My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, November 01, 2007

బాలరాజును బలిగొన్నది ప్రమాదమే

3000 ఏళ్ల క్రితం ఈజిప్టును పాలించిన బాలరాజు టుటన్‌ఖమున్‌ మరణం వెనకాల ఉన్న చిక్కుముడి చివరికి విడిపోయింది. ప్రమాదవశాత్తు రథంపైనుంచి పడిపోవటం వల్లనే అతడు మరణించాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచ పురావస్తు (ఆర్కియాలజీ) పరిశోధనల చరిత్రలో టుటన్‌ఖమున్‌ది ఆసక్తికరమైన అధ్యాయం. 1922లో బ్రిటన్‌ పురావస్తు పరిశోధకుడు హోవర్డ్‌ కార్టర్‌ టుటన్‌ఖమున్‌ సమాధిని కనుక్కున్నారు. దాంట్లో లభించిన అద్భుతమైన కళాఖండాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు యావత్‌ ప్రపంచాన్ని సమ్మోహపరిచాయి. టుటన్‌ఖమున్‌ మమ్మీపై అప్పటి నుంచి పరిశోధనలు మొదలైనాయి. బాల్యంలోనే అతను చనిపోవటానికి అంతఃపుర కుట్రలే కారణం అయి ఉంటాయని తొలుత భావించారు. 1968లో తీసిన ఎక్స్‌రే రిపోర్టులు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరిచాయి. ఈ నివేదికల్లో, పుర్రె అడుగు భాగం ఉబ్బిపోయి కనిపించింది. తలమీద బలంగా కొట్టి హత్య చేశారని అందరూ అనుకున్నారు. ఈ విధంగా బాలరాజు మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, తాజాగా జరిగిన పరిశోధనలు టుటన్‌ఖమున్‌ది హత్య కాదని తేల్చి చెబుతున్నాయి.

విరిగిన కాలే ప్రాణం తీసింది
సిటీస్కాన్‌తో నిర్వహించిన పరీక్షల్లో టుటన్‌ఖమున్‌ కుడికాలు విరిగిపోయిందని తేలింది. మోకాలిపై భాగంలో అయిన ఈ గాయంతో రక్తం విషతుల్యమై చనిపోయి ఉంటాడని కైరో మ్యూజియం శాస్త్రవేత్త డాక్టర్‌ నాదియా లోక్మా అభిప్రాయపడుతున్నారు. ఇంతకూ ఆ గాయం ఎందుకైంది అన్న ప్రశ్నకు, వేటకు వెళ్లినప్పుడు రథం పడిపోవటం వల్లేనని ఆవిడ సమాధానమిస్తున్నారు. దీనికి ఆవిడ చూపుతున్న ఆధారాలు ఏమిటంటే, సమాధిలో లభించిన రథాలు, వందలాది బాణాలు. వీటిని సమాధిలో అలంకారం కోసం ఉంచలేదని, గతంలో వాడారని అది కూడా యుద్ధాల్లో కాకుండా వేటలో ఉపయోగించారని ఇటీవలి పరిశోధనల్లో తెలిసింది. అంతేగాక, టుటన్‌ఖమున్‌ సమాధిలో ఒక కవచం కూడా గతంలో లభ్యమైంది. వేటకు వెళ్లినప్పుడు ఉదరభాగంలో దీన్ని ధరించేవారు. దీనిద్వారా కూడా అతనికి వేటకు వెళ్లే అలవాటు ఉండేదని తెలుస్తోంది.

గుట్టు విప్పిన పూలదండ
నాదియా చెప్పే వాదనకు వూతమిచ్చే మరో ఆధారం, టుటన్‌ఖమున్‌ మెడ చుట్టూ ఉన్న పూల దండ అవశేషాలు. వృక్షశాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో, కార్న్‌ ఫ్లవర్స్‌, మేవీడ్స్‌ పూలను ఉపయోగించి ఆ దండను తయారుచేశారని తెలిసింది. ఈ రెండు రకాల పూలు ఈజిప్టులో మార్చి, ఏప్రిల్‌లో మాత్రమే పూస్తాయి. శవాన్ని మమ్మీలా రూపొందించటానికి ప్రాచీన ఈజిప్టులో 70 రోజులు పట్టేది. అంటే, మార్చికి రెండు నెలల ముందు టుటన్‌ఖమున్‌ మరణించి ఉంటాడు. అది డిసెంబర్‌గానీ, జనవరిగానీ అయి ఉండవచ్చని రాయల్‌ హార్టీకల్చరల్‌ సొసైటీకి చెందిన నీగెల్‌ హెప్పర్‌ అంటున్నారు. ప్రాచీన ఈజిప్టు చరిత్ర ప్రకారం, ఈ సమయంలోనే చలికాలపు వేట జరిగేది. ఈ నేపథ్యమూ, లభించిన ఆధారాలూ... టుటన్‌ఖమున్‌ మృతికి ప్రమాదమే కారణమని వెల్లడిస్తున్నాయి. ఈజిప్టు పురావస్తు సంపద సుప్రీం కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి జాహి హవస్‌ కూడా ఈ విషయాన్నే ఒక టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా ధృవీకరించారు. మొత్తానికి పురావస్తు పరిశోధనలకే సవాల్‌గా నిలిచిన బాలరాజు మరణం చిక్కుముడి విడిపోయింది. అదొక్కటే కాదు, యువకులందరిలాగే టుటన్‌ఖమున్‌ కూడా చురుకైనవాడనీ, ధైర్యవంతుడనీ ఈ పరిశోధనలు వెల్లడించాయి. రాచబిడ్డ కాబట్టి టుటన్‌ఖమున్‌ అత్యంత కోమలంగా పెరిగి ఉంటాడని చరిత్రకారులు ఇప్పటి వరకూ భావించేవారు.
(Eenadu, 01:11:2007)
_______________________________

Labels:

Tuesday, October 30, 2007

ఘర్మజలం


- బులుసు-జీ-ప్రకాష్‌

శ్రీకృష్ణుని వద్దకు కుచేలుడు వెళ్లినపుడు ''ఇక్కడికి నువ్వు వస్తున్నప్పుడు నా మీద భక్తికొద్దీ ఏదో కానుక తెచ్చి ఉంటావు. అది కొంచెమైనాసరే, పదివేలుగా అంగీకరిస్తాను. భక్తి హీనుడై, నీచవర్తనుడైన దుష్టాత్ముడు మేరుపర్వత సమానమైన పదార్థం ఇచ్చినా అది నాకు సమ్మతం కాదు'' అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ విషయాన్నే భగవద్గీత నవమాధ్యాయంలో ధ్రువీకరిస్తాడు.

'పత్రం పుష్పం ఫలం తోయం
యోమే భక్త్యా ప్రయచ్ఛతి
త దహం భక్త్యుపహృతం
అశ్నామి ప్రయతాత్మనః'
''శుద్ధాంతరంగులైన వారు భక్తితో, ఆకుని, పువ్వుని, పండుని, నీటిని- వీటిలో ఏ ఒక్కటి సమర్పించినా, నేను తప్పకుండా స్వీకరిస్తాను''

సిక్కు మతాచార్యుడు నానక్‌ దేవ్‌ తన శిష్యుల కోరిక మేరకు ఒక గ్రామం వెళతారు. ఆ గ్రామంలో ధనవంతులెక్కువ, బీదవాళ్లు తక్కువ. నానక్‌ గురుదేవులు ఆ గ్రామంలో అడుగు పెట్టగానే అందరూ తమ ఇంటికి దయచేయండంటే తమ ఇంటికి దయచేయండని స్వాగతం చెబుతారు. ఊరంతా తిరిగితిరిగి నానక్‌ దేవులు ఒక నిరుపేద ఇంట్లో భోజనం చేస్తారు. ఆ ఊళ్లో అత్యధిక ధనవంతుడు ''ఇదేమి విడ్డూరం స్వామీ! మేమెవ్వరం పిలిచినా రాని తమరు ఒక నిరుపేద ఇంట్లో, అందునా ఒక పూరిగుడిసెలో భోజనం చేస్తారా?'' అని ప్రశ్నిస్తాడు.

''సరే, మీ ఇంటికి వస్తున్నా పద!'' అని ఆ ధనవంతుని ఇంటికి నానక్‌దేవ్‌ వెళతారు. ఆ ధనవంతుని ఇంట్లోని కొద్ది ఇసుకను తీసి పిండుతారు. అందులోనుంచి రక్తపు బొట్లు పడతాయి. ''చూశావా? నీ ఆర్జన అక్రమమైనది. అడ్డదార్లు తొక్కి పేదల రక్తాన్ని పిండి సంపాదించినది!'' అంటూ ఆయన బీదవాని ఇంటికి తీసుకెళతారు ఈ ధనికుణ్ని. ఆ బీదవాని ఇంట్లో ఇసుక పిండుతారు. అందులోనుంచి చెమటబొట్లు రాల్తాయి. అంటే ఆ బీదవాడు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనం అది! అది చూసి ధనవంతుడు సిగ్గుతో తల దించుకుంటాడు.

'కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన'
అనే శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం చెమటోడ్చి కష్టించి పని చేసే శ్రమజీవులు తమ కష్టఫలాన్ని భగవంతునికి సమర్పిస్తే ఆ 'ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు' ఒకడున్నాడు.
ఆతడే శ్రీకృష్ణపరమాత్మ!

(Eenadu, 24:10:2007)
________________________________

Labels: ,

Story of a city

LA. SU. RENGARAJAN

IN MID-1639, Francis Day, a British merchant of the East India Company, searching for a suitable place in the East Coast for establishing trade, anchored his small ship off a tiny coastal town known for long as Madaraasa-pattinam. He cordially met Venktadri Nayak who was ruling the coastal area up to Santhome as a representative of Vijayanagar Kingdom. The two signed an agreement on August 22, 1639 by which the company agent was permitted to build a fort there and commence friendly trade initially for two years. Imports would be duty-free. Half the income from trade was to be given to the Nayak. Thus was Madras born that day of August 1639. Construction of the fort, soon known as St. George Fort, began in 1640 with the arrival of a team of Englishmen from England aided by local labour.

Successive batches of British families who reached India preferred to settle down in Madaraasa-Pattinam, raising their own garden-bungalows. With the rapid expansion of the town, a cluster of nearby villages called Chennapattinam (named so by a chieftain of Venkatagiri dynasty of rulers in memory of his ancestor Chennappa Naidu) was also encroached upon. By a firman (official addict) issued in 1679 by the Nawab of Golkonda, villages of Santhome, Egmore, Kilpauk and Tiruvottriyur were leased to the British company on liberal terms. Judicial and administrative control was soon passed on to the British for a song. With Queen Elizebeth’s Proclamation of November 1, 1858 following the collapse of the Sepoy Muting of 1857, the British Crown took over the administration of British India from the East India Company. The city of Madras became the capital of Madras Presidency.

(The Hindu, 30:10:2007)
___________________________________________

Labels:

Yesteryear southern sensation

SAVITHA GAUTAM



BONDING… A MEMOIR: Vyjayantimala Bali with Jyoti Sabharwal; Stellar Publishers Pvt. Ltd., G-25, Vikas Puri, New Delhi-110018. Rs. 695.

Autobiographies and biographies seem to be the flavour of the season. Especially with Bollywood actors of yesteryear. If Dev Anand’s colourful past unfolds in Romancing with Life, Priya and Namrata Dutt recount the happy story of their parents in Mr and Mrs Dutt: Memories of our Parents. But if there’s one book that seems to have stirred up a hornet’s nest in recent times, it is this book by Vyjayantimala Bali with Jy oti Sabharwal.

Dance, her passion

The book, like all memoirs, traces the journey of a pretty lass born in Triplicane, Madras, into an orthodox Iyengar family, who breaks convention and literally dances her way to stardom before winning hearts in Parliament. Here, the dancer-actor-politician tells her side of the story, and yes, she tries to put the record straight on many issues that dogged her, be it doubts about her parentage or the much hyped affair with Raj Kapoor or the accusation that she was a home-breaker when she wed Dr. Chamanlal Bali.

These add that dash of zing to an otherwise predictable story of yet another product of a broken home. That Vyjayantimala shared a special bond with her maternal grandmother, Yadugiri Devi, and her father, M.D. Raman, is established early on in the book. Yagamma, as Yadugiri Devi was known, assumed the role of Vyjayantimala’s mother and mentor till the end of her life and was one of the most powerful influences in the girl’s life.

A pious woman, she filled the young girl’s ears with tales from the Puranas and the epics, which came in good stead when Vyjayantimala evolved as a dancer in later years. She was the one who initiated her charming granddaughter into the finer nuances of Carnatic music and Bharatanatyam. Of her mother, a classical singer who walked out on her husband for another man, Vyjayantimala has very little to say except that she felt let down by her. Though Vyjayantimala learnt Carnatic music, her heart was set on learning adavus and abhinaya. Yagamma recognised the craving and soon Vyjayantimala began training with the legendary Vazhuvoor Ramaiah Pillai. Thus began her rendezvous with dance, a passion that rules her life even today.

Successful film star

A major part of the book is devoted to her tryst with tinseldom, her days as one of Hindi cinema’s most successful stars. From her first Tamil film “Vazkhai” and the still-talked about dance sequence with Padmini in “Vanjikottai Valliban”, to her foray into Hindi filmdom with “Bahar” it’s all there in detail. Then, of course, there’s her take on the men she worked with including Dilip Kumar, Raj Kapoor, Dev Anand, Kishore Kumar, Sunil Dutt and Rajendra Kumar. Quite a few pages are devoted to the political face of Vyjayantimala. In fact, excerpts of some of her speeches in Parliament have been published. Be it her interaction with the Gandhi family or the masses who followed her during her campaigns, she did it all with élan. She may have acted in many a landmark film and walked down the corridors of power for years, but what she always wants to be known is as a dancer. Her love for dance consumes her and, throughout the book, it’s this passion that remains a constant. Though the language may not be up to the mark, the book has its moments. If you love cinema and are just curious about the life of one of the most beautiful actresses to grace the silver screen, then maybe you could enjoy this one. Of course, you have to pay quite a price for it!

(The Hindu, 30:10:2007)
________________________________

Labels: ,

Monday, October 29, 2007

Ideas, Out of Stock!

Jon Stock
I do like a good headline. Not the jingoistic ones favoured by the tabloid press, but those which make you stop turning the page and smile. "Gotcha!", The Sun's response to the British sinking of the General Belgrano during the Falklands War, was iconic, but also sickening. "New Bridges Held up by Red Tape" or "Sex Education Delayed, Teachers Request Training" are more to my liking.
When I was living in Delhi, I used to cut out my favourites from the Indian press. "Jayalalitha Questioned over Bogey Probe" appealed to my childish sense of humour, but only because in Britain bogeys live up noses rather than on railway tracks.

This term, at our village school, my children have been learning all about newspapers and I was asked to give a short talk about headlines to Year Four (eight-year olds-about my level). They had already been told that headlines should be snappy and informative, which didn't sit very well with my first example. There are two things you need to know before I share it (stay with me, it's a gem). The first is that there is a football team in Scotland called Inverness Caledonian Thistle, known affectionately as Caley. The second is that one of the most popular songs in the famous 1964 film of Mary Poppins is called "Super-cali-fragilistic-expiali-docious".
So, when Inverness Caledonian Thistle beat Celtic in the Scottish Cup in 2000, the subs at The Sun duly put two and two together and came up with arguably the wittiest headline of all time: "Super Caley Go Ballistic, Celtic Are Atrocious".

The children loved this one, not least because they knew the original song. Its comprehension also came with a sense of breaking a code. Others which tickled the assembled eight-year olds included "Hospitals are Sued by Seven Foot Doctors"; "Children Make Nutritious Snacks"; "Stolen Painting Found by Tree"; "Man Minus Ear Waives Hearing"; Typhoon Rips Through Cemetery, Hundreds Dead" and "The Umpire Strikes Back" (about a dodgy umpire decision on the subcontinent).

The internet, of course, has turned funny headlines into a small industry. There are hundreds of different sites listing unintentionally amusing ones from the world's press. Many of them I couldn't possibly have shared with my school: "Clinton places Dickey in Gore's Hands; "Clinton Stiff on Withdrawal"; Starr Aghast at First Lady Sex Position" or "Prostitutes Appeal to Pope". You suspect with many of these that the subs knew exactly what they were doing and just wanted to see what they could get passed the editor. When the late newspaper proprietor, Robert Maxwell, was destroying the Daily Mirror, morale was so low at the tabloid paper that staff tried desperately to get their own back. The political cartoonist, for example, managed to write "Robert Maxwell is a ****" in tiny writing, hidden in his last cartoon for the paper.

Naughty headlines are a more subtle form of rebellion, allowing staff to let off steam, while the paper can look the other way and maintain a cloak of decency. That, at least, can be the only explanation for "Chef Throws his Heart into Helping Feed the Needy" or even "Survivor of Siamese Twins Joins Parents". At the end of my little school chat, which I resisted ending with "Chinese Killed in Car Clash", I asked them to come up with some headlines of their own. If they had a story about an owl which looked funny, how would they caption the story? "What a hoot!" came back the answer, quick as a flash, confirming that there is a new generation of headline writers in the waiting.

They finished by asking for my most recent favourite, and I had to tell them it was for a book which we've been serialising in my newspaper, all about female Spitfire pilots in the Second World War: "Frocks Away!". They all looked at me blankly, until I explained that pilots used to shout "chocks away!" before taking off.
As you can see, I like nothing better than a good headline, and I shall be looking closely to see what the fine subs at THE WEEK come up with at the top of this column. In the meantime, I could do with some help from readers, as the school has asked me to come back and talk to the older children about Shakespeare's Hamlet. Could I come up with some headlines for the most famous scenes? In the meantime, I shall leave you with another personal favourite: "Man Struck by Lightning Faces Battery Charge".
riotact@compuserve.com
(The Week, 04:11:2007)
_________________________

Labels:

Gift of the gab

The nonsense file
By The Colonel

The other day I heard a sermon from a god-man. The subject was eschatology dealing with death and the final destiny. It was not edifying but terrifying.
He gave a graphic view of hell where there would be weeping and gnashing of teeth. I did not mind the terrorism part of it but did mind its long-windedness. The preacher continued forever and anon. It was easily the most long-winded speech I had ever heard in my life.

I was exactly in the same position as Mark Twain when he had to go through a similar experience. Hear the famous writer in his own inimitable words: "Some years ago in Hartford, we all went to church one hot sweltering night to hear Rev. Hawley, a city missionary who went around finding people who needed help and didn't want to ask for it. He told of the life in the slums, where poverty resided; he gave instances of heroism and devotion of the poor. 'When a man with millions gives,' he said, 'we make a great deal of noise. It is noise in the wrong place, for it is the widow's mite that counts.' Well, Hawley worked me up to a great pitch. I could hardly wait for him to get through. I had $400 in my pocket. I wanted to give that and borrow more to give. You could see greenbacks in every eye. But instead of passing the plate then, he kept on talking and talking, and as he talked it grew hotter and hotter, and we grew sleepier and sleepier. My enthusiasm went down, down, down, down-$100 at a clip-until finally, when the plate did come around, I stole ten cents out of it. It all goes to show how a little thing like this can lead to crime."

Well, I mustered enough courage to come out of the ordeal much before its end, and waited outside for fresh air. Yet after considerable time, seeing another sufferer skulking the sermon, I asked him," Has he finished yet?" "Yes," said the man who had just escaped," long ago, but he won't stop."
Lord North, once prime minister of England, was accustomed to sleep during the parliamentary harangues of his adversaries on the same lines as our own Deve Gowda. During a debate on ship-building, some tedious speaker entered on a historical detail, in which commencing with Noah's ark, he traced the progress of the art regularly downwards.

When he came to building the Spanish Armada, the slumbering prime minister got up and inquired from a colleague as to what era the honourable gentleman had arrived. Being answered: "We are now in the reign of Queen Elizabeth." The Prime Minister commented: "Dear me, why not let me sleep for a century or two more."
Late Piloo Mody was one of our finest parliamentarians. He was once scheduled to speak late on the programme at a meeting at which all the speakers had been brutally long-winded.

The chairman introduced Mody saying, "Piloo Mody, the famous parliamentarian will now give you his address." Mody faced the haggard audience and said, "Mr. Chairman, ladies and gentlemen, my address is the Parliament House, New Delhi. " He sat down and received a thumbing ovation.

(The Week, 04:11:2007)
___________________________

Labels:

NEVER LIE TO A WOMAN!!

A man called home to his wife and said, "Honey I have been asked to go
fishing up in Canada with my boss & several of his Friends.
We'll be gone for a week. This is a good opportunity for me to get that
Promotion I've been wanting, so could you please pack enough Clothes for
a week and set out my rod and fishing box, we're Leaving From the office
& I will swing by the house to pick my things up" "Oh! Please pack my
new blue silk pajamas."
The wife thinks this sounds a bit fishy but being the good wife she is,
did exactly what her husband asked.
The following Weekend he came home a little tired but otherwise looking
good.
The wife welcomed him home and asked if he caught many fish?
He said, "Yes! Lots of Salmon, some Bluegill, and a few Swordfish. But
why didn't you pack my new blue silk pajamas like I asked you to Do?"

You'll love the answer....
*.
*
*
*.
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*


The wife replied, "I did. They're in your fishing box....."
(an email forward)
_____________________________

Labels:

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* నా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే ఏ వ్యాపారం మేలు?

పూలు, పళ్లవ్యాపారం.

* కాసులో తేడావస్తే..

అంతా తిర'కాసు'

* ఇన్ని చెబుతున్నారు కదా... మీరేం చేస్తారు?

'జవాబు'దారీగా ఉంటాను.

* చాలామంది తమ షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టుకుంటారు. అయినా కొంతమందికి నష్టాలొచ్చి అప్పుల పాలైపోతుంటారు ఎందుకు?

పేరు పెట్టుకునే వాళ్లను దేవుడు బాగానే చూసుకుంటాడమ్మా. ఎటొచ్చీ 'నామం' పెట్టేవాళ్లనే ఒక పట్టుపడతాడు.

* గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించడం ఎక్కడన్నా జరుగుతుందా?

పౌల్ట్రీ పరిశ్రమలో సహజమే.

* కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు. దీనిని ఆపే మార్గమేమిటి?

'బఫే'ను అలవాటు చేసుకోండి! కూర్చునే అవసరం ఉండదు

* డబ్బుకోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నా. ఇంతకీ నేనేం చేస్తున్నానంటారు?

యోగా మాస్టర్‌ అయి ఉంటారు. అందుకే రోజూ శీర్షాసనం తప్పట్లేదేమో మీకు.

* వడ్డీ వ్యాపారం చేద్దామనుకుంటున్నా. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెబుదురూ?

'వడ్డి'చ్చేవాడు మనవాడు అవునో కాదో చూసుకుంటే చాలు.

* 'గొడ్డు' చాకిరీ చేస్తున్నాను. మంచిదేనా?

'పాడి' పరిశ్రమకయితే మంచిదే

* గుడికి, కర్మాగారానికి తేడా ఏమిటి?

గుడి మంత్రముగ్ధం చేస్తుంది. కర్మాగారం యంత్రముగ్ధం చేస్తుంది. అయితే రెండు చోట్లా ఎవరి 'కర్మ'కు వారే బాధ్యులు సుమా!

* పొదుపు సొమ్ము భద్రంగా ఉండాలంటే, ఆ డబ్బును ఎందులో పెట్టమంటారు?

నా జేబులో వద్దులెండి.

* నాకు వడ్డీ లేకుండా కోటి రూపాయలు అప్పు కావాలి. ఎవరిస్తారో కొంచెం చెబుదురూ?

నేను ఎదురుచూస్తోంది కూడా అ'ప్పిచ్చి'వాడి కోసమే నాయనా. అసలు కూడా తిరిగి ఇవ్వనక్కర్లేకుండా కోట్లు ఇచ్చేవారు ఎక్కడ దొరుకుతారా? అని వెతుక్కుంటూ ఇప్పటికే 50000 రూపాయలు తగలేశాను.

* దేవుడికి ఈమేల్‌ ఐడీ ఉంటుందంటారా?

దేవుడికి ఈమేల్‌ ఐడీ ఎందుకు చెప్పండి? 'ఫిమేల్‌' ఐడీ ఉంటే చాలు. భార్యల పేరుతోనే కదా వాళ్లకి గుర్తింపు వచ్చింది. సీతాపతి, ఉమాపతి, రాధాకృష్ణ... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు

* సాధారణంగా తీర్చని వాళ్లకే బ్యాంకులు అప్పులు ఇస్తాయి ఎందుకో చెప్పగలరా?
- జోగిపర్తి ప్రసాద్‌, బుచ్చిరెడ్డిపాలెం
తీర్చేవారికి ఇస్తే 'రుణానుబంధం' అప్పటికప్పుడు తెగిపోతుంది. కదా!అందుకే ఇవ్వరు.
(Eenadu, 28:10:2007)
______________________________

Labels:

Sunday, October 28, 2007

To a father extraordinary


Field Marshal K.M. Cariappa’s son has written an insightful book on his father


One from the album K.M. Cariappa with daughter Nalini
This is a son’s tribute to an extraordinary father. Titled Field Marshal K.M. Cariappa, it is a biography of this illustrious Army Chief written by his son Air Marshal (retd.) K.C. Cariappa and published by Niyogi Books.

Released recently, the biography is written in a very forthright fashion. That’s probably why it holds much connectivity. The facts and incidents related to the late Field Marshal K.M. Cariappa simply flow out. It’s a thick volume complete with many pictures and not a single detail seems to have been bypassed, neither personal nor professional, revolving around his illustrious career in the Army spanning over three decades (1918-1953 ). After all, Field Marshal K.M. Cariappa was the first Indian officer to enter the Staff College, Quetta. He was also among the first Indians to enter the Imperial Defence College in the U.K. and was the first Indian Major-General in 1947. The first Indian Commander-in-Chief, he is hailed as Father of the Indian Army.

Forthright account

Field Marshal Cariappa, however, suffered a major setback on his personal front. His son mentions his parents’ divorce in this biography, in a matter-of-fact, no-fuss manner. In our hypocrisy-ridden society, it does come as a refreshing surprise to read these lines. “His tenure in Bannu was short lived as he had been detailed to form part of the Army’s Reorganisation Committee. It was about this time too that his personal life was in turmoil. Nalini was born on 24 February, 1943, and soon thereafter, mother joined him in Dehra Dun with the two of us. Though he was posted in Dehra Dun, he was on the move, to and from Delhi, and elsewhere. He had to perforce leave his lovely young wife from time to time, and their two children, on her own. She was lonely, very young, very beautiful and very, very vulnerable. This was the beginning of the end of their marriage. Their divorce was announced in 1946…Mother did come to visit us in Delhi once and only very briefly. We never saw her again because she was killed in a car accident in Madikeri in 1954…”

In fact, in the epilogue, Field Marshal Cariappa’s daughter Nalini is even more candid.

“I sit on my balcony collecting my thoughts and memories. Before I write I look around at the beautiful trees in the forest that surround my home in Roshanara and I am filled anew with immense love and gratitude for the man who was my father. The legacy he left me is priceless... My parents were divorced when I was very young. As a result, I have no recollection of my mother… Papa tried to the best of his ability to be both father and mother to me. Bringing up two young children virtually single-handedly must have been a trying task. He was then Commander-in-Chief of the Army, a most demanding job, more so as it was soon after Partition and Independence. Yet he made time for us. When he was not touring, our morning ritual was to go to his room and say ‘Good Morning Daddy, I brushed my teeth last night’.” Several such simple and everyday instances are mentioned in this biography.

A true soldier

In between the finer details of his personal life, the book is infused with details about the Field Marshal’s military prowess. The places and locales he was posted at, the awards he was bestowed with, the recognition he had received, his views, his interactions with the political leaders of that era, including Mahatma GandhiIt is an important book for it contains the late Field Marshal’s rather candid and firm views vis-À-vis not just the neighbouring countries but also that of Kashmir and the North East.

The far sighted man that he was, Field Marshal Cariappa was often misunderstood. Perhaps this book will settle some creases.

HUMRA QURAISHI
(Tthe Hindu, 24:10:2007)
________________________

Labels:

The religion we need

"NOT RELIGION, but religious dogma" leads to conflict, "Religion should graduate into spirituality." These two epigrammatic statements of President Adbul Kalam are worth pondering over. It has been said that more blood has been shed over the cause of religion than any other cause. This is confirmed by what is happening today. It is a paradox that religion is at once a cohesive and divisive force. If religion with its potential for good has turned into a destructive force, it is but a perversion of religion.

Religion in its deepest sense has laid the foundation of moral order. It has extended the bounds of human sympathy and underscored the values of humanity, charity in the sense of love and tolerance, faith in a transcendental divine order, respect for the sanctity of all forms of life and observance of the decencies of life. The inherent divinity of the human being, universal brotherhood, unity of all faiths, and collective progress and peace — these are basic to all religions and form their core.

Erosion of values

All values advocated by religion are threatened by greed, violence, exploitation, competitive religion, consumerism, commercialisation and such forces. It looks as if religion has become its own enemy. Every sphere of human activity from the individual and domestic to the international level is torn with chaos and conflict. "Parents have very little love for each other and in the home begins the disruption of the world" (Mother Teresa).

The spirit of scepticism generated by science has resulted in an erosion of values. The world is broken into narrow domestic walls. Communities tend to be imprisoned in their watertight compartments bearing the respective labels — religion, caste, race, nation, ideology, etc. The phenomenal growth in knowledge is not matched by a commensurate growth in wisdom which lies in the cultivation of humanising impulses. "We have grasped the mystery of the atom and rejected the Sermon on the Mount. The world has achieved brilliance without wisdom and power without conscience. We know more about war than about peace, more about killing than about living" (General Omar S. Bradley).

We boast about our civilisation. There is nothing particularly civilised in travelling by plane or living in air-conditioned comfort. Speed, quantity, sophisticated lifestyle and bank balance do not make for civilisation. Human beings have been described as the elder brothers of the animals and the younger brothers of the gods. Civilisation fulfils itself when they are elevated from animality to spirituality. Religion and spirituality have their role in this transforming and regenerating process. Their role should be redefined and reformulated in the modern context.

Religion is awareness: it is wisdom and enlightenment. Bigotry, hatred, dogma, fanatical fury, intolerance and such negative elements are alien to it. "I was born not to share men's hatred but their love" (Antigone: Sophocles). True religion is free from the trappings of superstition, dogma, ritual, quackery, magic and witchcraft. It is sensitive to social needs. Holiness, purity, charity, human equality, service to human beings, etc., are religious universals and not the prerogative of any one faith.

Religion and spirituality should not be equated with otherworldliness or ascetic seclusion and escape from life's realities. They are related to life here and now and provide the guidelines for the art of living. One is most religious and spiritual when one is most human. A Russian peasant remarked at the conclusion of a lecture by Maxim Gorky on the marvels of science. "We are taught to fly in the air like birds and swim in water like fish, but how to live on earth, we do not know."

Fellowship of faiths

Religions are many, but religion is one. There is no relative superiority of one religion over another. One should go beyond denominational religion to understand religion. What the world needs is a fellowship of faiths on a common march towards a common goal. "Man must evolve for all human conflicts a method which rejects revenge, aggression and retaliation. The foundation of such a method is love." These words of Martin Luther King sum up the essence of religion. The present cancerous growth of hatred and violence can be averted by the inculcation and assimilation of the spirit of religion — religion understood to mean "refinement," "sweetness and light," "the culture of the soul," and "the culture of tolerance." The question is not, "why religion?" but "what kind of religion?"

S. JAGADISAN & T.V. VENKATARAMAN

(The Hindu, 01:02:2005)
________________________

Labels:

సమాజానికి అద్దం

'సాహిత్యంలో సమాజం ప్రతిబింబించాలి. అదీ సహజంగా వాస్తవికంగా ఉండాలి. అప్పుడే ఆ సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. స్ఫూర్తిగా నిలుస్తుంది'... సరిగ్గా ఈ అభిప్రాయంతో అల్లుకున్నవే ఇనాక్‌ సృజించిన కథానికా సంపుటులు 'కట్టడి', 'కొలుపులు'. భిన్న పత్రికల్లో విభిన్న సందర్భాల్లో ప్రచురితమైన ఈ కథానికలన్నీ సమాజంలో కనిపించే సమస్యల్నీ సంఘర్షణనీ ఎత్తి చూపించేవే. పోలింగుబూత్‌కు వచ్చి ఓటు వేయలేనివారి నిస్సహాయస్థితిని 'సగం ప్రజాస్వామ్యం'లో, బాలకార్మిక సమస్యని 'లేబరోళ్లు'లో, ఆడపిల్లని కనే తీరతాను అన్న యువతి ధైర్యాన్ని 'పిల్లని కంటాను'లో చూడవచ్చు. నిమ్నకులాలు, బడుగుల సమస్యల్ని తాకిన 'కులవృత్తి', 'పోలే', 'విముక్తి'... వంటివన్నీ ఈ కోవకు చెందినవే. 'మా అమ్మే'లో మనవరాలిని తల్లిగా భావించిన తాతనీ, 'రాధారాధన'లో యువతీయువకుల మధ్య ఉన్న ఆకర్షణనీ, 'తాతా కారు కావాలి'లో పిల్లల ఆటవస్తువుల్లో వచ్చిన మార్పునీ సున్నితంగా సృజించారు. సంభాషణా శైలి ఎక్కడా ఆగదు. కవితాత్మకంగా హాయిగా సాగిపోతుంది.
కట్టడి;
పేజీలు: 214; వెల: రూ.74/-
కొలుపులు;
పేజీలు: 185; వెల: రూ.69/-
రచన: ఆచార్య కొలకలూరి ఇనాక్‌
ప్రతులకు: జ్యోతి గ్రంథమాల, 4/282, న్యూ సర్వోదయనగర్‌
మీర్‌పేట, హైదరాబాద్‌-500 079.
- సాహితి
(Eenadu, 28:10:2007)
_____________________________

Labels: ,

తెలుగు ఆత్మకథా వైభవం

తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు ఆత్మకథకూ బాటలు పరిచి, 'స్వీయచరిత్రము' వెలువరించారు. 1911లో తొలిభాగం, ఆ తర్వాత నాలుగేళ్లకు రెండో భాగం అచ్చయ్యాయి. 'ఈ స్వీయచరిత్రము నందు వీరేశలింగ మహాశయుని జీవిత కథయేగాక యా కాలమందలి యాచారములు, కట్టుబాటులు, న్యాయస్థానములు వ్యవహారములు, దేశస్థితి వెుదలైనవెన్నో తేటతెల్లముగఁ దెలియును. అందుచేత నిది ఆంధ్రదేశము యెుక్క సాంఘిక చరిత్రమని చెప్పవచ్చును' అంటారు ఆ పుస్తకం గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం. కందుకూరి బాటలో నడిచి, సంఘసంస్కర్తగా, గ్రంథకర్తగా ప్రసిద్ధులైన చిలకమర్తి కూడా తన ఆత్మకథను 'స్వీయచరిత్రము' పేరుతో రాశారు.

పోరాట నేపథ్యం ఉన్నవాళ్లు ఆత్మకథలకు ఎక్కువగా శ్రీకారం చుట్టారనిపిస్తుంది. గదర్‌ పార్టీ యోధుడు దరిశి చెంచయ్య 'నేనూ నా దేశం', దాశరథి కృష్ణమాచార్య 'యాత్రాస్మృతి', ఆయన సోదరుడు దాశరథి రంగాచార్య 'జీవనయానం', కాళోజీ నారాయణరావు 'నా గొడవ' పేరొందిన ఆత్మకథలే. తన అంత్యక్రియలు ఎలా జరగాలో కూడా వివరంగా రాసిపెట్టిన రావి నారాయణరెడ్డి 'నా జీవనపథంలో' స్వాంతంత్య్రానంతరం తెలంగాణ పోరాట కొనసాగింపు విషయమై కమ్యూనిస్టుల మధ్య ఏర్పడిన విభేదాలను చక్కగా వెల్లడిస్తుంది. నల్లా నరిసింహులు 'తెలంగాణ సాయుధపోరాటం- నా అనుభవాలు' ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఓ వీరుడి కథను తలపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు, సేవాగ్రామ్‌లో గాంధీజీతోపాటు రెండేళ్లు గడిపిన ఎం.ఎస్‌.రాజలింగం 'స్వీయచరిత్రము', 'బాపు-నేను' పుస్తకాలు రాశారు.

ఉద్యమాలతో సంబంధం లేకుండా రచనలో ఉన్న మాధుర్యాన్ని బట్టి తిరుమల రామచంద్ర 'హంపీ నుంచి హరప్పా దాకా', శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'అనుభవాలు జ్ఞాపకాలు' గొప్ప ఆత్మకథలుగా పేరొందాయి. ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవలగా తన 'అనంతం' వెలువరించారు మహాకవి శ్రీశ్రీ. 'ఆత్మకథను, స్వీయచరిత్రగా రాసుకున్న తెలుగువాళ్ల సంఖ్య పూర్వం చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. సంస్కృత కవులు ఆత్మస్తుతీ పరనిందలకు పాల్పడలేదు గాని తెలుగు కవులు కుకవినింద మానలేదు... ఇదంతా కాలప్రభావం కావచ్చు. పూర్వ మార్గాన్ని అనుసరించటానికే ప్రయత్నిస్తాను' అని చెప్పుకున్న బూదరాజు రాధాకృష్ణ 'విన్నంత కన్నంత' రాసుకున్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు 'నా జీవితయాత్ర', రాష్ట్ర తొలి స్పీకర్‌ అయ్యదేవర కాళేశ్వరరావు 'నా జీవిత కథ', రాష్ట్ర తొలి రాజకీయ కార్టూనిస్ట్‌ ‌ ‌ రాంభట్ల కృష్ణమూర్తి 'సొంత కథ', రచయిత వేగుంట వోహన్‌ప్రసాద్‌ 'బతికిన క్షణాలు' పేర్లతో ఆత్మకథలు విడుదలచేశారు.

'ఆత్మచరితము' వెలువరించిన ఏడిదము సత్యవతి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి తెలుగు మహిళ. దీని రచనా కాలం 1934. మతం, సంఘం, దురాచారాలను నిరసించి, హేతుబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. నటి భానుమతి 'నాలో నేను' అంటూ తన గురించి చెప్పుకున్నారు. ఇంకా సినీ కళాకారుల్లో ధూళిపాల, పద్మనాభం, డి.వి.నరసరాజు విడుదల చేశారు. '...నా జీవితంలో పాఠకులకు ఆసక్తికరం కాని విషయాలు- ఘట్టాలు- చాలా వుంటాయ్‌. అవన్నీ వ్రాసి- వాళ్లను విసిగించడం ఏం న్యాయం? విసిగిస్తే- వాళ్లు తిట్టరు- కొట్టరు! పుస్తకం మూసేసి- అవతల పెడతారు!... అందువల్ల... అనవసర విషయాలు వదిలేసి చదివేవాళ్లకు- ఆసక్తికరమని నాకు అనిపించినవి మాత్రమే వ్రాయదల్చుకున్నాను' అన్నారు నరసరాజు.
(Eenadu, 28:10:2007)
___________________________

Labels: ,

అట్ల తదియ

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
భారతదేశం కర్మభూమి. కర్మల వెనుక పరమాత్మోపాసన లక్ష్యంగా ఉంటుంది. పురుషులకు జపతపాల్లా స్త్రీలకు నోములు, వ్రతాలు రూపొందాయి. మంచి భర్తను ఆశిస్తూ, మాంగల్య సంరక్షణమే ధ్యేయంగా, భర్త పరిపూర్ణానురాగాన్ని, సత్సంతానాన్ని కోరుతూ మహిళలు ఆచరించడానికి ఎన్నో వ్రతాలను, నోములను నిర్దేశించారు.

'అష్టాదశ వర్ణాలకు అట్ల తదియ' అని తెనుగునాట జనశృతి. ''అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్‌, ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌'' అంటూ- శ్రవణానందంగా, హాస్య స్ఫోరకంగా తెలుగు సీమ పల్లెపట్టుల్లో పాటల సందడి, యువతుల కోలాహలం, ఉయ్యాలలూగడం వెరసి అట్ల తదియ వేడుక.

ఆరోగ్యవంతుడైన, యువకుడైన భర్తకోసం ఆడపిల్లలు పట్టే నోము 'అట్ల తదియ'. వివాహితలు కూడా భర్త ఆరోగ్యం కోసం పెళ్త్లెన పదేళ్ల వరకూ ఈ నోము నోచడం కద్దు.

ఆశ్వియుజ బహుళ తదియనాడు రాత్రి నాల్గవ ఝామునే నిద్రలేచి యువతులు అభ్యంగన స్నానం ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేకువ వేళ ఉల్లి వేసిన గోంగూర పులుసు, పెరుగన్నం తినడం ఆచారం. గోరింటాకు పెట్టుకోవడం కొన్నిచోట్ల కనిపిస్తుంది. పగలంతా కఠిన ఉపవాసం ఉండి చంద్ర దర్శనమయ్యాక శుచిస్నాతలై, అట్లు వేసి గౌరీ దేవికి పది అట్లు నైవేద్యం పెట్టి భోజనం చేస్తారు. ఒకముత్త్తెదువుకు పది అట్లు వాయనం ఇస్తారు. వివాహితులు ఈ విధంగా పది సంవత్సరాలు నోము నోచి తదుపరి ఉద్యాపన చేసుకుంటారు. పదిమంది ముత్త్తెదువులకు పదేసి అట్లు, ఒక నల్లపూసల కోవ, లక్కజోళ్లు, రవికెలగుడ్డ, తాంబూలం, దక్షిణ, వాయనం ఇచ్చి ఆశీర్వచనం పొందడం సంప్రదాయం.

ఈ నోమును ఉమాచంద్రోదయ వ్రతమని, చంద్రోదయ గౌరీవ్రతమని అంటారు. చంద్రుడు ఈ వ్రతాధిపతి. చంద్రుడు ఔషధీపతి గనుక ఆరోగ్యవంతుడైన భర్తకోసం చంద్రోదయం చూసి వ్రతం పూర్తిచేయడం విశేషం.
అట్ల తదియ
యువకుడు, ఆరోగ్యవంతుడు భర్తగా లభించాలని 'సునామ' అనే రాకుమార్తె తోటి యువతులతో కలిసి అట్ల తదియ నోము పట్టింది. ఉపవాసంవల్ల నీరసించి ఆమె సొమ్మ సిల్లింది. దీంతో ఆమె సోదరులు కంగారుపడ్డారు. చంద్రోదయం చూసేవరకు భోజనం చేయరాదనే నియమం ఉండటంతో చేరువలో ఉన్న చింతచెట్టుకు అద్దాన్ని కట్టి, దానికి ఎదురుగా వరికుప్పను తగుల బెట్టి, చెల్లెల్ని లేపి అద్దంలో కనిపించే మంట చూపించి చంద్రోదయమైందని నమ్మించారు. ఆమె తృప్తిచెంది భోజనం చేసింది. తన తోటివారికి పడుచు భర్తలు లభించినా సునామకు ఆరోగ్యవంతుడు, యువకుడు భర్తగా లభించలేదు. ఎన్ని సంబంధాలు చూసినా యౌవ్వనులు కుదరడం లేదు. తన సోదరులు వయసు మళ్లినవానితో తన వివాహం జరిపిస్తారనే భయంతో రాకుమార్తె అడవిలోకి పారిపోయి మర్రిచెట్టు కింద పార్వతీ ధ్యానం చేస్తూ కూర్చుంది. పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించి ఆమె నోము భంగమైన విషయం చెప్పి మళ్లీ నియమంగా నోము ఆచరించమంటారు. సునామ శ్రద్ధగా 'అట్ల తదియ' నోము ఆచరించి అందగాడైన యువకుని పతిగా పొందింది.

బీజంలో వృక్ష గుణాలన్నీ గర్భితమై ఉన్నట్లు, సత్యం, ధర్మం, శౌచం, నీతి, ఆరోగ్యం, మోక్షం మొదలైన సంప్రదాయ భావనలన్నీ ఈ నోములు, వ్రతాల్లో అంతర్భూతమై ఉన్నాయి. ఇందులో నిగూఢమైనది వితరణ వ్రతం. ధనధాన్యాలు, వస్త్రాలు, ఫలపుష్పాలు, ఆహార పదార్థాలు ఇతరులకు అందజేయడం అనే సద్భావన కూడా ఇందులో ఉంది.
(Eenadu, 28:10:2007)
____________________________

Labels:

రిజిస్టర్డు పురోహితులు

'దేవుడి పెళ్ళికి అంతా పెద్దలే'- అని సామెత. దేవుడి పెళ్ళి సంగతేమోకానీ మనుషుల వివాహాల్లో మాత్రం పురోహితుడే పెద్ద. పురోహితుడన్నా, ఆచార్యుడన్నా, ప్రీస్ట్‌ అన్నా, మౌల్వీ అన్నా ఏ మతంలోనైనా వివాహాల్లో వారి పాత్రే ప్రధానమైంది. వారు చెప్పే మంత్రాలే వల్లిస్తూ, వారు చెప్పినట్లే భక్తిశ్రద్ధలతో చేస్తూ వధూవరులు ఒకటవుతారు. ఈ విధంగా వివాహాలవంటి శుభకార్యాలలో పురోహితులకే ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. ''మంత్రము లేనిపెళ్ళి, మౌనము లేని తపంబు, వేదవిత్తంత్రము లేని యాగము, బదజ్ఞత లేని కవిత్వము''- అని మొదలుపెట్టి మరికొన్నిటిని చెప్పి అటువంటివన్నీ ఏ సత్ఫలితాన్నీ ఇవ్వని 'వ్యర్థకార్యముల్‌'- అన్నారోకవి. ఆ కారణంగా వివాహం వంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు సంబంధాలతోపాటుగా మంచి పురోహితుల కోసమూ అన్వేషణ ప్రారంభిస్తారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి తన ప్రణయ సందేశాన్ని ఒక పురోహితుడి ద్వారానే పంపిందట. అటువంటి శుభకార్యాలకు పురోహితులే తగినవారని ఆమె భావించిందన్న మాట. ''ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా దలచెనో''- అనుకుంటూ లక్ష సందేహాలతో సతమతమైపోతుంది. ఆమె సందేశం ఫలించి రుక్మిణీ కల్యాణం నిర్విఘ్నంగా జరగటం భాగవతంలోని రసరమ్యఘట్టం. మంగళవాద్యాల హోరు, పురోహితుల జోరు లేకుండా ఏ వివాహానికీ నిండుతనం రాదు. అత్తగారి సాధింపులు, ఆడబిడ్డల వేధింపులు, అటు తిరుగు, ఈ మంత్రం చెప్పు, కూర్చో నుంచో అంటూ పురోహితుల పురమాయింపులు, భజంత్రీల వాయింపులు లేకుండా ఏ పెళ్ళీ పూర్తి కాదు.

''మీకు పెళ్ళయిందనటానికి సాక్ష్యం ఏమిటి? రుజువులేమన్నా ఉన్నాయా?''- అని జడ్జీగారు అడిగితే- ''లేకేమండి. మా ఆవిడ అప్పడాలకర్రే సాక్షి, నా బుర్రమీది బుడిపెలే రుజువు''- అన్నాట్ట ఓ చండీదాసు కోర్టులో తల తడుముకుంటూ. ఏ వివాహమైనా జరిగిందనటానికి ముఖ్యమైన సాక్షి ఆ పెళ్ళిని జరిపించిన పురోహితుడే. వధూవరులు ఇష్టపడి చేసుకొనే గాంధర్వ వివాహాల్లో పురోహితుల ప్రసక్తి ఉండదు. కణ్వాశ్రమంలో శకుంతల ముగ్ధసౌందర్యాన్ని చూసి వరించిన దుష్యంతుడు ఆమెను గాంధర్వ విధిని వేలికి ఉంగరం తొడిగి వివాహం చేసుకుంటాడు. తరవాత ఆ విషయమే మరిచిపోతాడు. కొంతకాలానికి శకుంతలే తన దగ్గరకు వస్తే తను పెళ్ళిచేసుకున్నట్లు రుజువు చూపెట్టమంటాడు. అతనిచ్చిన ఉంగరం పోగొట్టుకున్న శకుంతల తెల్లబోతుంది. వివాహాలు జరిపించటమే కాదు, వివాహాలకు శుభముహూర్తాలను నిర్ణయించటం కూడా శాస్త్రాలు క్షుణ్ణంగా పఠించిన పురోహితులే చేస్తారు. అర్జునుడు ఉలూచిని ఏ పురోహితుని ప్రమేయం లేకుండానే పెళ్ళాడతాడు. అటువంటి మినహాయింపులు ఎక్కడో కొన్ని ఉంటాయి. శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్ళిపుస్తకం పుటలు భర్తీచేసుకోవాలంటే పురోహితుల తోడ్పాటు తప్పనిసరిగా ఉండాల్సిందే. హిందూ వివాహాల్లో పురోహితుల పాత్రే ప్రధానమైంది. మంగళవాద్యాల నేపథ్యంలో పురోహితులవారు ''మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం''- అని వరునితో అనిపించి మాంగల్యధారణ చేయిస్తే కాని వివాహం పూర్తికాదు. వరపూజతో ప్రారంభించి కన్యాదానం, మంగళసూత్రధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, పాణిగ్రహణం, సప్తపది- వగైరా వివాహంలోని వివిధ ఘట్టాలు పురోహితుల మంత్రోచ్చారణల ఆధారంగానే జరుగుతుంటాయి. రుగ్వేదంలోని 'వివాహసూక్తం' ఆధారంగా పురోహితులు వివాహాలు జరిపిస్తూ ఉంటారు.

ఇతర మతస్థులలోలాగ హిందూ పురోహితులు తాము జరిపించే వివాహాల వివరాలను ఒక పుస్తకంలో నమోదుచేసి ఉంచుకోరు. ఇందువల్ల పురోహితులు జరిపించిన వివాహాలను రుజువు చేసుకోటానికి కొన్ని సందర్భాల్లో చిక్కులు ఏర్పడుతున్నాయి. ఆ బెడదను నివారించటానికి రాష్ట్ర ప్రభుత్వం పౌరోహిత్యాన్ని వృత్తిగా నిర్వహించే వారి వివరాలను రిజిస్టరు చేయాలని సంకల్పించింది. ఈ రిజిస్టర్డు పురోహితులు తాము జరిపే వివాహాల వివరాలన్నిటినీ ఓ పుస్తకంలో నమోదుచేసి ఉంచుతారు. అంతేకాక వివాహం పూర్తయిన తరవాత తామే ఓ సర్టిఫికెట్‌ను వధూవరులకు అందచేస్తారు. ఆ సర్టిఫికెట్‌కు న్యాయపరమైన భద్రత ఉంటుంది. పురోహితులను రిజిస్టరు చేసి వారికొక గుర్తింపు ఇవ్వాలనే ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి తన ఆమోదాన్ని తెలిపారనీ త్వరలోనే ఇందుకు సంబంధించిన చట్టానికి రూపకల్పన జరుగుతుందనీ సమాచారం. వివాహాలన్నిటినీ తప్పనిసరిగా రిజిస్టరు చేసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ ఆ చట్టం సవ్యంగా అమలుకావటంలేదు. ఈ చట్టం అమలులోకి వచ్చి రిజిస్టర్డు పురోహితులు అవతరించి, తాము జరిపించే వివాహాలకు వారిచ్చే సర్టిఫికెట్లకు న్యాయపరమైన భద్రత ఉన్నట్లయితే పురోహితుల బాధ్యతేకాక వారి హోదా కూడా పెరుగుతుంది. ఈ పద్ధతి వల్ల వివాహాలను రుజువు చేసుకోవటంలో ప్రస్తుతం ఎదురౌతున్న ఎన్నో ఇబ్బందులూ తొలగిపోతాయి!
(Eenadu, 28:10:2007)
_______________________________

Labels: