My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, June 12, 2007

Business World OPINION - Reservations As Cancer

______________________________________
Reservations were always unjust; now they create only misery and jealousy all round without political advantage to any party
_____________________________________

It is an historical accident that Meenas were included amongst scheduled tribes and Gujjars were not. There was a time when Meenas were like any other Rajput clan. They built Amber fort, which commands the approaches to Jaipur. In the 16th century, Baharmull Kuchhwaha, a Rajput king, transferred his allegiance to Akbar, and with his help, destroyed the Meena kingdom of Naed. The feud continued for four centuries. When the British came, Rajput kings allied themselves with them to defeat Meenas, who lost their kingdoms and turned to robbery. That is how they ended up in the list of criminal tribes. Later, when the British ceded power to nationalists, the label, “tribe”, proved a godsend. It brought Meenas reservations in the civil service and education, and proved to be their entry ticket to the lucky Indian middle class. Today, Meenas are well represented in the civil service, and are turning to business.

Gujjars have a less distinguished history. They were originally nomads spread across the dry tracts of western India and Pakistan from Kashmir to Karnataka; it is possible that they came from Central Asia, perhaps Georgia. There are two subcastes of Gujjars: dodhi and bakarwal, or buffalo-keepers and goat-herds. When India was sparsely populated, they used to take their animals up to the Himalayan foothills in summer and descend back into the plains of Punjab and Uttar Pradesh in winter. Now that settled population has grown and grazing grounds have shrunk, they are being forced to take to more sedentary occupations. But not being a landed community like the Meenas, they do not have steady incomes or family support and have not invested as much in education. As a result, they have found it difficult to climb up the social ladder.

When the mutiny broke out in 1857, Gujjars were amongst the most energetic rebels; as a result, they had their share of hangings and dispossession, and earned their place in the 1871 list of criminal tribes. But somehow the curse of the British did not turn into a blessing of the Congress on the advent of independence; Gujjars were not included amongst scheduled tribes.

It is thus an accident of history that Meenas are a scheduled tribe and Gujjars are not. Meenas did the right crimes in the 19th century to earn their place in the fortunate category of tribes; Gujjars somehow fell through the cracks of history. This is no justice; it is sheer chance.

This government does not believe in justice; it is prepared to take a chance. Its resolve to shower favours upon Other Backward Castes (OBCs) is a perfect example. OBCs are so close in their social parameters to the main population that if they deserve reservations, so does almost everyone. They are backward only in name; if they are backward, there are no forward castes, except politicians. But they are a big vote bank; reservations are the way the Congress hopes to get their votes. Hence, the government’s opportunistic move. Mayawati came to power by giving sops to the most forward caste; the Congress does not want to be left behind in opportunism.

But here too, Gujjars are unlucky. They are not numerous enough for the government to bother. There are many groups and castes related to Gujjars — after all, Gujarat calls itself the land of Gurjars — but they would rather hide their kinship to the poor Gujjars.

The looming civil wars of India are not over class as the Prime Minister claims. The working class may have fought bloodthirsty capitalists in the textbooks he once read; but in the India he rules, it is castes that are fighting over the right to undeserved jobs and places in educational institutions. The way to douse their wars is to leave caste behind, and to abolish reservations. Reservations were originally introduced for an opportunistic reason: the Congress wanted to wean away Untouchables from Ambedkar, and to persuade them not to convert themselves to Islam and Buddhism. So it gave them reservations — but only if they were Hindus. There are Muslim Meenas, called Meos; they were excluded from the reservations.

For reasons of political advantage, the Congress divided the people by caste and religion. But now those divisions it created are causing bloodshed and havoc. There is no more political mileage in them; instead, there is only trouble. Even sectarian political parties must see that the time for favouring vote banks has passed.

No politician likes to take a radical decision, least of all the Prime Minister. It may be beyond him to abolish reservations. But he should at least begin to reduce the reservation percentages. If he wants to profit politically, he can replace them at the margin by reservation for the meritorious poor. Let him practise inclusive growth.

( http://www.businessworld.in/content/view/1891/1954/)
_________________________________________________

Labels:

మన పాలెంత? అంతా.../ సాధన వట్టిపోదు


మన పాలెంత? అంతా...
-చక్కిలం విజయలక్ష్మి
పలాయనవాదులు కర్మ సిద్ధాంతాన్ని వక్రిస్తూ ఉంటారు. శివుని ఆజ్ఞ లేనిది చీమయినా కుట్టనప్పుడు మన కర్మలకు మనమెలా బాధ్యులమవుతామని వితండవాదం చేస్తూ ఉంటారు. '...యోగ క్షేమం వహామ్యహం' అన్న శ్రీకృష్ణుడి హామీని వాళ్లు అలుసుగా, వెసులుబాటుగా స్వీకరిస్తారు. నిత్యావసరాలకు సైతం భగవంతునిమీద భారం మోపి నిర్వ్యాపారంగా ఉన్నవాడు తప్పకుండా అన్నింటికీ ఆయనమీద ఆధారపడవచ్చు. కర్మ ఫలాలకూ నిర్బాధ్యుడుగా ఉండవచ్చు. అది మన ఆనుకూల్యాన్నిబట్టి ఉంటుంది. ధర్మం చాలా సూక్ష్మమైంది. మన అవసరాలకొద్దీ, మన ఇష్టాయిష్టాలకు అనుకూలంగా మార్చుకో వీలైంది కాదు. భగవంతుడి న్యాయస్థానంలోని న్యాయ సూత్రాలు, ధర్మ సూక్ష్మాలు అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప ఆయన కూడా అధిగమించరానివి. ఆ నిర్ణయం కూడా ఆయనదే. మన అవగాహనకు రాకపోయినా, మనం అంగీకరించకపోయినా ఆయన చట్టం అమలయ్యే తీరుతుంది. శివుని ఆజ్ఞలేనిది చీమయినా కుట్టని సూత్రం సత్యమే అయినా మానవ జీవన పథంలో పురుష ప్రయత్నం అనేది అనివార్యం.

ఏ కర్మ ఆచరణకైనా సంకల్పం ముఖ్యం. ఒక కర్మను సంకల్పించి, దానికి అవసరమైన జ్ఞానాన్ని సముపార్జించి, దాన్ని క్రియా రూపంలోకి తేవలసిన బాధ్యత కర్మిదే. జ్ఞానశక్తి, క్రియశక్తిగా దీనిని మనం పురుష ప్రయత్నంలోకి ఆవాహన చేసుకునే తీరాలి. ఫల వితరణ మాత్రం శివుని చేతిలో ఉంటుంది. ఈ క్రమాన్ని అర్థం చేసుకోలేకే మనిషి కర్మ సిద్ధాంతానికి, శివుని ఆజ్ఞకు పొంతన కుదరక గందరగోళపడి పలాయన వాదాన్ని చిత్తగిస్తూ ఉంటాడు. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుని విశ్వసించగలిగితే మనం కర్మను సుకర్మగా, కర్మయోగంగా ఆచరించగలుగుతాం. కర్మ సిద్ధాంతాన్ని శాస్త్రం ఇంత స్పష్టంగా చెప్పినా- నమ్మినా, నమ్మకపోయినా దుష్కర్మల్ని ఆచరిస్తూనే ఉంటారు. అదే మన కర్మ ఫలాలకు ఇతరులు వారసులవుతారని అనుకుంటే ఇక అప్పటి పరిస్థితేమిటి?

ఒక వ్యక్తి ఉపాహారం తీసుకునేందుకు ఫలహారశాలకెళ్లాడు. చెల్లించవలసిన మూల్యం గురించి భయపడ్తూ ధారాళంగా తినేందుకు జంకుతున్నాడు. అక్కడి పదార్థాలను పంపిణీ చేసే ఉద్యోగి ''మీ రంతగా భయపడవలసింది లేదు. బిల్లు మీరు చెల్లించనక్కరలేదు. భవిష్యత్తులో రాబోయే మీ మనవల నుంచి వసూలు చేస్తాం'' అన్నాడు. తాను తిన్నదానికి తానే చెల్లించవలసిన అవసరం లేదని తెలుసుకున్న ఆ వ్యక్తి పరమానందభరితుడై అవసరమైన దానికంటే అధికంగానే తిని తృప్తిగా లేచిపోతుండగా ఆ ఉద్యోగి వేల రూపాయలతో కూడిన బిల్లు తెచ్చి ముందుపెట్టాడు. నిజానికతను తిన్నది వందలోపే. తెల్లబోయి ఇదేమిటని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. ''మీరు తిన్నది మీ మనవలు చెల్లించబోతున్నప్పుడు మరి మీ తాతలు తిన్నది మీరు కట్టవలసిందే కదా?'' అన్నాడు నింపాదిగా.

ఎవరి కర్మఫలాలను వాళ్లే అనుభవించవలసి ఉంది అని తెలిసి కూడా ఇంత దుబారాగా దుష్కర్మలు చేసే లోకులు తమ కర్మఫలాలను ఇతరులు అనుభవిస్తారనే వెసులుబాటు ఉంటే ఇంకెంత విశృంఖలంగా ఉండేవారో కదా!? కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, మన బిల్లును మనమే కట్టవలసిన అనివార్యతను గుర్తుంచుకుంటే అప్రమత్తులమై కర్మలనాచరించి అమృత పుత్రులమనే మన స్వనామానికి సార్థకత చేకూర్చగలం.

'మన కర్మాచరణ, దాని ఫలాల బాధ్యతలో మన పాలెంత?' అని ప్రశ్నించుకుంటే, సమాధానం 'అంతా' అనే.

(Eenadu, 10:06:2007)
_______________________________________
సాధన వట్టిపోదు
- సామవేదం షణ్ముఖశర్మ
...ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా, కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు ప్రయత్నం కంటే ప్రారబ్ధం బలీయంగా ఉందని తెలుసుకోవాలి...

చిత్తం శుద్ధి అయితేనే పరిపూర్ణత. మనలోని అంతఃకరణ చైతన్యమే చిత్తం. ఏ కర్మచేత మనం పవిత్రమవుతామో ఆ కర్మను 'పుణ్యం' అంటారు. దోషాచరణ పాపం.

దుఃఖాలు తటస్థించినప్పుడు వాటి పరిష్కారానికై పలు ప్రయత్నాలు చేస్తాం. కొన్ని భౌతికమైనవి- ఇంకొన్ని ధార్మికమైనవి. ధార్మిక ప్రయత్నాలు జపతపాలు పూజలు దానాలు మొదలైనవి. ఇవి చేయడంవల్ల నిజంగా ఫలితం ఉంటుందా అని కొందరికి సందేహం కలగడం సహజం. రోగాలకు వైద్యపరమైన చికిత్సలు చేసినప్పుడు- అవే చికిత్సలకు కొందరు బాగుపడుతున్నారు, కొందరికి వైఫల్యం ఎదురవుతోంది. అయినా మనం ఆ చికిత్సను 'మూఢ విశ్వాసం' అనలేం కదా! అలాగే ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా, కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు ప్రయత్నం కంటే ప్రారబ్ధం బలీయంగా ఉందని తెలుసుకోవాలి.

ఇక్కడ మరో ధర్మసూక్ష్మం ఉంది. దైవీయమైన జపతపాది ధార్మిక ప్రయత్నాలు ఎప్పటికీ వృథాకావు. అవి ఈ జీవితంలోనే కాలాంతరంలో ఏనాటికైనా ఫలించే అవకాశముంది.

ఈ విషయమై మన శాస్త్రాలు చక్కని వివరణలనిచ్చాయి. విత్తనం, వేరు (మూలం) కనబడకపోయినా వృక్షం, ఫలం కనిపిస్తాయి. అలాగే కారణమైన కర్మలు గోచరించకున్నా, వాటి ఫలాలు అనుభవాలుగా వస్తాయి. ఈ 'కర్మ-ఫల' సంధానకర్మ ఈశ్వరుడు.

ఈ జన్మకు ఆధారమైన ప్రారబ్ధకర్మలలో ప్రతి కర్మకు- 1. బీజాంశ, 2. వృద్ధ్యంశ, 3. భోగాంశ... అని మూడు భాగాలుంటాయి. జపతపాది సాధనాల ద్వారా 'వృద్ధ్యంశ'ను నివారించవచ్చు. అంటే- దుఃఖాది అనుభవాల తీవ్రతను పెరగకుండా చేయవచ్చు.

తప్పించుకోలేనిది 'భోగాంశ'. ఇది అనుభవంతోనే క్షయమవుతుంది. కానీ దేవతారాధనచేత, తపోదానాదుల చేత సాధకుడికి ఈ అనుభవాన్ని తట్టుకోగలిగే శక్తి కలగడమేకాక, కాలపరిమాణంలో ఆ అనుభవం విజ్ఞాన హేతువవుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కారణమవుతుంది.

మిగిలినది 'బీజాంశ'. ధార్మిక సాధనవలన, ఆత్మవిచారణవలన చిత్తశుద్ధి, జ్ఞాన వైరాగ్యాలు కలిగి- ఈ బీజాంశ నశిస్తుంది. అప్పుడతడు పూర్తిగా కర్మమాలిన్యం నుండి బయటపడతాడు. కనుక పాపనాశనకోసం ఈ ధార్మిక సాధనలను అవశ్యం అవలంబించాలి. పాపమనేది మనస్సుతో, మాటతో, శరీరంతో, ధనంతో (సంపాదించిన సామగ్రితో) చేస్తాం. జప, స్తోత్రాదుల చేత వాచిక (మాట) పాపం పోతుంది. అసలు గట్టి పాపం మానసికం. అది ధ్యానంవలన నశిస్తుంది. పూజ, క్షేత్ర తీర్థయాత్ర, శౌచం- శారీరక పాపాలను తొలగిస్తాయి. దానం ద్వారా- సంపాదనగత పాపాలు నశిస్తాయి. అందుకే త్రికరణాలతో, ధనాలతో సత్కర్మలను ఆచరించాలి.

ఇప్పటికే పేరుకున్న పాపాలను తొలగించుకొనేవి పావనకర్మలు. అంతేగానీ- ఈ పరిహారాలు ఎలాగూ సిద్ధంగా ఉన్నాయని కొత్త పాపాలను ఆచరించడం తగదు. మందు సిద్ధంగా ఉందని రోగాన్ని ఆహ్వానించలేం కదా! ఉన్న చెడును తొలగించుకొని చిత్తం శుద్ధమైతేనే ఆత్మజ్ఞానం, సత్యప్రాప్తి చేకూరుతాయి.

(Eenadu, 08:06:2007)
___________________________________________

Labels: ,

మంచి మిత్రుడు

'క స్నేహితుడి కోసం ప్రాణాల నర్పించటమనేది ఏమంత కష్టమైన పనేమీ కాదు; కాని అంతటి త్యాగానికి అర్హుడైన మంచి స్నేహితుడిని సంపాదించుకోవడమే కష్టం!' అన్నాడొక పెద్దాయన. మంచి స్నేహితుడు మన కష్టాలను భాగిస్తాడు, సుఖాలను హెచ్చవేస్తాడు అన్నారు పెద్దవాళ్లు. లోకంలో తల్లిదండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి స్నేహితుడే అన్నాడు శ్రీమాన్‌ పరవస్తు చిన్నయసూరి తన నీతి చంద్రికలోని మిత్రలాభంలో.

'మన స్నేహితుడు- మనం పాపకార్యాలు చేయబోతుంటే వారిస్తాడు. మనచేత మనకు మేలు కలిగే పనులే చేయిస్తాడు. మన రహస్యాలను బయటకు పొక్కనివ్వడు. మన సుగుణాలను వృద్ధి చేస్తాడు. మనం కష్టాలలో ఉంటే వదలి వెళ్లడు. డబ్బు లేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు. ఇవే మంచి మిత్రుడి లక్షణాలు' అన్నాడు భర్తృహరి.

'నీ శత్రువుల చేత జూద మాడించి, రాజ్యాన్ని కాజేసి, అడవులకు పంపావు; బాగానే ఉన్నది. అంతటితో సరిపోయిందనుకొన్నావా? మన ఐశ్వర్యాన్నీ విలాసాలనూ వారికి చూపించి ఏడిపించవద్దా? వాళ్లున్న చోటికే వెళదాం పద!' అంటూ తన మిత్రుడినీ అతడి పటాలమంతటినీ తీసుకొని వెళ్లినవాడికీ, వాడివెంట వెళ్లినవాడికీ, వారి బంధుమిత్రాదులందరికీ శృంగభంగమైన కథ మనకు తెలుసు. ఇనుముతో కలిసి ఉన్నందుకు అగ్నికి సమ్మెట దెబ్బలు తప్పవు మరి.

బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి; కానీ, స్నేహితానికి అక్కరలేదు. చిన్నతనంలో ఒకే గురువు వద్ద యుద్ధ విద్య నేర్చుకొని 'ఒరే! నీకెప్పుడైనా ఇబ్బంది అంటూ వచ్చినట్లయితే మహారాజును నేనున్నానని మర్చిపోవద్దు; నా దగ్గరకు రావటానికి మొహమాట పడొద్దు' అని వాగ్దానం చేసిన మహారాజు వద్దకు ఆ బ్రాహ్మణుడు వెళ్లి 'నా కోసం ఏమీ వద్దు. మా అబ్బాయి పాల కోసం ఏడుస్తున్నాడు. ఒక్క ఆవును మాత్రం ఇవ్వు. చాలు!' అని అడిగితే ఆ మహారాజు నానా దుర్భాషలాడి పంపించాడు. ఫలితం అనుభవించాడు. ఈ కథ కూడా మనకు తెలుసు.

ఎప్పుడో చిన్నతనంలో కలసి చదువుకొన్న కుచేలుడు చినిగిపోయిన తుండుగుడ్డ చివర మూడు గుప్పెళ్ల అటుకులు మూట కట్టుకొని శ్రీ కృష్ణుడి వద్దకు వెళితే ఆయన ఆ బీద బ్రాహ్మణుడికి బ్రహ్మరథం పట్టాడు. ఆ అటుకుల నెంతో ఆప్యాయతతో తిన్నాడు. అతడడగ కుండానే అనంతమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. కనుకనే ఆదర్శమైత్రికీ, మైత్రీ మాధుర్యానికీ మారురూపంగా నిలిచింది వారి కథ. అట్లా ఉండాలి స్నేహితుడంటే.

మంచి మిత్రుడు కంటికి రెప్పలాగా, కాలికి చెప్పులాగా మనలను కాపాడుతూనే ఉంటాడు. అంటే తాను ఇబ్బందిపడుతూ కూడా మనకు సుఖాన్ని కలిగిస్తాడు. సుగ్రీవుడికి వచ్చిన కష్టాన్ని విని 'సంజాత బాష్పః...' - కన్నీరు కార్చాడు శ్రీరాముడు. ఆయనే గుహుడితో 'ఆత్మ సమ స్సఖః-' నీవు నాకు ఆత్మతో సమానమైన స్నేహితుడివి అన్నాడు.

సంసారమనే విష వృక్షానికి అమృతంతో సమానమైన ఫలాలు రెండే రెండు. ఒకటి మంచి పుస్తకం; రెండవది మంచి మిత్రుడు. మంచి పుస్తకాన్ని చదువుకొంటూ ఆనందానుభూతిని పొందడం, మంచి మిత్రులతో మాట్లాడుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం- ఈ రెండూ మన చేతిలోని పనులే! కనుక మనం మంచి మిత్రులను సంపాదించుకొందాం! మనమూ వారికి మంచి మిత్రులు గానే ఉందాం! మన మందరమూ ఈ విధంగా ఉన్నట్లయితే మన సమాజం తప్పకుండా అమృత వృక్షమవుతుంది. సందేహం లేద.

- డాక్టర్‌ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
(Eenaadu,09:06:2007)
_______________________________

Labels:

Sunday, June 10, 2007

INDIAN SALESMAN

The Manager says: "Do you have any sales experience?"


The Indian says: "Sir, I was a salesman back home in India."


Well, the boss liked the Indian choppy so he gave him the job.

"You start tomorrow. I'll come down after we close and see how you did."
His first day on the job was rough but he got through it.

After the store was locked up, the boss came down.

"How many sales did you make today?"


Indian boy says: "Sir, Just ONE sale."


The boss says: "Just one? No! No! No! You see here our sales people average 20 or 30 sales a day. If you want to keep this job, you'd better be doing better than just one sale. By the way, how much was the sale for?"


Indian boy says: " $101 237. 64"


Boss says: "$101 237. 64? What the hell did you sell?"


Indian boy says: "Sir, First I sell him small fishhook.
Then I sell him medium fishhook.
Then I sell him large fishhook.
Then I sold him new fishing rod and some fishing gear.
Then I ask him where he's going fishing and he said down on the coast, so I told him he'll be needing a boat, so we went down to the boating department and I sell him twin engine Chris Craft.
Then he said he didn't think his Honda Civic would pull it, so I took him down to our automotive department and sell him that 4X4 Blazer.

I then ask him where he'll be staying, and since he had no accommodation, I took him to camping department and sell him one of those new igloo 6 sleeper camper tents.
Then the guy said, while we're at it, I should throw in about $100 worth of groceries and two cases of beer.

The boss said: "You're not serious? A guy came in here to buy a fishhook and you sold him a boat, a 4X4 truck and a tent?"


Indian boy says: "No Sirji, actually he came in to buy Anacin for his headache, and I said: Well, fishing is the best way to relax your mind."


(An e-mail forward)


Labels:

HR MEANS HIGH RISK!

After 2 years of selfless service, an employee realized that he has not been promoted, no transfer, no salary increase no commendation and that the Company is not doing any thing about it. So he decided to walk up to his HR Manager one morning and after exchanging greetings, he told his HR Manager his observation. The boss looked at him, laughed and asked him to sit down saying:


My friend, you have not worked here for even one day.
The man was surprised to hear this, but the manager went on to explain.

Manager- How many days are there in a year?

Man - 365 days and some times 366

Manager- how many hours make up a day?
Man - 24 hours

Manager- How long do you wo rk in a day?
Man -
8am to 4pm. i.e. 8 hours a day.

Manager- So, what fraction of the day do you work in hours?
Man - (He did some arithmetic and said 8/24 hours i.e. 1/3(one third)

Manager- That is nice of you! What is one-third of 366 days?
Man - 122 (1/3x366 = 122 in days)

Manager- Do you come to work on weekends?

Man - No sir

Manager- How many days are there in a year that are weekends?
Man - 52 Saturdays and 52 Sundays equals to 104 days

Manager- Thanks for that. If you remove 104 days from 122 days, how many days do you now have?
Man - 18 days.

Manager- OK! I do give you 2 weeks sick leave every year. Now remove that14 days from the 18 days left. How many days do you have remaining?
Man - 4 days

Manager- Do you work on New Year day?
Man - No sir!

Manager- Do you come to work on workers day?
Man - No sir!

Manager- So how many days are left?
Man - 2 days sir!

Manager- Do you come to work on the (National holiday )?
Man - No sir!

Manager- So how many days are left?
Man - 1 day sir!

Manager- Do you work on Christ mas day?
Man - No sir!

Manager- So how many days are left?
Man - None sir!

Manager- So, what are you claiming?
Man - I have understood, Sir. I did not realise that
I was stealing Company money all these days.

Moral - NEVER GO TO HR FOR HELP!
HR = HIGH RISK!!

_(An e-mail forward)_____________

Labels:

ఉక్తులూ, సూక్తులూ (1)


అందం:
చూడదగినదైన చూడగ వలయురా. -వేమన

"అందమే ఆనందం
ఆనందమె జీవితమకరందం."
______________________________________________
అజ్ఞానం:
తెలియని మనుజుని సుఖముగ
దెలుపందగు సుఖతరముగ దెలుపగ వచ్చున్
దెలిసిన వానిందెలిసియు
దెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే. - భర్తృహరి

కుక్కనందలమున కూర్చుండపెట్టిన
నొక్క మనసుతోడ నుండబోదు.
ఆత్మ నిలుపలేని యజ్ఞానియును నట్టె. -వేమన

అజ్ఞుల నోరు మూయవచ్చునే. -పాపరాజు
________________________________________
అధికారం:
అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు.-వేమన

అవనిలోపల నధికార మబ్బినేని
క్రిందివారలనెప్పుడు కినియదగదు. -కందుకూరి వీరేశలింగం పంతులు
____________________________________
అప్పు:
అప్పుదీయ రోత హరిహరాదులకైన
మొప్పెతోడ మైత్రి మొదలె రోత
తప్పు బలుక రోత తాకట్టు కడు రోత. -వేమన

అప్పులేనివాడె అధిక సంపన్నుడు. -వేమన

ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం ఉండకూడదు. -ఒక సూక్తి
________________________________________
అలంకారం:
నగలు లేవటంచు వగజెందుటేగాని
నగలవల్ల లేని సొగసు రాదు;
మగువకేల నగలు మనసిచ్చుమగడున్న? -నార్లవెంకటేశ్వరరావు

తామర సాక్షికెందు
తలిదండ్రులు పెట్టని సొమ్ము పెన్నెరుల్. -చేమకూర వేంటకవి

భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితుచేయు పవిత్రవాణి వా
గ్భూషణమే సుభాషణము భూషముల్ నశియుంచు నన్నియున్.-భర్తృహరి
____________________________________________
అసూయ:
కుళ్ళుబోతు నొద్దగూడి మాట్లాడిన
గొప్ప మర్మములను చెప్పరాదు .-వేమన
అన్యుల కల్మి కన్ గొని యసూయామగ్నుడౌ
వానికాపద సేకూరు నవశ్యము. -పాపరాజు

సరివారి పరువు సైపని
నరుడే ధర తెవులు లేక నవయుచు కుందున్. -కోలచలం
__________________________________________
అహింస:
కలుగునవశ్యమున్ సకల కర్మములనందును హింస
హింస సేయనివాడు లేడిజ్జగమున. -ఎఱ్ఱన

దానమును తపంబు ధర్మంబు యజ్ఞంబు
శౌచ మంత్ర తంత్ర సత్యములును
బుధులహింస రూపములు గాగ చెప్పుట
నెల్లకల్మి సుమ్మహింస కలిమి. -తిక్కన

కుళ్ళిపోయున్న కురుపుమీద వైద్యుడు జరిపే శస్త్రప్రయోగాన్ని
హింస అని ఎవ్వడూ అనలేడు. -శ్రీశ్రీ

అహింస పరమోధర్మః -ఆర్యోక్తి
_______________________________________
(భావన, యువభారతి ప్రచురణ:29,ప్రథమ ముద్రణ 1974)
________________________________________

Labels: ,

Beany wonder

By Indu Balachandran

What you don’t know about the most rubber-faced man you know?

He brushes his teeth and changes his clothes—all while driving a car.

He looks smugly around his class—then realizes he’s prepared for the wrong exam

He tries everything, but falls hopelessly asleep in church.

IF these were clues in a quiz, you’d say at once “Mr Bean of course!”.


But look at this other set of clues:

He went to school with Tony Blair.

His biggest passion and hobby: fancy racing cars.

He’s married to a gorgeous Hindu woman, Sunetra Sastry.


Would you just as easily have guessed, “Rowan Atkinson!”?


Yes, these are the surprising facts about the rather private side of your beloved Mr. Bean (or the obnoxious Mr Bean, if you hated that episode of him running around naked in a posh hotel, for instance.)

But people in 95 countries (and travellers in 50 airlines) can’t seem to have enough of this rubber-faced wonder of blunders. Not just in manageable doses of 20-minute episodes, but even entire feature film lengths of him, as the success of the blockbusting “Mr. Bean’s Holiday” proves.


Reluctant comic

He went to school with Tony Blair.

Rowan Atkinson was born into an English farming family in 1955, and when he wasn’t making his classmates fall apart laughing with impersonations of teachers, he was taking apart all things mechanical, and enjoying putting them back. In fact in that very school was a young lad, Tony Blair — though Rowan only remembers him as ‘someone who smiled a lot’.

Rowan’s schoolday heroes were Buster Keaton and the French comedian Jacques Tati — and Rowan became obsessed with staging their skits — and yet managed to get excellent grades. And despite the many pranks he pulled on his hapless masters, it was his Headmaster who first advised Rowan to seriously consider a career in entertainment.

However Rowan believed his real interest was in engineering, topping his class with a Masters in Electronics. But everything was to change when he met the talented Richard Curtis — who drew him firmly into the path of show biz. Together, they would create path-breaking shows like “Not The Nine O’ Clock News”, the raucously funny “Black Adder” series and even “Mr. Bean”).

Rowan Atkinson was making waves as Britain’s funniest man, but once off the stage he would plunge into his private shy world, steering clear of interviews and publicity.


Family life

He’s married to a gorgeous Hindu woman, Sunetra Sastry.

Something that even affected his romance. He fell heavily in love with a very attractive BBC makeup artiste called Sunetra Sastry…but it took months to summon the courage to ask her for a date. What followed could well have made a Bean episode, as the meal was conducted in tongue-tied silence except for asking her to pass the ketchup. Then he suddenly disappeared to the men’s room and never returned for 15 minutes. Later he confessed that he broke his zipper and had to find a waiter with a safety pin.

Despite this Beany start, their romance deepened, and in 1990 they married in secret at a New York restaurant…without summoning the Father, The Son and the Holy Goat — (his best known line in Four Weddings and a Funeral.)

Rowan and Sunetra have two children but so fiercely guarded is he about his home life, that interviews have revealed nothing about his wife’s origins, except that she is probably part-Indian, and that she is a ‘British Hindu’. But when he does make his rare appearance on the red carpet, it’s with his drop-dead ravishing, dark-haired wife.

And behind the world’s most malleable face is another story — as a child, Rowan suffered from a bout of stuttering — with particular difficulty over the letter “B”. The struggle to get a word out often resulted in making the wildest faces — and as politically incorrect as it was — led to the first spontaneous bursts of laughter for his ‘talent’.


His biggest passion and hobby: fancy racing cars.

Mr. Bean’s beloved yellow Mini is probably just a tad more advanced than Noddy’s car, but the real life Bean has an all-consuming passion for racing cars — to which he escapes, from the acute stress of wondering whether he got a scene right or not. In fact directors note that Bean seldom enjoys his work, in his pursuit of the elusive ‘perfect shot’.

Today, with an estimated 65 million pounds, this enigmatic millionaire can afford to call in sick — and take a couple of years off, zooming around in one of his expensive cars — an easily affordable hobby. And that would be the biggest reason why a reluctant recluse like him would let himself be forcibly flung under the spotlights (a comic scene opener in all Mr. Bean episodes, as you will recall).


Hero in real life

While the ‘Sunetra Sastry” connection will be the most curious Mr. Bean trivia Indians will wonder about, there’s enough evidence that she’s the big love of his life—and fiercely protective of her too. Here’s a dramatic but little known incident of the real Mr. Bean…

Flying over Kenya on a family holiday, the pilot of the Atkinsons’ chartered Cessna suddenly passed out (apparently with acute dehydration). As the plane began to dangerously nose dive, Rowan took control — and despite no flying experience — brought the plane back on course, averting a terrifying disaster. The pilot was later revived by his wife — and landed the plane safely in Nairobi.

An episode to make even avowed haters of the error-terror Mr. Bean, stand up and clap.

(The Hindu, Magazine: 10.06.2007- with little alterations)

________________________________________________

Labels:

వెబ్‌లో తెలుగు వెలుగులు


(10:06:2007)

'భారత్ వెలిగిపోతోంది'... ఇదో రాజకీయ వ్యాఖ్య.ఇందులో నిజానిజాలు ఆ వ్యాఖ్య చేసిన కీయనాయకులకే ఎరుక.'ఇంటర్‌నెట్‌లో తెలుగు వెలిగిపోతోంది'... ఇది మాత్రం పదహారణాల నిజం. నమ్మకపోతే... వికీపీడియా తెలుగు వెబ్‌సైట్‌లో 27వేలకు పైగా తెలుగు వ్యాసాలున్నాయి చూడొచ్చు. మరే భారతీయభాషలోనూ ఇన్ని ఆర్టికల్స్‌లేవు. ఇదొక్కటే కాదు, ఆన్‌లైన్‌లో మాత్రమే వెలువడే తెలుగు పత్రికలూ అచ్చతెలుగు బ్లాగులూ ఎన్నో ఎన్నెన్నో! అదో ప్రత్యేక లోకం. అంతర్జాలం(ఇంటర్‌నెట్)లో తెలుగు మాయాజాలం... పదండి మనమూ చూద్దాం.
ఏదో రిఫరెన్సు కోసం అర్జంటుగా 'భర్తృహరి' సుభాషితాలు చూడాల్సి వచ్చింది. అంత అర్జంటుగానూ ఆ పుస్తకం దొరకడమంటే కష్టమే. అథవా దొరికినా... ఏదో చిన్న సందేహం తీర్చుకోవడం కోసం అంత ఖర్చు పెట్టి పుస్తకం కొనడానికి మనసొప్పని వాళ్లు చాలా మందే ఉంటారు. ఏం ఫర్వాలేదు! అలా ఇంటర్‌నెట్ సెంటర్‌కి వెళ్లి .www.andhrabharati.com
సైట్ చూస్తే సరి. అందులో భర్తృహరి సుభాషితాలు చూడీజీ(చూడ్డం ఈజీ అన్నమాట). అదొక్కటేనా! రామాయణ, భారత, భాగవతాలూ... మనుచరిత్ర, పారిజాతాపహరణం లాంటి ప్రబంధాలూ... వేమన, సుమతీశతకాలూ... అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలూ... ఇలా ఏం కావాలన్నా ఒక్క (మౌస్)క్లిక్కు దూరంలో ఉంటాయి. ఆంధ్రభారతి వంటి సాహిత్య సంబంధ వెబ్‌సైట్లే కాకుండా జాతీయ, అంతర్జాతీయ వార్తలూరాజకీయ విశ్లేషణావ్యాసాలూ వంటలూ జోకులూ పుస్తక, సినిమా సమీక్షలూ కళలూ సంస్కృతుల విశేషాలందించే తెలుగు వెబ్‌సైట్లు బోలెడు.తెలుగు వెబ్‌సైట్లను స్థూలంగా ఆన్‌లైన్ వార్తాపత్రికలు, నెట్‌లో మాత్రమే లభ్యమయ్యే వెబ్‌జైన్లు, బ్లాగు సైట్లుగా విభజించుకోవచ్చు. ఇరవైనాలుగ్గంటల వార్తా చానళ్లెన్నున్నా పొద్దున్నే పేపర్ చదవందే కడుపు కదలదు చాలా మందికి. ఇక్కడంటే తెల్లారేసరికి గుమ్మంలో పేపరు వేయించుకునే సౌలభ్యం ఉంది కానీ... వేరే దేశాల్లో ఉండే తెలుగువారికి ఆ సౌకర్యం ఏదీ? తెల్లారితే ఆఫీసు పనుల్లో బిజీగా ఉండేవారి ఇబ్బందీ అదే. తెలుగుపేపర్ల ఇంటర్‌నెట్ ఎడిషన్లు అలాంటి వారి కోసమే. ఉదాహరణకు ఈనాడు పేపర్ నెట్ఎడిషన్‌ను .www.eenadu.net లో చూడొచ్చు. అలాగే మిగతా పేపర్లవీ.

వెబ్‌జైన్స్
పత్రికల విషయానికొస్తే... కౌముది, సుజనరంజని, ఈ మాట, పొద్దు... ఇవన్నీ ఇంటర్‌నెట్‌లో మాత్రమే చూడగలిగే ఆన్‌లైన్ తెలుగు పత్రికలు. ఈ విభాగంలో ప్రాచుర్యం పొందిన వెబ్‌సైట్లు ఇవీ...
www.koumudi.net
www.siliconandhra.org
www.prajakala.org
www.eemata.com
http://poddu.net

అంతా 'బ్లాగు' మయం!
సాధారణంగా ఏ విషయం మీదైనా మంచో చెడో మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. దాన్ని నలుగురికీ తెలిసేలా చేసే వెసులుబాటు ఈ బ్లాగింగ్. ఒక్కమాటలో చెప్పాలంటే సొంతగోడు వినిపించుకోగలిగే ఒక సౌలభ్యం. అలాగని బ్లాగింగ్‌ని అంత తేలిగ్గా తీసిపారెయ్యక్కర్లేదు. సునామీ వచ్చినప్పుడు ప్రసార సాధనాల కన్నా ముందు ఇంటర్‌నెట్ ద్వారా ప్రపంచం వెుత్తానికీ తెలిసింది బ్లాగర్ల ద్వారానే. అంతెందుకు! మన బ్లాగర్ల వల్లే నెట్‌లో తెలుగు విస్తృతి పెరుగుతోందంటే అతిశయోక్తి కాదు.

'తెలంగాణ వస్తుందా' దగ్గర్నుంచి 'ఫలానా సినిమా ఎందుకు ఫ్లాపయిందంటారూ...' దాకా బ్లాగర్లకు ప్రతిదీ ఇష్యూనే. అలా అని అందరూ సిల్లీ కబుర్లతో కాలక్షేపం చేస్తారని కాదు. ఎంతో ఉపయోగపడే సీరియస్ చర్చలూ సాగుతాయి. మన తెలుగు బ్లాగుల పేర్లు కూడా 'సోది', 'తెరచాటు చందమామ', 'అహ నా బ్లాగంట'... ఇలా ఒకింత వినూత్నంగా ఉంటాయి.

అంతాబానే ఉంది కానీ... అసలింతకీ తెలుగులో బ్లాగింగ్ చేయడం ఎలా అనే సందేహం రావచ్చు. దానికో మార్గం ఉంది. .www.blogger.com/start మసైటులోకి వెళ్తే అందులో ఇచ్చిన సూచనల ప్రకారం ఎవరైనా తమ సొంత సోది రాసుకోవచ్చు(సొంత బ్లాగు రూపొందించుకోవడానికి ఇది ఒక మార్గం మాత్రమే. ఇలాంటివి చాలానే ఉన్నాయి. నెట్‌లో వెతికితే ఇంకా చాలా దొరుకుతాయి). అయితే... ఈ సైటు ద్వారా మన భావాలను తెలుగులో టైపు చేయలేం. దానికి 'యూనికోడ్ ఎడిటర్' అవసరం. అదేంటో అని కంగారు పడక్కర్లేదు. అదికూడా ఆన్‌లైన్‌లోనే దొరుకుతుంది.http://lekhini.org అనే వెబ్‌సైట్‌లోకి వెళ్తే కావలసినంత పైత్యాన్ని తెలుగులోనే వెళ్లగక్కి దాన్ని అక్కణ్నుంచి కాపీ చేసి మన బ్లాగు ఎడిటర్‌లో అతికించి ఇంచక్కా పోస్ట్ చేసెయ్యెుచ్చు(పద్మ, బరహ వంటి మరికొన్ని ఎడిటర్లు కూడా ఉన్నాయి, బ్లాగుల్లోకి అడుగంటూ పెడితే అన్నీ అవే తెలుస్తాయి). అందుకు కావలసిందల్లా కాసింత ఇంగ్లిషు పరిజ్ఞానం, కూసింత టైపింగ్ నైపుణ్యం... అంతే!

సరే! మనం రాయాలనుకున్నది రాస్తాం. దాని సంగతి మిగతా నెటిజన్లకు ఎలా తెలుస్తుందంటారా? http://koodali.org అనే తెలుగు బ్లాగుల కూడలి ఈ ప్రశ్నకు సమాధానం. మీ బ్లాగ్ చిరునామా తెలియచేస్తూ ఆ వెబ్‌సైట్‌లో అభ్యర్థన ఉంచితే మీరూ 'కూడలి'లో సభ్యులయిపోతారు(మీ బ్లాగులో అసభ్య/అభ్యంతరకర రాతలేవీ లేకపోతేనే సుమా!). http://thenegoodu.org,
http://telugubloggers.blogspot.com

అనే మరో రెండు వెబ్‌సైట్లు కూడా తెలుగు బ్లాగర్ల సమాహారాలే.

తెవికీ
...అంటే తెలుగు వికీపీడియా. భారతీయ భాషలన్నిటిలోకి అత్యధిక వ్యాసాలున్న వెబ్‌సైట్
(http://te.wikipedia.org) ఇది. 2003, డిసెంబరు 9న ఇందులో తెలుగు వ్యాసాలుంచడం వెుదలైంది. 2007 ఫిబ్రవరి నాటికి దాదాపు 27వేలకు పైగా తెలుగు వ్యాసాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాదాపు రెండువేల మందికి పైగా ఉన్న తెలుగు బ్లాగర్ల కృషి ఫలితమే ఇన్ని వ్యాసాలు. రాష్ట్రంలోని ప్రతిఊరికీ ఒక పేజీ కేటాయించి దానిగురించి రాయాలనేది తెవికీ సభ్యుల బృహత్తర లక్ష్యాల్లో ఒకటి....ఇవీ వెబ్‌లో తెలుగువెలుగులు. ఇప్పటికే ఎందరో ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంతో నెట్‌లో ఈ తెలుగువెలుగుల్ని పూయిస్తున్నారు. ఈ జోరు తగ్గకుండా ఉండాలంటే... మరిన్ని తెలుగుసైట్లతో నెట్ కళకళలాడాలంటే... కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అందరూ తమ వంతు కృషిచేయాలి. లేకపోతే ఆంధ్రులు ఆరంభశూరులన్న అపప్రథ ఉండనే ఉంది, గుర్తుందిగా!
http://www.eenadu.net/htm/2vnewfeatureshow.asp?qry=2&reccount=12
_____________________________________________

Labels: