My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, August 11, 2011

సరస్వతీ నమస్తుభ్యమ్‌..

పలు సందియములు దొలచును/ వెలయించు నగోచరార్థ విజ్ఞానము- అన్నది చదువుమీద చిన్నయసూరి సదభిప్రాయం. అక్షరం లోకం చక్షువు. నిరక్షర కుక్షిని గుడ్డి కుక్కతో పోల్చారు పురందరదాసు. 'సంతకుపోయి తిరిగిన దుడ్డుపెట్టె కాక దొరకేనా?' అని ఆ యోగి ఎకసెక్కాలాడినట్లే గాలికి తిరిగి తన పుత్రులెక్కడ జనుషాంధులవుతారోనని పంచతంత్రంలో పాటలీపుత్రం రాజు తెగ మథనపడిపోతాడు. అహరహము హరి నామస్మరణ మరిగిన ముద్దుల పట్టిని తిరిగి దారికి తెచ్చుకుందామంటే హిరణ్యకశిపుడికీ ముందుగా తోచింది సద్గురువుల వద్ద లభించే సద సద్వివేక చతురత కలిగించు విద్యాబుద్ధులే! చదవనివాడజ్ఞుండగునని రాక్షసుడైనా అక్షర మహిమను చక్కగా గ్రహించాడు. ఇప్పుడంటే విద్య పరమార్థం అర్థ సంపాదన గానీ... ఏకలవ్యుడు ఆ కాలంలో ఏ కాసులు ఆశించి గురుబ్రహ్మను బొమ్మగా తీర్చిమరీ విద్యలకోసం వెంపర్లాడాడు! కర్ణుడు పరశురాముని వద్ద పడీపడీ శుశ్రూషలు చేసింది కాలక్షేపం కోసమైతే కాదు గదా! మృతసంజీవనీ విద్యకోసం కచుడు చేసిన సాహసం సామాన్యమైనదా! ఆత్మ పరమాత్మల పరమ రహస్యాలను గురుముఖతః గ్రహించాలన్న కామనతోనే గదా జాబాలి గౌతముని మున్యాశ్రమంలో అన్నేళ్లు ఎడతెగక గొడ్లూ-గోదలను కాసింది! విద్యార్జనకెంత విలువలేకపోతే ఆ బాలగోపాలుడు సాందీప మహాముని ఆశ్రమంలో గుంట ఓనమాలు దిద్దుకుంటాడు! అవతార పురుషుడు ఆ తారకరాముడు సైతం తాటకి వధకు ముందు వశిష్టులవారి వద్ద వేద పారాయణాల్లో తర్ఫీదు పొందినవాడే! విద్యా సముపార్జనను ఓ విధిగా నిర్దేశించిన బ్రహ్మచర్యం చతురాశ్రమాల్లో ప్రథమమైనదే కాదు... ప్రధానమైనది కూడా. భారతీయులకు చదువు చెప్పే గురువు సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం. పురందరదాసు ప్రబోధించిన విధంగా గురువుకు 'గులాము అయ్యేదాకా ముక్తి దొరకదన్నా' అన్న సూక్తి మనిషికి చదువు మీదున్న భక్తిశ్రద్ధలకు పెద్ద నిదర్శనం.

భర్తృహరి బోధించినట్లు విద్య నిగూఢ గుప్తమగు విత్తము. పూరుషాళికి రూపము, యశస్సు, భోగకరి, విదేశంలో ఆదుకునే ఆపద్బంధువు. హర్తకు అగోచరమైన నిధి, సుఖపుష్టి, సత్కీర్తి ఘటించు ఈ దివ్యధనం విద్యార్థి కోటికి పూర్తిగా ధారపోసినా పెరిగేదే గాని తరిగే ద్రవ్యం కాదు. నిజానికి మనిషికి భుజకీర్తులు, సూర్య చంద్రహారాలు పెద్ద అలంకారాలు కావు. చందన స్నానాలూ, మందార మాలలు అందచందాలను ఏమంత పెంచనూ లేవు. వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణమ్‌- అన్న భర్తృహరి వాదనను కొట్టిపారేయలేము. ఆ రాచకవి అన్నట్లు నిజంగా విద్య నృపాల పూజితమే. కాకపోతే మనుచరిత్ర కర్త అల్లసాని పెద్దనామాత్యుని 'ఎదురైనచో మద కరీంద్రము నిల్పి కేయూత యొసగి' కృష్ణరాయలంతటివారు సరదాకి అయినా ఎక్కించుకుంటారా? వల్మీకజుడైన వాల్మీకి మహర్షికి కమలజన్మునితో సరిసమానమైన గౌరవ మర్యాదలందటానికి కీలకం రామాయణా రచనేనంటే ఏమనగలము? సుభాషిత రత్నావళి భాషించినట్లు చందమామకు తారాతోరణం, పతీపత్నులకు పరస్పర సాహచర్యం, పృథ్వీమతల్లికి సద్భూపాల సుపరిపాలన భూషణాలయితే... విద్య మాత్రం సర్వే సర్వత్ర సకల లోకాలకూ ఒకే మాదిరైన సద్భూషణం. 'డొక్క శుద్ధిలేని మనిషి తేనె బొట్టులేని పట్టు' అంటారు ఖలీల్‌ జిబ్రాన్‌. మనిషిజన్మ ఎత్తినందుకైనా నాలుగు మంచిముక్కలు నాలుకమీద ఉంచుకోనివాడిని- వజ్రవైఢూర్య ఖచిత ఘటకంలో తెలకపిండి వంటకంకోసం మంచిగంధపు చెక్కల్ని మంటపెట్టినవానికన్నా వెయ్యిరెట్లు అధిక మూర్ఖునిగా చిత్రించింది విద్యానీతి. చదువుకన్నా చక్కదనం, చక్కనిధనం ముల్లోకాలుగాలించినా ఎక్కడా దొరకదనేదే సర్వశాస్త్రాల సారం.

'చదువు సంధ్యలు' ఎంత చక్కని జంట పదం! జీవిత సంధ్యను రాగరంజితం చేయగలిగే చేవ చదువుకు మాత్రమే ఉందని ఎంత వింతగా ధ్వనిస్తున్నదీ పదం! బతుకు ధర్మక్షేత్రంలో మంచిచెడ్డల మధ్య జరిగే నిత్య కురుక్షేత్రంనుంచీ మానవుడిని మాధవునిలాగ కాపాడగలిగేది ఓనమాలే! సర్వరోగాలకు మూల కారణమైన తాపత్రయంవల్ల అంతిమంగా జరిగే నష్టం ఆయుక్షీణం- అన్నది రుగ్వేదవాదం. ఆ యావనుంచి మనసును మళ్లించి మంచి దోవకు తిప్పగల తారకమంత్రం మనచేతిలోనే ఉందని మానసిక వైద్యులూ చెబుతున్నారు. ఆరోగ్యసిద్ధికి... అమరత్వలబ్దికి పుస్తక పఠనమే ఉత్తమ సోపానం అని ఇప్పుడు లండన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులూ పేర్కొంటున్నారు. ఒక దశ దాటిన పిదప వయసుతోపాటు మనసు వడలిపోవడం సహజ పరిణామమే. నిష్కాముకత్వం దానికి నిఖార్సైన ఔషధం కావచ్చుకానీ... ఆ యోగం అందరికీ అంత సులభంగా అందివచ్చే అందలమా? బద్దెన నీతిశాస్త్రంలో కుండ బద్దలుకొట్టినట్లు ధనం, ఉషోదయం, యవ్వనం, వండిన అన్నం, మూర్ఖుడి స్నేహం లాగా మానవ జీవితకాలమూ బుద్బుధప్రాయమే. 'ఆయువు నూరు సంవత్సరములందు సగంబు నశించె నిద్రచే/ నా యరలో సగంబు గతమయ్యెను బాల్య జరాప్రసక్తి చే/ బాయక తక్కిన యట్టి సగబాలు గతించు బ్రాయస వృత్తిచే!' ఆ మిగిలిన సగభాగంలోనైనా పడుచుదనంతో పరవళ్లు తొక్కాలని ఎవరికి ఉవ్విళ్ళూరదు! పుస్తక పఠనం వ్యసనంగా మలుచుకున్నవారి ఆయుర్దాయం పెరగడమేకాదు... ఉన్నంత కాలం చలాకీగా చిందులెయ్య గలుగుతారని లండన్విశ్వవిద్యాలయ పరిశోధక బృందం జరుపుతున్న పరీక్షల ఫలితం నిగ్గు తేల్చింది. మానవ కణాలల్లోని క్రోమోజోముల చివర జీవితకాలాన్ని నిర్దేశించే 'టెలొమెర్‌'లు ఉంటాయనీ... అవెంత దీర్ఘంగా ఉంటే జీవితకాలమంత సుదీర్ఘంగా సాగుతుందని ఆ బృందం నాయకుడు ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ హోల్గేట్‌ వాదం. పుస్తకాల పురుగులలో ఈ టెలొమెర్‌ కణం పొడుగు పెరుగుతుంటుందనేది పరిశోధనల సారాంశం. ఇంకేం... ఏడు పదులు దాటినా చేతికి కర్ర రాకుండా చలాకీగా ఉండాలంటే వెంటనే ఓ మంచి పుస్తకంతో 'పఠనాయోగం' ప్రారంభించటం మంచిది కదూ!
(సంపాదకీయం, ఈనాడు, ౨౯:౦౫:౨౦౧౧)
_____________________________

Labels: ,

*Some good definitions*

School: A place where Papa pays and Son plays.

Life Insurance: A contract that keeps you poor all your life so that you can
die Rich.

Nurse: A person who wakes you up to give you sleeping pills.

Marriage: It's an agreement in which a man loses his bachelors degree and a
woman gains her masters.

Divorce: Future tense of Marriage.

Tears: The hydraulic force by which masculine willpower is defeated by
feminine waterpower.

Conference: The confusion of one man multiplied by the number present.

Father: A banker provided by nature.

Criminal: A guy no different from the rest....except that he got caught.

Yawn: The only time some married men ever get to open their mouth.

Experience: The name men give to their mistakes.

Doctor: A person who kills your ills by pills, and kills you by bills.

Politician: One who shakes your hand before elections and your confidence
after.

Atom Bomb: An invention to end all inventions.


(an email forward)
-------------------------------------------------------------------

Labels:

ఏది స్వర్గం, ఏది నరకం?

ఏ రహస్య సృష్టి సానువులనుంచో జాలువారే కాంతి జలపాతం ఈ జీవితం... జనించేదెవరి వలన, చలించేదెందు కొరకు, లయించేది ఏ దిశకు? అన్నీ ధర్మసందేహాలే. అసలు కిటుకు ఆ కమలాసనుడికైనా తెలుసో లేదో! మానవుడు బుద్ధిజీవి. రాశి చక్రగతులలో/ రాత్రిందిన పరిణామాలలో/ బ్రహ్మాండ గోళ పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువుకా ప్రేరణకేది మూలకారణమో అంతు తేలేదాకా ప్రయాణం మానడు. అదే చిత్రం. గ్రహరాశుల నధిగమించి/ గగనాంతర రోదసిలో/ గంధర్వ గోళగతులు దాటిన మనిషి ఓ వంక నెలవంకనంటివస్తాడు... మరోవంక, మరణానంతరం జీవితం ప్రశాంతంగా సాగేటందుకు చుక్కలకు ఆవలి దిక్కున ఎక్కడో చక్కని లోకాలు చక్కర్లు కొడుతున్నాయని బలంగా నమ్ముతుంటాడు... అదింకో విచిత్రం. మార్గాలు, రూపాలు వేరువేరైనా స్వర్గాలు, నరకాలు అన్న భావనలు అన్ని మతాలకూ ఒకేలా ఉండటం అన్నింటికన్నా చిత్ర విచిత్రం! 'పుణ్యం చేసుకున్నవారు మరణానంతరం దైవదూతలుగా తేలియాడే ప్రేమారామ'మని యూదుల స్వర్గధామాన్ని అభివర్ణిస్తారు. 'అమృతం కురిసిన రాత్రి'లో బాల గంగాధర్‌ తిలక్‌ వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలబడినప్పుడు- పాదాల తారామంజీరాలు ఘల్లు ఘల్లుమని మోగించుకుంటూ వయ్యారంగా ఆకాశమార్గాన పరుగులెత్తుతూ పరవశం కలిగించింది బహుశా అలాంటి దేవతా ప్రేమమూర్తులేనేమో!

ఆ అమరలోకాలకు నిచ్చెనలు వేసిన కవులు, భావుకులకు విశ్వసాహిత్యంలో కొదవే లేదు. కాళిదాసునుంచి మిల్టన్‌దాకా, కృష్ణశాస్త్రినుంచి కవి తిలక్‌వరకూ దివిసీమ అందాలను గురించి పలవరించనిదెవరు? మనుచరిత్రలో అల్లసాని పెద్దన అరుణాస్పదపురం పేరును అడ్డు పెట్టుకుని చేసిన వర్ణనంతా ఆ రంగుల ప్రపంచాన్ని గురించే! 'అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ' అంటూ అమరపురి వైభోగాలను కలవరించిన తీరుకు మునిముచ్చులకైనా కలవరం కలగక మానదు. కళాపూర్ణోదయంలో మణికంధరుడునే గంధర్వుడు ఈ కిందిలోకపు అందాలను చూసి మనసు పారేసుకుంటాడు. మరి మామూలు మానవుడి మరులు ఆ సురలోక సౌఖ్యాలనుంచి ఓ పట్టాన మరలి రాగలవా? 'దిగిరాను దిగిరాను దివినుంచి భువికి' అని భావకవి వూరికే మారాం చేస్తారా?! వరూధిని వంటి వయ్యారి వగలాడుల సాము గరిడీలట పద్మసంభవ, వైకుంఠ, భర్గసభలు! ఆ కొలువు కావాలని కోరిక లేకపోవడానికి మనసును ప్రవరాఖ్యుడు ఆవరించాలి. అదంతా సాధారణమైన సాధనేనా?! కాళిదాసు కల్పనలోని ఆ మేరుపర్వతంమీది కల్పవృక్ష చ్ఛాయల్లో పచ్చల పట్టు పరుపులపైన అచ్చరల వెచ్చని ఒడి... అమర గానం... అమృతపానం... అవో... ఏ మర్త్యప్రాణిని ఝల్లుమనిపించవు?! ఏడు వూర్ధ్వ లోకాలనే కాదు... ఏడు అధో లోకాలనూ సృష్టించి పెట్టారు. పాపాల పాలును యాతనా దేహంగా మార్చి వైతరణిని తరించిన పిదప ఇరవై ఆరు రకాల నరకాల వెంట పాపిని తిప్పి పిప్పిచేసే వైనాన్ని వైనతేయ పురాణం వర్ణిస్తుంది. 'ఆ నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు' ఉరికి పడితే గుండె జారని ధీరుడెవ్వడు?! కాలదండం పాలబడకుండా కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించినట్లు అరిషడ్వర్గాల వైరివర్గంలో చేరిపోవడమొకటే చివరి మార్గం. 'దైవమూ-దయ్యమూ, పాపమూ-పుణ్యమూ, స్వర్గమూ-నరకమూ, మందభాగ్యులను ఓ మందగా మార్చేటందుకు కామందువర్గం కనిపెట్టుకున్న మత్తుమందు' అంటాడు కవి ఎమ్మాగోల్డ్‌. మన హేతు కవిరాజు సూత పురాణం కూడా 'మతిమాలిన కవిచంద్రులు/ గతిమాలిన వారలగుచు గదుకక యెవరో/ బతిమాలిన నల్లిన' కట్టుకథలివి అని కొట్టిపారేస్తుంది.

స్వర్గం, నరకం- మానవ మనోమందిరంలోని రెండు వూహా లోకాలు అయితే కావచ్చు... మరి మహనీయుల కమనీయ కల్పనల వెనకున్న తపనో?! మానవుడనే శిలను మాధవుడనే శిల్పంగా తొలిచి భువిని భువర్లోకంగా మలచాలనుకోవడం మహదాశయం కాదా? మహాభారతంలో స్వర్గారోహణం వేళ ధర్మజునితో యమధర్మరాజు అన్నట్లు 'స్వర్గ నరకాలు వేరువేరుగా లేవు'. తన సంతోషమె స్వర్గం, తన దుఃఖమె నరకమనే గదా సుమతీ శతక కర్త సుభాషితం. 'తృప్తిచెందని నరుని సప్త ద్వీపంబులైన చక్కంజేయునే! అక్షరంబులు నాలుగు కుక్షిలో వేసి అక్షరంబేదో తెలుసుకో మనసా' అని హెచ్చరించారు వేదాంతులు. నిగమంబులు వేయి చదివినా జీవిత సారం ఒంటబట్టనివాడికి ముక్తిమార్గమూ సుగమం కాదు. జీవితాన్ని చెదలపుట్టలో చీకిన ఆకులు తిని బతికే మకిలి పురుగులాగా చీదరించుకొనే వాదం ఎంత అసంబద్ధమో... విడివిడి భాగాల కలివిడితో తయారైన భౌతిక యంత్రంతో పోల్చి చూడటమూ అంతే అహేతుకం. శాస్త్ర నిఘంటువు నిర్వచనానికి అందనిదంతా అసత్యమన్న వాదనా సత్యదూరమే. క్రాంతి దర్శకులు వెలుగు చూపరు. వారు చూపిన దారిని పట్టుకుని జీవితాన్ని వెలిగించుకోవలసింది మనం. తెలివిడే జ్ఞానం. ప్రేమను మూలధనంగా పెట్టి జీవితాన్ని వ్యాపారంగా మలుపుకోవాలనుకునే బేహారులకు- లాభం స్వర్గం, నష్టం నరకం. విజయం స్వర్గం, అపజయం నరకం. దుఃఖం నరకం, సుఖం స్వర్గం. ఠాగూర్గీతాంజలి ప్రార్థన ప్రకారమైతే- ఎక్కడ జ్ఞానం నిత్యం వెల్లివిరుస్తుంటుందో అదే శాశ్వత స్వర్గం. కాలసంక్షిప్త చరిత్ర గ్రంథకర్త, అయిదు దశాబ్దాల బట్టి చావుబతుకుల సరిహద్దుల వద్ద తచ్చాడుతూనే మానవ చరిత్ర పురోగతికి అసమానమైన సేవలందిస్తున్న శాస్త్రవేత్త స్టీఫెన్హాకింగ్‌ 'స్వర్గం మిథ్య' అని చేసిన తాజా వాదాన్ని నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. మానవజాతి అభివృద్ధికోసం తపించే వారెవరికైనా అడుగడుగునా గుడే కనిపిస్తుంటుంది. అందులో వెలిగే దీపం భావవాదులకు దైవం అయితే... భౌతికవాదులకు జ్ఞానం. చూపులు వేరైనా చూస్తున్నది ఒకటే. అదే దైవజ్ఞానం, జ్ఞానదైవం. తేడా లేదు- రెండూ ఒకటే.
(సంపాదకీయం, ఈనాడు, ౨౨:౦౫:౨౦౧౧)
_____________________________

Labels:

వృథా అరికడదాం!

'పెళ్ళిచేసి చూడు- ఇల్లుకట్టి చూడు' అని సామెత. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా గృహస్థుకైనా రెండూ తలకు మించిన కార్యాలే. వరవిక్రయంలో పురుషోత్తమరావు బాధపడినట్లు 'ఆడపిల్ల పెళ్ళంటే అశ్వమేధ యాగమే'! 'కావిళ్లతో కాఫీయు, దోసెలి/ డ్డెనులు, నుప్మాయు నడిపింప వలయు/ కుడుచుచున్నప్పుడు పంక్తి నడుమ నాడుచు బెండ్లివారి వాంఛలు కనిపెట్టవలయు' అన్న వధువు తండ్రి మాటల్లో ఉన్నది నూరుశాతం ఆవేదన. లోకం, కాలం ఎన్ని మార్పులకు లోనైనా వివాహాది శుభకార్యాల ఆచారాలు, ఆలోచనలు తాతల కాలంనాటివి కావడమే విచిత్రం! ఆడపిల్ల పెళ్ళంటే ఇప్పటికీ కన్నవారి గుండెలమీద నిప్పుల కుంపటే. బరువు దింపుకోవడానికి తల తాకట్టుకైనా తయారుగా లేకపోవడం లోకుల దృష్టిలో తప్పు! 'అన్నింటికి సైచి వేలు వ్యయించి గౌరవించినను నిష్ఠురములె ప్రాప్తించు తుదకు' అని ఎన్ని నిట్టూర్పులు విడిచినా ఫలితం సున్నా. కష్టించి జీవితాంతం కూడబెట్టిన లక్షలు క్షణాల్లో ఎంత గొప్పగా ఆరిపోయాయన్నదే ఘనతకు గుర్తు! అందుకే పెళ్ళితంతును ఒక ఆధునిక కవి అంతరిక్షనౌక ప్రయోగంతో సరిగ్గానే పోల్చాడు. వధువు మెడలో తాళిపడే సుముహూర్తం క్షిపణి ప్రయోగ క్షణమంత అమూల్యమన్న అతగాడి చమత్కారం- అణాపైసల్లో చూసుకున్నా రూపాయికి వంద పైసలంత నిజం. కల్యాణ మండపం ఖరారు, ఆహ్వాన పత్రాల ముద్రణ, ఆహూతుల సంఖ్య, వంటకాల జాబితా... అదుపులో ఉండొచ్చు గానీ, అతిథుల పూట ఆకలి దప్పికలను సూపర్కంప్యూటర్అంచనా వేయగలదు?! అది వేయలేకా, వృథాను అదుపు చేయలేకా ఎంతో ఆహారం వృథా అవుతోంది. ఎక్కడైనా ఏదైనా సమృద్ధిగా లభిస్తున్నప్పుడు, దాని విలువ తెలీదు. భూమాత అందించే ప్రతి గింజనూ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప, నేలపాలు చేయకూడదు.

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయం కావచ్చు గాక- భోజనాల ఏర్పాట్లు భూలోకంలోనే కదా జరిగేది! కన్య వరుడి రూపానికి, తల్లి అల్లుడి ఆస్తిపాస్తులకు, తండ్రి అతగాడి పరువు ప్రతిష్ఠలకు, బంధుబలగం కులగోత్రాలకు ప్రాధాన్యమిచ్చినా, అతిథి జనాలు ఆరాటపడేది భోజనాదికాల కోసమేనని సంస్కృత శ్లోక చమత్కారం. 'జలసేవన గళగళలు, అప్పళముల ఫెళఫెళలు, భోక్తల భళాభళాల' సందడిలేని పెళ్ళి విందుకు అందమే లేదు పొమ్మన్నాడు భోజనప్రియుడు. పెళ్ళిలో పుస్తెలకున్నంత ప్రాముఖ్యం విస్తరికీ ఉంది మరి! మాయాబజారు చిత్రంలోని ఘటోత్కచుడిలా గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలు, పులిహోర, దప్పళాలు... వరసపెట్టి అంగిట్లోకి జార్చుకోవాలనే యావే ముప్పు. అష్ట భోగాల్లో మృష్టాన్నమూ ఒకటి. అది మితిమీరడం అహితమే. మర్యాదల పేరుతో శ్రుతి మించి సాగే వియ్యాలవారి విందుకు చెయ్యడ్డు పెట్టుకోకపోతే ముందు చెడేది అతిథి కడుపే. మాయదారి జిహ్వచాపల్యం జీవితానందాన్నే దెబ్బతీసే ప్రమాదముంది. పీకలదాకా మెక్కి పీకలమీదకు తెచ్చుకోవడం ఏమంత తెలివైన పని?! కుడుము కడుపును చేరకముందే మనసును మంగళగిరి పానకాల స్వామి ఆవహిస్తే 'మంగళం మహత్‌'! పరగడుపున రాజులాగా, అపరాహ్ణం మంత్రిలాగా, సాయంత్రం బంటులాగా భుజించాలని భోజన నీతి. అందుకు కట్టుబడటం ఇంటికీ దేశానికీ మంచిదంటున్నారు ఆహార, ఆర్థిక శాస్త్రవేత్తలు. నూటికి నలభై అయిదుమంది ఒక్క పూటైనా ముద్దకు నోచని మన పూర్ణగర్భలో అది శిరోధార్యం.

కల్యాణమంటే ఇద్దరు ఒకటయ్యే అర్థవంతమైన ముచ్చట. ఆత్మీయులు, బంధుమిత్రుల ముందు వేడుక ఎంత ప్రశాంతంగా జరుపుకొంటే అంత ముద్దు. అప్పు చేసి గొప్పగా పప్పన్నం పెట్టాలనుకోవడం తప్పు, అంతకుమించి ముప్పు. 'జుట్టెడు గడుపుకై చొరని చోట్లు చొచ్చి/ పుట్టెడు కూటికి బతిమాలే' అభాగ్యులు కోట్ల సంఖ్యలో పోగుపడిన దేశంలో విందు పేరిట అనవసర భేషజాలు, ఎడాపెడా వృథా చేయడాలు దారుణ నేరాల పద్దులోకే చేరతాయి. ఎంత భీమ బకాసురులైనా త్రిషష్టిత(63) సంవర్గ రస భేదాలను ఆస్వాదించడం కుదిరే పని కాదు. గొప్పకోసం చేసి చివరకు చెత్తకుప్పలమీదకు పారేసే విస్తరాకుల్లోని ప్రాణశక్తి ఎందరెందరినో ఆకలిచావుల పాలబడకుండా కాపాడగలదు. అటుకులు పిడికెడేనని కృష్ణయ్య కుచేలుడిని కాదు పొమ్మన్నాడా? బంధుమిత్రత్వాలకు విందుభోజనాలు కొలమానాలు, ప్రాతిపదికలు కానేకాదు. దేహమనే దేవాలయంలో ఆత్మారాముడి సంతృప్తికి ఫలం తోయం పరిమాణంతో కాక... ప్రేమతోనే నిమిత్తం. తినగ తినగ గారెలు వెగటు. ఆకలి సూచికలో అరవై మూడో స్థానంలోని మనదేశంలో అంత వెగటు పుట్టేదాకా తినాలనుకోవడమే అపచారం. వండి వృథా చేయడం క్షమించరాని నేరం. విందు వినోదాల్లో సాధారణంగా పదిహేనునుంచి ఇరవైశాతం దాకా ఆహార పదార్థాలు వృథా అవుతాయని ఆవేదన చెందుతున్నారు- 'హంగర్ఎలిమినేషన్అండ్యూ' వ్యవస్థాపకులు వి.రాజగోపాల్‌. ఆవేదనలో కచ్చితంగా అర్థముంది. చెత్తకుండీలవద్ద ఎంగిలి విస్తళ్ల కోసం కుక్కలమధ్య కొట్లాడే కోట్లాది అన్నార్తులున్న అన్నగర్భ మనది. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి వైభోగంగా వివాహం చేసుకున్నా ఒకే వంటకానికి పరిమితం కావాలనే చట్టం తెచ్చే ఆలోచన మన పాలకులకు కలగటం ముదావహం. పొరుగున పాకిస్థాన్లో ఉన్నట్లు ఏకపాక శాసనం ఇక్కడా వచ్చేదాకా ఎందుకు... మనమందరం ముందుగానే మేలుకుందాం. స్వచ్ఛందంగా ఆహారవృథాను అరికడదాం. ఇంటికీ ఒంటికీ దేశానికీ అంతకంటే చేసే మేలు, సేవ ఏముంటుంది?
(సంపాదకీయం, ఈనాడు, ౧౫:౦౫:౨౦౧౧)
_________________________________

Labels:

LEVELS OF STRESSLabels:

జీవనం ఓ మైత్రీవనం

ప్రకృతి మన వేళ్లమధ్య సందుల్ని ఎందుకు వదిలింది? ఆ శిష్యుడి సందేహానికి గురువు ఇచ్చిన బదులుకు మించిన మంచి వివరణ- స్నేహానికి మరేదీ లేదు. వేళ్లసందులతో మరో వేళ్ల సందులను సంధానించడానికన్నది జ్ఞాని సమాధానం. పెద్దలు చెప్పిన సప్త సుగుణాల్లో స్నేహ సౌఖ్యం ప్రముఖమైనది. మనసుతో మనసు, రహస్యంతో రహస్యం, ప్రజ్ఞతో ప్రజ్ఞ క్షీరనీర న్యాయంగా కలగలసిపోవడమే స్నేహం- అని శ్రీసుభాషిత రత్నావళి సూక్తి. ఆదిశంకరులు ప్రబోధించిన ముక్తిమార్గమూ సజ్జన సాంగత్య సోపాన నిర్మితమే. లౌకికంగా చూసుకున్నా మనిషి దుర్భాగ్యాన్ని మాపగలిగే ముఖ్యమైన నాలుగు సాధనాల్లో సన్మిత్ర సాహచర్యం ప్రధానమైనదని భర్తృహరి భావన. మనిషి సంఘజీవి. 'చివరికి మిగిలేది'లో బుచ్చిబాబు తర్కించుకొన్నట్లు- లోకంతో సంపర్కం లేకుండా ఏకాంతంలో మనం సాధించిన జీవిత రహస్యమే యథార్థమని నమ్మి సమాధానపరచుకోవడం మనిషన్న వాడికి సాధ్యమా? పద్యపాదం చక్కటి నడకకు యతిమైత్రి ఎలాగో... జీవితం మంచి నడతకు సన్నితుడి తోడు అలాగ. ప్రేమతో విత్తనాలు వేసుకోవడానికి, కృతజ్ఞతతో పంట కోసుకోవడానికీ పనికివచ్చే మన పొలంలాంటివాడు నిజమైన మిత్రుడు- అంటాడు ఖలీల్‌ జిబ్రాన్‌. ధన సాధన సంపత్తి లేనివారైనా బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని స్వకార్యం సాధించుకుంటారన్నది పంచతంత్రంలో మిత్రలాభం మొదటి కథ చెప్పే నీతి. పొరుగువాడితో స్నేహపూర్వకంగా మసలుకోవడమే భూలోకవాసానికి మనమిచ్చే సరైన కిరాయి- అన్న అలనాటి బాక్సింగ్‌ యోధుడు మహమ్మదాలీ వాదం నిజమేకదా! ప్రేమభావంతో చూస్తే జీవనం సర్వస్వం మైత్రీవనమే.

మిత్రుడు అంటే సూర్యుడని మరో అర్థం. ఏ లాభాపేక్ష లేకుండానే తన చుట్టూ పరిభ్రమించే భూగోళాదిగ్రహాలకు ఉదారంగా వెలుగురేకలు పంచిపెట్టే ప్రభాకరుడు నిజంగా సార్థక నామధేయుడే. 'మేఘుడు బుధికి బోయి జలంబులు దెచ్చి యీయడే/వాన సమస్త జీవులకు వాంఛిత మింపెన లార!-' అని భాస్కర శతకపద్యం. మేఘం చెట్టుకు చుట్టమా, పక్కమా? ఉసిరితొక్కును దానంచేసిన పేదగృహిణి ఇంట కనకధారలు కురిపించడానికి శంకరుణ్ని ప్రేరేపించిందీ పరోపకారమే పరమార్థంగా ఉన్న స్నేహభావమే. పెదవి విప్పి చెప్ప పనిలేదు; మౌనహృదయం లయను కూడా గుర్తించగలడు నిజమైన నేస్తం. కలిమి లేములకు సంబంధం లేనిది చెలిమి. కృష్ణ కుచేల సంబంధమే దానికి ఉత్తమ ఉదాహరణ. రాధా మాధవుల మధ్య నెలకొన్నది ప్రేమభావానికి అతీతమైన స్నేహసౌందర్యమే. స్థాయీ భేదాలతో నిమిత్తం లేనిది స్నేహం. నరనారాయణుల సాహచర్యమే దీనికి చక్కని తార్కాణం. శ్రీకృష్ణుని నిర్యాణానంతరం హస్తినకు తిరిగి వచ్చిన పార్థుడు అన్నగారితో ఆవేదనగా పలికిన మాటలే చాలు నేస్తభావ సంపూర్ణ నిర్వచనానికి. స్నేహితుడు- సన్నిహితుడు, సారథి, సచివుడు, వియ్యం, సఖుడు, బాంధవుడు, విభుడు, గురువు... అన్నింటికీ మించి దేవర. గజేంద్రమోక్షంలో కరిరాజు మొరపెట్టుకున్నట్లు 'పెంజీకటి కవ్వలనెవ్వడు/నేకాకృతి వెలుగునో, ఆ వెలుగే మన అంతరంగాన్ని వెలిగించే స్నేహదీపం. ఒంటరైనా ఓటమైనా... వెంట నడిచే నీడ నేస్తం. తడికన్నులను తుడిచే ఆ స్నేహహస్తం- ఒడుదొడుకుల బతుకుబాటలో చివరివరకు తోడు దొరకటమే... మనిషి జన్మ ఎత్తినందుకు మనం చేసుకునే అదృష్టం.

వేడితే గాని వరాలివ్వని దేవుడి కన్నా వేడుకలా మన జీవితంలోకి నడిచి వచ్చే నేస్తం ఎందులో తక్కువ? ఎక్కడుంటాడో తెలియని దైవం కన్నా కష్టంలో సుఖంలో, ఎత్తులో పతనంలో... ఎన్నడూ చేయి విడవక పక్కనుండే సన్మిత్రుడి సన్నిధిని మించిన పెన్నిధి మరేముంటుంది? కృష్ణపరమాత్మను చెలికాడిగా పొందిన గోపబాలకుల జన్మే జన్మమని వ్యాస భగవానుడిలా మనమూ ఈసుపొందాల్సిన పనిలేదు. ఠాగోర్‌ చెప్పినట్లు మన హృదయ కవాటం తెరిచి ఉంచాలేగాని... చొచ్చుకుని వచ్చేందుకు ప్రేమవాటికలో తచ్చాడే నెచ్చెలులు లక్షలు లక్షలు. తండ్రి బిడ్డకు స్నేహితుడు. భార్య భర్తకు సహచరి. ఇరుగిల్లు పొరుగిల్లుకు తోడు. లోకమే ఏకైక కుటుంబంగా మారిన ఈ కాలంలో స్నేహసామ్రాజ్యం విస్తరించుకోవడానికి కులాలు, మతాలు, ప్రాంతాలు, వయసు, స్థాయీ భేదాలు- అడ్డుకావు. అమృత సాధనకోసం దేవదానవులే ఒక్కటై శ్రమించారు. స్నేహామృత సాధనకోసం జాతి మతాలకు అతీతంగా అందరూ ఒకటి కావడానికి అడ్డుగోడల్ని పడగొట్టలేమా? సంకల్పం చెప్పుకొనే సందర్భం 'అంతర్జాతీయ స్నేహదినం'(౦౭:౦౮:౨౦౧౧). ఆస్ట్రియా సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం- స్నేహబంధం కలిగించే ఆత్మసంతృప్తి మరే ఇతర బంధం కలిగించలేనంత బలమైనది. హృదయపూర్వకంగా స్నేహహస్తం చాచేవారికి హృద్రోగ సంబంధ రుగ్మతలూ అధికంగా రావంటున్నారు. మైత్రికి విలువిచ్చేవారి జీవితకాలం ఒంటరిజీవులకన్నా ఎక్కువనీ వారి పరిశోధనల సారం. ఆరుద్ర చెప్పినట్లు- ఎవరినీ ప్రేమించకపోవడం ఒక నేరం, ప్రేమ తెలియని జీవితం భూమికి భారం!

(ఈనాడు, ౦౭:౦౮:౨౦౧౧)
__________________________________

Labels:

BRILLIANT IDEA

An Indian man walks into the New York City bank and asks for the loan officer.
He tells the Loan Officer that he was going to India for some business for 2 weeks and needs to borrow $5,000.


The Loan Officer tells him that the bank will need some form of security for the loan.


So the Indian man hands over the keys and the documents of t
he new Ferrari car parked on the street in front of the bank.


The loan officer consults the president of the bank, produces all the required items and everything check out to be OK.

The loan officer agrees to accept the car as a security for the loan.


The bank president and the Loan Officer had a good laugh at the Indian for keeping a
$750,000 Ferrari as a security and taking only $5,000 as a loan.


An employee of the bank then drives the Ferrari Into the banks underground garage and parks it there.


Two weeks later the Indian returns and pays
$5000 and the interest which comes to it $15.41.


Seeing this, loan officer says,

“Sir, we are very happy to have your business and this transaction has worked out very nicely, but we are a little puzzled.
While you are away, we checked you out and Found out that you were a multimillionaire.
What puzzled us was why would you bother to borrow $5000?”


The Indian replies:
"Where else in the New York City can I park my car for 2 weeks and for only
$15.41and expect it to be there when I return".


This is a true incident and the Indian is none other than VIJAY MALLYA.


(To those whom the name is familiar - YES, he is chief of the Kingfisher empire)(An email forward)
-----------------------------------------------------------

Labels: