My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, July 14, 2007

Smoke!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!



Labels:

Three Parrots

A man wanted to buy his son a parrot as a birthday present.
The next day he went to the pet shop and saw three identical parrots in a cage.

He asked the clerk, "how much for the parrot on the right?

The owner said it was $250.
"$250", the man said. "Well what does he do?
"He knows how to use all of the functions of Microsoft Office 2000, responds the clerk.
"He can do all of your spreadsheets and type all of your letters."

The man then asked what the second parrot cost.
The clerk replied, $500, but he not only knows Office 2000, but is an expert computer programmer

Finally, the man inquired about the cost of the last parrot.
The clerk replied, "$1,000."
Curious as to how a bird can cost $1,000, the man asked what this bird's specialty was.
The clerk replies, "Well to be honest I haven't seen him do anything.
But the other two call him "Manager" !!
(an e-mail forward)
________________________________________________

Labels:

JOKES.(A)

Ladies hostel caught Fire. It took 1 hour to bring the fire under control and another 3 hours to bring the firemen under control.
- - - -
Wife: If I sleep with your best friend what will be the first thought to come in your mind?
Husband: that you are a lesbian.
- - - -
Why did they stop printing Pamela Anderson stamps in the U.S ???
Because the people started licking the wrong side!
- - - -

Nobody is ever satisfied, Poor men wish they were rich, Rich men wish they were handsome, Bachelors wish they were married & Married men wish they were Dead!
- - - -
A girl says to her boyfriend, "One kiss and I'll be yours forever."

The guy says 'thanks for the warning'

- - - -
A husband was asked : "Do you talk to your wife after sex?"
He replied: "Depends, If I Can find a Phone"
- - - -
Definition of a Gynecologist: Someone who looks for problems where others look for pleasure!!!
- - - -
Man to wife on wedding night- "Are you sure I'm the first man you are sleeping with?'
"Of course honey, I stayed awake with all the others!' ----------------------------------------------------------

Labels:

Friday, July 13, 2007

SUCCESS DOES NOT HAPPEN IN ISOLATION

There was a farmer who grew superior quality and award-winning corn.

Each year he entered his corn in the state fair where it won honour and prizes.

One year a newspaper reporter interviewed him and learnt something interesting about how he grew it. The reporter discovered that the farmer shared his seed corn with his neighbours'.

"How can you afford to share your best seed corn with your neighbours when they are entering corn in competition with yours each year?" the reporter asked.

"Why sir," said the farmer, "didn't you know? The wind picks up pollen from the ripening corn and swirls it from field to field. If my neighbours grow inferior, sub-standard and poor quality corn, cross-pollination will steadily degrade the quality of my corn. If I am to grow good corn, I must help my neighbours grow good corn."

The farmer gave a superb insight into the connectedness of life. His corn cannot improve unless his neighbour's corn also improves. So it is in the other dimensions!

Those who choose to be at harmony must help their neighbours and colleagues to be at peace. Those who choose to live well must help others to live well. The value of a life is measured by the lives it touches.

SUCCESS DOES NOT HAPPEN IN ISOLATION. IT IS VERY OFTEN A PARTICIPATIVE AND COLLECTIVE PROCESS.

So share the good practices, ideas, new learning's with your family, team members, neighbours.

"Success is the ability to go from one failure to another with no loss of enthusiasm."

(an e mail forward)

_______________________________________

Labels:

Wednesday, July 11, 2007

The Taj- a wonder






Labels:

Tuesday, July 10, 2007

పదాలు

'మామిడి పండు' అనే మాటకు సమానార్థకమైన మాట భారతదేశంలోని ప్రతి భాషలోను వుంది. కాని, యూరప్ లోని యే భాషలోను లేదు. యెందుకు లేదంటే, యూరప్ లో మామిడి పండే లేదు గనుక.ఇంగ్లీషువాళ్ళు మనదేశానికి వచ్చినప్పుడు మామిడి పండును/ కాయను చూసి, తమిళంలోని 'మాంగాయ్'నుండి mango అనేమాట సృష్ట్తించుకున్నారు.....అలాగే, యూరప్ లో వున్న పండ్ల పేర్లు మన భాషల్లో లేవు.యెందుకు లేవంటే ఆ పండ్లే మనకు లేవు గనుక.... వస్తువే లేకపోతే దానికి పేరు వుండడం సాధ్యం కాదు గదా.వస్తువు ప్రత్యక్షంగా లేకపోయినా, ఊహలో వున్నా సరే, మనుషులు దానికి పేరు పెట్టుకోగలరు.స్వర్గం, నరకం, దేవుడు, దయ్యం, అప్సరస, బడబాగ్ని లాంటి పదాలు ఇలా పుట్టినవే.

'మంచు' అనేమాట తెలుగు వుంది. సంస్కృతంలో హిమము, ప్రాలేయము, నీహారము, హిమిక అనే మాటలు వున్నాయి.అన్నీ మంచుకు పర్యాయపదాలే. మంచులో రెండు రకాలను తెలపడానికి 'మంచుగడ్డ' 'పొగమంచు' అనే రెండు మాటలు విడిగా వున్నాయనుకోండి.కానీ యింగ్లీషులో mist, dew, fog, frost, snow, ice, slush, sleet అని 8 మాటలున్నాయి. ఇవన్నీ చాలక smog అనే కొత్త మాట, యీ శతాబ్దంలో పుట్టింది.యీ 9 మాటలకూ తొమ్మిది వేరువేరు అర్థాలున్నాయి. యేదీ మరొకదానికి పర్యాయ పదం కాదు.తొమ్మిది పదాలు వేరువేరుగా యెందు కున్నాయంటే, తొమ్మిది వస్తువులు వేరువేరుగా వున్నాయి గనుకనే, యూరప్ లో వున్న వాళ్ళు యీ తొమ్మిదింటిని ప్రత్యక్షంగా చూస్తున్నారు.తెలుగు భాషలో యిన్ని పదాలు లేక పోవడానికి భౌగోళిక, శీతోష్ణ పరిస్థితులే కారణ మనవచ్చు..........

బంధుత్వాలకు సంబంధించిన మాటలన్నీ వివాహ వ్యవస్థతో ముడివడివుంటాయని సులభంగా గ్రహించవచ్చు......మనదేశంలో సోదరీ సోదరుల పిల్లలు ఒకరినొకరు పెండ్లి చేసుకోవచ్చు.దీన్నే మేనరికమంటారు. కానీ, అన్నదమ్ముల పిల్లలు ఒకరినొకరు గానీ, అక్కచెల్లెండ్ల పిల్లలు ఒకరినొకరు గానీ పెండ్లి చేసుకోకూడదు.కానీ, యూరప్ లో చేసుకోవచ్చు.అనగా, వివాహ విషయాల్లో యూరప్ లో మేనమామకు,చిన్నాయన(పెదనాయన) కూ భేదం లేదు; అలాగే, మేనత్తకూ చిన్నమ్మ (పెద్దమ్మ) కూ భేదం లేదు.ఆ కారణం వల్లనే అక్కడ వున్న uncle అనే పదానికి రెండు పదాలు, aunt అనే పదానికి రెండు పదాలు యిక్కడ మనకు అవసరమైనాయి.యింగ్లీషులోని cousin అనే మాటకు మనభాషలో సమానార్థకం లేకపోవడానికి కూడా అదే కారణం కావచ్చు.అయితే మరి, అన్న, తమ్ముడు అనీ, అక్క, చెల్లెలు అనీ విడివిడిగా ద్రావిడ భాషల్లో వున్నట్లు వుత్తరభారతదేశపు భాషల్లోను, యూరోపియన్ భాషల్లోను లేకపోవడనికి కారణమేమిటో చెప్పలేము...........................................

తెలుగులో మేము, మనము అనే మాటలు వున్నాయి. యీ రెండింటికి యింగ్లీషులో we అనే అంటారు.హిందీలో 'హం' అంటారు.తెలుగులో వున్న ఈ విభజన ప్రపంచంలో అనేక భాషల్లో లేదు..............................

యిలా కారణంగా లేదా ఊహకందని కారణాలవల్ల, యింగ్లీషులో వున్న పదాలు కొన్ని తెలుగులో లే
వు.
ladder అంటె నిచ్చెన అని తెలుగులో వుంది గాని stair-case కు తెలుగు మాట యెందుకు లేదు. సంస్కృతం లో కూడా 'శోపానశ్రేణి' లాంటి పండిత సమాసాలు వున్నాయి గానీ, ప్రత్యేకంగా ఆ వస్తువుకొక పేరంటూ లేదు.'శోపానశ్రేణి'లాగే తెలుగులోకూడా 'మెట్లవరుస' అని కల్పించుకోవచ్చు. కానీ తెలుగువాళ్ళెవరూ ఆ మాట వాడడం లేదు. stair-case అనడానికి మెట్లు, మెటికలు, తాపలు, చీడీలు అనే అంటున్నారు. step అనే మాటకు బహువచన రూపాలే ఇవన్నీ.
window కు తెలుగు,సంస్కృత పదాలన్నీ మరుగున పడిపోగా, 'కిటికీ' అనే (ఉరుదు నుండి వచ్చిన) పరాయి మాట వాడుకలో వుంది,
మరి, window-sill కు తెలుగులో యేమనాలి?
sentiment కు తెలుగు మాట యెందుకు లేదు?
instinct కు తెలుగు మాట యెందుకు లేదు?['సహజాతం' అనేది యిటీవల పండితులు సృష్టించిన మాట.దానికంటె 'అంత:ప్రవృత్తి' అనడమే బాగుంటుంది.]
house కూ home కూ విడివిడిగా రెండు పదాలు తెలుగులో లేవు.బహుశ ప్రపంచంలో చాలా భాషల్లో లేవు.........
అది పోనీ roof కూ ceiling కూ రెండు పదాలు మనకెందుకు లేవు?
marriage కూ wedding కూ రెండు పదాలు యెందుకు లేవు?
hot కు వేడి అనీ, warm కు వెచ్చని అనీ మనకు రెండు పదాలు వున్నాయి; కానీ cool కూ, cold కూ, యెందుకు లేవు?
misuse కూ, abuse కూమధ్య గల భేదం సున్నితమైనదిగనుక వాటికి తెలుగులో రెండు మాటలు విడివిడిగా లేవని సమాధానపడవచ్చు.
discover కూ, invent కూ రెండు తెలుగు మాటలు యెందుకు లేవు?...

అది పోనీ airకూ, windకూ వేరువేరుగా రెండు మాటలు మనకెందుకుండకూడదు?.............
గాలి, పయ్యెర, వాయువు, మారుతం,పవనం, అనిలం అని యెన్నో మాటలు వున్నాయి గానీ, అన్నీ పర్యాయపదాలే. ప్రభంజనం కూడా అంతే. అన్నీ airకూ సమానార్థకాలే; windకూ సమానార్థకాలే; మళ్ళీ మాట్లాడితే breezeకు కూడా సమానార్థకాలే; యింగ్లీషులో draughtఅనే మరో మాట కూడా వుంది.దానికి తెలుగు మాట ఊహించడానికేసాధ్యం కాదు...........
(పుటలు :45,46,47 & 48, "అనువాద సమస్యలు" , రాచమల్లు రామచంద్రా రెడ్డి, 1991)
-----------------------------------------------------------

Labels:

టైం

తెలుగువాళ్ళు గంట యెంతైందీ తెలుసుకొడానికీ, తెలియజేయడానికి మాత్రమే కాక, ఇంకా అనేక సందర్భాలలో టైం అనే మాట వాడుతున్నారు . భోజనం టైం అయింది. 'నీతో మాట్లాడటానికి యిప్పుడు నాకు టైం లేదు', 'సరిగ్గా టైం కు వర్షం వచ్చింది', 'రైలుకు యింకా అర్ధగంట టైం వుంది', 'యీ పని చేయడానికి గంట టైం పట్టుతుంది'- యిలా అనేక సందర్భాలలో యీ మాట వాడుతున్నారు. పై వాక్యాలలో యీ ఇంగ్లీషు మాటలకు బదులు సరైన తెలుగు మాట పెట్టడానికి ప్రయత్నించండి. ఒక నిమిషం ప్రయత్నం చేస్తే చాలు.- మీ ప్రయత్నం నెరవేరినా సరే, నెరవేరక పోయినా సరే- నెత్తి మీద సుత్తెతో కొట్టినట్లు ఒక విషయం మీకు హఠాత్తుగా బుర్ర కెక్కుతుంది. యేమిటంటే: టైం అనే భావానికి అన్ని సందర్భాలలోను తగిన ఒకే తెలుగు పదం యేదీ లేదు. అనగా , అన్ని సందర్భాలలోను టైం కు సమానార్థకమైన తెలుగు పదం ఒకే ఒకటి లేదు. కాలం, సమయం, వేళ, పొద్దు, తీరిక, వ్యవధి, అదను లాంటి పదాలు మనకు బోలెడు వున్నాయి. అయితే , ఏ ఒక్కటి అన్ని సందర్భాలకూ కుదరదు. ఒక్కొక్క సందర్భంలొ ఒకటి సరిపోతుంది గానిఎ, మరొకటియేదీ సరిపోదు. వివిధ సందర్భాలకు సరిపడే వివిధ పదాలు బోలెడు వుండడమే మనకు సమస్య అయింది. నిజానికి, యిలా సందర్భోచితమైన పదాలు వేరువేరుగా వుండడం భాషా వికాసానికి చిహ్నం. అనగా, టైం అనే భావానికి సంబంధించినంతవరకు మన తెలుగు భాష యింగ్లీషుకంటే యే ఎనిమిది రెట్లో పది రెట్లో అభివృద్ధి చెందిన భాష అని మనం గర్వించవచ్చు.

కానీ, దురదృష్ట వశాత్తు, మన భాష బాగా వికసించడమే తెలుగు'వాడి'కి సమస్య అయింది. వున్న బోలెడు పదాలలో సందర్భాన్ని బట్టి సరైన పదం యేరుకొని మాట్లాడడం మనవానికి యిబ్బంది కలిగించింది.యేరుకొనే శ్రమ యెందుకు, అన్ని సందర్భాలలోను టైం అనే ఇంగ్లీషు మాట వాడితే సరిపోతుంది కదా, అని మామూలు తెలుగు మనిషి అనుకొన్నాడు...........
___________________________________

టైమెంత? = వేళ ఎంత?

భోజనం టైం అయింది. = భోజనం వేళ అయింది.

'నీతో మాట్లాడటానికి యిప్పుడు నాకు టైం లేదు'= 'నీతో మాట్లాడటానికి యిప్పుడు నాకు తీరిక/ వ్యవధి లేదు'

'రైలుకు యింకా అర్ధగంట టైం వుంది' = 'రైలుకు యింకా అర్ధగంట వ్యవధి వుంది'

'యీ పని చేయడానికి యెంత టైం పట్టుతుంది' = 'యీ పని చేయడానికి యెంత కాలం పట్టుతుంది'

'యీ పని యే టైంకు పూర్తి అవుతుంది' = 'యీ పని యే వేళకు పూర్తి అవుతుంది'

'యీ పని చేయడానికి నీకు పది నిమిషాలు(పది రోజులు) టైం ఇస్తిన్నాను.' ='యీ పని చేయడానికి నీకు పది నిమిషాలు(పది రోజులు) వ్యవధి/ గడువు ఇస్తున్నాను.'

(స్వల్ప వ్యవధి)= పది నిమిషాల సేపు, గంట సేపు, చాలా సేపు ( కాని సంవత్సరం సేపు/ నెల సేపు అనకూడదు)

'నీకిచ్చిన
టైం ముగిసింది.' = 'నీకిచ్చిన గడువు ముగిసింది.

'యీ పని చేయడానికి గంట టైం పట్టుతుంది'= 'యీ పని చేయడానికి గంట
వ్యవధి పట్టుతుంది'

'వాడు సరిగ్గా టైం కు వచ్చాడు' = 'వాడు సరిగ్గా (నిర్ణయించిన)వేళకు(సకాలంలో) /(మనకు అవసరం ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా వస్తే)సమయానికి వచ్చాడు'

'యీ వారమంతా నాకు మిత్రులను చూడడానికి
టైం లేదు' = 'యీ వారమంతా నాకు మిత్రులను చూడడానికి తీరిక లేదు'

'రైలు వచ్చే
టైం అయింది' = 'రైలు వచ్చే (నిర్ణయించిన)వేళ/ (రైలు వస్తున్నట్లు గంట కొట్టినా, సిగ్నల్ యిచ్చినా ఆసందర్భంలో)సమయం అయింది'

సకాలంలో/ అదనుకు వర్షం వచ్చింది.
ఈ చెట్టు సకాలంలో పూయలేదు.

(పుటలు :3, 63,64 &65 "అనువాద సమస్యలు" , రాచమల్లు రామచంద్రా రెడ్డి, 1991) ___________________________________________

Labels:

ధన్యవాదాలా లేక కృతజ్ఞతలా?

'ధన్యవాదా'లనేది హిందీ మాట. తెలుగులో 'కృతజ్ఞతలు' అనాలి. ధన్యవాదాలని యెవరైనా అంటే, వాళ్ళకు తెలుగు రాదనే చెప్పాలి.
(పుట:108, "అనువాద సమస్యలు" , రాచమల్లు రామచంద్రా రెడ్డి, 1991) _________________________________________

Labels:

Monday, July 09, 2007

CARELESSNESS:

Life’s richest rewards go to those who have developed a high degree of accuracy- accuracy of thought, craftsmanship and accuracy of statement (truthfulness). Many unfortunate, even tragic incidents could not have happened except for someone’s ignorance, carelessness or recklessness. Many lives and much damage can be spared by everyone being habitually cautious and prudent.


GEMS:

  • ‘Carelessness’ said: “I can add to your troubles

Subtract from your earnings

Multiply your aches and pains

Take interest from your work and

Discount your chances of safety

Besides this, I can lessen your chances for success,

Cancel me from your habits and it will add to your happiness.”


  • Casualness leads to casualties.

  • M I S T A K E : If a barber makes a mistake, It's a new style... If a driver makes a mistake, It is an accident.. If a doctor makes a mistake, It's an operation.. If a engineer makes a mistake, It is a new venture... If parents makes a mistake, It is a new generation... If a politician makes a mistake, It is a new law... If a scientist makes a mistake, It is a new invention... If a tailor makes a mistake, It is a new fashion... If a teacher makes a mistake , It is a new theory... If a student makes a mistake, It is a MISTAKE.
(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)
______

Labels:

జీవుడే దేవుడు!

ఆ గురుకులంలో గురువు, తన శిష్యులకు విలువిద్యలతోపాటు ధర్మపాలన, నైతిక ప్రవర్తనల గురించి బోధించేవాడు. ఒకరోజు ఇద్దరు శిష్యుల్ని పిలిచి ''మీకొక పరీక్ష పెడుతున్నాను. మీరు వెళ్ళి మంచి లక్షణాలున్న ఒక ఉత్తముణ్ని, దుర్గుణాలున్న ఒక చెడ్డ వ్యక్తిని వెతికి తీసుకురండి'' అన్నాడు. ఆ శిష్యుల్లో ఒకరు గురువు గారి ఆజ్ఞ ప్రకారం తన అన్వేషణ కొనసాగించి చివరికి తిరిగి వచ్చి, ''ఆర్యా, నా పరిశీలనలో ఏ చెడ్డవ్యక్తీ దొరకలేదు, అందరిలోనూ ఏదో ఒక సుగుణం కనిపిస్తోంది'' అన్నాడు. కొద్దిసేపటికి రెండో శిష్యుడు వచ్చి, ''అయ్యా నాకు ఏ మంచి వ్యక్తీ కనబడలేదు. ప్రతీవారిలోనూ ఏదో చెడు గుణమే తొంగి చూస్తోంది'' అన్నాడు. అందుకు గురువు నవ్వుతూ, ''ఇప్పటి మీ పరిశీలన, అవగాహన, కొన్ని యుగాల తరవాతా ఐతిహాసిక నేపథ్యంలో మీరేమిటో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతాయి'' అన్నాడు. ఆ గురువే ద్రోణాచార్యులు. ఆ శిష్యులిద్దరిలో అందరిలోనూ మంచినే దర్శించిన వ్యక్తి ధర్మమార్గంలో తుదిశ్వాసవరకు జీవించిన ధర్మరాజు. అందరిలోనూ చెడునే చూసిన శిష్యుడు, దుష్టలక్షణాలకు ప్రతీకగా నిలిచిన దుర్యోధనుడు.
ప్రపంచం చెడుగా ఉందంటే, ఆ తప్పు ప్రపంచానిది కాదు. చూసే దృష్టిదే అంటారు వేదాంతులు.

ఒక చిత్రకళాసంస్థ, చిత్రకారులకు ఒక పోటీ నిర్వహించింది. ఒక మహాపురుషుడి బొమ్మ చిత్రించాలి. అందరికీ తెలిసి, తన ఆదర్శ వ్యక్తిత్వంతో ప్రచారంలో ఉన్నవారు కాక, అజ్ఞాతంగా ఎవరికీ కనబడకుండా ఉన్న ఒక ఆదర్శమూర్తి చిత్రం వెయ్యాలి. ''ప్రేమ, కరుణ, సేవాతత్పరత అనే త్రిగుణాల కలయికతో సాక్షాత్తూ భగవంతుడే అతడిలో కనిపించాలి అనే నిబంధన ప్రకారం ఆ బొమ్మను వేసి పంపాలి'' అన్నారు ఆ సంస్థ నిర్వాహకులు. ఆ పోటీకి కొన్నివేల బొమ్మలు వచ్చాయి. యోగులు, అవధూతలు, సంఘ సేవకులు, సంస్కర్తలు... ఇలా ఎందరో మహానుభావుల చిత్రాలు పోటీకి వచ్చాయి. న్యాయనిర్ణేతలు ఎన్నో వడపోతల తరవాత ఒక చిత్రాన్ని ఎంపిక చేశారు. కొన్ని వేలమంది పౌరుల సమక్షంలో ఆ చిత్రకారుడికి బహుమతి ప్రదానం, ఆ వేదికమీదే ఆ చిత్రానికి నమూనాగా నిలిచిన ఆదర్శవ్యక్తినీ సన్మానించారు. వేదికపై ఆ మహావ్యక్తిని చూసిన వారంతా ముక్కుమీద వేలేసుకున్నారు. అతడి గత జీవితం తెలిసి ఆశ్చర్యపోయారు. పూర్వాశ్రమంలో అతడు ఒక హంతకుడు, ఎన్నో దోపిడులు చేశాడు. జైలు పాలయ్యాడు. అతడికి జైలులో జ్ఞానోదయం కలిగింది. జైలు అధికారులు అతడిలోని మంచితనాన్ని గుర్తించారు. అంతర్గతంగా అతడిలో ఉన్న కరుణ, ప్రేమల్ని వెలికితీశారు. అలా అతడొక మానవతావాదిగా, ప్రేమ స్వరూపుడిగా రూపొందాడు.

- ఒక వ్యక్తిలోని మంచిని మాత్రమే గుర్తించగలిగితే అతడు ఒక ఆదర్శ పురుషుడిగా మారతాడనడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం ఉంటుంది?

మనసు నిర్మలంగా, పవిత్రంగా ఉంటే అంతా మంచివారిగానే కనిపిస్తారు. మనలోని అవలక్షణాలను తెలుసుకోవడంతోపాటు, ఎదుటివారిలోని సుగుణాలనూ గుర్తించి వారిని గౌరవించాలి.

సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనం
అంటోంది గీత.

సమస్త జీవుల్లో తనను, తనలో సమస్త జీవుల్నీ వీక్షిస్తూ సర్వకాల, సర్వావస్థల్లో సమదృష్టి కలిగి ఉండేవాడే ఆత్మయోగి.
- అంటే అందరిలో తనను, తనలో అందరినీ చూసుకునే వ్యక్తిలో దేవుడుంటాడు. అలా దేవుడున్నాడని నమ్మి అందరిలోనూ దేవుడిని చూడగలిగే జీవుడే దేవుడు!

- డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు
(Eenadu, 01:05:2006) ________________________________________

Labels: ,

భగవదంశ

సర్వాంతర్యామియైన భగవంతుడు సృష్టిలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడని, చరాచరాల్లోనేగాక జడపదార్థాల్లోనూ భగవదంశ ఉన్నదని మన పూర్వులు విశదం చేశారు.

భగవంతుని విశ్వవ్యాప్త లక్షణాన్ని వివరించే కథను రామకృష్ణ పరమహంస ఇలా తెలియజెప్పారు.
కార్తికేయుడు ఒకనాడు పిల్లిని గిల్లాడట. ఇంట్లోకి పోయి చూసేసరికి తన తల్లి పార్వతీదేవి చెంప గిల్లి ఉండటం గమనించాడు.
''అమ్మా! నీ బుగ్గమీద ఈ గాయం ఎట్లా అయింది'' అని ప్రశ్నించాడు.
''ఇది నీ పనే! నీ గోటిరక్కే ఇది'' అని జవాబు చెప్పింది ఆ జగజ్జనని. కార్తికేయుడు నివ్వెరపోయాడు. ''అదెట్లాగమ్మా! నేను నిన్ను గిల్లినట్టుగా గుర్తులేదే'' అన్నాడు.
''నాయనా! ఈ ఉదయాన నువ్వు పిల్లిని గిల్లినమాట మరచిపోయావా?'' అని తల్లి అడిగింది.
''ఆ! ఔనమ్మా! నేను పిల్లిని గిల్లిన మాట మరచిపోయాను. అయినా నీ బుగ్గ మీద గాయం ఎట్లయింది?'' అని అడిగాడు కార్తికేయుడు.
అప్పుడు ఆ తల్లి చెప్పింది. ''వెర్రి నాయనా! ఈ జగత్తులో నేను మినహా ఏమీలేదు. సృష్టి సర్వస్వం నేనే. నువ్వు ఎవరిని హింసించినా నన్నే హింసించిన వాడవవుతావు''.
''ఏది కళ్లకు కనబడదో, దేనివలన కళ్లు చూస్తున్నాయో అదే పరబ్రహ్మం అని తెలుసుకో'' అని చెబుతోంది.

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి... అని భగవానుడు గీతలో చెప్పాడు. ''సర్వప్రాణుల హృదయాలలోను ఈశ్వరుడు నివశించివున్నాడు...'' అయితే మాయచేత ఆయన ఉనికిని మానవుడు గ్రహించలేకపోతున్నాడు.

''ఆ పరతత్వానికి కాళ్ళు లేవు. అయినా వేగంగా పోగలదు. చేతులు లేకనే పట్టుకోగలదు. కళ్ళులేకనే చూడగలదు. చెవులు లేకనే వింటుంది'' అని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. భగవంతుడు సర్వత్రా సర్వకాలాల్లో ఉన్నాడనే స్పృహ ఉంటే విలువలతో కూడిన జీవనం గడపడానికి సాధన చెయ్యవచ్చు.
-డి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయలు
(Eenadu,06:05:2006) ___________________________________________

Labels: ,

శునకభోగం


''జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి'' అని ఓ తత్వం బోధిస్తుంది. మనుషులు మిగతా ప్రాణికోటికన్నా అధికులన్న మాట ఎంత వాస్తవమో, ఇతర ప్రాణుల సహాయ సహకారాలు లేకుండా మానవుడు మనుగడ సాగించలేడన్నదీ అంతే యథార్థం. నాగరికత ఇంతగా ప్రబలని రోజుల్లో మనుషులకు ఇతర ప్రాణులతో సన్నిహితత్వం ఎక్కువగా ఉండేది. కోడికూతతో కాని పల్లెసీమల్లో తెల్లవారేది కాదు. కవ్వపు చప్పుళ్ల నేపథ్యంలో కుక్కలు, పిల్లుల షికార్లు మొదలయ్యేవి. మెడలో చిరుగంటలు గణగణమని మోగుతుంటే బసవన్నలు పొలాలకు బయలుదేరేవి. బసవలకు, పాడిపశువులకు రకరకాల పేర్లుపెట్టి రైతు యువకులు ముద్దుముద్దుగా పిలుచుకునేవారు. అటు చుక్కపొడిచి ఇటు తెల్లవారగానే ఇల్లాళ్లు పాలు పితకటానికి తయారై- ''సురభి ధేనువరావె, సుందరిరావె, పాలవెల్లిరావె పాంచాలిరావె, త్రిపురసుందరి రావె తియ్యమామిడిరావె'' అంటూ గోమాతలను ఆప్యాయంగా పిలిచేవారని ఓ జానపద గీతంలో వర్ణించారు. గతంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు తలపెట్టినప్పుడు కాబోయే వియ్యాలవారింట్లో ఎలుకల, పిల్లుల సంచారం అధికంగా ఉందా లేదా అని పరీక్షించేవారు. అలా ఉంటే వారింట్లో పాడిపంటలకు లోటులేదని గ్రహించి సంబంధం ఖాయం చేసుకొనేవారు. పూర్వం రాజకుమార్తెలు చిలుకలను, గోరువంకలను పెంచుకుంటే ఇప్పటివారు కుక్కపిల్లలను పెంచుకోవడంపై ఎక్కువ మోజు చూపుతున్నారు.

ఆ అమ్మడు బోలెడంత డబ్బుపోసి కొత్తగా ఓ బొచ్చుకుక్కను కొని తీసుకొచ్చింది. దాన్ని చూడటానికి రమ్మని తన బాయ్‌ ఫ్రెండును ఆహ్వానించింది. ''చూశావా మోహన్‌- ఎంత బాగుందో.. దగ్గరకెళ్లి పలకరించు'' అంది. ''కుక్క బాగానే ఉంది. దగ్గరకెళ్లమంటున్నావు. కొంపతీసి కొత్తవాళ్లను చూసి కరవదు కదా...'' అన్నాడు మోహన్‌. ''అది తెలుసుకుందామనేగా నిన్ను వెళ్లమంటున్నది'' అంది అమ్మడు చల్లగా.

తోటి ప్రాణులను పెంచుకుంటూ ముద్దుచేస్తున్నా, వాటిని చిన్నబుచ్చుతూ వ్యాఖ్యానాలు చేయటమూ మనుషులకు అలవాటే. ఆ అలవాటువల్లే- ''గాడిదకెందుకురా గంధంబు వాసన, కుక్కకెందుకు కుచ్చుల జీను...'' వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ''అందువల్ల ఆ జీవాలకు పోయిన పరువేం లేదు. ఆ సామెతలు సృష్టించినవారి బుద్ధే బయటపడింది'' అని జంతుప్రేమికులు వాదిస్తుంటారు. ''ఎవ్వరి గుణములు ఏమన్న మానవు... చక్క చేయరాదు కుక్కతోక...'' అన్నాడో శతకకారుడు. మా తోకల సంగతి మీకెందుకు, ముందు మీ బుద్ధులు సరి చేసుకోండి చాలు- అంటూ శునకాలు భౌభౌమంటూ కయ్యానికి దిగితే ఆయనేమంటాడో తెలియదు. సుమతీ శతకకారుడైతే ఏకంగా శునకాలను కనకపు సింహాసనాలపై కూర్చోపెట్టినా వాటి వెనుకటి గుణాలు మానుకోవని ఎద్దేవా చేశాడు. ''మనుషులు మాత్రం మానుకుంటున్నారా? అధికార సింహాసనాలపై కూర్చుంటున్నా గడ్డి తినటం మానుకుంటున్నారా, చెప్పులు కొరకటం మానేస్తున్నారా...'' అని కుక్కలు కొక్కిరిస్తే ఆయనేం సమాధానమివ్వగలడు? నేరాలను పసిగట్టడంలో శిక్షణ పొందిన శునకాల సహాయం పోలీసులు తీసుకోవడం పరిపాటి. పరమ శివుడంతటివాడు చెంచువేషంలో వేటకు బయలుదేరినప్పుడు నాలుగు వేదాలను నాలుగు జాగిలాలుగా మార్చి తీసుకువెళ్ళాడంటారు.

పాశ్చాత్య దేశాల్లో పెంపుడు కుక్కలేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. వాటిని ఖరీదైన దుస్తులతో, నగలతో అలంకరించటం కుక్కలకు ఫ్యాషన్‌షోలు నిర్వహించటం వంటి కార్యక్రమాలూ అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సువంటి దేశాల్లో షరా మామూలు. జపాన్‌ వారికీ కుక్కలంటే మక్కువ ఎక్కువే. ఇప్పుడు కొత్తగా సరాది కార్పొరేషన్‌ అనే సంస్థ జపాన్‌లో కుక్కలకోసం ప్రత్యేకంగా ఓ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పింది. ప్రపంచంలోకెల్లా జపాన్‌లోనే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంది. రోజురోజుకు వీరిసంఖ్య పెరిగిపోతోంది. 2055 నాటికి జపాన్‌ జనాభాలో 40 శాతానికిపైగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులే ఉంటారని అంచనా. పెంపుడు జంతువుల ఆలనాపాలనా చూసుకోవడం వృద్ధులైన యజమానులకు కష్టతరమైన కార్యంగా పరిణమిస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగ వ్యాపకాల్లో తలమునకలై పోతుండటంతో ఇళ్లదగ్గర కుక్కల సంరక్షణను చూసేవారు లేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనుషులకు వృద్ధాశ్రమాలు కొత్తేమీ కాదు. అటువంటి సౌకర్యమే కుక్కలకు ఎందుకు కలిగించకూడదు అనే ఆలోచన సరాది కార్పొరేషన్‌కు చెందిన నానా ఉచిడా బుర్రలో మెరిసింది. దాన్ని వెంటనే కార్యరూపంలోకి తెచ్చి, ఉత్తర టోక్యోలోని నాసు ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఆశ్రమంలో కుక్కలకు సకల సౌకర్యాలు కలిగిస్తూ తమ యజమానులకు దూరంగా ఉంటున్నామనే బెంగ వాటికి కలగకుండా చేస్తున్నాడు. యజమానులు అప్పుడప్పుడూ వచ్చి తమ కుక్కలను చూసి పలకరించి ముద్దుచేసి పోవచ్చు. నిర్వహణ ఖర్చులకింద ఒక్కో కుక్కకు నెలకు లక్ష యెన్‌లను వసూలు చేస్తున్నా యజమానులు లెక్కచేయటంలేదు. వృద్ధాప్యంలోను తమ కుక్కలు కులాసాగా ఉండాలనే కాంక్ష ఈ ఆశ్రమంవల్ల తీరుతోందని వారు సంతోషిస్తున్నారు. పెంపుడు జీవాలకో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జపాన్‌లో ఇదే మొదటిసారి అయినప్పటికీ మనదేశంలో అటువంటి కేంద్రాన్ని చెన్నైకి చెందిన అశోక్‌ చాలాకాలం క్రితమే ప్రారంభించాడు. ఆయన నడుపుతున్న కేంద్రంలో కుక్కలే కాక కొన్ని పిల్లులూ ఆశ్రయం పొందుతున్నాయి. కేరళ ప్రభుత్వమూ వయసు మళ్లిన ఏనుగుల సంరక్షణకోసం ఓ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఇవన్నీ వింటుంటే మూగజీవాలకూ దశతిరిగే రోజులొచ్చాయనిపించడంలేదూ...
(Eenadu,08:07:2007)
__________________________________

Labels:

Sunday, July 08, 2007

Beautiful Quotes












































(an e-mail forward)
________________________________________

Labels: