My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, April 18, 2009

మన మేనేజ్‌మెంట్‌ గురువులకు ప్రేరణ


ఆధునిక
వ్యాపార సూత్రధారి కృష్ణుడే




కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన..
భగవద్గీతలోని ప్రవచనాన్ని ఇప్పుడు మేనేజ్మెంట్గురువులువల్లెవేస్తున్నారు. పాశ్చాత్య పోకడలకు పట్టం కట్టిన వీళ్లే మధ్య- క్షీరసాగరమథనం, సుదర్శన క్రియ, గీతాసారం వంటివాటిని తమ ఉపన్యాసాల్లోజొప్పిస్తున్నారు. వాటిని ఆలంబనగా తీసుకోవాలని, ఆచరణలో పెట్టివిజేతలుగా నిలవాలని తమ శిక్షణ తరగతుల్లో సూచిస్తున్నారు.

పాశ్చాత్యులపై పైచేయి
దీపక్చోప్రా, సి.కె.ప్రహ్లాద్‌, అరిందమ్చౌధురి, శివ్ఖేరా, మృత్యుంజయ్బి.ఆత్రేయ, హరీశ్బిజూర్తదితరులు ఇప్పటి కాలపు వ్యాపార నిర్వహణలోఎదురయ్యే సవాళ్లను తట్టుకొని ముందంజ వేసేందుకు తరచు రామాయణ, మహాభారతాది హిందూ పురాణేతిహాసాలను తిరగేసి తరణోపాయాలను సూచిస్తున్నారు. దీంతో ఫిలిప్కోట్లర్‌, గేరీహామెల్‌, జాక్వెల్ష్‌, ఎడ్వర్డ్డి బానో వంటి పాశ్చాత్యులది వెనకసీటే అవుతోంది.
యోగ ప్రాముఖ్యాన్ని గురించి మురారిసమగ్రంగా వివరించాడని, దీన్ని తమ శిక్షణ సమావేశాల్లో ఆధారంగా చేసుకున్నామని బిజూర్ చెప్తున్నారు. చేసే పనిలోప్రావీణ్యం సాధించడం, ప్రావీణ్యాన్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మళ్లీ మళ్లీ చాటుకోవడం ద్వారా వృత్తి జీవనంలోఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నదే యోగ అంతరార్థమని ఉద్ఘాటిస్తున్నారు. పలు వ్యాపార వ్యూహాలకుమూలాలను హిందూ పుక్కిటి గాథల్లో చూడొచ్చంటున్నారు. ఉదాహరణకు, ఏదైనా ఒక కంపెనీ స్వయం నైతికనియమావళికి కట్టుబడి అన్ని రకాల విధుల్లోనూ నాణ్యతను కరతలామలకం చేసుకోవచ్చని బిజూర్పేర్కొంటున్నారు.
ఇక ఆత్రేయ తన వంతుగా.. పాల కడలిని చిలికినప్పుడు అమృతం, హాలాహలం వెలువడ్డ ఘట్టాలను ఉటంకిస్తారు. దేవతలు (మంచికి ప్రతీకలు) దానవుల (చెడుకు నిదర్శనాలు)పై విజయం సాధించడానికి వీలుగా అమృత పానంచేసేందుకు ముందుగా విడుదల అయిన విషాన్ని శివుడు సేవించి గరళకంఠుడు అవుతాడు. నీలకంధరుడి విన్యాసంసాహసానికి, చొరవకు, క్రమశిక్షణకు, సరళత్వానికి, నిరాడంబరతకు చిహ్నం; సద్లక్షణాలు అన్నీ విజయాన్నికోరుకొనే బిజినెస్లీడర్లు, మేనేజర్లు అలవర్చుకోవలసినవేనని ఆయన ఏకరవు పెడుతున్నారు.

సంక్షోభ వేళ...
దేశ, విదేశాల్లో ఆర్థిక సంక్షోభం విస్తరిస్తున్న వేళ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పత్రాలు ఇవ్వడమో, సిబ్బందికిసౌకర్యాలను తగ్గించడమో చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి పుక్కిటి పురాణాల ఘట్టాల స్వారస్యాన్ని ఆకళింపుచేసుకోవడం మరింత సందర్భోచితంగా ఉండగలదంటున్నారు. కార్పొరేట్సామాజిక బాధ్యత (సీఎస్ఆర్‌)పై దృష్టినికేంద్రీకరించడం అన్ని కంపెనీల ధర్మం కావాలి. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల ప్రయోజనాలను అవి కాపాడాలి. కాలంఅనుకూలించినప్పుడు కంపెనీ లాభాలు ఆర్జించవచ్చు; కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాలి అని ఆత్రేయ విశ్లేషిస్తున్నారు. త్పత్తులకు ధరలను తగ్గించుకొని, స్వల్ప లాభ శాతంతో సంతృప్తి చెందుతూ వ్యర్థాలను నివారించుకోవాలి అని ఆయనబోధిస్తున్నారు. మహాభారత గాథలో యుధిష్ఠరుడిని గురించి ప్రస్తావించి, 'నిత్యం అనేక జీవరాశులు యమ లోకానికిప్రయాణం కట్టడం ప్రజలు ఎరిగినదే. అయినప్పటికీ ప్రాణాలతో ఉన్న వారు మాత్రం తాము కలకాలం బతికి బట్టకట్టాలనుకుంటారు' అన్నారు. దీన్నే మరోవిధంగా చూస్తే, ప్రతి రోజూ అనేక మంది పదవీ విరమణ చేస్తుంటారు. ఇదితప్పనిసరిగా సంభవించే పరిణామం అని ఆయన గుర్తు చేశారు. అయితే తాజా ఆర్థిక సంక్షోభం, అది వెంటతీసుకువచ్చేఅభద్రత ప్రభావాన్ని కార్పొరేట్యాజమాన్యాలు 'దీర్ఘదర్శులు'గా మారితే ఒకింత ముందుగానే పసిగట్టి అరికట్టేఅవకాశాలు దక్కుతాయి.

ఆదర్శవంతమైన కార్పొరేట్పరిపాలన సూత్రాలను రూపొందించుకోవడానికి వేదాలు, ఉపనిషత్తులు పరిశీలించడం వల్లతోడ్పాటు లభిస్తుంది. సంస్థల నిర్వహణ తీరు 'సాత్వికం'గా ఉంటే మేలు. ఇక్కడ సాత్వికం అంటే సమతౌల్యం, క్రమశిక్షణయుతంగా ఉండడం అని. సంస్థలు తమ వినియోగదారులు, వ్యాపార భాగస్వాముల పట్ల, ఉద్యోగుల పట్ల శ్రద్ధతీసుకోవాలి. పటిష్ఠమైన కార్పొరేట్పరిపాలనకు ఇది వెన్నెముకలా ఆధారభూతమని ఆత్రేయ వేదాల నుంచిసోదాహరణంగా చెప్పుకొస్తారు.
‌ ‌ ‌
(ఈనాడు, 22:03:2009)
_________________________________

Labels: