My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, November 14, 2007

Windows in Hindi (Atyant Mulayam Khidkiyan 2000)

Bill Gates was in India last year. He announced that Microsoft plans to release a Windows version in Hindi. Here are some of the Windows related terms that have been approved by Bill Gates to be used in the Hindi version of... Khidkiyan 2000:( More appropriately Atyant Mulayam Khidkiyan 2000 )

Atyant Mulayam = Microsoft
Khidki = Window
Phaail = File
Bachao = Save
Aise Bachao = Save as
Subko Bachao = Save All
Mujhe Bachao = Help
Madad Pe Madad = Help On Help
Dhoondo = Find
Firse Dhoondo = Find Again
Dhoondo aur Badlo = Find & Replace
Hilao = Move
Nakal = Copy
Chipkao = Paste
Chaara = Options
kachre ka daaba = Recycle bin
Bura sandesh yaa phail naam = Bad command or file name
Firse koshish karo, Naakaamyab = retry,fail
chhavo = Tile
Daak Bhejo = Send Mail
Daak = Mail
Daakiya = Mailer
Bhaago = Run
Chhaapo = Print
Dekh Ke Chhaapo = Print Preview
Chipkao = Paste
Khaas Chipkao = Paste Special
Mitao = Delete
Kagaz Uper = Page Up
Kagaz Neeche = Page Down
Anth = End
Saaf karo = Clear
Sab Kuch Saaf Karo = Clear All
Makan = Home
Topi Ka Tala = CapsLock
Hathiyaar = Tools
Khuli Chaadar = Spreadsheet
Futaas Ki Goli Kha = Exit
Ped = Tree
Chooha = Mouse
Chooha Chalak = Mouse Driver (Software)
Tik-Tik Karo = Click
Idhar-se-Udhar,Udhar-se-Idhar Wala Danda = Scrollbar
Pardha = Screen
Pardha Bachanewala = Screen Saver
Krimi = Virus
Tika = Anti Virus
Karo = Do
Galthi = Error
Ghusao = Insert
Pahle Ghusao = Insert Before
Beech Mein ghusao = Insert Between
Baadhme Ghusao = Insert After
Chabi Phalak = Key board
Choohha Ka Bisthar = Mouse Pad
Avaaz Phodney Wali Cheez = Sound Blaster
Antar Jaal = InterNet
Baath Cheeth Dabba = Dialog Box
Chale? = Exit?

(An email forward)
_________________________________________
Please also see:
my blog for "
Enzooy dis fun stuff",Tuesday, May 16, 2006
_______________________________________________

Labels: ,

Tuesday, November 13, 2007

HILARIOUS


Supposedly written by a schoolboy with all original spellings:

The original inhabitants of ancient India were called Adidases, who lived in two cities called Hariappa and Mujhe-na-Daro. These cities had the best drain system in the world and so there was no brain drain from them Ancient India was full of myths which have been handed down from son to father. A myth is a female moth. A collection of myths is called mythology, which means stories with female caricatures. One myth says that people in olden times worshipped monkeys because they were our incestors.

In olden times there were two big families in India. One was called the Pandava and the other was called the Karova. They fought amongst themselves in a battle called Mahabharat, after which India came to be known as MeraBharat Mahan.

In midevil times India was ruled by the Slave Dienasty. So named because they all died a nasty death. Then came the Tughlaqs who shifted their capital from Delhi because of its pollution. They were followed by the Mowglis. The greatest Mowgli was Akbar because he extinguished himself on the battlefield of Panipat which is in Hurryana. But his son Jehangir was peace loving; he married one Hindu wife and kept 300 porcupines. Then came Shahajahan who had 14 sons. Family planning had not been invented at that time. He also built the Taj Mahal hotel for his wife who now sleeps there. The king sent all his sons away to distant parts of India because they started quarrelling. Dara Seiko was sent to UP, Shaikh Bhakhtiyar was sent to J & K, while Orangezip came to Bombay to fight Shivaji. However,after that they changed its name to Mumbai because Shivaji's sena did not like it. They also do not like New Delhi, so they are calling it Door Darshan.

After the Mowglis came Vasco the Gama. He was an exploder who was circumcising India with a 100 foot clipper. Then came the British. They brought with them many inventions such as cricket, tramtarts and steamed railways. They were followed by the French who brought in French fries, pizzazz and laundry. But Robert Clive drove them out when he deafened Duplex who was out membered since the British had the queen on their side.

Eventually, the British came to overrule India because there was too much diversity in our unity. The British overruled India for a long period.They were great expotents and impotents. They started expoting salt from India and impoting cloth. This was not liked by Mahatma Gandhi who wanted to produce his own salt. This was called the Swedish moment. During this moment, many people burnt their lion cloths in the street and refused to wear anything else. The British became very angry at this and stopped the production of Indian testiles.

In 1920, Mahatma Gandhi was married to one wife. Soon after he became the father of the nation. In 1942 he started the Quiet India moment, so named because the British were quietly lootoing our country. In 1947, India became free and its people became freely loving. This increased our population. Its government became a limited mockery, which means people are allowed to take the law in their own hands with the help of the police.

Our constipation is the best in the world because it says that no man can be hanged twice for the same crime. It also says you cannot be put in prison if you have not paid your taxis. Another important thing about our constipation is that it can be changed. This is not possible with the British constipation because it is not written on paper. The Indian parlemint consists of two houses which are called lower and higher. This is because one Mr Honest Abe said that two houses divided against itself cannot withstand. So Pandit Nehru asked the British for freedom at midnight since the British were afraid of the dark. At midnight, on August 15, there was a tryst in parlemint in which many participated by wearing khaki and hosting the flag. Recently in India, there have been a large number of scams and a plaque,it can be dangerous because many people died of this plaque in Surat. Scams are all over India. One of these was in Bihar where holy cows were not given anything to eat by their elected leader. The other scam was in Bofor which is a small town in Switzerland.In this, a lot of Indian money was given to buy a gun which can shoot a coot.

Presently India has a coalishun government made up of many parties, left,right and centre. It has started to library the economy. This means that there is now no need for a licence as the economy will be driven by itself.

India is also trying to become an Asian tiger because its own tigers are being poached. Another important event this year was the Shark meeting at Malas Dive. At this place, shark leaders agreed to share their poverty, pollution and population.

(An email forward)_______________________________________________

Labels:

Line of Fire


Vivek Pradhan wasn't a happy man. Even the plush comfort of the First Class air-conditioned compartment of the Shatabdi Express couldn't cool his frayed nerves. He was the Project Manager and still not entitled to air travel. It was not the prestige he sought, he had tried to reason with the admin guy, it was the savings in time. A PM had so many things to do! He opened his case and took out the laptop, determined to put the time to some good use. "Are you from the software industry sir," the man beside him was staring appreciatively at the laptop.

Vivek glanced briefly and mumbled in affirmation, handling the laptop now with exaggerated care and importance as if it were an expensive car. "You people have brought so much advancement to the country sir. Today everything is getting computerized." 'Thanks," smiled Vivek, turning around to give the man a detailed look. He always found it difficult to resist appreciation. The man was young and stocky like a sportsman. He looked simple and strangely out of place in that little lap of luxury like a small town boy in a prep school. He probably was a Railway sportsman making the most of his free traveling pass.

"You people always amaze me," the man continued, "You sit in an office and write something on a computer and it does so many big things outside." Vivek smiled deprecatingly. Naivety demanded reasoning not anger. "It is not as simple as that my friend. It is not just a question of writing a few lines. There is a lot of process that goes behind it." For a moment he was tempted to explain the entire Software Development Lifecycle but restrained himself to a single statement. "It is complex, very complex." It has to be. No wonder you people are so highly paid," came the reply. This was not turning out as Vivek had thought. A hint of belligerence came into his so far affable, persuasive tone.

"Everyone just sees the money. No one sees the amount of hard work we have to put in." "Hard work!" "Indians have such a narrow concept of hard work. Just because we sit in an air-conditioned office doesn't mean our brows don't sweat. You exercise the muscle; we exercise the mind and believe me that is no less taxing." He had the man where he wanted him and it was time to drive home the point. "Let me give you an example. Take this train. The entire railway reservation system is computerized. You can book a train ticket between any two stations from any of the hundreds of computerized booking centers across the country. Thousands of transactions accessing a single database at a given time; concurrency, data integrity, locking, data security. Do you understand the complexity in designing and coding such a system?"

The man was stuck with amazement, like a child at a planetarium.This was something big and beyond his imagination."You design and code such things." "I used to," Vivek paused for effect, "But now I am the project manager," "Oh!" sighed the man, as if the storm had passed over, "so your life is easy now." It was like being told the fire was better than the frying pan. The man had to be given a feel of the heat."Oh come on, does life ever get easy as you go up the ladder. Responsibility only brings more work. Design and coding! That is the easier part. Now I don't do it, but I am responsible for it and believe me, that is far more stressful. My job is to get the work done in time and with the highest quality. And to tell you about the pressures! There is the customer at one end always changing his requirements, the user wanting something else and your boss always expecting you to have finished it yesterday."

Vivek paused in his diatribe, his belligerence fading with self-realisation. What he had said was not merely the outburst of a wronged man, it was the truth. And one need not get angry while defending the truth. "My friend," he concluded triumphantly, "you don't know what it is to be in the line of fire." The man sat back in his chair, his eyes closed as if in realization. When he spoke after sometime, it was with a calm certainty that surprised Vivek. "I know sir, I know what it is to be in the line of fire," He was staring blankly as if no passenger, no train existed, just a vast expanse of time.

"There were 30 of us when we were ordered to capture Point 4875 in the cover of the night. The enemy was firing from the top. There was no knowing where the next bullet was going to come from and for whom. In the morning when we finally hoisted the tricolor at the top only 4 of us were alive."

"You are a..." "I am Subedar Sushant from the 13 J&K Rifles on duty at Peak 4875 in Kargil. They tell me I have completed my term and can opt for a land assignment. But tell me sir, can one give up duty just because it makes life easier. On the dawn of that capture one of my colleagues lay injured in the snow, open to enemy fire while we were hiding behind a bunker. It was my job to go and fetch that soldier to safety. But my captain refused me permission and went ahead himself. He said that the first pledge he had taken as a Gentleman Cadet was to put the safety and welfare of the nation foremost followed by the safety and welfare of the men he commanded. His own personal safety came last, always and every time. He was killed as he shielded that soldier into the bunker. Every morning now as I stand guard I can see him taking all those bullets, which were actually meant for me. I know sir, I know what it is to be in the line of fire."

Vivek looked at him in disbelief not sure of his reply. Abruptly he switched off the laptop. It seemed trivial, even insulting to edit a word document in the presence of a man for whom valor and duty was a daily part of life; a valor and sense of duty which he had so far attributed only to epical heroes.

The train slowed down as it pulled into the station and Subedar Sushant picked up his bags to alight. "It was nice meeting you sir." Vivek fumbled with the handshake. This was the hand that had climbed mountains, pressed the trigger and hoisted the tricolor. Suddenly as if by impulse he stood at attention, and his right hand went up in an impromptu salute. It was the least he felt he could do for the country.

PS: The incident he narrates during the capture of Peak 4875 is a true life incident during the Kargil war. Major Batra sacrificed his life while trying to save one of the men he commanded, as victory was within sight. For this and his various other acts of bravery he was awarded the Param Vir Chakra - the nation's highest military award.

Live humbly, there are great people around us, let us learn!

(An email forward)
___________________________________________

Labels:

Seatbelt - Correct Installation

The National Roads Safety Council has done extensive testing on
a newly designed seat belt. Results show that accidents can be
reduced by as much as
45%when the belt is properly installed.

Correct installation is illustrated below.......

;

;

;

;

;

;

;

;

;

;

;

;

;

;

;


This is very Important, please pass onto friends and family .

THIS MAY SAVE A LIFE!

(An email forward)

_____________________________________________

Labels:

What is the origin of ‘denim’?

When you hear the word ‘denim’, you immediately think of jeans. This sturdy cloth that both young and old wear nowadays was originally made in the town of ‘Nimes’ in France. I understand the name is pronounced like the word ‘neem’. The tough cloth material when it was introduced was not called ‘denim’ but ‘serge’; it was often referred to as ‘serge de Nimes’, meaning ‘serge of Nimes’. With the passage of time, the name of the cloth was shortened to ‘denim’. Sailors from ‘Genoa’, a seaport in Italy, made pants from denim. Since the trousers lasted for a very long time, they were affectionately called ‘Genoese’. The name was later shortened to ‘geans’, from which we get the word ‘jeans’.

S. UPENDRAN
upendrankye@gmail.com
(The Hindu, 13:11:2007)
______________________________

Labels:

నేడు విశ్వ కారుణ్య దినోత్సవం

కరుణ చూపించు.. సంతోషం సంపాదించు!


నోరు మంచిదయితే వూరు మంచిదవుతుంది. ఓ చిరునవ్వు... ఆత్మీయులను సంపాదించి పెడుతుంది. కరుణ చూపిస్తే పాషాణ హృదయమూ కరుగుతుంది. ప్రతి ఒక్కరూ కరుణను అలవర్చుకుంటే ప్రపంచమంతా సంతోషమయమవుతుంది. కరుణ చూపించడానికి కోట్లు కుమ్మరించాల్సిన పనిలేదు. పెద్దపెద్ద త్యాగాలూ అవసరం లేదు. కాస్తంత ఉదారం చూపితే చాలు. కోపం అణుచుకుంటే చాలు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు కాస్తంత సంయమనం పాటిస్తే దూదిపింజలా తేలిపోతాయి. రోడ్డుమీద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఓ వృద్ధురాలు రోడ్డు దాటడానికి ప్రయాస పడుతుంది. ఓ శునకం బెంబేలెత్తుతుంది. పోలీసులెవరూ చెప్పకుండానే... మీ వాహనాన్ని ఆపి ఆ వృద్ధురాలికో, ఆ శునకానికో వెసులుబాటు ఇవ్వండి. అదే కరుణంటే. అర్థరాత్రి మంచి నిద్రలో ఉంటారు. పక్క ఫ్లాట్లోంచి విపరీత శబ్దాలు వచ్చి మీ నిద్రకు భంగం వాటిల్లుతుంది. వారిపై కోపగించుకుంటే ఏమవుతుంది. మీ నిద్ర ఎలాగూ పోయింది సరికదా! వారితో శత్రుత్వం ఏర్పడి ప్రశాంతత కరవవుతుంది. సంయమనంతో ఉండండి. ప్రశాంతత మీ సొంతమవుతుంది. మొక్కలు పెంచడం, పక్షులకు ధాన్యం గింజలు వేయడం, సహోద్యోగి పని ఒత్తిడిలో ఉన్నప్పుడు సాయమందించడం, పొరుగువారి కష్టాల్లో పాలుపంచుకోవడం ఇవన్నీ కారుణ్య చర్యలే. ఇల్లాలికి ఇంటిపనిలో సాయం చేయడమూ అదే కోవలోకి వస్తుంది. విశ్వ కారుణ్య ఉద్యమం తొలిసదస్సును జపాన్‌లోని టోక్యోలో 1998 నవంబరు 13న నిర్వహించారు. జపాన్‌ చిరు కారుణ్య ఉద్యమం 35వ వార్షికోత్సవం కూడా ఆ రోజునే పాటించారు. అప్పటినుంచి, కారుణ్య స్వభావాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నవంబరు 13ను విశ్వ కారుణ్య దినోత్సవంగా గుర్తిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ప్రాణి పట్లా కరుణ చూపడం, పర్యావరణం పట్ల మమకారం పెంచుకోవడం ఈ దినోత్సవం ఆశయం. ఈ ఆశయానికి అందరూ కంకణబద్ధులైతే ప్రపంచమంతా సంతోషం వెల్లివిరిస్తుంది. అశాంతి పరిసమాప్తమవుతుంది.
-మాగంటి
(Eenadu, 13:11:2007)
_______________________________________

Labels: ,

Sunday, November 11, 2007

భ్రాతృ విదియ

- చిమ్మపూడి శ్రీరామమూర్తి
...పర్వదినాల్లో 'యమ ద్వితీయ' ఎంతో ప్రముఖమైనది. కార్తీక శుద్ధ విదియనాడీ పర్వం వస్తుంది. దీన్ని 'భ్రాతృవిదియ'గా కూడా పేర్కొంటారు. కార్తీక శుక్ల విదియనాడు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతివంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం నివారణ జరుగుతాయంటారు. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది నేటి మహత్తర సందేశం...

ఒకనాడు సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. ప్రతి అంశానికీ ప్రాతిపదిక ఆర్థిక శక్తే అవుతోంది.

ఇవాళ కుటుంబంలోని సభ్యులు- కనీసం పండగరోజునైనా కలిసి భోజనం చేయడం యాదృచ్ఛికమో, మహదవకాశమో, అదృష్టమో అయిపోతోంది. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహనా మంచీ- మర్యాదా, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి.

ప్రాచీన సాహిత్యమంతా ఏదో ఒక ధర్మాన్ని ప్రతిపాదించడానికే, ఈ పండగల పేర్లూ- ఆయా పండగల్లో ఆచరించవలసిన ధర్మాలనూ, వ్రతాలను, ఆచరాలను మనకు తెలియజేస్తున్నాయి. పర్వదినాల్లో 'యమ ద్వితీయ' ఎంతో ప్రముఖమైనది. కార్తీక శుద్ధ విదియనాడీ పర్వం వస్తుంది. యమున సోదరుడు యముడు. వీరి సౌభ్రాతృత్వం, సౌహార్దానికి ప్రతీకగా ఈ పర్వదినాన్ని వ్యవహరిస్తారు. కనుకనే 'భ్రాతృవిదియ'గా కూడా దీనిని పేర్కొంటారు.

ఈ పర్వదినాన 'కాంతిద్వితీయ', 'పుష్ప ద్వితీయ' అనే వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి ఉటంకిస్తోంది. 'యమద్వితీయ' ముచ్చటైన మురిపాల పండగ. అనుబంధాల పండగ. తోబుట్టువుల ఆప్యాయతలను ప్రతిబింబించే పండగ. ఈనాడు యమపూజ, చిత్రగుప్త పూజ చేస్తారు. 'భగినీ గృహే భోజనం పరమ కర్తవ్యం'గా యీ పర్వదినం జరుపుకొంటారు. కార్తీక శుక్ల విదియనాడు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతివంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం నివారణ జరుగుతాయంటారు.

యముడి చెల్లెలు యమునాన
ది. యమున తన అన్న యముడిని భోజనానికి తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది. యముడికి చాలా రోజులవరకు వీలుపడలేదు. అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ఉసురును హస్తగతం చేసుకునేందుకు యముడు వెళ్లాడు పాశాలతో. మార్కండేయుడు మహాశివుణ్ని శరణు వేడుకున్నాడు. శివుడు త్రిశూలం తీసుకుని యముడి వెంట పడ్డాడు. యముడు పరుగెత్తి- పరుగెత్తి యమున ఇంటికి చేరి తలదాచుకున్నాడు. అన్నగారిన్నాళ్లకు వచ్చాడని సంతోషంతో మర్యాదచేసి, రుచికరమైన పిండివంటలతో చక్కని వంటకాలు సిద్ధంచేసి తృప్తికరంగా భోజనం పెట్టింది. భోజనం చేస్తున్నవాళ్లను సంహరించరాదని శివుడు తిరిగి వెళ్లిపోయాడు.

ఆ విధంగా ఓ వైపు మార్కండేయ సంరక్షణం జరిగింది. మరోవైపు అన్నగారికి మనస్ఫూర్తిగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరింది. సోదరి చేతి వంట తినడానికి ఉపక్రమించడం వల్ల యముడికి అపమృత్యు దోషఫలమూ అంటలేదు.

శివుడి ఆగ్రహానికి గురికాకుండా తలదాచుకునే అవకాశమిచ్చిన చెల్లెల్ని మనసారా లోలోపల అభినందిస్తూ, ఆమె అతిథి మర్యాదలకు పొంగిపోయిన యముడు ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడామె 'ఈనాడు చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలి చేతివంట తిని తృప్తిపడే అన్నకు నరకలోకప్రాప్తీ, అపమృత్యుదోషం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా అన్నను కోరుకుంది. యముడెంతో ఆనందభరితుడై 'ప్రతి ఏటా నేను కార్తీక శుద్ధ విదియనాడు నీ ఇంటికి వచ్చి, నీ చేతివంట తింటాను. నీవు కోరిన విధంగా ఈ రోజున ఎవడు తన సోదరి యింట భోజనం చేస్తాడో, అతనికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుభయం కాని సంభవించని విధంగా నీకూ వరం ఇస్తున్నాను. అంతేకాదు, సోదరుణ్ని తనఇంటికి ఆహ్వానించి, మనఃపూర్వకంగా తన చేతి వంటకాలను వడ్డించి, తృప్తిపరిచే చెల్లెలు (స్త్రీ) వైధవ్యం పొందక చిరకాలం 'సువాసిని'గానే ఉంటుంది' అన్నాడు యముడు. సాభిమానమైన వీడ్కోలు చెల్లెలినుంచి పొంది వెళ్ళిపోయాడు.

యమునకు యముడికి గల ఈ సౌహార్దదినమే 'యమద్వితీయ' అనే పేరుతో అద్వితీయ పర్వదినంగా ప్రఖ్యాతి పొందింది. సోదరి చేతి వంటతో చేసే భోజనం కనుక ఇది భగినీ హస్త భోజనంగా వ్యవహారంలోకి వచ్చింది. సోదరులు తోబుట్టువుల ఇళ్లలోభోజనం చేసినప్పుడు వారికి చీర, పసుపు కుంకమ, పువ్వులు, ఇతర కానుకలు ఇచ్చే సంప్రదాయమూ ఉంది. కర్మిష్ఠులు, తత్వజ్ఞులు, ముముక్షువులు ఈ రోజున నవోదిత చంద్రార్ఘ్యదానం తప్పక చేస్తారు. కార్తీకశుద్ధ పాడ్యమి (నిన్నటి రోజున) 'బలి' పూజలందుకున్నాడు. విదియనాడు పాతాళానికి వెళ్లిపోతాడు. ఈ రోజున బలికి వీడ్కోలు పూజలతోపాటు దానాలు మక్కువతో ఎంతో ఎక్కువగా చేస్తారు. ఈ రోజున చేసే దానాలకు అనంతమైన పుణ్యఫలం సంప్రాప్తమవుతుందంటారు. భవిష్య పురాణం వంటివి భగినీ హస్త భోజన పర్వదిన ప్రాముఖ్యాన్ని విశేషంగా విశ్లేషించాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది నేటి మహత్తర సందేశం. ఈ యమద్వితీయనాడైనా ఈ సత్సంప్రదాయానికీ, సుసంస్కారానికీ పునరంకితులమయ్యేందుకు సంసిద్ధులమవుదామా!
(Eenadu, 11:11:2007)
____________________________

Labels: ,

తెలుగు సంగతులు

- సేకరణ : ద్వా.నా.శాస్త్రి

తెలుగువారికి సొంతరాష్ట్రం ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని భాషకు సంబంధించిన కొన్ని చిరు సంగతులు .....
-----------------------------------------------
''పొగత్రాగనివాడు దున్నపోతై పుట్టున్‌'' అని కన్యాశుల్కం నాటకంలో గురజాడ గిరీశంతో అనిపిస్తాడు. పైగా అమృతం తీసుకెళ్ళేటప్పుడు ఒక చుక్క భూమ్మీదపడి అదే పొగాకు చెట్టయిందని కోతలు కోస్తాడు. అలవాటున్నవాడు ఇలాగే సమర్థించుకొంటాడు గదా!
------------------------------------------------
దీపాల పిచ్చయ్యశాస్త్రి, గుఱ్ఱం జాషువా కలిసి జంట కవిత్వం రాద్దామనుకొని ఏం పేరు పెట్టుకుంటే బాగుంటుందో ఆలోచించారు. దీపాల జాషువా, గుఱ్ఱం దీపాల, గుఱ్ఱం పిచ్చయ్య, పిచ్చయ జాషువా, గుఱ్ఱం శాస్త్రి... ఇలా అనేక రకాలుగా చూస్తే సరైన పేరు కుదరలేదు. అందుకని ''మనకి పేరే కుదరలేదు. ఇంక జంట కవిత్వం ఎందుకులే'' అని మానేశారట.
------------------------------------------
బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజలలో చైతన్యం వస్తుందేమోనన్న భయంతో కొన్ని పుస్తకాలను నిషేధించింది. తిరుపతి వేంకటకవులు రాసిన ''శ్రవణానందం'' కావ్యాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం 1913లో నిషేధించింది. ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన ''మాలపల్లి'' నవలను రెండుసార్లు నిషేధించింది. స్వాతంత్య్రం వచ్చాక కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ''ఝంఝ'' విప్లవ కవితా సంకలనాన్ని, వాసిరెడ్డి సీతాదేవి ''మరీచిక'' నవలను నిషేధించింది.
-------------------------------------------
దేవులపల్లి కృష్ణశాస్త్రిని భావకవిగా చూసి తిరోగమనవాది అంటారు. ఇది నిజంకాదు. బ్రహ్మసమాజ కార్యక్రమాల్లో పాల్లొన్నారు. సంఘ సంస్కరణ భావాలను పాదుకొల్పారు. హరిజనులతో కూడి హరిజనాభ్యుదయ గీతాలు పాడుతూ తిరిగారు. 1930లోనే పిఠాపురంలో ''వేశ్యా వివాహ సంస్థ'' స్థాపించి వేశ్యలకి వివాహం చేయించారు. తాత, తండ్రి సంపాదించిన ఆస్తిని ఈ విధంగా వెచ్చించారు. మరి దేవులపల్లి సంఘ సంస్కర్త కాదా?
---------------------------------------------
తెలుగు కవుల్లో గణపవరపు వేంకటకవి ''ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము'' అనే కావ్యం రాశాడు. ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విచిత్రం, ఏదో ఒక అపూర్వరచన కనిపిస్తుంది. 808వ పద్యం- ''సారాగ్య్రసారస సమనేత్ర...''లో 64 రకాల పద్యాలను నిక్షిప్తంచేశాడు. ప్రపంచ సాహిత్యంలోనే ఇటువంటి విశేషం లేదంటారు.
---------------------------------------------
స్త్రీల ముఖాన్ని పద్మంతో చంద్రుడితో పోల్చాలి.
కళ్ళని- తామర రేకులతో, చేపలతో పోల్చాలి.
ముక్కును- సంపెంగతో పోల్చాలి.
పెదాలను- దొండపండుతో, చిగురాకుతో పోల్చాలి.
కంఠాన్ని- శంఖంతో పోల్చాలి.
లలాటాన్ని- అర్ధచంద్రా కారంగా వుందనాలి.
జుట్టును-తుమ్మెదలతో పోల్చాలి.
ఇటువంటి వర్ణనలను 'కవి సమయాలు' అంటారు.
---------------------------------------------
గురజాడ కన్యాశుల్కం నాటకం రాయడానికి అంతకుముందు అప్పటి విశాఖ జిల్లాలో జరిపిన సర్వే కారణం. దాని ప్రకారం
కన్యాశుల్క వివాహాలు జరిగినవి- 1034
అయిదేళ్ళ వయసులో జరిగినవి- 99
నాలుగేళ్ళ వయసులో జరిగినవి- 44
మూడేళ్ళ వయసులో జరిగినవి- 36
రెండేళ్ళ వయసులో జరిగినవి- 6
ఏడాది వయసులో జరిగినవి- 3
కన్యాశుల్కంగా చెల్లించిన ధర -350 రూ. నుంచి 400 రూ.లు. ఇదీ 1897 నాటి స్థితి.
----------------------------------------------
కందుకూరి వీరేశలింగం- సహాయోపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు
గురజాడ- కలెక్టరాఫీసులో హెడ్‌ గుమస్తా, అసిస్టెంట్‌ లెక్చరర్‌,
దేవులపల్లి కృష్ణశాస్త్రి- కాలేజీ ట్యూటరు. ఆకాశవాణిలో ప్రయోక్త.
గుర్రం జాషువా- ఉపాధ్యాయుడు, ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‌.
శ్రీశ్రీ- కాలేజిలో డిమాన్‌స్ట్రేటర్‌, హార్బర్‌లో గుమస్తా,
కుందుర్తి- ఆంగ్లోపాధ్యాయుడు, టుబాకో మార్కెట్‌లో ఉద్యోగి, సమాచార శాఖలో అనువాదకుడు.
--------------------------------------------
కోరాడ రామచంద్రశాస్త్రి 1860లో రాసిన 'మంజరీమధుకరీయము' తెలుగులో మొట్టమొదటి నాటకం. 1875లో వావిలాల వాసుదేవశాస్త్రి రాసిన 'నందక రాజ్యము' మొదటి సాంఘిక నాటకం. ఇంగ్లీషులోని జూలియట్‌ సీజర్‌ను వాసుదేవశాస్త్రి గారే అనువదించారు. ఇది తొలి ఆంగ్లానువాద నాటకం. కొక్కొండ వెంకట రత్నంపంతులు రచించిన 'నరకాసుర విజయ వ్యాయోగము' తొలి సంస్కృతానువాద నాటకం!
------------------------------------------------
తెలుగుభాషలో గల పదాలలో అసలైన పదాలు 20శాతమే! సగానికి పైగా సంస్కృతం, ప్రాకృతం నుంచి వచ్చినవే. పారశీభాషా పదాలు, పోర్చుగీసుభాషా పదాలూ ఎక్కువే. ఇప్పుడు ఆంగ్ల పదాలు ఎక్కువ. విద్యార్థి, పత్రిక, రాజు, పూజ వంటివి సంస్కృత పదాలే! అగ్గి, సింగారం వంటివి ప్రాకృతం నుంచి వచ్చాయి. రోజు, కాగితం, బాకీలు పారశీవి. బత్తాయి, తువాలు, బాల్చీ, అనాస అనేవి పోర్చుగీసు పదాలు.
------------------------------------------------
తెలుగు భాషలో గల సంస్కృత సమములు కాకుండా మిగిలిన ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యపదాలు గలవి అచ్చతెలుగు పదాలు!
అచ్చ తెలుగు పదాలు ఇలా వుంటాయి- కబ్బము (కావ్యం), నెలవేలుపు (చంద్రుడు), పొత్తపు గుడి (గ్రంథాలయం), నెయ్యము (స్నేహం), ఆన (ఆజ్ఞ), నల్ల దేవర (కృష్ణుడు), వేడిక (పార్థన).
----------------------------------------------
కలకత్తాలో పుట్టిన సి.పి. బ్రౌన్‌ కడప జిల్లాలో ఉద్యోగం చేస్తూ మన తెలుగు భాషకి అపూర్వమైన సేవ చేశాడు. మన వేమన పద్యాలను సేకరింపచేసి మొట్టమొదటిగా 1829లో అచ్చువేశాడు. కొన్ని పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు. తెలుగు నేర్చుకొన్నాడు. తెలుగు వ్యాకరణం రాశాడు. తెలుగు వారికి నిఘంటు రచనా రీతిని నేర్పాడు. తెలుగు వాచకాలు రాసాడు. లండన్‌ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధించాడు. అందుకే బ్రౌన్‌ తెలుగు సూర్యుడు!
--------------------------------------------
జయంతి రామయ్య పంతులు అనే గొప్ప పండితుడు బి.ఎ. చదువుతున్నప్పుడు బ్రహ్మసమాజ మత ప్రబోధకులైన పండిత శివనాధశాస్త్రి రాజమండ్రి వచ్చారు(1881). ఆయన అనర్గళంగా ఇంగ్లీషులో ఉపన్యాసం ఇస్తే అదే వేగంతో ఆ ఉపన్యాసాన్ని ఇంగ్లీషులోనే రాసి జయంతివారు పత్రికకి పంపటం, మర్నాడు పత్రికలో రావటం... శివనాథశాస్త్రి చూసి ఆశ్చర్యపోవటం జరిగింది.
---------------------------------------------
తెలుగులో మొట్ట మొదటి పత్రిక ఏది? అన్నప్పుడు కొందరు 1831 నాటి 'తెలుగు జర్నల్‌'ను చెప్తారు. దీనికి ఆధారం లేదు. 1835లో బళ్లారి క్రైస్తవ మత ప్రచారకులు ప్రారంభించిన 'సత్యదూత' పత్రికనే తొలి పత్రికగా చాలా మంది నిర్ణయించారు.
---------------------------------------------
జర్మన్‌ దేశీయుడైన బెంజమిన్‌ షుల్జ్‌ 1746లో హాలె నగరంలో మొట్టమొదటి తెలుగు పుస్తకాన్ని అచ్చు వేశాడు. ఆ పుస్తకం పేరు- ''మోక్షానికి కొంచ్చుపొయ్యెదొవ''.
---------------------------------------------
శ్రీనాథుడు శివభక్తుడు. కానీ శివుడి మీద రాసిన కావ్యాలను రాజులకు, మిత్రులకి, అంకితమిచ్చాడు. మానవుల చరిత్ర గల 'పల్నాటి వీరచరిత్ర'ను మాత్రం దేవుడికి అంకితమిచ్చాడు.
----------------------------------------------
పోతన భాగవతంలోని పన్నెండు స్కంధాలలో ఎనిమిదే రాశాడు. మిగిలిన నాలుగూ అతని శిఘ్యలు-బొప్పరాజు గంగవు, ఏర్చూరి సింగయ, వెలిగందల నారయ రాశారు. అంటే ఆంధ్ర మహాభాగవతం రాసింది నలుగురన్నమాట!
---------------------------------------------
తెలుగు కథ 1910లో పుట్టి 1952లోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ''న్యూయార్క్‌ హెరాల్డు ట్రిబ్యూన్‌'' నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో పాలగుమ్మి పద్మరాజు రాసిన 'గాలివాన' కథకి ద్వితీయ బహుమతి లభించింది. ఒక మనిషి ప్రవర్తన బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పే కథ ఇది!
---------------------------------------------
క్రీ.శ. ఒకటో శతాబ్దికి చెందినదిగా భావిస్తున్న అమరావతి బౌద్ధస్థూపంపై నున్న ''నాగబు'' అనేది మొట్టమొదటి తెలుగు పదంగా భావించబడుతోంది. 'నాగబు' అంటే 'నాగము' అని అర్థం.
----------------------------------------------
ఎ.డి.కాంప్‌బెల్‌ అనే ఆంగ్లేయుడు మన తెలుగు నేర్చుకోవటమే కాకుండా
"A Grammar of the Teloogoo Language" నే వ్యాకరణం రాశాడు. ఇది మద్రాస్‌లో కాలేజ్‌ ఆఫ్‌ ఫోర్ట్‌ సెయింట్‌ జార్జిలో గల ముద్రణాలయంలో అచ్చయింది.
----------------------------------------------
శ్రీశైలంలోని శివుని పేరు మల్లికార్జునుడు. మల్లిక, అర్జున పుష్పాలతో పూజింపబడే దేవుడు కాబట్టి మల్లికార్జునుడయ్యాడు. ఇది తెలుసుకోకుండా మల్లిఖార్జున శర్మ, మల్లిఖార్జునుడు... అని వాడుతూంటారు. ఇది సరి కాదు.
-----------------------------------------------
పారశీ భాషలో 'ఉస్తాద్‌' తెలుగులో వస్తాదు అయింది. ఉస్తాద్‌ అంటే ఉపాధ్యాయుడు అని ఆ భాషలో అర్ధం. ఉచితం అంటే తగినది, యుక్తమైనదనే అర్థం. ఖర్చు లేకుండా, 'ఫ్రీ'గా వచ్చేది అనే అర్థం తర్వాత వచ్చింది.
----------------------------------------------
లక్ష్మీ నరసింహ పానుగంటి
సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి
ఎంచేతంటే వాటిలో పేనులాంటి
భవానికాయన ఏనుగంటి
రూపాన్నియ్యడం నేనుగంటి
-శ్రీశ్రీ
-----------------------------------------------
ఏకపత్నీ వత్రము
ఎలుగెత్తు మన మతము
వేల్పు భార్యలు శతము
ఓ కూనలమ్మా!
-ఆరుద్ర
----------------------------------------------
తాళ్ళపాక తిమ్మక్క తొలి కవయిత్రి. రాయగా రాయగా తొలి కావ్యం ''సుభద్రా కల్యాణం'' రాసింది. రాసి, ''పొలతి! నమ్మగరాదు పురుషులనెపుడు/పలురీతి కృష్ణసర్పములైయుండ్రు'' అని మగవారిని నిం దించింది. (కృష్ణసర్పం అంటే నల్లత్రాచు)
----------------------------------------------
'స్త్రీ'కి అరవై పర్యాయ పదాలున్నాయి. నారి, అబల, వనిత, మహిళ, కాంత, లలన, మగువ, ఇంతి, అతివ, నవల, నాతి, వెలది, అంగన, మానిని, సుదతి, పడతి, లలన, తొయ్యలి మొదలైనవి.
-----------------------------------------------
పుట్టపర్తి నారాయణాచార్యులు 12వ ఏటనే 'పెనుగొండ లక్ష్మి' అనే కావ్యం రాశారు. దీనిని మద్రాస్‌ విశ్వవిద్యాలయం 'విద్వాన్‌' పరీక్షకి పాఠ్యభాగంగా నిర్ణయించారు. పుట్టపర్తివారు ఆ పరీక్షకి వెళ్లినప్పుడు తాను రచించిన 'పెనుగొండ లక్ష్మి'నే చదివి పరీక్షలో సమాధానం రాశారు! ఇది విచిత్రం!
-----------------------------------------------
తిక్కవరపు పఠాభి రామిరె
డ్డి 'ఫిడేలు రాగాలు డజను'లో రాసిన పంక్తులివి.
'' మీ వాన్దరు సనాతనా చర్‌యుల్‌
ముఖమ్విరిచి ఇన్‌గ్‌లీష్టానివి
నన్‌నున్జేపట్‌టవద్‌దని
గద్‌ దిన్చి నా కూడ నీవు'
-----------------------------------------------
ప్రశ్నలోనే సమాధానం ఉండేలా రచించే భాషా వైచిత్రిని పరికించండి.
ప్రశ్న- ఎద్దీశున కశ్వంబగు?
సమాధానం- ఎద్దు
ఈశునకశ్వంబగు.
-----------------------------------------------
కొంచెం తేడాతో ఒకే విధంగా కనిపిస్తూ అర్థంలో భేదం ఉండే జంట పదాలను గమనించండి-
అభినందనం - అభివందనం
ఆహుతి - ఆహూతి
(అగ్నిలో వేయుట) (పిలుచుట)
నిదానము - నిధానము
(నెమ్మది) (ఉంచుట నిక్షేపము)
నిరశనము - నిరసనము
(నిరాహారం)(తిరస్కారం)
--------------------------------
(విపుల, నవంబర్,2007)
___________________________________

Labels:

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

*వ్యాపారం బాగా 'సాగాలంటే' ఏం చేయాలి?
'రబ్బరు వ్యాపారం' చేస్తే సరి!

*'చస్తే ఏ గొడవా లేదు' అంటారు నిజమేనా?
కాస్త సవరణ. 'బీమా చేసి చస్తే ఏ గొడవాలేదు' అంటే బాగుంటుంది.

*నాయకులకు ఉపయోగపడేందుకు తిట్లలో శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. కమర్షియల్‌గా ఇది క్లిక్‌ అవుతుందంటారా?
నలుగురు తిడుతుంటే ఆ సంస్థకు అవే ఆశీర్వచనాలు అవుతాయి. దానికి కమర్షియల్‌ విలువ కూడా వచ్చి తీరుతుంది.

*స్టాక్‌ మార్కెట్‌లో నెగ్గుకు రావాలంటే...?
'స్టాక్‌'చాతుర్యం ఉండి తీరాలి.

*నాకు ప్రపంచ బ్యాంకుకే రుణమిచ్చినట్లు కల వచ్చింది. నిజంగా అదే జరిగితే?
అంతా 'కల'కలమే!

*కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టే కట్టడాలు కూడా రోజులు లెక్కపెడుతున్నట్లు నాసిరకంగా తయారవుతున్నాయి. బిల్లులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటున్నాయి. మీరు ఏమంటారు?
'గుడ్‌' వచ్చి 'బిల్లు'ను వెక్కిరించడమంటే ఇదే మరి!

*నాకు ఏ అర్హతా లేదు. మంచి తెలివితేటలూ లేవు. వ్యాపారం చేయమంటారా? ఉద్యోగం చేయమంటారా?
మీ ఒంటికి ఈ రెండూ సరిపడవు గానీ రాజకీయాల్లో చేరండి. అటు వ్యాపారం ఎఫెక్టూ వస్తుంది. ఉద్యోగమూ చేసినట్లు ఉంటుంది. పైన ఒకాయన తిట్ల ఇనిస్టిట్యూట్‌ పెడదామనుకుంటున్నాడట. అడ్రస్‌ కనుక్కుని వెళ్లి ఓ నాలుగు తిట్లు నేర్చుకోండి చాలు.
(Eenadu, 11:11:2001)
__________________________________

Labels:

హిందీ చిత్రరాజాలు

నెంబర్‌ వన్‌
నెంబర్‌ వన్‌ ఒకటే జననం... ఒకటే మరణం... అలుపు లేదు నీకు గెలుపు దగ్గరయ్యే వరకూ..! అంటూ పరుగు పందెంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ గెలవాలనే దృఢ సంకల్పంతోనే బరిలోకి దిగుతారు. కానీ ఎందరు పరుగెత్తినా... చివరకు ఒక్కరే మొదటి స్థానంలో నిలుస్తారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఏడాదికి వందలసంఖ్యలో సినిమాలు విడుదలవుతాయి. కానీ ఆ ఏడాదికి వాటన్నింటిలో నెంబర్‌ వన్‌గా నిలిచేది మాత్రం ఒకే సినిమా. బాలీవుడ్‌లో గత పదేళ్లుగా విడుదలైన అనేక చిత్రాల్లో ఏడాదికొకటి చొప్పున నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిన పది చిత్రాల విశేషాలను ఒకసారి పరిశీలిస్తే..

దిల్‌ తో పాగల్‌ హై: ఎవరో ఒకరు... ఎక్కడో ఒకచోట... నీ కోసం పుట్టే ఉంటారు - 1997లో యశ్‌ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'దిల్‌ తో పాగల్‌ హై' విడుదలైన తరవాత ప్రతి ప్రేక్షకుడి నోట నానిన మాటిది. షారుఖ్‌్‌, మాధురీ, కరిష్మా నటించారు. ఈ చిత్రానికి ఆ ఏడాది రెండు సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇందులో జె.పి.దత్తా రూపొందించిన 'బార్డర్‌' ఒకటి కాగా, సుభాష్‌ ఘయ్‌ రూపొందించిన 'పరదేశ్‌' ఇంకొకటి.


కుఛ్‌ కుఛ్‌ హోతా హై: ఎవరికైనా మనసులో ఏదో ఏదో అయిపోతుంటే వారు కచ్చితంగా ప్రేమలో పడినట్టే అని చెప్పిన చిత్రం 'కుఛ్‌ కుఛ్‌ హోతా హై'. 1998లో విడుదలైన ఈ సినిమా విక్రమ్‌ భట్‌ రూపొందించిన 'గులామ్‌' సొహైల్‌ ఖాన్‌ రూపొందించిన 'ప్యార్‌ కియా తో డర్నా క్యా' చిత్రాలతో పోటీ పడి నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకొంది. ఇందులో షారుఖ్‌, కాజోల్‌, రాణి ముఖర్జీ, సల్మాన్‌ నటించారు.


హమ్‌ దిల్‌ దె చుకే సనమ్‌: 1999లో విడుదలైన ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కథతో రూపొందింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకుడు. సల్మాన్‌్‌, ఐశ్వర్య, అజయ్‌ దేవగణ్‌ నటించారు. ఇందులో సల్మాన్‌, ఐశ్వర్యల మధ్య అప్పట్లో జరిగిన నిజ జీవిత ప్రేమ కథను కూడా చొప్పించారు. ఇదే ఏడాది విడుదలైన 'తాల్‌', 'సర్ఫరోష్‌' చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని ఈ సినిమా విజయ పథాన దూసుకుపోయింది.


కహో నా ప్యార్‌ హై: బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ని ఓ స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'కహో నా ప్యార్‌ హై'. కథానాయికగా అమీషా పటేల్‌కి కూడా మంచి బ్రేక్‌నిచ్చింది. 2000లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. హృతిక్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 102 అవార్డులను పొందిన ఏకైక బాలీవుడ్‌ చిత్రంగా 2003లో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది.


లగాన్‌: 2001లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్రికెట్‌ నేపథ్యంతో సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. అమీర్‌ ఖాన్‌, గ్రేసీ సింగ్‌ నాయకానాయికలు. అదే ఏడాది విడుదలైన 'గదర్‌-ఏక్‌ ప్రేమ్‌ కథా', 'దిల్‌ చాహతా హై' రేసులో నిలిచాయి. మొదటి సారిగా బాలీవుడ్‌ నుంచి విదేశీ ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆస్కార్‌ బరిలో నిలిచిన చిత్రంగా 'లగాన్‌' ఖ్యాతిని ఆర్జించింది.


దేవదాస్‌: సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'దేవదాస్‌' రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. దేవదాస్‌గా షారుఖ్‌, పార్వతిగా ఐశ్వర్య, చంద్రముఖిగా మాధురీ దీక్షిత్‌ నటించిన ఈ చిత్రం 2002లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బెంగాలీ రచయిత శరత్‌ చంద్ర చటోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి వేసిన భారీ సెట్టింగులు చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి.


కొయి మిల్‌ గయా: రాకేష్‌ రోషన్‌ దర్శకత్వంలో 2003లో సైన్స్‌, ఫిక్షన్‌ మిళితంగా రూపొందిన 'కొయి మిల్‌ గయా'లో హృతిక్‌, ప్రీతి జింటా నటించారు. అదే ఏడాది 'కల్‌ హో న హో', 'మున్నాభాయ్‌ ఎం.బి.బి.ఎస్‌' చిత్రాలు కూడా విజయాలు సాధించాయి. అయితే చిన్న పిల్లాడి మనస్తత్వం కల పాత్రలో హృతిక్‌ రోషన్‌ ప్రదర్శించిన నటన, రాకేష్‌ రోషన్‌ దర్శకత్వ ప్రతిభ 'కొయి మిల్‌ గయా' చిత్రాన్ని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాయి.


వీర్‌జారా: షారుఖ్‌, ప్రీతి జింటా, రాణి ముఖర్జీ నటించిన 'వీర్‌ జారా' యశ్‌ చోప్రా దర్శకత్వంలో వచ్చింది. ఇండో-పాక్‌ నేపథ్యంతో తెరకెక్కిన ఈ ప్రేమ కథను ప్రేక్షకులు ఎంతగానో అభిమానించారు. అమితాబ్‌, హేమమాలిని కూడా ఇందులో అతిథిపాత్రలు పోషించారు. ఎనిమిదేళ్ల గ్యాప్‌ తరవాత యశ్‌ చోప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారత్‌, పాకిస్థాన్‌లోనే కాకుండా యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌, యూఎస్‌ దేశాల్లో కూడా విజయం సాధించి 2004లో నెంబర్‌ వన్‌గా నిలిచింది.


బ్లాక్‌: హెలెన్‌ కెల్లర్‌ అనే మహిళ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'బ్లాక్‌'2005లో విడుదలైంది. సాధారణ కళాశాల నుంచి ఓ ఫిజికల్లీ ఛాలెంజెడ్‌ అమ్మాయి గ్రాడ్యుయేట్‌ విద్యను కొనసాగించడం నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకుడు. అమితాబ్‌బచ్చన్‌, రాణి ముఖర్జీ నటించారు. అదే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 10 ఉత్తమ చిత్రాలను టైమ్‌ అనే మ్యాగజైన్‌ (యూరప్‌) ప్రకటించింది. ఇందులో 'బ్లాక్‌' నెంబర్‌: 5 స్థానంలో నిలిచింది.


రంగ్‌ దె బసంతి: రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన 'రంగ్‌ దె బసంతి' 2006 జనవరి 26న విడుదలైంది. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో అమీర్‌ ఖాన్‌, సొహ అలీఖాన్‌, మాధవన్‌, తదితరులు నటించారు. ఇదే ఏడాది 'ధూమ్‌:2', 'కభి అల్విద నా కెహనా', 'క్రిష్‌', 'లగే రహో మున్నాభాయ్‌' ఘన విజయాలనే నమోదు చేశాయి. అయితే మొదటి వారం కలెక్షన్లే రూ. 51 కోట్లు దాటిన సినిమాగా 'రంగ్‌ దె బసంతి' రికార్డు సృష్టించింది.
(Eenadu, 11:11:2007)
__________________________________

Labels: ,

బంధాలూ అనుబంధాలు

సంఘ జీవనంలో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యముంది. కుటుంబ సభ్యులు ఒకరిపట్ల మరొకరు బాధ్యతాయుతమైన ప్రేమను కలిగి ఉంటూ ఒకరికొకరు తోడుగా ఉండటంలో ఆనందం ఎంతయినా ఉంటుంది. అండలుంటే కొండలు దాటవచ్చని సామెత. మంచయినా, చెడయినా నేనున్నానని అండగా నిలిచే కుటుంబ సభ్యులు తోడుంటే మనిషి నిశ్చింతగా ఉండగలుగుతాడు. నాగరకత ఎంత పెరిగినా, ఎన్ని మార్పులొచ్చినా భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ పదిలంగానే ఉంది. 'తల్లితండ్రి యన్నదమ్ములాత్మ సఖులు, నెలమి బంధుభృత్యులెల్ల జనులు గలిగి వర్ధిల్లంగ ఘనతతో నుండరా...' అన్నాడు వేమన కవీంద్రుడు. తల్లితండ్రులు, అన్నదమ్ములు, ఆత్మబంధువులు అంతా కలసి ఒకే కుటుంబంలా ఉండటం మనదేశ ప్రత్యేకత. మారుతున్న కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్నా కుటుంబ సభ్యులమధ్య ఆప్యాయతానురాగాలు మాత్రం తగ్గిపోవటం లేదు. మనదేశ సంస్కృతీ వారసత్వమే దానికి కారణం అని చెప్పవచ్చు. 'అపుత్రస్య గతిర్నాస్తి' అని సామెత. పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని మనవారి నమ్మకం. అంతేకాక కొడుకులు వృద్ధాప్యంలో తమను ఆదుకుంటారని, ఆదుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. ఆ కారణంగానే కొడుకులే కావాలని కోరుకుంటూ ఉంటారు. పిల్లలు పక్కదారులు పట్టకుండా లక్షణంగా పెరిగి పెద్దవారై కుటుంబానికి మంచిపేరు తేవాలని ప్రతి తల్లిదండ్రులూ ఆశిస్తారు. ఆ ఆశతోనే ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా పిల్లలను పెంచుతుంటారు. అన్నిటినీ సర్దుకుంటూ పిల్లల యోగక్షేమాలే ధ్యేయంగా సంసారాన్ని నెట్టుకురాక తప్పదు గృహస్తులకు. ఆదర్శప్రాయంగా జీవిస్తూ తమకూ, తల్లిదండ్రులకు పేరు తేవటమేగాక వారి క్షేమమే తమ లక్ష్యంగా ప్రవర్తిల్లే కొడుకులూ అనేకమంది ఉన్నారు. పురాణకాలంలో భీష్ముడు తన తండ్రి సుఖం కోరి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞచేసి తన మాటను నిలబెట్టుకుంటాడు. భీష్మ ప్రతిజ్ఞ చరిత్ర ప్రసిద్ధి చెందింది. యయాతి తనయుడు పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసి ఆయన అకాల వృద్ధాప్యాన్ని తాను భరిస్తాడు. తల్లిదండ్రుల కోసం పిల్లలు, పిల్లల కోసం వారిని కన్నవారు త్యాగనిరతిని ప్రదర్శిస్తూ ఉండటం కొత్తకాదు. యుగాలు మారినా మనుషులలోని ఈ స్వభావం మారలేదని నాగశయన ఉదంతమే రుజువు చేస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన నాగశయన, సుమాకిరణ్‌ దంపతులిద్దరూ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులే. సుమాకిరణ్‌ సికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుంటే నాగశయన అమెరికాలో టెలికాం ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నాగశయన తండ్రికి కాలేయం దెబ్బతినగా మార్చాలని డాక్టర్లు చెప్పారు. దాంతో నాగశయన అమెరికానుంచి భారత్‌ చేరుకొని తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆపరేషన్‌ చేయటానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ దశలో నాగశయన భార్య సుమాకిరణ్‌, 70 ఏళ్ల వృద్ధుడైన తండ్రికోసం 27 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న తన భర్త నాగశయన కాలేయం ఇస్తే భవిష్యత్తులో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా భర్త తన నిర్ణయం మార్చుకోకపోవటంతో ఆమె కోర్టుకు వెళ్లింది. కాలేయ మార్పిడివల్ల తన భర్త ఆరోగ్యం క్షీణిస్తే తమ దాంపత్య జీవితానికి భంగం కలుగుతుందనీ భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె కోర్టులో వాదించింది.

కేసును కూలంకషంగా పరిశీలించిన కోర్టువారు ఇది కుటుంబపరమైన సమస్యనీ, కుటుంబంలోనే పరిష్కరించుకోవచ్చని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. అదీకాక కాలేయం ఇవ్వడంవల్ల తన భర్త ఆరోగ్యం దెబ్బతింటుందనడానికి సుమాకిరణ్‌ ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదని వ్యాఖ్యానించారు. అదేసమయంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్యగల ఆత్మీయతానుబంధం అనిర్వచనీయమైనదని, తల్లిదండ్రుల ప్రేమకు, త్యాగాలకు హద్దులుండవని తన భర్త భూమిమీదకు రావటానికి కారణం ఆయన తల్లిదండ్రులేనన్న విషయాన్ని ఆమె అర్థం చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ కేసుకు కొసమెరుపేమిటంటే కోర్టువారు సుమాకిరణ్‌ వాదనను పూర్వపక్షం చేసినా ఆమె మామగారు మాత్రం కోడలి హృదయాన్ని అర్థం చేసుకున్నారు. వృద్ధుడైన తన మూలంగా ఎంతో భవిష్యత్తు ఉన్న తన కొడుకు ఆరోగ్యంలో సమస్యలు ఏర్పడటం తనకు సమ్మతం కాదన్నారు. తన మూలంగా కొడుకు సంసారంలో కలతలు ఏర్పడటం తనకు ఇష్టం లేదన్నారు. ఈ కారణాలతో కొడుకునుంచి కాలేయాన్ని స్వీకరించటాన్ని నిరాకరించారు. దాంతో జరగవలసిన ఆపరేషన్‌ ఆగిపోయింది. తండ్రి ఆరోగ్యం కోసం తనయుడు, కొడుకు క్షేమం కోసం తండ్రి పడుతున్న ఈ ఆరాటం మనదేశంలో కుటుంబవ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో, కుటుంబ సభ్యులు ఒకరిపట్ల మరొకరు ఎంతటి ఆప్యాయతానురాగాలను కలిగి ఉంటున్నారో స్పష్టపరచింది. ఎంతకాలం గడిచినా, ఎన్ని మార్పులొచ్చినా ప్రాచీన భారత సంస్కృతి ఇంకా తన పట్టుకోల్పోలేదనే విషయం ఆనందాన్ని కలిగిస్తోంది.!
(Eenadu, 11:11:2007)
_______________________________

Labels: