1273-హైదరాబాద్‌పై పోటాపోటీగా కావూరి-జైపాల్ వాదనలు
హౖదరాబాద్‌ను చారిత్రక కోణంలో చూడాలి:
జైపాల్‌రెడ్డి, సీమాంధ్ర ప్రాంత మంత్రులు వ్యక్తంచేసిన అభిప్రాయంతో విభేదిస్తున్నందుకు బాధ పడుతున్నట్లు చెబుతూ... ''తెలంగాణను చారిత్రక కోణంలో చూడాలి. ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేపథ్యాన్ని, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన గతులను చూడాలి. ఫజల్అలీ కమిషన్ కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని వ్యతిరేకించింది. సమైక్య రాష్ట్రంలో ముల్కీ నిబంధనలు, పెద్దమనుషుల ఒప్పందాలు, జోనల్ వ్యవస్థ వచ్చాయి. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు 300 మంది చనిపోయారు. 1971లో మళ్లీ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ ఇచ్చిన గరిబీ హటావో నినాదం ఉన్నప్పటికీ తెలంగాణలో పార్టీ ఓడిపోయింది. అప్పట్లో తెలంగాణ ప్రజా సమితికి 11 సీట్లు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రహ్మానందరెడ్డిని, ఆంధ్ర ఉద్యమ సమయంలో పీవీ నరసింహరావును (పదవుల పరంగా) త్యాగం చేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి విభజన ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 2004లో కనీస ఉమ్మడి కార్యక్రమంలో కూడా తెలంగాణను పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పాం. శ్రీకృష్ణకమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. మహారాష్ట్రకు బాంబే ఎలాగో తెలంగాణకు హైదరాబాద్ అలా అయిపోయింది. దీన్ని చారిత్రక కోణంలో చూడాలి. దేన్నయినా మార్చొచ్చుకానీ భౌగోళిక పరిస్థితులు మార్చలేం. 1956లో హైదరాబాద్ దేశంలో 5వ పెద్దనగరం. ఈరోజున కూడా అదే స్థానంలో ఉంది. హైదరాబాద్ నగరాభివృద్ధిలో తెలుగేతరుల శ్రమే ఎక్కువగా ఉంది'' అని పేర్కొన్నారు.
అంతకుముందు కావూరి సాంబశివరావు సీమాంధ్ర ప్రాంతంలో రెండు నెలలుగా జరుగుతున్న ఉద్యమం గురించి వివరించారు. ''60 రోజుల నుంచి తీవ్రంగా నడుస్తున్న ఉద్యమాన్ని దురదృష్టవశాత్తు జాతీయ మీడియా చూపెట్టడం లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ జరగడం లేదని మీరు భావిస్తున్నట్లున్నార''ని ఆక్షేపించారు. తాము నియోజకవర్గాలక్కూడా పోలేక పోతున్నట్లు వాపోయారు. ఆ వాదనలను జైపాల్‌రెడ్డి తోసిపుచ్చారు. ''అలాగైతే మేం కూడా నాలుగేళ్ల నుంచి ఇక్కడే ఇరుక్కుపోయాం, డిసెంబర్ 9 ప్రకటన నాటి నుంచి మేం కూడా నియోజకవర్గాలకు వెళ్లలేని సంకటస్థితిని ఎదుర్కొంటున్నా''మని వాపోయారు. ''కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో ఎప్పుడూ ఎక్కడా తెలంగాణా ఇస్తామని చెప్పలేదు. ఎందుకు తెలంగాణా ఇవ్వడానికి తొందరపడుతున్నారు. వైకాపా, తెలుగు దేశం పార్టీలు విభజన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గే సమయంలో కాంగ్రెస్ ఎందుకు వేగంగా ముందుకెళ్లాలి? శ్రీకృష్ణకమిటీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని పేర్కొంది'' అని కావూరి గుర్తు చేయగా... అదే శ్రీకృష్ణకమిటీ అయిదో అంశం కింద రాష్ట్రాన్ని విభజించాలని కూడా చెప్పింది కదా అని జైపాల్ పేర్కొన్నారు.
ఏకాభిప్రాయం అసాధ్యం-వినోభా కాలంలో లేం:
ఏకాభిప్రాయం అంశం గురించి వచ్చినప్పుడు జైపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ''ఏ అంశంపైనా 100 శాతం ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మొరార్జీదేశాయ్ ముంబాయి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి రామ్‌కిషన్‌కూడా! 66లో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టి పంజాబ్ రాష్ట్రాన్ని విభజించారు. అక్కడ ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి అలా చేశారు. వినోభాభావే కాలంలో 100 శాతం అభిప్రాయం ఉంటేనే ఏకాభిప్రాయం కింద లెక్క. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. మనం ఆ కాలంలో లేం. కాబట్టి పూర్తి ఏకాభిప్రాయం అసాధ్యం. దాదాపు ఏకాభిప్రాయం తీసుకుంటే చాలు. తెలంగాణ కూడా 60 ఏళ్ల నుంచి మండుతోంది. నేను ఒకప్పుడు సమైక్య వాదిని అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యవాదిని'' అని పేర్కొన్నారు. అంతకుముందు పళ్లంరాజు 10 ఏళ్లకు మించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కోరారు. కావూరి మాట్లాడుతూ తాను పార్టీని ధిక్కరించే వాణ్ణి కానని, కానీ ఇప్పుడు వ్యవహరించిన తీరు మాత్రం తనను తీవ్ర వేదనకు గురి చేసిందని స్పష్టం చేశారు.
అంతా తెలంగాణకే జై
ఇద్దరు సీమాంధ్ర మంత్రులు తప్ప మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన వారంతా తెలంగాణకే జై కొట్టార
Labels: Events, Hyderabad, India/Telugu, Life/telugu, Places, Telugu/ culture