My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, April 24, 2007

Believe it or not!

------------------------------------------------------------------------------------

Labels:

Sunday, April 22, 2007

నమ్మి చెడినవారు లేరు...

'ఉన్నదని మనమూహించే అనిర్వచనీయమైన శక్తి ఏమిటో మనకు తెలియకపోయినా అదే ఈశ్వరుడు' అన్నారు గాంధీజీ. అన్ని మతాల సారాంశం కలిగిందీ, మనల్ని ఈశ్వర సాన్నిధ్యానికి చేర్చగలిగిందే అసలైన మతం అనీ అన్నారు. మనుషులు ఆలోచించటం మొదలుపెట్టినప్పటినుంచీ రకరకాల మతాలు పుట్టుకొచ్చాయి. ఎందరో దేవుళ్ళూ ఉద్భవించారు. మతాల కారణంగా యుద్ధాలు జరగటమూ రక్తపాతం సంభవించటమూ కొత్తకాదు. మత విశ్వాసాలు కలిగి ఉండటం తప్పుకాదు. తమ మతమే గొప్పదని ఇతర మతాలవారిని కించపరచటం, వారిపై ద్వేషభావం పెంచుకోవటం మాత్రం మంచిదికాదు. సకలజన సమ్మతమైనదే అసలైన మతం. 'మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నీ మనసుకు మబ్బైతే మతం వద్దు, గితం వద్దు మారణహోమం వద్దు' అన్నారు కృష్ణశాస్త్రి. ఎవరెన్ని సూక్తులు వల్లించినా నాటినుంచి నేటివరకూ మతం పేరుతో మారణహోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దారుణాలు చూసి సహించలేని కొందరికి అసలు మతాల పట్లా దైవం పట్లా నమ్మకం సడలిపోవటమూ జరుగుతోంది. ''మతములనుచు పుట్టి మన్వంతరములాయె మనుజునందు మిగిలె ధనుజ వృత్తి. మతము లెప్పుడింక మనుజుని పెంచురా?'' అని సూటిగా ప్రశ్నించారు నార్లవారు. ఎవరూ సమాధానం చెప్పలేని శేష ప్రశ్నలాగానే మిగిలిపోయిందది. భగవద్గీత, బైబిల్, ఖురాన్, గురు గ్రంథసాహెబ్ వంటి వాటిలోని సూక్తులను కలగాపులగం చేసేసి దడదడా లెక్చరిస్తున్న ఆ మహానుభావుణ్ని ''అసలు ఇంతకీ మీ మతం ఏమిటండీ?'' అని అడిగాడో పెద్దమనిషి. ''ఆయన్ది వేరే మతంలెండి, రెటమతం'' అని టక్కున జవాబు చెప్పింది పక్కనే ఉన్న ఆయన సతీమణి. ఈ బాపతు రెటమతస్థుల సంగతెలా ఉన్నా ప్రపంచంలో మత విశ్వాసాలు, భగవంతునిపట్ల భక్తి భావాలు పెరుగుతున్నాయే కాని తరగటం లేదు. దేవుళ్ళ సంఖ్యకూ కొదవలేదు. హిందువులు కొలిచేందుకు ముక్కోటి దేవతలున్నారు. చిల్లర దేవుళ్ళే కాక గ్రామదేవతలూ అసంఖ్యాకం.
జీవితంలో అభద్రతాభావం ఎక్కువవుతున్నకొద్దీ భక్తి పెరుగుతుంటుందని కొందరు మనస్తత్వ శాస్త్రవేత్తల విశ్లేషణ. ''భక్తియున్నచోట పరమేశ్వరుడుండు భక్తి లేనిచోట పాపముండు భక్తి గలుగువాడు పరమాత్ముడేనయా'' అన్నారు వేమనకవి. భక్తులు కానివారిపట్లా వాత్సల్యం ప్రదర్శింపజేసి ఆదుకోవటమే భగవంతుని లక్షణమని చెప్పే కథనాలు ఎన్నో ఉన్నాయి. తెనాలి రామకృష్ణకవి సృష్టించిన నిగమశర్మ, కందుకూరి రుద్రకవి కావ్య నాయకుడు నిరంకుశుడు స్వతహాగా దుడుకు మనుషులయినా భగవంతుని కరుణచే జగత్ప్రసిద్ధి పొందుతారు. నిరంకుశుడు సాక్షాత్తు పరమశివుణ్నే జూదానికి ఆహ్వానించి రెండువైపుల పందాలూ తానేవేసి పరమేశ్వరుడే ఓడిపోయాడని నిర్ణయించి పందెం ప్రకారం తన కోరిక చెల్లించమని సాక్షాత్తు ఆ శివుణ్నే నిగ్గదీయటం మనోహరమైన నిరంకుశోపాఖ్యాన కావ్యంగా రూపుదిద్దుకొంది. ''ఓ దేవుడా నా మనస్సు యిండిపెండెంటుగా సృజించావా లేక డిపెండెంటుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే నా యిష్టవొచ్చిన పనల్లా నేను చేశాను నువ్వెవరు అడగటానికి? లేక నన్ను డిపెండెంటుగా చేశావూ? అట్లాగయితే నువ్వే నా చేత పాపం చేయించావు గనక నీకే ఆ శిక్ష కావాల్సింది'' అంటూ ఓ కొత్త వితండవాదం లేవదీస్తాడు కన్యాశుల్కం ఫేం గిరీశం. ఆస్తికులున్నట్లే నాస్తికులూ ఉన్నారు. దేవుని ఉనికిపట్ల రకరకాల సందేహాలతో గందరగోళాలు సృష్టించేవాళ్ళూ ఉన్నారు.
చదువుకున్నవారిలో పట్నవాసపు జీవితాలకు అలవాటుపడినవారిలో మత విశ్వాసాలు తక్కువగా ఉంటాయని దేవునిపై నమ్మకమూ తక్కువని అందరూ భావిస్తుంటారు. అది సరికాదని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటీవల బయటపడింది. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అనే సంస్థ దాదాపు 7670మందిని కలుసుకొని దేవుని పట్లా మతం పట్లా వారి అభిప్రాయాల గురించి ప్రశ్నించింది. వారు పాటించే ఆచారాలు, దైవభక్తికి సంబంధించి ఆచరించే విధానాల గురించీ ఆరాతీశారు. ఆ సమాచారాన్ని విశ్లేషించి చూడగా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. పల్లె ప్రాంతాల్లో నివసించేవారికంటె పట్నవాసపు జీవితాలు గడిపేవారిలోను, చదువురాని వారికంటే చదువుకున్నవారిలోనే మత విశ్వాసాలు, దేవుని పట్ల నమ్మకం ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. పురుషుల్లో కంటే స్త్రీలలోనే మత విశ్వాసం అధికంగా ఉంటుందనీ తేలింది. పట్నవాసపు జీవితాల్లో పెరుగుతున్న ఒత్తిడీ తగ్గుతున్న స్థిరత్వం వంటివాటివల్ల వారు మతంపట్లా దైవంపట్లా మొగ్గుచూపుతున్నారని సర్వే నిర్వహించినవారు అభిప్రాయపడ్డారు. విద్యార్హతల సంగతెలా ఉన్నా సర్వేలో పాల్గొన్నవారిలో 93 శాతం భగవంతునిపట్ల అచంచల విశ్వాసం ప్రకటించారు. 64శాతం ఆలయం, మసీదు లేదా గురుద్వారాలకు క్రమం తప్పకుండా వెళతామని చెప్పారు. 53శాతం ప్రతిరోజూ దైవప్రార్థన చేస్తామని చెప్పారు. వారిలో విద్యాధికులే ఎక్కువ. 46శాతం దయ్యాలు భూతాలూ ఉన్నాయనీ నమ్ముతున్నారు. 24శాతం జ్యోతిష్యంపట్ల నమ్మకం ఉందన్నారు. మతపరమైన కార్యక్రమాలకు ప్రార్థనలకు తప్పకుండా హాజరవుతామని 68శాతం చెప్పారు. పార్టీల ప్రభావం వీరి అభిప్రాయాలపై ఏమాత్రం లేదని సర్వే నిర్వాహకులు వెల్లడించారు. టెలివిజన్‌లో ప్రసారమవుతున్న మతపరమైన కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయనీ, వాటి ప్రభావంవల్లా మత విశ్వాసాలు పెరుగుతున్నాయనీ పరిశోధకులు అంటున్నారు. కారణాలు ఏమైనా నమ్మి చెడినవారు లేరు- అన్న సిద్ధాంతం పట్ల మనుషుల్లో విశ్వాసం అధికమవుతున్నట్లుంది!

(Eenaadu;04:02:2007)
---------------------------------------------------------

Labels: ,

ఇతరులు మెచ్చిందే అందం !

''చూడదగినదైన జూడగ వలయురా'' అన్నాడు వేమన. సృష్టిలో అందానికి ఎంతో ప్రాముఖ్యముంది. పచ్చని చెట్లు, విచ్చిన పూలు, నీలం కొండలు, మెరిసే ఆకాశం, కదిలే మబ్బులు... అన్నింటా అందం తొణికిసలాడుతూనే ఉంటుంది. చూడగలిగిన కళ్ళూ, ఆస్వాదించగలిగిన హృదయం ఉండాలంతే! ఒకరికి అందంగా అనిపించింది మరొకరికి అలా అనిపించకపోవచ్చు. అప్సరస ఊర్వశి నల్లగా ఉంటుందని పురాణం. అటువంటి ఊర్వశిని తలమునకలుగా ప్రేమించాడు పురూరవుడు. అంత నల్లటి ఆమెను ఎలా ప్రేమించావయ్యా అని ఏ నారదుడో అడిగితే, నా కళ్ళు పెట్టుకుచూడు మహానుభావా- అని పురూరవుడు సమాధానం చెప్పేవాడనిపిస్తుంది, ఊర్వశీ పురూరవుల ప్రణయగాథ తెలిసినవాళ్ళకు. అటువంటి స్థిరమైన అభిప్రాయాలు అందరికీ ఉండవు. మనుషుల్లో కొన్ని బలహీనతలు తప్పనిసరి. ఏ వస్తువు విలువ అయినా ఇతరులు చెబితే కాని నమ్మకం కుదరదు కొందరికి. తన మనసుకు నచ్చినా ఇతరులూ తన అభిప్రాయంతో ఏకీభవిస్తేకాని సంతృప్తి కలగదు చాలామందికి. ముఖ్యంగా స్త్రీలు తమకంటే తోటి మహిళల అభిప్రాయాలకే ఎక్కువ విలువనిస్తారు. తనకు వంద చీరలున్నా ఎదురింటావిడ కట్టుకున్న చీరే బాగుందనుకోవటం చాలామంది ఆడవాళ్ళ నైజం. ఆ అమ్మ బట్టల షాపులో బీరువాలన్నీ ఖాళీ చేయించి చీరలు గుట్టగా పోయించింది. అయినా ఒక్కటీ నచ్చటంలేదు. ''ఇంతకూ మీకు ఎటువంటి చీర నచ్చుతుందమ్మా'' అని అడిగాడు విసిగిపోయిన షాపాయన. ''నాకు నచ్చటం కాదు ముఖ్యం. మా పక్కింటావిడకు నచ్చాలి. ఈ చీర తానే ముందు ఎందుకు కొనుక్కోలేదని ఆవిడ గింజుకోవాలి. అటువంటి చీరలు చూపించండి'' అంది. ఈ చిక్కు సమస్య తీర్చటం తనవల్ల కాక గుడ్లు తేలేశాడు షాపాయన!
అసలు తాము చూడకపోయినా ఇతరులు చెప్పుకొంటున్న మాటలు విని హృదయాలు అర్పించుకున్న కావ్యనాయికలున్నారు. దమయంతి ఆ కోవకు చెందిన నాయికే. తాను స్వయంగా నలమహారాజును చూడకపోయినా, 'పుల్విలుకాని తోడ సరిపోలెడు చక్కనివాడు భూమిలో నెవ్వడు చెప్పు'డని చెలికత్తెలనడుగుతుంది. వారు 'ఒప్పులకుప్ప నలుండుగాక యొండెవ్వడు' అంటే, ఆ మాటలు నమ్మి అతణ్నే ప్రేమిస్తుంది. అలాగే నలమహారాజు సైతం దమయంతిని అప్పటికి తాను చూడకపోయినా హంస చేసిన వర్ణనలు విని ఆమెపట్ల అనురక్తుడవుతాడు. కొంతమంది సొంత అభిప్రాయాలకంటే ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువనిస్తుంటారు. ఈ మనస్తత్వాన్ని పొరుగింటి పుల్లకూర రుచి అని తేలిగ్గా కొట్టిపారేయటానికి వీలులేదు. ఏ విశేషమో లేకపోతే అవతలివారిని అంతగా ఎలా ఆకట్టుకోగలుగుతారన్న ఆలోచనే వీరికి కూడా అవతలి వ్యక్తిపై ఆకర్షణను కలిగించవచ్చు. నలుగురు నడిచిందే దోవ అని ఒకరు చూపిన ఏ ప్రత్యేకతో ఆకర్షణీయంగా కనపడి పదిమందీ ఆ పోకడలే పోవటం పరిపాటి. ఫ్యాషన్ల విషయంలో మహిళలు ఇతరులను అనుకరించటం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. పూర్వం కన్నాంబ చీరలనీ కాంచనమాల గాజులనీ ఆ నటీమణులు వారు నటించిన సినిమాల్లో ధరించిన చీరలు గాజులు వంటివాటిని ధరించటమే ఫ్యాషన్‌గా భావించి అటువంటివాటి కోసమే బజారుకు పరిగెత్తేవారు మహిళలు. ఇప్పుడు- శ్రీదేవి చీరలు, జయప్రద గాజులు అంటూ పేర్లు మారాయి- అంతే తేడా.

'తాను మెచ్చిన కొమ్మ తళుకు బంగరుబొమ్మ' అన్నారో కవి. మగవారి విషయంలో ఈ సూత్రం వర్తిస్తుందేమో కాని, ఆడవారికి కాదు. మహిళలు తమతోపాటు అవతలివారినీ ఆకర్షించిన పురుషులనే అందగాళ్లుగా భావిస్తారు. ''అందం అన్నది చూసేవారి దృష్టిని బట్టి, వారి ఆలోచనలను బట్టి ఉంటుందనే మాట నిజమే. స్త్రీల విషయంలో ఇతరుల అభిప్రాయాల ప్రభావమూ ఎక్కువే. తన కళ్ళతో చూసేదానికన్నా ఇతరులు మెచ్చుకున్న అందమే వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది'' అంటున్నారు ఇంగ్లాండుకు చెందిన బెన్‌జోన్స్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త. అబర్డీన్ విశ్వవిద్యాలయానికి చెందిన బెన్‌జోన్స్ మరికొందరు పరిశోధకులతో కలిసి ఈ విషయంలో ఓ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనంలో వారు కొంతమంది మహిళలను ఎంపిక చేసి వారికి కొంతమంది అందగాళ్ళ ఫొటోలు చూపించారు. తరవాత వారికి మరో వీడియో చిత్రాన్ని చూపారు. ఆ వీడియో చిత్రంలో ఆ మగవారితో పాటు వారిని చూస్తున్న కొందరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వీడియోలో కనిపిస్తున్న మహిళలు కొందరు పురుషుల వంక మెచ్చుకోలుగా చిరునవ్వులు చిందిస్తూ చూడగా కొందరు మగవారిని చూస్తూనే మొహం చిట్లిస్తూ అయిష్టాన్ని ప్రదర్శించారు. ఈ వీడియోను చూపించి అందులో కనిపించిన మగవారిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని సర్వేలో పాల్గొన్న ఆడవారిని అధ్యయన బృందం కోరింది. అప్పుడా మహిళలు వీడియోలో కనిపించిన స్త్రీలు చిరునవ్వులు చిందిస్తూ ఏ మగవారిని చూశారో వారే ఎక్కువ అందగాళ్ళని వారికే తమ ఓటు వేశారు. ఈ అధ్యయనాన్ని బట్టి అందం విషయంలో తోటి మహిళల అభిప్రాయాలు ఆడవారిపై మంచి ప్రభావాన్నే చూపుతాయని అధ్యయన బృందం నిగ్గుతేల్చింది. పురుషుల దగ్గరకొచ్చేసరికి ఇందుకు ఫక్తు వ్యతిరేకమైన భావాలు వ్యక్తమయ్యాయి. అదే వీడియో చిత్రాన్ని కొందరు పురుషులకు చూపించగా మహిళలు మెచ్చుకోలుగా చిరునవ్వులు చిందిస్తూ చూసిన మొహాలను వారు తిరస్కరించారు. ఇందుకు పురుషుల్లో సహజంగా ఉండే పోటీతత్వంతోపాటు అసూయ కూడా కారణం కావచ్చని బెన్‌జోన్స్ అంటున్నారు. ఆ సంగతెలాఉన్నా వ్యక్తుల అందాన్ని అంచనా కట్టటంలోను, ఒక వ్యక్తి పట్ల ఆకర్షణకు లోనుకావటంలోను అవతలివారి అభిప్రాయాల ప్రభావమూ ఉంటుందని తేలిపోయిందంటోంది అధ్యయన బృందం. మనసు చేసే మాయాజాలాల్లో ఇదో నవకోణం!

(Eenaadu-28:01:2007)
-----------------------------------------------------------------------

Labels:

Nun runs


There were two nuns...

One of them was known as Sister Mathematical (SM) ,and the other one was known as Sister Logical (SL) .

It is getting dark and they are still far away from the convent.

SM: Have you noticed that a man has been following us for the past thirty-eight and a half minutes? I wonder what he wants.

SL: It's logical. He wants to rape us.

SM: Oh, no! At this rate he will reach us in 15 minutes at the most! What can we do?

SL: The only logical thing to do of course is to walk faster.

SM: It's not working.

SL: Of course it's not working. The man did the only logical thing. He started to walk faster, too.

SM: So, what shall we do? At this rate he will reach us in one minute..

SL: The only logical thing we can do is split. You go that way and I'll go this way. He cannot follow us both.

So the man decided to follow Sister Logical.

Sister Mathematical arrives at the convent and is worried about what has happened to Sister Logical.

Then Sister Logical arrives.

SM: Sister Logical! Thank God you are here! Tell me what happened!

SL : The only logical thing happened. The man couldn't follow us both, so he followed me.

SM: Yes, yes! But what happened then?

SL : The only logical thing happened. I started to run as fast as I could and he started to run as fast as he could.

SM: And?

SL : The only logical thing happened. He reached me.

SM: Oh, dear! What did you do?

SL: The only logical thing to do. I lifted my dress up.

SM : Oh, Sister! What did the man do?

SL: The only logical thing to do. He pulled down his pants.

SM: Oh, no! What happened then?

SL: Isn't it logical, Sister? A nun with her dress up can run faster than a man with his pants down.

And for those of you who thought it would be dirty,

Say two Hail Marys!
------------------------------------------------------------------------

Labels:

లోకమే కాదా స్వర్ణ సీమ


'మా పైడి తల్లికి మల్లె పూదండా
మా 'కొన్న' తల్లికీ మంగళారతులూ
మా చెవులు రింగులయి, తీగ సాగేదాక
మా గొంతు గొలుసులతో, నిండిపోయేదాక
నీ మాటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై పసిడి తల్లీ' అంటూ ఎరువు తెచ్చుకున్న 'అక్షయ తృతీయ' పండక్కి బంగారం కొనుక్కోవడానికి బ్యాంకులు, షాపుల వెంట పడ్డ జనాన్ని చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఇలాంటి పండగోటి ఉందని మూడు, నాలుగేళ్ల కిందటి వరకు మనకే తెలియదు. ఉత్తరాది నుంచి దిగుమతైన ఈ పండగ దక్షిణాదిలోనూ స్వర్ణాభరణాలకు మంచి గిరాకీని పెంచేసింది. దీన్నిబట్టి చూస్తే భువికి దివికి అనుసంధానమైంది కనకమాలక్ష్మేనన్న నమ్మకం కలక్కమానదు. స్వర్గం ప్రకృతి అయిత
స్వర్ణం వికృతి అని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. రోజూ గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చునే వాళ్లు కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ గిల్లుకోవడానికి 'చలో బ్యాంకు' నినాదం అందుకున్నారు(ట). 'అక్షయ' పాత్ర మీద ఆశతోనే ఇదంతా. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ ఏవో పథకాలు వల్లించారు గానీ అదే అక్షయ తృతీయ నాడు తలా ఒక గోల్డ్ కాయిన్ ఇస్తే సరిపోయేది కదా. ఇంటింటా బంగారు బొమ్మే కనపడేది. బంగారు సర్వ సమస్యానివారణి కూడాను.

కేవలం పారిజాత పుష్పం కోసం మొగుణ్ని రచ్చ కెక్కించి బంగారం ఊసే ఎత్తని సత్యభామ అంతటి అమాయకురాళ్లు కాదిప్పటి భామామణులు. బంగారం కోసం నిరసన దీక్ష పట్టని ఇల్లు ఉంటుందని ఎవరైనా అంటే వాళ్ల ఖలేజాను మెచ్చుకుని మెళ్లో 'హారం' వెయ్యాల్సిందే. అన్నట్టు హారం కోసం ఇల్లాలు ఆహారం మానేస్తే బంగారంలా కరగని ఇంటాయనుంటాడా! చెప్పండి. బంగారం కొంటే ప్రపంచ యుద్ధాలు ఉండనే ఉండవు కదా!

72 ఏళ్ల తర్వాత ఈసారి అక్షయ తృతీయ ఏకంగా రెండు రోజులు (19, 20 తేదీల్లో) వచ్చింది. ఈ రెండు రోజుల్లోనూ దాదాపు రూ.300 కోట్ల బంగారం అమ్ముడుపోయిందంటే 'బంగారు పంటలే' పండుతాయీ అని పాడాలనీ ఉంది. బంగారం షాపింగ్ క్రీడలో మహిళల 'డ్రీమ్ ఇండియా' టీముది రికార్డు గెలుపన్నమాట. మహిళలు ఆడువారు అయితే బంగారం విక్రేతలు 'ఆడించువారు'. బంగారం ముందు పుట్టి ఆడవాళ్లు తరువాత పుట్టారనొచ్చు. అయినా మొగుడి మీద దయతో మా ఆయన బంగారం అని సర్టిఫికెటిస్తారు. కనకధారాస్తోత్రమూ వారికి కరతలామలకం.'ఎవ్వనిచే జనించు బంగారమెవ్వని లోపల నుండు లీనమై...' అని పతి మీద పేరడీ పద్యమూ పాడగలరు. ఈ విషయంలో ఆడవాళ్లలో వర్గ విభేదాల్లేవు. 'వగలాడి ఆకాంక్ష ఏదంటే నగలాడి కావాలన్నదే' అని ఒక కవి వ్యాఖ్యానించాడు. అయినా బంగారక్కలు లెక్కపెట్టరు. నీతులు చెప్పిన నిగమశర్మ సోదరి సైతం తన సోదరుడు ముక్కుపుడకలు దొంగిలించుకుపోయాడని ఏడ్చింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే బంగారాన్ని నిర్లక్ష్యం చేయడమంటే భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడమే. స్వర్ణో రక్షతి రక్షితః... బంగారాన్ని నీవు కాపాడితే, అది నిన్ను కాపాడుతుంది. ఆడవాళ్లకు వారి మాంగల్యం సాక్షిగా ఇది చాలా ముందే తెలుసు. మగవాళ్లకు ఆ తెలివిడి మరి ఎప్పుడొస్తుందో?


- ఫన్‌కర్
(Eenadu-22:04:2007)
--------------------------------------------------------------------------------

Labels:

Have you ever seen a WATER bridge over a river?


Even after you see it, it is still hard to believe !

WaterBridge in Germany ... What a feat!
Six years, 500 million euros, 918 meters long.......now this is engineering!

This is a channel-bridge over the River Elbe and joins the former East and West Germany, as part of the unification project.

It is located in the city of Magdeburg, near Berlin. The photo was taken on the day of inauguration.

To those who appreciate engineering projects, here's a puzzle for you armchair engineers and physicists.

Did that bridge have to be designed to withstand the additional weight of ship and barge traffic, or just the weight of the water?


Answer:

It only needs to be designed to withstand the weight of the water!

Why? A ship always displaces an amount of water that weighs the same as the ship, regardless of how heavily a ship may be loaded.
-------------------------------------------------------------------

Labels: