My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, October 20, 2007

UNIVERSAL LAWS OF THE OFFICE

- Rome did not create a great empire by having meetings. They did it by killing all those who opposed them.

- If you can stay calm while all around you there's chaos, then you probably haven't completely understood the seriousness of the situation.

-Doing a job right the first time gets the job done. Doing the job wrong 14 times gives you job security.

- Eagles may soar, but weasels don't get sucked into jet engines.

- Artificial Intelligence is no match for Natural Stupidity.

- A person who smiles in the face of adversity probably has a scapegoat.

- Never put off until tomorrow what you can avoid altogether.

- Teamwork means never having to take all the blame yourself.

- Hang in there, retirement is only a few years away!

- Go the extra mile. It makes your boss look like an incompetent slacker.

- A snooze button is a poor substitute for no alarm clock at all.

- When the going gets tough, the tough take a coffee break.

- Indecision is the key to flexibility.

(an email forward)
_____________________________

Labels:

Wednesday, October 17, 2007

సిల్లీ పాయింట్‌

* ఆసియా ఆడ ఏనుగుకు దంతాలుండవు. అదే ఆఫ్రికా ఏనుగుల్లో అయితే ఆడవాటికి కూడా దంతాలుంటాయి.
*
ప్రస్తుత పోప్‌ బెనెడిక్‌్టXIV వద్ద 2 గిగాబైట్ల సామర్థ్యం గల తెల్లరంగు ఐపాడ్‌ ఉంది.
* భుక్తాయాసం వచ్చేటట్టు తింటే కొద్దిసేపటి దాకా వినికిడి శక్తిలో చురుకుదనం లోపిస్తుంది.
*ఇంద్రధనుస్సు ఎప్పుడూ సూర్యుడికి అభిముఖంగానే ఏర్పడుతుంది.

* సువారో కాక్టస్‌ అనే రక్కిస వెుక్కకు కొమ్మ రావడానికి 75 ఏళ్లు పడుతుంది.
* దిబ్బడేసిన నాసికా నాళాలు శృంగారంలో పాల్గొంటే తెరుచుకుంటాయి.
* డాక్టర్‌ పేరుగల వైద్యులు అమెరికాలో 23 మంది ఉన్నారు. నేమ్‌బోర్డ్‌పై వారి పేరు ఇలా ఉంటుంది... Dr.Doctor

*
కిల్లర్‌వేల్‌ నీటి ఉపరితలానికి వచ్చినప్పుడు దాని గుండె నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుంది. అదే అడుగుభాగాన ఆ రేటు నిమిషానికి 30.
*కుడిచేతి వాటం వాళ్ల కన్నా ఎడమచేతి వాటం వారు క్రీడల్లో చురుగ్గా ఉంటారు.
* అమెరికా అధ్యక్షుల్లో గడ్డం ఉన్నవారంతా రిపబ్లికన్‌లే.
* మగమేక మూత్రంలో అవ్మోనియా అధికంగా ఉంటుంది.
* 'తనను తాను ఓ నాయకుడిగా భావించుకునే దురహంకార పూరిత దుందుడుకు పిల్లాడు' ...హిట్లర్‌ మూడోతరగతి చదువుతున్నప్పుడు అతని గురించి టీచర్‌ ఇచ్చిన రిపోర్టు ఇది.
* జిరాఫీలు దగ్గలేవు.
* చంద్రుడి దశనూ వచ్చే కాలాన్నీ బట్టి బ్లూమూన్‌, బ్లాక్‌మూన్‌, హార్వెస్ట్‌ మూన్‌, హంటర్స్‌మూన్‌(దీన్నే బ్లడ్‌మూన్‌, సాంగ్విన్‌మూన్‌ అని కూడా అంటారు), క్రిసెంట్‌మూన్‌, రైజింగ్‌ క్రిసెంట్‌మూన్‌, గిబ్బస్‌మూన్‌, డ్రైమూన్‌, వెట్‌మూన్‌, ఫెయిరీమూన్‌, న్యూమూన్‌, హాఫ్‌మూన్‌, ఫుల్‌మూన్‌... ఇలా దాదాపు 13కుపైగా పేర్లున్నాయి.
*
పందుల శరీరనిర్మాణం దృష్ట్యా అవి తల పూర్తిగా పైకెత్తి ఆకాశాన్ని చూడటం అసాధ్యం
*
ఇంగ్లండులోని గ్లూసెస్టర్‌షైర్‌ విమానాశ్రయ ప్రాంతాల్లో పక్షుల్ని తోలడానికి ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అమెరికన్‌ రాక్‌ గాయని టీనాటర్నర్‌ పాటలు ప్రసారం చేస్తుంటారు. ఆమె గొంతులో పలికే పైస్థాయి స్వరాలే అందుకు కారణం. టీనాకు ఉత్తమ గాయనిగా మంచి పేరుంది. ఎనిమిది గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఘనతా ఉంది.
*
ఈఫిల్‌ టవర్‌పై కొనకు ఎక్కడానికి 1665 మెట్లున్నాయి.

(Eenadu, 14:10:2007)
______________________________________________

Labels:

జనం నోట్లో 'నానీ'

- రావికంటి శ్రీనివాస్‌

ఇప్పుడంతా
రెండింటిపైనే చర్చ
క్రికెట్లో ధోని
కవిత్వంలో నాని
తెలుగు సాహిత్యంలో నానీలు ఎంత ప్రాచుర్యం పొందాయో చెప్పడానికి ఈ ఒక్క నానీ చాలు.
ఇరవై ఓవర్ల క్రికెట్‌లో ధోనీసేన సంచలనం సృష్టిస్తే... ఇరవై అక్షరాలతో ఫోర్లు (నాలుగులైన్లు) కొడుతూ నాని తెలుగు కవిత్వంలో దూసుకుపోతోంది. తెలుగు కవిత్వంలో ప్రాచీన సాహిత్యాన్ని, కావ్యాలను టెస్టు మ్యాచ్‌లతో పోలిస్తే నానీలను ట్వంటీ ట్వంటీ పోటీలుగా భావించవచ్చు. టెస్టు మ్యాచ్‌ల తర్వాత వచ్చిన వన్డే మ్యాచులు ఎంతగా అలరించాయో తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన 'ట్వంటీ ట్వంటీ' మరింత స్పీడ్‌ పెంచుకుని, నిడివి తగ్గించుకుని ఎంత రసవత్తరంగా తయరైందో అందరికీ తెలిసిందే. సరిగా ఇదే పోలిక తెలుగు కవిత్వానికీ వర్తిస్తుంది. గ్రాంధిక భాష, ఛందో బంధాల నడుమ సాగిన కవిత్వ ప్రక్రియ క్రమంగా రూపాలు మారుతోంది. సంక్లిష్ట వృత్త పద్యాలకన్నా, సరళమైన ఆటవెలదులు, తేటగీతులకే ఆదరణ ఎక్కువ. చిన్న చిన్న పదాలు, పాదాలే అందుకు కారణం. పామర జనం నోళ్లలో కూడా నాని విస్తృతం కావడానికి కూడా ఆ సరళతే కారణం. భావాన్ని నిర్దుష్టంగా చెప్పటం, సూటిగా చెప్పటం కోసం అనేక ప్రక్రియలు అవసరమయ్యాయి. సాహితీ రచనలో సౌలభ్యం కోసం పద్యం వచన పద్యం దాకా వచ్చింది. ఆ వరుస లోనే మినీ కవితలు, హైకూలు వచ్చాయి. ''దేనిలోనైనా మార్పు జరిగే కొద్దీ సౌలభ్యమూ పెరుగుతుంది. అసలు కచ్చితంగా చెప్పాలంటే సౌలభ్యం కోసమే మార్పు అవసరమవుతుంది'' అదే క్రమం కొనసాగి తెలుగు కవితా లోకంలో వికసించిన వెలుగు పూలు... తెలుగు పూలు నానీలు. దశాబ్దం క్రితం చిన్న పాయగా ప్రారంభమైన ఈ కవిత్వ ప్రక్రియ నేడు మహాప్రవాహమై ముందుకు సాగుతోంది. కవిత్వం.. రచనలు.. సాహిత్యం పండితులకే తప్ప మనకెందుకులే అనుకునే దశలో సామాన్యులను సైతం నానీలు ఆకట్టుకుంటున్నాయి. ఆంగ్ల మాధ్యమంపై మోజులో తెలుగు భాష అంతరించిపోతుందేమో అని ఆందోళన చెందుతున్న వారికి సరికొత్త ఆశను చిగురింపజేస్తున్నాయి. 'ట్వింకిల్‌ ట్వింకిల్‌' రైమ్స్‌ తప్ప చిట్టి పొట్టి పాటలు తెలియని చిన్నారులను సైతం కట్టిపడేస్తున్నాయి. చిన్నారులను నానీ, కన్నా అంటూ పిలచుకుంటాం. అలాంటి వారినీ ఆకట్టుకునేవి కాబట్టే వీటిని నానీలు అంటున్నామంటున్నారు ఈ ప్రక్రియ సృష్టికర్త ఆచార్య ఎన్‌.గోపి. నావి(నా), నీవి(నీ) కలిపితే నానీలు.. అంటే మనవి అని మరో అర్థం. 1997 ఆచార్య ఎన్‌.గోపి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆతర్వాత ఎస్‌.రఘు, ఎస్‌.ఆర్‌.భల్లం, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, అంబల్ల జనార్దన్‌, ద్వానా శాస్త్రి, రసరాజు తదితరులు నానీల వర్షం కురిపించారు. 2001లో కోట్ల వెంకటేశ్వరరెడ్డి 'తెలంగాణా నానీలు' రాయడంతో నానీల సీను తెలంగాణాకు మారింది. చిల్లర భవానీ దేవి యశశ్రీ రంగనాయకి, శారదా అశోకవర్ధన్‌ లాంటి రచయిత్రులూ నానీలు రాశారు. కొత్త కొత్తగా రచనా ప్రక్రియకు పూనుకునే వారికి నానీలు స్వాగతం పలుకుతున్నాయి. తెలుగు సాహిత్య ప్రపంచంలోకి సింహద్వారంగా నానీలు వెలుగొందుతున్నాయి.

నానీల్లో ప్రశ్నలు ఉంటాయి. జవాబులు ఉంటాయి. చమక్కులు ఉంటాయి. భావోద్వేగాలు ప్రతిఫలిస్తాయ్‌. ఆర్తిని కలిగిస్తాయ్‌. ఆవేదన రగిలిస్తాయ్‌. ఆలోచన రేపుతాయ్‌. అయ్యో అనిపిస్తాయ్‌.. భలే అనిపిస్తాయ్‌.. బాధను కలిగిస్తాయ్‌. మనసును కదిలిస్తాయ్‌. మంచిని పెంచుతాయి. చెడును దునుమాడుతాయి. పంచ్‌తో బాధేస్తాయి. స్పార్క్‌తో మెరిపిస్తాయి.

గాఢమైన భావనలు, లోతైన ఆలోచనలు బుద్ధిగా నాలుగు పంక్తులో ఒదిగిపోతాయి.
మెలకువ
రెప్పల గదుల్లో బందీ
రేపటికే
విడుదల
ఎంత లోతైన భావన.
గోపీ గారి పదాల్లో చెప్పాలంటే-
ఎండపొడల్లో
తడిగా నానీలు
రక్తంతో శ్రుతిచేసిన
వినూత్న బాణీలు
''నానీల్లో వాక్యాన్ని భావాన్ని సంక్షిప్తంగా చెప్పటం, జీవన సత్యాన్ని పిండటం అనే లక్షణాలున్నాయి. అన్నింటికి మించి నానీలో ఏ ఉద్రేకం, ఆగ్రహం, ఆవేశం లేవు. స్పష్టమైన ధ్యానాత్మకత నానీలకుంది.'' నానీలు కేవలం నాలుగు పంక్తులు కలిగి ఉన్న ప్రక్రియ కాదు. అనేకమైన కవితా మార్గాలను సంలీనం చేసుకున్న ప్రక్రియ. రెండు భావ శకలాలలో ఒక పెద్ద వచన కవిత సాధించిన ప్రయోజనాన్ని సాధించిన ప్రక్రియ. నానీల్లో అంతశ్శోధన ఒక ప్రత్యేక గుణం.

తడుస్తాయని
చేపలు భయపడవు
సముద్రాన్ని చీలుస్తూ
అతికిస్తాయి.
చూసిన దృశ్యాన్ని కొత్తగా... ఎంత గొప్పగా ఆవిష్కరించారు?
నడుస్తున్నట్లు
మైమ్‌
అంగుళం ముందుకుసాగదు
రాజకీయమంటే అదే..
రాజకీయాల తీరుపై ఎంత ఘాటైన వ్యంగ్య బాణమిది?
క్లాసులో ఎప్పుడూ
వెనకవరసే
ఇప్పుడాయన
అగ్రనాయకుడు
ఎలాంటివారు రాజకీయాల్లోకి వస్తున్నారో.. ఎవరు పాలకులవుతున్నారో ఎంత వ్యంగ్యంగా చెప్పారో కవి
వివాహమా
ఎంతపనిచేశావ్‌
పుట్టింటికే
నన్ను అతిథిని చేశావ్‌
ఓ రచయిత్రి కలం నుంచి జాలువారిన ఈ పదాలు చదివితే మనసు కదలడం లేదూ..
బువ్వ తింటాంటె
సరం పడ్డది
ఎక్కడో
రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
మరో కవి హృదయ స్పందన ఇది. ఎంత సామాజిక స్పృహ.
పూలదండను చూసి
మురిసింది మేక
అదే ఇక
చివరి కేక
ఒక మూగ జీవి దైన్యాన్ని ఇలా ఆవిష్కరించారు.
నానీలలో
కవిత్వం జాడ
కై చిప్పలతో తీసిన
పాలమీగడ
ఇవి కొన్ని మ(మె)చ్చు తునకలు మాత్రమే. ఇలాంటి కొన్ని వందల వేల నానీలు ఈ రోజు తెలుగునాట వెలువడుతున్నాయి. భాషను సుసంపన్నం చేస్తున్నాయి. మరి కొన్ని శతాబ్దాల వరకు భాష నిలిచి ఉండేందుకు బీజాలు వేస్తున్నాయి.
నానీ జనాః సుఖినోభవంతు
(నానీల దశమ వార్షికోత్సవం, నానీల శతాధిక గ్రంథోత్సవాల సందర్భంగా)
(Eenadu, 14:10:2007)
_______________________________

Labels:

ఒంటరి జీవులకు చేయూత

'పొట్ల పాదుకు పొరుగు గిట్టదు'- అని సామెత. అలాంటి మనుషులూ కొందరుంటారు. వారికి ఇతరులతో పొసగదు. ఎవరితో కలవకుండా ఒంటరిగా కాలం గడపటానికే ఇష్టపడతారు. 'ఒంటికాయ శొంఠికొమ్ము' మనస్తత్వం గల ఈ బాపతు మనుషులు నలుగురిలో కలవక దూర దూరంగానే ఉంటారు. నీకు నాకు పడదు కాని రోలెక్కి తలంబ్రాలు పోయి- అందిట ఓ కొత్త పెళ్లికూతురు. పెళ్లిపీటలమీదే ఆవిధంగా ప్రవర్తించిన ఆ అమ్మాయి తరవాత కాపురం ఎంత లక్షణంగా సాగించి ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. ఇటువంటి వారికి స్నేహంలోని మాధుర్యం, సహజీవనంలోని సౌఖ్యం వంటివి తెలియవు. 'సృష్టిలో తీయనిది స్నేహమేనోయి'- అన్నాడు కవి. ఇతరులతో కలసి మెలసి ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకొంటూ, సహాయపడుతూ, సహకారం పొందుతూ ఫలప్రదమైన జీవితాన్ని అనుభవించటంలోనే అర్థం ఉంది, ఆనందం ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని కొందరు ఒంటరిగానే ఉండాలనుకొంటారు. ''ఇతరులతో సంపర్కమువొదులు కొని ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవితరహస్యాన్ని యదార్థం అని నమ్మి సమాధానపరుచుకోవడం సంఘంతో నిమిత్తం వున్న మనిషికి సాధ్యం కాదు కాబోలు...'' అంటారు బుచ్చిబాబు తన 'చివరకు మిగిలేది' నవలలో. నిజానికి ఒంటరితనం వాంఛించదగ్గది కాదు.

''ఎవరినీ ప్రేమించకుండుట అదే ఒక నేరం, ప్రేమ తెలియని జీవితాలు భూమికే భారం-'' అన్నారు ఆరుద్ర. ఒంటరితనాన్ని కోరుకోవటం అభిలషణీయం కాదు. అనేక కారణాలవల్ల అయినవారి తోడు లేక ఒంటరిగా జీవితాలు గడపక తప్పని అభాగ్యులెందరో ఉన్నారు. తమను ఆదుకొనే ఆపన్నహస్తం కరవై నిరాశా నిస్పృహలతో వారు వేగిపోతుంటారు. ''నా కొరకు చెమ్మగిలు నయనమ్ములేదు...'' అనిపించటం కంటె జీవితంలో దుర్భరమైన దశ మరొకటి ఉండదు. కోరి ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకొనేవారు కొందరైతే పరిస్థితుల ప్రాబల్యంవల్ల పలకరించేవారు, ఆదరించేవారు లేక తప్పనిసరి ఒంటరితనాన్ని అనుభవించేవారు మరికొందరు. వృద్ధాప్యం పైబడినవారిని, రోగగ్రస్తులను ఒంటరితనం మరింత ఎక్కువగా బాధిస్తుంది. వారికి మరొకరి తోడు, ఓదార్పు తప్పనిసరి. అవి లోపించినప్పుడు జీవితమే దుర్భరంగా తోచి నిరాశానిస్పృహలు ఆవరిస్తాయి. ''రాతి బ్రతుకెంచుకొని యహోరాత్రములను రెప్పవాల్చని తిమిర యాత్రికుడ నేను-'' అన్న భావుకుడు ''కోతకై చూచు పంట బరువున వ్రాలిన పైరువోలె నీ చేయూతకై వేచి కాచి యుంటి-'' అంటాడు. అతడు కోరుకున్న స్నేహహస్తం అందినప్పుడే ఆనందం అంచులు దాటుతుంది. లేనిపక్షంలో నిర్బంధ ఒంటరితనంతో జీవితమంతా నిట్టూర్పుల పొగలూ సెగలూ విడుస్తూ భారంగానే కాలం వెళ్లదీయాల్సి ఉంటుంది. ఏకాంతవాసం, ఒంటరితనం ఎవరూ కోరదగినవి కావు.

నలుగురితోపాటు నారాయణా అన్నట్లుగా నలుగురితో కలసిమెలిసి ఉండే సామూహిక జీవనాన్నే మనిషి కోరుకుంటాడు. మానవుడు సంఘజీవి. ఆ స్వభావం వల్లే నలుగురితో చావు పెళ్ళితో సమానం వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఒంటరితనం బాధాకరమైంది. ఒక శాపం వంటిది. మరొకరి తోడు లేకుండా ఒంటరిగా ఉండాల్సి రావటం మనిషిని కుంగదీస్తుంది. మారిపోయిన నేటి పరిస్థితుల్లో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన నేపథ్యంలో చాలామందికి ఒంటరితనం తప్పటంలేదు. రోగులను, వృద్ధులను కనిపెట్టుకొని ఉండే తీరిక ఇప్పడు ఎవరికీ ఉండటంలేదు. ఈ దశలో హాలెండ్‌లో 'డిజెనోబ్లోయెమ్‌' (పొద్దుతిరుగుడు పువ్వు) అనే స్వచ్ఛంద సంస్థ ఒంటరితనాన్నుండి వృద్ధులను, రోగులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఉద్భవించింది. 1945లో ప్రారంభమైన ఈ సంస్థ తన కార్యకర్తల ద్వారా వృద్ధులు, రోగులు వంటి ఆపన్నులకు తగిన సేవలందించి వారికి మనోధైర్యాన్ని కలిగిస్తోంది. ఈ సంస్థకు 40,000 మంది కార్యకర్తలుండగా వారు ఆరు లక్షలమందికి పైగా వృద్ధులు, రోగులు తదితరులకు తమ సేవలందిస్తున్నారు. సంస్థకు చెందిన కార్యకర్తలు వృద్ధులతో, రోగులతో మాటామంతీ ఆడుతూ వారితో కబుర్లు చెబుతూ కాలక్షేపం కలిగిస్తారు. అప్పుడప్పుడూ వారిని సినిమా, నాటకాలవంటి వినోద కార్యక్రమాలకు తీసుకెళతారు. కబురుచేస్తే వృద్ధుల, రోగుల ఇళ్లకే వెళ్లి, వారితో చదరంగం వంటి ఆటలలో పాల్గొంటారు. వారితో కబుర్లాడుతూ కాఫీ తాగుతూ ఉల్లాసాన్ని కలిగిస్తారు. ఆమ్‌స్టర్‌డాం నగరంలో ప్రారంభమైన ఈ సంస్థ మొదట్లో తమ సేవలను వయసుమళ్లిన వారికి, రోగులకు మాత్రమే పరిమితం చేసినా ప్రస్తుతం అన్ని వయసులవారికీ విస్తరింపచేసి యువతకు సైతం తమ సేవలను అందిస్తోంది. ''అనేక కారణాలవల్ల, ముఖ్యంగా ఇతరులతో కలిసే స్వభావం కొరవడటంవల్ల యువజనంలో కూడా కొంతమంది ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. అటువంటివారిని మార్చి నలుగురితో కలసిపోయేలా కార్యక్రమాలు రూపొందించి ఆచరిస్తున్నాం. ఇందుకోసం శిక్షణ పొందిన యువ కార్యకర్తలు అనేకమంది మా సంస్థలో ఉన్నారు. మా కృషి సత్ఫలితాలను ఇవ్వటమేకాక విదేశాలవారి దృష్టినీ ఆకర్షిస్తోంది. మా సంస్థవారి సేవలను అందుకోవటానికి వారు సైతం ఆసక్తి చూపుతున్నారు-'' అని వివరించారు సన్‌ఫ్లవర్‌ సంస్థ నిర్వాహకురాలైన జెన్నీడిజోంగ్‌. ఉదాత్తమైన ఆశయాలతో నడుస్తున్న ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతుండటం ముదావహం!
(Eenadu, 14:10:2007)
___________________________________


Labels:

I never take risk while drinking

When I come from office in the evening, wife is cooking

I can hear the noise of utensils in the kitchen

I stealthily enter the house

Take out the bottle from my black cupboard

Shivaji Maharaj is looking at me from the photo frame

But still no one is aware of it

Becoz I never take a risk

I take out the glass from the rack above the old sink

Quickly enjoy one peg

Wash the glass and again keep it on the rack

Of course I also keep the bottle inside my cupboard

Shivaji Maharaj is giving a smile

I peep into the kitchen Wife is cutting potatoes

No one is aware of what I did Becoz I never take a risk

I: Any news on Iyer's daughter's marriage?

Wife: Nope, she doesn't seem to be that lucky. Still they are looking out for her

I again come out; there is a small noise of the black cupboard

But I don't make any sound while taking out the bottle

I take out the glass from the old rack above sink

Quickly enjoy one peg

Wash the bottle and keep it in the sink

Also keep the Black Glass in the cupboard

But still no one is aware of what I did

Becoz I never take a risk

I: But still I think Iyer's daughter's age is not that much

Wife: What are you saying? She is 28 yrs old... like an aged horse

I: (I forgot her age is 28) Oh Oh...

I again take out potatoes out from my black cupboard

But the cupboard's place has automatically changed

I take out the bottle from the rack and quickly enjoy one peg in the sink

Shivaji Maharaj laughs loudly

I keep the rack in the potatoes & wash Shivaji Maharaj's photo & keep it

in the black cupboard

Wife is keeping the sink on the stove

But still no one is aware of what I did

Becoz I never take a risk

I: (getting angry) you call Mr. Iyer a horse? If you say that again, I

will cut your tongue...!

Wife: Don't just blabber something, go out and sit quietly...

I take out the bottle from the potatoes

Go in the black cupboard and enjoy a peg

Wash the sink and keep it over the rack

Wife is giving a smile

Shivaji Maharaj is still cooking

But still no one is aware of what I did

Becoz I never take a risk

I: (laughing) So Iyer is marrying a horse!!

Wife: Hey go and sprinkle some water on your face...

I again go to the kitchen, and quietly sit on the rack

Stove is also on the rack

There is a small noise of bottles from the room outside

I peep and see that wife is enjoying a peg in the sink

But none of the horses are aware of what I did

Becoz Shivaji Maharaj never takes a risk

Iyer is still cooking

And I am looking at my wife from the photo and laughing Becoz I never take what???

(an email forward)
_________________________________________

రిస్క్‌
క(వి)థాపజ్జగజ్జెం
పెగ్‌-1: మందు విషయంలో మాత్రం మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.సాయంత్రం ఇంటికి వచ్చేసరికి, మా ఆవిడ వంట చేస్తూంటుంది.వంటింట్లోంచి వంటపాత్రల శబ్దం వినిపిస్తూంటుంది.మనం పిల్లిలా ఇంట్లో దూరతాం.చెక్క బీరువాలోంచి మందు బాటిల్‌ తీస్తాం. ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.ఎవరూ వాడని బాత్రూం అటకమీంచి గ్లాసందుకుంటాం.లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.గ్లాసు కడిగేసి అటకమీద పెట్టేస్తాం.అఫ్‌కోర్స్‌, బాటిల్‌ కూడా చెక్కబీరువాలో పెట్టేస్తాం.తాతగారు బోసినవ్వుతో చూస్తారు.వంటింట్లోకి తొంగిచూస్తాను.మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
నేను: శర్మగారమ్మాయి పెళ్ళి సంగతేమైంది?
ఆవిడ: తిన్నగా ఉంటే కదా మంచి సంబంధాలు రావడానికి?

పెగ్‌-2: మనం మళ్ళీ ఇవతలికి వస్తాం.
చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది.
మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్‌ తీస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
బాటిల్‌ కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
నేను: ఏమిటోయ్‌, మన శర్మ కూతురు అప్పుడే పెళ్ళీడుకొచ్చేసిందా?
ఆవిడ: ఇంకా పెళ్ళి వయసేమిటి? అడ్డగాడిదలా ముప్ఫైయేళ్ళొస్తుంటే.
నేను: ఓ... ఐసీ!

పెగ్‌-3: మనం మళ్ళా చెక్కబీరువాలోంచి చపాతీపిండి తీస్తాం.
చెక్కబీరువాలో బాత్రూం ప్రత్యక్షం అవుతుంది.
బాటిల్‌తీసి అటకలో రెండౌన్సులు పోస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి ముడుచుకుంటాం.
తాతగారు పడీపడీ నవ్వుతుంటాడు.
అటకని పిండిమీద పెట్టేసి
తాతయ్యని కడిగేసి చెక్కబీరువాలో పెట్టేస్తాం.
వంటింట్లోకి తొంగిచూస్తాం.
మా ఆవిడ పొయ్యిమీద బాత్రూం పెడుతుంది.
ఈ బాటిల్లో సద్దు ఆ బాటిల్లో పడనివ్వం.
ఎందుకంటే, మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
నేను: ఏంటే మా శర్మగార్ని గాడిదంటావా, తోలు ఒలిచేస్తాను.
ఆవిడ: ఊరికే గొడవ చెయ్యకుండా వెళ్ళి పడుకోండి.

పెగ్‌-4: మనం పిండిలోంచి బాటిల్‌ తీస్తాం. చెక్కబీరువాలోంచి ఓ పెగ్గు కలుపుతాం.
బాత్రూం కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
మా ఆవిడ ఫొటోలోంచి నవ్వుతూ చూస్తుంటే గాంధీ వంట చేస్తుంటాడు.
ఈ శర్మ సంగతి ఆ శర్మగాడికి తెలియనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
నేను: ఇంతకీ శర్మగాడి పెళ్ళి ఆ గాడిదతో అయిందా లేదా?
ఆవిడ: నెత్తిమీద బక్కెట్‌ నీళ్ళు పోశానంటే... వెళ్ళండి బయటికి.

పెగ్‌-5: నేను మళ్ళీ కిచెన్‌లోకి వెళ్తాను.
నిశ్శబ్దంగా అటకమీద కూర్చుంటాను.
డ్రాయింగ్‌రూంలోంచి బాటిళ్ళ శబ్దం వినిపిస్తుంటుంది.
నేను లోపలికి తొంగిచూస్తే మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంటుంది.
వెంటనే లటక్కున మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకుంటాం.
ఈ గాడిద చప్పుడు ఆ గాడిద చెవిలో పడనివ్వం.
అఫ్‌కోర్స్‌, తాతయ్య ఎప్పుడూ రిస్క్‌ తీసుకోడు.
శర్మ వంట చెయ్యడం పూర్తయ్యేవరకూ
మనం ఫొటోలో కూర్చుని మా ఆవిణ్ణి చూసి నవ్వుతుంటాం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్‌ తీసుకోం.
మరాఠీ మూలం: అజ్ఞాత రచయిత
అనువాదం: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
(Eenadu, 21:10:2007)

__________________________________

Labels:

WHAT'S UR PLAN 'B'?

A pretty woman was serving a life sentence in prison. Angry and resentful about her situation, she had decided that she would rather die than to live another year in prison.

Over the years she had become good friends with one of the prison caretakers. His job, among others, was to bury those prisoners who died in a graveyard just outside the prison walls. When a prisoner died, the caretaker rang a bell, which was heard by everyone. The caretaker then got the body and put it in a casket. Next, he entered his office to fill out the death certificate before returning to the casket to nail the lid shut. Finally, he put the casket on a wagon to take it to the graveyard and bury it.

Knowing this routine, the woman devised an escape plan and shared it with the caretaker. The next time the bell rang, the woman would leave her cell and sneak into the dark room where the coffins were kept. She would slip into the coffin with the dead body while the caretaker was filling out the death certificate. When the care-taker returned, he would nail the lid shut and take the coffin outside the prison with the woman in the coffin along with the dead body. He would then bury the coffin. The woman knew there would be enough air for her to breathe until later in the evening when the caretaker would return to the graveyard under the cover of darkness, dig up the coffin, open it, and set her free.

The caretaker was reluctant to go along with this plan, but since he and the woman had become good friends over the years, he agreed to do it.

The woman waited several weeks before someone in the prison died. She was asleep in her cell when she heard the death bell ring. She got up and slowly walked down the hallway. She was nearly caught a couple of times. Her heart was beating fast. She opened the door to the darkened room where the coffins were kept. Quietly in the dark, she found the coffin that contained the dead body, carefully climbed into the coffin and pulled the lid shut to wait for the caretaker to come and nail the lid shut.

Soon she heard footsteps and the pounding of the hammer and nails. Even though she was very uncomfortable in the coffin with the dead body, she knew that with each nail she was one step closer to freedom. The coffin was lifted onto the wagon and taken outside to the graveyard. She could feel the coffin being lowered into the ground. She didn't make a sound as the coffin hit the bottom of the grave with a thud. Finally she heard the dirt dropping onto the top of the wooden coffin, and she knew that it was only a matter of time until she would be free at last. After several minutes of absolute silence, she began to laugh. She was free! She was free! Feeling curious, she decided to light a match to find out the identity of the dead prisoner beside her.

To her horror, she discovered that she was lying next to the dead caretaker.

Many people believe they have life all figured out..... but sometimes it just doesn't turn out the way they planned it.

Think 'Plan B' !
(an email forward)
____________________________________________

Labels: