My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 08, 2007

ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ అస్తమయం

ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిషశాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు భమిడిపాటి రాధాకృష్ణ(78) మంగళవారం ఉదయం 11.05 గంటలకు రాజమండ్రిలో మృతి చెందారు. ఆస్తమా, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడురోజుల క్రితం కోమాలోకి వెళ్ళిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. 1929, నవంబరు 24న రాజమండ్రిలో జన్మించిన రాధాకృష్ణకు భార్య సుశీల, ఒక కుమార్తె, అయిదుగురు కుమారులు ఉన్నారు. ఈయన 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంతవేదాంతం తదితర నాటిక, నాటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కీర్తిశేషులు నాటకంలోని ఓ పాత్ర ద్వారా ప్రముఖ నటుడు రావుగోపాలరావు మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు పోద్బలంతో భమిడిపాటి సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తొలి చిత్రమైన ఆత్మగౌరవం చిత్రం కూడా ఉంది. బ్రహ్మచారి, కథానాయకుడు, కీర్తిశేషులు, మరపురానికథ, విచిత్రకుటుంబం, పల్లెటూరి బావ, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామ కళ్యాణం, నారీనారీ నడుమ మురారి, కాలేజీ బుల్లోడు వంటి చిత్రాలకు ఈయనే కథకుడు. నాటి తరంలోని ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి మహానటులకు భమిడిపాటి సన్నిహితుడు. ప్రత్యేకించి అక్కినేని నాగేశ్వరరావుతో మంచి మైత్రి ఉండేది. ఆయన ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పనిసరిగా భమిడిపాటిని కలిసేవారు. రాధాకృష్ణ 1994 తరువాత క్రమంగా సినిమా రంగానికి దూరమై తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. భమిడిపాటి క్యాలెండర్‌ పేరిట క్రీస్తు పూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా రాధాకృష్ణ అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కనబరిచారు. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా నామకరణ మహోత్సవం సందర్భంగా చిన్నారులు బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా జాతకాలు చెబుతారనే పేరుంది. 'అపరిచితుడు' సినీ హీరో అసలుపేరు కాన్‌ కెనడీ కాగా జాతకం ప్రకారం ఆయనకు విక్రమ్‌గా నామకరణం చేసింది రాధాకృష్ణ కావడం గమనార్హం. హాస్యబ్రహ్మ భమిడిపాడి కామేశ్వరరావు కుమారుడిగా ఆయన రచనా వారసత్వాన్ని రాధాకృష్ణమూర్తి పుణికి పుచ్చుకుని సునిశితమైన వ్యంగ్యాన్ని రంగరించి ఆయన కథల్లో హాస్యాన్ని పండించేవారు. తుది ఘడియల వరకు కూడా రచనా వ్యాసంగంలోనే మునిగి తేలారు. తాను 'సెప్టెంబరు 4న గంట కొట్టేస్తాన'ని నర్మగర్భంగా తన మరణ తేదీని ముందే డైరీలో రాసుకున్న ఉదాహరణ రాధాకృష్ణ హాస్యచతురతకు, సంఖ్యా, జ్యోతిష శాస్త్రాలపై ఆయనకున్న పట్టును రుజువు చేస్తుంది. ప్రముఖ వారపత్రిక 'స్వాతి' ఎడిటర్‌ వేమూరి బలరామ్‌ భమిడిపాటి రాధాకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించగా, సాహితీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
(Eenadu, 05:09:2007)

Labels: ,

జీవితం ఏమిటి?

- ఎర్రాప్రగడ రామకృష్ణ
''కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది గాని, దాని ఫలితంపట్ల లేదు''- అని గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. ఫలితం సంగతి అలా ఉంచి, అధికారం ఉంది కదా- అని, కర్మలను విడిచిపెట్టేయడం మనిషికి సాధ్యమేనా? అదీ చాలా కష్టమైనదిగానే తోస్తుంది. కర్మలనుంచి దూరంగా ఉండటం అనేది మనిషికి దాదాపుగా అసాధ్యమని ఈ కథ మనకు తెలియజేస్తోంది.

ఒకాయన వయసులో ఉండగానే వైరాగ్యం పెంచుకుని, ఊరికి దూరంగా ఒక నిర్జనమైన అడవిలో నిరాడంబరంగా సాధువులా జీవించడం ప్రారంభించాడు. ఆకలివేసినప్పుడు అడవిలో దొరికే పళ్ళూ, దుంపలు తినడం, సెలయేరులోని నీళ్ళు తాగి రోజంతా మౌనంగా, నిశ్చింతగా ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం సాధన చేశాడు. ఆయనకి ఉన్నవల్లా చిన్నపాక, కట్టుకోవడానికి రెండు గోచీలు, ఒకటి రెండు మట్టిపిడతలూ... ఇంతే మొత్తం ఆయన ఆస్తిపాస్తులు.

ఒకరోజు చూరులో దాచిన గోచీ గుడ్డను ఎలుకలు కొరికి, ముక్కలు చేసేశాయి. దాంతో ఆ సాధువుకు ఇబ్బంది ఏర్పడింది. ఊళ్ళోకి వచ్చి ఎవరినో యాచించి మరో కౌపీనాన్ని సంపాదించాడు. మర్నాడు చూస్తే దాన్నీ ఎలకలు కొరికి నాశనం చేశాయి. ఇలా రెండు మూడుసార్లు జరిగేసరికి సాధువుకు చికాకు కలిగి, ఒక పిల్లిని తెచ్చి పెంచడం ఆరంభించాడు. వెంటనే సమస్య పరిష్కారమైంది. ఎలుకలు ఆ పాక దరిదాపుల్లోకి రావడం మానేశాయి. మరి పిల్లి సంగతి?

మళ్ళీ ఊళ్ళోకి పోయి, పాలు అడిగి తెచ్చి పిల్లిని సాకడం మొదలైంది. దానికి ఆకలైనప్పుడల్లా సాధువు ఒళ్ళో చేరి 'మ్యావ్‌ మ్యావ్‌' అంటూ గోల చేయడంతో ఆయన ధ్యానం భంగమయ్యేది. ఇది పనికాదనుకుని, ఆయన ఈసారి ఏకంగా ఒక గేదెనే సంపాదించి, పెరట్లో చెట్టుకు కట్టేశాడు. దాని పాలు పితికి పిల్లికి పోసేవాడు. ఆ రకంగా పిల్లి గొడవ పరిష్కారమైంది. కానీ, గేదె బాధ మొదలైంది. దాన్ని పెంచడం అనేది తపస్సు చెయ్యడం కన్నా కష్టమన్న సంగతి ఆయనకు చాలా త్వరగానే బోధపడింది. చివరికి విధిలేక ఆ సాధువు పెళ్ళి చేసుకుని భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. ఆవిడ ఇంటి సంగతీ, గేదె సంగతీ సమర్థంగా, శ్రద్ధగా చూసుకోవడంతో సాధువు పూర్వంలాగే నిశ్చలంగా ధ్యానంలో మునిగిపోయాడు. కొన్నాళ్ళకు ఆయన భార్యకి విసుగుపుట్టింది. తనను పట్టించుకోని భర్త, మగదిక్కు ఉన్నా తనమీదే కుటుంబ బాధ్యతలు, ఇల్లూ, గేదె, భర్తకు సేవలూ... ఇలా ఎన్నాళ్ళని? దాంతో సాధింపులు, సతాయింపులు మొదలై సాధువు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. దైవధ్యానం నుంచి దూరమైన ఆయన మనసులో భార్య గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి. చివరికి ఆయనకో గొప్ప ఉపాయం తోచింది. పిల్లల్ని కనిపారేస్తే వాళ్ళ పెంపకంలో పడి భార్య తన జోలికి రాకుండా ఉంటుంది, తనదారిన తాను నిరాటంకంగా ధ్యానం కొనసాగించవచ్చు అనుకున్నాడు.

ఈ తెలివైన పథకాన్ని ఆయన వెంటనే అమలుచేశాడు. ఇద్దరు పిల్లలు కలిగాక ఆయన పూర్తిగా సంసారంలో కూరుకుపోయాడు. పూజాలేదు, పునస్కారమూ లేదు. ధ్యానమూ లేదు, మౌనమూ లేదు. నెత్తిమీద బాధ్యతలు, చేతినిండా చాకిరీ, మనసు నిండుగా విచారం మిగిలాయి. మనిషి నిస్సహాయుడయ్యాడు. అవసరాలు మనిషిని కర్మల్లోకి నెట్టాయి. ఇది చదవడం పూర్తయ్యాక అద్దంలో చూసుకుంటే మనలో చాలామందికి ఆ సాధువు దర్శనమిస్తాడు. అదే విషాదం!
(Eenadu,07:09:2007)
-------------------------------------------------

Labels: ,

నేటి తెలుగులో సంధి స్వరూపం

వాక్యమధ్యంలో పదాలను విసంధిగా రాయడం మంచిది.దానివల్ల పాఠకునికి శబ్ద మూలరూపం తెలుస్తుంది. ఈ విధంగానే క్రియా శబ్దాల విషయంలో కూడ విసంధిగా రాయడంవల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.మూలరూపంతో పదాలను వాక్యమధ్యంలో రాయటమే నేడు ప్రచురంగా కనిపిస్తుంది.కాబట్టి శబ్దానికి ఏకరూపాన్ని ప్రచారంలోకి తేవడం ఆధునిక ప్రయోజనాల దృష్ట్యా చాలా ముఖ్యం.

రెండు అక్షరాలమధ్య సంహిత- అంటే సంధి ఏర్పడే పట్టులను గూర్చి సంస్కృత వైయాకరుణులు ఈ విధంగా నిర్వచించారు

'సంహేతైక పదేనిత్యా/ నిత్యాధాతూప సర్గయో:/
నిత్యా సమాసే/ వాక్యేతు సా వివక్షామపేక్షతే/

పై విధి సంస్కృత భాషకు సంబంధించిందైనా, తెలుగు భాషకు గూడా చాలావరకు వర్తిస్తుంది.

[1]సంహేతైక పదేనిత్యా:
ఏకపదంలో అక్షరాలకు మధ్య సంధి నిత్యంగా జరుగుతుంది.
పుట్టి+ఎడు = పుట్టెడు
మూడు+అవ+మూడవ
గోరు+అంత=గోరంత
నిర్ణయ+ఇంచు=నిర్ణయించు
నిర్జి+ఇంచు=నిర్జించు

[2]నిత్యాధాతూప సర్గయో:/
సాధారణంగా తెలుగు ధాతువులన్ని 'ఉ ' అనే అచ్చుతో అంతమవుతాయి.కాబట్టి ధాతువులకు క్రియా ప్రత్యయాలు చేరేటప్పుడు ఆ ప్రత్యయాలు అచ్చులను ఆదిలో కలిగి ఉంటే ఉత్వసంధికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. పూర్వ పరాచ్చులు రెండింటి స్థానంలో పరాచ్చు ఆదేశంగా వస్తుంది.
ఇచ్చు+ఎను=ఇచ్చెను
కొట్టు=ఎను=కొట్టెను
చదువుతు+ఉన్నాను=చదువుతున్నాను
కొట్టు+ఇంచు=కొట్టించు
చేయు+ఇంచు=చేయించు
చదువు+ఇంచు=చదివించు
కొట్టు+అక=కొట్టక
తిట్టు+అక=తిట్టక

ఇక సంస్కృత పదాలతోబాటు ఉపసర్గలు(prefixes) కూడా తెలుగులోకి వచ్చాయి.కాబట్టి తత్సమ పదాల్లో సంస్కృతంలో లాగే ఉపసర్గలను శబ్దాలకు చేర్చేప్పుడు సంధి కార్యం నిత్యంగా జరుగుతుంది.
ప్రతి+ఏక=ప్రత్యేక
అభి+ఉదయం=అభ్యుదయం
సు+అగతము=స్వాగతము
అను+ఏషన=అన్వేషణ

[3]నిత్యా సమాసే/
సమాసంలోని పదాలమధ్య సంధి నిత్యంగా జరుగుతుంది.
చింత+ఆకు=చింతాకు
ఇల్లు+ఆలు=ఇల్లాలు
పీత+అంబరుడు=పీతాంబరుడు
రామ+ఆజ్ఞ=రామాజ్ఞ
సూర్య+ఉదయం=సూర్యోదయం

[4]వాక్యేతు సా వివక్షామపేక్షతే/
రచయిత తన ఇష్టాన్ని అనుసరించి వాక్య మధ్యంలో పదాలను విడివిడిగా రాసుకోవచ్చు. లేకుంటే పదాలకు మధ్య సంధినియమాలను పాటించనూవచ్చు.
ఉదాహరణకు ఈ కింది వాక్యాన్ని చూడండి.
'ఒకడు పరీక్షలో ఉత్తీర్ణుడు అయినాడు అనుకొందాం.'
ఈ వాక్యాంలోని పదాలకు మధ్య సంధి చేస్తే ఇలా ఉంటుంది:
'ఒకడు బరీక్షలో నుత్తీర్ణుడయినాడనుకొందాం. '
పై వివరణవల్ల తేలిందేమిటంటే వాక్య మధ్యంలో రెండు పదాలను కలిపి సన్నిహితంగా ఉచ్చరించడంగాని,రెండు శబ్దాలమధ్య కొంచెం కాలం ఆగి ఉచ్చరించడంగాని రచయిత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. సన్నిహితంగా ఉచ్చరిస్తే సంధి కార్యం జరుగుతుంది. పదాలను వ్యవధానంగా ఉచ్చరిస్తే సంధి రాదు.కాని వాక్య మధ్యంలో పదాలను విడివిడిగా రాయడంవల్ల చాలా ఉపయోగం ఉంది.

ఇంగ్లీషు భాషలో 'MIRROR ' అనే మాట వాక్యంలో ఎక్కడైనా 'MIRROR' గానే వాడుతున్నాము.కాని తెలుగులో ' అద్దం ' అనే మాటను వాక్యారంభంలో ' అద్దం ' - అని రాస్తాము.కాని వాక్యమధ్యంలో ద్రుత ప్రకృతికం (నకారం అంతంలో ఉండే శబ్దాలు) తరువాత 'నద్దం ' అని రాస్తాము. అలాగే సంధి రాని చోట 'య్ 'ని ఆగమం చేసి 'యద్దం ' అని రాస్తాం. సామాన్య పాఠకుడు దీని మూల రూపం ఏదో తెలియక తికమక పడతాడు.కాభట్టి వాక్యమధ్యంలో పదాలను విసంధిగా రాయడం మంచిది.దానివల్ల పాఠకునికి శబ్ద మూలరూపం తెలుస్తుంది. ఈ విధంగానే క్రియా శబ్దాల విషయంలో కూడ విసంధిగా రాయడంవల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. 'ఉంది '- అనే క్రియా శబ్దాన్ని ద్రుతప్రకృతికం(నకారం అంతంలో ఉండే శబ్దాలు) తరువాత 'నుంది '- అని, కళల(అచ్చు అంతంలో ఉండే శబ్దాలు)పై సంధి రాని చోట 'యుంది ' -అని రాయకుండా, 'ఉంది '- అని వాక్యమధ్యంలో రాయడం సబబు.అలాగే 'వ్ 'ఆగమం చేసి 'వుంది '- అని రాస్తే, పాఠకుడు మూలరూపం తెలియక తికమక పడతాడు.మూలరూపంతో పదాలను వాక్యమధ్యంలో రాయటమే నేడు ప్రచురంగా కనిపిస్తుంది.కాబట్టి శబ్దానికి ఏకరూపాన్ని ప్రచారంలోకి తేవడం ఆధునిక ప్రయోజనాల దృష్ట్యా చాలా ముఖ్యం.
("చక్కని తెలుగు రాయడ మెలా?" డా.వి.లక్ష్మణరెడ్డి,ఎమెస్కో, 1992)
-----------------------------------------------------------

Labels:

Thursday, September 06, 2007

The first steps to problem-solving

Photo: K Murali Kumar

LOOKING AHEAD: More than wasting time in thinking about the reasons and people responsible for the problems, it is important to search for solutions to overcome them.

What is a problem?

Problem means slipping into an uncomfortable position, level of severity of pain being different.

The intensity of a crisis depends on how you take it, rather than how severe the problem is. Injury being the same, a wound at the finger-nail is more painful than at the palm.

When a problem engulfs us, our first reaction is “Why me.” It is brooding over the matter rather than searching for the way out.

To solve a problem, analyse the following five aspects:

1. What I am going to lose by this?

2. How can I recover it back?

3.What should I do to return to my normal position?

4. How much time it would take for salvage (of money/ prestige/ relationship/ freedom etc)?

5. How can I minimise the time or the loss, to overcome the catastrophe?

We waste more time thinking about the reason and people responsible for it, rather than searching for the solution.

When you get lesser marks in a subject, or suddenly your rankings come down, analyse the same above points:

What to do to minimise the loss, how to do it fast to recover to the original position.

It is not because problems are difficult that we do not dare to solve them, but because we do not dare, the problems get complicated.

When you are agonised, go to more agonised people.

Visit a cancer hospital or an old-age home, offer fruits and gifts, talk to them and that makes you comfortable as you realise that your problem is less severe.


When you are confronted with a problem, write it down, glare at it continuously and you will suddenly find a new dimension to solve it.

When ‘lift’ was invented,

people were comfortable but irritated with its slow pace. Though much faster lifts were discovered later, their impatience continued.

Nobody could analyse the reason. One engineer discovered that it is not the slowness, but the veiled insecurity (while the lift is running up or downwards) is hurrying them to come out of it.

And more importantly, the exasperation of standing close to each other, the odour, immobility, quietness and the congestion is making them irritated.

He suggested fixing of mirrors on four sides to look at and a music system, to keep people engaged. And that solved the problem.

YANDAMOORI VEERENDRANATH

yandamoori@hotmail.com
(The Hindu, Education Plus Chennai, 03:09:2007)
---------------------------------------

Labels:

Who is a good teacher?

Here is a systematic look at the capabilities, skills and traits that will help one attain the goal of being an ideal teacher.

– Photo: V. Ganesan

A friend and guide: Good teachers are excellent facilitators.

.................................................................The ‘ideal teacher’ is a concept. It is a goal that teachers should aspire to attain.

There is no ideal teacher as there is no perfect musician. Let us look at an eastern concept. Seekers of knowledge are sometimes compared to the musk deer. The deluded deer that does not know that the scent emanates from one of its own glands runs hither and thither in search of the source.

The eastern scriptures tell that all knowledge is within us. But there is a thin film of ignorance covering the knowledge. The teacher does not teach, but removes the thin layer and brings out the knowledge for our benefit. True teachers are not knowledge shopkeepers, but are those who help us to remove the cover of ignorance. Perhaps this is what is meant by guidance from the teacher. “Discover” or “unveil” are good synonyms for “teach.” Good teachers are excellent facilitators.

The teacher in the eastern scheme of things stands on a very high pedestal. He is called the Guru and the disciple the Sishya. The process of teaching and learning is treated as a sacred course of action, and not commercial activity. Knowledge stands head and shoulders above every other kind of wealth. Scholars are respected much more than those who are rich in money, or great in power................................

Personal characteristics

The significant personal characteristics of a good teacher are: appreciates students’ problems; articulate; accessible to students; avoids mannerisms in the classroom; believes in the potential of each student; caring; clarity in speech; committed to the teaching profession; communicates effectively; concern for student learning; conducts practical experiments wherever necessary; creates good learning environment for students; creative; dedicated; desire to teach; develops student-centred classroom; displays exceptional people skills; does more than just teach; does not belittle students before others, or otherwise; dynamic model of contagious enthusiasm; effective interaction with all students; effective techniques; employs different teaching methods to suit the subject and the pupils; encourages interdisciplinary approach; ensures interaction of pupils, and not keep them as passive listeners; ensures pupil participation in lecture classes through questioning techniques; evaluates student assignments in time, points out errors, and offers corrections; excellent communication skills; gets feedback from students on classroom performance in order to improve; gives practical examples for illustrating concepts; gives the details of the syllabus in the beginning of the academic year; good academic qualifications; innovative; instils mutual respect among teacher and pupil; interacts with parents; joy and pride in teaching; knowledge of different learning styles; knows his subject thoroughly; lifelong learner; links the lesson with the pupils’ everyday experience and kindles their interest; maintains a spirit of research; maintains punctuality and discipline through his own example; passionate in teaching; has a positive relationship with students; prepares well before each class; presents himself / herself as part of “real people”; promotes hands-on student learning; provides clear expectations for assignments; provides frequent feedback to students on their performance; provides the relevance of information to be learned; respects individuality of students; responsible; role model to students; seen and heard well in the classroom; sense of humour; sensitive to cultural differences; speaks in a lucid style; employs special methods to handle difficult subject areas; spends extra time with students; states lesson objective and lesson summary; strong work ethics; student-centred approach; suggests good textbooks, reference books, and websites; takes constructive criticism; tries to know students; uses appropriate teaching aids; wide knowledge and experience in teaching techniques and willingness to learn from students and other teachers.

One may doubt whether one individual can have all these attributes. This indeed is possible. Many trained teachers have acquired all these through deliberate effort.

Lecture method

Although the lecture method of teaching has several disadvantages, it would continue to be an important component of our classroom teaching, because of many points of convenience. Teachers adopting this style should invariably ensure student participation in the classroom. One of the important methods for achieving such participation is the use of the “questioning” technique. Teachers who use the questioning technique may keep the following points in mind – Precise, simple wording; prepare in advance; pose, pause, point; don’t use YES / NO type; not with several good answers; avoid vagueness; use elliptical questions for slow learners; avoid tricky/very hard questions; never make sudden jumps; don’t rephrase in a hurry; avoid saying “Can anyone tell me?,” “What rubbish ?,” “Do you work hard ?,” etc; repeat right answers; don’t accept unsolicited answers; give due credit for right answers; comment, “Aha, that’s a fine idea,” “Could you improve the answer?,’ etc and encourage reverse questions.

Questioning in the classroom has other applications as well such as eliciting information (prior learning / depth of assimilation); revision; consolidation; logical development of the lesson; probing into difficulties of the pupils; forcing the class to think; rousing curiosity and interest; feedback to measure success of teaching; evaluation of pupils etc

This write-up has the limited objective of highlighting the desirable attributes of a good teacher in the environment of our temples of higher education.

B.S. WARRIER

(The Hindu, education Plus Chennai, 03:09:2007)

----------------------------------------------------------------

Labels:

When you converse at a personal level

B.S. WARRIER

Personal conversation accounts for a substantial part of our daily communication. Here are ways of making it effective and result-oriented.



Doing it right: These youngsters seem to have a good conversation going.

“Unless one is a genius, it is best to aim at being intelligible.”

- Anthony Hope (1863-1933), British novelist


In personal conversation you have to take care of many things. An expert in interpersonal communication advises that you should be TACTFUL in conversation. What he suggests is the following;

T – Think before you speak

A – Apologise quickly when you commit a blunder

C – Converse, don’t compete

T – Time your comments

F – Focus on behaviour, not personality

U – Uncover hidden feelings

L – Listen for feedback

In strange company, it is good manners to introduce yourself to others, since that would not leave them guessing who you are. So also, you may greet others first; this shows that you are not plagued by ego feelings. It is most likely that you do get a favourable response.

There is no harm in asking a person’s name if you do not know it. After knowing the name, repeat it during the conversation. The sweetest word for anyone is his/her name. Try to remember the names of people whom you would meet again. Be liberal in showering praise, if you feel someone deserves it.

Intellectual curiosity

When ideas are discussed, you should not give an impression that you are too conventional to accept a new idea. Intellectual curiosity will be appreciated in cultured groups. Conversation would sour if you enter into arguments on trifles.

Never try to offer unsolicited advice. Though it is not advisable to bore others by narrating dull events in your life, you need not feel shy in sharing your interesting experiences if the occasion demands. Keep your general awareness up to date, if you want to partake actively in an interesting conversation. You would be able to switch to new subjects when a subject has run out of steam.

Maintain a balanced outlook. Extreme positions may lead to controversial remarks that may mar smooth dialogue among the members of a normal group. Do not go after any contentious issue, unless it is unavoidable. Be tolerant to differing views. Never be dogmatic. Be a good listener. In personal conversation humour has a place, though it should not jar, given a situation. If you are not gifted with the fine art of making humorous conversation, do not attempt it.

Body language

You may encourage others to speak by paraphrasing their statements for confirmation and through pleasing body language, including facial expression. Never try to be another person through your language or gestures. People who speak in a natural way are liked by others. Do not try to put on airs. You cannot wear a mask for a long time; you are likely to be exposed. Eye contact and a pleasant smile would add spice to your words. Find areas of common interest during conversation. You can ask questions on subjects that are of interest to the other person, when you are in a one-to-one mode. Everyone likes to speak on areas in which he is well versed. Enjoy the conversation, and show that you are enjoying it. Be enthusiastic.

You should never adopt a stance of arrogance, since none would like to communicate with such a person. Never be rude. Never assume a patronising attitude. But you should not surrender your self-esteem. Avoid insinuation. Show patience; never try to be unduly smart before others. You have to display empathy by entering into the other person’s world of thought, and trying to think the way he thinks.

You can ask leading questions to confirm your interest in his conversation. Questions seeking clarification are generally welcomed by people. Confessing your own weakness would generate sympathy and keenness in the other person and prompt him to listen to you further.

Key to success

Any communication succeeds only when it has been received, understood, accepted, and the intended action has been effected. If such a success has to be achieved, there are several measures we should follow in the process of communication. Ideas and the words that carry them are certainly important. But you should realise that your voice, tone, appearance, and body language are also equally important in oral communication.

Making a presentation

If you intend to make a presentation, not only the structure but the content, logic, and main phrases have to be planned. The right strategies for effective presentation have to be followed. These include:

•Getting over nervousness

•Wearing proper dress

•Proper body language

•Speaking with clarity

Not reading from a prepared text

•Stating your objective in the beginning

•Following a logical order in presenting ideas

•Choosing the right mode for each item (for example, statistical trends to be displayed through graphs, histograms, pie diagrams, etc.)

•Using charts or computer software such as the PowerPoint or Flash

•Avoiding cluttered display on the screen

•Ensuring that your voice can be heard and the projection seen well

•Synchronising spoken words with gestures

•Not keeping a projected slide on the screen for too long a duration

•Avoiding mannerisms

•Ensuring voice modulation

•Keeping eye contact

•Adopting the language to suit the comprehension level of the audience

•Maintaining appropriate speed of delivery

•Keeping consistency in logic

•Using controlled humour

•Avoiding frequent corrections during speech

Emphasising significant points

Interacting effectively with the audience

•Watching the body language of the listeners and making changes in style, if necessary

•Listening carefully to questions from the audience

•Handling of tricky questions wisely

•Not talking beyond the permitted duration

•Giving a summary at the end

It is easily said that you should look at the type of your listeners before choosing your language. But the characteristics of a group are not susceptible to generalisation. Suppose you are addressing a group of rural farmers. All of them may not be the same, in the matter of information or perception. There would be individuals who are much more informed than many others in the group. There may be persons who are far below the general level of awareness. Perhaps in such situations, one strategy that can be adopted is to address the average among the group. This is the style that is followed by good teachers in a classroom comprising a heterogeneous group of pupils, so that the very bright do not get bored and the underachievers do not feel left out.

Persuasion

You are often faced with the problem of convincing others of your standpoints. You might have observed that most of the time, politicians are engaged in this exercise. Marketing professionals and businessmen have to be good in this kind of communication. What are the aspects to be kept in mind when you attempt to convince others on some point or other?

First and foremost you should find out what type of person is your target – on the bases of educational background, culture, language comprehension, age, sex, attitude, and so on. You should ensure that the person listens to you when you speak. If the mood is not proper, you have to generate an appropriate atmosphere congenial to effective listening. The person should be in a listening mood throughout.

What you say should have the qualities or clarity and accuracy. You should plan beforehand your strategy of presentation. You have to be enthusiastic. You have to be confident. You should continuously watch the listener’s expression and body language, and make sure that the person is not emotional when you try to apply logic through your words.

In any persuasive talk, you will have to emphasise the significant points of interest to the listener. Your logic has to be convincing. Use illustrations. Be consistent. If the listener wants to raise a question, make him fell free to do so, thereby making way for smooth exchange of ideas. Make him feel important. If there is a problem to be settled through negotiation, split it into parts and identify portions of agreement, and try to tackle the other portions in stages. Try to build trust at every stage. Never make the listener hostile, lest he should block further communication.

(The Hindu, Education Plus Chennai, 03:09:2007)

--------------------------------------------------------

Labels:

Tuesday, September 04, 2007

CONVERSATION:

On the subject of conversation, a Chinese proverb states as follows:

"a single conversation across the table with a wise man is worth a month's study of books."

Seek out the wise and learn from them. They are just waiting for that small spark of interest to tell you all that you need to know.

.Develop conversational aptitude.

.Be well-versed and be rehearsed.

· Visit internet.

· Know local, national, and international news of the day.

· Practice conversing with strangers in bus/ train/ flight/ queue.


While speaking avoid-

· Monotone

· Whining

· Mumbling

· Speaking too fast/ too slow/ nasal twang

· Saying ‘uh-uh’

· Conversational don’ts & dos


Topics to avoid

Family tragedy

Foul language

Personal health

Politics

Poor health

Religion

sex

Tasteless jokes

Using too many ‘I’s


Topics for Conversation

books

Cultural events

Food and local hotels

Movies

sport

Always answer the phone with enthusiasm in your voice and show your appreciation for the caller. Good phone manners are essential. To convey authority on the line, stand up. This will instill further confidence in your voice.

ü To listen well is as to talk well and is as essential to all true conversation.

ü It's never boring to listen to someone tell the truth. When people are speaking from the heart, you can't help but be interested regardless of the content or whether or not you agree with them.

__________

Labels:

భయం లేని చోటు

ఆహార, నిద్రా, భయ, మైధునాలు జీవులన్నిటిలో సాధారణమే అయినప్పటికీ, మానవుల్లో వీటి గురించిన చింతన కొంచెం ఎక్కువ. ఆహార, నిద్రా, మైధునాలు- వాటి అవసరం తీరాక అవి శాంతిస్తాయి. కానీ, మూడోదైన భయం మాత్రం మనిషిని నిత్యం వెన్నంటి ఉంటూనే ఉంటుంది.

రోజుల శిశువు కూడా నిద్రలో ఉలికులికిపడటం మనం చూస్తుంటాం. అది మొదలు- ఏదో కారణంగా, ఈ భయం మనిషిని బాధిస్తూనే ఉంటుంది. 'నేనెవరికీ భయపడను. భయం అనేది నా నిఘంటువులోనే లేదు' అని డంబాలు పలికినవారూ కొన్ని కొన్ని పరిస్థితుల్లో భయపడక తప్పదు. సకల సంపదలూ ఉన్నప్పటికీ వాటిని అనుభవించటంవల్ల రోగం వస్తుందన్న భయం. మంచి పేరు ప్రతిష్ఠలున్నవారికి జాగ్రత్తగా ప్రవర్తించకపోతే చెడ్డపేరు వచ్చేస్తుందన్న భయం. ధనవంతులకు ఆ ధనాన్ని ఎలా కాపాడుకోవాలా అన్న భయం. అభిమానవంతులకు ఆత్మాభిమానం కాపాడుకోవాలన్న భయం. బలవంతులకు శత్రుభయం. సౌందర్యవంతులకు ముసలితనంవల్ల భయం. శాస్త్రజ్ఞులకు ప్రతివాదులవల్ల భయం. మంచివారికి చెడ్డవారివల్ల భయం. జీవులందరికీ మరణభయం. ఈ భయాలేవీ లేని చోటు అసలు ఉంటుందా?మానవులు తాము చూస్తున్నదీ, అనుభవిస్తున్నవీ శాశ్వతాలు కావనీ, ఇవన్నీ ఏదో ఒకరోజున నాశనమైపోయేవే అని గ్రహించగలిగి వాటిమీద మమకారాన్నీ, వ్యామోహాన్నీ తగ్గించుకొని- నిత్యమైనదీ, సత్యమైనదీ భగవంతుడొక్కడే అని గ్రహించగలిగితే- 'ఇది నాది, ఇది నేను' అనే భావన తొలగుతుంది. అదే వైరాగ్యం! అలాంటి వైరాగ్యం కలిగినప్పుడు భయానికి చోటుండదు. దాన్ని అలవరచుకోవటానికి ప్రయత్నించాలి! అదే విషయం చెప్పాడు భర్తృహరి-

భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయం
మానే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయాభయమ్‌
శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాన్తాద్భయమ్‌
సర్వం వస్తు భయాన్వితం భువినృణాం, వైరాగ్యమేవా భయమ్‌
(వైరాగ్య శతకం)

- పి.వి.బి.శ్రీరామమూర్తి
((Eenadu, 30:08:2007)

Labels: ,

Monday, September 03, 2007

CONCENTRATION & CONFIDENCE:

ONCENTRATION:

The Two Minute Mind is an excellent exercise for developing concentration. Simply stare at the second hand on your wristwatch for two minutes and think about nothing else for that time. At first your mind will wander but after 21 days of practice, your attention will not waver during the routine. One of the greatest qualities a person can develop to ensure his success is the ability to focus for extended periods of time. Learn to build up your concentration muscles and no task will be too difficult for you.

To enhance your concentration, read a passage in a book you have never explored. Then try to recite it verbatim. Practice this for only 5 minutes a day and enjoy the results which follow after a few months of effort.

83% of our sensory input comes from our eyes. To truly concentrate on something, shut your eyes and you will remove much distraction.

Get into the habit of memorizing beautiful poetry. Not only will it be a great source of entertainment but it will quickly lift your intellectual functions to a higher level by improving your memory, concentration and mental agility.


CONFIDENCE:

In this unpredictable world, confidence is a most useful asset. There are inevitably many situations which we face with alarm. In such cases, a timid person may give up and run away. A vain and egotistical person may bluff and bluster. But a confident person will size up the situation, prepare himself as well as possible, and then tackle it with a determination to succeed, or at least to make a good attempt.

Ø A con-man once reported with a reference letter from his previous employer. The letter said, “This man is a good worker, but be careful- he is a gambler too. Any help extended to him will be greatly blah! Blah! Blah!”

The new employer looked at him and asked, “I hear you are a gambler. What do you bet on?”

The con-man for once spoke truthfully, “practically anything, Sir, if you want, I will bet rs.1000/- that you have got a dark patch under your arm.”

The employer got angry. He decided to teach this man a lesson. He said, “Put your money down.” Then he took off his shirt and surprisingly the con-man lost. The employer, satisfied with himself, phoned the ex-employer to boost about his achievement against the con-man.

“I don’t think he will bet again in a hurry.” “Don’t be too confident,” said the old employer. “He had taken a bet of rs.2000/- with me that within five minutes of his reporting at your office, he will get you to take off your shirt. I guess he won.”

One of the golden rules in presenting your ideas is that you should first of all be confident about yourself. You should not be hesitant in taking responsible risks. The world is looking for people with confidence and a decisive spirit. How confident are you?

ü The story of the human race is the story of men and women selling themselves short.

ü Confidence isn't something that you get. It's something that you are.

ü Act boldly and unseen forces will come to your aid.


(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)

--------------------------------------

Labels:

Sunday, September 02, 2007

'బోగస్‌'స్వాములు

'కలడు కలండనెడివాడు కలడో లేడో' అన్నది సాక్షాత్తూ దేవుడి గురించిన డౌటు. ఇది పోతన భాగవతం లోది. 'కలదు కలందనెడి సంస్థ కలదో లేదో' అన్నది వ్యాపార బాగోతం. దీనిని తిప్పి చూస్తే ఎందరో 'బోగస్‌'స్వాములు ఎందెందు వెదకి చూసిన అందందే కలరన్న పద్యపాదం కనపడుతుంది. వ్యాపారమంటే కోట్లు లక్షలు పెట్టుబడి పెట్టాలి; 24X7 శ్రమపడాలి అన్న భావనకు పోటీగా పెట్టుబడులెందుకు? పట్టుబడకుండా ఉంటే అదే పది లక్షలు అదే పది కోట్లు అన్న ధోరణి ప్రబలుతోంది. మాయ వ్యాపారులు మాయం కాగానే ఉన్నావా అసలున్నావా అన్న పాట పాడాల్సి వస్తోంది. 'జమీందారు రోల్సు కారు మాయంటావూ! బాబూ ఏమంటావూ?' అన్న శ్రీశ్రీ మాటలు వింటే ఆహా ఓహో అనుకుంటాం. కారు మాయ కాకపోవచ్చు లేని కారును ఉన్నట్లు భ్రమ కలిగించి డబ్బు కొట్టేసే మాయ'దారుల్లో'ని మోస'కారు'లను తలుచుకుంటే మాత్రం 'కార్‌'ఫుల్‌గా ఉండాలనిపిస్తుంది. సృష్టికి ప్రతిసృష్టి ఉన్నట్టే, అసలు వ్యాపారులకు తోడు బోగస్‌ వ్యాపారాలూ పుట్టుకొస్తున్నాయా అనిపిస్తోంది. మాయల మరాఠీ ఒక్కడు కాదు ఎంతోమంది ఉన్నారనిపిస్తుంది. వాక్చాతుర్యం ఉంటే చాలు 'ఫేక్‌'చాతుర్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు. నకిలీ స్టాంపులు, నకిలీ నోట్లు, నకిలీ సంస్థలు నకిలీ సర్టిఫి'కేట్లు' కాదేదీ నకిలీకనర్హం అనిపిస్తుంది. నకిలీ నోట్లది చిదంబర రహస్యం అనడానికీ వీల్లేదు. అది పి.చిదంబరానికి కూడా తెలియని రహస్యమేమో. దాదాపు 1,69,000 కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ మన సమాజంలో చొరబడినందువల్ల బాధితులు 'చెల్లియో చెల్లకో...' పద్యం పాడుతున్నారని అంచనా. బోగస్‌ వ్యాపారమంటే సమాజం మీద జరిపే కుట్రతో సమానం. అన్నట్లు ఇంగ్లిషు వాడు స్థలాన్ని ప్లాట్‌ అన్నాడు. ప్లాట్‌ అంటే కుట్ర అని దాని అర్థం కూడా చెప్పాడు. దీంతో బోగస్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గురించి తెల్లవాడికి ముందే ఐడియా ఉందని తేలిపోయింది. ప్లాట్లు కాగితాల మీదనే కనపడుతున్నాయి తప్ప ఎన్ని పాట్లు పడ్డా భూమ్మీద ఆనవాలు చిక్కట్లేదు. బోగస్‌కు దిగాక ఒకటి కుదురుతుంది ఇంకోటి కుదరదనలేం. ముందు 'మోహన'ంగా సాగిన యూరో లాటరీ 'కోలా'టం ఎలా బంద్‌ అయిందో అందరికీ తెలుసు. అలాగే 'వీసా'సనీయ వర్గాల ప్రకారం ఆ మధ్య చెన్నైలో 9 మంది తెలుగు మహిళలు 'గాలి'వీసాలతో చెన్నై ఎయిర్‌పోర్టులో పట్టుబడి 'వీసా'విరహే తవదీనా... అని పాట ఎత్తుకున్నారు. ఒక పెద్ద మనిషి తానో పెద్ద ఎయిర్‌పోర్టు పెడుతున్నట్టు జనాన్ని నమ్మించి 15 కోట్లు గుటకాయ స్వాహా చేసిన 'ధన'కార్యం ముందు ఇదెంత అనిపిస్తుంది.

'ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన బోగసోడు' అని సర్కారు ఇటువంటి వాళ్ల వెంటపడి పట్టుకుని 'సమ్‌'కెళ్లు వేస్తుందని ఆశపడతాం. కానీ ఓ 'గద్ద'మనిషి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్నే 'సృష్టించేసి' మంది డబ్బును ఎగరేసుకుపోయాడు. దాంతో ఎంతో మంది 'జేబులొ డబ్బులు పోయెనే' అనే 'బాట' పాడుకోవలసి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు చూపిస్తామని గాలి కబుర్లు చెప్పి జేబులు కత్తిరించి, బిచాణా ఎత్తేయడం బోలెడు గిరాకీ ఉన్న వ్యాపారమైపోయింది. 'దొర'కేంత వరకు ఇటువంటి 'దొరలు' ఎందరో!
బోగస్‌ వ్యాపార సుందరి 'ఫోర్‌'జరీ అంచు చీర కట్టుకుని హొయలొలకబోస్తుంటుంది కూడా. బోగస్‌ వ్యాపారాలను 'మార్చి' మార్చి జనాన్ని ఏమార్చి ఒక నెలలోనే 15వేల కోట్ల రూపాయల మేరకు సాగించారని 'నోటు'మాటగా చెప్పవచ్చు. హ్యాపీ లైఫ్‌ కోసం ఆశపడి బీపీ లైఫ్‌ తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. బోగస్‌ నవ్వులు నవ్వి 'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా' అన్న సీను సృష్టించి నమ్మిన వాళ్లను రౌడీల చేత నట్టేట ముంచేట్టు చేయడమూ జరుగుతోంది!

చివరకు షాపింగ్‌లో బోగస్‌, సర్కారు ఇళ్ల కేటాయింపులోనూ బోగస్‌ వ్యవహారం 'చోటు' చూసుకుంటోంది! చిత్రమేమిటంటే బోగస్‌ వ్యవహారాల మీద స్ట్రాంగ్‌ యాక్షన్‌ తీసుకుంటామని మంత్రులు నమ్మకంగా చెప్తుంటారు. కొంత కాలానికి ఎంత గొప్ప 'యాక్షన్‌' అనిపిస్తుంది. మహామహా నటులు ఇంతగా నటించ లేరని వేరే చెప్పాలా?
-ఫన్‌కర్‌
(Eenadu, 01:09:2007)

Labels:

పిల్లలూ బహుపరాక్‌!

ఇల్లలకగానే పండగ కానట్లు పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు సంతోషపడటానికి లేదు. ఆ పిల్లలు ప్రయోజకులై నలుగురిలో మంచి పేరు తెచ్చుకుని కన్నవారిపట్ల తమ బాధ్యతను గుర్తెరిగి వృద్ధాప్యంలో వారిని ఆదరణగా చూసినప్పుడే ఆనందపడాలి! తమను కని అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో ఎంతమంది పిల్లలు శ్రద్ధగా చూస్తున్నారు? ''కొడుకు పుట్టాడంటే కొండలెక్కుదురు, రంభ కోడలు వస్తే రచ్చకెక్కుదురు...'' అంటూ సాగిపోతుందో జానపదగీతం. అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలా అని సామెత. ఇటువంటి గీతాలు, సామెతలు అన్నీ సమాజంలోని ప్రస్తుత పోకడలను ప్రతిబింబించేవే. ''కన్నందుకు మమ్మల్ని పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత మీదే'' అని పిల్లలు తల్లిదండ్రుల్ని అడగటానికి ఎంత హక్కుందో, ''మిమ్మల్ని పెంచి పెద్దచేసి ప్రయోజకుల్ని చేసినందుకు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకూ ఉంది'' అని డిమాండు చేసే హక్కు తల్లిదండ్రులకూ ఉంటుంది. ఈ రోజుల్లో అనేక కారణాలవల్ల కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతను గుర్తించటం లేదు. దాంతో వృద్ధాప్యంలో ఉన్నవారి స్థితిగతులు దయనీయంగా తయారవుతున్నాయి. పరీక్ష ఫెయిలై శలవుల్లో స్వగ్రామం కృష్ణరాయపురం అగ్రహారం వెళ్ళటానికి భయపడుతున్న వెంకటేశాన్ని గిరీశం పంతులు, ''నువ్వు శలవుల్లో యిక్కడుంటావా ఊరికి వెళతావా?'' అని అడుగుతాడు. అందుకు వెంకటేశం, ''వెళ్ళాల్నుందిగాని పాసు కాలేదంటే మా తండ్రి చావగొడతాడు...'' అంటాడు. ''దటీజ్‌ టిరనీ - యిదే బంగాళీ కుర్రవాడవుతే ఏం జేస్తాడో తెలిసిందా? తాతయేది తండ్రయేది కర్రపట్టుకొని చమ్డాలెక్కగొడతాడు'' అంటాడు గిరీశం అయ్యవారు. అలా అనటంలోని గురుబోధ తండ్రిని ఎదిరించమని చెప్పటమేనని వేరే వివరించనక్కరలేదు.

పిల్లలందరూ అలా ప్రవర్తించలేరు. తల్లిదండ్రుల మాటలనే శిరోధార్యంగా పరిగణించి అష్టకష్టాలు పడ్డవారూ ఉన్నారు. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు నారచీరలు ధరించి వనవాసం చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన పితృభక్తి, కార్యదీక్షా ఈనాటికీ మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచి ఉన్నాయి. ద్వాపరయుగంలో పూరుడు తన తండ్రి కోరిక ప్రకారం ఆయన వృద్ధాప్యాన్ని తాను ధరించి భరించి తన యౌవనాన్ని ఆయనకిస్తాడు. యయాతి చక్రవర్తి వయసుమీరి జరా రుజగ్రస్తుడైనా విషయవాంఛలు వదులుకోలేక తన కొడుకులను పిలిచి- ''మీలో ఒక్కడు నా ముదిమిగొని తన జవ్వనము నాకివ్వండి'' అని అడుగుతాడు. అందుకు కొడుకులెవ్వరూ అంగీకరించరు. ''తగిలి జరయు రుజయి దైవవశంబున నయ్యెనేని వాని ననుభవింత్రుగాక...'' అంటూ హితోపదేశం మొదలుపెట్టి, ''యెరిగి యెరిగి కడగి యా రెంటి జేకొందురయ్య యెట్టి కుమతులైన?'' అంటారు. అప్పుడు ఆఖరువాడైన పూరుడు తన యౌవనం తండ్రికిచ్చి ఆయన వృద్ధాప్యాన్ని తాను స్వీకరిస్తాడు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి పుణ్యక్షేత్రాలన్నీ తిప్పిన శ్రావణకుమారుని కథ లోకప్రసిద్ధమే. తండ్రి జంగమారాధన దీక్షను పరిపూర్ణం చేయటానికి తనను తాను అర్పించుకుంటాడు సిరియాళుడు. పురాణాల్లో, చరిత్రలో ఇటువంటి ఉదంతాలు ఎన్నో. కాలం ఒక్కతీరుగా నడవదు. కాలం మార్పువల్ల మనుషుల మనస్తత్వాల్లోను ప్రవర్తనలోను ఎన్నో మార్పులొచ్చాయి. పెద్దవారిపట్ల భక్తిశ్రద్ధలు తగ్గిపోయాయి. ''తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు పుట్టెనేమి వాడు గిట్టెనేమి...'' అని వేమన కవీంద్రుడు విసుక్కొనేదాకా దిగజారిపోయింది వ్యవహారం.

ఆలికి అన్నం పెట్టనివాడు ఆచారం చెప్పె- తల్లికి తిండిపెట్టని వాడు తగవు చెప్పె అని సామెత. ఆత్మీయులపట్ల అనాదరణ చూపేవారిని సమాజం చిన్నచూపే చూస్తుంది. తల్లిదండ్రులపట్ల పిల్లలకు, పిల్లల ఎడల తల్లిదండ్రులకు సహజంగానే మమతానురాగాలు ఉంటాయి. లోగడ పెద్దవారిని గౌరవించటం వారి సౌకర్యాలు చూడటం తమవంతు బాధ్యతగా చిన్నవారు భావించేవారు. ఆనాటి కుటుంబ వ్యవస్థలో వృద్ధుల భద్రతా భావానికి లోటుండేది కాదు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపు కనుమరుగైపోయింది. దాంతో వృద్ధులైన తల్లిదండ్రులు తాము కన్న సంతానానికే భారమైపోతున్నారు. కొంతమంది తమ తల్లిదండ్రుల్ని ఏ వృద్ధాశ్రమంలోనో చేర్చి చేతులు దులిపేసుకుంటుంటే, మరికొందరు ఆ మాత్రం శ్రమా తీసుకోకుండా వారి ఆలనా పాలనా చూడటమే మానేశారు. తాము కని, పెంచి, పెద్దచేసిన పిల్లలే తమను నిరాదరణగా చూస్తుంటే తట్టుకోలేక వృద్ధులైన తల్లిదండ్రులు ఎంతోమంది తల్లడిల్లిపోతున్నారు. అటువంటివారిని ఆదుకోవాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం వృద్ధాప్య బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులను నిరాదరించే పిల్లలకు మూడునెలల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఏర్పడుతుంది. సంపాదనాపరులైన పిల్లలు తల్లిదండ్రులను సమాదరించాలి. కొన్ని సందర్భాల్లో నెలకు పదివేల రూపాయలవరకు జీవన భృతి ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో అటువంటి పిల్లలు శ్రీకృష్ణ జన్మస్థానం సందర్శించవలసిరావచ్చు. ఈ చట్టం అమలులోకి వస్తే వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా చూసే పిల్లల ఆటకట్టినట్లే అవుతుంది. ''అమ్మానాన్నలే అవనిలోన దేవతలు కాదంటే తప్పదులే కటకటాల కాపురం'' అన్న గ్రహింపు కలిగి ఇప్పట్నించీ పిల్లలు బహుపరాక్‌గా ఉండటం మంచిది!
(Eenadu, 02:09:2007)
-----------------------------------------------------

Labels: