ఫన్‌కర్ ఫటాఫట్
*ధరలతో ధరణి దద్దరిల్లితే వ్యాపారులు ఏం చేస్తారు?
ఆకాశానికి నిచ్చెనలేస్తారు.
____________________________
* మా కంపెనీ కారును కొన్నారంటే నెల పాటు పెట్రో కార్డు ఉచితం అనే స్కీమును ప్రవేశపెడితే ఖాతాదారులు ఏమనుకుంటారు?
పెట్రోలు కొనగలిగితే కారు ఫ్రీ అనే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు.
____________________________
* లక్ష కారు కొనవలసిందేనని ఇంటావిడ పట్టుపడితే, ఇష్టం లేని ఇంటాయన ఏం చేస్తాడు?
భార్యవన్నీ 'కారుకూతలు' అని కొట్టేస్తాడు.
_______________________________
* రిలయన్స్ పవర్ షేర్ కనీసం రెండు రెట్లు ఎక్కువ ధరకు లిస్ట్ అవుతుందని బెట్టు కట్టాను. మీ సలహా..?
'బెట్టు'కుపోయి దెబ్బతింటే కష్టం. మీ 'షేరు' మీరు సునాయాసంగా పొందండి చాలు.
________________________________
* పూరీలు, చపాతీలు, ఇడ్లీలు.. గుండ్రంగానే ఎందుకుంటాయి?
'గుండు' చేసేవన్నీ గుండ్రంగా ఉంటాయని చెప్పడానికి.
_____________________________
* చెట్టు కింద కూర్చొని కన్ను కొడితే?
ఏమీ కాదు. 'పళ్లు' రాలవు.
______________________________
ప్ర: ఆశబోతు వ్యాపారి ఎన్నికల్లో నిలబడితే?
డిపాజిట్‌ను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు.
____________________________
* కదిలే భూమి కదలనట్లు, కదలని సూర్యుడు కదులుతున్నట్లు అనిపిస్తోంది. ఇదేం రివర్స్ గేరండీ? నా వ్యాపారంలో ఏమవుతుందంటారు?
మీకు వ్యాపారంలో నష్టాలు వచ్చినా ఇబ్బంది లేదు.. లాభాలు వచ్చినట్టు అనిపిస్తుంది లెండి.
____________________________
* దొంగలంతా కలిసి వ్యాపారం చేస్తే?
'పగలు' కూడా పని చేయక తప్పదు.
____________________________
(Eenadu, 20;01:2008)
_____________________________
____________________________________
Labels: pun/telugu