My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, May 04, 2007

వికటించిన హాస్యం

నవరసాల్లో హాస్యానికి ప్రత్యేక స్థానం ఉంది. హాస్యరసం లేకపోతే నీరసమే మిగులుతుంది. ఇదివరకు పెళ్ళిపాటల్లో, వియ్యాలవారి సరసాల్లో, వదినా మరదళ్ళ సరాగాల్లో కావాల్సినంత హాస్యం జాలువారుతుండేది. భోజనాల సమయంలో వినిపించే పరాచికాలకు, పాటలకు పద్యాలకు అంతే ఉండేది కాదు. కాలం మారి క్యాటరింగ్ సంస్కృతి పెరిగి, బఫే భోజనాల హడావుడి ఎక్కువయ్యాక పెళ్ళిళ్ళలో డాబుదర్పాల ప్రదర్శన పెరిగింది. సరదాలు, సరస సంభాషణలు తరిగాయి. హాస్యం వల్ల మందహాసం నుంచి అట్టహాసం వరకు అనేక రకాల నవ్వులు వెల్లివిరుస్తుంటాయి. కొందరు పొదుపరులు ఎంత నవ్వొచ్చినా దాచుకొని మందహాసంతోటే సరిపెడుతుంటారు. డబ్బు విషయంలో పొదుపు మంచిదేకానీ నవ్వుల విషయంలో కాదు. హాయిగా నవ్వుతుంటేనే ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుందని డాక్టర్లూ చెబుతున్నారు. ఛలోక్తులు, చతురోక్తులు, పరాచికాలు, పరిహాసాలు వంటివన్నీ నవ్వు తెప్పించేవే. తెలుగులో ఇన్ని మాటలున్నా ఇంగ్లీషులో ఉన్న జోక్ అనే పదమే బహుళ ప్రచారంలో ఉంది. జోక్ అనే మాట వింటూనే మొహం ప్రఫుల్లమవుతుంది. ''ఆ కొత్తాయన వట్టి కాకారాయుడనీ పట్టుపరిశ్రమలో ప్రవీణుడనీ మన బాస్‌కి అప్పుడే ఎలా తెలిసిందోయ్'' అని అడిగాడో ఉద్యోగి సహచరుణ్ని. ''ఎలా ఏముంది? మన బాస్ ఇంకా జోక్ చెప్పకుండానే ఈయన పొట్ట చేత్తో పుచ్చుకొని మెలికలు తిరిగిపోతూ నవ్వటం మొదలెట్టాడు'' అని సందేహం తీర్చాడు తోటి ఉద్యోగి.
''నీతులకేమి యొకించుక బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో'' అని కవి చౌడప్ప అన్నాడు. అసభ్యతను హాస్యంగా సహృదయులు అంగీకరించరు. అపహాస్యం కానంతవరకే హాస్యం రాణిస్తుంది. నైట్రస్ ఆక్సయిడ్‌ను 'లాఫింగ్ గ్యాస్' అంటారు. ఈ గ్యాస్‌ను పీలిస్తే తెరలు తెరలుగా నవ్వు పుట్టుకొస్తుందిట. హాయిగా నవ్వుకోవటానికి సరసమైన ఛలోక్తులు, జోకులు చాలు. అటువంటి గ్యాస్ పీల్చవలసిన అవసరమేమిటి? షేక్స్‌పియర్ మహాశయుడు మంచి నాటకం ఒకటి రాయాలని కూర్చున్నాడు. ఎంతసేపటికీ భావోద్వేగం కలగడంలేదు. రచన సాగటంలేదు. చేతిలో ఉన్న పెన్సిల్‌ను కొరుకుతూ కూర్చున్నాడు. కొంతసేపటికి చూస్తే పెన్సిల్ మీద పంటి గాట్లయితే చాలా పడ్డాయి కాని ఒక్క భావమూ స్ఫురించలేదు. దాంతో ''టు బైట్ ఆర్ నాట్ టు బైట్'' అనుకున్నాడు. దాంతో బుర్రలో భావం తళుక్కుమని ''టు బి ఆర్ నాట్ టు బి'' అన్న ప్రసిద్ధ డైలాగుతో రసవంతమైన 'హేమ్లెట్' నాటకం రూపుదిద్దుకొంది. కేవలం ఫక్కుమంటూ నవ్వునే తెప్పించనక్కరలేదు. మనస్సును ఆహ్లాదపరచేది హాస్యమే. తనను ఆటపట్టించాలని మాటలు విసురుతున్నవారిని అంతకంటే ఘాటైన మాటతో అవాక్కయ్యేటట్లు చేయటాన్నే రిపార్టీ అంటారు. ఓ మాస్టారు పాఠం వినకుండా అల్లరి చేస్తున్న ఓ కుర్రాడి వైపు బెత్తాన్ని పెట్టి చూపిస్తూ ''ఈ బెత్తం చివర ఓ గాడిద ఉన్నాడు'' అన్నాడు. ''ఏ చివర మాస్టారూ?'' అన్నాడా అబ్బాయి అమాయకంగా. అందుకే ఇతరులను ఆట పట్టించాలనుకునేవారు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఏ ఛలోక్తి అయినా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని తెలుసుకోవాలి!

నొప్పింపక తానొవ్వక ఫక్కున నవ్వించేదే ఛలోక్తి అంటారు. ఎంతటి గంభీరమైన వాతావరణాన్నయినా చక్కని జోక్స్ చల్లబరిచి ఆహ్లాదకరంగా మారుస్తాయి. మొహాన్ని గంటుపెట్టుకొని ధుమధుమలాడుతూ కూర్చున్నవారూ సరసమైన జోకులు విన్నప్పుడు పకపక నవ్వుతూ ప్రఫుల్లవదనులైపోతారు. సర్దార్జీల మీద జోకులు ఎన్నో ఎంతో కాలంగా ప్రచారంలో ఉన్నాయి. గడియారంలో 12 గంటలైనప్పుడు చిన్న ముల్లును ఎవరో ఎత్తుకుపోయారని ఓ సర్దార్జీ కంగారుపడ్డాడని చెప్పే- 'సర్దార్జీ బారా బజే-' వంటి జోకులు వినపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఇటువంటివాటి గురించి ఆట్టే పట్టించుకోకుండా ఉపేక్షించి ఊరుకున్నా ఇహముందు సర్దార్జీలు అలా ఊరుకోదల్చుకోలేదు. ఇటీవల ముంబాయిలోని ఓ ప్రచురణ సంస్థ 'శాంటా బాంటా ఎస్ఎమ్ఎస్ జోక్స్' అనే పేరుతో ఓ జోక్స్ పుస్తకాన్ని వెలువరించింది. ఈ పుస్తకం అట్టమీద శాంటా అనే సర్దార్జీ పింక్‌రంగు తలపాగా చుట్టుకొని ఉండగా బాంటా అనే సర్దార్ నీలంరంగు తలపాగా చుట్టుకొని ఉన్నట్లు ఉంటుంది. లోపల సర్దార్జీలకు సంబంధించిన జోక్స్ ఎన్నో ఉన్నాయి. ఒక జోక్‌లో జిరాక్స్ కాపీ చేతికి అందగానే ఓ సర్దార్‌జీ ఏం చేస్తాడు అంటే అసలుతో పోల్చి చూసుకుంటాడు అని ఉంది. ఇటువంటి జోకులు సిక్కు మతస్థులను, సర్దార్లను కించపరిచేటట్లు ఉన్నాయంటూ ఆ ప్రచురణ సంస్థపై చర్య తీసుకోవాలని సిఖ్ మీడియా అండ్ కల్చర్‌వాచ్ సంస్థ సభ్యుడు జస్మీత్‌సింగ్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ''సర్దార్లకు సిక్కు మతస్తులకు సంబంధించి అభ్యంతరకరమైన ఛలోక్తులు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికైనా వాటికి ఫుల్‌స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది'' అన్నాడు స్వర్ణజిత్ బజాజ్ అనే ఆయన. ''ప్రస్తుతం ఈ పుస్తకం ముంబాయికే పరిమితమైనా త్వరలోనే ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంది. సర్దార్లను కించపరిచే జోక్స్ ఇప్పటికే నెట్‌లో చాలా ఉన్నాయి. ఇటువంటి అవాంఛనీయమైన జోకులపై చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది'' అని కొంతమంది అంటున్నారు. ''ఇటువంటి జోకులపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చర్య తీసుకోవాలి'' అంటున్నాడు మహారాష్ట్ర మైనారిటీస్ కమిషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అబ్రహమ్ మతాయ్. నిజానికి ఒకరిని నొప్పించేవి ఛలోక్తులు కానే కావు. అటువంటి జోక్స్ వల్ల ఎవరికీ నవ్వు రాదు- వాటికి గురైనవారికి బాధ కలుగుతుంది తప్ప. జోక్స్ విసిరి అవతలివారిని నవ్వించాలని ప్రయత్నించేవారు ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది!

(Eenadu-25:03:2007)
--------------------------------------------------------------------------------

Labels: ,

పెద్ద మనసు


వృత్తుల్లో భిక్షాటన అతి ప్రాచీనమైనది. కేవలం పేదరికం వల్లేకాక పరంపరగా వస్తున్న ఆచారంవల్లనూ వెనకటి రోజుల్లో కొందరు మాధూకర వృత్తితోనే జీవనం సాగించేవారు. వారిని పండితులుగా భావించి గౌరవించి ఆదరించేవారు. ఎవరైనా సరే ఇంటిముందు నిలబడి- భిక్షాందేహి అని అర్థిస్తే ఇల్లాళ్ళు భిక్షం పెట్టకుండా పంపేవాళ్ళు కాదు. నలుగురికి పెట్టిందే మనకు మిగిలేది అన్న నమ్మకంవల్ల అప్పట్లో దానం చేయటానికి ఎవరూ వెనకాడేవారు కాదు. ''గురుకుల వాసమూ మాధూకర వృత్తీ చదువుకొనేవాడికివి మంచివనే నా నమ్మకం యిప్పటికీ. తుమ్మెద కాస్తకాస్త చొప్పున పువ్వుపువ్వునుంచీ మకరందం సంపాదించుకొంటుంది. భోజనం విషయమై విద్యార్థికిది సరిగా అలాంటి వృత్తి'' అని రాశారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన ''అనుభవాలూ- జ్ఞాపకాలూను'' అనే గ్రంథంలో. పరమేశ్వరుణ్నే పతిగా పొందాలని పార్వతి తపశ్చర్య ప్రారంభించినప్పుడు కపటవటుని రూపంలో వచ్చిన శివుడు భిక్షాటన విషయమే ప్రస్తావించి ఆదిదేవుణ్ని పరిహసిస్తాడు. ''ఎక్కడా మనువు దొరకకనా ఆ జంగమయ్యే కావాలంటున్నావు'' అని అడిగి- ''ముది గొడ్డునెక్కి భిక్షాటనంబు చేయబోవుట యదియు మెచ్చాయె జువ్వె...'' అంటూ హేళనచేస్తాడు. శివనింద భరించలేక పార్వతి కోపం తెచ్చుకుంటే అప్పుడు పరమశివుడు తన అసలు రూపం ప్రదర్శించి ఆమెను కరుణించి కల్యాణమాడతాడు. రానురాను కాలం మారిపోయింది. దానధర్మగుణాలు తగ్గిపోయాయి. భిక్షాటనను బిచ్చగాళ్ళను నిరసనగా చూడటమూ ఎక్కువైపోయింది. భిక్షుకుల మోసాలు వేషాలు కూడా అధికమయ్యాయి.
''ఇలా రోడ్డుమీద నిలబడి అడుక్కోవటానికి నీకు సిగ్గుగా లేదూ?'' అని అడిగాడు ఆ పెద్దయ్య తన ముందు నిలబడి చెయిచాపిన భిక్షుకుణ్ని. ''అయితే ఏం చేయమంటారు ఆఫీసు పెట్టమంటారా?'' అని రుసరుసలాడాడా ఆసామి. ''నా చెయి కిందా మీ చెయి పైనా ఇచ్చిపుచ్చుకొను రుణమే బాబూ, ముష్టి ఏమిటది ముసలి బ్రహ్మ మన చిట్టాలో రాసిన జమలే బాబూ...'' అంటూ దబాయింపు సెక్షను ఉపయోగించి మరీ అడుక్కొంటాడో యాచకేశ్వరుడు ఓ సినిమాలో. యాచించటం దగ్గరకొచ్చేసరికి మహావిష్ణువంతటివాడు వామనుడైపోతాడు. ''అధిక దానంబడుగ అది పాడి కాదు పృధివి మూడడుగులు దానంబు యిమ్మి...'' అని బలిచక్రవర్తిని అడుగుతాడు. అసలు విషయాన్ని గ్రహించిన శుక్రాచార్యుడు- ''వామనరూపుడై వసుధ జన్మించి నిను వంచన చేయ యిట కొచ్చినాడు, పొట్టివానికి కాదె పుట్టెడు బుద్ధి దిట్టతనమున వీని ఝడిపించి విడువు-'' అంటాడు. బలిచక్రవర్తి అందుకు ఒప్పుకోడు. మహామహులు కొలిచే శ్రీహరి- ''కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే'' అంటూ తన చేయి మీదుగా వామనుని చేయి కిందుగా ఉండగా మూడడుగుల నేల దానమిస్తాడు. ఆ వెంటనే వామనుడు విజృంభించి బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కటం అదో రసవత్తరమైన కథ. భిక్షాటనకు ఇంత పూర్వచరిత్ర ఉన్నప్పటికీ ఈ రోజుల్లో భిక్షుకులపై సానుభూతి చూపించి గౌరవించేవారు దాదాపు లేరనే చెప్పాలి. కోల్‌కతాకు చెందిన మలేసాహా మాత్రం అందుకు మినహాయింపు.

''మా అబ్బాయి పెళ్ళి మీరంతా తప్పక రావాలి'' అంటూ బంధువులను, స్నేహితులను, తెలిసినవారిని పిలవటం మామూలు. వచ్చిన వారికి చందన తాంబూలాది సత్కారాలు చేయటమూ పరిపాటే. కోల్‌కతాలోని సాహా కుటుంబీకుల పద్ధతే వేరు. వారు తమ ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకు పనికట్టుకొని వెళ్ళి వీధి బిచ్చగాళ్ళకు శుభలేఖలిచ్చి మరీ ఆహ్వానిస్తారు. మిగతా అతిథులతో సమానంగా ఆదరిస్తారు. విందుభోజనం పెట్టి నూతన వస్త్రాలూ బహూకరిస్తారు. ఈ పద్ధతిని మొదట్లో సతీష్‌చంద్రసాహా ప్రారంభించాడు. ఆయన తన కుమారుడు మలేసాహా వివాహానికి దాదాపు 175మంది వీధి భిక్షుకులను ఆహ్వానించాడు. ''ఆ సమయంలో ఆ భిక్షుకుల మొహాల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. వారు హృదయపూర్వకంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. బడుగు జీవుల ఆశీర్వాద ఫలమే మా కుటుంబాన్ని చల్లగా కాపాడుతోంది'' అంటాడు సతీష్‌చంద్రసాహా. తండ్రి నెలకొల్పిన సంప్రదాయాన్ని ఆయన కుమారుడు మలేసాహా కూడా అనుసరిస్తున్నాడు. ఇటీవల మలేసాహా తన భార్యా కుమారునితో కలిసి సీల్దానుంచి సోధ్‌పూర్ వరకు తిరిగి కనపడ్డ భిక్షుకులందర్నీ ఆహ్వానించాడు. ''మొదట్లో నేను నమ్మలేకపోయాను. కాని నిజంగానే వారు నన్ను పిలుస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. కొద్దికాలం క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ వారిచ్చిన కొత్తచీర కట్టుకొని పెళ్ళికి వెళ్ళాను. సాహా కుటుంబం మమ్మల్నెంతగానో ఆదరించింది' అంటూ సంతోషంగా చెప్పింది డమ్‌డమ్ విమానాశ్రయం దగ్గర బిచ్చమెత్తుకొనే తులసీరాణిదేవి. సాహా కుటుంబీకులు ఆహ్వానించి తీసుకొచ్చిన భిక్షుకుల్లో వికలాంగులు, గుడ్డివారు, సాధువులు సైతం ఉన్నారు. అందరినీ ఆదరించి పెళ్ళికూతురు మాంపియే స్వయంగా విందు భోజనం వడ్డించింది. ఆపై మాలెసాహా వారందరికీ కొత్తబట్టలు బహూకరించాడు. ఊహించని ఈ అపూర్వ సత్కారానికి భిక్షుకులంతా ఎంతో సంతోషించి ఆ కుటుంబంవారంతా చల్లగా ఉండాలని తమ శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్ళారు. ''ఈ సంప్రదాయాన్ని నా తరవాతి తరాల వారూ కొనసాగిస్తారనే నా నమ్మకం'' అంటున్నాడు మలేసాహా. మంచి పద్ధతి ఎవరికైనా అనుసరణీయమే కదా!
(Eenadu-18:03:2007)
--------------------------------------------------------------------------------

Labels:

ఉభయతారకం

పెళ్ళయినవారిని 'పుత్రపౌత్రాభివృద్ధిరస్తు' అని దీవించటం మన సంప్రదాయం. వివాహం పరమోద్దేశం సంతానప్రాప్తేనని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ''సుబ్బీ గొబ్బెమ్మా శుభములనియ్యావే, తామర పువ్వంటీ తమ్ముణ్నియ్యావే, చామంతి పువ్వంటీ చెల్లెల్నియ్యావే, మల్లెపువ్వంటి మొగుణ్నియ్యావే...'' అని గతంలో ఆడపిల్లలు ఆడుకుంటూ పాడుకొనేవారు. అధిక జనాభాతో ప్రపంచమంతా సతమతమవుతున్న ఈ రోజుల్లో కూడా సంతానం కలగక పరితపించేవారెందరో ఉన్నారు. పరిచయస్తులు ఇద్దరు కలుసుకున్నప్పుడు- ''మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయికి పెళ్ళయిందా?'' అంటూ పిల్లల యోగక్షేమాలతో సంభాషణ ప్రారంభించటం రివాజు. సంతానభాగ్యానికి నోచుకోనివారు డాక్టర్లతో పాటు గుళ్ళూ గోపురాలను సందర్శించుకోవటం స్వామీజీలను సలహాలడగటమూ పరిపాటి. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారంటే అలాగే చేస్తూ చుట్టుచుట్టుకూ కడుపు చూసుకొందట ఓ అమాయక ఇల్లాలు. ఇటీవలి కాలంలో ప్రజల ఆలోచనల్లోను, దృక్పథాల్లోను కొంత మార్పు వచ్చి పెళ్ళయిన దగ్గరనుంచీ సంతానం కోసం అంతగా ఆత్రపడటం తగ్గినా, పిల్లలు కావాలనే కోరిక మాత్రం తగ్గలేదు.
ఇక తమకు సంతానం కలగదని తెలుసుకున్నవారు కొందరు బంధువుల పిల్లలనో స్నేహితుల పిల్లలనో పెంచుకోవటమూ జరుగుతుంటుంది. 'పెంచుకున్నవాడు కొడుకూ కాదు, ఉంచుకున్నవాడు మొగుడూ కాదు అన్న ముతక సామెత నిజమవుతున్న సందర్భాలూ చాలానే ఉంటున్నాయి. పెంచినవారి ఆస్తిపాస్తులపైనే దృష్టి ఉంచి పెంపుడు తల్లిదండ్రుల బాగోగుల గురించి పట్టించుకోనివారి బాగోతాలు కొత్తేమీ కాదు. పిల్లలన్న తరవాత సమస్యలెన్నో పుట్టుకొస్తుంటాయి. పిల్లల్ని పెంచి పెద్దచేసి చదువు చెప్పించి జీవితంలో స్థిరపడేటట్లు చేసేంతవరకు తల్లిదండ్రుల బాధ్యత తీరదు. సంతానంవల్ల ఇటువంటి చింతలు కొన్ని ఉన్నప్పటికీ పిల్లల కోసం తాపత్రయపడటం మానవ సహజం. శాస్త్ర విజ్ఞానం పెరిగిన కారణంగా కొన్ని లోపాలున్నా వాటిని పక్కకు నెట్టి సంతానం పొందగల అవకాశం ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంది.

''ఎవరు కన్నారెవరు పెంచారు, నవనీత చోరుని గోపాల బాలుని'' అని ప్రశ్నించిన కవి- ''తాను కనకనె తల్లియయ్యెను, తనయుడాయెను దేముడే యశోదకు...'' అని జవాబు చెప్పారు. ఒకరి బిడ్డను మరొకరు పెంచటం వింతేమీ కాదు. ఒకరి అంశాన్ని మరొకరు తన గర్భవాసంలో ధరించి నవమాసాలు మోసి, తన కడుపులో పెరగనిచ్చి చూలింత బాలెంత కష్టాలన్నీ భరించి కని చివరకా గర్భఫలాన్ని అసలువారికి అప్పగించడం విశేషమే. తమ గర్భాశయాన్ని అద్దెకివ్వటానికి సిద్ధపడిన యువతులు అందుకు తగిన ప్రతిఫలం పుచ్చుకొని తమ ఆర్థికావసరాలను తీర్చుకుంటున్నారు. ఉభయతారకంగా ఉన్న ఈ పద్ధతి వల్ల అటు అసలు తల్లికి, ఇటు అద్దె తల్లికి- ఇద్దరికీ లాభం కలుగుతోంది. ఇటువంటి సంఘటనే ఇటీవల అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన కేరన్ కిమ్ అనే మహిళ గర్భాశయ లోపాల కారణంగా స్వయంగా గర్భభారాన్ని వహించి బిడ్డను కనలేకపోతోంది. ఫలదీకరణ ప్రక్రియలో నిపుణురాలైన అహ్మదాబాద్ డాక్టర్ నయనా పటేల్‌ను ఆమె సంప్రతించారు. కోల్‌కతాకు చెందిన ఓ మహిళ తనవంతు సహకారాన్ని అందివ్వటానికి అంగీకరించారు. ఆమె గర్భాశయాన్ని కిమ్ అద్దెకు తీసుకున్నారు. ఇందుకుగాను ఆమెకు రెండున్నర లక్షల రూపాయల నగదుతోపాటు గర్భభారాన్ని వహించిన తొమ్మిది నెలలూ నెలకు నాలుగువేల రూపాయలు ఖర్చుల కింద ముట్టాయి. గర్భాశయాన్ని అద్దెకిచ్చిన మహిళకూ ఓ బిడ్డ ఉన్నాడు. గుండెజబ్బు కారణంగా అతను మృత్యువుకు చేరువవుతున్నాడు. అతని చికిత్సకు అవసరమైన డబ్బు ఆమె దగ్గర లేదు. ''అటువంటి పరిస్థితుల్లో కిమ్ ఇచ్చిన డబ్బు అయాచిత వరంగా నాకు లభించింది. నా బిడ్డను కాపాడుకోగలిగాను'' అంటోంది ఆమె సంతోషంగా. ''ఒకరి బిడ్డను మరొకరు మోయటమంటే మాటలు కాదు. అందుకు ఎంతో సహనం, మంచితనంతోపాటు మానవతా దృక్పథం, ఇతరులకు సహాయపడే సుగుణమూ ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలిగిన త్యాగమయి లభించటం నా అదృష్టం'' అని కిమ్ సంతృప్తి వెలిబుచ్చుతోంది. అటు అసలు తల్లికీ, ఇటు అద్దెతల్లికీ ఇద్దరికీ ఉభయతారకంగా సంతోషాన్ని కలిగించే ఇటువంటి ప్రక్రియను కనిపెట్టిన శాస్త్రజ్ఞులు ఎంతైనా అభినందనీయులు!
(Eenadu-11:03:2007)
--------------------------------------------------------------------------------

Labels:

బిడ్డలూ బహుపరాక్!

''సకలైశ్వర్య సమృద్ధులు నొకతల సంతానలాభ మొక తల'' అన్నాడు శ్రీనాథమహాకవి. సంతానాపేక్ష ప్రతిజీవికీ ఉంటుంది. వివాహం పరమోద్దేశం సంతానాన్ని పొందటమే అని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. అపుత్రస్య గతిర్నాస్తి అని సూక్తి. అందుకే మనవారు పుత్ర సంతానంకోసం పరితపిస్తుంటారు. ''పిడికెడు విత్తనాలు మడికెల్ల చాలు ఒక్కడే కొడుకైన వంశాన చాలు...'' అనుకుంటూ కొడుకుల కోసం కలవరిస్తుంటారు. కాలక్రమంలో మనుషుల భావాల్లో మార్పులొస్తున్నాయి. కొడుకైతేనేమిటి కూతురైతేనేమిటి అంతా తమ పిల్లలు కారా అన్న ఆలోచనా సరళీ ఎక్కువవుతోంది. ''కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై, కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునికనేకుల్ వారిచే నేగతుల్ వడెసెన్'' అంటూ ఓ కవి సూటిగా ప్రశ్నించాడు. కందుకూరి రుద్రకవి రచించిన 'నిరంకుశోపాఖ్యానం'లోని నాయకుడు సకలశాస్త్ర పారంగతుడైనా వ్యసనాలకులోనై తల్లిదండ్రులను లెక్క చేయకుండా నిరంకుశంగా ప్రవర్తిస్తుంటాడు. తండ్రి ఎంత ప్రయత్నించినా, ఎన్ని హితోక్తులు చెప్పినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో- ''చాలునింక నా పాలికి జచ్చినాడు, కొడుకు గుణనిధి యనువాడు కులవిషంబు'' అని తీర్మానించి- ''తిలలు దర్భయు నుదకంబుదెత్తుగాక యేనివాపాంజలులు వానికిత్తు నిపుడు'' అంటాడు. తెనాలి రామకృష్ణకవి సృష్టించిన నిగమశర్మ కూడా నిరంకుశునికి తోడైనవాడే. కూతురైనా నిగమశర్మ అక్కే కుటుంబాన్ని ఆదుకొని తమ్ముణ్ని సరిదిద్దటానికి ప్రయత్నిస్తుంది. సంతానంవల్ల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కోవటం అనాదిగా జరుగుతున్నదే.
''తల్లిదండ్రులయందు దయలేని పుత్రుండు పుట్టెనేమి వాడు గిట్టెనేమి?'' అన్న వేమనకవి ''పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా...'' అని నిష్కర్షగా చెప్పేశాడు. సంతానమే మహాభాగ్యం అనుకుంటూ తమ పిల్లలను ఎంత శ్రద్ధగా పెంచి పెద్దచేసినా, స్వసుఖాలను సైతం పట్టించుకోకుండా పిల్లల క్షేమమే ధ్యేయంగా కృషి చేసినా, వృద్ధులైన తల్లిదండ్రులపట్ల తమ కర్తవ్యాన్ని ఎంతమంది పిల్లలు నిర్వర్తిస్తున్నారు? తమ తల్లిదండ్రులను ఎంతమంది జాగ్రత్తగా చూసుకుంటున్నారు? వృద్ధులైన తల్లిదండ్రులను అదనపు భారంగా భావిస్తూ వారిని నిర్లక్ష్యంగా చూసే కొడుకులు, కూతుళ్ళ సంఖ్యే ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. వృద్ధులైన తల్లిదండ్రులను ఏ వృద్ధాశ్రమంలోనో చేర్చి చేతులు దులుపుకొనేవారు కొందరు. ఆమాత్రం బాధ్యతా తీసుకోకుండా రోడ్లమీదే వదిలేసే పుణ్యాత్ములూ ఇంకొందరు. మారుతున్న సమాజ పోకడలవల్లా, పెరుగుతున్న స్వార్థంవల్లా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే- తల్లిదండ్రుల పట్ల సంతానం అవాంఛనీయ ప్రవర్తనకు కళ్ళాలు బిగించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది.

వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని బిడ్డల ఆట కట్టించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అటువంటివారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే జైలుకు పంపాలనీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఓ బిల్లును పార్లమెంట్లో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతారంటున్నారు. ఇటీవలి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. బిల్లు ప్రకారం వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడాల్సిన పిల్లలు ఆ బాధ్యతను విస్మరిస్తే మూడు నెలల జైలుశిక్ష లేదా ఐదువేల రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సొంతబిడ్డలు, బంధుగణానికే కాదు- పెంపుడు కొడుకులు కూతుళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. వృద్ధులైన తల్లిదండ్రుల హక్కులకు ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందంటున్నారు. అవసరమైతే తల్లిదండ్రులు అదివరకు తాము రాసిన వీలునామాను రద్దుచేసుకోగల అవకాశాన్నీ ఈ బిల్లు కల్పిస్తుంది. ఇటువంటి కేసులను విచారించటానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక ట్రిబ్యునళ్ళను ఏర్పాటుచేసి విశేష అధికారాలు కల్పిస్తారు. తల్లిదండ్రులకు ఖర్చు లేకుండా వేగంగా న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక వృద్ధాశ్రమాలు నెలకొల్పాలని, వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలనీ సంకల్పించారు. సమాజపరంగాను, ఆధునిక పోకడల కారణంగాను వ్యక్తుల మనస్తత్వాల్లో విపరీత మార్పులు వస్తున్నాయి. స్వసుఖమే ప్రధానమైపోయి కుటుంబ బాధ్యతలను, పెద్దవారి సంరక్షణను పట్టించుకోని లక్షణం ముమ్మరిస్తోంది. తాజా బిల్లువల్ల వృద్ధులైన తల్లిదండ్రులకు రక్షణ కలగటమే కాక కొడుకులు కూతుళ్ళకు తమ బాధ్యతను గుర్తుకు తెచ్చినట్లూ అవుతుంది. మమతానుబంధాలతో మానవతా దృక్పథంతో సహజంగానే నెరవేర్చవలసిన బాధ్యతలను ఓ బిల్లు ద్వారా జరిగేటట్లు చూడవలసి రావటమే విచారించవలసిన విషయం!
(Eenadu-04:03:2007)
--------------------------------------------------------------------------------

Labels:

అలనాటి కౌగిలి

''ప్రేమ అనగానేమి?'' అని బ్రహ్మాండమైన ప్రశ్నవేసిన ఆసామి, ''ప్రేమ అనగా రెండు హృదయాలు ఒకే పన్‌ధాన నడుచుట'' అని తానే సమాధానం చెబుతాడు ముళ్ళపూడివారి ఓ కథలో. ప్రేమ అన్నది అన్ని కాలాలకు చెందినది. నిర్వచనాలకు అందని హృదయ సంబంధమైన మధుర బాధ. అన్ని యుగాలలోను ప్రేమ మనుషులను నీడలా వెంటాడుతూనే ఉంది. విరహవ్యధతో వేగిస్తూ, సమాగపు ఆనందసాగరంలో మునకలేయిస్తూ ప్రేమికులకు రకరకాల మధురానుభూతులను అందిస్తూనే ఉంది. ఊర్వశీ పురూరవులది పురాణకాల ప్రేమ. వరూధినీ ప్రవరులది ప్రబంధయుగ ప్రేమ. లైలామజ్నూ, సలీం అనార్కలీలది ఇటీవలి కాలానికి చెందిన ప్రేమ. కల్పితమైనా దేవదాసు పార్వతిలది అమర ప్రేమగాథగా మిగిలిపోయి ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. శకుంతలా దుష్యంతులు, నలదమయంతులు, సుభద్రార్జునులు తదితరులెందరో రసవంతమైన ప్రేమకథలు నడిపినవారే. ఎందరో మహనీయుల జీవిత చరిత్రల వెనక బయటకురాని రహస్య ప్రేమపురాణాలూ ఉన్నాయన్న విషయం వాస్తవమే. ''ఈ రాణీ ప్రేమపురాణం, ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ కైఫీయతులూ ఇవికావోయ్ చరిత్ర సారం...'' అని మహాకవి అన్నారు కాని- ముంతాజ్‌మహల్ ప్రేమకథా, కులీకుతుబ్‌షా ప్రణయగాథా చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం సంపాదించుకున్నాయి. ప్రేమలో తలమునకలుగా మునిగిపోయినా ప్రియ సమాగమం కాక విరహవ్యధతో వేగిపోతున్న సుకుమారి, ''అలరులు సూదులై మలయజాది సమస్త వస్తువులగ్నికల్పమై, మలయ సమీరముల్ విషసమానములై, హిమభానుడైన యా కలువలరేడు చండకరు కైవడి యై కనుపట్టె'' అని బాధపడుతూ ''అయ్యయో వలపను పాపమెట్టి పగవారలకున్ వలదింక దైవమా...'' అని వేడుకొంటుంది.
''ప్రేమ గుడ్డిదంటారు నిజమేనా?'' అని అడిగాడు ప్రేమకుమార్. ''నిజమే. పెళ్ళి కళ్ళు తెరిపిస్తుంది అన్న మాట నిజమే'' అన్నాడు కుటుంబరావు. ప్రేమలో పడ్డాడు అంటారు పడటమేమిటి అసహ్యంగా గోతిలో పడ్డట్లు అని విసుక్కొనే ప్రేమబాబులకు ఆ పడటమేమిటో పెళ్ళయ్యాక కాని అర్థం కాదులే- అని సర్దిచెప్పే అనుభవజ్ఞులూ అనేకమంది. వయసులో ఉన్న వారికి కలిగే సహజమైన ఉన్మాదమే ప్రేమ అని ప్రేమను నిర్వచించాడో మేధావి. బుచ్చమ్మను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయిన గిరీశం- ''అయామ్ డ్రెడ్‌ఫుల్లీ యిన్ లవ్ విత్ హర్. దీన్ని చూసిన దగ్గర్నుంచే టౌన్ లవ్‌సూ డాన్సింగర్లుసూ మీద పరమాసహ్యం పుట్టింది'' అంటాడు. ''కాముని విరిశరముల బారికి నేనేమని సహింతునే చెలి యేమని సహింతునే'' అంటూ వెర్రెత్తిపోతాడు. ప్రేమించుకున్న వారంతా వివాహబంధంతో ముడివేసుకొని ఒకటి కాలేరు. మతాలు, కులాలు, సామాజిక నిబంధనలూ ఎన్నో అడ్డుగా నిలుస్తుంటాయి. పేద ధనిక తారతమ్యాలు ప్రేమకు అడ్డుగోడలుగా నిలవటం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. ''నేను మన్మధ్‌ను ప్రేమించిన మాట నిజమే. పెళ్ళికూడా చేసుకొనేదాన్నే- అతని బ్యాంక్ పాస్‌బుక్ చూడకపోతే. బ్యాంక్‌బుక్‌లో బాలెన్సు లేదు. ఇంకేం ప్రేమ పెళ్ళి అనుకొని గుడ్‌బై చెప్పేశాను'' అందో ప్రేమకుమారి. అందరూ అటువంటివారే ఉండరు. ప్రేమకోసం సర్వం త్యాగం చేసేవారూ మృత్యువు కూడా విడదీయలేనంతగా గాఢ ప్రేమికులూ ఉంటారు.

''ఆ ధృఢాశ్లేషమున భేదమంతరించి యొక్క హృదయమొక్క ప్రాణమైయున్నయటుల'' బిగికౌగిలిలో ఉన్న ఆ ప్రేమజంట అస్థిపంజరాలను విడదీయటానికి పరిశోధకుల మనసొప్పటం లేదు. ఇటలీలోని కెరోనా నగరానికి సమీపంలో మాన్‌టోవా నగర శివార్లలో తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రజ్ఞులకు ఓ అస్థిపంజరాల జంట కనిపించింది. ఆ జంట అస్థిపంజరాలు ఒకదానికొకటి హత్తుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాయి. అవి ఐదు లేక ఆరువేల సంవత్సరాల నాటి ప్రేమికులవిగా పరిశోధకులు భావిస్తున్నారు. కొత్త రాతియుగానికి చెందినవిగా భావిస్తున్న ఆ అస్థిపంజరాల బిగికౌగిలికి భంగం కలిగించకుండా వాటిని అలాగే పరిశోధనల నిమిత్తం ప్రయోగశాలకు తరలించాలనుకొంటున్నారు. పరిశోధనల అనంతరం వాటిని సందర్శకులు దర్శించటానికి వీలుగా మ్యూజియంలో భద్రపరుస్తారంటున్నారు. ''వేల సంవత్సరాల క్రితంనాటి ఈ ప్రేమజంట బిగికౌగిలికి మేం భంగం కలిగించదలచుకోలేదు. వారినలాగే ఉంచి పరిశోధనలు కొనసాగిస్తాం'' అంటున్నారు ఎలీనా మెనొట్టీ అనే పురావస్తు శాస్త్రజ్ఞురాలు. షేక్స్‌పియర్ మహాకవి రాసిన అమరప్రేమకావ్యం ''రోమియో జూలియట్''కు కెరోనా నగరమే నేపథ్యం. ఆ నగర సమీపంలోనే గాఢాశ్లేషంలో బిగిసిపోయిన అస్థిపంజరాల జంట బయటపడటం విశేషంగా భావిస్తున్నారు. ఆ జంటది సహజమరణమా, ఆత్మహత్య చేసుకున్నారా లేక ఏ మతాచారాల ప్రకారమో వారిని బలి ఇచ్చారా అన్నది పరిశోధనల తరవాతనే తేలుతుంది. జంట అస్థిపంజరాల పక్కనే మరొక మానవ అస్థిపంజరం కూడా కనబడింది. దాన్నిబట్టి చరిత్రకు అందని కాలానికి చెందిన శ్మశానవాటికగా ఆ ప్రదేశాన్ని పరిగణించవచ్చంటున్నారు. జంట అస్థిపంజరాల తలలు ఉత్తరం దిక్కుగా కాళ్ళు దక్షిణదిశగా ఉండేటట్లు ఖననం చేయగా, ఆ సమీపంలోనే దొరికిన మరో మానవ అస్థిపంజరం తల తూర్పు దిక్కుగా కాళ్ళు పడమటి దిశగా ఉన్నాయి. ''అలా భిన్న దిక్కుల్లో ఎందుకు ఖననం చేశారో బోధపడటం లేదు'' అంటున్నారు శాస్త్రజ్ఞులు. వివరాలు పరిశోధనల్లో కాని తేలవు. చరిత్రకందని కాలపు మడతల్లో సైతం అమరప్రేమకథలు దాగి ఉన్నాయని ఈ జంట అస్థిపంజరాలు రుజువు చేస్తున్నాయి. అందుకేగా- ''ప్రేమకన్నను యెక్కువేముందిరా, యెల్లకామ్య పదవులకన్న ప్రేమే యెక్కువరా'' అన్నారు కవి!
(Eenadu-25:02:2007)
--------------------------------------------------------------------------------

Labels:

మరో వింత



''చూడు చూడు గోడలు వైరుధ్యాల నీడలు...'' అన్నారో కవి. గోడలు మనుషులను విడదీస్తాయి. వంతెనలు కలుపుతాయి. మనుషులు గోడలు నిర్మించటంలో చూపే ఉత్సాహం వంతెనలు కట్టుకొని మానసిక సాన్నిహిత్యం పెంపొందించుకోవటంలో ప్రదర్శించరు. ఆ కారణంగానే ప్రపంచంలో ఇన్ని అభిప్రాయ భేదాలు వైరుధ్యాలు చోటు చేసుకొని అనేక ఆందోళనలకు, అలజడులకు కారణమవుతున్నాయి. దేశాలను విడదీసిన గోడలూ ఉన్నాయి. చైనా గోడ, బెర్లిన్ గోడ చరిత్ర ప్రసిద్ధాలే. మంగోల్ దాడులకు తట్టుకోలేక అప్పటి చైనా చక్రవర్తులు గోబీ ఎడారికి చైనా దేశానికి మధ్యగా పెద్ద గోడను నిర్మింపజేశారు. చైనా గోడను ప్రపంచ వింతల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. తూర్పు పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ అప్పట్లో బెర్లిన్ నగరంలో గోడను నిర్మించారు. ఒకే దేశంలోని మనుషులను వేరు చేస్తూ ఇటువంటి గోడను నిర్మించటాన్ని మానవతావాదులు వ్యతిరేకించారు. అనేక ఉద్యమాల దరిమిలా బెర్లిన్ గోడను పడగొట్టాక ఐక్య జర్మనీ ఏర్పాటయింది. విడదీసే గోడలు, కలిపే వంతెనలను గురించి చెప్పుకొనేటప్పుడు ఇటువంటి ఉదంతాలెన్నయినా గుర్తుకు వస్తాయి. సీతాదేవిని రక్షించి తీసుకురావటానికి కపి సైన్యంతో బయలుదేరిన శ్రీరామచంద్రునికి కల్లోల జలధి అడ్డువస్తుంది. సముద్రాన్ని దాటి లంకానగరం చేరాలంటే ''నాలుగామడ దాట నా నేర్పుమీద నా చేతగాదను నొక్క వానరుండు, ఎన్మిదామడ దాటనేర్తు మీద నా చేతగాదను నొక్కవానరుండు, పదియామడైన నే బరతెంతు మీద నా చేతగాదను నొక్కవానరుండు'' అంటూ కపి సైన్యం సముద్రాన్ని లంఘించి లంకానగరం చేరటం తమవల్ల కాదంటారు. అప్పుడు సేతువు నిర్మించటం అనివార్యమవుతుంది. సుగ్రీవుని ఆజ్ఞానుసారం వానర వీరులంతా కలిసి సముద్రంపై సేతువును కట్టటానికి పూనుకొంటారు. విశ్వకర్మకు ఔరస పుత్రుడైన నీలుడు అనే శిల్ప విద్యాప్రవీణుడు మిగతా వానరుల సహాయంతో సముద్రంపై సేతువును నిర్మింపజేస్తాడు. పురాణ ప్రసిద్ధమైన సముద్రంపై నిర్మించిన ఆ వంతెన ఆనవాళ్ళను దర్శించటం పుణ్యప్రదమని ఈనాటికీ భక్తులు నమ్ముతారు.
''సేతువు దర్శింప మహాపాతకములు బాసిపోవు'' అన్నారో పూర్వ కవి. కింద గలగలా పారుతున్న నీటితో నిండిన నదులపై నిర్మించిన వంతెనలను పర్యాటకులు ఉత్సాహంగా దర్శిస్తుండటం నేటికీ జరుగుతున్నదే. వంతెనలు దూరాలను కలుపుతూ మనుషులను, దేశాలను దగ్గర చేస్తుంటాయి. వంతెనలవల్ల కలిగే మార్పులు కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి ఇబ్బందులనూ కలిగించవచ్చు. ''అసలు మన ఊరికీ తిప్పలన్నీ ఆ బూసయ్య వొంతెనేయించాకే వచ్చిపడ్డాయి. వొంతినతోపాటూ బస్సులూ వచ్చాయి. ఊరి తీరే మారిపోయింది. అంతకుముందు బీడీలు, సిగరెట్లు, సోడాలు, కిళ్ళీలు మన ఊళ్ళో అమ్మేవారా? ఇప్పుడు ఆ మండి నొంతిన దగ్గర అన్నీ ఈ కొట్లే'' అంటుంది ఓ పల్లెటూరి ఇల్లాలు నార్లవారి 'వంతెన' అనే నాటికలో. వంతెనల వంటి వాటివల్ల పల్లెటూళ్ళకు పట్నవాసపు సంస్కృతులు రవాణా కావటం ఆమెకు ఇష్టం ఉండదు. మార్పులను ఎవరూ అడ్డుకోలేరు. ఓడ ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి ఓ దీవిలో చిక్కుబడిపోయాడు. ఏళ్ళు గడిచిపోతున్నా తిరిగి మామూలు ప్రపంచంలోకి వెళ్ళే మార్గం కనపడక అల్లాడిపోయాడు. అదృష్టవశాత్తు ఓరోజు ఓ ఓడ కనపడింది. సంతోషంతో అరుస్తూ తనను రక్షించి ఆ దీవిలోనుంచి తీసికెళ్ళమని ప్రార్థిస్తూ ఓడకు దగ్గరగా పరుగులు పెట్టాడా వ్యక్తి. ఓడ కెప్టెన్ మాట్లాడకుండా ఓ పేపర్లకట్ట అతనిమీదకు విసిరేసి ముందు అవి చదవమన్నాడు. ''పేపర్లు చదవటమేమిటి?'' అన్నాడా వ్యక్తి తెల్లబోతూ. ''ఆ పేపర్లు చదివితే ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది. అప్పటికి కూడా వస్తానంటే నా అభ్యంతరం లేదు తీసికెళతాను'' అన్నాడు కెప్టెన్ చల్లగా.

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో దేశాల మధ్యే కాదు ఖండాల మధ్య దూరమూ తగ్గిపోతోంది. ఖండాలను సైతం చేరువ చేసే కొత్తరకం సముద్ర గర్భసొరంగ మార్గాలు రూపొందుతున్నాయి. లోగడే ఇంగ్లీషు ఛానెల్ కింద జలగర్భ సొరంగ మార్గం ఏర్పడటంతో బ్రిటన్ ఫ్రాన్సులు దగ్గరయ్యాయి. ఆ ఛానల్ టన్నెల్ పుణ్యమా అని కేవలం 32 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తే చాలు ఇంగ్లాండు నుంచి ఫ్రాన్సుకు చేరిపోవచ్చు. ఇప్పుడు అదే పద్ధతిలో ఆఫ్రికా ఐరోపా ఖండాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో మరో సముద్ర గర్భ సొరంగ మార్గం నిర్మించే ప్రయత్నాల్లో పడ్డారు ఇంజినీర్లు. ఆఫ్రికాను ఐరోపా నుంచి వేరుచేస్తూ మధ్యదరా సముద్రం పరుచుకొని ఉంది. ఆ సముద్ర గర్భంలోనుంచే ఓ సొరంగ మార్గం తవ్వితే ఆ రెండు ఖండాల మధ్యా దూరం తగ్గిపోతుంది. మొరాకో, స్పెయిన్ ప్రభుత్వాలు ఆ సత్కార్యానికే పూనుకొన్నాయి. వీరు అనుకొన్న విధంగా సముద్రగర్భంలో సొరంగ నిర్మాణం సాగి, రైళ్ళు తిరిగితే- దక్షిణ స్పెయిన్‌లోని సెవెల్లి నగరంలో ఉదయం ఎనిమిది గంటలకు రైలెక్కినవారు తొమ్మిదిన్నర అయ్యేసరికల్లా మొరాకోలోని టాంజియార్ రేవు పట్టణం చేరుకుంటారు. ప్రస్తుతం నౌకలో ప్రయాణం చేసినా లేదా రైల్లో ప్రయాణం చేసినా అంతకు మూడు నాలుగురెట్లు ఎక్కువ కాలం పడుతోంది. ఆ కారణంగా జిబ్రాల్టర్ జల సంధినుంచి ఓ జలగర్భ సొరంగ మార్గాన్ని తవ్వి మొరాకో, స్పెయిన్ దేశాల మధ్య దూరాన్ని తగ్గించాలని ఉభయప్రభుత్వాలు సంకల్పించాయి. 600కోట్ల నుంచి 1300కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో, ఐరోపా సంఘం సహకారంతో ఆ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. సాంకేతిక రంగంలోనే అద్భుతమైన వింత అని చెప్పదగ్గ ఈ ప్రాజెక్టును సత్వరంగా పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో ఉన్నాయి మొరాకో, స్పెయిన్ దేశాలు. ''శాస్త్ర విజ్ఞానమద్భుత సరణి పెరగ మానవుడొనర్పలేనిదేదేని గలదె...'' అని కవికోకిల గతంలోనే చెప్పారు. ఆయన మాటలే నిజమవుతున్నాయి!
(Eenadu-18:02:2007)
--------------------------------------------------------------------------------

Labels:

Thursday, May 03, 2007

The Value of a Good Drink


Sometimes when I reflect back on all the wine I drink I feel shame. Then I look into the glass and think about the workers in the vineyards and all of their hopes and dreams .. If I didn't drink this wine, they might be out of work and their dreams would be shattered.

Then I say to myself, "It is better that I drink this wine and let their dreams come true than be selfish and worry about my liver."
~ Jack Handy

WARNING: The consumption of alcohol may leave you wondering what the hell happened to your bra and panties
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"I feel sorry for people who don't drink. When they wake up in the morning, that's as good as they're going to feel all day. "
~Frank Sinatra

WARNING: The consumption of alcohol may create the illusion that you are tougher, smarter, faster and better looking than most people.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"When I read about the evils of drinking, I gave up reading." ~ Henny Youngman

WARNING: The consumption of alcohol may lead you to think people are laughing WITH you.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"24 hours in a day, 24 beers in a case. Coincidence? I think not." ~ Stephen Wright

WARNING: The consumption of alcohol may cause you to think you can sing .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"When we drink, we get drunk. When we get drunk,we fall asleep. When we fall asleep, we commit no sin. When we commit no sin, we go to heaven. So, let's all get drunk and go to heaven!"
~ Brian O'Rourke

WARNING: The consumption of alcohol may cause pregnancy.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"Beer is proof that God loves us and wants us to be happy." ~ Benjamin Franklin

WARNING: The consumption of alcohol is a major factor in dancing like a fool.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"Without question, the greatest invention in the history of mankind is beer. Oh, I grant you that the wheel was also a fine invention, but the wheel does not go nearly as well with pizza." ~ Dave Barry

WARNING: The consumption of alcohol may cause you to tell your friends over and over again that you love them.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
To some it's a six-pack, to me it's a Support Group. Salvation in a can! ~Dave Howell

WARNING: The consumption of alcohol may make you think you can logically converse with members of the opposite sex without spitting.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
And saving the best for last, as explained by Cliff Clavin, of Cheers. One afternoon at Cheers, Cliff Clavin was explaining the Buffalo Theory to his buddy Norm.Here's how it went:

"Well ya see, Norm, it's like this... A herd of buffalo can only move as fast as the slowest buffalo. And when the herd is hunted, it is the slowest and weakest ones at the back that are killed first This natural selection is good for the herd as a whole, because the general speed and health of the whole group keeps improving by the regular killing of the weakest members. In much the same way, the human brain can only operate as fast as the slowest brain cells. Excessive intake of alcohol, as we know, kills brain cells. But naturally, it attacks the slowest and weakest brain cells first. In this way, regular consumption of beer eliminates the weaker brain cells, making the brain a faster and more efficient machine. That's why you always feel smarter after a few beers."

WARNING: The consumption of alcohol may make you think you are whispering when you are not
----------------------------------------------------------------------------

Labels: ,

[తెలుగుబ్లాగు:7159] Re: [తెలుగుబ్లాగు] Re: ఇంతమంది దేవుళ్ళు ఎందుకు?


On 5/2/07, noorbasha rahamthulla <nrahamthulla@gmail.com> wrote:
దళిత గోవిందం

డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన జరగాలని ఎందుకుకోరారు ? బౌద్దమతాన్ని ఎందుకు స్వీకరించారు? హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు.దళితులు,మైనారిటీలు తమకు జరిగే అవమానాలను దిగమింగుకోవాలి . తమ మాన మర్యాదలు మంటగలిసినా ఊరుకోవాలి.ఎందుకంటే వాళ్ళు మెజారిటీ వర్గీయులను ఎదుర్కోలేరు కాబట్టి. వాళ్ళు ఏది చెబితే అది వినాలి. విధేయతతో మసలుకోవాలి. యుద్దం చేయటం కన్నా ఓర్పుతో ఉండడం చాలా తేలిక. సంకుచిత మనస్తత్వం గల పిడివాదులనీ వర్గ విభేదం సృష్ఠించే వాళ్ళనీ ఏమీ అనలేక తమ వాళ్ళని తామే తిట్టుకోవడం అన్నిటికంటే తేలికైన పనిగా వీళ్ళు భావిస్తారు .

భారత ప్రభుత్వం లౌకికవాదాన్ని అతి చక్కగా కాపాడుతున్నది . అగ్రవర్ణ హిందువులు వర్గ విభేదాలు పాటించని లౌకికవాదులుగా మొత్తం ప్రపంచ దృష్టిలో పడేట్లుగాచేస్తుంది .దళితులు, మైనారిటీలు ఎలాంటి తిట్లైనా తినాలి, తన్నులు భరించాలి. వాళ్ళ దేవుళ్ళకి, ప్రవక్తలకి , మతాలకి ఎటువంటి అవమానం జరిగినా అంగీకరించాలి. అప్పుడే వాల్లని చాలా ఓర్చుకునే లౌకికవాదులుగా భుజం తడతారు. దళితులను,మైనారిటీలను ఎదిరిచటం చాల సులువైన పని ఎందుకంటే వారు సౌమ్యులు , దౌర్జన్యం చేయలేరు, అల్ప సంఖ్యాకులు. నిజమైన శత్రువుని ఎదుర్కోవటానికి ఎంతో దైర్యం కావాలి, కాబట్టి దళితులు, మైనారిటీలు ఏం చేస్తారంటే తమ శత్రువుని గౌరవిస్తూ తమ సొంత ప్రజలనే వ్యతిరేకిస్తారు. అందుచేత తమలోని బాధితులను ఆదుకోలేక బాధితులదే తప్పంటారు. అయినా వాళ్ళనుతీవ్రవాదులు, పిడివాదులు అంటారు, దాడులకు కారకులంటారు. అగ్రవర్ణ హిందూ ఉగ్రవాదులు మన దేశ లౌకిక నాగరికతను, సమగ్రతను దెబ్బతీస్తున్నా వాళ్ళను విమర్శించే ధైర్యం లేదు .

సమస్యలను గుర్తిస్తే వాటి పరిష్కారం కోసం మనం ప్రయత్నించాలి . పిరికిపందలు, తప్పించుకునే స్వభావం కలవారు ఈ సమస్యలను గుర్తించటానికి తిరస్కరిస్తారు . కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించరు. మనమంతాలౌకికవాదులం,శాంతినిప్రేమించేవాళ్ళం, అహింసావాదులం. కానీ మనకి ఏమి సరిపోతాయో వాటినే స్వీకరిస్తూ చేస్తాం.
కానీ లేఖనాలు చెప్పిన విషయాల్ని పాటించాల్సి వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తాం.
అధర్మాన్ని ఎదుర్కోవాలని - ఉపదేశాలు చేసే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర మత గ్రంధాలను మనం మర్చిపోయాం. కులవివక్ష అనేది తప్పు మరియు క్రూరమయినది . మన అసమర్ధతను కప్పిపుచ్చుకోవటానికి ఓర్పు, లౌకికవాదం అనే ముసుగును వాడుతున్నాం. అహింసావాదులమని చెప్పుకుంటాము. అధర్మాన్ని ఎదిరించకపోవటం మరింత అధర్మాన్ని ప్రొత్సహించడమే అవుతుంది . అది మరీ పాపకార్యం. నిప్పుకోడి మనస్తత్వం మనకు ఉపయోగపడదు. మన సమస్యలను పట్టించుకోకుండా గుడ్డి చూపుతో చూస్తే సమస్యలు పరిష్కారం కావు, పైగా సమస్యలు పెరుగుతాయి. గుడ్డివాడిలాగా బూకరిస్తే మరిన్ని కష్టాలు వచ్చిపడతాయి.

హిందువులు ద్వైతీయులు , అద్వైతీయులు, విశిష్టద్వైతీయులు, నాస్తికులు, జైన్లు, బుద్దులుగా ఉండవచ్చు. అలాగే వారికిష్టమైన ఏ దేవుడైనా, దేవతనైనా పూజించవచ్చు. హిందువులు ఎక్కువగా పూజలద్వారా, యాగాలుద్వారా, భాగవతమార్గంద్వారా , స్వాములను, బాబాలను దర్శించటం ద్వారా సమయాన్ని, ధనాన్ని మరియు శ్రమను ఖర్చు చేస్తారు. వాళ్ళు క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గౌరవిస్తారు . ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే, కొట్టినవాడికి రెండవ చెంప చూపించు అన్నాడు క్రీస్తు. క్రైస్తవ మతం హింసను బోధించడంలేదు.

హైందవేతర మత ప్రచారకుల యొక్క అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేస్తూ మధ్యప్రదేశ్ , ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో మతమార్పిడి నిషేధచట్టాన్ని తెచ్చారు . ఇప్పుడు తి.తి.దే. దళితుల్ని హిందూమతంలోనే ఉంచే ఉద్దేశంతో "దళిత గోవిందం" అనే కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది.దీనిని భారతీయ ముస్లిములకు వర్తింపచేస్తే ఎంతో బాగుంటుంది, ఎందుకంటే వారి పూర్వీకులు కూడా హిందువులే కదా! హిందూ సమాజం క్రమేణా దానిలోని వైరుధ్యాలను నియంత్రించుకుంటుంది . ఇప్పుదు వారు కులవ్యవస్ధను రద్దు చేసుకొని హిందువులందరూ సాంఘికంగా సమానులే అని చెప్పడానికి సిద్దపడుతున్నారు. కాబట్టి మనమంతా ఈ "దళిత గోవిందం "ని సాదరంగా ఆహ్వానిద్దాం.

ఈ దళిత గోవిందాన్ని దళిత ముస్లిములకు కూడా పొడిగిస్తే బాగుంటుంది . వారి తాత ముత్తాతలు కూడా హిందువులే... షేక్ శ్రీనివాసరావు, ఇబ్రహీం రాజు, మక్బూల్ నాయుడు, అహ్మద్ రెడ్డీ, గనీఖాన్ చౌదరి, సులేమాన్ మాదిగ.... మొదలగు వారు ఈ దళిత గోవిందాన్ని గురించి ఆలోచిస్తారు . హిందూత్వాన్ని ఒక మతంలా చూడకుండా ఒక జాతిగా చూడాలని హిందూనాయకులు కొందరు కోరుతున్నారు. తి.తి.దే. మత పెద్దలు కులవివక్ష నిర్మూలించటానికి ఈ పధకాన్ని రూపొందించారు. అందరు హిందువులు సాంఘికంగా ఆధ్యాత్మికంగా సమానులేనని చెప్పటమే ఈ కార్యక్రమ ఉద్దేశం. మన భారతీయ ముస్లిములు , క్రైస్తవుల పూర్వీకులు అరబ్ దేశాలనుండి రాలేదు. వారికీ పాకిస్ధానీయులకు ఎలాంటి సంబంధం లేదు. ఆత్మ గౌరవంకోసం, సాంఘిక సమానత్వం కోసం తపిస్తూ ఈ కులవివక్షను తట్టుకోలేక విసుగు చెంది ఇస్లామునీ ,క్రైస్తవాన్నీ అంగీకరించి స్వీకరించి వుంటారు.
ఒకవేళ తి .తి.దే. ఇలాంటి వాళ్ళందర్నీ హిందూత్వంలోకి తిరిగి మార్చటానికి మార్గాన్ని తెరిస్తే అది మంచి పరిణామమే. ఇది ఎలా సాధ్యం అంటారా ? కొంచెం సేపు ఆలోచించండి. హిందువులు అంత తేలికగా ముస్లిములుగా లేదా క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు? ధనం కోసమా? లేక సాంఘిక ఐక్యతతో కూడిన ఎగువస్దానం కోసమా ? లేక రెండింటి కోసమా? విశ్వాసం మీద, సిద్ధాంతాల మీద ఆధారపడిన ఆధ్యాత్మిక తౄప్తి కూడా వారి మీద ప్రభావం చూపుతుంది. కాని దానివల్ల భౌతికంగానో , ఆధ్యాత్మికంగానో ఉపయోగం ఉండాలి. ఇన్నాళ్ళూ దళితులను దేవాలయాల్ని దర్శించటానికి, పూజారులవటానికి, వేదాలు నేర్చుకోవడానికి అనుమతించలేదు , కాని ముస్లిములు, క్రైస్తవులు వారిని సోదరులుగా మనస్పూర్తిగా ఆదరించి పాస్టర్లుగా, ముల్లాలుగా చేశారు. హిందూ పెద్దలు ఇప్పటికైనా వారి తప్పుని తెలుసుకొని తప్పును సరిదిద్దుకుంటున్నారు . కాబట్టి అందరూ ఈ విప్లవాత్మకమైన పరిణామాన్ని ఆహ్వానించాలి. భవిష్యత్తులో అణగదొక్కబడిన కులస్దులకు హిందూత్వంలో ఏ మాత్రం సమాన హక్కులు ఇచ్చి సంఘంలో గౌరవంగా చూస్తారో మనమంతా వేచి చూడాలి . నన్ను హిందూత్వంలోకి ఆహ్వానించి బ్రాహ్మణిడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేస్తే ఆనందంగా స్వీకరిస్తాను . అందుకోసం నా బి.సి.రిజర్వేషన్ను కూడ వదులుకుంటాను. ఎందుకంటే మా తాత ముత్తాతలు పూర్వీకులు ఏ కులం నుంచి ఇస్లాంలోకి మారారో , నాకు తెలియదు.అలా మార్చటం కుదరదంటే హిందువులకు ఒకే ఒక మార్గం మిగిలింది: అదేంటంటే నాలుగు వర్ణాలను వందలాది కులాలను నిర్మూలించటం, అందర్నీ హిందువులని పిలవటం. దేవుడు ఒక్కడే కాని వేలపేర్లుతో పిలుస్తున్నారు. అతను ఎవరో తెలియదు, ఎవరికీ కనిపించడు కాని ఆయన సౄష్టించిన దళితులు , ముస్లిములు మన తోటి సహోదరులు. వారు మనకు మనలాగే మనంత సమానంగా కనిపిస్తారు. కులవివక్ష వర్ణవివక్ష అనేది మనిషి స్రుష్టించిన ఘోర పాపం. ఈ దళిత గోవిందం ద్వారా ఆ పాపకార్యానికి ప్రాయశ్చిత్తం జరుగుతోంది. మన తప్పులేకపోయినా మతవాదులు మానవత్వాన్ని మరచి మనపై ఆధిక్యాన్ని సంపాదించటానికి మనల్ని అనేక కులాలుగా విభజించారు . అప్పుడే పుట్టిన బిడ్డకు కులం గురించి తెలియదు కాని కాలక్రమేణా దాని గురించి తెలుపుతాము, ఎంత నీచమైన పద్దతి? ఎవరైనా తప్పు చేస్తే దాని ఆధారంగా కొన్ని తరాల తరువాత వారి వారసులను శిక్షించొచ్చా ? అది ఎంత వరకు న్యాయం? గొర్రెపిల్ల, తోడేలు కధ మనకు గుర్తు రావడంలేదా?

మనలో ఉన్న శక్తిని అంతఃకరణ శుద్ధికి వెచ్చిద్దాం . మన నమ్మకాలని మనం తేలికగా విడిచిపెట్టలేము. ఎవరు ఎలా పని చేయాలి? ఏ క్రమంలో, ఏ పద్ధతిలో చెయ్యాలో మన మతాల పెద్దలు నిర్ణయించారు . అవి ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నాయో విశ్లేషిద్దాం. లోపాలుంటే సరిచేద్దాం. అప్పుడే ఆధ్యాత్మిక సంతోషాన్ని పొందగలుగుతాము.
మన ధ్యాసంతా తప్పుడు పనులమీద ఉంది . మరో పక్క ప్రపంచం మంచిగా మారుతూ ఉంది.
మంచి మార్పుల్ని మనమూ స్వీకరించాలి , మారాలి.

ఆర్యులు భారతదేశానికి వలస వచ్చి కులవ్యవస్థను స్థాపించారని రొమిల్లా తాపర్ చెప్పారు .సెల్యులార్ అండ్ మోలికులర్ బయోలజీ హైదరాబాద్ డైరెక్టర్ లాల్జిసింగ్ ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 తర్వాత నుండే భారతదేశానికి వచ్చారనీ, కుల వ్యవస్థ అనేది 8000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందనీ అంటే మనిషి వేటాడడం నుండి వ్యవసాయానికి మారిననాటి నుండే ఏర్పడిందనీ చెప్పారు .

మన ఆలోచనలు ఇతరులకు శక్తినివ్వాలి . అవి ఇతరుల్ని మానసికంగా అణచివెయకూడదు.
అవి తిరోగమనంగా , వక్రంగా ఉండకూడదు. అవి ఇతరుల బుద్దిని హరించి అశక్తుల్నిగా చేయకూడదు. అనుత్పాదకంగా ఉండకూడదు.
కుక్కలు చింపిన విస్తరిలా చిరిగిపోయి చిన్నాభిన్నమై నిరాశతో ఉన్న దేశంలోకి ఒక కొత్త ఊపిరిని ఆశను తెద్దాం . వివేకవంతమైన ఉత్పాదకమైన ఆలోచన అశక్తులకు సరైన దారిని చూపిస్తుంది, నడిపిస్తుంది . అవివేకులను ఉత్తేజ పరుస్తుంది. అణగారిన వర్గాలను లేపుతుంది. ప్రతి మనిషికీ అంతులేని తెలివి ఉంటుంది. మనం బలంగా తయారవటానికి ఇతరులపై పడి దోచుకోవడం మానుకుందాం . మరొకరి చాకిరినీ, మేధాశక్తినీ ఉపయోగించుకొని బలంగా, మందంగా, కావరంగా తయారవ్వకూడదు.
ఇతరుల శక్తియుక్తులను పిండుకుని బలంగా అహంకారులుగా తయారవ్వటం అభివృద్ధి యొక్క ప్రామాణిక న్యాయ సూత్రాలను అతిక్రమించినట్లే .
మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ప్రతి ఒక్కరికీ తెలిసుండాలి . తన కడుపూ తన స్వార్ధమే పరమార్ధమనే భావన జాతి నాశనానికి దారి తీస్తుంది.
"మీరు పెరగాలంటే ఇంకొకరు తగ్గాలా? మీరు ఇష్టులుకావాలంటే, ఇతరులు అంటరానివాళ్ళు కావాలా?
ఇతరులు మాత్రం అల్పులుగా , స్వల్పులుగా ఉండాలా?" ఇదే మీలో ఉన్న వినాశకర శక్తి.
మర్యాదస్తుడు మరొకరికి మర్యాదనిస్తాడు తనతో సమానగౌరవం ఇస్తాడు . నిరంకుశుడు ఇతరులకు స్వేచ్చను ఇవ్వడు. ఎల్లప్పుడు ఏది మంచో ఏది చెడో చెబుతూనే ఉండాలి .
స్వేచ్చ కోసం సమానత్వం కోసం , సోదరభావం కోసం పోరాటం చేయాలి. మిగతా ప్రజల్ని కూడా ఆలోచించి స్వేచ్చగా మాట్లాడనివ్వండి. స్వతంత్రంగా ఆలోచించటానికి సాహసం చేయండి, ఇతరులు కూడా స్వతంత్రంగా ఆలోచించేలా చేయండి.
అభివౄద్ది పెరుగుదల అందరి హక్కు అనే ప్రాధమిక న్యాయసూత్రాన్ని గౌరవించండి . ఓ వ్యక్తి అభివ్రుద్ది చెందడం, సమర్ధత ద్వారా సాధించడం అనేవి అపారమైన అవకాశాలు , అతనిలో దాగి ఉన్న నిపుణత మీద ఆధారపడి ఉన్నాయి. అతన్ని శత్రువుగా భావించి అణగదొక్కకూడదు.ఇతరులని పీడించి నాశనం చేయటానికి సమయాన్ని, ఆలోచనని, శక్తిని వృదాచేయవద్దు.ఉపయోగకరమైన గొప్ప పనులకోసం శక్తిని వెచ్చించండి. ప్రజలను నిరంకుశులై పీడించకండి.

మీలోని శక్తిని ప్రజావ్యతిరెకంగా వాడకండి . సంఘాన్ని విచ్చిన్నం చేయకండి. అందరి ఐక్యత కోసం అంటరాని తలంపుల్ని వదులుకోండి. అందర్నీ రానివ్వండి.అందరితో కలవండి. అదే పనిగా పడిన దెబ్బలు శతాబ్దాల తరబడి దళితుల్లో సృజనాత్మకతను, సకారాత్మక స్పందనను చంపేసాయి.అవమానాన్ని, పేదరికాన్ని తలరాతగా భావిస్తూ జీవనాన్ని గడుపుతున్నారు . పరాజితులై అవమానంతో నిరాశ చెందడం వల్ల వారిలో ఇక పైకి లేవాలి అనే చైతన్యం, శక్తి నశించింది. నకారాత్మక శక్తి ఆవరించింది.
నిరాశావాది తన నైరాశ్యాన్ని తలరాతగా భావిస్తూ తననుతానే శిక్షించుకుంటాదు . తాను ఎవరో, ఎందుకు పుట్టాడో, తానెలా ఉండాలో అన్నీ సోదాహరణంగా తెలుసుకుని నోరు మూసుకుని బ్రతుకుతాడు . నోరు విప్పినా, కాలు కదిలినా ఏం జరుగుతుందో అతనికి తెలుసు. అందుకే అతను తనపైతానే జాలి పడతాడు. తన మీద తనకే రోత కలుగుతుంది కాబట్టి తనను తాను తిరస్కరించుకుంటాడు . బాధే సౌఖ్యమనే భావనతో నాకెందుకింత పెద్ద వాలుగ అంటాడు. మిగతావాళ్ళతో నేను సమానుణ్ణి కాదనుకుంటాడు. కాబట్టి పోటీపడే శక్తులన్నీ పోగొట్టుకుని అడుక్కు తినే స్వభావాన్ని పెంచుకుంటాడు . మరొకరి అదుపాజ్ఞల్లో బ్రతకడంలోనే ఆనందిస్తాడు.
ఆధ్యాత్మికమైన స్వేచ్చ సృజనాత్మక శక్తికి జీవాన్నిస్తుంది . ఆధ్యాత్మికమైన స్వేచ్చ మనిషి ఎదుగుదలకు అపార అవకాశాలనిస్తుంది. దళిత గోవిందం ఈ ఆధ్యాత్మికమైన స్వేచ్చను ఇచ్చే ఒక ఆశాకిరణం .
మారిన వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడు . తనకు తాను సంపాదించుకుంటాడు.
అతని మనసు ఉత్తేజితమై వెలుగుతుంది . కొన్ని వందల సంవత్సరాల పాటు చీకటి గుహకు సూర్యుని కాంతి, చంద్రుని కాంతి ఎట్లా ఉంటుందో తెలియకపోవచ్చు. కాని చిన్న దివిటి కాంతి రెప్పపాటు కాలంలో చీకటిని చీల్చి వెలుగు తెస్తుంది . అలాగే ఈ వెలుగు చీకటి గుహలో ఉన్న దళితులు అనుభవిస్తున్న ఆధ్యాత్మిక అంధకారాన్ని చెదరగొడుతుంది. చీకటి చెరలో ఉన్న అతని ఆలోచనా శక్తులకు వెలుగునిస్తుంది.
వందల సంవత్సరాల తరబడి రాజ్యమేలిన హిందూ చీకటి తనంపై ఈ దళిత గోవిందం తన వెలుగును ప్రసరించింది . సాంఘిక, ఆధ్యాత్మిక సమానత్వం వైపు దారి చూపింది. దైర్యమిచ్చింది. అడుగులు వేయించింది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలి. అన్ని దేవాలయాల వాళ్ళూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ను, అర్చకులను అభినందిద్దాం.

------------------------------------------------------------

Labels: ,