My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, November 28, 2006

Saying the right thing, at the right time... Priceless.

Jack wakes up at home with a huge hangover after the night at a business function. He forces himself to open his eyes and the first thing he sees is a couple of aspirins next to a glass of water on the side table. And, next to them, a single red rose!

Jack sits down and sees his clothing in front of him, all clean and pressed. Jack looks around the room and sees that it is in perfect order, spotlessly clean. So is the rest of the house.

He takes the aspirins, cringes when he sees a huge black eye staring back at him in the bathroom mirror and notices a note on the table: "Honey, breakfast is on the stove, I left early to go shopping - Love you!!"

He stumbles to the kitchen and sure enough, there is hot breakfast and the morning newspaper. His son is also at the table, eating.

Jack asks, "Son...what happened last night?"
"Well, you came home after 3am, drunk and out of your mind. You broke the coffee table, puked in the hallway and got that black eye when you ran into the door."
"So, why is everything in such perfect order, so clean, I have a rose and breakfast is on the table waiting for me?"
His son replies, "Oh, THAT!...Mom dragged you to the bedroom and when she tried to take your pants off, you screamed, "
Leave me alone, I'm married!".

Broken table - R585.26
breakfast - R42.20
Red Rose bud - R35.00
Two aspirins - R8.00

Saying the right thing, at the right time... Priceless.
------------------------------------------------------

Labels:

The power of non-violence



Dr. Arun Gandhi, grandson of Mahatma Gandhi and founder of
the M.K.Gandhi Institute for Nonviolence, in his June 9 lecture at the
University of Puerto Rico, shared the following story:
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
I was 16 years old and living with my parents at the
institute my grandfather had founded 18 miles outside of
Durban, South Africa, in the middle of the sugar plantations.
We were deep in the country and had no neighbors, so my
two sisters and I would always look forward to going to town
to visit friends or go to the movies.
One day, my father asked me to drive him to town for an
all-day conference, and I jumped at the chance. Since I was
going to town, my mother gave me a list of groceries she
needed and, since I had all day in town, my father asked me
to take care of several pending chores, such as getting the
car serviced.
When I dropped my father off that morning, he said, "I will
meet you here at 5:00 p.m., and we will go home together."
After hurriedly completing my chores, I went straight to
the nearest movie theatre. I got so engrossed in a John
Wayne double-feature that I forgot the time. It was 5:30
before I remembered. By the time I ran to the garage and
got the car and hurried to where my father was waiting for
me, it was almost 6:00.

He anxiously asked me, "Why were you late?"

I was so ashamed of telling him I was watching a John Wayne
western movie that I said, "The car wasn't ready, so I had
to wait," not realizing that he had already called the
garage.

When he caught me in the lie, he said: "There's something
wrong in the way I brought you up that didn't give you
the confidence to tell me the truth. In order to figure out
where I went wrong with you, I'm going to walk home 18 miles
and think about it."

So, dressed in his suit and dress shoes, he began to walk
home in the dark on mostly unpaved, unlit roads.

I couldn't leave him, so for five-and-a-half hours I drove
behind him, watching my father go through this agony for a
stupid lie that I uttered. I decided then and there that I
was never going to lie again. I often think about that
episode and wonder, if he had punished me the way we punish
our children, whether I would have learned a lesson at all.
I don't think so. I would have suffered the punishment and
gone on doing the same thing. But this single non-violent
action was so powerful that it is still as if it happened
yesterday. That is the power of non-violence.
--------------------------------------------

Labels:

Monday, November 27, 2006

'కాల్'మికులారా... ఏకంకండి!

'ప్రపంచ కార్మికులారా! ఏకం కండి' అంటూ కార్ల్ మార్క్స్ ఎప్పుడో పిలిస్తే, ఈమధ్యే మన దేశంలో సీపీఎం కార్మిక విభాగం సీఐటీయూ మరో అడుగు ముందుకేసి తాజా ట్రెండ్‌కు తగ్గట్టు బీపీఓ 'కాల్'మికులారా, చలో మీరంతా ఏకం కండి... పోరాడితే పోయేది మీ కష్టాల్ కన్నీళ్లే అంటూ ఇప్పుడు కొత్త 'కాల్' వినిపించి మార్కులు కొట్టేసే యత్నం మొదలెట్టింది. దానికితగ్గట్టే దేశంలో తొలిసారిగా కాల్ సెంటర్ ఉద్యోగుల కోసం కోల్‌కతాలో ట్రేడ్ యూనియన్‌కు ప్రాణం పోసి, దానికి ఐటీ సర్వీసెస్ అసోసియేషన్ అని నామకరణం పెట్టి బారసాల కూడా జరిపించేసింది.
కాల్ సెంటర్లలో ఉద్యోగాలు ఈమధ్యన హాట్ టాపిక్కులైపోయాయి. చూసి రమ్మంటే 'కాల్'చేసి వస్తారని పేరున్న వీరిలో 20 శాతం మంది తమ జీవిత భాగస్వాములు బీపీఓల్లో ఉద్యోగం చేయడానికి ససేమిరా ఇష్టపడడం లేదు. కేవలం పది శాతం మంది ఇందులో పది కాలాలు పాటు పని చేయాలనుకుంటుండగా మిగిలిన తొంభై శాతం మంది 'జాబు జాబంటావు జాబు నీదంటావు నీ జాబు ఎక్కడే చిలుకా' అనే అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర ఉద్యోగాలకు నిచ్చెనలు వేసుకుంటున్నారు. ఉన్న సంస్థలో ఎక్కువ మంది ఏడాదికి మించి పని చేయడంలేదు.

బీపీఓ ఉద్యోగుల్లో అరవై శాతం మంది వరకు మహిళలు ఉండడంతో ఆఫీసులోనూ, బయటా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అంతా దృష్టి సారిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో బెంగళూరులో ఓకాల్ సెంటర్ ఉద్యోగిని డ్రైవర్ చేతిలో అత్యాచారానికి, ఆ తరువాత హత్యకు గురికావడం, ఈ సంవత్సరంలో మరో ఉద్యోగినిని ప్రియుడే కాలయముడై కాటేయడంతో కలవరం ఎక్కువయింది. ఈ ఉద్యోగుల్లో డబ్బు వస్తుందన్న మాటే గానీ గుండె నిమిషానికి 172 సార్లు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందని అనుభవజ్ఞులు చెప్తున్నారు. డ్యూటీ అయ్యాక ఇంటికి చేరేంతవరకు భయాందోళనలతో కాలం గడపాల్సి వస్తోందని స్వయానా మహిళా ఉద్యోగులే అంటున్నారు. దీంతో వారిని ఇళ్ల వద్ద దిగబెట్టేందుకు డ్రైవర్లుగా ఆడవారినే నియమిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మెరుపులా మెరిసింది. దీనిమీద అధ్యయనమూ జరిగింది. మహిళల చేతికి స్టీరింగ్ ఇవ్వడమే సబబు అని తేలింది. దేశం మొత్తంమీద 5 వేల మంది క్యాబ్ డ్రైవర్లు అవసరమని తెలియడంతో 'ఊయలలూపే చేతులు ఉర్విని ఏలుతాయి, కార్లనూ నడుపుతాయి' అనుకోక తప్పదు. మహిళా డ్రైవర్లకు శిక్షణ మొదలైంది. ఇందులో మన రాష్ట్రమే ముందుంది. మూణ్నెల్ల పాటు శిక్షణ పొందగానే వీరు స్టీరింగ్ లీడర్లు అవుతారు. మహిళా ఉద్యోగుల కోసం క్యాబ్‌లలో మహిళా గార్డులను కూడా నియమించడానికి సన్నాహాలు సాగుతున్నాయి.

పదే పదే షిఫ్టులు మారడం, నిర్విరామంగా టెలిఫోన్ కాల్స్‌కు జవాబులు చెప్పాల్సిరావడం, వీటిలో అనేక మంది క్లయింట్ల దురుసు కాల్స్, తిండి తిప్పలు నియమబద్ధంగా ఉండకపోవడం వంటి వాటితో ఒత్తిడి పెరిగి అనేక శారీరక రుగ్మతలతో కాల్‌సెంటర్ల సిబ్బంది సతమతం అవుతున్నారు(ట). 'బాస్'ను అదుపు చేయడమే ఇందుకు మార్గమని తీర్మానిస్తున్నారు. బాస్‌లు తిట్టే తిట్లన్నీ పడాలనే రూలేమీ లేదని, తమ రైట్లను రైట్‌ఫుల్‌గా వినియోగించుకొనే అవకాశాలూ ఉండాలని కలసికట్టుగా కష్టాలకు ఎదురొడ్డుదాం అన్న 'కాల్'తో కదం తొక్కుతున్న

'వీరినెవ్వరాపరీవేళ వీరి ధాటికోపలేరీవేళ' అని సంతసించి, పదండి ముందుకు పదండి... అంటూ వారిని ఎంకరేజ్ చేద్దామా!


- ఫన్‌కర్, Eenadu, 26:11:2006
-------------------------------------------------------------------------------------------

Labels:

పురుషులందు భారత పురుషులు వేరయా...

పుణ్యంకొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలని సామెత. దాంపత్య జీవితం సజావుగా సాగిపోవటమన్నది భార్యాభర్తలిద్దరి పైనా ఆధారపడి ఉంటుంది. ఆదరణ చూపే భర్తా అనుకూలవతియైన భార్యా దొరికినప్పుడు ఆ సంసారం ఏటివాలులో చల్లగా సాగిపోయే పడవ ప్రయాణంలా హాయిగా గడిచిపోతుంది. దంపతుల్లో ఒకరు ఏటికి ఇంకొకరు కోటికి లాగుతుంటే ఆ కాపురంలో చిటపటల రాగాలే హోరెత్తిపోతుంటాయి. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయమై ఉంటాయంటారు. నిశ్చయపరచటం ఎక్కడ జరిగినా వివాహాలు జరిగేదీ జంటలు కాపురాలు వెలగబెట్టాల్సిందీ భూమిమీదే కదా! కాబట్టే ఎన్నో మంచిచెడ్డలు విచారించాకనే పెద్దవారు పిల్లలకు పెళ్ళిళ్ళు కుదురుస్తారు. ''అల్లవూరీవారు పిల్లనడిగేరు, పిల్లవానికి రూపురేఖలున్నాయి, ఏటేట పండేటి భూములున్నాయి, పిల్లదానికి మంచి యీడుజోడేను, కన్నెనిస్తామని కబురంపుదాము'' అని మధ్యవర్తులెంత ఊదరగొట్టినా ఆ వైనాలన్నీ కళ్ళారాచూసి సంతృప్తిచెందాకనే సంబంధాలు ఖాయపరుచుకుంటారు. ''బుద్ధిమతే కన్యాం ప్రయచ్ఛేత్'' అని ఆర్యోక్తి. బుద్ధిమంతుడైన వరునికే కన్యనివ్వాలి అని దాని అర్థం. విద్య, ఆరోగ్యం, మంచి నడవడిక కలిగినవారే యోగ్యులైన వరులని అటువంటివారికే అమ్మాయినిచ్చి వివాహం చేయాలని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆశిస్తారు. ''అంత తొందరపడతావేం? అబ్బాయి ఎలాంటివాడో ఏమిటో అన్నీ తెలుసుకోకుండానే పెళ్ళి చేసేద్దాం అంటే ఎలా?'' అన్నాడు అమ్మాయి తండ్రి. ''అవన్నీ తెలుసుకొనే మా నాన్న నన్ను మీకిచ్చి కట్టబెట్టాడా ఏమిటి? ఇప్పుడు మనం అవన్నీ చూడటానికి'' అంటూ ధుమధుమలాడింది భార్యామణి! వివాహం అనేది ఏడు జన్మల బంధం అంటారు. అందుకే మూడుముళ్ళు వేసే ముందు అబ్బాయిలు, మూడుముళ్ళకు తలవంచే ముందు అమ్మాయిలు చక్కగా ఆలోచించి కాని నిర్ణయాలు తీసుకోకూడదు.
''వివాహం అనేది బోనులాంటిది. బయట ఉన్నవారు లోపలకు వెళ్ళాలని ఉబలాటపడుతుంటారు. లోపల ఉన్నవారు ఎలా బయటపడటమా అని మధనపడుతుంటారు...'' అని పెళ్ళిని నిర్వచించాడో పెద్దమనిషి. బహుశా ఆయనకు సరైన భాగస్వామి లభించి ఉండకపోవచ్చు. వెనకటి రోజుల్లో ఏటవతల సంబంధాలు వద్దనుకొనేవారు. దగ్గర ఊళ్ళలోనే సంబంధాలు కుదుర్చుకొనేవారు. వారి మంచి చెడ్డలు వీరికీ వీరి గుణగణాలు వారికీ తెలిసి ఉండటంతోపాటు- రాకపోకలు సులభమై అచ్చట్లు ముచ్చట్లు చక్కగా తీరతాయని భావించేవారు. మారిన కాలంలో ఊళ్ళమధ్యే కాదు దేశాల మధ్యే దూరాలు చెరిగిపోతున్నాయి. అడవిలోని చెట్టుకాయ ఊరిలోని ఉప్పురాయి కలిసినట్లు ఏ దేశంలోని అమ్మాయో మరో దేశంలోని అబ్బాయిని పెళ్ళాడి ''నీకు నాకు జోడు కుదిరెను కదరా చల్ మోహన రంగా'' అనటం పరిపాటైపోయింది. ఒక లోకంలోనివారు మరో లోకంవారిని ప్రేమించి పెళ్ళాడిన ఉదంతాలు పురాణాల్లో ఉన్నాయి. పాతాళలోకానికి చెందిన ఉలూచి అనే నాగకన్య గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న అర్జునుని సోయగం చూసి మోహవివశ అవుతుంది. ''ఔరా సొగసిటుకదా ఉండవలె...'' ననుకొని మచ్చుజల్లి అర్జునుణ్ని పాతాళ లోకంలోని తన మందిరానికి తీసుకుపోతుంది. తన మనసు తెలిపి పెళ్ళి చేసుకొమ్మంటుంది. ''ఇదెక్కడి వింత. మన లోకాలు వేరు, జాతులు వేరు, మన మధ్య వివాహం ఎలా సంభవం?'' అన్న అర్జునునితో- ''ఏమనబోయెదం దగుల యెంచక నీవిటులాడ, దొల్లి శ్రీరామ కుమారుడైన కుశరాజు వరింపడె మా కుముద్వతిన్, గోమల చారుమూర్తి పురుకుత్సుడు నర్మద పెండ్లియాడడే'' అని చెప్పి, ''వారికి లేని అభ్యంతరం మనకొచ్చిందా...'' అంటూ లా పాయింట్లు లాగుతుంది. చివరకు ఉలూచి అర్జునుల వివాహం జరిగి వారికి ఇలావంతుడు అనే కుమారుడు కలగటం మనోహరమైన విజయవిలాస కావ్యంగా రూపుదిద్దుకొంది.

భర్తలందు భారతీయ భర్తలు వేరయా- అంటోంది మేరియా ఆర్బతోవా. భారతీయ భర్తలకు మరే దేశంవారూ సరిరారు అంటున్న ఈ రష్యన్ వనిత స్వదేశంలోని రమణులకు భారతీయ యువకుల్నే వరులుగా ఎన్నుకొని పెళ్ళి చేసుకొని సుఖపడాల్సిందిగా సలహా ఇస్తోంది. ఈ స్త్రీవాద రచయిత్రి మనదేశాన్ని సందర్శించి, ఇక్కడి ప్రజల మనస్తత్వాన్ని జీవన విధానాలను అధ్యయనం చేసి రచించిన 'ఎ టేస్ట్ ఆఫ్ ఇండియా' పుస్తకం రష్యాలో బ్రహ్మాండంగా అమ్ముడుపోతోంది. భారత్‌లోని మగవారు సున్నిత మనస్కులనీ కుటుంబం పట్ల ఆపేక్షగా ఉంటూ బాధ్యతతో మెలగుతారంటున్న మేరియా, సుమిత్ దత్తాగుప్తా అనే భారతీయుణ్నే పెళ్ళి చేసుకొంది. ''మనస్తత్వాలు, భావోద్వేగాలు, అభిప్రాయాలు వంటి అనేక విషయాల్లో రష్యన్లకు, భారతీయులకు దగ్గర పోలికలున్నాయి. రష్యన్ యువతులు భారత్‌కు చెందిన మగవారితో చక్కగా కలిసిపోగలరు. వారి మధ్య వివాహబంధం దృఢంగా ఉంటుంది'' అంటోంది మేరియా. రష్యాలో ఇప్పుడు వరుల కొరత ఎక్కువగా ఉంది. అక్కడ అవివాహిత యువతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరిణామం అనేక సామాజిక సమస్యలకు దారి తీస్తోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక అక్కడి యువతలో పాశ్చాత్య నాగరికతపై మోజు పెరిగింది. కొంతమంది రష్యన్ యువతులు అమెరికా యూరప్ దేశాలకు చెందినవారిని పెళ్ళి చేసుకుంటున్నారు. ఆ పెళ్ళిళ్ళు ఆట్టే కాలం నిలవటం లేదు. పాశ్చాత్య దేశాల మగవారిలో పురుషాధిక్య భావం ఎక్కువ, సంయమనం తక్కువ ఉండటంవల్ల వారితో రష్యన్ యువతులు ఎక్కువకాలం కలిసి మనలేకపోతున్నారని మేరియా భావన. సంస్కృతీ, సంప్రదాయాలకు కుటుంబ విలువలకు ఎక్కువ విలువనిచ్చే భారతీయ పురుషులే సరియైన జోడీ కాగలరన్నది ఆమె స్వానుభవం. అందుకే, ఇంకా పెళ్ళికాని రష్యన్ అమ్మాయిలను- భారత్ పురుషునితో శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు- అని దీవిస్తోంది!

(Editorial, EEnadu,26:11:2006)
--------------------------------------------------------------------------------

Labels:

నిధి చాల సుఖమా!?

ఆదాయానికి, ఆనందానికి
మధ్య దూరం ఎంతో
శాస్త్రవేత్తల పరిశోధనలు
ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోకం దాసోహం, సొమ్ముతో కాని పని లేదు... ఇవన్నీ ఎప్పుడూ వినిపించేవే. నిజంగానే డబ్బుకు అంత శక్తి ఉందా? కొంత సొమ్ముంటే అవసరాలు తీరుతాయి. మరికొంత ఉంటే సౌకర్యాలు సమకూరుతాయి. ఇంకెంతో ఉంటే విలాసాలు కాళ్ల ముందు వాలుతాయి. ఇవన్నీ పరిపూర్ణ ఆనందాన్నిచ్చేవేనా? ఆత్మసంతృప్తి కలిగించేవేనా? విలువను కొలవడానికి మనిషి తయారుచేసుకున్న డబ్బు... మనసుకు సంబంధించిన ఆనందాన్ని కొనితెస్తుందా?

డబ్బును ఎక్కువగా సంపాదించేవారు ఎక్కువ ఆనందంగా ఉంటారని అంతా అనుకుంటారు. ఇందులో నిజమెంత అనే అంశంపైనే ప్రముఖ ఆర్థిక, మానసిక పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఆదాయానికి, ఆనందానికి ఉన్న సంబంధంపై అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయానికి చెందిన నోబెల్ గ్రహీత డేనియల్ కానెమెన్, ఆర్థికవేత్త అలన్ బి.క్రూగర్ మరికొందరు మానసిక శాస్త్రవేత్తలతో కలిసి రెండేళ్లుగా కృషిచేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు ఉన్న నమ్మకాలకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఎక్కువ ఆదాయం కలిగినవారు మరింత ఆనందంగా ఉంటారన్న నమ్మకం అతియోశక్తి, భ్రమ మాత్రమేనని వెల్లడైంది. డబ్బు వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చన్నది వాస్తవమే అయినా... ఆనందంగా జీవించడంలో మాత్రం దాని పాత్ర తక్కువేనని తేలింది. ఎంత సంపాదించినా అదిచ్చే ఆత్మతృప్తి తక్కువేనని ఇటీవలి ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అపర కుబేరులు కూడా సేవా కార్యక్రమాలవైపు దృష్టిని మళ్లిస్తున్నారు. సెకన్లను డబ్బుతో కొలవగలిగే స్థితిలో ఉన్న మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకొని సేవారంగానికి పూర్తిసమయం కేటాయించడానికి సిద్ధమవుతున్నారు. జీవితమంతా సంపాదనకే వెచ్చించిన బర్క్‌షైర్ హాతవే యజమాని వారెన్ బఫెట్ తన ఆస్తిలో అధికభాగం విరాళంగా ఇచ్చేశారు. తన సొమ్మును ఇంతకంటే సద్వినియోగం చేసే మార్గమేదీ కనిపించలేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. వీరి మార్గంలో మరెందరో అపర కుబేరులు పేదరిక నిర్మూలన, వ్యాధుల నిరోధక మందుల పరిశోధనలకు విరాళాలను ప్రకటిస్తున్నారు.

వ్యక్తిత్వవికాస బోధనల్లోనూ ఆదాయానికి, ఆనందానికి సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. కొంతకాలం క్రితం వ్యక్తిత్వవికాస నిపుణుడు, భారత సంతతికి చెందిన కెనడా రచయిత రాబిన్‌శర్మ రచించిన 'ఏ మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ' (ఫెరారీని అమ్ముకున్న సన్యాసి) అనే నవల 35 దేశాల్లో 40 భాషల్లో విపరీతంగా అమ్ముడుపోయింది. ఇది నవలే అయినా వ్యక్తిత్వవికాస పుస్తకంగా పేరుపొందింది. ఇందులో కథానాయకుడు జూలియన్ మాంటిల్ (53) న్యాయవాద వృత్తిలో విపరీతంగా సంపాదిస్తాడు. అత్యంత విలాసంగా జీవిస్తుంటాడు. అతడి జీవన విధానం వల్ల బాగా వృద్ధుడిలా కనిపిస్తుంటాడు. మాంటిల్ ఒకరోజు అకస్మాత్తుగా గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోతాడు. కోలుకున్న తర్వాత ఒక్కసారిగా మారిపోయి తన ఆస్తిని, తనకెంతో ఇష్టమైన ఫెరారీ కారును కూడా అమ్మేస్తాడు. మూడేళ్లపాటు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతాడు. భారత్‌లోని హిమాలయాల్లో కొందరు సాధువుల నుంచి పరిపూర్ణ జీవితం గురించి తెలుసుకొని కొత్త ఉత్సాహంతో నవయువకుడిలా తిరిగొస్తాడు. ఆ విశేషాలను తన శిష్యుడైన మరో న్యాయవాది జాన్‌కు వివరించడమే కథాంశం. ఇందులో భాగంగానే జ్ఞానం, ఆనందం, ఆధ్యాత్మికత, నాయకత్వ లక్షణాలు, లక్ష్యసాధన, నిరాడంబర జీవితం వంటి అంశాలను రచయిత లోతుగా వివరిస్తారు.

తప్పని పనులే ఎక్కువ
అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ...
అధిక ఆదాయం ఉన్నవారు... తప్పనిసరైన కార్యకలాపాలైన రోజువారీ పని, షాపింగ్, పిల్లల సంరక్షణ వంటి వాటికి సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తున్నారు. ప్రశాంతత, ఆహ్లాదాన్ని కలిగించే సామాజిక కార్యక్రమాలు, టీవీ చూడడం వంటి పనులకు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.
అధికాదాయం పొందేవారు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలకు తక్కువ సమయాన్ని కేటాయించగలుగుతున్నారు. వారికి ఆనందాన్నివ్వడంలో ఆదాయం పాత్ర అతి స్వల్పం.
సాధారణంగా ఆనందం కలిగించే అంశాలేమిటని ఎవరినైనా ప్రశ్నించినప్పుడు డబ్బేనని చెబుతారు. అది కేవలం నమ్మకమని, వాస్తవం అందుకు భిన్నమని అధ్యయనంలో తేలింది.
ఏటా లక్ష డాలర్ల (రూ.45 లక్షలు) ఆదాయం వచ్చేవారు తమ కంటే ఆనందంగా ఉంటారని 20వేల డాలర్ల (రూ.9 లక్షలు) వార్షికాదాయం పొందేవారు అభిప్రాయపడ్డారు. సర్వే విశ్లేషణ తర్వాత రెండు వర్గాల వారి ఆనందం స్థాయుల్లో తేడా భిన్నంగా ఉంది.
పురుషుల్లో లక్ష డాలర్ల ఆదాయం ఉన్నవారు తమ సమయంలో 19.9 శాతాన్ని వినోద కార్యక్రమాలపై వెచ్చిస్తుండగా, 20వేల డాలర్లలోపు ఆదాయం కలిగినవారు 34.7 శాతం సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ ఆదాయ వర్గాలకే చెందిన మహిళల్లో ఇది 19.6, 33.5 శాతంగా ఉంది.
'ఆదాయానికి, జీవితపు సంతృప్తికి పెద్దగా సంబంధం లేకున్నా చాలా మంది మరింత సంపాదనను పెంచుకోవడానికే తీవ్రంగా కృషిచేస్తుంటారు. కొన్నిసార్లు మరింత ఒత్తిడితో కూడిన పనులకు మరింత సమయాన్ని కేటాయించడం, ఆనందం కలిగించే సామాజిక కార్యాక్రమాల సమయాన్ని త్యాగం చేయడం జరుగుతోంది' అని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ అధ్యయనం కోసం కొత్త విధానాన్ని అనుసరించారు. మొత్తంగా జీవితం ఎలా ఉందన్న కోణంలో కాకుండా... వ్యక్తులు ఎదుర్కొనే రోజువారీ అనుభవాలపై వారి మనోభావాలెలా ఉన్నాయన్న కోణంలో సర్వేను నిర్వహించారు. దీనికి రోజువారీ పునర్నిర్మాణ పద్ధతి (డైలీ రీకన్‌స్ట్రక్షన్ మెథడ్-డీఆర్ఎం) అని పేరు పెట్టారు. దీని ప్రకారం ఎంపిక చేసుకున్న వ్యక్తులను... క్రితం రోజు కార్యకలాపాల్లో వారు పొందిన ఆనందం, విచారం వంటి భావనలను ఒక డైరీలో నమోదు చేయాలని కోరారు. ఇలా రెండు దఫాలుగా నిర్వహించిన సర్వే వివరాలను సరిపోల్చి విశ్లేషించారు.
(Eenadu, 26:11:2006)

__________________________________________________

Labels: