My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, September 02, 2008

హనుమంతుడి విశ్వరూపం


భారతీయులకు హనుమంతుణ్ని వివరంగా పరిచయం చేసిన కావ్యం- వాల్మీకి రామాయణం! ఒక భీష్ముడు, ఒక దశరథుడు, ఒక విశ్వామిత్రుడు తెలిసినంత బాగా మనకు- మన సొంత తాత ముత్తాతల గురించి తెలియదు. అందుకు కారణం- వ్యాసవాల్మీకులు. వారి పాత్ర చిత్రణా చాతుర్యం కారణంగా- ఆయా పాత్రలతో మనకు గట్టి పరిచయం, చనువు ఏర్పడ్డాయి. పరిచయం పెరిగిన ఫలితంగా క్రమంగా వారంతా పురాణ పురుషులే తప్ప, కల్పిత పాత్రలు కారనే ఒకానొక ప్రగాఢ విశ్వాసం బలంగా వేళ్లూనింది. విశ్వాసం బలపడిన కొద్దీ, మూలానికి అతీతంగా కూడా ఆయా పాత్రల గురించి ఊహించడం మొదలైంది. క్రమేపీ వాళ్లలో కొందరు దైవాలుగా దర్శనం ఇచ్చారు. హనుమంతుడు దేవుడైంది ఆ విధంగానే. భక్తుడి విశ్వాసానికి ప్రతిరూపమే- భగవంతుడు! భక్తుడి భావనలు ఎన్ని విధాలో, భగవంతుడికి అన్ని రూపాలు. భక్తుడి విశ్వాసం ఎంత బలమైనదో, భగవంతుడు అంత బలమైనవాడు. నిజానికి వాల్మీకి రామాయణంలో హనుమంతుడు భక్తుడే తప్ప, భగవంతుడు కాడు. శ్రీరామచంద్రుణ్ని సైతం భగవంతునిగా వాల్మీకి పేర్కొనలేదు. 'పురుషోత్తముడు' అన్నాడంతే! 'అంజనానందనం వీరం- జానకీ శోకనాశనం' అన్నంత వరకే వాల్మీకి చిత్రణ. దాన్ని అందిపుచ్చుకున్న అన్నమయ్య 'బాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి సేతల హనుమంత!' అన్నాడు. భక్తి, వినయం, వివేకం, బలం, ధైర్యం, వాక్పటిమ, సమయజ్ఞత వంటి ఉన్నతోన్నత గుణాల మేలు కలయికగా వాల్మీకి హనుమను పరిచయం చేశాడు. ఆ చిత్రణ భక్తుల గుండెల్లో ఎంతటి బలమైన ముద్రవేసిందంటే- యత్రయత్ర రఘునాథకీర్తనం, తత్రతత్ర కృత మస్తకాంజలి... ఎక్కడెక్కడ శ్రీరామనామం వినవస్తున్నా- అక్కడక్కడల్లా వినయంగా తలవంచి, చేతులు మోడ్చి, ఆనంద బాష్పాలు చిందించే హనుమంతుడు సాక్షాత్కరించడం మొదలైంది. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన పిల్లవాణ్ని 'ఆంజనేయ దండకం చదువుకుని పడుకో నాన్నా... భయం లేదు' అంటూ వీపుమీద జోకొట్టిన అమ్మ చేతిస్పర్శలా, ఓదార్పు వచనంలా- హనుమ అనే భావన ధైర్యం చెబుతూ వచ్చింది. చెలిమి చేసిన వానర సహచరులకీ, చేరదీసిన ప్రభువు సుగ్రీవుడికీ, ఆరాధ్యదైవమైన శ్రీరాముడికీ సైతం సహాయపడిన 'అభయ' ఆంజనేయుడు తమ పాలిట సర్వభద్రంకరుడన్న గట్టి విశ్వాసం భక్తుల్లో వ్యాప్తిచెందింది.

ఉదాత్తమైన వ్యక్తిత్వంతో విశేషంగా ఆకర్షించి, భక్తుల హృదయాల్లో దేవునిలా ఎదిగిపోయిన హనుమకు ఎంతో ప్రాచుర్యం లభించింది. లక్ష్మణుడికీ, భరతుడికీ ఎక్కడా విడిగా గుడులు లేవు. హనుమ శ్రీరాముడికన్నా అధిక సంఖ్యలో తన పేరిట మందిరాలు వెలసిన చరిత్రను సొంతం చేసుకున్నాడు. దివ్య దేవాలయ ప్రాంగణం వంటి రామాయణంలో సుందరకాండను గర్భగుడిగా స్థిరపరచి, దాన్ని నిత్య పారాయణకాండగా మలిచాడు. వానరుడై జన్మించి, భక్తునిగా పరిచయమై, దైవంగా ఎదిగినవాడు హనుమంతుడు. సముద్రాన్ని లంఘించే ఘట్టంలో ఆయన నందీశ్వరుడిలా ఉన్నాడని (గవాంపతి రివాబభౌ), చారణాచరితేపథి... చారణా మార్గంలో పయనిస్తున్నాడని వాల్మీకి చేసిన వర్ణనల్లో రహస్య సంకేతాలను ఆకళించుకున్న భక్తుల గుండెల్లో ఆయన త్రివిక్రముడిలా ఎదిగాడు. భక్తుల సంగతి అలా ఉంచి, ఇటీవల ఆయన పిల్లలకు బాగా చేరువ అవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో మొట్టమొదటి పూర్తి నిడివి యానిమేషన్‌ చిత్రంగా రూపొందిన 'హనుమాన్‌' చిత్ర విజయం పెను సంచలనం సృష్టించింది. యానిమేషన్‌ ప్రక్రియకు జవసత్వాలు అందించింది. పిల్లలను విశేషంగా ఆకర్షించగల పురాణశ్రేష్ఠుడిగా హనుమ గొప్ప గుర్తింపు పొందాడు. పెద్ద హీరో అయ్యాడు. యానిమేషన్‌ రంగ ప్రముఖుడు శంభూఫాల్కే మాటల్లో- హనుమ 'ట్రెండ్‌ సెట్టర్‌' అయ్యాడు. ఎందరో ప్రముఖులు ఆ చిత్ర హక్కులకు పోటీపడ్డారు. ముందుగా తాను లంకలోకి పోయి, అమ్మవారిని దర్శించి వచ్చి ఆ పిదప తనవారందరినీ లంకకు తీసుకువెళ్ళినట్లే- ఇప్పుడు విదేశాల్లోకి అడుగుపెట్టిన హనుమ తనతోటి పురాణ పాత్రలకు సైతం విదేశీ ప్రయాణానుభూతి కలిగించబోతున్నాడు. రావణ, అర్జున, గణేశ, భీమ, లవకుశులు వంటివారు ప్రయాణికుల జాబితాలో ఉన్నారు.

రాముడికి బదులుగా ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి, భరతుడు రాజ్యపాలనా బాధ్యతలను వహించిన విషయం మనం రామాయణంలో చదివాం. కేంద్ర సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన లక్నోలోని సర్దార్‌ భగత్‌సింగ్‌ కళాశాల సరిగ్గా ఆ విధానాన్నే అమలుచేస్తోంది. ఆ కళాశాల పాలకమండలి తమ ఛైర్మన్‌గా ఆంజనేయ'స్వామి'ని ఎన్నుకుని తీర్మానం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ స్వామిపేరు మీద జరుగుతాయి. పాలకమండలి సమావేశాల్లో స్వామికి ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేశారు. స్వామి ప్రతినిధిగా ఉప ప్రధాన అధికారి వివేక్‌ కాంగ్రి అధికారిక నిత్యవిధులు నిర్వహిస్తారు. రామలక్ష్మణులకు లక్ష్యసాధనలో దారి చూపించిన ఆంజనేయుడు తమ సంస్థ విజయాలకు తప్పక దారి చూపిస్తాడని వారు గట్టిగా నమ్ముతున్నారు. వారి నమ్మకం సరే, అమెరికా అధ్యక్ష పదవికి తన దారి సుగమం కావడానికి కూడా సాక్షాత్తు ఆంజనేయుడే కారణం కాగలడని డెమొక్రాట్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా బలంగా విశ్వసిస్తున్నారు. హనుమంతుడి బొమ్మతోగల బ్రాస్లెట్‌ను ఆయన నిత్యం చేతికి ధరిస్తున్నారు. 'నమ్మినవాడు చెడిపోడు' అని సామెత. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే- హనుమ అనుగ్రహంతో ఒబామా గట్టెక్కేలాగే ఉన్నారు. ఈ ప్రపంచంలో దేవుణ్ని మోసంచేసే ప్రజలున్నారు గాని, ప్రజల్ని మోసంచేసే దేవుడు లేడన్న భక్తుల విశ్వాసం మరోసారి రుజువయ్యేలా ఉంది. దేవుడు దేనియందు ప్రతిష్ఠితుడై ఉన్నాడన్న ప్రశ్నకు వేదం గొప్ప జవాబు చెప్పింది. స భగవః కస్మిన్‌ ప్రతిష్ఠితః- ఇతి స్వే మహిమ్ని!- ఆయన తన మహిమలోనే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అంది. విశ్వాసం గలవారికి ఆ మహిమ నిజం; లేనివారికి కట్టుకథ!
(ఈనాదు, సంపాదకీయం, 22:06:2008)
_____________________________

Labels: , ,

వానా వానా వందనం...

'సువాసన పిలుపువంటిది- పదిమందినీ ఆకర్షిస్తుంది. సౌరభం పక్షివంటిది- దిక్కుదిక్కులా పరుగెత్తుతుంది. సుగంధం స్మృతివంటిది- పదేపదే స్ఫురిస్తుంది...' అంటూ వర్ణించిన కృష్ణశాస్త్రి, పరిమళాన్ని మాత్రం 'సమయం చూసి దగ్గర చేరే నేస్తం'గా పోల్చిచెప్పారు. వర్షపు చినుకుకీ- నేలతల్లికీ గొప్ప స్నేహం. సమయం చూసి తొలకరి చినుకు నేలను తాకగానే కమ్మని పరిమళం వెదజల్లడం- మట్టి స్వభావం! తీవ్రమైన ఎండల వేడికి ప్రాణం సొమ్మసిల్లిపోయిన సమస్త జీవజాలంతోపాటు, భూమిసైతం తొలకరికోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. స్వాతి చినుకును ప్రేమగా స్వాగతిస్తుంది. కమ్మని పరిమళాన్ని వెదజల్లడం ద్వారా తన పులకరింతను వ్యక్తం చేస్తుంది. కాంతిని దీపం పీల్చుకున్నట్లుగా, వర్షాన్ని పీల్చుకుని భూమి సురభిళించడం- సృష్టికి శోభను చేకూర్చే అంశం. ప్రకృతికి జీవంపోసే విషయం. 'గ్రీష్మాదిత్య పటుప్రతాపాని'కి, తీవ్రతాపానికీ ప్రాణం డస్సిపోయిన స్థితిలో తొలకరి పలకరింత- సృష్టికి పులకరింత. అందుకే వర్షర్తువును జీవరుతువంటారు. 'ప్రాణం లేచొచ్చినట్లు' అనిపించేది వర్షాగమనానికే! రోహిణీకార్తెకు వీడ్కోలుపలికి, మృగశిర ప్రవేశించడం మనకి తొలకరి. అంతవరకూ భూమి నుండి అదేపనిగా నీటిని పీల్చుకున్న ఆకాశం సమయం చూసి బదులు తీర్చేస్తుంది. నీటిని వర్షిస్తుంది. ఇది పంచభూతాల మధ్య సృష్టి కుదర్చిన ఒక ఒప్పందం. బాకీ తీర్చేవాడికోసం మనం కళ్ళు విప్పార్చి ఎదురుచూసినట్లుగానే- వర్షపు చినుకుకోసం నోరు తెరిచి కూర్చున్నట్లుగా భూమి నెర్రెలు విచ్చి ఎదురుచూస్తుంది. ఆషాఢమూ, శ్రావణమూ, భాద్రపదమూ, ఆశ్వీయుజమూ నాలుగూ వార్షుకమాసాలు. వానకారు. నీరే జీవులకు ప్రాణాధారం. ప్రాణులకోసమే భూమి వర్షాన్ని ఆశిస్తుంది. అది తల్లి స్వభావం. అందుకే నేలను భూమాత అంటాం. వర్షమే భూమిపై పాడిపంటలకు, సిరి సంపదలకు మూలం. వర్షం లేకపోతే కరువు కాటకాలు ఏర్పడతాయి. వర్షపు లేమి- అనే అర్ధంలో క్షామాన్ని 'వర్షపు టెవ్వ'గా పేర్కొన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అడవికి ఆమని- కోరిక. వయసుకు వలపు- కానుక. పుడమికి తొలకరి- వేడుక! గొప్ప సంబరం!

వర్షర్తువు- సాహిత్యవర్ణనలకి అద్భుతమైన కొలువు. కవిసమయాలకి అందమైన నెలవు. 'కురిసేదాకా అనుకోలేదు- శ్రావణమేఘమని, తడిసేదాకా అనుకోలేదు- తీరని దాహమని' అని ఆశ్చర్యపడిన సినీకవి వేటూరి నుండి వెనక్కువెళ్ళేకొద్దీ- జాబితా ఆదికవి వాల్మీకి దాకా విస్తరిస్తుంది. 'అసలు శ్రావణమాస మధ్యమ్మునందు కురిసితీరాలి వర్షాలు. కొంచెకొంచెమేని, రాలాలి తుంపరులుయేని. కాని ఉక్క ఏ మాత్రము ఉండరాదు' అని కృష్ణశాస్త్రి కోరుకున్నారు. మనిషి స్వార్థాన్ని నిలదీస్తూ 'ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?' అని ప్రశ్నించారు జయప్రభ. పింగళి కాటూరి కవుల 'తొలకరి', ఇస్మాయిల్‌ 'రాత్రి వచ్చిన రహస్యపువాన' వంటివి యువతరం స్మృతిపథంలోని లేతచినుకులు- అనుకుంటే, వాల్మీకి కిష్కింధాకాండ. నన్నెచోడుడి 'కుమారసంభవం'.. వంటివి రసజ్ఞుల గుండెల్లో స్వాతి చినుకులు. పరమశివుని కోసం పార్వతి తపస్సు చేస్తుంటే- ఆమె పాపిట రాలిన వర్షబిందువు కిందకి జారి, నాభిదాకా ప్రయాణించిన వైనాన్ని వర్ణిస్తూ చెప్పిన- స్థితాఃక్షణం... నాభిం ప్రథమోద బిందవః శ్లోకంలో ఆమె స్థిరదీక్షా భంగిమను కాళిదాసు వర్ణించిన తీరు- రసజ్ఞతకు అమృత జీవధార. కాళిదాసుదేనని చాలామంది భావిస్తున్న ఘటకర్పర కావ్యంలో 'మేఘావృతం నిశి న భాతి నభో వితారం'... శ్లోకం వ్యంగ్యార్థపు చినుకుల్లోంచి రూపుదిద్దుకున్న స్వాతిముత్యం. కృష్ణదేవరాయల వర్షర్తువర్ణనమైతే ఒక దట్టమైన జడివాన. కృష్ణరాయల కవిత్వమే ఒక గొప్ప వర్షర్తువు- అన్నారొక భావుకపట్టభద్రుడు. వర్షర్తువు సాహిత్యాటవికి వసంతరుతువు. సాహిత్యపు విందులలో రుచికరమైన ఆధరువు.

వర్షం కురిసి వెలిసింది. మబ్బులు తెల్లబడ్డాయి. వాటి మధ్య ఒక సంధ్యారుణ రేఖ మెరిసింది. అదెలా ఉందో తెలుసా? చేతికి గాయమై, కట్టుకట్టినప్పుడు- చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో ఎర్రగా ఉంటుందికదా! అలా ఉందన్నారు వాల్మీకి మహర్షి. అతి ప్రాచీనకావ్యంలో అధునాతన అభివ్యక్తిని ప్రదర్శించినది- వాల్మీకి అయితే, ఆధునిక కావ్యంలో ప్రాచీన వైదిక పరిమళాన్ని పరిచయం చేసినవారు శేషేంద్ర. అదే నిజానికి వర్షాల ప్రయోజనం కూడా! కవులంతా సౌందర్యాన్ని వర్ణించగా, వేదం మాత్రం వర్షం ప్రయోజనాన్ని ప్రకటించింది. గ్రీష్మకాలే దావాగ్ని నా దగ్ధప్రదేశే, అచిరకాలే వర్షర్తౌ వృష్టి పతనేన- భూయస్యః కోమల యుక్తాశ్చ ఓషధయః ప్రజాయన్తే!- గ్రీష్మరుతువులో దావాగ్ని కారణంగా దగ్ధమైన ప్రదేశాలన్నింటా వర్షాలు పడ్డాక కోమలమైన ఔషధీ లతలు, రోగనివారణా మూలికలు పూర్వంకన్నా అధికసంఖ్యలో పుట్టుకొస్తాయని వేదం చెప్పింది. ఇదీ వర్షం బాపతు పరమ ప్రయోజనం. భూమి తాలూకు పరమ సార్ధక్యం. రుతు పరిణామానికి ధన్యత అదే! దీన్ని దృష్టిలో పెట్టుకునే శేషేంద్ర ఆ పరిణామక్రమానికి ప్రణామాలు చేశారు- ఒక కవితలో... 'వర్షం వెళ్ళిపోయింది- మబ్బుల రథాలెక్కి/ జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు/ భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయట పెట్టి/ మొదటవచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది... కృతజ్ఞతతో...' అన్నారాయన. దీన్ని ఆకళించుకుంటే వర్షకళ లక్ష్యం బోధపడుతుంది. వానా వానా వందనం అని ఎందుకు మొక్కాలో తెలుస్తుంది.
(ఈనాడు, సంపాదకీయం, 08:06:2008)
_____________________________

Labels:

Monday, September 01, 2008

Purposeful-burning DESIRE (magnificent obsession/ enthusiasm/ zeal/ intensified emotion/ excitement/ passion/ fervour/ ambition/ great drive/

intense commitment):
---------------------------------------------------
The law of desire:
To attain success, you must have a burning desire. A mild desire or casual interest is not sufficient. You can tell how badly you want it by observing your actions each day. Are they consistent with attainment of success?”

The law of energy:
The greater the energy and enthusiasm you have, the more likely you will recognize and respond to luck.”

You have a vehicle, say a motorcycle/ car. You have chosen a destination to go. Now your vehicle can convey you to your destination. For your vehicle to move and reach the desired destination, fuel- ‘petrol’/ ‘diesel’, is required. Though the destination is chosen and the vehicle is available, yet without sufficient fuel you can not reach the destination. So also is with our life. If a goal is chosen and even if all the required resources/ inputs/ facts & details required for attaining the desired goal are available, yet without the burning desire/ intense commitment the goal can not be reached.

When your goal becomes a magnificent obsession- whatever other qualities you need to reach the top will come to you. As the fuel propels the car so also is the burning desire/ intense commitment that propels us towards attaining the goal. Enthusiasm is the fuel of success, hence Enthusiasm makes the difference.

Ø How intensive should be the desire?
Narendranath (later he became a sanyasi and took the name Swami Vivekananda), a skeptic, once approached Saint Ramakrishna Paramahamsa asking him to show God. When they went to the river for taking bath, Ramakrishna Paramahamsa took the young man by surprise and holding Narendranath’s head pushed him under water. Narendranath kicked, bit and clawed to get the hand off his head. At last, Ramakrishna Paramahamsa released him so that he could come up for a gasp of air. Ramakrishna Pamahamsa asked, “What did you want the most when you were under water?” Narendranath replied, “AIR”. Ramakrishna Pamahamsa said, “When you want God as badly as you wanted air, then surely you will find Him.” Thus Ramakrishna Pamahamsa practically showed Narendranath, the level of intensity required to see God. Narendranath, subsequently as Swami Vivekananda, with all passion took up the message of Ramakrishna Pamahamsa to start Ramakrishna Mission, which now has branches all over the world. If God can be found applying such intensity, achieving any other desire with the same intensity can be just a cakewalk.

Ø Another analogy is the VOLCANO. Do you want to be unstoppable? Then be a human VOLCANO. When a mountain becomes a VOLCANO, it turns on, comes alive, lights up, radiates a glow and becomes a shaker & mover. Its source of power is HEAT. Get HOT and INTENSIVE, like a VOLCANO. No one dares to oppose the oncoming, unstoppable, constantly spreading, all-consuming heat. Thus the burning desire, a desire with emotional intensity, is the starting force for all achievements. A small fire cannot give much heat, so also a weak desire cannot produce great results. The burning desire backed by unwavering commitment turns the impossible possible.

Ø After throwing him out of a train in the apartheid South Africa, Mahatma Gandhi developed the obsession to send the British away as well to eradicate untouchability.

Ø Thomas Alva Edison used to work in his laboratory non-stop, often for two and three days straight, without sleep, because he was obsessed with inventing the light bulb.

Ø For several thousands of years, people held the belief that it was impossible for any human being to run a mile in less than 4 minutes. It is Dr. Roger Bannister’s desire, to prove otherwise, which broke the four-minute mile for the first time on 6th of May 1954.

Ø Karl Marx’s desire was to establish communism.


GEMS:

 • The degree of success you achieve depends on the amount of desire you possess. Success is directly proportion to the amount of enthusiasm.

 • The starting point of all accomplishments is burning desire. Keep this constantly in mind. Weak desire brings weak results just as a small amount of fire makes a small amount of heat.

 • Live all your dreams with passion.

 • Men are failures, not because they are stupid, but because they are not sufficiently impassioned

 • Nothing great was ever achieved without enthusiasm.

 • The gazelle outruns the tiger because the tiger is running for his dinner and the gazelle is running for its life.

 • Catch on fire with enthusiasm and people will come for miles to watch you burn. ü Energy is equal to desire and purpose.

 • Enthusiasm is the greatest asset in the world. It beats money, power, and influence.

 • The real secret to success is enthusiasm.

 • One person with a belief is equal to a force of ninety-nine who have only interest.

 • You can have anything you want if you want it desperately enough. You must want it with an inner exuberance that erupts through the skin and joins the energy that created the world.

 • We act as though comfort and luxury were the chief requirements of life, when all that we need to make us happy is something to be enthusiastic about.

 • Success is not the result of spontaneous combustion. You must set yourself on fire.

 • Passion is in all great searches and is necessary to all creative endeavors.

 • We act as though comfort and luxury were the chief requirements of life, when all that we need to make us happy is something to be enthusiastic about.

 • Whatever you vividly imagine, ardently desire, sincerely believe, and enthusiastically act upon must inevitably come to pass.

 • He who believes is strong; he who doubts is weak. Strong convictions precede great actions.

 • The worst bankrupt in the world is the person who has lost his enthusiasm.

 • Desire, like the atom, is explosive with creative force.

 • Every production of genius must be the production of enthusiasm.

 • Success is going from failure to failure without loss of enthusiasm.

 • When one is willing and eager, the Gods join in.
(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)
_______


____________________________________________

Labels:

కలవరమాయె మదిలో...

పువ్వుల కారణంగా మొక్కలను ఆదరిస్తాం. పళ్లు పేరుచెప్పి చెట్లకు గుర్తింపు దక్కుతుంది. వర్షాల పుణ్యమా అని, మేఘాలకి పూజలు జరుగుతాయి. పంటలవల్ల భూమి ఆరాధనకు నోచుకుంటుంది. అలా ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత మూలంగా మన్నన లభిస్తుంది. ఆలోచన కారణంగా మనిషి గౌరవనేయుడవుతున్నాడు. ఆలోచనే మనిషి ప్రత్యేకత. ఆలోచనే మనిషి పెట్టుబడి. ఆలోచనే నిజమైన సంపద! ఆలోచించే శక్తి సృష్టిలో మనిషికే సొంతం. మనిషి ఆలోచనలకు మనసు కేంద్రం. శరీరంకన్నా భిన్నమైన మనసు అనేదాన్ని ప్రజాపతి ప్రతి మనిషిలోనూ నిక్షిప్తం చేశాడు. అది అపూర్వమైనది. అపూర్వా ప్రజాపతేః తనూ విశేషః తన్మనః అన్నది- ఐతరేయ బ్రాహ్మణం. చెట్లు బతుకుతున్నాయి. పశువులూ పక్షులూ బతుకుతున్నాయి. అయినా జీవనమంటే మనిషిదే- ఎందుకంటే మనిషి ఆలోచనలతో జీవిస్తాడు కనుక! సజీవతి మనోయస్య మననేవహి జీవతి- అన్నది యోగ వాసిష్ఠం. మనిషి ఆలోచన ఎన్నో అద్భుతాలను సాధించింది. ఎన్నో జగత్తులను ఆవిష్కరించింది. ఎన్నో సత్యాలను గ్రహించింది. గట్టిగా మాట్లాడితే మనిషి ఆలోచనే, భగవంతుణ్ని సృష్టించింది. అందుకే ఆలోచనాపరుడైన మనిషే సృష్టిలో అన్నింటా ప్రమాణమన్నాడు గ్రీకు దార్శనికుడు ప్రొటొగొరస్‌. చిత్రం ఏమంటే, ఈ లోకంలో చాలామంది ఆలోచించరు- కొంతమందికి ఆలోచించడం రాక, మరికొందరికి అవసరం లేక! కవి మనసులో మొదట గొంగళి పురుగుల్లా మొదలైన ఆలోచనలు అక్షర రూపంలోకి వచ్చేసరికి సీతాకోక చిలుకలై, ఆకర్షణీయమైన కవిత్వం రూపు దాలుస్తాయి. ఆలోచించే పాఠకుడికి ఆనందాన్ని పంచుతాయి. అందుకే సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు.

అలా స్పష్టంగా చెప్పలేకపోయినా, చెప్పడం ఇష్టంలేకపోయినా- అవతలివాడి మనసును చదివేసే శక్తి కొంతమందికి ఉంటుంది. దాన్ని పరేంగిత జ్ఞానం అంటారు. మాటలు ఇంకారాని పసివాడు ఏం చెప్పదలచుకున్నాడో తల్లి గ్రహిస్తుంది. రోగి చెప్పుకోలేకపోతున్న ఇబ్బందులను నిపుణుడైన వైద్యుడు అర్థం చేసుకుంటాడు. పరేంగిత అవగాహనమైన బుద్ధి పండితుని విశేషం అన్నాడు చిన్నయసూరి. ధృతరాష్ట్రుడి ఇంగితాన్ని పదో ఎక్కం అంత సులువుగా ఆకళించుకున్నవాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిశాక, భీముణ్ని కౌగలించుకుంటానని ధృతరాష్ట్రుడు ముందుకు వస్తే- ఒక విగ్రహాన్ని అందుబాటులో ఉంచి, భీముణ్ని రక్షించింది- కృష్ణుడి పరేంగిత జ్ఞానమే! అలా అని, పరేంగిత జ్ఞానం అన్నివేళలా ఆనందదాయకం కాదు. గంగానదిమీద చలాగ్గా నడిచి వస్తున్న యోగిని చూసి మనం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. అద్భుతం అనుకుంటాం. అదేమాట పక్కవాడితో అంటాం. తీరా అతగాడు 'ఆఁ ఇందులో అద్భుతం ఏముంది? ఆ యోగికి ఈత వచ్చి ఉండదు' అని చప్పరించే బాపతు అనుకోండి. అలాంటివాడి ఇంగితం కనుగొనడం వల్ల ఏం ప్రయోజనం లేదు సరికదా, అంతకుముందు యోగప్రక్రియను చూసినప్పటి ఆనందం కూడా ఆవిరైపోతుంది. ఈ తరహా వ్యక్తులు ఎక్కువగా పేకాటలో తారసపడతారు. 'ఈ రోజు ఏమిటో చెయ్యి తెగ తరుగు ఆడుతోంది' అంటూ, తన పేక పడేసి మన పక్కన చేరి సలహా చెప్పబోతారు. 'వీడి దుంపతెగా! ఇంతకన్నా నా పేక చాలా నయం. ఇలాంటివి ఆడేసి గెలిచేస్తున్నాడన్నమాట. ఈ పేక బతికేలోగా, ఎవడైనా షో చూపించేస్తే బాగుణ్ను!' అనేదే ఆ వ్యక్తి మనసులో నిజమైన ఆలోచన అయి ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చాలామంది నిజ స్వరూపాలు ఇలాంటివే! అందుకే అజ్ఞానమంత సుఖం ఇంకోటి లేదన్నారు- అనుభవజ్ఞులు.

ఎదుటివారి మనసులో ఆలోచనలు తెలియకపోవడమే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనిషి బుర్రలోని ఆలోచనలను చూసి చదివినట్లు చెప్పగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేస్తున్నారన్న వార్త- ఈ కారణంగానే చాలామందిని కలవరపెడుతోంది. తలకు ఎలక్ట్రోడ్‌లతో కూడిన పరికరాన్ని తగిలించి, ఏదైనా ప్రత్యేక విషయం గురించి ఆలోచించమంటారు. ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రఫీ పరిజ్ఞానంతో మెదడులోని సంకేతాలను అధ్యయనం చేస్తున్నారు. అలా ఎదుటివారి ఆలోచనలను పసిగట్టే సాఫ్ట్‌వేర్‌ రూపొందించడం వారి లక్ష్యం. అది తయారైతే కంప్యూటర్‌ ద్వారా చదవడమో, వాటిని స్పీకర్‌ ద్వారా వినడమో సాధ్యమవుతుందంటున్నారు. యుద్ధంలో గాయపడిన సైనికుల మనోగతాన్ని అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని భావించిన అమెరికా సైన్యం- ఈ కృషికి తన వంతుగా 40 లక్షల డాలర్ల సహాయాన్ని సమకూర్చింది. అదంతా శత్రు సైనికులు పట్టుబడినప్పుడు వారినుంచి రహస్యాలను రాబట్టేందుకేనన్న విమర్శలు వినవస్తున్నాయి. కళావతి ద్వారా పద్మినీ విద్యను సాధించిన స్వరోచి దాంతో సరిపెట్టుకోకుండా, విభావరిని వివాహం చేసుకోవడం ద్వారా జంతు, పక్షి భాషలను గ్రహించే సర్వభూత రుత శక్తి సంపాదించాడు. చక్రవాకి, మగలేడి తనను ఘాటుగా తిట్టిన తిట్లతో మనసు వికలం కావడం మినహా- మనుచరిత్రలో స్వరోచి బావుకున్నది ఏం లేదు. అలా అని, ఒక సరికొత్త ఆవిష్కారాన్ని స్వాగతించకుండా ఉండలేం. కొత్తదైనంత మాత్రాన ప్రతిదాన్నీ శంకించడం ప్రగతికి ఆటంకమవుతుంది. మనసులో గాఢమైన అనురాగాన్ని దాచుకుని, భర్తపై తన వలపును మాటల్లో వెల్లడించలేని ముగ్ధల తీయని మనోగతాన్ని భర్తలు కనుగొనగలిగితే అది అద్భుతమేగా- అనేవారు లేకపోలేదు. ఆ రకంగా మాటల్లో చెప్పలేని మధురమైన భావాలు అవగతమైతే ఆ దాంపత్య మాధుర్యం వర్ణనాతీతం. అలాంటి సందర్భాల్లో ఇలాంటి పరికరం పరమ ప్రయోజనకరమైనదని చెప్పక తప్పదు.
(ఈనాడు, సంపాదకీయం, 31:08:2008)
_______________________________

Labels:

సిల్లీపాయింట్‌

నుదుటిపై పడే మెలిదిరిగిన ముంగురులను (ఉదా: శోభన్‌బాబు రింగ్‌) ఇంగ్లిషులో 'పిన్‌కర్ల్స్‌' అంటారు. వాటినే 'స్పిట్‌కర్ల్స్‌' అని కూడా అంటారు. స్పిట్‌ అంటే ఉమ్ము. ఒక్కోసారి ఉమ్మితడితో కూడా ముంగురుల్ని అలా రింగు తిప్పుతారు కాబట్టి ఆ పేరు వచ్చింది.
* 22 కండరాలు సమన్వయంతో పనిచేస్తే కానీ తేనెటీగ కుట్టలేదు.
* పేకముక్కల్లోని నాలుగు ఆసుల్లోకీ ఇస్పేట్‌ ఆసు మీది గుర్తు బాగా పెద్దదిగా ఉంటుంది.
* అమెరికాలో 98 శాతం మంది ఇళ్లల్లో టీవీలున్నాయి. *Cow, sheep, pig, calf... ఇవన్నీ ఇంగ్లిషు పదాలు కావు జర్మన్‌ పదాలు.
beaf, mutton, pork... ఇవి ఫ్రెంచివారి నుంచి అప్పుగా తీసుకున్నవి.'స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ' (కాగడా పట్టుకున్న) చేతి పొడవు 42 అడుగులు.
* మలాన్ని పరీక్షించేవారిని స్కాటాలజిస్టులంటారు.
* అంతర్జాతీయంగా ఎక్కడో ఒకచోట ప్రతి సెకనుకూ రెండు బార్బీబొమ్మలు అమ్ముడవుతున్నాయి.
* అపోలో-11 వ్యోమనౌకలో వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తమతోపాటు 'ఓరల్‌-బి' కంపెనీకి చెందిన టూత్‌బ్రష్‌లను తీసుకెళ్ళారు.
* సెప్టెంబరు 20ని చైనాలో 'మీ పళ్లని ప్రేమించండి (లవ్‌ యువర్‌ టీత్‌ డే) దినం'గా పాటిస్తారు.
* ప్రపంచవ్మెుత్తమ్మీదా ఏడాదికి ఐదు కోట్ల కొత్త కార్లు రోడ్లపైకి వస్తున్నాయి.జాన్‌ ఎఫ్‌.కెన్నెడీ వాడిన రాక్‌చెయిర్‌ని ఆయన చనిపోయాక వేలం వేస్తే దాదాపు రూ. 2 కోట్ల ధర పలికింది.
* అమెరికన్ల సగటు ఇంటర్‌నెట్‌ వినియోగం రోజుకు 70 నిమిషాలు.
* ఆరోగ్యవంతుడైన మనిషి సగటున ఒక రాత్రిలో నాలుగు కలలు కంటాడు.
* చలనచిత్ర చరిత్రలోనే టాయిలెట్‌ను ఫ్లష్‌ చేసే దృశ్యాన్ని తొలిసారి చిత్రీకరించిన దర్శకుడు అల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌. ఆ సినిమా 'సైకో'.
* పిల్ల ఈల్‌ చేపను 'ఎల్వర్‌' అనాలి.మెక్సికన్‌ సొంబ్రెరో టోపీ ఎంత పెద్దగా ఉంటుందంటే అది పెట్టుకుంటే వర్షంలో తలతోపాటు మన ఒళ్లు కూడా తడవదు!
* మార్ల్‌బరో వెుదటి మహారాణి సారా చర్చిల్‌ ఇంగ్లిషు 'ఐ' అక్షరంపై ఎప్పుడూ చుక్కపెట్టేది కాదు.
* మనుషులు తినగలిగే/తినే పురుగుల రకాలు 1,462.
* అమెరికన్లకు బాల్‌పాయింట్‌పెన్‌ తొలిసారి పరిచయమైంది 1945 అక్టోబరులో. న్యూయార్క్‌లో వాటిని అమ్మితే తొలిరోజే పదివేల పెన్నులు అమ్ముడయ్యాయి.
* పాప్‌ రారాజు మైకేల్‌ జాక్సన్‌కి ఇష్టమైన రంగులు ఎరుపు, నలుపు.
* జెట్‌విమానాల శబ్దాన్ని దగ్గర్నుంచి వింటే టర్కీకోళ్లు ఆ సౌండుకే చనిపోతాయి
.
90 శాతానికి పైగా జాతుల నత్తగుల్లలపై ఉండే గీతలు గడియారం తిరిగే దిశలోనే ఉంటాయి. మిగిలిన కొద్దిశాతం జాతుల నత్తల్లో మాత్రం ఆ గీతలు అపసవ్య దిశలో ఉంటాయి.
(ఈనాడు, ఆదివారం,31:08:2008)
________________________________

Labels:

వ్యసనంతో సహగమనం

హోరున వర్షం మొదలైంది. పొలాల్లో పనిచేసుకుంటున్నవారంతా తలదాచుకోవడానికి ఒక పూరిగుడిసె దగ్గర చేరారు. లోపల చోటు తక్కువై, కొంతమంది మాత్రమే పట్టారు. కాసేపటికి పరిస్థితి ఏమిటంటే- లోపలివారంతా ఏదోవిధంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నారు, బయటవాళ్లంతా ఎలాగోలా లోపలికి దూరాలని తోసుకుంటున్నారు. వ్యసనం అనేది- అదిగో... ఆ గాలివానలో పూరిగుడిసె వంటిది! వ్యసనపరులు వాటినుంచి బయటపడాలని తంటాలు పడుతూ ఉంటారు. కొత్తవాళ్లు వ్యసనాలను రుచిచూడాలని సరదాపడుతుంటారు! వరదనీటిలో ఇద్దరు మిత్రులు కొట్టుకుపోతున్నారు. ఒకతనికి ఏదో కాస్త ఆధారం దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మైదానంలోకి ప్రవేశించాక ప్రవాహతీవ్రత నెమ్మదించింది. అయినా అతను బయటపడలేదు. 'ఇంకా వదిలిపెట్టవేం?' అని రెండోవాడు హెచ్చరించాడు. 'నేను ఎప్పుడో వదిలేశాను. దురదృష్టవశాత్తూ నేను పట్టుకున్నది మొసలిని. ఇప్పుడు నన్ను అది విడిచిపెట్టడం లేదు' అన్నాడు మిత్రుడు- మరింత దూరంగా కొట్టుకుపోతూ. వ్యసనం ఆ మొసలి వంటిది! ఉదాహరణకు సిగరెట్‌ కాల్చడాన్నే తీసుకోండి. సరదాకనో, చలికాలంలో వెచ్చదనంకోసమో- మనిషి సిగరెట్‌ కాలుస్తాడు. ఆ పిదప సిగరెట్టే సిగరెట్‌ను కాలుస్తుంది. చివరికి సిగరెట్‌ మనిషినే కాల్చేస్తుంది. ఆ బాపతు ధూమపాన ప్రియులందరి జీవితాలూ దుర్భరంగా గడిచి, విషాదంగా ముగుస్తాయి. అమెరికాలో స్త్రీల సగటు ఆయుర్దాయం 78 ఏళ్లుకాగా, పురుషులది 70 మాత్రమే. ఈ వ్యత్యాసానికి మత్తు పదార్థాలు, ధూమపానమే ముఖ్యకారణాలుగా తేలింది.

పొద్దున్నే ఆరుబయట చల్లని వాతావరణంలో కూర్చుని వేడికాఫీ తాగడం చాలామందికి అలవాటు. ఆ అలవాటువల్ల మనిషికి సంతృప్తి లభిస్తుంది. అలా సంతృప్తి లభించేంతకాలం అది కేవలం అలవాటేనని చెప్పుకోవాలి. ఒకవేళ కాఫీ దొరక్కపోతే, కాలకృత్యాలు మొదలు కాని స్థితి వస్తే మాత్రం- అది వ్యసనంగా ముదిరందని గ్రహించాలి. యువకులు తమలోని ఆత్మన్యూనతా భావాన్ని, లేదా అభద్రతాభావాన్ని పోగొట్టుకోవడంకోసం వ్యసనాలకు లోబడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. 'ఇంతవరకూ సిగరెట్‌ ముట్టించలేదా! బీరు రుచి చూడలేదా!' అని స్నేహితులు వెక్కిరిస్తారని, వెర్రివెంగళప్పగా జమకడతారన్న భావనతో కొందరు కుర్రవాళ్లు వ్యసనాలకు అలవడతారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మానేయగలమనీ అనుకుంటారు. 'నేనంత తేలిగ్గా లొంగను... మానేయమంటావా చెప్పు' అని మిత్రులతో పంతాలకు పోయి, కొన్నాళ్లు నిజంగానే మానేస్తారు కూడా! చాలామందిలో ఆ దృఢచిత్తం త్వరలోనే నీరుగారిపోతుంది. మళ్లీ వ్యసనం మొదలవుతుంది. 'సిగరెట్లు మానేయడం చాలా తేలిక... నేను చాలాసార్లు మానేశాను తెలుసా' అని చమత్కారాలకు పోతారు. లేదా, సిగరెట్లకేసి ఆరాధనగా చూస్తూ 'భయంకరమైన నా ఒంటరి జీవితంలో బాసటగా నిలిచింది ఇదే బ్రదర్‌' అని బరువుగా నిట్టూరుస్తూ ఆత్మవంచనకు పాల్పడతారు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ పొగతాగడంపట్ల ఎందుకింత మక్కువ చూపిస్తారో నాకైతే అర్థంకాదు. రైళ్లలో పొగతాగేవారివల్ల మిగిలినవారికి శ్వాసపీల్చడమూ కష్టతరమవడం నాకు తెలుసు' అని గాంధీజీ అనేవారట. అదివిని ఒకాయన 'బీడీ సిగరెట్‌ వంటివాటిని ఘాటుగా విమర్శిస్తూ, వాటిని నిషేధించాలని ఉద్యమం మీరు ఎందుకు చేపట్టరాదు?' అని అడిగారు. 'ఆ పని చేస్తే నన్ను 'మహాత్మ' అనడం మానేస్తారు... ఆ ధూమపాన సాధనాలు నాకంటే చాలా గొప్పవి... నిజం!' అన్నారు గాంధీజీ.

గాంధీగారికి వచ్చినట్లే- సిగరెట్లు ఎందుకు కాలుస్తారన్న సందేహం ఒక ఇల్లాలికీ వచ్చింది. మెల్లగా భర్త దగ్గరచేరి 'అసలు నాకు తెలియక అడుగుతా, అంత ఇదిగా కాలుస్తారే... ఆ సిగరెట్‌లో ఏముందీ?' అని అడిగింది. వెంటనే 'పొగాకు' అనేసి లేచి చక్కా పోయాడా పతిదేవుడు! తరవాత ఏం అడగాలో తెలియక నిలబడిపోయిందావిడ. 'భర్తను అలా వదిలేస్తే మీకే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది తెలుసుకోండి' అంటున్నారు పరిశోధకులు. 'ఇంట్లో పొగతాగే భర్త ఉంటే భార్యకు పక్షవాతం ముప్పు పొంచి ఉన్నట్లే' అని హెచ్చరిస్తున్నారు డాక్టర్‌ మరియా గ్లెయిమోర్‌. డాక్టర్‌ మరియా నేతృత్వంలోని 'హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌' బృందం- సుమారు పదహారువేల మందిని పరిశీలించిన తరవాత ఈ చేదునిజాన్ని నిర్ధారించింది. 'వెలుగుతున్న సిగరెట్‌కు రెండో చివర ఒక మూర్ఖుడు ఉంటాడు' అన్నాడొక ఆంగ్ల రచయిత. 'మూర్ఖుడు అవునో, కాదో గానీ తనకీ, తన ఇంట్లో వారికే కాదు, బయట ఎందరికో చాలా ప్రమాదకారి మాత్రం అవును' అని డాక్టర్‌ మరియా అధ్యయనం స్పష్టం చేస్తోంది. వ్యక్తిగతంగా ఆ మనిషిలో తలెత్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు, భార్యకు పొంచిఉన్న పక్షవాతం ముప్పూ కాక, పరోక్షంగా ఒకరు పీల్చి విడిచిన పొగద్వారా గాల్లోకి వ్యాపించిన క్యాన్సర కారక విషపదార్థాలు ఎంతోమంది ఆరోగ్యానికి చాలా హానికరంగా పరిణమిస్తాయని అమెరికా సర్జన్‌ జనరల్‌ నివేదిక సైతం తేల్చిచెప్పింది. పొగ రహిత వాతావరణంలో జీవించే భాగ్యవంతులకన్నా ధూమపానం అలముకున్న వాతావరణంలో కాలంగడిపే అభాగ్యులకు వూపిరితిత్తుల క్యాన్సర్‌, శ్వాసకోశ రుగ్మతలు, గుండెజబ్బులు రెండురెట్లు ఎక్కువగా సంక్రమిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే 'మీరు మీ భార్యను నిజంగా ప్రేమిస్తున్నారా, అయితే ధూమపానం జోలికి పోనేవద్దు' అని వారంతా గట్టిగా హెచ్చరిస్తున్నారు. 'సొంత వ్యసనం అంతమైతే, పొరుగువాడికి మేలు కలుగును' అని బోధిస్తున్నారు.
(ఈనాడు, సంపాదకీయం, 24:08:2008)
_____________________________

Labels:

Sunday, August 31, 2008

What is the difference between a ``robber" and a ``thief"? "robbery" and "burglary"?

---------------------------------------------------
What is the difference between a ``robber" and a ``thief"?

A thief is someone who takes things from you without your being aware of it.A pickpocket, for example, is a thief. He comes up behind you and takes away your wallet without your knowledge. A thief doesn't threaten you with a gun or a knife. In fact, in most cases, you are hardly aware of his presence.
In the case of a robber, on the other hand, you are aware of his presence. You usually come face to face with him. A robber takes things from you by threatening you; he may have a gun or a knife. In the case of a robbery, you are aware of the fact that things are being taken from you. People who force you to part with your belongings are robbers; those who take it away from you without your knowledge are thieves. (31:07:2001)
--------------------------------------------------

WHAT IS the difference between "robbery" and "burglary"?

When you are being robbed, you are usually aware of it. The person who is robbing you is there standing in front of you and demanding that you hand over the money, jewellery, etc. In the case of a robbery, there is always a threat of violence. You could end up getting hurt or even killed! Here are a few examples.
*When Chaitra walked into the bank there was a robbery in progress.
*All the robberies took place around 3:00 in the afternoon.
*The robbery was meticulously planned.

In the case of a burglary, on the other hand, there is no threat of violence. A burglar is like a thief. What does a thief do? He merely takes away something that belongs to you without your being aware of it. You become aware of the fact that you have lost something much later. A burglar enters your house illegally and takes away things that he is interested in. He plans meticulously and takes care not to be seen by you. When he strikes, you may be fast asleep, or you may not be at home.
*When the Jains were away for the weekend their house was burgled.
*There was a burglary in our neighbourhood yesterday.
*The burglary didn't go off as planned.

(The Hindu,Tuesday,
Nov 26,2002)
______________________________________

Labels:

నవ్వు నలభైవిధాల మేలు!


'ఎంతటి ఆయుధమైనా సరే, ప్రమాదకరమైనది కాదు- అది కోపాన్ని నిగ్రహించుకోలేనివారి చేతిలో పడేదాకా!' అన్నాడొక ఆంగ్లరచయిత. మనిషి స్వభావాల్లో ఎక్కువ ప్రమాదకరమైనది కోపం. దానికి విరుగుడు హాస్యం. హాస్యచతురత అలవడితే కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. అవతలివారి కోపాన్ని చల్లార్చేందుకూ హాస్యం ఉపకరిస్తుంది. పేద కుర్రవాడొకడు హోటల్లోకి చొరబడి, మస్తుగా ఫలహారాలు సేవించాడు. సొమ్ము చెల్లించమనేసరికి డబ్బులు లేవని బిక్కమొహం వేశాడు. ఆ యజమానికి కోపం ముంచుకొచ్చింది. చాచిపెట్టి గూబమీద కొట్టాడు. పిల్లవాడు ఆ దెబ్బకు గిర్రున తిరిగి కిందపడ్డాడు. కాసేపటికి తేరుకొని, మెల్లగా 'అయ్యా! ఈ లెక్కన నేను రోజూ రావచ్చా' అని అడిగాడు. యజమానికి ముందు నవ్వు వచ్చింది. ఆ తరవాత కన్నీళ్లు వచ్చాయి. కుర్రవాడి మీద అంతలావు కోపం ప్రదర్శించినందుకు సిగ్గుపడ్డాడు. హాస్యప్రవృత్తి మనిషిని ఆరోగ్యవంతుణ్ని చేస్తుంది. 'రోజుకు ఒకసారైనా మనసారా బిగ్గరగా నవ్వని రోజు జీవితంలో వృథా అయినట్లే' అన్నాడొక రచయిత. 'నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అని ప్రముఖ సినీదర్శకులు జంధ్యాల చెప్పిన మాట తెలుగునాట విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సృష్టిలో నవ్వగలిగే జీవి మనిషి ఒక్కడే! కనుక నవ్వు మనిషిసొత్తు. నవ్వు నాలుగిందాల చేటు- అనేది నమ్మదగిన మాటకాదు. నవ్వుకుని వదిలేయవలసిన మాట.

'నాలో హాస్యప్రవృత్తి లేకుంటే నేను ఏనాడో ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చేది' అన్నారు గాంధీజీ. కోపంలోంచి, నిరాశలోంచి తేలిగ్గా బయటపడటానికి మనిషి హాస్య చతురతను అలవరచుకోవాలి. కోపం ముంచుకొచ్చినప్పుడు- పాతకాలం తెలుగు మాస్టర్లు తిట్లకు హాస్యాన్ని ముసుగువేసేవారు. ఒక మంత్రిగారి సుపుత్రుడు కళాశాలలో బాగా అల్లరి చేసేవాడు. ఉపాధ్యాయులను ఏడిపించేవాడు. వాణ్ని ఏమీ చెయ్యలేక ఒక తెలుగు మాస్టారు 'ఓరి ఇరవై అయిదూ, ఇరవై ఆరూ! నోర్మూసుకు కూర్చో' అనేవారు. అది తిట్టో ఏమిటో అర్థమయ్యేదికాదు. చివరికి కళాశాల నిమంత్రణ ఉత్సవం(ఫేర్‌వెల్‌)లో కొందరు విద్యార్థులు 'గురువుగారూ చివరిరోజు కదా, ఇవాళైనా ఆ ప్రహేళిక విప్పండి' అని అడిగారు. దానికి ఆయన 'తెలుగు సంవత్సరాల పేర్లు వెతుక్కోండి' అన్నారు. తీరాచూస్తే ఇరవై అయిదు- ఖర, ఇరవై ఆరు నందన! అంటే, రోజూ వాణ్ని 'గాడిదకొడకా' అని ఆయన కసితీరా తిట్టేవారన్నమాట. 'నోరా వీపుకి తేకే' అన్న సూత్రాన్ని ఆయన తన హాస్య చతురతకు ముడివేసి ఆపద రాకుండా చూసుకునేవారు. ఒకోసారి చట్టసభల్లో ఉద్రిక్తతలను సైతం హాస్యధోరణి చల్లబరుస్తుంది. కేంద్రమంత్రులు సంప్రదాయ అంబాసడర్‌ కార్లు వదిలేసి, విదేశీ వాహనాల కొనుగోలుపట్ల మొగ్గు చూపడంపై చట్టసభలో పెద్ద దుమారం రేగింది. 'పెద్దపెద్ద విదేశీ కార్లలో మహారాజుల్లా తిరగడం- ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ఘోరం' అంటూ ప్రతిపక్షసభ్యులు విరుచుకు పడ్డారు. సభలో ఉద్రిక్తతలు చెలరేగాయి. అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి లేచి 'అవును నాకు ఇష్టం లేదు... అంతపెద్ద కారులో నావంటి పొట్టివాడు కూర్చుంటే బయటికి అసలు కనపడడు' అన్నారు. సభ గొల్లుమంది. గాంభీర్యం తొలగిపోయింది. హాస్యస్ఫురణ కారణంగా ఒకోసారి అనుకోని ప్రయోజనాలు జతపడతాయి. చైనా దురాక్రమణ సందర్భంగా మనదేశం కోల్పోయిన భూభాగం విషయమై- డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా ఆవేదనగా ప్రసంగిస్తున్నారు. 'గడ్డికూడా మొలవని వృథా భూభాగం కోసం ఇంత రభస చెయ్యాలా' అని నెహ్రూజీ ఆ వాదనను తోసిపుచ్చారు. వెంటనే డాక్టర్‌ లోహియా 'మీ బట్టతలపై కూడా ఏమీ మొలిచే అవకాశం లేదుకదా, అదీ వృథా అని ఒప్పుకొంటారా' అని అడిగారు. అంతవరకూ ఆయన చేసిన ప్రసంగం సాధించలేనిదాన్ని- ఈ ఒక్క చమత్కారపు ప్రశ్న సాధించింది. లోహియా హాస్య చతురతకు నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది.

హాస్యచిత్రాలు చూసినా, చమత్కారాలు విన్నా- మనిషి దేహంలో 'ఇంటర్‌ ఫెరాన్‌ గామా' రెట్టింపవుతుంది. అనారోగ్య లక్షణాలను పారదోలే విలువైన రసాయనమది. పెదాలకు ఫెవికాల్‌ అంటించుకున్నట్లు ఎప్పుడూ గంభీరంగా ఉండే మాజీ ప్రధాని ఒకరు తెలుగులో రాజేంద్రప్రసాద్‌ హాస్య చిత్రాలను ఇష్టపడేవారు. ఆయన ఆరోగ్య రహస్యం హాస్యం అన్నమాట! మనిషి విరగబడి నవ్వినప్పుడు మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాలు రక్తపోటును తగ్గించి, గుండెను తేలికచేస్తాయని సైన్సు నిరూపించింది. అందుకే వైద్యులు బాగా నవ్వమని సలహా ఇస్తున్నారు. నవ్వును ఒక చికిత్స (లాఫింగ్‌ థెరఫీ)గా ప్రయోగిస్తున్నారు. 'కూర ఇలా తగలబడింది ఏమిటి?' అని గర్జించే భర్తకు- హాస్య చతురత అలవడినా, నవ్వు విలువ బోధపడినా- 'ఈ కూర నువ్వు చేసినట్లు లేదే!' అని అడగడం చేతనవుతుంది. ఈ రెండో రకమే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని, ఎక్కువ ప్రయోజనకరమైనదని తెలుస్తుంది. తద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. ఇది కేవలం వ్యక్తిగతమే కాదు, సంస్థాగతం కూడా. ఇంట గెలిచినవాడు రచ్చగెలవడం నేరుస్తాడు. ఇప్డుడు పెద్దపెద్ద సంస్థల్లోనివారు ఈ నైపుణ్యాన్ని సాధన చేస్తున్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు రిచర్డ్‌ బ్యాండ్లర్‌ 'లాంగ్వేజి పేటర్న్‌'లో చెప్పిన సూచనలు ఈ తరహావే. 'ఖరీదైన సౌందర్య లేపనాలకన్నా మనిషి మొహాన్ని ఆకర్షణీయంగా చూపించేది- పెదాలపై చక్కని నవ్వే' అని చాలామంది అభిప్రాయం!
(ఈనాడు, సంపాదకీయం, 17:08:2008)
_____________________________

Labels:

SWAMINOMICS Why Hinglish will beat Chinglish

31 Aug 2008, 0127 hrs IST, Swaminathan S Anklesaria Aiyar


Thanks to its English language advantage, India has become world leader in call centres and back office outsourcing. China cannot compete because very few Chinese speak English. To rectify this, China has made English compulsory in schools. Will it soon give India tough competition in outsourcing?

I doubt it. I was asked once by a Chinese magazine for a ‘short’ article of 3,000 words on the Indian economy. I protested that 3,000 words was much too long. ‘‘No,’’ said the Chinese editor, ‘‘when translated, 3000 English words will shrink to just 800 Mandarin words.’’

Every letter in Mandarin is a full concept. That gives Mandarin a totally different structure. So, it is truly difficult for the Chinese to master English, and for the British to master Mandarin. For similar reasons, the Japanese remain weak in English. Some Chinese speak excellent English, but they are so few that they command salaries of $100,000/year, too high for call centres.

It’s much easier for Indians to learn English. Sanskrit (the root of Indian languages) and Latin (the root of European languages) belong to the same group of ancient Indo-European languages. When a Swaminomics column of 800 words is translated into Hindi, the translation is also around 800 words.

Only a tiny fraction of Indians speak high quality English. Most speak halting or pidgin English that can sound comic. Jug Suraiya has pointed out that the Indian phrase ‘‘with folded hands’’ is an anatomical impossibility. So is ‘‘my head is eating circles,’’ a direct translation of ‘‘mera sir chakkar kha raha hai.’’ Malcolm Muggeridge once said that he realised, whenever an Indian spoke English, that the days of the white man’s burden were not over.

We now have Hinglish, which does not even attempt translation but mixes English and Hindi words. It has become the lingua franca of Bollywood movies. But it is unsuitable for call centres, which require good English and an American accent. BPO companies now hold English training classes.

Many Indians instinctively translate Indian phrases into English, with comic results. But the Chinese are even funnier. Signs for visitors to China — given high priority in the run-up to the Olympics — leave one in splits of laughter. Consider this signboard at a toilet.

- Go Into the Toilet Beard Know

- The service object of this toilet is limited by a person only.

- The toilet provides only into the toilet place, the dissatisfied foot goes into the toilet to have a bowel movement outside of other request.

- The one who go into toilet want to take good care of toilet facilities, strictlying forbid to move this toilet tool to did it touse.

- Go into the toilet beard to place excrement the tool is intestablishment inside, cannot spread
to leak.

- The one who go into toilet cannot clamour loudly. The in order to prevent make other go into toilet is frighten.

- Go into toilet and cannot will boil to make food to take isedible into this toilet, the in order to
prevent break good go into toilenvironment.

- Can not move bowels in the urine the pond.

- Please read this beard to know hard into the toilet and act according to carry on.
(Times of India, 31:08:2009)
__________________________________

Labels:

'ప్రాయ'స్నేహితులు!

ప్రాయం అనేమాటకు వయసు అనే అర్థంగాని, అన్నివయసులకీ ఆ మాట నప్పదు. ప్రాయమనేసరికి జిగి, బిగి కలగలసిన పడుచుదనం స్ఫురిస్తుంది. శరీరంలోకి పడుచుదనం ప్రవేశించడం నిజంగా ఒక ఉత్సవం. బతుక్కి తిరనాల. అందుకే ప్రాయంలోకి ప్రవేశించే కుర్రాళ్ళంతా గెడ్డాలు, మీసాలు త్వరగా వచ్చేయాలని ఆత్రపడతారు. తాము యువకులమయ్యామని ప్రపంచం గుర్తించడంకోసం నిక్కర్లలోంచి లుంగీల్లోకి మారతారు. అలాగే ఆడపిల్లలకీ గౌనుల్లోంచి పరికిణీల్లోకి మారడం మధురమైన అనుభూతి. శరీరంలో వచ్చే మార్పులు వారి మొహాలకు సిగ్గును పులిమి, మురిపాన్ని జోడిస్తాయి. అలా వయసు వాయనాలను అందుకున్న సుభద్ర మేనిసొగసులను విజయ విలాసంలో చేమకూర వేంకటకవి ముచ్చటగా చిత్రించాడు. 'ప్రాయపుటెక్కునన్‌...' అని మొదలుపెట్టి ఆ కొత్త యౌవన సోయగాలు ఎవరిని ఆకర్షించవంటూ 'ఏ ఎడ ఇంపుకావు, నవీన వయోవిలాసముల్‌?' అని ప్రశ్నించాడు. వాటిని 'నడమంత్రపు కలిమి'గా శ్లేషించాడు. అంతేకాదు- అర్జునుని అమాంతం పడకగదికి ఎత్తుకుపోయి, అతని బ్రహ్మచర్య దీక్షను భగ్నంచేసిన ఉలూచి వలపుఠేవను వర్ణిస్తూ, 'కులుకుగుబ్బల ప్రాయంపు కోమలి- అట వలచి వలపింపదే ఎంతవానినైన!' అంటూ వయసు మహిమను ప్రశంసించాడు. చేమకూర పద్యాలకు సౌష్ఠవం అందించిన 'ప్రాయం' పదప్రయోగం- 'పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటిదండాలు' సినీ గీతానికి కావ్యసౌరభం చేకూర్చింది. 'ప్రాయమింతకు మిగుల గైవ్రాలకుండ... కాశికాఖండమును తెనుగుచేసెదను' అని శ్రీనాథుడు దీక్షపూనాడు. 'వయస్‌' అంటే పక్షి అనే అర్థం కూడా ఉంది. పడుచు వయసు మనిషి ప్రతిభకు రెక్కలిస్తుంది. గరుత్మంతుణ్ని చేస్తుంది.

దీన్ని గ్రహించడంలో ముఖ్యంగా తల్లిదండ్రులు విఫలమవుతారు. 'ఢిల్లీకి రాజు అయినా, తల్లికి బిడ్డడే' అని సామెత. రామాయణం అంతా మథించినా, సూర్యమండలందాకా ఎగిరి రెక్కలు కాలి, వింధ్యపర్వతంపై కూలిపోయిన సంపాతి గుర్తుంటాడేగాని, పర్వతాన్ని పెళ్ళగించుకుని వచ్చిన హనుమంతుడి సామర్థ్యం తమ పిల్లల్లో ఉంటుందని వారు నమ్మలేరు. పిల్లలు స్వేచ్ఛగా రెక్కలు విప్పార్చి, నింగిలోకి దూసుకుపోతామంటే వారు అడ్డుకుంటారు. ప్రాయం చాలా ప్రమాదకరమైనదని వారి భయం. పాఠశాల నుంచి కళాశాలకు మారే వయసును సావాసాలు ప్రభావితం చేస్తాయి. శైశవానికి యౌవనానికి మధ్య వయసును వ్యసనాలు బలంగా ఆకర్షిస్తాయి. కాశీఖండంలో గుణనిధిని వయస్సే చెడగొట్టింది. 'అవినయ నిధానమగు నీ నవయౌవన, శైశవముల నడిమి వయసునన్‌ గవిసెడు వ్యసన ఉద్రేకంబు అవగాఢము(లోతైనది) దీని మానవయ్య తనూజ!' అని తల్లి మొత్తుకుంది. దీన్ని గ్రహించిన మన పెద్దలు చక్కని పరిష్కారం చెప్పారు. 'పిల్లవాడికి అయిదేళ్లు వచ్చేదాకా చక్రవర్తిలా లాలించండి. ఆపై పదేళ్లు క్రమశిక్షణతో పనిపాటలు నేర్పండి. పదహారు వస్తే ఇక వాడు పిల్లవాడు కాడు... మీ స్నేహితుడు. స్నేహంగా దగ్గరకు తీసుకుని, చక్కని సలహాలిస్తూ మంచిదారిలో నడిపించండి' అని హితవు పలికారు. తల్లిదండ్రులు మిత్రులైనప్పుడు పిల్లల పడుచుదనం ప్రతిభకు కొలువు అవుతుంది. సృజనకు నెలవు అవుతుంది. జాతికి పరువు అవుతుంది.

'పద్దెనిమిది, పాతిక మధ్య వయసు పెద్దరికానికి బాటలు వేస్తుంది. ఈ సమయంలో ఎన్నో స్వాభావిక గుణాలు, మైలురాళ్లు, పరిమితులు వాటంతట అవే అలవడతాయి. ఆశ్చర్యపరచే విజయాలు, ఆకస్మిక పరాజయాలు మనిషికి పరిణతిని సాధించిపెడతాయి' అంటున్నారు అమెరికాకు చెందిన వయోజనుల అభివృద్ధి ప్రాజెక్టు నాయకుడు రే సింప్సన్‌. ఇటీవల ఆయన నేతృత్వంలో జరిగిన అధ్యయనం ప్రకారం పాతికేళ్లు వస్తేనేగాని పరిపక్వత, సంపూర్ణ అవగాహన కలగడంలేదు. మన సమాజం పద్దెనిమిదేళ్లకు వయోజనుడిగా గుర్తించి ఓటుహక్కును కల్పిస్తోంది. స్త్రీలకైతే, అది పెళ్ళికి తగిన వయసు అంటోంది. పెద్దరికం మాత్రం ఇరవైఏళ్ళ తరవాతే అంటున్నారు డాక్టర్‌ సింప్సన్‌. 'ముసలివాళ్ళు ప్రతిదాన్నీ నమ్ముతారు. నడివయస్కులు ప్రతిదాన్నీ అనుమానిస్తారు. యువకులు ప్రతిదాన్నీ తెలుసుకుంటారు' అన్నాడు ప్రముఖ రచయిత ఆస్కార్‌ వైల్డ్‌. అలా తెలుసుకోవడానికి ఆలోచన అవసరం. ఆలోచనాశక్తిని పెంపొందించడం, పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం పెద్దల బాధ్యత. అరికట్టడం కాదు, వారి ఆలోచనలను సరిదిద్దడం మన విధి. 'చెట్లు బతుకుతున్నాయి, జంతువులు పక్షులు బతుకుతున్నాయి. కాని అద్భుతమైన ఆలోచనాశక్తితో నిండుగా జీవించే మనిషిదే- అసలైన బతుకు' అంది యోగవాసిష్ఠం. అలాంటి ఆలోచనాపరుడు గెలీలియో తన పద్దెనిమిదో ఏట పెండ్యులం సిద్ధాంతం ప్రకటించాడు. అలెగ్జాండర్‌ ఇరవయ్యో ఏట అధికారం చేపట్టాడు. వాషింగ్టన్‌ తన ఇరవైమూడోఏట దేశానికి రాయబారి అయ్యాడు. మన పిల్లలూ ఆ వయసులోనే విజేతలు కాగలరు- మనం సహకరిస్తే!
(ఈనాడు, సంపాదకీయం, 10:08:2008)
______________________________

Labels: