My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, August 21, 2010

సత్తా చాటిన తెలుగు తేజం


పెదాలమీద చిరునవ్వు చెక్కుచెదరనివ్వని తెలుగు యువ సంచలనం అద్భుత స్వరప్రజ్ఞకు యావద్దేశం మంత్రముగ్ధమైన తరుణమిది. సుప్రసిద్ధ బ్రిటిష్‌ రియాలిటీ షోకి దేశీయ అనుసరణ 'ఇండియన్‌ ఐడల్‌' అయిదో అంకం పోటీల ఆసాంతం అగ్రగామిగా కొనసాగి, అంతిమ విజేతగా ఆవిర్భవించిన శ్రీరామచంద్ర స్వరసమ్మోహకశక్తి- ఆసేతుశీతనగాన్ని ఏకరీతిగా సంభ్రమాశ్చర్యపరచింది. స్వాతంత్య్ర దినోత్సవంనాటి పోటీల తుదిఘట్టంలో నెగ్గితే, జీవితాంతం ఆగస్ట్‌ 15న విజయోత్సవం చేసుకుంటానన్న తెలుగుతేజానిదే భారతీయ సుస్వరమని సినీ దిగ్గజం అమితాబ్‌ సమక్షంలో ఫలితం వెలువడ్డ మరుక్షణం- భాగ్యనగరంలో సంబరాలు మిన్నంటాయి. ఈ అపురూప కిరీటం కోసం దేశం నలుమూలలనుంచీ ఎకాయెకి లక్షా ఎనభైవేలమంది అభ్యర్థులు పోటీపడ్డారు. అంచెలవారీ వడపోతలో కడకు మిగిలిన రాకేశ్‌ మైనీ, భూమీ త్రివేదీలను అధిగమించడంలో శ్రీరామ్‌ చూపిన ప్రతిభ న్యాయమూర్తుల్నీ, వీక్షకుల్నీ తన్మయత్వంతో కట్టిపడేసింది. ఇప్పటిదాకా అభిజీత్‌ సావంత్‌, సందీప్‌ ఆచార్య, ప్రశాంత్‌ తమాంగ్‌, సౌరభీ దేబ్‌బర్మలకే పరిమితమైన ఇండియన్‌ ఐడల్‌ జాబితాలో మొట్టమొదటిసారి దక్షాణాదినుంచి ఒక తెలుగుబిడ్డ పేరు చేరడం- మనందరికీ గర్వకారణం. నాలుగేళ్లక్రితం 'ఇండియన్‌ ఐడల్‌ 2' పోటీల ఆఖరి ఘట్టందాకా నెగ్గే వూపు కనబరచిన కారుణ్య, సంక్షిప్త సందేశాల ప్రాతిపదికన బలాన్ని కూడగట్టడంలో వెనకబడిపోవడం తెలిసిందే. విశేష ప్రతిభ కలిగీ వట్టిచేతులతో ఇంటిముఖం పట్టే దుర్గతి మరో తెలుగువాడికి దాపురించరాదంటూ ప్రసారమాధ్యమాలు సాగించిన విస్తృత ప్రచారం- ఈసారి శ్రీరామచంద్రకు తులాభారంలో తులసిదళమైంది.

అసంఖ్యాక ప్రేక్షకుల ఆదరణ ప్రసాదించి, భావిజీవితాన్ని అమాంతం మార్చివేయగల ఇంతటి అసామాన్య విజయం ఆషామాషీగా ఒనగూడేది కాదు.
లక్షలూ కోట్లమందిలో ప్రత్యేక గుర్తింపు సాధ్యపడాలంటే కఠోరశ్రమ తప్పనిసరి. అదే, న్యాయవాది ఇంట కన్నుతెరిచి సహజసిద్ధ ప్రతిభకు పదును పెట్టుకుంటూ ఎదిగిన శ్రీరామ్‌ ఆయువుపట్టు. మేనమామతో సంగీత కచేరీలు చేసిన అనుభవం, ఏళ్ల తరబడి తెల్లవారుజామున ఆపకుండా సాగించిన కఠోర సాధన- శ్రుతిశుద్ధ మెలకువలతో అతడి గళాన్ని మార్దవం చేశాయి. ఎంత క్లిష్టమైన బాణీనైనా అలవోకగా పలికేలా రాటు తేల్చాయి. ఇండియన్‌ ఐడల్‌ పోటీల పొడుగునా అమీర్‌ఖాన్‌, సంజయ్‌దత్‌, లతా మంగేష్కర్‌, హేమమాలిని ప్రభృత ఉద్దండుల్ని విస్మయపరచిన శ్రీరామ్‌ స్వరధుని- ఎక్కడా శ్రుతి తప్పకుండా అలరించడానికి గట్టి పునాది అదే. ఈ తరహా పోటీల్లో గెలుపోటముల మధ్య తేడా ఉల్లిపొరంత పలచన. విజయాన్నీ పరాజయాన్నీ ఒకేలా ధైర్యంగా స్వీకరించగల మానసిక స్త్థెర్యం అత్యావశ్యకమనీ గెలుపొందిన క్షణాన తెలియజెప్పింది- అతడి ప్రథమ స్పందన. ఏకకాలంలో రెండు ఆస్కార్‌ పురస్కారాల్ని ఒడిసి పట్టినప్పుడు స్వరమాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌ వినమ్రతను మళ్ళీ తలపుల్లో నిలిపిన అరుదైన సందర్భమది! ఈటీవీ నిర్వహించిన 'సై' కార్యక్రమం తుది సమరందాకా మెరిసి, 'ఒక్కరే' పోటీల్లో అద్వితీయుడనిపించుకున్న శ్రీరామచంద్రకు- తెలుగు సినిమాల్లో పాటల అవకాశాలు ఇప్పటికే తలుపు తడుతున్నాయి. సాధించినదాంతో తృప్తిచెందితే అంతటితో ఎదుగుదల ఆగిపోయినట్లే. జాతీయస్థాయిలో తానేమిటో నిరూపించుకోవాలన్న పంతం, తెలుగువాడి సత్తా చాటాలన్న అభిలాష- తనను ముందుకు ఉరికించాయంటున్న ప్రతిభావంతుడి ఈ ప్రస్థానం మరెందరిలోనో స్ఫూర్తి రగిలించక మానదు. దేశం గర్వించే గాయకుడిగా ఎదగడమే ఏకైక లక్ష్యమంటున్న మైనంపాటి వంశాంకురానికి ఇక ఆకాశమే హద్దు!

కలలు అందరూ కంటారు. వాటిని సాకారం చేసుకోవడానికి అహరహం శ్రమించేవాళ్లే విజయులవుతారు. జాతీయస్థాయికోసం తపిస్తున్న శ్రీరామ్‌ స్వరయాత్రలో ఇప్పటికిది మొదటి అడుగు. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం హిందీ చిత్రాలకు పాటలు పాడి సంగీతానికి ఎల్లలు లేవని సాధికారికంగా చాటిచెప్పారు. అనంతరకాలంలో దక్షిణాదికి ఉత్తరాది గాయకులు విరివిగా వలస రావడమే తప్ప, ఇటునుంచి అటు గట్టిపోటీ ఇవ్వగల గళం కరవై ఇన్నాళ్లూ చిన్నబోయిన తెలుగుజాతికి దొరికిన పాటల తేనెల వూట శ్రీరామచంద్ర! విలక్షణ గాయకుడిగా రాణించాలన్న తహతహ ముంబయివైపు పరుగులెత్తిస్తోందంటున్న అతడి భుజస్కంధాలపై- తెలుగువారు మరెవరికీ తీసిపోరని అడుగడుగునా నిరూపించాల్సిన బృహత్తర బాధ్యత ఉంది. పాప్‌ సంగీత చక్రవర్తి మైకేల్‌ జాక్సన్‌ 'థ్రిల్లర్‌' సంపుటిలో ఒకపాట- 'అతడి నమ్మకాన్నీ అనంతమైన ఆనందాన్నీ తుంచివేయాలని ఎవరెన్ని విధాల ప్రయత్నించినా... అదృశ్య కవచమేదో రక్షిస్తోంది' అంటూ సాగుతుంది. ఎంత గట్టిపోటీ ఎదురైనా ఇరవై నాలుగేళ్ల శ్రీరామ్‌ను ధీమాగా, స్థిరంగా పురోగమింపజేస్తున్న ఆ అదృశ్య కవచం పేరు... నిరంతర సాధన, అంతకుమించిన పట్టుదల! మరుగునపడి ఉండిపోరాదన్న ఏకైక దీక్షతో ఎంచుకున్న రంగాన చిచ్చరపిడుగులై చెలరేగిన గోపీచంద్‌, లక్ష్మణ్‌, హరికృష్ణ, హంపి, మల్లేశ్వరి, సానియా, సైనాలాంటి తెలుగుతేజాల సరసన సరికొత్త వెలుగుదివ్వె శ్రీరామచంద్ర. సప్త స్వరాన్వితమైన సంగీత సాగరాన్ని మధించి గానామృతాన్ని సాధించే సుదీర్ఘ ప్రయాణానికి ఇది ఆది కావాలి. కన్నవారికి, సొంతరాష్ట్రానికి పేరుతెచ్చి- రసజగత్తును సంగీతార్ణవంలో ఓలలాడించే తెలుగు జాతిరత్నమై మనవాడు వెలుగులీనాలి!


____________________________________

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, న్యూస్‌టుడే: : బాలీవుడ్‌ గాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడమే ఇపుడు నా ముందున్న పెద్ద కల అని అంటున్నాడు... ఇండియన్‌ ఐడల్‌-5 మ్యూజిక్‌ రియాలిటీ షో విజేత శ్రీరామచంద్ర. బాలీవుడ్‌ గాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే ముందు... స్వరమాంత్రికుడు ఎఆర్‌ రెహమాన్‌తో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ''ఫైనల్స్‌లో విజయం సాధించే లక్ష్యంతో ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేచాను. ఇవ్వాళ (సోమవారం) కూడా లేచాను. ఇపుడు నేను మామూలు శ్రీరామ్‌ని కాదు. ఈ షో నాకు కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది'' అంటూ శ్రీరామ్‌ తన మనసులో మాటలను పంచుకున్నాడు. ''యాశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ కోసం పాట పాడటం గొప్ప అదృష్టం. ఇండియన్‌ ఐడల్‌ షో వల్లనే ఇది సాధ్యమవుతోంది'' అని అంటాడు శ్రీరామ్‌. తనకు అన్ని రకాల పాటల్నీ పాడాలని ఉందని, సొంతంగా ఒక ఆల్బం కూడా చేసే కోరిక ఉందని తెలిపాడు. ప్రస్తుతం పార్టీ మూడ్‌లో ఉన్న శ్రీరామ్‌ హైదరాబాద్‌ చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇండియన్‌ ఐడల్‌-5 విజేత శ్రీరామచంద్ర తండ్రి సంగీత ప్రియుడే.. 1975-78 ప్రాంతంలో ఆయన పాటలు పాడేవారు.. ఓ సినిమాలోనైనా పాడే అవకాశం వస్తే బాగుండును అని ఎన్ని కలలు కన్నారో..! అవి కలలుగానే మిగిలిపోయాయి. న్యాయవాద వృత్తిలోనే స్థిరపడిపోయారు. అయితే... తండ్రి కోరికను శ్రీరామచంద్ర నిజం చేశాడు. తను కూడా తండ్రిలాగానే గాయకుడు కావాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోవడమే కాకుండా తన గానంతో తెలుగోడి సత్తాని ప్రపంచానికి చాటిచెప్పాడు.

తాను కన్న కలల్ని కొడుకు నిజం చేసినందుకు శ్రీరామచంద్ర తండ్రి ఎస్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పొంగిపోతున్నారు. ఆయన ఆనందానికి అవధుల్లేవు. ఫైనల్‌ కార్యక్రమంతో నిద్ర కరువై హోటల్‌ గదికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీరామచంద్ర తండ్రి... ప్రసాద్‌ను 'న్యూస్‌టుడే' ఫోన్‌లో పలకరించింది. ఆయన ఏమన్నదీ... ఆయన మాటల్లోనే... ''సాధారణంగా టీవీ షోల్లో విజేతను మైక్‌ ద్వారా ప్రకటిస్తుంటారు. ఇందులో అమితాబ్‌ రిమోట్‌ బటన్‌ నొక్కగానే కొద్దిసేపటికి విజేతగా శ్రీరామ్‌ ఫొటో కనిపించింది. ఆక్షణం.. కలా.. నిజమా అని అనిపించింది. మా ఆవిడ జయలక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. జీవితంలో మరవలేని క్షణాలవి..! మాకు ఎనలేని పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాడు. అంత పెద్ద నటుడు అమితాబ్‌ను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆలింగనం చేసుకుని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నాకు ఎప్పుడు వాయిస్‌ ఇస్తున్నావని శ్రీరామచంద్రతో ఆయన అన్నాడంటే అంతకంటే గొప్ప ప్రశంస మావాడికి ఇంకేం ఉంటుంది? ఇది తెలుగు ప్రజల విజయం''.

(ఈనాడు, ౧౭:౦౮:౨౦౧౦)
____________________________________

Labels: , ,

జీవిత పరమార్థం

'కోటి గ్రంథాల సారాంశాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్పగలను. అదేమిటంటే- పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం' అన్నాడు కవి కులగురువు కాళిదాసు. 'పరోపకారార్థమిదమ్‌ శరీరమ్‌' అన్నది ఈ వేదభూమిలో నిత్యం ప్రతిధ్వనించే రుషివాక్కు. సమాజంలో సౌభ్రాతృత్వ భావన వెల్లివిరియడానికి, మనసున విశాల దృక్పథం పెంపొందడానికి, మనుషుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లడానికి- యావత్‌జగత్తుకు ఈ నేల అందించిన దివ్యసందేశమది. శరీరమున్నది ఇతరులకు ఉపకారం చేయడానికేనన్న ఆ ఆర్యోక్తికి భారతీయ సంస్కృతి యుగయుగాలుగా పట్టం కడుతూనే ఉంది. మనిషి సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడటంకంటే పుణ్యప్రదమైన కార్యమేముంటుంది? స్వకార్యాల కోసమేకాక, ఇతరులకు ఉపకారం చేయడానికీ శరీరాన్ని సాధనంగా మలచుకోవలసింది మనిషే. 'అనిత్యాని శరీరాణి' అంటూ అందరికీ బోధించేవారిలో చాలామంది, స్వవిషయంలో మాత్రం 'అంతా మాకే రానీ' చందంగా వ్యవహరించడం కద్దు. తనువు అశాశ్వతం, సిరులు అస్థిరం, భోగభాగ్యాలు తాత్కాలికమన్న ఎరుకతో- తమ శక్త్యానుసారం సాటివారిని సమాదరించే వితరణశీలురూ ఎందరో ఉన్నారు ఈ లోకంలో. 'జీవితం కరిగిపోయే మంచు/ ఉన్నదాంట్లోనే నలుగురికీ పంచు' అన్న కవి వాక్కును సార్థకం చేస్తూ ఆపన్నహస్తం అందించేవారు ఆర్తుల పాలిట ఆప్తులూ ఆత్మబంధువులే. మనిషికి అమ్మ ఒడిలాంటి ప్రకృతి కూడా పరోపకారతత్వానికి ప్రతీకే. దాహార్తిని తీర్చే సెలయేరు, వూరటనిచ్చే చిరుగాలి, ఛత్రమై నిలిచే చెట్టునీడ- ప్రకృతి ప్రసాదితాలైన ఇవన్నీ తమ ఉనికి పరుల మేలుకేనని చాటుకుంటున్నవే.
స్వసుఖాలకంటే సామూహిక శ్రేయానికే పాటుపడటం సత్పురుషులకు సహజాలంకారం. 'తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాప్తకుల్‌ సజ్జనుల్‌...' అన్నాడు సుభాషితకర్త భర్తృహరి. అలా- పరోపకారమే పరమావధిగా తమ జీవిత ప్రస్థానం సాగించిన మహనీయులు ప్రజల గుండెల్లో భగవత్‌ స్వరూపులుగా కొలువై ఉంటారు. రామానుజాచార్యుల చరితమే అందుకు దృష్టాంతం.
ఎవ్వరికీ చెప్పకూడదంటూ గురువు తనకు ఉపదేశించిన తిరుమంత్రాన్ని రామానుజులవారు అందరికీ వెల్లడించారు. గురువుకు ఇచ్చిన మాట తప్పి- 'ఓమ్‌ నమోనారాయణాయ' అన్న ఆ మంత్రాన్ని బహిర్గతం చేయడంవల్ల తనకు నరకం ప్రాప్తించినా ఫరవాలేదన్నారు. ఓ గోపురశిఖరం పైకి ఎక్కి... జాతి, మతం, కులవిచక్షణ లేకుండా సమస్త ప్రజానీకం చెవిన పడేలా ఆ మంత్రాన్ని ఎలుగెత్తిచాటారు. తిరుమంత్రం మహిమ 'ఇంతమందికి మోక్షాన్ని, స్వర్గాన్ని ప్రసాదిస్తున్నప్పుడు- నేనొక్కణ్నీ నరకానికి పోవలసివస్తే మాత్రమేం, ఆనందంగా వెళ్తాను' అన్న నిండుమనసు ఆయనది.
పరుల మేలుకోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించినందునే శిబి చక్రవర్తి, దధీచి మహర్షి మహాదాతలుగా చిరకీర్తిని సొంతం చేసుకున్నారు. దానశీలత, ధర్మనిరతి, దయాగుణం, సత్యవచనం, రుజువర్తనం- 'రాజుల పాలిటికివి రాజయోగంబులు' అన్నాడు వేమన. ఆ గుణగణాలన్నీ మూర్తీభవించిన శిబి- తనను శరణు వేడిన పావురాన్ని రక్షించడంకోసం ప్రాణాల్ని అర్పించడానికీ సిద్ధపడ్డాడు. దానవ సంహారార్థం ఆయుధాలను అర్థిస్తూ తన కడకు వచ్చిన దేవతల కోసం శరీరాన్నే త్యజించిన రుషి దధీచి.

జీవసమాధి పొందిన దధీచి వెన్నెముకే దేవేంద్రుడి వజ్రాయుధంగా రూపుదాల్చిందని ప్రతీతి.
సశరీరంగానే కాదు, మరణానంతరమూ మానవదేహానికి పరమార్థం లోకోపకారమేనన్నది శిబి, దధీచి వృత్తాంతాలు బోధిస్తున్న నీతి.

'మ్రోడు మందారాలు పెడుతుంది/ అటు చాపి, ఇటు చాపి అభయహస్తాలల్లి/ జగమంత పందిరిని కడుతుంది' అంటూ చెట్ల జీవలక్షణాన్ని అక్షరీకరించారు కృష్ణశాస్త్రి ఓ కవితలో. శాశ్వతంగా జీవితం మోడువారే వేళ- పరోపకారానికి పందిరి పరవడం ద్వారా- తాము లేకున్నా తమ పేరు నిలిచిపోయేలా పుట్టుకను సార్థకం చేసుకుంటున్నవారెందరో. మరణానంతరమూ సమాజానికి ఉపయోగపడాలన్న సదాశయంతో- వైద్య పరిశోధనల నిమిత్తం తమ పార్థివ శరీరాన్ని ఆసుపత్రులకు అప్పగించాలని ఆకాంక్షిస్తున్నవారున్నారు. లోకమంతా చీకటైపోయినవారికి తమ కళ్లతో వెలుగులు పంచాలని కోరుకుంటున్నవారున్నారు. ఆ మేరకు వాగ్దాన పత్రాలపై వారు సంతకాలు చేస్తున్నారు కూడా. ప్రమాదవశాత్తో, ఇతరత్రానో మృత్యుముఖంలోకి వెళ్లిన తమ పిల్లల అవయవాలను- ఇతరులకు అమర్చడానికి పెద్దమనసుతో సమ్మతి తెలుపుతున్న తల్లిదండ్రులున్నారు. ఓ చిన్నారి... ముప్ఫై ఏళ్లలోపు వయసున్న ఓ జంట కలల పంట... పుట్టిన నాలుగోరోజునే కనుమూసింది... అమ్మకు, అయ్యకు గుండెకోత మిగిల్చి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఈ మధ్యనే... పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువున అదిమిపట్టి ఆ తల్లి తన పసికూన అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. భర్త, బంధువులు ఆ మహత్కార్యాన్ని ప్రోత్సహించారు. ఆ కసిగందు హృదయనాళాలను ఇద్దరు పసివాళ్లకు, కళ్లను మరో ఇద్దరు బిడ్డలకు అమరుస్తామంటున్నారు వైద్యులు. అమ్మ పక్కలో పడిన తరవాత నాలుగు రోజులకే మృత్యుఒడిలోకి చేరిన పాప- భౌతికంగా లేకపోవచ్చు. కానీ, ఆ చిట్టితల్లి- తన హృదయనాళాలు అమర్చిన ఇద్దరు చిన్నారుల ప్రాణస్పందనలో ఉంటుంది. తాను దృష్టి ప్రసాదించిన మరో ఇద్దరు చిన్నారుల కళ్లల్లోనుంచి ఈ లోకంలోని అద్భుతాలను, సౌందర్యాన్ని వీక్షిస్తూనే ఉంటుంది. 'మృతినెరుంగని ఒంటిదేవతలకన్న/ నలుగురికి మేలు చేసెడి నరుడె మిన్న' అన్న గాలిబ్‌ సూక్తికి ప్రతిబింబమై వెలుగులీనుతూనే ఉంటుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౨౫:౦౭:౨౦౧౦)
____________________________

Labels:

జయహో కృష్ణరాయ!


'కారే రాజులు, రాజ్యముల్‌ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై బేరైనం గలదే...?' అన్నాడు పోతనామాత్యుడు భాగవతంలో. బలిచక్రవర్తి నోట ఆయన పలికించిన ఆ సత్యవాక్కు అక్షరాలా ఆణిముత్యమే. ఈ లోకయాత్ర ముగిసిన వేళ- సిరులూ సంపదలూ తమ వెంట తీసుకువెళ్లలేరెవరూ. ఎన్ని రాచరికాలు, ఎంతమంది రాజులు, ఎవరి ఏలుబడులు ప్రజల స్మృతిపథంలో ఇప్పుడు నిలిచి ఉన్నాయి? స్థాపించిన సామ్రాజ్యాలు, మిడిసిపాటుతో సాగించిన దొరతనాలు, కట్టుకున్న సౌధాలు, కూడబెట్టిన సిరులతోపాటు తమ నామధేయాలూ కాలగర్భంలో కలిసిపోయిన ఏలికలు ఎందరో! జనరంజకంగా, యశఃకాములై ప్రవర్తిల్లినవారి పేర్లే జగత్తులో చిరస్థాయిగా వర్ధిల్లుతాయి. వారి కీర్తిసౌరభాన్ని వందలు, వేల ఏళ్లయినా వెదజల్లుతూనే ఉంటాయి- అదృశ్యంగా. తెలుగునేలను సంతోష చంద్రశాలగా, శౌర్యస్థలిగా, సకల కళల కాణాచిగా తేజోమయం చేసిన ప్రభువు కనుకనే శ్రీకృష్ణదేవరాయల పేరు- చెక్కుచెదరని శిల్పంలా, చెరిగిపోని శిలాక్షరంలా నేటికీ సజీవంగా మిలమిలలాడుతోంది. అయిదేళ్ల ఏలుబడితోనే మొహం మొత్తించే పాలక నిక్షేపరాయళ్లున్న ఈ రోజుల్లోనూ- అయిదు శతాబ్దాల క్రితంనాటి ఏలిక కృష్ణరాయల పేరు సమ్మోహన మంత్రమై మోగుతూ అందరికీ చిరస్మరణీయమవుతుండటం అందుకు దాఖలా. ఆయన పట్టాభిషిక్తుడై అయిదువందల ఏళ్లు దాటిన సందర్భమిది. రాజకీయంగానే కాక, సాంస్కృతికంగానూ దక్షిణాపథాన్ని ఏకం చేసిన రాయలవారిని స్మరించుకుంటూ తెలుగుజాతి వేడుకల్ని నిర్వహిస్తున్నది అందుకే.

తెలుగునేలను ఏలిన విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణరాయలు స్వతహాగా కన్నడ దేశస్తుడు. అమ్మపలుకు తుళు. సంస్కృతంలో కావ్యాలల్లినవాడు. సకల భాషలకు జననిగా వాసికెక్కిన సంస్కృతంపైనా ఆయనకు మక్కువే. ద్రావిడ భాషా కుటుంబంలో పెద్దక్కగా పేరొందిన తమిళ'మొళి' మీదా గౌరవమే. వాటితోపాటు కన్నడ కస్తూరి పరిమళాల్నీ తన ఆస్థానంలో గుబాళింపజేసినవాడే. అయినా- పది బాసలు తెలిసిన ఆ ప్రభువు 'బాస యన యిద్ది' అంటూ ఎలుగెత్తి చాటి, మణిమకుటం పెట్టింది మాత్రం తెలుగుభాషకే! అందుకే ఆయన తెలుగు రాయలయ్యాడు. తెలుగువారికి ఆరాధనీయుడయ్యాడు. బంగారు పళ్లెరానికి గోడ చేర్పువలె- భాషకు పాలకులు గొడుగుపడితే, సారస్వత వికాసం మూడు పూవులూ ఆరు కాయలుగా విరాజిల్లుతుందనడానికి... రాయల పాలనలో అపూర్వ గౌరవాదరాలను సొంతం చేసుకున్న తెలుగు వెదజల్లిన విద్వత్‌కాంతులే తార్కాణం. ఆ కాలంలో తెలుగు అక్షరం కొత్త నడకలు నేర్చింది. కొత్త సోయగాలు సంతరించుకుంది. 'మరపురాని హొయల్‌' చిలికించింది. ప్రబంధమై నర్తించింది. ఆచార్య రాయప్రోలు అన్నట్లు 'విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్లు' కప్పించిన రోజులవి. సారస్వత మూర్తులను 'న భూతో...' అన్న రీతిన సమ్మానించిన రాజు రాయలవారే. మనుచరిత్ర కర్త ఆంధ్రకవితా పితామహుడు పెద్దనామాత్యుడు 'ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి/ కేలూత యొసగి యెక్కించు'కున్నవాడు ఆయన. తనకు అంకితమిచ్చిన ఆ ప్రబంధాన్ని స్వీకరించేవేళ, పెద్దన పల్లకిని 'తనకేల యెత్తి పట్టిన'వాడు. తెలుగు కవీంద్రుడు ఆనాడు కవితా రాజసంతో దక్కించుకున్న రాజ లాంఛనమది! హృద్యమైన పద్యం వినిపిస్తే 'స్తుతమతి ఐన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకెట్లు కల్గె/ ఈ అతులిత మాధురీ మహిమ?' అంటూ పరవశించిన కవితా పిపాసి రాయలు.

రాయలవారి 'భువనవిజయ' సభామంటపం సాహితీ గోష్ఠులకు వేదిక. అష్టదిగ్గజాలుగా విఖ్యాతులైన కవీశ్వరులకు నెలవు. సారస్వత చర్చలకు, కవితా పఠనాలకు ఆటపట్టు. తెలుగు సాహితీ సరస్వతి కొలువు తీరిన ఆస్థానమది. ఆంధ్రభోజుడు ఆయన! సమరాంగణంలోనే కాదు, సాహితీ రంగంలోనూ రాయలు సార్వభౌముడే. మనుచరిత్రము, వసుచరిత్రము, ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యము, శృంగారనైషధము- తెలుగు సాహిత్యంలో పంచ మహాకావ్యాలని ప్రతీతి. ఆముక్తమాల్యద కృతికర్త కృష్ణరాయలే. శృంగార నైషధాన్ని మినహాయిస్తే, మిగిలిన మూడు కావ్యాలూ రాయలవారి ఆస్థాన కవుల అమృత కరస్పర్శతో అక్షరాకృతి దాల్చినవే. తెలుగులోని అయిదు మహాకావ్యాల్లో నాలుగు, రాయల కాలంలోనే వెలువడటం- ఆయన హయాములో విద్యానగరం తెలుగు భాషాభారతిని సమున్నత పీఠంపై అధిష్ఠింపజేసిందనడానికి దర్పణం. తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగానిది ఓ అధ్యాయం. దానికి అంటుకట్టింది రాయల కాలమే. అప్పటివరకు అనూచానంగా వస్తున్న అనువాద కావ్య రచనల పద్ధతికి కవులు స్వస్తి చెప్పి, ప్రబంధ రచనా సంప్రదాయానికి శ్రీకారం చుట్టేలా బాటలు పరచినవాడు రాయలు. అనంతర కాలంలో తెలుగునాట రెండు, మూడు శతాబ్దాలు కొనసాగిన సంప్రదాయమది. అపారమైన ప్రతిభా వ్యుత్పత్తులతో, అనితరసాధ్యమనిపించే రీతిలో ఆయన రచించిన ఆముక్తమాల్యద- రాజనీతి, వైరాగ్య, భక్తి బంధుర మహాకావ్యంగా పండితుల ప్రశంసలందుకున్న ప్రౌఢ ప్రబంధం. రాయల యుగం తెలుగు సాహిత్యానికి సంబంధించి స్వర్ణ శకం. ఆయన ఆస్థానంలో అగ్రపూజలందుకున్నదీ, అందలాలెక్కిందీ తెలుగు భాషే. కవుల్ని ఎత్తుపీటపై నిలపడమే కాదు, స్వయానా తానూ తెలుగులో మహాకావ్యం రాసిన రాజకవి కృష్ణరాయలు. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగు/ ఏను తెలుగు వల్లభుండ, తెలుగొకండ/... దేశ భాషలందు తెలుగు లెస్స' అంటూ రాయలు కట్టిన పద్యం- ప్రతి తెలుగు ముంగిటా నిత్య రంగవల్లికై వెలుగులీనాలి. ప్రతి తెలుగు గుండె తలుపునూ తట్టాలి. తెలుగువారి జాతీయగీతమై ఎదఎదలో రవళించాలి. తెలుగువారందరూ తెలుగు అక్షరానికి పట్టం కట్టినప్పుడే- రాయలవారి పట్టాభిషేక పంచశత ఉత్సవాలకు సార్థకత. తెలుగు రాయల స్మృతికి నికార్సయిన నివాళి అదే! (ఈనాడు, సంపాదకీయం, ౧౧:౦౭:౨౦౧౦)
____________________________

Labels: , ,

వానావానా వల్లప్పా...

వేసవి వేడి, వెన్నెల హాయి, చినుకు చురుక్కు, చలి గిలిగింత- అన్నీ మనిషి అనుభవించి కలవరించాల్సిన అనుభూతులే. విరగకాసే ఎండలు, విరబూసే చంద్రికలు, జలధారలై ఉరికివచ్చే వర్షాలు, జలదరింతలై పలకరించే చలిగాలులు- కాలచక్రంలో వరసక్రమంలో కదలాడే వర్ణోజ్జ్వల వలయాలే. అన్ని రుతువులూ ఆనందహేతువులు. వసంతం ఒళ్లు విరుచుకుంటే చెట్లకు చిగురింత; హేమంతం హసిస్తే మంచు బిందువులకు తుళ్లింత! 'పంచాంగంలో భయపడి దాక్కున్న వసంత రుతువును/ పంచమ ప్రాణంగా లాక్కుని, గుండెల్లో దాచుకున్నాను' అన్నాడు కవితాపయోనిధి దాశరథి. హేమంత రుతువులో గుమ్మడిపువ్వులో ఒయ్యారమొలికిస్తున్న హిమబిందువు- బుట్టలో కూర్చోబెట్టిన నవవధువులా ఉందని మురిసిపోయాడు కవిసమ్రాట్‌ విశ్వనాథ. నిరంతరం దొర్లుతూపోయే రుతుచక్రంలోని ఆకుల్లాంటి కాలాలు- ఒకదాని వెంబడి మరొకటి మనిషిని నిత్యం వెన్నంటే ఉంటాయి. వేసవి వేసంలో తీవ్రతీవ్రంగా నిప్పులు చెరగడం, వర్షనర్తనమై చినుకు చినుకునా హొయలు చిలకడం, శిశిరవీచికై చలిగాలుల్లో రివ్వురివ్వున రవళించడం- ప్రకృతిధర్మంగా మూడుకాలాలూ పునరావృతం చేసే విలాస విన్యాసాలు. వాటిలో మనిషి పరిభ్రమించక తప్పదు. మహాకవి పలుకుల్ని మననం చేసుకుంటూ, తాను 'ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా?/ వానకాలం ముసిరి రాగా నిలువు నిలువున నీరు కాలేదా?/ శీతకాలం కోతపెట్టగ కొరడుకట్టీ...' అని పలవరించకా తప్పదు. ఆయా కాలాల్లోని సౌందర్య మాధుర్యాల్నే కాదు, చేదు రుచుల్నీ స్వాగతించాల్సిందే. వడగాలులు భయపెట్టవచ్చు, జడివానలు జడిపించవచ్చు. అయితేమాత్రమేం, 'ఉగ్రమైన వేసంగి గాడ్పులు... ఆగ్రహించి పైబడినా అదరిపోవకు/ ఒక్కుమ్మడిగా వర్షామేఘం... వెక్కివెక్కి రోదించినా లెక్కచేయకు' అన్న కృష్ణశాస్త్రి కవితనే ధైర్యకవచంగా ధరించి, దారిదీపంగా వరించి ముందుకు సాగిపోలేమా!

ఆయా కాలాల ప్రభావాన్ని అంతకుముందరి రోజులతో పోలుస్తూ- గత కాలమె మేలు ప్రస్తుత కాలముకంటెనని ఉస్సురనడం కొందరికి రివాజు. ముఖ్యంగా వేసవిని ఆస్వాదించే వేళ అటువంటివారు మంచి గతమున కొంచెమేనని గుర్తించకపోవడమూ కద్దు. ప్రతిఏటా- నిరుటి ఎండలే నయమని నిట్టూర్చడం, నేటి ఎండలు భయంకరమని వాపోవడం వారికి పరిపాటి. నిజానికి వెనకటి రోజుల్లోనూ చండభానుడి చండ్రనిప్పులు లోకానికి కొత్తేమీ కాదు. పైన భగ్గున మండే సూర్యుడు పులికోరలా, బయట ఫెళ్లున కాసే ఎండ పాముపడగలా; రోడ్డుపైని ఎర్రటి మధ్యాహ్నం మంటల జుట్టును విరబోసుకున్న చందాన- యాభైఏళ్ల క్రితంనాటి వేసవి దినాలూ విజృంభించినట్లు రచయితలు అక్షరబద్ధం చేయడమే అందుకు దాఖలా. ఆ మాటకొస్తే- ఎండల కాలం మంటల కొలిమిలా మారడం శతాబ్దాల కిందటా ఉన్నదే. గ్రీష్మరుతువు అగ్నిశిఖల్ని విరజిమ్ముతున్నవేళ, వృక్షమూలాల్లో అణగిన నీడల్ని చూస్తుంటే అవి- మండుటెండల ధాటికి భీతిల్లి ఆ మాకుల కింద దూరాయా, లేక తమ దాహార్తిని తీర్చుకోవడానికి తమ నీడల్ని ఆ చెట్లే స్వయంగా తాగేశాయా... అన్నట్లుందని నన్నెచోడుడు అభివర్ణించింది పన్నెండో శతాబ్దిలో! శేషేన్‌ కవిత్వీకరించినట్లు 'చటుల దుర్జన రాజ్య శాసనము వోలె/ సాగె చండ ప్రచండ మార్తాండ రథము' అనిపించేలా దాదాపు ఎనిమిది వందల ఏళ్లక్రితమూ ఎండల కాలంలో సూర్యుడు అంతలా చెలరేగాడు! మనిషి వగచినా, వాపోయినా- ప్రతి కాలమూ కాస్త స్థాయీభేదాలతో తన ప్రభావాన్ని చూపుతూ అలా కదలిపోతూనే ఉంటుంది. దానిస్థానే కొత్తగా వచ్చి చేరే కాల లక్షణమూ అదే.

మొన్నమొన్నటిదాకా సెగలూ పొగలు కక్కి ఉడికించిన వేసవి- కాల యవనిక వెనక్కి జారుకుంది. తాపోపశమనాన్ని కలిగించి, సాంత్వన చేకూర్చగలదన్న ఊరింపులతో వర్షకాలం విచ్చేసింది. రుతుపవనాలు, వానలు మొదలయ్యాయి. చిన్ని చిన్ని చినుకులు, సనసన్నని తుంపరలు, చిరుచిరు జల్లులు, జడివానలు- ఇలా ఏ రూపాన ఉన్నా వర్షం ఎదల హర్షం కురిపించేదే. రుతుపవనాలు దోబూచులాడితే మనిషి నిరాశపడటం, దాగుడుమూతలు మాని అవి వానలై సాక్షాత్కరించాలని ఆకాంక్షించడం సహజం.వానలు మబ్బుల వెనకే తారట్లాడుతుంటే '...కురిసి తీరాలి వర్షాలు/ కొంచెకొంచెమేని రాలాలి తుంపరలేని; కాని ఉక్క మాత్రమేమాత్రమూ ఉండరాదు' అని ఆశించని వారెవరు? వర్షాలు మరీ విరుచుకుపడినా మనిషికి అసంతృప్తే. అలా కురిసిన ఏట- ఈసారి ఎప్పుడూ లేనంతగా భగ్గుమన్న ఎండలు, ఎన్నడూ ఎరుగనంత విపరీతంగా వణికించిన చలి మాత్రమే కాదు, వానలూ ఎడతెరిపి లేకుండా పడుతున్నాయే అని చికాకు పడుతుంటారు కొందరు. అందుకే- 'ఎండో, వానో, మబ్బో ఎలాగో ఒకలాగ ఉండాలి కదా వాతావరణం/ ఎలా ఉన్నా దాన్ని ఆడిపోసుకుంటేనే కాలహరణం' అంటూ మానవ స్వభావంపై చెణుకు విసిరాడు ఆరుద్ర. ఆకసంలో మబ్బులు కమ్ముకుంటే రైతు కళ్లలో ఆశల మెరుపులు. చినుకు రాలితే నేలతల్లి కంట ఆనందబాష్పాలు. వాన కురిస్తే చేనంతా చెమరింత. చిరుజల్లుల్లో ఆడుతూ పాడుతూ మురిసిపోయే పసి హృదయాల కేరింతలు. తుంపర్లలో తడుస్తూ చెట్టపట్టాలుగా సాగిపోయే పడుచు గుండెల్లో సంతోష తరంగాలు- అన్నీ వానల చలవే. మనిషిని వేధించి, బాధించే తులవతనమూ వాటికి ఉంది. అది అతివృష్టి కుంభవృష్టిగా ముంచెత్తి కూడు లేని, గూడు లేని దీనజనుల కడుపు కొట్టే వర్షాల దౌర్జన్యం- గుండెను కలుక్కుమనిపిస్తుంది. కాలకన్యకకు పొగరెక్కువనిపిస్తుంది!
((ఈనాడు, సంపాదకీయం, ౦౪:౦౭:౨౦౧౦)
_____________________________

Labels:

సంగీతార్థసారం


లలితకళలు మానసోల్లాసానికి స్వాగతద్వారాలు తెరిచి మనల్ని మంత్రనగరిలో విహరింపజేస్తాయి. అవి- తరతరాలుగా మనిషికి వారసత్వంగా సంక్రమించిన అపురూప సంపద. అక్షర విలాసంలో అనంత సాహిత్యం; కరచరణాల కదలికల్లో అపూర్వ నృత్యం; కంటి విన్యాసాల్లో నవరసాల సమ్మిళతమైన అభినయం; నాడులతీగలపై కదలాడే నాదం, గానం; గాలి తరంగాల మీదుగా పల్లవించే గీతం, సంగీతం- మనిషి సృజించిన మణిదీప్తులు. 'మాది' అని మానవలోకం సగర్వంగా చాటుకోవాల్సిన సిరులవి. ముఖ్యంగా మనిషికి అన్నిటినీ మించి ఒనగూడిన కలిమి- చదువులతల్లి సరస్వతమ్మ స్తన్య ప్రసాదమైన సంగీత సాహిత్యాలు. 'ఎవరికైనా ఆస్తి ఏముంటుంది?/ సంగీతంలో సప్తస్వరాలు/ సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు' అంటూ ఆరుద్ర స్వరాక్షరాలకు పట్టాభిషేకం చేశాడు కవితలో. భువన సమ్మోహనకరమైన రాగాలెన్నింటికో వూపిరులూదిందీ, హృదయాల్ని రసప్లావితం చేసే గీతాలెన్నింటికో రెక్కలు తొడిగిందీ ఏడంటే ఏడు స్వరాలే! వాయిద్యాలపై నాట్యమాడే చేతివేళ్లు, తీగలను మీటే వేలికొసలు- రసజగత్తును సంగీతార్ణవంలో ఓలలాడించేదీ సప్తస్వరాల తరంగాలపైనే! పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలున్నా అది- మోవికి తాకితే గేయాలై రవళిస్తుందన్నాడు వేటూరి. ఖాళీ వెదురుగొట్టాన్ని సైతం పాటల మంత్రదండంగా మార్చేది- పవన వీచికల పలకరింతల్లోని నిశ్శబ్ద సంగీతమే. స్పందించే హృదయం, అనుభూతించే మనస్సు, ఆస్వాదించే చెవులు ఉంటే- మౌనరాగాల్లోనూ మధురగానాలు వినవచ్చు. నిశ్చల సమాధిలో, కవితామతల్లిని స్మరించే వేళ- 'శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు... ఒక లక్ష నక్షత్రాల మాటలు, ఒక కోటి జలపాతాల పాటలు' విన్న మహాకవి మన శ్రీశ్రీ. 'తెలిపూల తేనె వాకలువారగా చేసి/ తెనుగువాగై సాగెనే- నెత్తావి తెనుగు పాటలు పాడెనే'- అంటూ కిన్నెరసాని నడకల సోయగాన్ని సంగీతమయం చేశారు కవిసమ్రాట్విశ్వనాథ.

అలసిన హృదయానికి సాంత్వన, చెదిరిన మనసుకు శాంతి లభించేది సంగీత రసాస్వాదనలోనే. గానం- తీయని కలలా పలకరిస్తుంది. కమ్మని కథలా అలరిస్తుంది. కలతల్ని మాపుతుంది. చింత తీరుస్తుంది. మంత్రలోకపు మణిమంటపాల్లో విహరింపజేస్తుంది. మనిషి మనసున మల్లెల మాలలూగించడానికే కదా ఆమనిలో కోయిల తన గొంతు సవరించుకునేది! 'మావిగున్న కొమ్మను మధుమాసవేళ/ పల్లవము మెక్కి కోయిల పాడుటేల? పరుల తనియించుటకొ?/ తన బాగు కొరకొ?/ గానమొనరింపక బ్రతుకు గడవబోకొ?' అన్నాడు కృష్ణశాస్త్రి. త్యాగయ్య కృతి, అన్నమయ్య సంకీర్తన, క్షేత్రయ్య పదం, మీరా భజన్- ఇలా మానవరూపంలో కదిలివచ్చినట్లనిపించే ఎందరో గానగంధర్వులు సంగీత సరస్వతిని స్వరార్చనతో కొలుస్తున్నదీ సకల జగదానందం కోసమే. స్వరలయాది రాగములను తెలియువారెందరో మహానుభావులు అన్న నాదబ్రహ్మవాక్కును సార్థకం చేసిన, చేస్తున్న నాదయోగులు, గానరుషులు పుట్టిననేల ఇది. సంగీతం- అవధులెరుగనిది. ఎల్లలు ఒల్లనిది. భాషాభేదాలు లేనిది. ప్రాంతీయతలు తెలియనిది. కొడవటిగంటి మాటల్లో చెప్పాలంటే- ' ప్రపంచంలో దివ్యత్వంతో కూడినది ఒకటే ఉంది, సంగీతం! కల్లబొల్లి న్యాయాలకూ, ధర్మాలకూ, నీతులకూ, బోధలకూ అతీతమైన'దది. అంతటి మహత్వశక్తి కనుకనే- ఆ రసఝరిలో మునకలేస్తున్నంతసేపూ మనుషులంతా ఒక్కటే. మనసులన్నిటా బ్రహ్మానందానుభూతులే! కనీసం ఆ కొద్దిసేపైనా- దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. జాతి పేరుతోనో, మతం మిషతోనో మనుషులు తమ మధ్య ఏర్పరచుకున్న సంకుచిత పరిధులు తుడిచిపెట్టుకుపోతాయి.

ప్రాక్‌, పశ్చిమం; కర్ణాటక, హిందుస్థానీ; జనపదం, జాజ్‌- ప్రాంతమేదైతేనేం, పేరేదైతేనేం... సంగీతం సంగీతమే. అది అమృతతుల్యం. ప్రణవనాదం నుంచి పల్లెపదం వరకు ప్రతిదీ మనసును వర్ణరంజితం చేస్తుంది. పవళింపుసేవ వేళ- 'ఉయ్యాలలూగవయ్యా, సయ్యాట పాటలను సత్సార్వభౌమా' అని భగవంతుడికి విన్నవించుకుంటూ సంప్రదాయ ఒరవడిలో భక్తుడు ఆలపించే జోలపాటా కర్ణపేయమే. పరమాత్ముడికి ప్రతిరూపమైన పసిపాపడికి జోకొడుతూ 'నాగస్వరమూదితే నాగులకు నిద్ర/ జోలల్లు పాడితే బాలలకు నిద్ర' అంటూ అమ్మ జానపద బాణీలో పాడే లాలిపాటా వీనులవిందే. లోకబాంధవుణ్ని నిద్రలెమ్మని వేడుకుంటూ 'శ్రీ సూర్యనారాయణా, మేలుకో' అని పెద్ద ముత్తయిదువులు ఆలపించే గానమూ మధురమే. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడని ప్రతీతి. వెలుగుల్ని ప్రసరించి, వేడిమిని పంచి, యావత్జగతిని తేజోమయం చేసే సూర్యుడు- సంగీత స్రష్ట అనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సౌరమండలం నుంచి సంగీతం వెలువడుతోందని, సూర్యుడి వెలుపలి వాతావరణం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం వేదికగా విభిన్న స్వరాలు సంచరిస్తున్నాయని- బ్రిటన్లోని షెఫీల్డ్విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. 'భానుడి బాహ్య వాతావరణంనుంచి దూరంగా జరుగుతున్న పెద్దపెద్ద అయస్కాంత వలయాలు- సంగీత వాయిద్యాలపైని తంత్రుల మాదిరిగా కంపిస్తున్నాయి. గాలి ఆధారంగా పనిచేసే వాయిద్యాల్లోని శబ్దతరంగాల్లా ఉన్నాయవి' అని వారు వివరిస్తున్నారు. ఉపగ్రహాల ద్వారా ఆ అయస్కాంత వలయాలను దృశ్యరూపంలో చిత్రించి, ప్రకంపనలను శబ్దాలుగా మార్చిన శాస్త్రజ్ఞులు, అవి శ్రవణానందకరంగా ఉన్నాయని తన్మయులవుతున్నారు. సౌరమండలంలోనే కాదు, నాలుగు వేదాలూ సంగీతాకృతిలోనే ఉన్న మనదేశంలో ప్రకృతీ సంగీతశోభితమే. ఇక్కడి జలపాతాల గలగలల్లో, గువ్వల కువకువల్లో, చినుకుల చిటికెల్లో సైతం రాగతాళాలు, శ్రుతిలయలు వినిపిస్తాయి.
(ఈనాడు, సంపాదకీయం, ౨౭:౦౬:౨౦౧౦)
_____________________________


Labels: ,

WHAT IS IN A NAME

A Burglar broke into a house one night. He shone his flashlight around, looking for valuables when a voice in the dark said;
Jesus knows you're here.”

He nearly jumped out of his skin, clicked his flashlight off, and froze. When he heard nothing more, after a bit, he shook his head and continued. Just as he pulled the stereo out so he could disconnect the wires, clear as a bell he heard;
Jesus is watching you.”

Freaked out, he shone his light around frantically, looking for the source of the voice. Finally, in the corner of the room, his flashlight beam came to rest on a parrot.

”Did you say that?” he hissed at the parrot.
”Yep” the parrot confessed and then squawked,

”I'm just trying to warn you that he is watching you.”
The burglar relaxed. “Warn me, huh? Who in the world are you?”

”Moses,” replied the bird.
”Moses?” the burglar laughed.
“What kind of people would name a bird Moses?”


”The kind of people that would name their Rottweiler Jesus.”


(an email forward)

___________________________________

Labels:

Brilliant Lawyer's Questions and Arguments


Things people have actually said in court, word for word, taken down and now published by court reporters that had the torment of staying calm while these exchanges were actually taking place.
____________________________________________
ATTORNEY: Now doctor, isn't it true that when a person dies in his sleep, he doesn't know about it until the next morning?
WITNESS: Did you actually pass the bar exam?
____________________________________
ATTORNEY: The youngest son, the twenty-year-old, how old is he?
WITNESS: He's twenty, much like your IQ.
___________________________________________
ATTORNEY: Were you present when your picture was taken?
WITNESS: Are you shitting me?
_________________________________________
ATTORNEY: She had three children, right?
WITNESS: Yes.
ATTORNEY: How many were boys?
WITNESS: None.
ATTORNEY: Were there any girls?
WITNESS: Your Honor, I think I need a different attorney. Can I get a new attorney?
____________________________________________
ATTORNEY: How was your first marriage terminated?
WITNESS: By death.
ATTORNEY: And by whose death was it terminated?
WITNESS: Take a guess.
____________________________________________
ATTORNEY: Can you describe the individual?
WITNESS: He was about medium height and had a beard.
ATTORNEY: Was this a male or a female?
WITNESS: Unless the Circus was in town I'm going with male.
______________________________________
ATTORNEY: Doctor, how many of your autopsies have you performed on dead people?
WITNESS: All of them. The live ones put up too much of a fight.
_________________________________________
ATTORNEY: ALL your responses MUST be oral, OK? What school did you go to?
WITNESS: Oral.
_________________________________________
ATTORNEY: Do you recall the time that you examined the body?
WITNESS: The autopsy started around 8:30 p.m.
ATTORNEY: And Mr. Denton was dead at the time?
WITNESS: If not, he was by the time I finished.
____________________________________________
ATTORNEY: Doctor, before you performed the autopsy, did you check for a pulse?
WITNESS: No.
ATTORNEY: Did you check for blood pressure?
WITNESS: No.
ATTORNEY: Did you check for breathing?
WITNESS: No.
ATTORNEY: So, then it is possible that the patient was alive when you began the autopsy?
WITNESS: No.
ATTORNEY: How can you be so sure, Doctor?
WITNESS: Because his brain was sitting on my desk in a jar.
ATTORNEY: I see, but could the patient have still been alive, nevertheless?
WITNESS: Yes, it is possible that he could have been alive and practicing law.
(An email forward)
_____________________________

Labels:

SOME Interesting Facts (Quite a few of these were eye-openers)

1. MOPED is the short term for 'Motorized Pedaling'.

2. POP MUSIC is 'Popular Music' shortened.

3. BUS is the short term for 'Omnibus' that means everybody.

4. FORTNIGHT comes from 'Fourteen Nights' (Two Weeks).

5. DRAWING ROOM was actually a 'withdrawing room' where people withdrew after dinner. Later the prefix 'with' was dropped.

6. NEWS refers to information from four directions North, East, West and South.

7. AG-MARK, which some products bear, stems from 'Agricultural Marketing'.

8. JOURNAL is a diary that tells about 'Journey for a day' during each day's business.

9. QUEUE comes from 'Queen's Quest'. Long back a long row of people as waiting to see the Queen. Someone made the comment Queen's Quest.

10. TIPS come from 'To Insure Prompt Service'. In olden days to get prompt service from servants in an inn, travelers used to drop coins in a box on which was written 'To Insure Prompt Service'. This gave rise to the custom of Tips.

11. JEEP is a vehicle with unique gear system. It was invented during World War II(1939-1945). It was named 'General Purpose Vehicle (GP)'. GP was changed into JEEP later.


12. Coca-Cola was originally green.

13. The most common name in the world is Mohammed.

14. The name of all the continents end with the same letter that they start with
except NA & SA .

15. The strongest muscle in the body is the tongue.

16. TYPEWRITER is the longest word that can be made using the letters only on one row of the keyboard.

17. Women blink nearly twice as much as men.

18. You can't kill yourself by holding your breath.

19. It is impossible to lick your elbow.

20. People say "Bless you" when you sneeze because when you sneeze, your heart stops for a millisecond.

21. It is physically impossible for pigs to look up into the sky.

22. The "sixth sick sheik's sixth sheep's sick" is said to be the toughest tongue twister in the English language.

23. Each king in a deck of playing cards represents a great king from the history:
Spades - King David
Clubs - Alexander the Great
Hearts - Charlemagne
Diamonds - Julius Caesar

24. Horse statue in a park:
- If a statue of a person in the park on a horse has both front legs in the air, the person died in battle.


- If the horse has one front leg in the air, the person died as a result of wounds received in a battle.
- If the horse has all four legs on the ground, the person died of natural causes.

25. What do bullet proof vests, fire escapes, windshield wipers and laser printers all have in common?
Ans. All invented by women.

26. A crocodile cannot stick its tongue out.

27. A snail can sleep for three years.

28. All polar bears are left handed.

29. Butterflies taste with their feet.

30. Elephants are the only animals that can't jump.

31. In the last 4000 years, no new animals have been domesticated.

32. On average, people fear spiders more than they do death.

33. Shakespeare invented the word 'assassination' and 'bump'.

34. Stewardesses is the longest word typed with only the left hand.

35. The ant always falls over on its right side when intoxicated.

36. The electric chair was invented by a dentist.

37. The human heart creates enough pressure when it pumps out to the body to squirt blood 30 feet.

38. Rats multiply so quickly that in 18 months, two rats could have over million descendants.

39.
Wearing headphones for just an hour will increase the bacteria in your ear by 700 times.

40. If you sneeze too hard, you can fracture a rib. If you try to suppress a sneeze, you can rupture a blood vessel in your head or neck and die.

41. The cigarette lighter was invented before the matchbox.

42.
Most lipstick contains fish scales

(An email forward)

_____________________________

Labels: