My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, August 08, 2008

Leopard savaging a crocodile caught on camera


The Telegraph

The astonishing spectacle of a leopard savaging a crocodile has been captured for the first time on camera.

A series of incredible pictures taken at a South African game reserve document the first known time that a leopard has taken on and defeated one of the fearsome reptiles.

The photographs were taken by Hal Brindley, an American wildlife photographer, who was supposed to be taking pictures of hippos from his car in the Kruger National Park .

The giant cat raced out of cover provided by scrub and bushes to surprise the crocodile, which was swimming nearby.
A terrible and bloody struggle ensued. Eventually, onlookers were amazed to see the leopard drag the crocodile from the water as the reptile fought back.


With the crocodile snapping its powerful jaws furiously, the two animals somersaulted and grappled. Despite the crocodile's huge weight and strength, the leopard had the upper hand catching its prey by the throat.






Labels:

MANAGEMENT CARTOONS.







(An Email forward)
__________________________________

Labels:

Monday, August 04, 2008

గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌!

అమ్మభాషకేల దుర్గతి?
- డాక్టర్‌ తూమాటి సంజీవరావు
'జనని సంస్కృతంబు సకల భాషలకు' అంటే నేడు మండిపడేవారు తెలుగువారు. ఈ విషయంలో అభిప్రాయ భేదాలుండవచ్చు. సంస్కృత సాహాయ్యంవల్ల తెలుగు భాష భ్రష్టుపట్టిందని వీరి అభిమతం. ఈ కోణంలో ఒక అర్ధ శతాబ్దికాలంగా సమాజంలో అభిప్రాయం బలపడింది. ఫలితంగా- సంస్కృత జ్ఞానంలేని తరం ఒకటి తయారై, దానిని ద్వేషించడం మొదలయింది. ఆపై పరిస్థితులు మారాయి. సంస్కృత జ్ఞానం లేకపోవటం వలన మనం నష్టపోతున్నాం అనే జ్ఞానోదయం కొంతమందికి కలిగింది, మరి కొంతమందికి కలుగుతూ ఉంది. మన విద్యా విధానంలో ఇప్పుడు భారతీయ భాషలకంటే ఆంగ్ల భాషకు ప్రాధాన్యం ఎక్కువైంది. అయినా, విద్యార్థులు తెలుగుకంటే సంస్కృత భాషను చదివితేనే పరీక్షల్లో మార్కులు ఎక్కువగా ఇస్తారనే భావంతో, దానిని అభ్యసించడమూ ఎక్కువయింది. ఫలితం- సంస్కృత భాషా బోధన పెరిగింది. ఇటువంటి సంస్కృత భాషను మన విద్యారంగంలో 'క్లాసికల్‌' భాషగా పరిగణిస్తున్నాం.

మనం మరచిన మాతృభాష
సంస్కృత భాషను సుసంపన్నం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం వారు- అప్పటి మానవ వనరుల శాఖామాత్యులు ప్రత్యేక నిధులను సమకూర్చటంతో ఒక ప్రణాళికాబద్ధంగా దాని అభివృద్ధిని చేపట్టారు. ఆ సమయంలో డీఎంకే వారు ఆ కూటమిలో భాగస్వాములే. వారికి గల భాషాప్రేమ చాలా ఎక్కువ. ద్రావిడ పార్టీల వారికందరికి తమిళభాష మాత్రమే ద్రావిడ సంస్కృతికి మూలమనే విశ్వాసం. సంస్కృత భాషను 'వడమొళి' (ఉత్తరాది భాష)గా పరిగణిస్తారు. వారు తమ భాషపై సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావాలను మందులాగా వాడుకొంటున్నారు. సంస్కృత భాషా ప్రాచుర్య విషయంలో వారికి ఇబ్బంది లేకున్నా, తమ భాషకు కూడా అటువంటి ప్రత్యేక నిధులను సమకూర్చుకొనటంలో కృతకృత్యులు అప్పట్లో కాలేకపోయినా, యూపీఏ కూటమి అవతరణ సమయంలోనే, తమ మద్దతును కోరే కాంగ్రెస్‌ పార్టీ దగ్గర సెమ్మొళి అంతస్తును ఇచ్చేలా నియమం ఏర్పరచుకుని, ఆపైనే కూటమిలో చేరారు. ఫలితంగా యూపీఏ అధికారం చేపట్టిన తరవాత తమిళ భాషకు క్లాసికల్‌ భాష (సెమ్మొళి) హోదాను సాధించుకున్నారు. ఏ రాజకీయ పక్షం వారు పోరాడకపోయినా, సంస్కృత భాషకు క్లాసికల్‌ అంతస్తు లభించింది. తమిళానికి రాజకీయ ఒత్తిడివల్ల ఆ పని జరిగింది.

'అంధాన్‌ రాతి ఇతి-ఆంధ్రః, ఆంధ్రః ఏవ ఆంధ్రః' అని ఆంధ్ర శబ్దవ్యుత్పత్తిని చెప్పే అలవాటు కూడా ఉంది. అంటే గుడ్డివాళ్లకు కూడా ప్రకాశాన్ని తెలియజేసేవాళ్లు తెలుగువాళ్లని అభివర్ణించుకుంటాము. కానీ, క్లాసికల్‌ (సెమ్మొళి) అంతస్తు విషయంలో మనం గుడ్డివాళ్లగానే మిగిలిపోయాం. తమిళానికి ఇచ్చేవరకు నిద్రపోయాం, ఆపై మేల్కొన్నాం! దాదాపు నాలుగేళ్లనుంచి రకరకాలుగా పోరాడుతున్నా, పరిస్థితి మాత్రం 'ఎక్కడ వేసిన గొంగడి' అక్కడే అన్నట్టు ఉంది. 'క్లాసికల్‌' పదానికి తెలుగు అనువాదంగా- శ్రేష్ఠ, విశిష్ట, ప్రాచీన పదాలను మనవాళ్లు వాడుతున్నారు. ఇవన్నీ పర్యాయార్థకాలే అయినా, సరియైన పదానువాదం ఇంతవరకు చేసుకోలేకపోయాం. తమిళులు 'సెమ్మొళి' అని ఒక పదాన్ని వాడుతున్నారు. తమిళ సాహిత్యం సంగ కాలానికే ప్రారంభమయింది. 'తొల్కాప్పియ' వ్యాకరణ గ్రంథం క్రీస్తుపూర్వం తయారయింది. వారి 'తిరుక్కురళ్‌' ద్రవిడవేదమట. అలాగే ఆరాధిస్తారు. వారి ప్రాచీన గ్రంథాలు 'మణిమేగలై', 'శిలప్పదికారం' వంటివి వారికి తలమానికాలు. ఇటువంటి ప్రాచీన సాహిత్యాన్ని చూపి, వారు తమ భాషను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగు సాహిత్యం పుట్టుక నన్నయతోనని మనవాళ్ల సంరంభం. మొదటి తెలుగు వ్యాకరణం నన్నయ్య కృతం- ఆంధ్ర శబ్ద చింతామణి. సంస్కృత భాషలోనే అదికూడా విరచితం. దానికి వచ్చిన వ్యాఖ్యానాలు కూడా సంస్కృత భాషలో రాసినవే. తెలుగు భాషలో తెలుగుభాషకు గాను చిన్నయసూరి రాసిన వ్యాకరణమే 'బాల వ్యాకరణము'. దానికిగల పూరణమే ప్రౌఢవ్యాకరణము. చిన్నయ వ్యాకరణం అసమగ్రమని 1926లో మల్లాది సూర్యనారాయణ శాస్త్రి 'ఆంధ్ర భాషానుశాసనము' పేరిట ఒక వ్యాకరణ గ్రంథం రచించారు. 1958లో వాంగ్మయ మహాధ్యక్ష వడ్లమూడి గోపాలకృష్ణయ్య 'వ్యావహారిక భాషా వ్యాకరణం' వెలువరించారు. ఇవి తెలుగులో గల మౌలిక వ్యాకరణాలు. తెలుగు సాహిత్యమంతా అనువాదమని మన ఆధునికులు ప్రచారం చేసి, మహాపరాధం చేశారు భాషకు. అనువాదంవేరు. అనుసృజన వేరు. మన కవులు సంస్కృత వాంగ్మయాన్ని మదించి, అందలి విషయాన్ని తమదైన బాణీలో రచించారు. కాబట్టి అపోహలను వీడి, అనుసృజన ఎంతటి గొప్ప విషయమో తెలుసుకోవాలి. మచ్చుకు ఒక ఉదాహరణను గమనించండి. 'శృంగార నైషధం'లో శ్రీనాధుడు ఒకచోట 'వనజదళ నేత్ర! విహరింతు, శృంగార వనములోన' అంటాడు. ఇక్కడ 'వనజదళనేత్ర' శబ్దంలోని 'వన' పదానికి నీళ్లు అని, 'శృంగార వనములోన' అనే చోటగల 'వన' పదానికి అడవి, తోట అని అర్థం. ఒకే పద్యపాదంలో విరుద్ధార్థాలు కలిగిన 'వన' శబ్దాన్ని వాడిన విధం మన తెలుగు కవికే సాధ్యమైంది. ఇటువంటి అంశాలను వెలికితీసి మన భాషా ఔన్నత్యాన్ని లోకానికి తెలియజేయాలి. అది ప్రస్తుతం ఉద్యమంలో ఎంతవరకు స్థానాన్ని పొందిందో చెప్పలేము.

నన్నయ, తిక్కన, ఎర్రన, శ్రీనాధ, పోతన, శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు, చేమకూర వేంకటకవితోపాటు నాచన సోమన, మొల్ల, భాస్కరుడు, ముద్దుపళని వంటి కవులు, కవయిత్రులు వెలయించిన సాహిత్యం సంస్కృత జన్యమైనా, అనుసృజనాత్మకం అనే విషయం మరువకూడదు. సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావంతోపాటు, తనదైన ప్రత్యేకతను నిలుపుకొన్న భాష మన తెలుగు. నన్నయ నాటికే ఛందస్సుందరత్వం కనబడుతుంది. సంస్కృత వృత్తాలతోపాటు దేశీయ ఛందస్సులోని కంద, సీస, తేటగీతి, ఆటవెలది, మధ్యాక్కర వంటివి సుప్రయుక్తాలు. ప్రత్యేక సారస్వతాన్ని తెలుగులో అప్పకవి అందించాడు. పద్య, గద్య, చంపూ నాటకాది సంస్కృత ప్రక్రియలను పుణికి పుచ్చుకున్న మన తెలుగువారు వాటితో మాత్రమే సంతృప్తి చెందలేదు. విప్లవ కవిత్వం, భావకవిత్వం, దిగంబర కవిత్వం, అభ్యుదయ కవిత్వం, నవల, కథలు, కథానికలు, గేయాలు, నానీలు, ప్రక్రియలతోపాటు స్త్రీవాద, దళితవాద, మైనారిటీ వాద సాహిత్యం కూడా వెలుగు చూసింది. తెలుగువాళ్లకు మాత్రమే పరిమితమైన విశిష్ట ప్రక్రియ అవధాన ప్రక్రియ. అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, ద్విసహస్రావధాన, పంచసహస్రావధాన పర్యంతం ఎదిగింది. నేత్ర, నాట్యావధానాలు కూడా సుప్రసిద్ధాలు. ద్వ్యర్థి, త్య్రర్థి, చాతురర్థికాలతోపాటు శతార్థక కావ్యాలు వెలిశాయి. తెలుగువారి శతక సాహిత్య ప్రక్రియ వైశిష్ట్యం కలది. చిన్నవారిని, పెద్దవారిని కూడా ఆకట్టుకోగలది శతకం మాత్రమే. 'ఉదాహరణ ప్రక్రియ'ను గుర్తుపెట్టుకున్నవారు చాలా అరుదు. మన వాగ్గేయ సాహిత్యం త్యాగరాజుతో మొదలయి ముమ్మూర్తులతో విరాజిల్లింది. త్యాగరాజు నేటి తమిళనాడు ప్రాంతంలోనివారని కొట్టి పారేస్తారేమో! రాయలసీమలోని అన్నమయ్య, తెలంగాణలోని రామదాసు, కోస్తాలోని క్షేత్రయ్యలను తీసి పారేవేయలేం కదా! త్రిలింగదేశం వారే కదా ఈ మువ్వురు! ఇంతటి విలువైన సాహిత్య సంపదను ఉట్టంకించకుండా, పెంకులు, రాళ్లు, రప్పలమీద పరిశోధనచేసి, గీతలను ఆధారంగా చేసుకుని ప్రాచీన భాషాస్థాయి కావాలంటే వస్తుందా!

'నేటి తెలుగు భాషను కాపాడండి. నేడు తెలుగు భాషను కాపాడండి' అనే వేదన, ఆవేదనను వెలిబుచ్చుతున్నవారున్నారు. వ్యవహారిక, గ్రాంధిక రూపాలలో భాషను చూస్తున్నాం. రూపాలు వేరైనా, సమస్యల జోలికి పోలేదు. పరిష్కారాల ఊసేలేదు. తెలుగు భాషకు గల ప్రత్యేకాక్షరాలైన అరసున్న, ఱ (బండి ర) చ, జ(దంత్య చకార, జకారాలను)ను వదులుకున్నాం. నేడు అక్షరాల సంఖ్య ప్రశ్నార్థకం!

తెలుగు నేతలు ఆలోచిస్తున్నారా?
తెలుగు అకాడమీ లక్ష్యాల్లో మూడోది: 'తెలుగు భాషను ఆధునీకరించి (ఆధునికీకరించి) సుసంపన్నం చేసే కృషిలో భాగంగా ప్రమాణీకరించడం, పరిశోధనలు నిర్వహించడం.' అయితే అందుకు పరిస్థితి నేడు భిన్నంగా ఉంది. ఆ సంస్థ సంచాలకుల మాటల్లో చెప్పాలంటే 'సిబ్బంది కొరత. దీనివలన భాషా సమీక్ష, పరిశోధన వంటి అకాడమీ మౌలిక ఆశయాలు కుంటుపడుతున్నాయి.' ఈ వాస్తవాన్ని గమనించండి. సముచిత రీతిలో స్పందించండి. అధికార భాషా సంఘాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆరోపణ ఉంది. తెలుగు అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఏటా వచ్చే మొత్తం ఆరులక్షల రూపాయలు మాత్రమే. ఈ మొత్తాన్ని జీతాలకోసం ఇస్తారు. ఇది విద్యుత్‌ ఛార్జీలకు కూడా చాలదు. హిందీ అకాడమీకి మనరాష్ట్ర ప్రభుత్వం 48లక్షల రూపాయలు ఇస్తుంది. ఇంతకంటే ఘనమైన విషయం- ఉర్దూ అకాడమీకి మూడు కోట్ల రూపాయలు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుకు గల ప్రాధాన్యమిదీ! తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వమే ఇటువంటి పరిస్థితిని కల్పిస్తే, రాష్ట్రేతరాంధ్రుల స్థితిగతులు ఇంక ఎలా ఉంటాయో గమనించగలరు! కరుణానిధి తమిళ భాషా సాహిత్యాలలో దిట్ట. 'తొల్కాప్పియ వ్యాకరణ గ్రంథానికి 15 ఏళ్ల క్రితమే వ్యాఖ్యానం వెలయించారు. అది ఆంగ్లంలోకి కూడా తర్జుమా అయింది. ఆయన రచనలను చైనా భాషలోకి కూడా తర్జుమా చేయిస్తున్నారు. ప్రపంచ జనాభాలో మొదటి స్థానాన్ని వహించిన చైనీయులకు కూడా తమ సాహిత్యం అందుబాటులో ఉండాలనే కోరిక తమిళులది. ఇది వారి అనువాద శక్తియుక్తులకు సాక్షాత్కారం. కరుణానిధి ఇటీవల 'సెమ్మొళి' సంస్థకు తమ సొంతపైకం ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. భాషా సాహిత్యాలకోసం వారి దాతృత్వం మన తెలుగు(నే)తలలో ఉందా! పార్టీల విషయం మరవండి. తెలుగుకోసం ఆలోచించండి!!
(ఈనాడు,03:08:2008)
__________________________

Labels:

Paradigm Shift...!!!!!

Have a Blessed Day


A blind boy sat on the steps of a building with a hat by his feet. He held up a sign which said: "I am blind, please help." There were only a few coins in the hat.

A man was walking by. He took a few coins from his pocket and dropped them into the hat. He then took the sign, turned it around, and wrote some words. He put the sign back so that everyone who walked by would see the new words.

Soon the hat began to fill up. A lot more people were giving money to the blind boy. That afternoon the man who had changed the sign came to see how things were. The boy recognized his footsteps and asked, "Were you the one who changed my sign this morning? What did you write?"


The man said, "I only wrote the truth. I said what you said but in a different way."
What he had written was: "Today is a beautiful day and I cannot see it."

Do you think the first sign and the second sign were saying the same thing?

Of course both signs told people the boy was blind. But the first sign simply said the boy was blind. The second sign told people they were so lucky that they were not blind. Should we be surprised that the second sign was more effective?


Moral of the Story: Be thankful for what you have. Be creative. Be innovative. Think differently and positively.


Invite others towards good with wisdom. Live life with no excuse and love with no regrets. When life gives you a 100 reasons to cry, show life that you have 1000 reasons to smile. Face your past without regret. Handle your present with confidence. Prepare for the future without fear. Keep the faith and drop the fear.

Great men say, "Life has to be an incessant process of repair and reconstruction, of discarding evil and developing goodness. In the journey of life, if you want to travel without fear, you must have the ticket of a good conscience."


The most beautiful thing is to see a person smiling

And even more beautiful is, knowing that you are the reason behind it!!!

(an email forward)
_____________________________

Labels:

సంఘం చెక్కిన శిల్పాలు


తామెంతగానో ఆరాధించే కథానాయకుడు వెండితెరపై కళ్లబడగానే అభిమానులంతా ఉప్పొంగిపోతారు. ఊగిపోతారు. జేజేలు పలుకుతారు. అదే సమయంలో వారంతా ఒక ముఖ్యవిషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అందాల నటుడు ఎందరిదో శ్రమకు ఫలితంగా అంత అందంగా రూపొందాడు. తలదువ్వేవారు, తళుకులు అద్దేవారు, దిద్దితీర్చేవారు, నిగ్గుతెచ్చేవారు, మాటరాసేవారు, వెనక పలికేవారు... ఇలా ఎందరో నిర్విరామంగా కృషిచేస్తే- ఆ నటుడు తెరమీద మనకు కనువిందు చేస్తున్నాడు. మనిషి విషయంలో సమాజం పాత్రా అదే! ఒక మనిషి విజేతగా రాణించడం వెనక ఎందరిదో శ్రమ ఇమిడి ఉంటుంది. కని పెంచేవారు, విద్యనేర్పేవారు, బుద్ధిమప్పేవారు, వివేకం అలవరచేవారు, ఆలోచనలను అలవాట్లను ప్రభావితం చేసేవారు... ఇలా ఎందరో సాయపడితే- ఒక విజేత తయారవుతాడు. మనిషికి సమాజంనుంచి లభించే తోడ్పాటును సమీక్షిస్తూ, అరిస్టాటిల్‌ 'మనిషి సంఘజీవి' అని తీర్మానించాడు. ప్రతివ్యక్తికీ 'తాను ప్రేమ పొందాలి' అనే తపన ఉంటుంది. అంతేకాదు, 'నిన్ను ప్రేమిస్తున్నాను' అని ఎవరో చెబితే వినాలనీ ఉంటుందన్నాడు ప్రముఖ రచయిత జార్జి ఇలియట్‌. 'నా కొరకు చెమ్మగిలు నయనమ్ములేదు...' అంటూ కవి వాపోవడం మనకు తెలుసు. తనచుట్టూ ఉన్న ప్రపంచంనుంచి మనిషి ప్రేమ, గుర్తింపు కోరుకుంటాడు. మనస్తత్వవేత్తలు దీన్ని అస్తిత్వ సంక్షోభం(ఐడెంటిటీ క్రైసిస్‌)లో భాగం అంటున్నారు. గుర్తింపుకోసం తపన, సమాజంతో అవసరాలు పునాదులుగా, మనిషికీ సంఘానికీ మధ్య సంబంధబాంధవ్యాలు నిర్మాణమవుతాయి. మనిషే సమాజానికి కేంద్రబిందువు. మనిషి వ్యక్తిత్వమే సమాజంలో అతని స్థానాన్ని నిర్దేశిస్తుంది. వ్యక్తిత్వం అంటే మరేంలేదు- 'ఆ మనిషి అలవాట్లన్నింటి కూడికే' అన్నాడు స్టీఫెన్‌కోవె. 'అలవాట్లలోంచే ఆ మనిషి వ్యక్తిత్వం తొంగిచూస్తుంది' అన్నాడాయన. బాల్యంలోని సావాసాలు, వయసులో తిరుగుళ్లు- మనిషి అలవాట్లుగా మారి, వ్యక్తిత్వంగా ప్రపంచానికి పరిచయమవుతాయి.

'ఏమిస్తావో అదే వస్తుంది' అనే సిద్ధాంతం- ప్రేమ, గుర్తింపుల విషయానికి బాగా అన్వయిస్తుంది. ప్రేమ ఇవ్వడమంటే- పక్కింటమ్మాయిని ప్రేమించడం కాదు. ఒకాయన 'భార్యే నా ప్రపంచం' అనేవాడు. ప్రపంచంపై కసి అంతటినీ నిత్యం భార్యమీద చూపించేవాడు. మనపక్కవాడు తన యోగక్షేమాలపట్ల మన ఆసక్తిని ఆశిస్తాడు. కష్టాల్లో మన సహానుభూతిని కోరతాడు. తనను చాలామంది పట్టించుకుంటున్నారన్నది- మనిషికి గొప్ప ఊరట. అలాంటి సందర్భాల్లో 'నీవు ఇచ్చిన- నీకు వచ్చును' అన్న సూత్రం వర్తిస్తుంది. ఎండ అనుకోకుండా పక్కింటావిడతో కిరాణాకొట్టుకు తోడువెళ్తే- పెద్దపిల్లను స్కూల్లో దింపడానికి వెళ్లినప్పుడు, మన ఇంట్లో చంటాణ్ని ఆవిడ చూసుకుంటుంది. తోటి ఉద్యోగికి ఒంట్లో బాగోలేనప్పుడు అతని పనిని కాస్త పంచుకుంటే- మన బండి పాడైనప్పుడు అతడు ఆదుకుంటాడు. వీధికుళాయి దగ్గర నీళ్లు పట్టుకోవడం దగ్గరనుంచి- ఇల్లు మారడాలు, పెళ్లిళ్లు వంటి పనులదాకా ఇరుగుపొరుగు ఒకరికొకరు సాయం చేసుకునే అలవాటు ఆ రకంగానే మొదలవుతుంది. సాయపడేటప్పుడు కొందరికి మనసులో ఇష్టంగా లేకపోయినా, పైకి నవ్వు నటిస్తూండవచ్చు. ఈ రకం ద్వంద్వ ప్రవృత్తినే లోపలిమనిషి(హైడ్‌), బయటిమనిషి(జెకిల్‌) లక్షణాలుగా మనస్తత్వవేత్తలు చెబుతారు. కొన్నాళ్లకు వారుచేసిన సాయం కారణంగా కాకుండా- మంచితనాన్ని గుర్తించినందువల్ల, తెలియకుండానే మనలో వారిపట్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అది మనలో మార్పుతెస్తుంది. సాయం లేదా మంచి చెయ్యడం మనకీ అలవాటుగా మారుతుంది. క్రమంగా అది మన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందుతుంది. మనం 'సంఘం చెక్కిన శిల్పాలం' అవుతాం. సమాజాలు బాగుపడేది ఈ రకంగానే! తమదగ్గరలేని గొప్ప గుణాలను తెరవేల్పుల్లో చూసి ఈలలువేసే అభిమానులు స్వయంగా తామే కథానాయకులయ్యేది- ఈ సమాజాల్లోంచే. అలాంటివాణ్ని 'ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు' అంటారు.

చెట్టు చాటున నిలిచి తనను బాణంతో పడగొట్టిన రాముణ్ని జుగుప్సగా చూశాడు వాలి. 'రేపు సభ్యసమాజం నిన్ను నిలదీస్తే- ఈ పాపకార్యానికి ఏం జవాబు చెబుతావు' అని అడిగాడు. అంటే మనిషి తప్పుచేస్తే సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. సత్పురుషులతో కూడిన సంఘాలు సభ్యుల చెడు నడతను నిలదీస్తాయి. వ్యక్తిత్వాలను సరిజేస్తాయి. ఇరుగుపొరుగు ముత్తయిదువులను పిలిచి భార్య నట్టింట్లో పేరంటం పెడితే, పడగ్గదిలో మందుకొట్టడాన్ని భర్త వాయిదావేయక తప్పదు. మంచిని చూసినప్పుడు చెడు జంకుతుంది. వెనకంజ వేస్తుంది. ఇరుగూపొరుగూ గౌరవనేయులైతే, మధ్యవాడు మంచివాడవడానికి చాలా అవకాశం ఉంది. అంతేకాదు, నలుగురితో కలివిడిగా ఉండేవారికి ఆరోగ్యం బాగా ఉంటుందని మిచిగన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ అనాడియెజ్‌ రూక్స్‌ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అలాంటివారికి రక్తపోటు చాలా తక్కువస్థాయిలో ఉందని ఆయన పరిశోధనలో తేలింది. కలిసిమెలసి జీవించే స్వభావం మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని, గుండెజబ్బుల ప్రమాదం తగ్గిస్తుందని- ఆయన నిరూపించారు. నలుగురితో కలిసిపోయేవారిలో వ్యాయామాలు చెయ్యడం, నడకకు వెళ్లడం వంటి మంచి అలవాట్లు పెరుగుతున్నాయని, వారిలో నేరస్వభావం తగ్గుతోందని డాక్టర్‌ రూక్స్‌ గుర్తించారు. ఒంటరివాళ్లకన్నా- ఇరుగుపొరుగులతో జతకలిపి బతికేవాళ్లు 'ఆరోగ్య భాగ్యవంతులు' అని తేలింది. 'మీరు మా పక్కింట్లోంచి మారిపోయాక మాకు మంచి పొరుగు లభించిందొదినా' అని ఈవిడా, 'మాకూ అంతే... పీడ విరగడ అయినట్లుంది' అని ఆవిడా దెప్పుకొనేట్లు కాకుండా- ప్రేమాభిమానాల వాయనాల్ని ఇరుగుపొరుగులతో ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంది సహజీవన సౌందర్యం!
(ఈనాడు, సంపాదకీయం,03:08:2008)
_____________________________

Labels: ,