?"

To which the priest eagerly replies, "By all means, my son. By all means."

The reply you get depends up on the question you ask!

Rarely may you get a negative response. Then you should be deaf to “no” from others. In many cases it is not a decision. They want to get convinced. Never take for granted that you will be refused. People find it difficult to refuse a confident request. Some people like to be asked repeatedly and with coaxing to boost their importance. Make them feel important and you can get their acceptance.

 • If you ask something of someone and you are upset over their response, then it wasn't a request, it was a demand.

 • Getting the right answers is only possible when you have asked the right questions.

 • Quality questions create a quality life. Successful people ask better questions, and as a result, they get better answers.

 • Questions provide the key to unlocking our unlimited potential.
__(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi) _____________________________________

Labels:

APPEARANCE/ APPAREL:

Without attractive packaging, no product can successfully compete. What others see is your appearance/ how you look. “Apparel oft proclaims the man,” said Shakespeare. The power of dress is very great in commanding respect. Good clothes open all the doors. Be careful with your clothing and grooming and look like the kind of person who deserves respect, attention, and special consideration. There is no second chance to make a first impression in situations like an interview, a business meeting, a first meeting etc. The first impression is often made by the dress, the facial expression, and the first few words you speak. By dressing well, we show respect to the people we meet in any transaction and telling them that we take the transaction/ job on hand seriously.

In terms of business attire, dark suits (navy blue and charcoal grey) reflect power, sophistication and authority. Have you ever seen a prime minister or president in a tan suit?

(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)
_____________________________________

Labels:

మరో ప్రపంచం

''ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో, జనియించినాడనీ స్వర్గ ఖండమున'' అన్నారు రాయప్రోలు. భూలోకంలోను అందులో భారతదేశంలోను పుట్టడమే మహద్భాగ్యం అని ఆయన ఉద్దేశం. అనేక పరిశోధనల అనంతరం శాస్త్రజ్ఞులు సూర్యుని ఆధారంగా అనేక గోళాలు, గ్రహాలు తిరుగుతున్నాయని అందులో భూగోళం ఒకటనీ కనిపెట్టారు. ''గెలీలియో గొప్పేమిటి? తెగ పరిశోధనలు చేసి భూమి గుండ్రంగా తిరుగుతోందని కనిపెట్టాడు. ఆ విషయం తెలుసుకోవటానికి అన్ని పరిశోధనలు ఎందుకు? రెండు పెగ్గులేసుకుంటే చాలదా?'' అని ఓ మందుబాబు దబాయించాడు. అటువంటి దబాయింపుల సంగతెలా ఉన్నా- శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు కొనసాగిస్తూ ఎన్నో కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నారు. మానవుడు చంద్రమండలాన్ని శోధించి వచ్చాడు. రోదసిలోకి అడుగుపెట్టాడు. ఇతర గ్రహాల్లో ఏముందో ఎవరున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో నిత్యం అన్వేషణలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మొదటిసారిగా ఓ మానవుణ్ని హిమాలయ పర్వతాలపై చూసినప్పుడు, ''ఎక్కడివాడొ యక్షతనయేందు జయంతు వసంత కంతులం జక్కదనంబునం గెలువజాలెడువాడు'' అంటూ వరూధిని ఆశ్చర్యపోతుంది. ''సురగరుడోరగ నర ఖేచర కిన్నర సిద్ధ సాధ్యచారణ విద్యాధర గంధర్వ కుమారుల నిరతము గనుగొనమె'' అంటూ తాను చూసే సకల లోకాల అందగాళ్ళనీ జ్ఞప్తికి తెచ్చుకొని, ''పోలనేర్తురె వీనిన్‌'' అనుకుంటూ సురగరుడ ఖేచర కిన్నర గంధర్వుల కంటే మానవుడైన ప్రవరాఖ్యుడే అందగాడనే నిర్ణయానికొస్తుంది.

పాతాళలోకంలో ఉండే నాగరాజ కన్యక ఉలూచి అనే అందగత్తె కూడా గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న అర్జునుణ్ని చూసి అలాగే ఆశ్చర్యపోయి, మంత్రబలంతో పాతాళంలోని తన నాగలోకానికి తీసుకొని వెళుతుంది. అక్కడ తన కోరికను అర్జునుడికి తెలియజేయగా అతను ఆశ్చర్యపోయి, ''ఫణిజాతివీ, వేను మనుజజాతి నన్యజాతి ప్రవర్తించుటర్హమగునె'' అంటాడు. ప్రేమకు జాతి మత లోక భేదాలేవీ అడ్డురావని ఉలూచి తన వాదనా పటిమతో రుజువు చేసి అర్జునుణ్ని పెళ్ళాడటం 'విజయవిలాస' కావ్యంలోని ఒక మధురాధ్యాయం. ఇతర లోకాలపై మానవుని విజయయాత్ర పురాణ కాలంనుంచీ కొనసాగుతూనే ఉంది. ఒక గ్రహంలో లేదా ఒక లోకంలో ఉండేవారు అన్య ప్రాంతీయుల అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని కుతూహలపడటం సహజమే. నిత్యం కలుగులోనే ఉంటూ అదే లోకమని భావించే ఓ ఎండ్రకాయ, ''నరలోకంబెటువంటిది, సురలోకంబెట్టిది నీవు చూచితె?'' అని తల్లినడుగుతుంది. అంతటితో ఊరుకోకుండా, ''మనమందిరముల సాటివి యౌనొ విరచితగతి నింతకంటె విస్తీర్ణములో, అందుండెడి వారికి మన చందమొ రూపములు వేరె చందమొ నాకా చందము వివరింపుము'' అంటూ వెంటపడుతుంది. మన శాస్త్రజ్ఞులూ చంద్రునిలో ఏముంది, అంగారక గ్రహంలో ప్రాణి సంతతి ఉందా లేదా అనే విషయాల గురించి నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. గ్రహాంతర జీవుల గురించీ, ఎగిరే పళ్లాల గురించీ నిత్యం ఆశ్చర్య పరిచే వార్తలు వెలువడుతూనే ఉన్నాయి.

భూమిని మించిన మరో మహాభూమి ఉందని శాస్త్రజ్ఞులు ఇటీవల కనుగొన్నారు. భూమికంటె అయిదురెట్లు బరువైనదిగా భావిస్తున్న ఆ మహాగ్రహం సౌర వ్యవస్థకు 20 కాంతి సంవత్సరాల దూరంలో ఒక ఎర్రని నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందంటున్నారు. గ్లీసే 581 అనే ఆ నక్షత్రం చుట్టూ పరిభ్రమించే ఆ గ్రహం చాలావరకు భూమండలాన్ని పోలి ఉందంటున్నారు. జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన 11మంది అంతరిక్ష శాస్త్రజ్ఞులు మైఖేల్‌ మేయర్‌ అనే శాస్త్రజ్ఞుని ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనల్లో ఈ మహాభూమి వెలుగులోకి వచ్చింది. ఈ గ్రహం గ్లీసే 581 నక్షత్రానికి దగ్గరగానే ఉన్నప్పటికీ ఆ నక్షత్ర కాంతి సూర్యుడంత ప్రకాశవంతమైనది కాకపోవటాన అక్కడి ఉష్ణోగ్రత అంత తీవ్రంగా లేదు. అక్కడి సగటు ఉష్ణోగ్రత 0 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రెండు వందలకు పైగా గ్రహాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నప్పటికీ ఈ గ్రహమే మిగతా అన్నిటికంటె భూమికి దగ్గర పోలికలతో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు కనుగొన్న ఇతర గ్రహాలకన్నా ఈ గ్రహమే చిన్నది. ఈ గ్రహంపై ఉన్న ఉష్ణోగ్రత కారణంగా ద్రవరూపంలో నీరు, ప్రాణికోటి ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున ఈ గ్రహానికి చేరగలగటం దాదాపు అసాధ్యం. ఈ కొత్త గ్రహానికి 581సి అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ గ్రహాన్ని గురించి ఇంకా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించాలనీ, నిర్వహిస్తామనీ జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన అంతరిక్ష శాస్త్రజ్ఞులు అంటున్నారు. వీరి పరిశోధనలు ఫలవంతమైతే మరో భూమికి చెందిన మరిన్ని వింతలూ విశేషాలూ బయటపడగలవని ఆశించవచ్చు!
(Eenadu,06:05:2007)
____________________________________

Labels:

The Sivaji wave

Rajnikant’s “Sivaji” creating history through advance ticket sales even before its release is an old story! The way it opened (June 15 to 18) across India and 28 countries worldwide was phenomenal. “Sivaji” became the first Tamil film ever to be featured in the U.K. top 10 and took a 100 per cent opening in Mumbai and Delhi multiplexes, whereas Big-B’s “Jhoom Barabar Jhoom” released the same week could manage only a 50 to 60 per cent opening! In Kerala, despite heavy rains, “Sivaji” has taken the best ever opening for any film in history from a record 86 screens! Back home in Chennai, nearly two lakh seventy thousand people saw it, in 17 screens and the film collected Rs. 1.35 crore in the first four days. On the ECR, at Mayajaal, it rocked with almost continuous shows from Friday morning to late Sunday night. Says B. Udeep, CEO, Mayajaal multiplex: “Rajni is a global star! We had 78 houseful shows from six screens in three days, 12,200 audiences saw it and we netted approximately Rs. 13.5 lakh! No other star in the world can work this magic.”

SREEDHAR PILLAI

(The Hindu, Metro Chennai, 21:06:2007)
____________________________________________________________

A magnum opus in style - Sivaji

Genre: Action
Director: Shankar
Cast: Rajinikanth, Shreya, Vivek, Suman
Storyline: Of a do-gooder who vows to expose black money hoarders.
Bottomline: With an expert team in tow, Rajini reigns!

He’s referred to as ‘Madras Messiah’ and ‘Style Samrat’ (in the film) and he’s here to win! Diligently chiselled to meld Shankar’s formula and Rajinikanth’s style AVM’s ‘Sivaji’ is a t reat for frenzied fans of action. Generally, too much hype or too much secrecy could turn counter-productive. But even with a hero whose selective off-media stance has been slightly disconcerting (the English news channels went to town with crisp interviews with the superstar!) juxtaposed with dizzying promo campaigns, ‘Sivaji’ provides enough and more for style-starved cinemagoers all over. And the appreciable factor is ‘Sivaji’ carries a solid message too.

Cleansing society of chronic ills is a theme Shankar els in.. The helpless man on the street can do nothing about the bad becoming big and the good being punished. But Shankar’s hero can — with a cornucopia of glitz and gloss! And with Rajini helming the action in style, the entertainment module is near perfect.

Sivaji decides to rid the country of black money — a stupendous task. The way he goes about systematically exposing hoarders and racketeers may not be true to life. But who wants reality on screen?

The utopian State Sivaji strives for is a futile dream, so when it happens at least on celluloid, why not sit back and enjoy?

And now ,to Rajani

The intro scene where Rajinikanth turns around smilingly to face the camera shocks you out of your seat! The man looks as young as he did about three decades ago! The right kind of wig, make up, angles and digital expertise present a remarkably youthful Rajini. It’s only in one of the later scenes (in prison), does he look jaded.

The suave, sophisticated, English-speaking (and quite clearly, at that) Rajinikanth is rather new. His style patterns gain more sheen in ‘Sivaji’ — the ambidexterity and speedy body language will make his fans scream in joy. Of course, as for fight or dance sequences whatever Rajini does with his feet and fingers is dance and how ever he moves his hands and legs is style!

Rajini’s adeptness at slapstick comedy is well-known — Shankar exploits it quite well. Vivek and Rajini make a hilarious twosome. If Vivek and others have been allowed to mimic Rajini so freely it only shows the hero’s maturity. And the way in which Rajini and Vivek imitate Vadivelu is another rib-tickling exercise. ‘Sivaji’ is a bumper harvest for Vivek who also holds his own with his typical, sarcastic one-liners.

Shreya shines as the modest, well covered homely girl. In the dances, of course, she compensates amply with a crowd pulling glam quotient. In such a meticulously detailed film you wonder why her lip sync has been grossly ignored — at times her erroneous mouthing of words appears quite funny.

Suman returns to Tamil after quite a while, as a villain this time. His menacing looks, authoritative strides and understated performance grip you. Just a couple of scenes, but Raghuvaran makes them impressive.

Shankar’s story, though on guessable lines, has been made engaging by his screenplay and Anthony’s intelligent scissoring. Yet ‘Sivaji’ sags towards the end. However, the cocktail gets tangier with Sujatha’s dialogue.

With A.R. Rahman at the console the hip numbers spell variety. The SPB-Rajini combo for the opening song has always augured well. This time it’s an exuberant ‘Ballelakka …’ The scintillating ‘Sahana Saaral …’ will remain unforgettable. (Are you imagining it or is Udit Narayan’s pronunciation really improving?)

The sound design of A.S.Lakshminarayanan, the large helpings of visual splendour that Thottatharani’s art serves, the excellent lens view K.V.Anand provides, the hi-tech CG wizardry coupled with the make-up department’s (Banu) incredible achievement — technical support offers a Lucullan feast in ‘Sivaji.’

Those who plump for films in the ‘Superman,’ ‘Spiderman’ genre will love our very own Style Man Supreme!

MALATHI RANGARAJAN

(The Hindu, Friday Review,Chennai Tamil Nadu, 22:06:2007)
_______________________________________________________________

Labels: ,

Wednesday, June 20, 2007

నవ్వంటే నవ్వులాట కాదు

-సోనాలి
నవ్వు విలువ చెప్పటానికి ''ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు'' అనే పాత పాట చరణం ఒక్కొటి చాలు. ''నీ దరహాసచంద్రికలు నిండిన నా మనస్సులో లేదు కదా లవలేశము పేదరికమ్ము'' అనే పద్యపంక్తి కూడా నవ్వు అనేది మనసుని ఎలా నింపుతుందో చెబుతుంది. ఒక్కసారి నవ్వరాదూ, ముత్యాలు ఏరుకుంటాననీ, మల్లెపూలు కోసుకుంటాననీ ప్రేయసితో చెప్పని ప్రియుడెవరుంటారు? ఆ ఒక్క మాటతో సదరు ప్రేయసి జీవితాంతం నడచి రాదూ...
ఎంత అపరిచితుడైనా (సినిమా కాదు) ఒక్కసారి నవ్వి చూడండి. వెంటనే బదులొస్తుంది. ఆత్మనీ, ప్రేమనీ, స్నేహాన్నీ అన్నింటినీ తెలియజేసేది నవ్వు ఒక్కటే. నవ్వుది జీవద్భాష, నవ్వుది అంతర్జాతీయ భాష. పసిపాప దగ్గర్నుంచీ పండు ముసలిదాకా నవ్వు ఎల్లలెరుగదు. నవ్వుతో కోటి భావాలు పలికించవచ్చు.

ఇలా నవ్వు గురించి ఎంతో చెప్పవచ్చు. రామాయణంలో నవ్వు ప్రస్తావన ఉంది, భారతంలోనూ ఉంది. (ప్రబంధ యుగంలో ఏడ్పుకి ఇచ్చిన ప్రాధాన్యం నవ్వుకి ఇవ్వలేదు.)

నవ్వు గురించి ఎంతైనా చెప్పవచ్చు కానీ నవ్వించేట్టు చెప్పటం కష్టం. ఎదుటివారిని ఇట్టే ఏడిపించవచ్చు కానీ నవ్వించటం కనాకష్టం. నవ్వించటం అంత సులభం కాదు. ఎదుటివాడికి హాస్య చతురత లేకుంటే ఇక బ్రహ్మతరమూ కాదు (బ్రహ్మ నవ్విస్తాడని అర్థం చేసుకోవద్దు). నవ్వించే ప్రతివాడి వెనకాలా ఒక విషాదం ఉంటుందన్నాడు ప్రముఖ హాస్య రచయిత ఆర్ట్ బుక్‌వాల్డ్. ప్రతి ఆనందం వెనకాలా మరొకరి దుఃఖం ఉంటుందన్నాడు బాల్జాక్. (ఈ సూత్రాలన్నీ కితకితలు పెట్టి నవ్వించేవాడికి వర్తించవు).

నవ్వు ఆరోగ్యాన్నిస్తుంది. నవ్వు బలాన్నిస్తుంది. (నవ్వుతున్నప్పుడు బలం పనికిరాదు. మనం దిండుని కూడా ఒడిసి పట్టుకోజాలం. తెలుసా!)

బాల్జాక్ చెప్పింది నిజమేననిపిస్తోంది. నాయకుల ఆనందం వెనకాల ప్రజల దుఃఖం ఉంటుంది. అవినీతీ, కాంట్రాక్టులూ, రోడ్లూ, ప్రాజెక్టులూ, సర్కారు ఇళ్లూ చూడండి... నిజమే కదూ!

''లోకమునందు ఏ మనుజుడు ఎక్కువ ఆనందము పొందును'' అని యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు. దానికి ధర్మరాజు సత్యకాలం మనిషి కనుక పారలౌకిక సమాధానమేదో ఇస్తాడు. నేనైతేనా ''ఎక్కువ కొంపలు ముంచినవాడు ఎక్కువ ఆనందము పొందును. దేశాన్ని నట్టేట్లో ముంచినవాడు బ్రహ్మానందము చెందును.'' అని ఠకీమని జవాబిచ్చేవాణ్ని, యక్షుడి బుర్ర తిరిగి స్పృహ తప్పేట్టు!

''నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు'' అని సిగ్గు తీసి చెట్టుమీద పెట్టేవాళ్లకీ పరమానందం సిద్ధిస్తుంది. లక్షలు తీసుకుని మహిళల్ని దేశాలు దాటించేవాడికున్నంత ఆనందం నీకూ నాకూ దక్కుతుందా?

'లంచం తిన్నావు' అంటే, 'రసీదు చూపెడితేనే ఒప్పుకుంటా' అనేవాళ్లకేం చెబుతాం? గాదెకింది పందికొక్కు రసీదిచ్చి బొక్కుతుందా, దొంగకుక్క రసీదిచ్చి కుండలు నాకుతుందా?

ఆనందించటం నేర్చుకోవాలని రుషులూ, సర్వసంగ పరిత్యాగులూ, ఆనందం పుష్కలంగా దొరుకుతున్నవాళ్లూ ఫ్రీగా ఉద్బోధిస్తారు. ఆ తత్వం తలకెక్కితే అంతా హాయే. దేవదాసు చెప్పినట్టు బాధే సౌఖ్యమనుకోవచ్చు, చీదరింపే సింగారమనుకోవచ్చు. అలా అనుకుంటే చాలు... ఆనందమే ఆనందం, డబ్బే డబ్బు, సౌఖ్యమే సౌఖ్యం! అనుకుంటాంకానీ, ఆనందాన్ని పొందటానికి అనేక మార్గాలున్నాయి. అందుకు సందు దొరక్క ఎదుటివాణ్ని వెక్కిరిస్తాం కాని!

సొంతంగా ఆనందించలేనివాడు ఆనందించేవాణ్ని చూసి ఆనందించటం నేర్చుకోవాలి. అలా కాకపోతే మనకు ఏడుపే మిగులుతుంది. ఆనందించేవాడు చెప్పే సూక్తి ఇది.

అలా నవ్వుకోటానికీ, ఆనందించటానికీ మనకు బోలెడు సరుకుంది. కళ్లంటూ ఉంటే చూసీ, వాక్కంటూ ఉంటే రాసీ అన్నట్టుగా చూడగలిగే భావుకత, నవ్వగలిగే సృజన ఉండాలి. అవి లేకుంటే అది ఎదుటివాడి తప్పా చెప్పండి?

కుక్క పిల్లా, సబ్బు బిళ్లా, అగ్గిపుల్లా ఏదైనా కవితామయమే అన్నట్టు ఏ పార్టీ అయినా, ఏ లీడరయినా, ఏ అధికారి అయినా వాళ్లూ, వాళ్ల చేష్టలూ, వాళ్ల మాటలూ ఆనంద రససాగరంలో ముంచి తేలుస్తాయి. వక్రీకరించి వ్యంగ్య పరచటానికి ఏ కార్టూనిస్టులో, హాస్య రచయితలో అవసరంలేదు. మన నాయకపుంగవాల (పుంగవాలే కాదు గవాలు కూడా అని మనవి) మాటల్ని వరసగా పేర్చుకుపోండి ఫకాల్న నవ్వు వస్తుంది చెకుముకి రాయితో నిప్పు పుట్టినట్టు!

పాతకాలపు జానపద సినిమాలో రాజబాబుని సిపాయిలు పట్టుకుని రహస్యాలు ''చెప్పు చెప్పు చెప్పు'' అని అడిగితే రాజబాబు వారికి చెరో చెప్పు చేతికిచ్చి బురిడీ కొట్టించి పరారై ఆనందిస్తాడు. రాజబాబు ఇద్దరు వ్యక్తుల్ని బురిడీ కొట్టిస్తేనే నవ్వు పుట్టినప్పుడు మన నాయకాగ్రేసరులు ఏకకాలంలో ఎందరినో బురిడీ కొట్టించినప్పుడు ఎంతగా ఆనందించాలి!

తెనాలి రామలింగడు అందర్నీ బురిడీ కొట్టించే కదా నవ్విస్తాడు. నసీరుద్దీన్ కానీ, బీర్బల్ కానీ అంతా బురిడీ వ్యవహారమే కదా, మరి వారికి దొరికిన మర్యాదా, గౌరవాదులు దేశాన్ని బురిడీ కొట్టించేవారికెందుకు లేవు? ఉండాలిగా!

ఇప్పుడు లైన్లోకి వచ్చారుగా... మనకు ఎంత ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, అనంతానందం దొరుకుతోందో ఎరిగారా.

కరెంటు కోతా, రైతుల ఇబ్బందులూ, ఈతిబాధలూ, అవినీతి బాధలూ, నిరుద్యోగం, మోసం, దగా, ఆక్రమణలూ, గూండాయిజం, అధిక ధరలూ ఇవన్నీ మరచి ఆనందంగా ఉండాలంటే వాటిని చూసి నవ్వటం నేర్చుకోవాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలి అన్నారు.

నవ్వు దుఃఖాన్ని మరిపిస్తుంది. నవ్వు బాధల్నించి ఉపశమింప జేస్తుంది. నవ్వులో చాలా రకాలు ఉన్నాయికానీ తేటతెల్లని నవ్వుని పోగొట్టుకోనంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా అజేయంగా నిలుస్తాం. ఈ రోజు కష్టాల్ని చూసి నవ్వుదాం, అవినీతిని చూసి అపహాస్యం చేద్దాం, గూండాయిజంపై వికటాట్టహాసం చేద్దాం, నవ్వుల కొరడాలతో బాధల వీపుల్ని బద్దలు చేద్దాం.

(Eenadu, 06:05:2007)
_____________________________________________

Labels: ,

సెకండ్‌హ్యాండ్‌... ఫస్ట్‌ క్లాస్‌!

వినబోతే
'హ్యాండు మారిన నష్టమేమోయ్‌
బ్రాండు మంచిది చూసుకోవోయ్‌''

అన్న మాటలు వినియోగదారులకు తెగ నచ్చేసినట్టున్నాయి. సెకండ్‌హ్యాండ్‌ మాల్‌
కొను'గోల్‌' చేసేవాళ్లు ఎక్కువైపోతున్నారు. ఆ వస్తువుల్ని తడిమి ఎంత హేండ్‌సమ్‌గా ఉందో అనుకుంటూ మందహాసంతో మందగమనం చేస్తున్నారు. వాళ్లకి షేక్‌హ్యాండ్‌లు ఇచ్చేవారు బోలెడు మంది. మైండ్‌సెట్‌ మార్చుకుంటే నష్టమేమీ లేదన్నమాట.

పూర్వ కాలంలో సెకండ్‌హ్యాండ్‌ వస్తువులు అనగానే సెంటిమెంట్‌ దెబ్బతో
'కారు'మబ్బులు కమ్ముకునేవి. 'కారు'చిచ్చు పుట్టేది. ఇప్పుడలా కాదు. 'కారు'వాక సాగుతోంది. వాడేసిన 'బెంట్లీ' కార్లు మార్కెట్‌లో దర్శనమిచ్చి 'కారు చూడు కారందం చూడు నే మునుపటి వలెనే లేనా' అని హొయలు పోనున్నాయ్‌. వాటిపైన 'ఇష్ట'మర్లు మరులుకొంటూ కోట్లు ఖర్చు చేయడానికి ఎదురుతెన్నులు చూస్తున్నారు. ప్రీ-యూజ్డ్‌ కార్ల వైపు మొగ్గుచూపేవాళ్లకు కొదువ లేదు. 'ఏమి బ్రాండ్‌లే హలా! సెకండ్‌హ్యాండ్‌ భేష్‌లే భళా!!' అనే పల్లవి ఎత్తుకొంటున్నారు. వాడేసిన కార్ల విక్రయాలు సాలీనా 8-10 లక్షల యూనిట్లకు చేరాయి. కొత్త కార్లవిపణికీ, దీనికీ తేడా కాస్తే.

పెద్ద షాపుల సెకండ్స్‌ సేల్స్‌కూ గిరాకీ ఎక్కువే. పాత దుస్తులను అమ్మే వారపు సంతలు ఎటూ ఉండనే ఉన్నాయిగా. ఇంటర్‌నెట్‌లో ఎభయ్, తదితర సైట్లు సినిమా తారలు కొన్ని హిట్‌ సినిమాల్లో ధరించిన కాస్ట్యూమ్స్‌ వేలం వేస్తుంటాయి. వేలంవెర్రి అనేది 'వర్డు'పోసుకుంది సెకండ్స్‌ వ్యాపారంలోనే. సెకండ్‌హ్యాండ్‌ భవనాల్ని బ్యాంకులూ, ప్రభుత్వమూ వేలం వేస్తుంటాయి.

కాదేదీ సెకండ్‌హ్యాండ్‌ కనర్హం అనుకోవడానికి లేదు. అండర్‌వేర్లను ఈ పద్ధతిన విక్రయించడానికి వీల్లేదు. ఇటువంటివి చెప్పుడు మాటలు కావు, చెప్పుల మాటలు. సెకండ్‌హ్యాండ్‌ చెప్పులకు గుళ్ల దగ్గర తిరిగే దొంగ దగ్గర తప్ప ఎక్కడా డిమాండ్‌ ఉండదు. ఒకాయన పాపం చెప్పులను కొందామని చెప్పుల దుకాణానికి వెళ్లాడు. కొనదల్చుకున్న చెప్పులు కాళ్లకు తొడుక్కుని వాటి మన్నిక ఎన్నాళ్లు ఉంటుందో అనుమానిస్తూ కూర్చున్నాడు. అదే సంగతిని షాప్‌ యజమానితోనూ ప్రస్తావించాడు. దానికి యజమాని 'సందేహించనక్కర్లేదు... ఆ చెప్పులు ఇంకో ఏడాది పనిచేస్తాయి' అన్నాడు. అంత గట్టిగా ఎలా చెప్పగలరు? అని కస్టమర్‌ అడిగాడు. 'మీరు వేసుకున్న చెప్పులను నేను ఏడాది నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు' అన్నాడు. దాంతో షాక్‌ తిన్న పెద్దమనిషి
'చెప్పు'పెట్టకుండా వెనుదిరిగి వెళ్లిపోయాడు. సెకండ్‌హ్యాండ్‌ పుస్తకాల మార్కెట్‌ ఆ'షో'మాషీ వ్యవహారమనుకుంటే పొరపాటు. పెద్ద పెద్ద మేధావులకే అది జ్ఞాన జన్మభూమి. ముందుకాలమంతా సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌దే అన్న ప్రచారం ఉంది. ఏడేడు జన్మాల బంధం అంటుంటారు... మన జన్మకే సెకండ్‌హ్యాండ్‌, థర్డ్‌ హ్యాండ్‌ అని సిరీస్‌ ఉన్నప్పుడు వస్తువులు ఫస్ట్‌ హ్యాండ్‌ కావాలని సీరియస్‌గా పట్టుబట్టడం ఎందుకు చెప్పండి?
- ఫన్‌కర
(Eenadu,15:04:2007)
_________________________________________

Labels:

వంచనలోనే ఆనందం?

- చికిత
ప్రేమికుల రోజు, మిత్రుల రోజు, నీటి రోజు, నిప్పు రోజూ ఉన్నట్టుగా ఫూల్స్‌కి(మూర్ఖులకి) ప్రత్యేకంగా ఒక పండగ రోజు ఏప్రిల్ మొదటి తారీఖున ఉండటం ఎంతైనా ముదావహం. మిగతా రోజులన్నీ వారివి కావని కాదు. ఆస్తమా డే, క్యాన్సర్‌డే, ఎయిడ్స్‌ డే అని ప్రత్యేకంగా ఉంటాయి. అయినంత మాత్రాన మిగతా రోజుల్లో ఆయా జబ్బులకి ప్రాధాన్యం ఇవ్వరని కాదుగా.

పునఃచైతన్యం పొందటానికీ, పదవిలో ఉన్నవారు ప్రతియేటా ప్రజలకు పునరంకితం కావటానికీ స్టేడియంలో సంబరాలు జరుపుకొన్నట్టుగానే యావత్‌ మూర్ఖజాతి ఒకటై, (మూర్ఖపు) పనులన్నీ పక్కనపెట్టి- మూర్ఖలోకపు సత్తా చాటడానికి, మూర్ఖుల పునరుజ్జీవనానికి సంకల్పించటానికి ఒక రోజంటూ ఉండటం ఎంతో అవసరం.

మూర్ఖత్వం ఒకందుకు చాలా మంచిది. ప్రేమలో పడ్డవాడు ప్రాణాన్ని లెక్కచేయడు. సర్వస్వం త్యాగం చేస్తాడు. వాడికి బాధే సౌఖ్యం. దేవుడి భక్తిలో లీనమయినవాడికి ఐహిక కష్టసుఖాలు తెలియవు. అలాంటివాడు దారిద్య్ర బాధను లెక్కచేయడు. అలాగే మూర్ఖత్వం అబ్బితే గొర్రెపోకడే. మనం ఎన్నిసార్లు ఎలా మోసపోతున్నామనే స్పృహ ఉండదు. ప్రతిసారీ ఎన్నికల్లో ఇట్టే మోసపోతాం. మోసం తాలూకు నొప్పి గ్రహించే స్థితిలో ఉండం. అవునా కాదా?

విషయాన్ని కాస్తంత భిన్నంగా ఆలోచిద్దాం... వన్యమృగ సంరక్షణ దినోత్సవాన్ని వన్యమృగాలు జరుపుకోవు. మనం జరిపి, వాటి అభివృద్ధికి పాటుపడతాం. అలాగే మూర్ఖుల అభివృద్ధికి మూర్ఖులే పాటుపడాల్సిన పనిలేదు. మూర్ఖుల అవసరం ఉన్నవారు మూర్ఖుల్ని మూర్ఖులుగా ఉంచటానికీ, కొత్తవారు మూర్ఖులుగా పరిణతి చెందటానికీ సతతం పాటు పడతారు.

పురాణేతిహాసాల్లోనూ, చరిత్రలోనూ మనకు మూర్ఖులకు కొదవలేదు. మూర్ఖులే లేకుంటే అరాచకం తాండవిస్తుంది. జీవితంలో ఆనందం అంతరిస్తుంది. ఎవరైనా ఫూల్‌ అయితే మనం నవ్వుతాం. ఫూల్‌ కాని వారిని ఫూల్‌ చేసి ఆనందిస్తాం. ఫూల్‌ చేయడంలో ఆనందం ఉంది. ఒక వ్యక్తిని ఫూల్‌ చేస్తేనే ఎంతో ఆనందిస్తాం. ఈ లెక్కన కోట్లసంఖ్యలో ఉన్న ప్రజానీకం మొత్తాన్నీ ఫూల్స్‌ చేస్తున్నవారికి ఇంకెంత ఆనందం కలుగుతుండాలి? బ్రహ్మానందం అంటే అదేనేమో! అనంతానందం... అది అనుభవించినవాడికి తెలుస్తుంది. మనకు అర్థంకాదు.

మన మేరకు మనం మనకు దొరికిన వాణ్ని బక్రా చేసి ఆనందిస్తాం. ఎక్కువ మందిని బక్రా చేసి ఆనందిస్తున్నవాళ్లు అధికారంలో ఉండి అమితానందరస సాగరంలో మునిగి తేలుతుంటారు.

అధికారంలో ఉన్నవారిని ఐదేళ్లదాకా ఎలాగూ దించలేం... వారు ఏం చేసినా సరే ఎంత మేసినా సరే. మనల్ని బక్రా చేసి వాళ్లు గడ్డిమేస్తారు. వారిని మూర్ఖుల్ని చేయలేం. కనీసం అలా ఊహించుకుని జోకులు చెప్పుకుంటే పోలా?

సంతోషం సగం బలం అన్నారు. సరిగ్గా ఇలాగే ఊహించి ఉంటారు మన పూర్వీకులు. అందుకే రాజులపైనా, మంత్రులపైనా, ప్రజల్ని పీడిస్తున్న ఇతరేతర అధికార గణాలపైనా వారివారి మూర్ఖత్వం పైనా కథలుకథలుగా చెప్పుకొని కాలం గడిపేసి ఉంటారు.

ఈ లెక్కన పురాతన కాలం నుంచే మన దేశంలో 'మూర్ఖుల'కు కొదవలేదని అర్థమవుతోంది. కథలు ఊర్నే పుడతాయా, నిప్పులేనిదే పొగరాదు. తుగ్లక్‌లు కోకొల్లలు, నాటికీ నేటికీ.

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం ప్రభలు చిమ్ముతూ పరిఢవిల్లుతోంది. కాని మూర్ఖ సంతతి మాత్రం అంతరించిందా అంటే లేదనే చెప్పాలి.

ఎదుటివాడిని ఫూల్‌ చేస్తేనే మనం తెలివిగలవాడిగా చెలామణీ అవుతాం. ఎంతో మందిని ఫూల్‌ చేస్తేనే నాలుగురాళ్లు వెనకేసుకోవచ్చు. అధికారం కూడా అంతే అనుకున్నాం కదా. ఈ పరమార్థం తెలిసినవాడు ఎప్పుడూ పైనే, మనపైనే ఉంటాడు.
(Eenadu,01:04:2007)
____________________________________________

Labels: