My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 22, 2007

ఇడ్‌, ఈగో, సూపర్‌ ఈగో

.............మనిషి వ్యక్తిత్వంలో ఇడ్‌, ఈగో, సూపర్‌ ఈగో అనే మూడు కంపొనెంట్స్‌ ఉంటాయి.

ఇడ్‌ కోరికలకు నిలయం. అది మంచి చెడులను పట్టించుకోదు. సమాజ నిబంధనల గురించి ఆలోచించనివ్వదు. కోరికలు తీర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది.

ఈగో పరిసరాలకు, నిబంధనలకు ...ప్రాముఖ్యతనిస్తాయి.

సూపర్‌ ఈగో నీతి, నియమాలకు ప్రాముఖ్యతనిస్తాయి. ఇవి మనిషి తప్పు చేస్తే పశ్చాత్తాప భావనలను కలిగిస్తాయి.

అయితే ప్రతి మనిషిలో ఈ మూడూ సమపాళ్లలో ఉండవు. హెచ్చుతగ్గులు సహజం. 'ఇడ్‌' ప్రభావమెక్కువగా ఉంటే తమ కోరికలు, అవసరాలే ముఖ్యం. అందుకే తమ తీరుతో మిగతావాళ్లకి ఇబ్బంది కలిగినా పట్టించుకోరు . ఇలాంటి వాళ్లలో సూపర్‌ ఈగో బలహీనంగా ఉండటం సహజం. దానివల్ల తప్పు చేస్తున్నానన్న పశ్చాత్తాప భావనలు రావు. సామాజిక నియమాలు పట్టవు.................
-డా|| కె. నిరంజన్‌రెడ్డి-క్లినికల్‌ సైకాలజిస్ట్‌
( Eenaadu, 22nd September 2007)
________________________________

Labels: ,

Inviting a read!

Well designed book racks help maintain your book collection, writes Hema Vijay
Photo Courtesy: Sujata Shankar

Do it right: Good design provides easy access and storage value.

Guess what’s the most fashionable thing to display now? No, it is not Swarovski crystal, Egyptian masks or Thai gold, but the good old things that transport you into other worlds – books.

Not surprisingly then that book racks have undergone a sea change; from being simply utilitarian to avant-garde.

Out of the box designs

While wooden book racks remain a classy way to store books and magazines, designers have come up with several creative book storage ideas. To begin with, books need not necessarily be stored in a boxed rack.

For instance, curved metal racks have become very popular abroad. The idea is simple; bend a metal plate about a foot wide and about 10 feet long in the shape of ’s’ or any curve you fancy.

Clamp it to the wall so that the metal plate provides a platform for books, which can now be arranged along the curving rack.

To prevent the books from sliding off, provide tiny raised surfaces where the curves head into space.

The same can be done with toughened glass too, and the ledges can be fashioned like steps, in zigzags, and curves, of course.

A multi-purpose space

On the other hand, book racks cannot be restricted to just books. You need space to store magazines, pamphlets, newspapers, letters, stationary, etc.

For this purpose, however, you need boxed book racks. The height of each shelf is best made variable.

While huge books like encyclopaedias need about 12 to 14 inches of vertical space, paperbacks need less vertical space.

Add drawers for storing stationery (spanning a height of three to four inches), and perhaps one huge drawer at the very bottom to store assorted stuff like charts, thermocol models, etc. Add a small rack for storing CDs (about seven inches high). The depth of the book rack is ideally about 12 inches, while the height and length are non-definable. The dimension of the book rack hinges closely on your needs, says architect and designer Sujatha Shankar.

Common mistake

One common mistake made by those setting up homes is to design their furniture keeping in mind just the present.

"When you design a boxed book case, make plenty of adjustable slots and holders, so that you can move the racks about to fit the huge atlas your child may be bringing along soon," says Sujatha Shankar.

As for storing books in other areas, you can provide space for books in the headboard of beds, ledges along kitchen, underneath stairways, etc. Use triangular glass panes in L-shaped areas.

Using the book rack as a display combo for curios is not so much in fashion now.

However, if you desire this, all you need to do is to install overhead lights and use glass shelves (in the case of closed book racks).

Designer book racks may cost anywhere between Rs. 3,000 and Rs.10, 000 and above, depending on the design and material.

For easy access and extra storage value, revolving racks are ideal, especially for room corners.

Moving on to material, the choice available here, as with the rest of interior décor, is endless… glass, acrylic, chromium, powder-coated steel, wrought iron, aluminium, pre-laminated boards, etc. Wood is, of course, an ever green choice, and the good thing about book racks fashioned in real wood is that they can gel with any décor.

In fact, wooden racks can emanate an air of elegance and a sense of being rooted to the space.

In sight, in mind

The role of book racks is not limited to systematically maintain your book collection; well-designed book racks may actually promote reading.

As designer Anupama Krishnan says, "People tend to read only what lies on the table.

If your books are in wooden cupboards hidden from the eye, the chance of your picking up a book casually and reading it is very less."

Out of sight and out of mind?

So, overt display of books may not be just intellectual snobbery.

Funky book racks can actually tempt you into picking up books and get into the reading groove.

(The Hindu, PROPERTYPLUS, Chennai,15:09:2007)

_____________________________

Labels:

COURAGE:

"When you cannot make up your mind which of two evenly balanced courses of action you should take - choose the bolder," said W. J. Slim.

If you have a choice of taking two paths, always take the more daring of the two. Calculated risk taking often produces extraordinary results.

There is no substitute for courage and though the chance of stubbing your toe increases the more you walk, it is always better than going nowhere by standing still. Take chances, take smart risks and you will meet with success beyond your dreams.

The law of courage states that

Your willingness to risk failure is the only real measure of your desire to be successful/ rich, but analyze and minimize risk in the pursuit of success.

The systematic, deliberate development of courage is essential to the achievement of success.

Fear is the greatest single obstacle to achievement.

Make a habit of always confronting the things you fear and doing them anyway.”

Act tough and you will be tough. Have courage and inspire others with your actions. But always be considerate. Fortune and love befriend the bold. No guts, no glory. Most failures are not due to lack of LUCK, but to lack of PLUCK. Life shrinks or expands in proportion to one’s courage. Courage means the willingness to take risks, to accept challenges. Nothing positive happens, until you take full responsibility for your thoughts and action. Positive people take responsibility for their own lives, where as unsuccessful people duck responsibilities.

Ø A person holding a butterfly in his fist asked Mullah Nasiruddin “Tell me whether the butterfly is alive or dead?”

Mullah smiling cryptically replied, “How can I say that? The butterfly is in your hand. It is up to you whether you want to keep the butterfly alive or kill it.”

Responsibility is like a butterfly. It is your choice whether you take it or leave it.


GEMS:

ü Guts are a combination of confidence, courage, conviction, strength of character, stick-to-itiveness, pugnacious ness, backbone, and intestinal fortitude. They are mandatory for anyone who wants to get to and stay at the top.

ü Courage is rightly considered the foremost of the virtues, for upon it, all others depend.

ü When the going gets tough, the tough gets going.

ü One man with courage makes a majority.

ü …What counts is not necessarily the size of the dog in the fight - it is the size of the fight in the dog.

ü Often the test of courage is not to die, but to live.

ü Courage is grace under pressure.

ü Success is the child of Audacity.

ü The Gods favour the bold.

ü The hero is no braver than an ordinary man, but he is brave five minutes longer.

ü Life shrinks or expands in proportion to one’s courage. Courage means the willingness to take risks, to accept challenges.

ü Courage is doing what you're afraid to do. There can be no courage unless you're scared.

ü Be bold-and mighty forces will come to your aid.

ü The strangest, most generous, and proudest of all virtues is true courage.

ü Courage is the mastery of fear-not the absence of fear.

ü The only man who never makes mistakes is the man who never does anything.

ü Most of us have far more courage than we ever dreamed we possessed.

ü The will to do, the soul to dare.

ü Don't be afraid to take a big step. You can't cross a chasm in two small jumps.

ü Cowards die a thousand deaths. The valiant taste of death but once.

ü It takes guts to get out of the ruts.

ü Whatever you can do, or dream you can begin it. Boldness has genius, magic, and power in it.

_(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)
_______
__________________

Labels:

సాహిత్యం-వాఙ్మయం

అధిక్షేపం:
అధిక్షేపం అంటే నిందించటం, వద్దని త్రోసిపుచ్చడం, తిరస్కరించడం అని అర్థాలు. వ్యంగ్య, హాస్య ధోరణిలో చేసే రచన. ఆంగ్లంలో సెటైర్. సమకాలీన సాంఘిక, రాజకీయ పరిస్థితులను సమీక్షించి వివిధ రంగాలలోని కలుషిత వాతావరణాన్ని ఆయా వ్యక్తుల దుశ్చర్యల్ని వ్యంగంగా చిత్రీకరించే రచనలు, అధిక్షేపించే రచనలు.అయితే ఆధునిక కాలంనాటి అధిక్షేప రచనలో ఉపదేశం కనిపిస్తుంది.సంఘ సంస్కరణ కనిపిస్తుంది.విమర్శనలో బాగోగులు కనిపిస్తాయి.
ఉదాహరణలు:తిరుపతి వెంకటకవుల గీరతం, గ్రామ సింహం, బిడాలోపాఖ్యానం.దాసు శ్రీరామకవి చక్కట్ల దండశతకం.ప్రహసనాలను సాక్షి సంపుటాలలో, వదరుబోతు వ్యాసాలలోనూ 'అధిక్షేపం ' గుర్తించవచ్చు.
_____________________________
అధివాస్తవికత:
ఆంగ్లంలో సర్రియాలిసం.మనసులో, కలలో వచ్చే అలోచల్ని యథాతథంగా వెల్లడించడం;సహేతుకంగా గతాన్ని, సంప్రదాయాన్ని నిరసించడం; రచనలో వ్యంగ్యము, అధిక్షేపము, హాస్యము, అవహేళనములతో శబ్దచిత్రాల గారడి, ఈ అధివాస్తవికత లక్షణాలు.వీటిలో సౌందర్యానికి, నీతికి సంబంధించిన సూత్రాలకు చోటు లేదు.తమ కాలములోని సాంఘిక నియమాలు పుటుక్కున తెంచి, హద్దు పద్దు లేని వ్యక్తి స్వేచ్ఛను కోరడమే సర్రియలిష్టుల అభ్యుదయ వ్యతిరేక ధోరణికి నిదర్శనము.ఆండ్రే బ్రెటన్,లూయీ ఆరగాన్, సోఫాల్ ఈ ఉద్యమానికి మూలస్తంభాలు.
తెలుగులో ఇది తాత్విక సిద్దాంతంగా కాకుండా కవితాధోరణిగా నిలిచింది.కొందరు దీనిని భీభత్స కవిత్వం, స్మశాన కవిత్వం, మణిప్రవాళం, అహంభావ కవిత్వం అని పిలిచారు. శ్రీశ్రీ రుబాయత్, విధూషకుని ఆత్మహత్య, శ్రీరంగం నారాయణ బాబు రుధిర జ్యోతిలో లెండోయి ఋషులు ఖండిక,
ఠాభి ఫిడేలు రాగాల డజన్ మొ// ఉదాహరణాలు.
___________________________
(వాఙ్మయ దర్శిని-ఆచార్య కె.సర్వోత్తమ రావు;
తెలుగు సాహిత్య దర్శనం,క్విజ్-ఎస్.నాగేoద్రనాథ్ రావు,
తెలుగు వెలుగు-డా.ద్వా.నా.శాస్త్రి.)
__________________________________

Labels:

Thursday, September 20, 2007

IDOL worship ?

IDLE worship ?

or

IDEAL worship ?
After immersion .. ?


The Day after ..


Would you like your Gods bulldozed like garbage ?



and treated like this ... ?

or dumped like this ?


left to rot for scavengers to feast ... ?


Lying at your feet .Helpless ..
Abandoned by worshippers !


Maimed ?

Desecrated ?

And you create a hue and cry when some statue in your city gets 'desecrated' ?

You burn down busses and call for bandhs ?



Maimed ?

Was that statue a GOD,

OR

Is this GOD only a Statue ?

You decide.


(an email forward)
-----------------------------------------

Labels:

Wednesday, September 19, 2007

It happens only in Pakistan!












(an email forward)
------------------------------

Labels:

Indian

(an email forward)
-------------------------

Labels:

హాస్యం



Title: Haasya Prapancham
Author: Maacherla Radhakrishnamurthy
Year of Publication: 2006
(http://www.avkf.org/BookLink/view_subjects.php?current_number=36)
-----------------------------------------

Labels: ,

హాసం





(Andhrabhoomi,18:09:2007)
(http://andhrabhoomi.net/sahiti.html)
---------------------------------

Labels: ,

Sunday, September 16, 2007

సిల్లీపాయింట్‌

రెన్సీనోటు చిరగడానికి ముందు కనీసం 4000 మంది చేతులు మారుతుంది.

* హాలీవుడ్‌లో అడుగుపెట్టేనాటికి వాల్ట్‌డిస్నీ జేబులో 40డాలర్లు, చేతిలో సగం గీసిన ఓ కార్టూన్‌ ఉన్నాయంతే!



* బబుల్‌గమ్‌పై ఉండే పొడి అత్యున్నత నాణ్యత కలిగిన ఫైన్‌ రకం పాలరాతి పొడి.

థాయ్‌లాండ్‌లో కనిపించే బంబుల్‌బీ ప్రపంచంలోనే అత్యంత చిన్న క్షీరదం. 30-40 మి.మీ. పొడవుండే దీని బరువు రెండు గ్రాములు. ఇది వేటాడే పద్ధతీ విచిత్రమే! గాలిలో ఎగిరే పురుగుల్ని పట్టుకుని తింటుంది.




అమెరికన్‌ వంద డాలర్ల నోటు మీది గడియారం చూపించే సమయం 4 గంటల పది నిమిషాలు.


* అమెరికన్‌ అధ్యక్షులందరిలోకీ పొట్టివాడు జేమ్స్‌ మాడిసన్‌(5అడుగుల 4అంగుళాలు). పొడగరి అబ్రహాంలింకన్‌(6అడుగుల 4అంగుళాలు).


* విజయవాడ నగర విస్తీర్ణం(61.88 చ.కి.మీ) కన్నా తక్కువ విస్తీర్ణం గల దేశాలు పది ఉన్నాయి.

* నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలకు సంబంధించిన అప్పులను బ్రిటన్‌ ఇంకా తీరుస్తూనే ఉంది.


* 1853కు ముందు బంగాళదుంపచిప్స్‌ లేవు.


* ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ఈ-బేలో విక్రయించిన అత్యంత ఖరీదైన వస్తువు జెట్‌విమానం. వెల దాదాపు 5మిలియన్‌డాలర్లు.

* జపాన్‌లో వీధులకు పేర్లుండవు.



క్రైస్తవ మతగురువు పోప్‌ ఎర్రటి ప్రాడా బూట్లనే ధరిస్తారు. పోప్‌ చెప్పులు కూడా ఎర్రవే.


(Eenadu,16:09:2007)
--------------------------------------

Labels:

ఇవ్వడంలో ఆనందం

1985లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ 'అమెరికా ప్రెసిడెన్షియల్‌ ఫ్రీడం మెడల్‌'ను మదర్‌థెరీసాకు బహూకరిస్తూ, 'ఈమె దీన్ని భారత్‌కు తీసుకెళ్లి, కరిగించి ఆ డబ్బుల్ని పేదలకోసం ఖర్చు చేస్తుందేవో' అని చమత్కారంగా వ్యాఖ్యానించారు. అవును మరి, ఇచ్చే మనసున్నవారికి ఇవ్వడంలో లభించే తృప్తి మరెందులోనూ దొరకదు.
దానం ఇవ్వడాన్ని వ్యక్తిగత బాధ్యతగా బోధిస్తుంది రుగ్వేదం. తమ ఆస్తిలో పదోవంతు ఆదాయాన్ని దానంగా ఇవ్వాలని బైబిలూ 2.5 శాతం 'జకాత్‌'గా ఇచ్చేయాలని ఖురానూ చెబుతున్నాయి. అంటే అన్ని మతాలూ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించమనే చెబుతున్నాయి. బహుశా దీన్నే కార్పొరేట్‌ కంపెనీలు తమ అభిమతం చేసుకున్నట్లున్నాయి.
వెున్నటికి వెున్న తన సంపదలో 85శాతం వాటాను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి దాతల్లోకెల్లా మహాదాత అనిపించుకున్నారు 'బెర్క్‌షైర్‌ హాతవే' ఛైర్మన్‌ వారెన్‌ బఫెట్‌. ఈ వితరణ విలువ సుమారు లక్షా డెబ్భైవేల కోట్ల రూపాయలు. సంతానం కోసం కొద్దిగా అట్టిపెట్టారాయన. దీనికి బఫెట్‌ ఇచ్చిన సమాధానం చాలా చిన్నది, కానీ ఎంతో లోతైంది. 'నువ్వు ఎవరికి పుట్టావన్నదే సమాజంలో నీ స్థానాన్ని నిర్ణయించకూడదు'...అన్నదే ఆ సమాధానం. తన కుమారులనుద్దేశించి ఆయన అలా వ్యాఖ్యానించినా దీన్ని మనం పేదలకూ అన్వయించుకోవచ్చు.
చేసిన మేలును చెప్పుకోకూడదంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అలా చెప్పడమే మంచిదేవో. అప్పుడే ఇంకొకరికి మంచి చేయాలన్న స్ఫూర్తి కలుగుతుంది. మంచి చేయడంలో మించిపోవాలన్న పట్టుదల పెరుగుతుంది. అది పనిలోనైనా ఆపన్నులపట్ల ప్రేమలోనైనా.
పోటీతత్వం... ఇదేగా కార్పొరేట్‌ మంత్రం!

మహా దాతలు!
మనిషి జీవితం డబ్బు, పేరు, తృప్తి చుట్టూ తిరుగుతుంటుంది. వయసు పెరిగినకొద్దీ ప్రాధాన్యాలు మారుతుంటాయి. శాశ్వత తృప్తిని మిగిల్చేది సామాజిక సేవేనని అత్యధికుల విశ్వాసం. అందుకే చేతనైన సాయం చేస్తారు. పారిశ్రామికవేత్తలూ అదేకోవలోకి వస్తారు. అయితే అంతర్జాతీయ వ్యాపారవేత్తలతో పోల్చితే మన ప్రముఖులు ఇచ్చే విరాళాలు తక్కువే. మనకంటే సంపద సృష్టిలో వాళ్లు ముందుండడం అందుకు ఓ కారణం కావచ్చు. కొందరు చేసిన దానధర్మాల సొమ్ము చూస్తే కళ్లు చెదురుతాయి.

* ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అనిపించుకున్నారు అమెరికా పారిశ్రామికవేత్త జాన్‌ డేవిసన్‌ రాక్‌ఫెల్లర్‌. గుత్తాధిపత్యానికి పెట్టింది పేరు. అలాంటివ్యక్తిలో సేవాభావం ఉప్పొంగాక విద్య, ప్రజారోగ్యం కోసం తన సగం సంపద ఖర్చుచేశారు. 1913లో ఏర్పడిన రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌కు 25కోట్ల డాలర్లు వితరణ చేశారు. 1937లో ఆయన చనిపోయినప్పుడు, 'నానారకాలుగా డబ్బు సంపాదించిన రాక్‌ఫెల్లర్‌ తన సేవాభావంతో పునీతుడయ్యారు' అంటూ విమర్శకులు ప్రశంసించారు.

* స్కాట్‌లాండ్‌కు చెందిన ఆండ్రూ కార్నిగీ అసలు సిసలు వ్యాపారి అనిపించుకున్నారు. తర్వాత మనసు మారి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ లాంటి దేశాల్లో సేవాకార్యక్రమాలు చేపట్టారు. దాదాపు మూడువేల గ్రంథాలయాలకు నిధులిచ్చారు. తన జీవితకాలంలో 35కోట్ల డాలర్లు ధర్మాలకే వెచ్చించారు. 1919లో మరణించిన కార్నిగీకి ఆస్తిని కొడుకులకు పంచడంలో తర్కం కనిపించలేదు. 'నేను కష్టపడ్డాను. వాళ్లు కాదు'... అదీ ఆయన చెప్పిన సమాధానం.

* తొలినుంచీ మనసున్నవాడిగానే జీవించిన ఫోర్డ్‌ వోటార్‌ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్‌ తన పేరుమీదే ఫౌండేషన్‌ నెలకొల్పారు. కంపెనీలోని కొన్ని షేర్లను మళ్లించి దాన్ని స్వతంత్రంగా సేవలందించేలా నిలబెట్టారు. యాభైదేశాల్లో దీని కార్యకలాపాలు సాగుతున్నాయి. ఒక్క 2006 సంవత్సరంలోనే ఈ సంస్థ అందజేసిన వితరణ రూ.2300 కోట్లు.

* 'ఇంటెల్‌' సహ వ్యవస్థాపకుడు గార్డన్‌ మూర్‌ ప్రపంచంలో అత్యంత ఉదారస్వభావమున్న దాతల్లో ఒకరు. పర్యావరణ ప్రేమికుడు, రచయిత కూడా అయిన మూర్‌ తన ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటిదాకా అందించిన ఆర్థికసాయం విలువ సుమారు రూ.30,000 కోట్లు.

* ప్రపంచంలో తొమ్మిదో అత్యంత ధనవంతుడైన చైనా సంతతి లికా షిం
గ్వ్యాపార సామ్రాజ్యం 50కి పైగా దేశాల్లో విస్తరించింది. హచిసన్‌ వాంపో లిమిటెడ్‌, చ్యుంగ్‌ కాంగ్‌ (హోల్డింగ్స్‌) లిమిటెడ్‌ సంస్థల యజమాని అయిన లికా తన పేరుమీదుగానే ఫౌండేషన్‌ నెలకొల్పారు. దానికి తన బీమా కంపెనీలోని 30 శాతం వాటాను (సుమారు రూ.1200 కోట్లు) విరాళంగా ప్రకటించారు. విద్య, ఆరోగ్యం ప్రధానాంశాలుగా ఆయన వాగ్దానం చేసిన విరాళాల వెుత్తం సుమారు రూ.25,000 కోట్లు.

* ఐక్యరాజ్యసమితికి రూ.4500 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు టెడ్‌ టర్నర్‌. 'చెక్‌ రాస్తున్నప్పుడు నా చేతులు వణికాయి. నా చేతులారా ప్రపంచంలోకెల్లా ధనవంతుడిని అయ్యే అవకాశం వదులుకుంటున్నాను కదా అనిపించింది' అని చమత్కరించారాయన. పర్యావరణ ప్రేమికుడు అయిన ఈ సీఎన్‌ఎన్‌ వ్యవస్థాపకుడు 'టర్నర్‌ ఫౌండేషన్‌' నెలకొల్పారు.

* హంగెరీలో జన్మించి అమెరికాలో ఆర్థికవేత్తగా ఎదిగిన జార్జిసొరోస్‌ స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులతో కోట్లు గడించారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు గురైన నల్లజాతీయులకు ఎన్నో సేవలందించారు. స్వేచ్ఛాయుత సమాజస్థాపనే ధ్యేయంగా 'ఓపెన్‌ సొసైటీ ఇన్‌స్టిట్యూషన్‌' నెలకొల్పారు. యాభై దేశాల్లో విస్తరించిన ఈ సంస్థ ప్రతి ఏటా అందించే ఆర్థిక సాయం సుమారు రూ.1600 కోట్లు.

* 'బ్లూంబర్గ్‌ ఎల్‌పీ కంపెనీ' అధిపతి, న్యూయార్క్‌ మేయర్‌ మైకేల్‌ బ్లూంబర్గ్‌ 2005లో రూ.654 కోట్లు విరాళమిచ్చారు. 987 స్వచ్ఛంద సంస్థలకు ఆ సొమ్మును పంచారు.

దానం
అన్నదానం, రక్తదానం, విద్యాదానం... దానం ఎన్నో రకాలు. ఈ భౌతిక ప్రపంచంలో మనుషులు దానం చేయడం మరచిపోయుంటారని పొరబడే అవకాశముంది. కానీ అది నిజంకాదు. పి.ఆర్‌.ఐ.ఎ.(పార్టిసిపేటరీ రీసెర్చ్‌ ఇన్‌ ఆసియా) సర్వే ప్రకారం ఏటా సుమారు ఏడున్నర కోట్ల భారతీయ కుటుంబాలు సేవా కార్యక్రమాలకోసం విరాళాలు ఇస్తున్నాయట. సంస్థాగత దానాల విషయానికొస్తే 2005లో అంతర్జాతీయంగా పేరువోసిన 211 కంపెనీలు ఉమ్మడిగా సుమారు రూ.44,000 కోట్లు దానమిచ్చాయి.

ఎవరైనా దానం ఎందుకు చేస్తారు? దీనిమీదే 'ఆసియా పసిఫిక్‌ ఫిలాంత్రపీ కన్సార్టియమ్‌' అధ్యయనం చేసింది. దాని ప్రకారం పేదల కష్టాలను చూడలేని జాలిగుణం 68 శాతం మందిని స్పందింపజేస్తోంది. సాయం చేస్తే మనసుకు సంతోషం కలుగుతుందని 48 శాతం మంది జవాబిచ్చారు. మతవిశ్వాసాలవల్ల 46 శాతం మంది దానం చేస్తారు.

నిజమైన హీరో
సెలబ్రిటీల్లోకెల్లా దయాగుణం ఉన్నవాడిగా జాకీచాన్‌ను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కొనియాడింది. 1988లో 'జాకీచాన్‌ ఫౌండేషన్‌' నెలకొల్పాడు జాకీ. పేదరికం, ప్రకృతి బీభత్సం ఆయన్ని కదిలించే అంశాలు. సునామీ బాధితులకోసం యునిసెఫ్‌కు రూ.30 లక్షల ఆర్థికసాయం ప్రకటించాడు. ఇల్లులేనివారికోసం పనిచేస్తున్న అమెరికాలోని క్రిసాలిస్‌ అనే స్వచ్ఛందసంస్థకు రూ.45 లక్షలు అందించాడు. రెడ్‌క్రాస్‌, వరల్డ్‌ ఎయిడ్‌ లాంటి డజను స్వచ్ఛంద సంస్థలకు తరచూ విరాళాలు ఇస్తుంటాడు. వెుత్తంగా సుమారు 300 కోట్ల రూపాయలు దానధర్మాలు చేశాడీ యాక్షన్‌హీరో. తన సగం సంపద దానమిస్తానని ఇదివరకే ప్రకటించాడు. ఆ సొమ్ము ముఖ్యంగా యువతకు ఉపయోగపడాలనేది ఆయన కోరిక. జాకీ వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు రూ.500 కోట్లు.

ఆపదొస్తే ఆదుకుంటాం
ప్రైవేటు కంపెనీలు ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా పాటుపడుతున్నాయి. ఆరోగ్యసేవలే తీసుకుంటే, బజాజ్‌ సంస్థ ఔరంగాబాద్‌లో 'కమల్‌నయన్‌ బజాజ్‌ హాస్పిటల్‌' నిర్వహిస్తోంది. ముంబయిలోని హరికిషన్‌దాస్‌ ఆసుపత్రికి 'ధీరూభాయి అంబానీ ఫౌండేషన్‌' ధర్మకర్త. 'ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌' కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఆసుపత్రులు నిర్మించింది. 'సీఎస్‌ఆర్‌' అంతగా ప్రాచుర్యంలోకి రాకముందునుంచీ సామాజిక బాధ్యతను తనదిగా చేసుకున్న టాటా ముంబయిలో క్యాన్సర్‌ రోగుల కోసం 'టాటా మెవోరియల్‌ హాస్పిటల్‌' నిర్మించింది. ఆదిత్యబిర్లా గ్రూపు పుణెలో 500 పడకలతో 'ఆదిత్యబిర్లా స్మారక ఆసుపత్రి' నిర్మించింది. ఇందులో 60-70 పడకలు పేదవారికోసం కేటాయించారు. హోప్‌ ఫౌండేషన్‌కు అత్యధికంగా నిధులు సమకూరుస్తున్నది ఫినోలెక్స్‌ గ్రూపు. ఇక చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి వెన్నుదన్నుగా ఉన్నవి ఒరాకిల్‌, హెచ్‌పీ, యాహూ లాంటివే. మనరాష్ట్రంలో సత్యం '108' సేవలు తెలిసినవే. 'ముందు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపద సృష్టి జరగాలి. తర్వాత దాన్ని పంపిణీ చేయాలి' అంటారు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి. ఆ పంపిణీ సమాజసేవ రూపంలో జరుగుతోంది.

ఎన్జీఓలకు అండదండ
గిరిజనుల పునరావాసం నుంచి పురజనుల సంక్షేమందాకా, బాలకార్మికుల విముక్తి నుంచి పల్లెప్రజల అభ్యున్నతి దాకా... పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్నో,
indianngos.com ప్రకారం దేశవ్యాప్తంగా వీటి సంఖ్య పదిహేను లక్షలు. వీటిల్లో కోటీ 94 లక్షల మంది పనిచేస్తున్నారని 'పీఆర్‌ఐఏ' అంచనా. ఇందులో 85శాతం మంది వలంటీర్లు. మిగిలినవారికి జీతాలు చెల్లించాలి. ఇన్ని లక్షల స్వచ్ఛందసంస్థల్లో సొంతంగా ఆర్థికవనరులు కలిగి ఉన్నవి చాలా తక్కువ. మరి ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? ఎలా సేవలందిస్తున్నాయి? ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, కార్పొరేట్‌ సంస్థల నిధులే ప్రాణాధారం. కాల్గేట్‌, భారతి, సిటీగ్రూప్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ, ఏసీసీ, ఆసియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ... వంటి ప్రతీ సంస్థ కొన్ని ఎన్జీఓలకు అండదండగా ఉంటోంది. 'ఏ సమాజపు సహజ వనరులు వాడుకుని మేము సంపద సృష్టిస్తున్నావో ఆ సంఘానికి మా వంతు సేవ చేసి తీరాలి' అంటారు హీరోహోండా సీఎండీ బ్రిజ్‌వోహన్‌ లాల్‌ ముంజాల్‌.
(Eenadu,16:09:2007)

Labels: ,

చరిత్రలో ఈ వారం

సెప్టెంబరు 17 1948:
భారతసైన్యం చేపట్టిన పోలీసుచర్య ధాటికి నిజాం సైన్యం లొంగిపోయింది. ఆపరేషన్‌ పోలో పేరుతో ఐదురోజులపాటు సాగిన ఈ పోలీస్‌యాక్షన్‌లో దాదాపు 1373 మంది రజాకార్లు హతమయ్యారు. 1900మందికి పైగా బందీలుగా చిక్కారు. హైదరాబాదు సైన్యంలో 800మందికి పైగా మరణించగా, సుమారు 1670మంది బందీలయ్యారు. సెప్టెంబరు 18న నిజాం లొంగిపోయాడు. ఆ రోజు సాయంత్రం నాలుగున్నరకు అధికారిక లొంగుబాటు పత్రంపై సంతకం చేయడంతో 224సంవత్సరాల అసఫ్‌జాహీల పాలన ముగిసినట్లయింది. హైదరాబాదు సంస్థానం భారత్‌లో విలీనమైంది.




ఇక... నిజాం హయాంలో అరాచకాలకు పాల్పడ్డ రజాకార్ల నాయకుడు ఖాసింరజ్వీ కొన్నాళ్లపాటు జైలుజీవితం గడిపి, విడుదలయ్యాక పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే అనామకంగా మరణించాడు.


-----------------------

సెప్టెంబరు 20,1633:
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన గెలీలియోగెలీలీ విచారణ సమయంలో ఆ విషయాన్ని ఒప్పించడంలో విఫలమై మతపెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. ఆపై జీవిత కాలమంతా గృహనిర్బంధంలోనే గడిపి కన్నుమూశాడు.
------------------------
సెప్టెంబరు 20,1878:
నూటపాతికేళ్లకు పైగా ప్రచురితమవుతున్న 'హిందు' తొలిసంచిక విడుదలైంది. అప్పట్లో అది డైలీ కాదు... వారపత్రిక.
--------------------------------
సెప్టెంబరు 21
అంతర్జాతీయ శాంతి దినోత్సవం.
1995:
ఆ రోజు తెల్లవారుజామునే ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు వినాయకుడు పాలు తాగుతున్నాడనే విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు తెలిపాడు. ఉదయం పదకొండుగంటల సమయానికి అది దేశమంతటికీ పాకింది. మరో గంటలో ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తెలిసింది. విదేశాల్లో సైతం హిందువులు వినాయకుడికీ శివపార్వతుల విగ్రహాలకూ పాలు నివేదించడం వెుదలుపెట్టారు. అయితే దాని వెనుక శాస్త్రీయకోణం ఉందని శాస్త్రవేత్తలు రుజువుచేయడంతో ఎంత వేగంగా ఆ ప్రచారం వెుదలైందో అంతే వేగంగా మరుగున పడిపోయింది.
(Eenadu,16:09:2007)
--------------------------------------

Labels:

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

* ఉన్నఫళాన లక్షాధికారిని అయిపోవాలని ఉంది. కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకుందురూ...!
-ఆర్‌. రామమోహన్‌రావు, హైదరాబాద్‌
అదెంత 'భాగ్యం' నాయనా! వెంటనే ఓ కోటి రూపాయలు తెచ్చియ్యి. చిటికెలో నిన్ను లక్షాధికారిని చేసేస్తా.
-------------

* నేను ఎప్పుడు షేర్లు కొన్నా మార్కెట్‌ పడిపోతోంది. నా ఫ్రెండ్సంతా నాది ఐరన్‌లెగ్‌ అని తిడుతున్నారు...
- ఆరారెమ్మార్‌, హైదరాబాద్‌
ఎంత అదృష్టం! వెంటనే మీ లెగ్గు తీసి ఉగ్రవాదం మీద పెట్టి పుణ్యం కట్టుకోండి. వాళ్ల బిజినెస్‌ మటాష్‌ అయిపోతుంది.
-------------------
* పలాసలో నాకో కంపెనీ ఉంది. అది ఎప్పుడూ నష్టాల్లోనే నడుస్తోంది. దాన్ని ఎక్కడికి మార్చమంటారు?
-ఎస్‌.వనజ, బరంపురం
'లాస్‌'ఏంజిల్స్‌కి మార్చండి. పేరుకు తగ్గట్టు సరిపోతుంది.
-----------------
* 'ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి' అని సామెత. దీనిని కార్పొరేట్‌ రంగానికి అన్వయిస్తే?
- టి. మల్లికార్జునరావు, తాడికొండ
ముందొచ్చిన షాపుల కంటే వెనకొచ్చిన 'మాల్స్‌' గ్రేట్‌!
------------------------
* కొన్ని పబ్లిక్‌ ఇష్యూల ధరలు చూస్తే రేట్లు ఎక్కువగా ఖరారు చేశారేమో అనిపిస్తుంది. మీరేమంటారు?
-ఎం.మనోహర్‌ రావు, చేవెళ్ల
అనవసరంగా 'ఇష్యూ' చేశారేమో అనిపిస్తుంది.
----------------
* 'ల్యాండ్‌లైన్‌ ఇల్లాలైతే, సెల్‌ఫోన్‌ ప్రియురాలు' అంటాను. మీరేమంటారు?
-కె.కృష్ణారావు, మచిలీపట్నం
ఇంతకీ మీకు ఎన్ని 'సెల్‌ఫోన్లు' ఉన్నాయి?
------------------
* 'వేమన క్లాత్‌ సెంటర్‌' అని పేరు పెట్టాను. ఎలా ఉంది మన ఐడియా? - వి.ఎస్‌. రాములు, ఇచ్ఛాపురం
డ్రెస్‌ ఉన్నా అడ్రస్‌ ఉంటుందా అన్నదే డౌటు.
-------------------
* మా మిత్రుడు దివాలా తీసినా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కారణం ఏంటంటారు?
-ఎస్‌. గోవిందరావు, కంకిపాడు
దివాలా వెనక ఏదో హవాలా ఉండి ఉంటుంది. ఓ కన్నేయండి
--------------------
* బాగా ప్రమోషన్లు రావాలంటే పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ మంచిదా? ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మంచిదా?
- పి.ఆర్‌. కోటేశ్వరరావు, రాజమండ్రి
ఏదైనా 'కమిటెడ్‌'గా పనిచేస్తే వస్తాయి గానీ 'లిమిటెడ్‌'గా పనిచేస్తే ఎలా వస్తాయి ప్రమోషన్లు.
----------------

------------------
(Eenadu,16:09:2007)
-------------------

Labels:

ఆరోగ్య సమాచారం ఇచట లభించును

మీకు ఇంటర్నెట్‌లో ఏదైనా సమాచారం కావాలంటే వెంటనే 'గూగుల్‌'ను ఆశ్రయిస్తారు కదూ! ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు సైతం ఇదే మార్గమున్నా, ఆయా రంగాలకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక వెబ్‌సైట్లు విస్తృత సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇలాటి వాటిలో ఒకటి www.healthline.com కేవలం ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలకైనా ఈ సైట్‌ ద్వారా సమాధానం దొరుకుతుంది. కిందటేడాది ఈ సైట్‌ను సందర్శించిన వారి సంఖ్య ఏడింతలై 25 లక్షలకు చేరడాన్ని గమనిస్తే ఈ సైట్‌కు లభిస్తున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫిజీషియన్ల సహకారంతో ఏర్పాటైన ఈ సైట్‌ను ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షిస్తూ ఉంటుంది. 10 లక్షలకు పైగా వైద్య రంగ పదజాలం, సామాన్య జనబాహుళ్యానికి సైతం అర్థమయ్యే రీతిలో వివరణలు, 70000కు పైగా వివిధ వివిధ రోగాలు, చికిత్సల వివరాలు, ఇతరత్రా ఆరోగ్య సమాచారం... ఈ సైట్‌ ప్రత్యేకతలు.
(Eenadu,16:09:2007)
------------------------------------------

Labels:

పంట పొలాల్లో పాటల సందడి

''సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే...'' అన్నారు త్యాగరాజు. మంచి సంగీతానికి ముగ్ధులుకానివారు అరుదు. ''చక్కని సంగీతం విని ఆనందించలేనివారు హత్యలు చేయటానికైనా వెనుకాడరు'' అన్నాడు షేక్స్‌పియర్‌. పురాణకాలం నుంచీ సంగీతం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. మన దేవతలంతా సంగీత ప్రియులే. ఎంత గొప్ప సంగీతమైనా పక్కవాద్యాల హంగు ఉంటేనే శోభిస్తుంది. మహతి అనే వాద్య విశేషాన్ని చేతబుచ్చుకొనే విష్ణు సంకీర్తనం చేస్తూ నారదమహర్షి త్రిలోక సంచారం చేసేవాడని పురాణ కథనం. ''పూను స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే'' అని మహాకవి అన్నట్లుగా నారదుడికి తుంబురునికి సంగీతపరంగా పోటీ ఉండేదని చెప్పే కథలున్నాయి. చదువులతల్లి సరస్వతి పుస్తకం ఎప్పుడు పట్టుకొనేదో కాని సదా వీణ వాయిస్తూనే ఉండేదన్నట్లుగా చిత్రాల్లో దర్శనమిస్తుంది. వీణాపాణి అన్న పేరుతో ఆమె ప్రసిద్ధికెక్కింది. శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా వీణ వాయించేవాడని ప్రసిద్ధి. వీణలలో మళ్ళీ రావణ వీణలు రజత వీణలు గోవింద వీణలు రుద్రవీణలు వంటి ఎన్నో రకాలుంటాయంటారు. అవన్నీ ఇప్పుడు ప్రాచుర్యంలో లేకపోయినా వీణ, ఫిడేలు వంటి వాద్యాలు సంగీతానికి సుసంపన్నమైన హంగును సమకూరుస్తూనే ఉన్నాయి.

కాస్త ఉల్లాసం కలిగినప్పుడల్లా కూనిరాగాలు తీయటం మనుషులకు అలవాటు. బాత్‌రూం భాగవతార్లు, వంటింటి కోయిలమ్మలు ప్రతి ఇంట్లోనూ దర్శనమిస్తారు. ''మా ఆయనవి కూనిరాగాలు కాదు. ఖూనీ రాగాలు... ప్రతిరాగాన్ని ఖూనీ చేస్తారు-'' అని పళ్ళు కొరుకుతుంది తాయారమ్మ. ''నేను కాస్త పాడదామని గొంతెత్తినపుడల్లా మీరు పరిగెత్తికెళ్ళి వీధిగుమ్మంలో కూర్చుంటారెందుకు?'' అని రుసరుసలాడింది గానసరస్వతి. ''ఎందుకంటే... ఎవరూ నాపై గృహహింస కేసు పెట్టకుండా'' అన్నాడు అయోమయం తెలివిగా. ''గృహహింసేమిటి?'' అంది గానసరస్వతి తెల్లబోతూ. ''నువ్వు పాడుతున్నావనీ, ఏడుస్తూ గోలపెట్టటంలేదనీ, నేను నిన్నుకొట్టటం లేదని నలుగురికీ తెలియాలని నువ్వు పాడుతున్నప్పుడల్లా నేను వీధిగుమ్మంలో కూర్చుంటాను'' అన్నాడు అయోమయం. ఆ తరవాత భార్యాభర్తలమధ్య సీతారామయుద్ధం భీకరంగా జరిగుంటుందని వేరే చెప్పనక్కరలేదు. గిరీశం పాటగాడు అవునోకాదో తెలియదుకాని బుచ్చమ్మను చూడగానే అతనిలో కూనిరాగాలు పుట్టుకొచ్చేవి. ''కాముని విరిశరముల బారికి నేనేమని సహింతునే చెలి యేమని సహింతునే...'' అని ఒకసారీ, ''ఎటులోర్తునే చెలియా...'' అని మరోసారి రాగాలు పలికించినా ఆట్టే ప్రయోజనం కలగలేదు. అమాయకురాలైన బుచ్చమ్మకు ఈ రాగాలు సరాగాలు అంతగా తెలియవు. ''యీ రుబ్బురోలు నిండా తాటాకు ముక్కలు పడుతున్నాయి. ఇవతలికి లాగేసి పెడతారూ?'' అని అడుగుతుంది తప్ప గిరీశం గాన కళానైపుణ్యాన్ని మెచ్చుకుంటూ ఒక్కమాటా మాట్లాడదు. సాధారణంగా సంగీతం మనిషిని కదిలిస్తుంది. మైమరిపిస్తుంది. మనిషికి మోదం కలిగినా రాగం జాలువారుతుంది. ఖేదం కలిగినా పాట- 'గొంతుకలో కొట్లాడుతుంది'. సంగీతం ఒక్క మనుషులనే కాదు పంట పొలాలనూ, ప్రభావితం చేస్తుందని ఇటీవల శాస్త్రజ్ఞులు రుజువు చేశారు.

వరి పొలాలు చక్కని సంగీతానికి ప్రభావితమై ఎక్కువ ఫలసాయాన్ని ఇస్తాయని దక్షిణకొరియా శాస్త్రవేత్త మిజియోంగ్‌ జియోంగ్‌ తన పరిశోధనల ద్వారా కనుగొన్నారు. ప్రస్తుతం జన్యుమార్పులకోసం రైతులు రసాయనిక ఎరువులు తదితరాల్ని ఉపయోగిస్తున్నారు. రసాయనిక ప్రక్రియలవల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమేకాకుండా ఖర్చుకూడా ఎక్కువవుతోంది. సంగీతంవల్ల ఇదే మార్పును ఆట్టే ఖర్చు లేకుండా పర్యావరణానికి నష్టం కలిగించకుండా సాధించవచ్చని కొత్తగా రుజువైంది. దక్షిణకొరియాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీకి చెందిన మిజియోంగ్‌జియోంగ్‌ తన సహచర శాస్త్రజ్ఞులతో కలిసి వరి పొలాలకు 14 రాగాల శాస్త్రీయ సంగీత రికార్డులను వినిపించాడు. వాటిల్లో ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బెథోవిన్‌ సృష్టించిన సంగీతమూ ఉంది. ఈ సంగీతం వింటూ ఆ ప్రభావానికి వరి జన్యువుల్లో కలుగుతున్న మార్పులను శాస్త్రజ్ఞులు నిశితంగా పరిశీలించారు. సంగీతం వింటూ వరిలోని రెండు జన్యువులు బాగా ఉత్తేజితం అవుతున్నట్లు శాస్త్రజ్ఞులు గమనించారు. అంతేకాక అందులోని ఒక జన్యువు ఇతర జన్యువులను కూడా సంగీత ధ్వనులకు ప్రభావితమయ్యేలా చేస్తుందని వీరి పరిశోధనలలో తేలింది. దక్షిణకొరియా శాస్త్రజ్ఞుల పరిశోధన పుణ్యమా అని ఇక రైతులు తమ పొలాలలో అవసరమైన మార్పులు తీసుకురావటానికి రసాయనిక ప్రక్రియల జోలికి పోనక్కరలేదు. సలక్షణంగా తామే ఏ వాయిద్యమో నేర్చుకొని చక్కని సంగీతం మొక్కలకు వినిపిస్తే చాలు!
(Eenadu,16:09:2007)

Labels: