My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, March 25, 2010

గెలిచిన సంప్రదాయం

యావత్ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయిన రోజులివి. ఎల్లల రూపేణా దేశాల మధ్య విభజనరేఖలు ఏర్పడిఉండవచ్చుకానీ, మనుషుల నడుమ సరిహద్దులుచెరిగిపోతున్నాయి. ఒకదేశానికీ, మరోదేశానికీ మధ్య పరస్పరఅపనమ్మకాలో, అపోహలో అడ్డుగోడలై నిలిచి ఉండొచ్చుకానీ- మనుషుల మనఃకవాటాలు మాత్రం విహంగబాహువుల్లావిచ్చుకుంటూనే ఉన్నాయి. 'దేశమేదైతేనేం, మట్టంతా ఒక్కటే/ అమ్మ ఎవరైతేనేం, చనుబాల తీపంతా ఒక్కటే'నన్నకవివాక్కును సాకారం చేస్తూ- స్వదేశమేదైనా సరిహద్దులు దాటి, సముద్రాలు దాటి దేశదేశాల్లో స్థిరపడుతున్న వారెందరో ఉన్నారు. వాటిని తమ కర్మభూమిగా మలచుకుంటూ విశ్వజనయిత్రికికైమోడ్పులర్పిస్తున్నారు . 'ఇలాతలం విశాలం' అన్న ఉవాచకుతరాల తరబడి దివిటీ పడుతున్నారు. మహాకవి శ్రీశ్రీ మీటిన 'మనుష్య సంగీతాన్ని, చాటిన మానవ సందేశాన్ని, సరిహద్దులెరుగని సకల జగజ్జనులు' విశ్వవీణపైపలికిస్తున్నారు. అంతర్జాతీయ యవనికపై విశ్వమానిసి విరాట్రూపంతో ప్రత్యక్షమవుతున్న కాలమిది. ఖండాంతరాల్లోనివాసమేర్పరచుకున్నా- తమ ప్రాచీన నెలవుల్ని ఎవరూ మరచిపోలేరు. ఎక్కడ ఉన్నా, 'ఫలానా' దేశానికి చెందినసంతతిగా స్వీయ అస్తిత్వపతాకాన్ని వారు రెపరెపలాడిస్తూనే ఉంటారు. తాతముత్తాతలు, తండ్రుల మూలాల్లో వారికితమ జీవన మంత్రధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి. తరతరాల కిందట తమ పెద్దలు నడయాడిన నేలను తలచుకుంటే, అనిర్వచనీయమైన పులకరింత; వారిని తడిమిన గాలి స్ఫురణకు వస్తే దివ్య పరిమళం; పూర్వీకులు పుట్టిన వూరినిగుర్తుకు తెచ్చుకుంటే మధురానుభూతి- వారిని ఉద్విగ్నభరితుల్ని చేస్తాయి. ఎంత దూరాన ఉన్నా, నేల మృత్తికాసుగంధం వారిని వెన్నంటుతూనే ఉంటుంది. మా 'నివాసమ్ము తొలుత గంధర్వలోకమ్ము' అని వారు తన్మయత్వంతోఆలపించేలా చేస్తుంది.

వంశవృక్షపు వేళ్లను స్పృశించగలిగితే వాటి మౌనభాషలో- తరతరాల పేగుబంధపు గాథలు వినబడతాయి. ఆరు తరాల వెనక ఆఫ్రికా ఖండంలోని తన వంశ మూలపురుషుని పుట్టుపూర్వోత్తరాలను వెలుగులోకి తీసుకురావాలనికంకణం కట్టుకున్నాడు అమెరికన్‌ రచయిత ఎలెక్స్‌ హేలీ. పన్నెండేళ్లు శ్రమించి కృషిలోసంకల్పసిద్ధుడనిపించుకున్నాడు. ధనబలవంతుల దౌష్ట్యం, దౌర్జన్యం కారణాన బానిసలుగా బతుకులీడ్వాల్సివచ్చిన తనపూర్వీకుల మూలాల్ని తెలుసుకోవడానికి హేలీ సాగించిన అన్వేషణను తని నవల 'రూట్స్‌ (ఏడు తరాలు)' మనకళ్లకు కడుతుంది. మూలాలమీద మక్కువతోపాటు మనిషికి కొన్ని గట్టి నమ్మకాలు, గాఢ విశ్వాసాలు అంతకుమించి- తాను పుట్టిన నేలపైన ప్రేమాభిమానాలు ఉండటం సహజమే. తన చితాభస్మాన్ని హిమగిరులపైన విరజిమ్మాలని, ఇక్కడి నదీజలాల్లో కలపాలని, పొలాల్లో వెదజల్లాలని నెహ్రూ విల్లు రాశాడు. దేశపు గాలిపై, నీటిపై, మట్టిపై ఆయనమమకారానికీ మమతానురాగాలకూ అది తార్కాణం. జీవనవిధానానికి మూలమంత్రాలుగా తాము విశ్వసించేఆచారాలకు, సంప్రదాయాలకు ఎత్తుపీట వేయాలని మనుషులు భావించడంలో తప్పులేదు. 'తన పేరు తల్లి పేరును/ తను గాంచిన తండ్రి పేరు, దైవము పేరున్‌/ తను యున్న యూరు పేరును వినుకలిగా బ్రతుకవలయు...'నన్నాడు ఓ చాటుకవి. అనాదిగా మనం పాటిస్తున్న కొన్ని ఆచారాలూ సంప్రదాయాలూ జాబితాలో చోటు చేసుకోదగినవే. సంప్రదాయమంటే వారసత్వంగా సంక్రమించిన మంచితనమే. ఆచార్య సినారె మాటల్లో చెప్పాలంటే '... కడివెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లుగ/ మనకు మిగులును గతములోపలి మంచి; అదియే సంప్రదాయము'. మనిషిని నడిపించేది అదే.

ఆచారాలు, సంప్రదాయాలు ఒక్కో మతానికి ఒక్కోరకంగా ఉండవచ్చు. ఆయా మతస్తులు వాటికి కట్టుబడి మనుగడసాగిస్తుంటారు. శుభకార్యాల్లోనే కాదు, అశుభకార్యాల్లోనూ కొన్ని సంప్రదాయాలను అనుసరించడం- అన్నిమతాలవారిలో ఉన్నదే. తన నమ్మకాలకు, విశ్వాసాలకు అనుగుణంగా వాటిని పాటించడానికి మనిషితాపత్రయపడుతుంటాడు. తాను గౌరవించే సంప్రదాయాన్ని పదిలంగా కాపాడుకోవడానికి అవసరమైతే ప్రభుత్వంపైధర్మయుద్ధానికైనా సిద్ధమవుతాడు.
బ్రిటన్‌లో స్థిరపడిన దేవేందర్‌ ఘయ్‌ అయిదేళ్ల సుదీర్ఘకాలంపాటు అక్కడన్యాయపోరాటం సాగించి సాధించిన విజయమే అందుకు నిదర్శనం. తమ మతాన్ని ఆచరించే హక్కు బ్రిటన్లోనిహిందువులకు ఉన్నా- పార్థివశరీరాలకు హిందూమత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపే వీలు అక్కడలేదు. హిందువుల భౌతికకాయాల్ని శవదహనశాలలో దహనం చేయాలి తప్ప- కట్టెలతో చితి పేర్చడం, తలకొరివి పెట్టిఅంత్యక్రియలు జరపడం బ్రిటన్లో నిషిద్ధం. ఇటువంటి ఆంక్షలవల్ల- దేశంలోని భారతీయ సంతతికి చెందినహిందువులెవరైనా కనుమూస్తే, మతాచారాల ప్రకారం దహనక్రియలు నిర్వహించడానికి వారి పార్థివశరీరాల్నిబంధువులు భారత్కు తరలిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. దీనిపై 'ఆంగ్లో-ఆసియన్మైత్రీ సంఘం' వ్యవస్థాపకుడుదేవేందర్ఘయ్హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురైనా అప్పీళ్ల కోర్టుకు వెళ్లి 71ఏళ్ల వృద్ధుడు సాగించినపోరాటం- పట్టుదలకు వయసు అడ్డంకి కాదని చాటుతోంది. హిందువుల పార్థివశరీరాలకు చితిని పేర్చి, దహనం చేయడంచట్టబద్ధమేనని అప్పీళ్ల న్యాయస్థానం ఇచ్చిన తీర్పు- దేశంలో ఉన్నా తమ మతాచారాలకు, సంప్రదాయాలకు గౌరవందక్కాలని ఆకాంక్షిస్తున్నవారికి వూరట కలిగిస్తుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౦౭:౦౩ :౨౦౧౦)
____________________________________
‌ ‌ ‌ ‌

Labels:

Too good replies.. Must Read!


These are some random questions supposedly asked at the top level exams (I seriously doubt this).
But there are very witty answers. So read On...
----------------------------------------------
Q. How can you drop a raw egg onto a concrete floor without cracking it?

A. Concrete floors are very hard to crack! (UPSC Topper)

----------------------------------------------------

Q.If it took eight men ten hours to build a wall, how long would it take four men to build it?
A. No time at all it is already built. (UPSC 23 Rank Opted for IFS)
---------------------------------------------------


Q.If you had three apples and four oranges in one hand and four apples and three oranges in the other hand, what would you have?

A. Very large hands.(Good one) (UPSC 11 Rank Opted for IPS)
------------------------------------------------------


Q. How can you lift an elephant with one hand?

A. It is not a problem, since you will never find! An elephant with one hand. (UPSC Rank 14 Opted for IES)
------------------------------------------------------


Q. How can a man go eight days without sleep?

A. No Probs , He sleeps at night. (UPSC IAS Rank 98)
--------------------------------------------------------


Q. If you throw a red stone into the blue sea what it will become?

A. It will Wet or Sink as simple as that. (UPSC IAS Rank 2)
-----------------------------------------------------


Q. What looks like half apple?

A : The other half. (UPSC - IAS Topper)
-----------------------------------------------------


Q. What can you never eat for breakfast?

A : Dinner.
--------------------------------------------------


Q. What happened when wheel was invented?

A : It caused a revolution.

----------------------------------------------------

Q. Bay of Bengal is in which state?

A : Liquid (UPSC 33Rank )
-----------------------------------------------------


Interviewer said "I shall either ask you ten easy questions or one really difficult question", think well before you make up your mind!

The boy thought for a while and said, "my choice is one really difficult question."

Well, good luck to you, you have made your own choice! Now tell me this;

"What comes first, Day or Night?"

The boy was jolted into reality as his admission depends on the correctness of his answer, but he thought for a while and said, "It's the DAY sir!"

"How?", the interviewer asked,

"Sorry sir, you promised me that you will not ask me a SECOND difficult question!"

He was selected for IIM!
-----------------------------------------------------


"Technical Skill is the mastery of complexity, while Creativity is the master of presence of mind"
-----------------------------------------------------
(An email forward)
______________________________

Labels: ,

Sunday, March 21, 2010

మౌనరాగం


మౌనానికి ఎన్నో ముఖచిత్రాలు... ఇంకెన్నో భాషలు... మరెన్నో భాష్యాలు. అది- పూలరేకుల లాలిత్యాన్ని మరిపిస్తుంది. కత్తి అంచు కాఠిన్యాన్నీ తలపిస్తుంది. అంగీకార ముద్రను సంకేతిస్తుంది. తృణీకార సందేశానికీ ప్రతీక అవుతుంది. ఖేదాన్నీ, మోదాన్ని; రాగాన్నీ, ద్వేషాన్ని; సుఖాన్నీ, దుఃఖాన్ని; విషాదాన్నీ, మాధుర్యాన్ని భాషాంతరీకరిస్తుంది. మాట మాదిరే మౌనమూ పదునైనది. ఆ మాటకొస్తే అది మాటకంటే శక్తిమంతమైనది. పలుకుది శబ్దభాష, మౌనానిది నిశ్శబ్ద భాషణ! మాట్లాడటానికి చాతుర్యం చాలు. కానీ, మౌనంగా ఉండటానికి చాతుర్యంతోపాటు నిగ్రహమూ అవసరమే. అందుకే- 'మాటలకు అలవిగాని శక్తి, ఒదుగు మౌనానికి ఉన్నాయి. మాటలు ఆవగింజ పాలు పలుకుతవి. మౌనం కొండంతదాన్ని ముక్తసరిగా ఉద్ఘోషిస్తుంది' అన్నారు మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి. నిజమే. మాటలు బట్వాడా చేయలేని భావాలను అవలీలగా ప్రసారంచేసే కొంటెచూపుల భాష మౌనమే. కొండంత మమతను పెంచుకోవడం మినహా మరేమీ తెలియని పిడికెడు పిచ్చిగుండెదీ మౌనభాషే. గొంతుకలోన కొట్లాడుతున్న మాటను చెప్పాలన్న మనిషి తపనకు, చెప్పలేని మనసు నిస్సహాయతకు మధ్య ఉక్కిరిబిక్కిరయ్యే హృదయలయ భాష కూడా మౌనమే. ఆత్రేయ అన్నట్లు అది- 'సెవులుండే మనసుకే ఇనిపిస్తుంది'. ఎద పలికించే మౌనగీతాన్ని ఆలకించగల చెవులుండే మనసులున్నప్పుడు ఈ లోకంలో భగ్నప్రేమలూ ఉండవు, దగ్ధమానసాలూ ఉండవు. మాటలతో పనిలేనిది- నిశ్శబ్ద రవళుల్ని వినగలిగే మనసు మాత్రమే.

మాట, మౌనం బొమ్మా బొరుసులాంటివి. రెండువైపులా పదునున్న కత్తివంటివవి. అనుచిత సంభాషణను తుంచివేయగల మందు మౌనంతో మందలించడమే. అర్థం పర్థం లేని కోపతాపాలకు స్వస్తిపలికి మాటలు కలుపుకొంటే చాలు... ఎంత ఎడమొహం పెడమొహంగా ఉన్న మనుషుల మధ్యనైనా స్నేహగీతికలు పల్లవిస్తాయి. మౌనంగా ఉండేందుకు చాతుర్యనిగ్రహాలు ముఖ్యమైనట్లే- మాటలకు సంయమనం, సమతూకం ప్రధానం. కత్తిగాట్లయినా పూడుతాయేమో కానీ, కరకుమాటలు చేసే గాయాలు మాసిపోవు. 'మాన్పగలిగితి కత్తి కోతలు/ మాన్పవశమే మాట కోతలు/ కత్తి చంపును; మాట వాతలు మానవేనాడున్‌...' అన్న మహాకవి గురజాడ మహితోక్తి- నరంలేని మన నాలుక పలికే మాటతీరు ఎంత మృదువుగా ఉండాలో నిర్దేశించే దిక్సూచి. మాటయినా, మౌనమంత్రమైనా సందర్భావసరాలకు తగినట్లుగా ఉండటమే మనుషుల సంస్కారానికి, పరిణతికి గీటురాళ్లు. దిక్పాలకుల్లో ఒకర్ని వివాహమాడవలసిందిగా దమయంతిని కోరడానికి వారి తరఫు దూతగా వచ్చిన నలమహారాజు తన పేరు వెల్లడించడం పాడి కాదన్నాడు. 'పేరు సెప్పిన నీ కనాచారమేని/ మాకు నాయంబె నీ తోడ మాటలాడ' అంటూ దమయంతి అతణ్ని సూటిగా ప్రశ్నించడం ఆమె పరిణతికి అద్దం. అలా అంటూనే 'పలుకకుంట తిరస్కార కలనముద్ర/కాన ప్రత్యుత్తరమిచ్చుదాన నీకు' అంటూ ఆమె దూతకు ఇవ్వవలసిన మర్యాదనూ కనబరచింది. అవసరమైన సమయాల్లో నోరు విప్పకుండా మౌనమంత్రం పఠించడమూ అనర్థదాయకమే. వ్యక్తికే కాదు, సమాజానికీ అది చేటుతెస్తుంది.

'మౌనేన కలహం నాస్తి' అని పెద్దలు చెప్పినమాట చద్దిమూట. కాలంతోపాటు సామాజిక విలువల్లో, మానవీయ సంబంధాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న ఈ రోజుల్లో- సాంసారిక జీవనాన మౌనమూ కలహకారకమవుతోంది. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న కలతలు, కలహాలు, చిరుకోపాలు సహజమే. కొన్ని సందర్భాల్లో దంపతులు పరస్పరం మాట్లాడుకోకపోవడమూ కద్దు. అది కుటుంబ సంబంధాల్లో చిచ్చు పెట్టే స్థాయికి దిగజారకూడదు. దురదృష్టమేమిటంటే- అటువంటి ప్రమాదకర పోకడలు ఇప్పుడు మన సమాజంలో పొడచూపుతుండటం! జీవిత భాగస్వామి తన పట్ల కఠినంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణతో- విడాకులకోసం దంపతుల్లో ఎవరో ఒకరు కోర్టుల్లో దాఖలు చేస్తున్న కేసులు అనేకం. దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా మౌనవ్రతం పట్టడమూ వైవాహిక సంబంధాల్లో 'కాఠిన్యం' కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ మధ్య పేర్కొంది. విడాకులకు సంబంధించిన కేసులను పరిష్కరించేటప్పుడు ఇతర అంశాలతోపాటు ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలని కింది కోర్టులను ఆదేశించింది. తమ సంసార జీవనంలో కస్తూరిబా, తాను రోజుల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా భీష్మించుకున్న సందర్భాలూ ఉన్నాయని గాంధీజీ తన ఆత్మకథలో రాశారు. అవేవీ తమ సంసారయాత్ర సాఫీగా సాగడానికి ఎన్నడూ అవరోధం కాలేదని ఆయన అన్నారు. అందుకు కారణం- తనమాటే భార్య విని తీరాలన్న పురుషాధిక్య ధోరణితో బాపూ వ్యవహరించకపోవడం, తనపై భర్తకు గల ప్రేమానురాగాలను కస్తూరిబా అర్థంచేసుకోవడం! అటువంటి సర్దుబాటు తత్వం ఉంటే- భార్యాభర్తల మధ్య మౌనమంత్రంలోనూ మంగళవాయిద్యాలు వినిపిస్తాయి. అహం విడనాడి మాటలు కలుపుకొంటే, జీవనయాత్రా పథమంతా పూలపుంత అవుతుంది.
(ఈనాడు, సంపాదకీయం, ౨౮:౦౨:౨౦౧౦)
____________________________________

Labels:

DIFFICULT PROBLEMS – STRANGE SOLUTIONS!

Imagine you are the manager of a 10 story office building that was built back in the days when everybody has big spacious offices. Back then two elevators were sufficient to handle number of people working in the building. But over the years large offices got converted into small cubicles and now it’s obvious that two elevators can not handle the number of people.

You have installed the fastest and most efficient computer operated elevators yet every morning and afternoon crowds of angry employees gather in the lobbies grousing about having to wait for 3 minutes or more before they can catch a ride. Tenants are threatening to leave. It’s a Crisis time.

What do you do?
If you think the problem logically (or Vertically top to down approach) it seems obvious that u have to figure out a way either (a) to get more people up and down faster or (b) to reduce number of people going up and down.

You could therefore:
Make the elevator shaft larger & put in larger elevators,
Or bore a hole through the building & install new elevators,
Or turn the stairways into escalators,
Or work with various employees in the building to stagger their starting and quitting times,
Or sponsor programs that extols the benefits of stair-climbing and other benefits.

All these ideas are good one's (some may be very expensive) and all would probably work to one degree or another.But when the manager of an office building in Chicago was faced this identical problem she did none of these things.

Instead she installed wall to wall, Floor to ceiling Mirrors in every elevator lobby. She figured that people wouldn't mind waiting so much if they could spend that time looking at themselves. The solution worked perfectly.

In short she solved a different problem. Instead of trying how to add elevators and escalators or how to reduce number of people; she changed the problem and asked herself, "How do I make waiting less frustrating?”

Some times, by looking at the other side of the problem you my reach the solution.
- - - - - - - - - - - - -

Labels:

శతాయుష్మాన్‌భవ!


అసలు 'వంద' అనే పదంలోనే అలౌకికమైన అందం ఉందనడం అతిశయోక్తి కానేకాదు. వంద అనగానే వందనాలు అర్పించాలనిపిస్తుంది. నూరు- నిండుదనానికి ఓ కొండగుర్తు... గమ్యసాధనకు ఓ గీటురాయి... జీవన ప్రస్థానపథంలో ఓ మేలిమలుపు! 'శతాయుష్మాన్‌భవ' అంటూ నిండుమనసుతో పెద్దలు పలికే దీవెనలు గంధర్వగానానికి ప్రతిధ్వనులై పిన్నలను అలరిస్తాయి. బతుకంతా నూరేళ్లపంటలా పండించుకొమ్మని ఆహూతులు జల్లే ఆశీరక్షతలు, పెళ్లిపీటల మీది వధూవరులకు దేవతలు కురిపించిన అమృతపు సోనలనిపిస్తాయి. దాంపత్యం వందేళ్ళ సౌభాగ్యంతో తులతూగుతూ సాగిపోవాలనే శ్రేయోభిలాషుల శుభకామనలు- ఏ జంటకైనా వెన్నెల్లో తడిసినంత చల్లదనాన్నిస్తాయి. బుజ్జి పాపాయికి పొలమారినా, ఆ చిన్నారి 'హాఛ్‌' అంటూ చిన్నగా తుమ్మినా- తలను చేతితో మృదువుగా తడుతూ 'శతాయుష్షు' అంటూ అమ్మ అందించే ఆశీర్వాదం మాతృవేదఘోషలా వినిపిస్తుంది. ఈ రోజుల్లో తెలుగు కట్టూబొట్టుకు నిలువుటద్దమైనవారిని అసలు సిసలు తెలుగుదనానికి ప్రతిబింబాలుగా ప్రశంసించాలంటే అందుకు తగిన ఉపమానం 'నూరు' నయాపైసలే తప్ప, గతంలో మాదిరి పదహారణాలు కాదు. ఇప్పుడంటే నూర్రూపాయల నోటు కాగితం పల్చబడి, పరిమాణంలో చిక్కిపోయిందికానీ- ఒకప్పుడు దాని దర్జాయే వేరు. దాదాపు పావుఠావు మందాన ఫెళఫెళలాడుతూ, నాలుగు మడతలు పెడితే తప్ప పర్సులో ఇమడనంత సైజులో ఉండేదా నోటు. వెయ్యి, అయిదువందల రూపాయలు నోట్లు వచ్చినా, 'పచ్చనోటు' అని ఘనకీర్తి దక్కించుకున్నది వందరూపాయల నోటొక్కటే!

వంద అంకెమీద అందరికీ మక్కువే. సరిహద్దులెరుగని యువజనులు 'బౌండరీలు దాటే మనస్సు మాది' అని సగర్వంగా చాటుకుంటూ 'సెంచరీలు కొట్టే వయస్సు మాది' అంటూ నూరుకు మారాకు తొడుగుతుంటారు. కవులూ అందుకు మినహాయింపు కాదనడానికి- తెలుగు అక్షర భాండాగారాన్ని సుసంపన్నం చేసిన ఎందరో సారస్వతమూర్తులు సృజించిన శతక సాహిత్యమే సాక్ష్యం. చాలా ఏళ్ల తరవాత పద్యాలు రాస్తూ 'అందంగా, మధురస నిష్యందంగా/ పఠితృ హృదయ సంస్పందంగా/ కందాలొక వంద రచించిందికి మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా' అన్నాడు శ్రీశ్రీ. వ్యంగ్యం, నీతి, ఉపదేశంతో కూడిన తన 'సిరిసిరిమువ్వ' శతకంలో వందకు పైగానే కంద పద్యాలు విరచించి ఆ ముచ్చట తీర్చుకున్నాడు మహాకవి. నిజానికి అన్నింటా సింహాసనం నూటికే! ఓ నాటకం రంగస్థలం మీద వంద ప్రదర్శనలు పూర్తిచేసుకుంటే ఒక పండుగ. చలన చిత్రం వెండితెరమీద శతదినోత్సవానికి పరుగులు తీస్తే వేడుక. వంద సినిమాల్లో నటించడం అభినేతల కీర్తిమకుటంలో కలికితురాయి. గణితం, శాస్త్రీయ విజ్ఞానం వంటి సజ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోవటం విద్యార్థికి గర్వకారణం. మనిషి వందేళ్ల పరిపూర్ణ జీవనం గడపగలగడం ఓ అద్భుతం! 'అమ్మ కడుపు చల్లగా, అత్తకడుపు చల్లగా' ఆ అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ, నూరేళ్ల నిండుజీవితాన్ని జీవించి తుదిమజిలీలో పండుటాకులా రాలిపోయినవారు ఉన్నారు. వందేళ్లకు పైబడినా పూర్తి ఆయురారోగ్యాలతో ఉల్లాసంగా జీవించడంలోని జీవన మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నవారూ ఉన్నారు. 'పుట్టుట గిట్టుట కొరకే'నని తెలిసినా మనుషుల్లో జీవితేచ్ఛ, సుఖభోగలాలస నశించవనడానికి యయాతి చరిత ఓ ఉదాహరణ. ముదిమి ముదిరినా శృంగారేచ్ఛను వదులుకోలేని ఆ రాజుకు తన యౌవనాన్ని ప్రదానంచేసి, ఆయన ముసలితనాన్ని తాను స్వీకరించాడు కుమారుడు పూరుడు. కొడుకు నుంచి సంప్రాప్తించిన యౌవనశక్తితో యయాతి వెయ్యేళ్ల సంసార సుఖాలు అనుభవించి సంతుష్టుడై, పూరుడి జవ్వనాన్ని తిరిగి అతనికి ఇచ్చి, తన వార్ధక్యాన్ని తాను తీసుకున్నాడన్నది 'మహాభారతం'లోని కథ.

మిసిమి ప్రాయాన్ని, ముదిమి వయసును పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఇదేమీ పురాణయుగం కాదు. అలాగే, వెయ్యేళ్లు 'సుఖంబులు బడయుట' కూడా- నూరేళ్లు బతకడమే అబ్బురమనిపించే ఈ రోజుల్లో అసాధ్యమే. బహుశా అందుకే కాబోలు- 'ఎవడు బతికేడు మూడు యాభైలు' అన్న సామెతను కొందరు తరచూ ఉటంకిస్తుంటారు. ఆ నానుడిని ధిక్కరిస్తున్నట్లుగా- శత వసంతాలే కాదు, ఆ తరవాతా మనుషులు సంపూర్ణ ఆరోగ్యంతో, హాయిగా జీవితం గడపడానికి దోహదం చేసే పరమాద్భుత మాత్ర రూపుదిద్దుకుంటోంది. మరో మూడేళ్లలో ప్రాథమిక పరీక్షలకు సిద్ధం కానున్న ఆ అమృతగుళిక తయారీలో ప్రపంచంలోని పలు ప్రయోగశాలలు నిమగ్నమై ఉన్నాయి. మనిషి శతాధిక వత్సరాలు జీవించడానికి ఉపకరించే మూడురకాల జన్యువుల కలబోత అయిన ఈ మాత్రకు 'లాంగ్‌ లైఫ్‌ పిల్‌ (సుదీర్ఘ జీవన ప్రదాన గుళిక)'గా శాస్త్రజ్ఞులు నామకరణం చేశారు. ఆరోగ్యంతో కూడిన జీవనం, వయసు మీరేకొద్దీ ఉత్పన్నమయ్యే సమస్యలు, దీర్ఘాయువు- ఈ మూడింటినీ నియంత్రించే మూడు జన్యువుల ప్రభావాన్ని ఒకే మాత్రలో మేళవించడానికి ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నట్లు లండన్‌లోని 'ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వైద్య కళాశాల'కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ గుళిక అందుబాటులోకి వస్తే అది మానవాళి పాలిట- రామాయణకాలం నాటి సంజీవని వంటిది కాగలదనడంలో సందేహం లేదు. ఆదికావ్యంలోని ఆ మందులకొండలో సంజీవ, విశల్య, సంధాన, సౌవర్ణ కరణులనే నాలుగు ఔషధాలున్నాయన్నది రుషివాక్కు. వాటి ప్రభావంతో- అంతకుముందు రామరావణ యుద్ధంలో మూర్ఛిల్లిన లక్ష్మణుడు, వానర వీరులు తిరిగి తేరుకున్నారట. కొత్తగా రాగలదని ఆశిస్తున్న సుదీర్ఘ జీవన ప్రదాన గుళికలోని జన్యువులూ అలా పనిచేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?
(ఈనాడు, సంపాదకీయం, ౧౪:౦౨:౨౦౧౦)
____________________________


Labels: