My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, September 14, 2007

గాడ్సే తండ్రి...

- ప్రమోదూత

''అవును... ముమ్మాటికీ ఇది ఆత్మహత్యే. గాంధీజీ ప్రజలందరూ చూస్తుండగానే కావాలని మా అబ్బాయి గాడ్సే దగ్గర తుపాకీ లాక్కుని ఢామ్మని పేల్చుకున్నాడు. మీరు ఆ సంఘటనని సరిగ్గా చూడండి... గాంధీజీ పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో పిస్తోల్ని గుండెలకు గురిపెట్టుకుని, జనం ఎవరూ చూడకుండా, వేలాది ప్రజలమధ్య తనని తాను ఢామ్మని పేల్చేసుకున్నాడు.

కావాలంటే ఆ తుపాకీ పేలిన సవుండు చూడండి. ఢామ్మని వచ్చింది. అదే వేరెవరో చంపి ఉంటే... దూరం నుంచి కాల్చినప్పుడు... ఢాంఁఁఁఁఁఁ ఁఁఁ ఁఁఁ అంటూ రీ సవుండు వస్తుంది. అలా రాకుండా తుపాకీ ఢామ్మని పేలింది. అంటే గాంధీజీని వేరెవరో చంపలేదు. ఆయన్ని ఆయనే కాల్చేసుకున్నాడు. కావాలంటే పోలీసుల్ని అడగండి. ఎగస్పార్టీవాళ్ళని కాదు... ఎక్స్‌పర్టుల్ని అడగండి. దగ్గర్నుంచి పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చుకోవటం వల్లే గాంధీజీ చనిపోయాడు.

నేను చెబుతున్నానని కాదు... తుపాకీని మనకి మనమే గురిపెట్టుకుని ఢామ్మని పేల్చుకుంటే ఎలా చస్తామో నాకన్నా బాగా తెలిసినవాళ్ళు లేరు. ఇది మా అబ్బాయికి మాత్రమే తెలిసిన విద్య అని మీరనుకోవటం తప్పు. మా గాడ్సేకీ తుపాకీ ఉంది. గాంధీగారికి ప్రాణం అంటే లెక్కలేదు. కాబట్టే చనిపోయారు. తుపాకీతో ఎలా పేలిస్తే ఎలా చస్తారో బాగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా... వినండి: బాగా దగ్గర్నుంచి ఢామ్మని పేలిస్తే... మనిషి ఒకలా చనిపోతాడు. మనిషికే తుపాకి గొట్టం ఆనించి ఢామ్మని పేలిస్తే ఇంకోలా చనిపోతాడు. ఇవన్నీ మీకు తెలియదు... తెలిసినవాణ్ణి, అనుభవజ్ఞుణ్ణి చెబుతున్నా... గాంధీగారిది ఆత్మహత్యే. గాంధీగారు బాగా దగ్గర్నుంచి చనిపోయారు కాబట్టి, ఇది వేరేవాళ్ళు కాల్చింది కాదు.

నిజాలు మీకు నిలకడమీద తెలుస్తాయి. మా గాడ్సే ఎలాంటివాడో నాకన్నా బాగా తెలిసినవాళ్ళు ఎవరుంటారు చెప్పండి... వాడి దగ్గర పిస్తోలుండవచ్చు... అందులో గుళ్ళుండవచ్చు... అవి ట్రిగర్‌ నొక్కితే ఢామ్మనవచ్చు... అలా పేల్చటం మావాడికి వచ్చినంత బాగా ఇంకెవరికీ వచ్చి ఉండకపోవచ్చు... అంతమాత్రాన మావాడే తుపాకీ ట్రిగ్గరు నొక్కి గాంధీగారిని చంపేశాడంటే... బతికున్న నేను నమ్మను, చచ్చినా మీరూ నమ్మొద్దు. వాస్తవాలను నిపుణులు చెప్పగలుగుతారు... నేను మాత్రం నిపుణుణ్ణి కాకపోవటంవల్ల ఏమయినా చెప్పగలను.

విలువలకు కట్టుబడినవాణ్ణి కాబట్టి మా వాడు ఎవర్నీ చంపలేదని చెప్పగలుగుతున్నాను. అదే విలువలు లేని వాణ్ణయివుంటే... మా గాడ్సేయే ఈ హత్య చేశాడని కచ్చితంగా చెప్పివుండేవాణ్ణి. మా గాడ్సేకున్న విలువల గురించి చెప్పనే అక్కర్లేదు. వాడు నా కొడుకు. కాబట్టి విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. వాడి వాదన నా వాదనను బలపరుస్తోంది. ఏ కన్న తండ్రికైనా ఇంతకుమించిన ఆనందం ఏముంటుంది? ఒక వ్యక్తి చనిపోవటం ఎంత దారుణమో... మరో వ్యక్తి అతడిని చంపాడనటం అంతకన్నా దారుణం. గుర్తుంచుకోండి.

అలాగని, చనిపోయిన గాంధీజీ పట్ల, ఆయన కుటుంబ సభ్యులపట్ల నాకు సానుభూతి లేదా? మా గాడ్సేకు లేదా? సానుభూతి ఉన్న వ్యక్తి ఎలా చంపుతాడు? గాంధీ ఆత్మహత్యను చూడలేకే మా గాడ్సే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏ పాపం తెలియని నువ్వు ఇంకా స్పృహలో ఉండటమేమిటని నేనే కేకలు వేయగానే... మా గాడ్సేకు స్పృహ తప్పింది. నేనొక మాట అనగానే స్పృహ తప్పించుకున్న అంతటి సున్నిత హృదయుడు గాంధీగార్ని హత్య చేశాడంటే... నేను నమ్మటం లేదు. నేను నమ్మని ఏ విషయాన్నీ వాడూ నమ్మడు. అంతటి విలువలున్న బంధం మాది...''

* * *
టక్‌... టక్‌... టక్‌...
ఏదో చప్పుడు. కళ్ళు తెరిస్తే, వాకిట్లో గూర్ఖా ఊదుతున్న విజిల్‌ చప్పుడు...
గాంధీ జయంతి దగ్గర పడుతుండటంతో... గాడ్సే ఎందుకు గాంధీగార్ని చంపాడని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా...
దిక్కుమాలిన 2007లో, ఆంధ్రప్రదేశ్‌లో బతుకుతున్నందున... ఏకంగా 'గాడ్సే తండ్రి' నా కలలోకి వచ్చి, వాళ్ళబ్బాయి తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు.
గాడ్సే తండ్రేమిటి... కలలోకి రావటమేమిటి... వాళ్ళబ్బాయి తరఫున వకాల్తా పుచ్చుకోవటమేమిటి... ఇది కలా? నిజమా?
(Eenadu, 12:09:2007)
----------------------


నేరాలు వ్యవస్థీకృతం!
రాజకీయ మదాంధ శక్తుల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంతో రాష్ట్రంలో వికృత భూ మాఫియాస్వామ్యం ఒళ్లు విరుచుకుంటోంది. పదవీ పీఠ పరివేష్ఠితుల పుత్రరత్నాలు యథేచ్ఛగా భూములు, గనులపై పెత్తనం చలాయించడమే- మున్ముందు నాయకత్వ హోదాకు ప్రాథమిక అర్హతగా పరిగణించే నయా 'సంస్కృతి' వేళ్లు తన్నుకుంటోంది. పీసీసీ పీఠాధిపతి తనయుడి ఇంట్లో ఇటీవల జరిగిన కాల్పుల్లో ఒకానొక భూవ్యాపారి మృతి- సెటిల్‌మెంట్ల పేరిట దారుణాలకు ప్రబల ఉదాహరణ. రియల్‌ వ్యాపారాల దందాలో కేశవరావు కొడుకు కాకుండా ఇంకెవరున్నారన్న దిగ్విజయ్‌సింగ్‌ ప్రశ్న- సమస్య విస్తృతిని తక్కువచేసి చూపించాలన్న ఆరాటానికి అద్దంపట్టేదే. ఎంచి చూడబోతే, మంచమంతా కంతలే! కాంగ్రెస్‌ జమానాలో వారసుల వ్యాపార సామ్రాజ్యాలు ఇంతలంతలవుతున్నాయి. ఏ జిల్లా చూసినా యువనేతల ఖిల్లాగా వర్ధిల్లుతోంది. సర్కారీ భూములు, వివాదాస్పద పరగణాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం, అందినకాడికి దండుకోవడంలో 'కొత్త'తరం రాటుతేలుతోంది. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- ఛోటా మోటా రాజకీయ నేతల సంబంధీకులు, అధికార గణాలు, గూండా తండాలు మూకుమ్మడి భూకైంకర్య మహాయజ్ఞం సాగిస్తుంటే- యావత్‌ రాష్ట్రం దిమ్మెరబోతోంది. వాటాలు తెగని సందర్భాల్లో తలలు తెగిపడుతున్న తీరు బీహారర్‌ను తలపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పాలకపక్ష నేతల బంధుమిత్ర పరివార గణంతోపాటు- కబ్జాలు, సెటిల్‌మెంట్ల ఉరవడిలో పోలీస్‌ అధికారుల పేర్లూ మార్మోగుతున్నాయి. భూ లావాదేవీలకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాల తయారీలో ముంబాయి తరవాత రెండోస్థానం హైదరాబాద్‌దేనని రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బందే మొత్తుకుంటోంది. భూబకాసురులకు గొడుగు పడుతున్న ఏలికల హయాములో చట్టబద్ధ పాలన అర్థ తాత్పర్యాలే చెల్లాచెదురైపోతున్నాయి!

రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాల కట్టడికి పటిష్ఠ చట్టం ఆవశ్యకతను ప్రస్తావిస్తూ గతంలో హోంమంత్రిగా దేవేందర్‌గౌడ్‌ నిష్ఠుర సత్యమొకటి వెళ్లగక్కారు. తమ ప్రాంతాలకు తామే సర్వం సహాధికారులమని, తమ కనుసన్నల్లోనే ఏ పనైనా జరగాలని ఫ్యాక్షన్‌ లీడర్లు తలపోస్తున్నారనీ ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారనీ కుండ బద్దలుకొట్టారు. నేడా విశృంఖలత్వం రాష్ట్రవ్యాప్తంగా వెర్రితలలు వేస్తోంది. నాయకులు, అధికారులు, వారి అనుయాయుల అసురగణాలు చట్టాల్ని చట్టుబండలు చేయడమే రోజువారీ కార్యక్రమంగా పెట్టుకుని చెలరేగిపోతున్నాయి. ఈ తరహా పాతక ధోరణుల్ని పాతరేయడానికి ఉద్దేశించిన 'కోకా' చట్టాన్ని వై.ఎస్‌.సర్కారే అటకెక్కించింది. కంచే చేను మేసిన రీతిగా పాలకపక్ష పెద్దలే అసాంఘిక శక్తులుగా అప్రతిష్ఠ మూట కట్టుకుంటూ కంటకస్వామ్యాన్ని నిర్లజ్జగా ఆవిష్కరిస్తున్నారు. ఓ వంక ప్రభుత్వ విభాగాలు అస్మదీయులకు అనుకూలంగా భూముల రేట్లకు రెక్కలు తొడుగుతుంటాయి. రహస్య సమాచారాన్ని ముందే దొరకబుచ్చుకుంటున్న వాళ్లు ఎక్కడెక్కడి భూముల్నీ గుప్పిట పట్టేందుకు, కుదరని చోట్ల సెటిల్‌మెంట్ల రూపేణా వాటాలు రాబట్టేందుకు ఉరకలెత్తుతుంటారు. రక్కసి మూక పాదతాడన ప్రకంపనలే భూమాఫియా సామ్రాజ్య విస్తరణ ఢంకానాదాలుగా ప్రతిధ్వనిస్తున్నాయి. బలవంతంగా డబ్బులు గుంజే దాష్టీకాలకు, ఫోన్లలో బెదిరింపులకు, భూఆక్రమణ నేరాలకు ఉచ్చు బిగించేందుకే ఒకప్పుడు 'కోకా' చట్టం తెచ్చారు. ఇప్పుడది కాల గర్భంలో కలిసిపోవడమే అలుసుగా ఎక్కడికక్కడ భూభోక్తలు పుట్టుకొస్తున్నారు. సెటిల్‌మెంట్ల బాగోతాలు అడ్డూఆపూ లేకుండా సాగిపోతున్నాయి. హైదరాబాద్‌ జంట బాంబుపేలుళ్ల నేపథ్యంలో- 'కోకా' పునరుద్ధరణ అవకాశాలపై సందడి చేసిన ప్రభుత్వమింకా మీనమేషాలు లెక్కించడం ఏలికల మాటలకు చేతలకు మధ్య అగాధాన్నే ఎండగడుతోంది.

రాజకీయ భూ అరాచకాల మహాజాడ్యం ఇప్పుడు రాజధాని నగరానికే పరిమితం కాలేదు. విశాఖ వంటిచోట్లా భూసేకరణ ముసుగులో నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మాయాజాలం అసంఖ్యాక రైతుకుటుంబాల్ని నిలువునా ముంచేస్తోంది. దగాకోరు స్వామ్యాన్ని కళ్లకు కడుతోంది. మొసలి కన్నీరు కారుస్తున్న నేతల చిత్తశుద్ధి ఏపాటి అన్నదే పౌర సమాజాన్ని నేడు తొలిచేస్తున్న ప్రశ్న. విచ్చలవిడి భూకుంభకోణాల్ని అక్రమ వసూళ్లను బలవంతపు ఆక్రమణల్ని అరికట్టేందుకు ఏ ప్రజాప్రభుత్వమైనా- పటుతర నిబంధనలతో ప్రత్యేక చట్టానికి కోరలు తొడగాల్సిన తరుణమిది. వ్యవస్థీకృత నేరాల అదుపుకోసం దేశంలో తొలిసారిగా 'మోకా' ప్రయోగించింది మహారాష్ట్ర. ఆ శాసన నిబంధనల దన్నుతోనే దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబాయిలో ఆ ముఠా కొంతయినా బలహీనపడిందంటే, కారణం ఆ చట్టమే. అందులోని కఠిన నిబంధనల స్ఫూర్తితోనే రాష్ట్రంలో 'కోకా' రూపుదాల్చింది. 2004 నవంబర్లో కాలపరిమితి ముగిసిన ఆ చట్టం కొనసాగాల్సిందేనని రాష్ట్ర పోలీసు విభాగం కేంద్ర హోంశాఖను అభ్యర్థించినా ఒరిగింది పూజ్యం. శాసనసభలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించినట్లు శాంతిభద్రతల అదనపు డీజీపీ 19 నెలల క్రితమే ప్రకటించారు. ముఖ్యనేతలు సుముఖం కానంతవరకు అలాంటి ప్రకటనలన్నీ ఉత్తచేతులతో మూరలే. సెటిల్‌మెంట్ల కబ్జాసుర సంతతికి రాజకీయ ఛత్రచ్ఛాయలో ఆసరాకు ఢోకా లేనన్నాళ్లు రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాల అదుపు దింపుడుకళ్లం ఆశే!
(Eenadu,,13:09:2007)

--------------------------------------------------------------

Labels:

Thursday, September 13, 2007

COOPERATION

Ø The heaven and the hell: A gentleman, on his final call reached the court of the death God- Yama Dharma Raja. He requested Yama Dharma Raja to show a sample of the heaven and hell. He was first taken to the hell. The food was excellent but the inmates of hell were emaciated. Their hands were tied with three feet long spoons. As a result, though they were trying hard to eat

Yet they were not able to reach their mouths. The man inferred that the hell was a difficult place to live in.

Thereafter he was taken to the heaven. He hardly found any difference between the hell and the heaven. To his utter surprise, he found that the inmates of the heaven were also tied with the same long spoons. But they were all hale, healthy, and rejoicing. In fact, they were feeding one other instead of just trying to feed themselves.

Wherever we collaborate we make the place a heaven. Wherever we fail to collaborate we make the place a hell.


Ø Co-operation/ Stand by each other.

Next fall, when you see geese heading south for the winter, flying along in a V-formation, you might consider what science has discovered as to why they fly that way. As each bird flaps its wings, it creates uplift for the bird immediately following. By flying in V formation, the whole flock adds at least 71% greater flying range than if each bird flew on its own.

People who share a common direction and sense of community can get where they are going more quickly and easily, because they are travelling on the thrust of one another.

When a goose falls out of formation, it suddenly feels the drag and resistance of trying to go it alone- and quickly gets back into formation to take advantage of the lifting power of the bird in front.

If we have as much sense as a goose, we will stay in formation with those people who are headed the same way we are.

When the head goose gets tired, it rotates back in the wing and another goose flies point.

It is sensible to take turns doing demanding jobs, whether with people or with geese flying south.

Geese honk from behind to encourage those up front to keep up their speed.

What message do we give when we honk from behind? Encouragement!

Finally- and this is important- when a goose gets sick or is wounded by gunshot, and falls out of formation, two other goose fall out with that goose and follow it down to lend help and protection. They stay with the fallen goose until it is able to fly or until it dies; and only then do they launch out on their own, or with another formation to catch up with their group.

If we have the sense of a goose, we will stand by each other like that.


Ø The value of a life is measured by the lives it touches:

There was a farmer who grew superior quality and award-winning corn.

Each year he entered his corn in the state fair where it won honour and prizes.

One year a newspaper reporter interviewed him and learnt something interesting about how he grew it. The reporter discovered that the farmer shared his seed corn with his neighbours'.

"How can you afford to share your best seed corn with your neighbours when they are entering corn in competition with yours each year?" the reporter asked.

"Why sir," said the farmer, "didn't you know? The wind picks up pollen from the ripening corn and swirls it from field to field. If my neighbours grow inferior, sub-standard and poor quality corn, cross-pollination will steadily degrade the quality of my corn.

If I am to grow good corn, I must help my neighbours grow good corn."

The farmer gave a superb insight into the connectedness of life. His corn cannot improve unless his neighbour's corn also improves. So it is in the other dimensions!

Those who choose to be at harmony must help their neighbours and colleagues to be at peace. Those who choose to live well must help others to live well. The value of a life is measured by the lives it touches.

SUCCESS DOES NOT HAPPEN IN ISOLATION. IT IS VERY OFTEN A PARTICIPATIVE AND COLLECTIVE PROCESS.

So share the good practices, ideas, new learning's with your family, team members, neighbours.

(from my book "10 Fundamental Rules of Success", Publishers: PUSTAK MAHAL, New Delhi)

-----------------------------------------------------

Labels:

Wednesday, September 12, 2007

Inspirational Musings (Popular Pages)




This is the list of popular pages enlisted in
the 'StatCounter'. Press each of the webpages
to see the articles published there in.


Webpages

28Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

27Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

25Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

17Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

16Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

14Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

13Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

11Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

11Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

10Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

10Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

10Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

10Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

9Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

8Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

6Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

6Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

5Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

4Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%


4Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

4Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

4Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

4Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

4Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

3Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

2Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

2Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

2Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

2Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

2Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

2Inspirational Musings %u0C07%u0C28%u0C4D%u0C38%u0C4D%u0C2A%u0C3F%u0C30%u0C47%u0C37%u0C28%u0C32%u0C4D %u0C2E%u0C4D%u0C2F%u0C42%u0C38%u0C3F%u0C02%u0C17%

Labels:

Yesteryear actor Rukmani dies

CHENNAI: Yesteryear actor Rukmani passed away at her daughter, actor Lakshmi’s, residence in Saidapet on Tuesday. She was 81.

Rukmani began acting in films from the age of four.

Her first film was ‘Harichandra’. She worked as a child artist in nearly 40 films.

Rukmani’s first film as a heroine was ‘Sri Valli’ with T.R. Mahalingam. The film was produced under the AVM banner.

From then on she worked with some of the best talents in Tamil cinema.

She has acted in about 100 films in three Indian language films, namely Tamil, Telugu and Hindi.

Some of the Tamil films in which she had given memorable performances include ‘Venniraadai’, ‘Kappalotiya Thamizhan’, ‘Rojavin Raja’, ‘Maniosai’ and ‘Idhayakamalam’.

She has also worked in Telugu films, with both N.T. Rama Rao and Nageswara Rao.

She has not only acted in Hindi films but has also produced a few of them.

Among the Hindi films that Rukmani produced, the notable ones are ‘Lavangi’ and ‘Manjari’.

Rukmani married Y.V. Rao, a producer, director and actor, when she was 17 years old.

Rukmani had been ailing for some time and she passed away on Tuesday at 5.30 p.m. Both actor Lakshmi and her husband, Sivachandran, were near Rukmani when she died.

(The Hindu, TamilNadu, 05:09:2007)

Labels:

Sunday, September 09, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

నమ్మిచెడ్డవాడు ఉండొచ్చేమో గాని... నవ్వి చెడ్డవాడు లేడు. ఇంతకాలం వ్యాసం నాది. హాసం మీది. మనం మనం కలిసి 'ఫన్ని'కిలించాలని నా తహతహ. అందుకే ఫన్‌మంతులూ కదలిరండి. 'ఫన్‌'చాయతీ చేసుకుందాం. నవ్వే జనాస్సుఖినోభవంతు
-ఫన్‌కర్‌
------------------------
* నాకో గిఫ్ట్‌ చెక్కు వచ్చింది. దానిమీద డేట్‌ 30.2.2008 అని ఉంది. ఆ డేట్‌ అసలు రాదు కదా! మరి ఆ చెక్కును ఏం చేయమంటారు?
- ఎం. వీరనారాయణ, అనకాపల్లి
మీదగ్గరే 'చెక్కు' చెదరకుండా ఉంచుకోండి. ఎప్పటికీ 'చేతులు' మారని 'స్థిరాస్తి' అది!
------------------------------
* మేనేజ్‌మెంట్‌ 'గురు' కావాలన్నది నా కోరిక. ఓ పట్టాన నెరవేరేటట్లు లేదు
-కె. గణనాథ్‌, జగిత్యాల
మన రైల్వే మినిస్టర్‌ లాలూజీతో మాట్లాడా. అబ్బే! రెండు 'పట్టాలు' ఉండాల్సిందే అంటున్నాడాయన.
------------------------------
* అంబానీల ఐశ్వర్యాన్ని చూసి ఓ పాట రాయాలనిపిస్తోంది. ఒకవేళ రాస్తే ఎలా ఉంటుందంటారు?
-ఎస్‌.సుగుణాకర్‌, విజయవాడ
'అంబా' నీ తీయని డబ్బు... ఎంత కుప్పగా ఉందిరో యబ్బ' అన్నట్టు ఉంటుంది.
-------------------------------
* మావాడు ఈమధ్య బిజీబిజీగా తిరుగుతున్నాడు. ఏంటీ కత?
-ఎస్‌. సుబ్రమణ్యం, గుడివాడ
బిజీగా ఉన్నాడంటే బిజినెస్‌ ఏవైనా బెడిసికొడుతోందేమో ఓ కన్నేయండి.
-----------------------------------
* పార్టనర్లు బిజినెస్‌ చేస్తారు. లైఫ్‌ పార్టనర్లు ఏం చేస్తారు?
-ఎం.సుబ్బారావు, రాయదుర్గం
'గజి బిజి'నెస్‌
--------------------------------
* పంచ పాండవులు ఐదూళ్లు పంచి ఇమ్మన్నా పంచి ఇవ్వలేదు. చివరకు భీముడి చేతిలో పంచ్‌లు తిని చచ్చాడు. దుర్యోధనుడికి ఏం లాభం చెప్పండి?
- వి. రమాదేవి, పాణ్యం
'చచ్చేంత' లాభం.
-------------------------
* దుస్తుల కొరత తీరాలంటే
-కె.వెంకట్రావు, కడప
ప్రతి ఒక్కరూ 'తార'స్థాయికి ఎదగాలి. లెస్‌ డ్రస్‌ మోర్‌ కంఫర్ట్‌ కదా మరి
------------------------
* మా స్థలాల్లో టేకు చెట్లు పెంచినా పెద్దగా ఫలితం కలగడం లేదు ఏం చేయమంటారు?
-ఎం. సుగుణ, అనంతపురం
పారిజాతపు చెట్లు పెంచండి. సత్యభామ సాక్షిగా శ్రీకృష్ణుడి 'అండ్‌'దండలు ఉంటాయి. ఒకే 'టేకు'లో వ్యాపారం ఓకే అవుతుంది.
-----------------------------
* వ్యాపారులందరూ పార్టీపెడితే
-ఎ. నటరాజ్‌, బెంగళూరు
'టీ' పార్టీకే ఎక్కువ ఖర్చవుతుంది.
---------------------------------
(Eenadu, 09:09:2007)
------------------------------------------------------

Labels:

సాహిత్యం

సహృదయైుక వేద్యం
నన్నయ నాటి నుంచి నేటివరకు ఉన్న పద్యరత్నాలను ఏర్చి కూర్చిన సమాహారమిది. ఈ తరహాలో 'ప్రాచిన పద్యమంజరి' ఇత్యాదులు సాహితీలోకంలో సుప్రసిద్ధాలే. ఇది వాటికంటే భిన్నం. ఈ సంకలనంలో ఒక క్రమాన్ని పాటించకపోయినా ఒక సమన్వయ సూత్రంతో సంపుటీకరణ సాగింది. కవిత్రయ పద్యవిన్యాసం, శతక సాహితీ సౌరభం, పోతన కవితా సుధా మాధుర్యం, ఆంధ్ర పంచకావ్య కవితా వైభవం ఆపై చమత్కార పద్యమంజరి, ఇంకా ఇతిహాస, పురాణ, ప్రబంధాది కవితా ప్రక్రియల లాక్షణికత... ఈ సంవిధానంతోనే చక్కని క్రమపరిణామ రామణీయకత్వాన్ని సంతరించుకుంది. ప్రబంధ సాహిత్యానికి బీజావాపనం చేసిన కుమారసంభవ కర్త నన్నెచోడ కవిని గ్రంథకర్త విస్మరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వేయి సంవత్సరాల పైబడ్డ పద్యం నవరసాలకు ఆకరమనీ మరో వెయ్యేళ్ళయినా తెలుగు ప్రజల రసనాగ్రాలపై నర్తిస్తుందనీ ఈ కృతికర్త విశ్వాసం. పద్యం మీద అభిమానమే కాదు అభినివేశం ఉందనడానికి వాటి వైశిష్ట్యాన్ని విశ్లేషించడమే నిదర్శనం.
పద్యం- రసనైవేద్యం;
రచన: దోరవేటి
పేజీలు: 140; వెల: రూ.80/-
ప్రతులకు: విశాలాంధ్ర ప్రధాన శాఖలు.
- చారి
-------------------------------------------------------
వడగట్టిన కథలు
యడ్లపాటి వేంకట సుబ్బారావు స్మారక పోటీకి వచ్చిన కథలలో నుంచి 76 కథలను 'రచన' పత్రికలో ప్రచురించారు. అందులో ఇరవై ఆరింటిని 'కథావాహిని-2007' పేరుతో సంకలనంగా వెలువరించారు. రెండుసార్లు వడపోతకు నిల్చినవి మంచిస్థాయికి చెందినవి కావడం సహజం. తాగేనీళ్ళకు సైతం తప్పని పేదలతిప్పలు, పనికి ఆహారపథకం తీరు, సాయం కోరితే ఎదురైన పోలీసు జులుం, ఆడామగా మధ్య స్నేహంలోని వెలుగు, వెర్రితలలు వేస్తున్న క్రికెట్‌ వ్యావోహం... వెుదలైన ఇతివృత్తాల చుట్టూ అల్లిన కథలివి. రచయితలందరూ చేయితిరిగిన కథకులే. కథాశిల్పం బాగా తెలిసినవారే. బాధామయ జీవులపై రాసిన కథలలో గాఢత, క్లుప్తత, నైశిత్యం ఆకట్టుకుంటాయి. కాగా సంపన్నవర్గాలూ ఎగువ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యం ఉన్న కథలలో పాఠకులకు కొత్తకోణాన్నో సమస్యల లోతునో సాహసంతో చూపిన సందర్భాలు తక్కువగా ఉండటానికి బహుశా పోటీ దృష్ట్యా గీసుకున్న పరిధి ఒక కారణం కావచ్చు.
కథావాహిని-2007;
సంచాలకుడు: 'రచన' శాయి
పేజీలు: 254; వెల: రూ.130/-
ప్రతులకు: వాహిని బుక్‌ట్రస్ట్‌
1-9-286/3, విద్యానగర్‌, హైదరాబాద్‌-44.
- జి.రా.
-------------------------------------------------------
'కాలమ్‌' చెల్లనిది
సామాజిక సమస్యల్ని తక్కువ నిడివిలో, తేలిక పదాల్లో, సరదాగా అందించిన ఫీచర్ల సమాహారమే ఈ పుస్తకం. ప్రతి కాలమ్‌ చిన్నచిన్న పదాల్లో ఆలుమగల మధ్య అల్లరిగా సాగే సంభాషణతో వెుదలవుతుంది. అది చదివి నవ్వుకుంటుండగానే 'మమతానుబంధాలే కదా మనుగడ మీద ప్రేమను పెంచుతాయి' వంటి వాక్యాలు హలో చెప్పి ఆకట్టుకుంటాయి. ఆఖరు పేరాగ్రాఫ్‌లో అనుకోని మలుపు. భార్యాభర్తల సంభాషణ అనూహ్యంగా సమాజం, రాజకీయాలు, అవినీతి, అత్యాచారం వైపు మరలుతుంది. సమస్యలు తెరమీదికొస్తాయి. వాటిపై చకచకా చెణుకులు పడతాయి. ఇక్కడ రచయిత కనబరిచే అన్వయశక్తి, చేసే వ్యాఖ్యానం ఆసక్తికరంగా ఉంటుంది. చదివింపజేస్తుంది. ఓ దిన పత్రికలో వారం వారం వచ్చినవే అయినా ఈ పుస్తకం 'కాలమ్‌' చెల్లనిది.
కనకమహాలక్ష్మి సింహాచలం
రచన: కెవియస్‌ వర్మ (ఫీచర్స్‌)
పేజీలు: 118; వెల: రూ.40/-
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్ని శాఖలు.
- భద్రగాయత్రి
------------------------------------------------
(Eenadu, 09:09:2007)
------------------------------------------------

కొత్తతరం కోసం
తెలుగులో వెుదటి వరసలో నిలిచే హాస్యనవల 'బారిష్టర్‌ పార్వతీశం'. కథానాయకుడు పార్వతీశం ఇంగ్లండుకు ప్రయాణమవుతూ పళ్ళు తోముకోవటానికి కచ్చిక పొడీ, నాలుక గీసుకోవటానికి తాటాకు ముక్కలూ మర్చిపోకుండా తీసుకువెళ్ళే 'ముందుచూపు'న్న వ్యక్తి. సృష్టించిన రచయిత పేరును మించిపోయి ప్రాచుర్యం పొందిన సజీవ పాత్ర. హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ 'మన మంచి పుస్తకాలు' సిరీస్‌లో భాగంగా ఈ నవలను సంక్షిప్త రూపంలో అందించటం మంచి ప్రయత్నం. దీనివల్ల కొత్తతరం పాఠకులకు సారం తెలుస్తుంది; కొందరికైనా మూల రచనలను చదవాలనే ఆసక్తి ఏర్పడుతుంది.
బారిష్టర్‌ పార్వతీశం
రచన: వెుక్కపాటి నరసింహశాస్త్రి
తిరిగి చెప్పిన కథనం: సహవాసి
పేజీలు: 88; వెల: రూ.40/-
ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌
ప్లాట్‌ నం: 85, గుడిమల్కాపూర్‌
హైదరాబాద్‌-67.
- సీహెచ్‌.వేణు
---------------------------------------------
మాటల పేటి
బాలగంగాధరరావు కలం నుంచి జాలువారిన ఆణిముత్యం 'మాటతీరు'. మనం నిత్యంవాడే వందలాది మాటల వెనకగల చరిత్రనూ అవి లోక వ్యవహారంలో స్థిరపడిన విధానాన్నీ చదువుతుంటే అబ్బురం అన్పిస్తుంది. ప్రతిమాటకూ వెనక ఇంత పురాణం ఉందా అని ముక్కున వేలేసుకుంటాం. ఆంగ్లపదం 'టవల్‌' క్రమంగా మన తెలుగు 'తువ్వాలు'గా మారిందంటే ఔరా అనుకుంటాం. సంస్కృతపదం 'యువన్‌' నుంచి 'జవాను' మాట వచ్చిందంటే నివ్వెర పోతాం. ఇలా ఒకటేంటి? కొడుకు, కోడలు, కూలి-నాలి, ఏండ్లు-పూండ్లు వంటి రెండొందల పైచిలుకు సాధారణ పదాల వెనకగల అసాధారణ విషయాల్ని విప్పిచెప్పారు రచయిత. భాషాజిజ్ఞాసువులకి ఇదెంతో ఉపయుక్తం అనడంలో సందేహం లేదు.
మాటతీరు;
రచన: యార్లగడ్డ బాలగంగాధరరావు
పేజీలు: 176; వెల: రూ.80/-
ప్రతులకు: జయంతి, విశాలాంధ్ర,
నవోదయ, నవయుగ పుస్తకకేంద్రాలు.
- చంద్రప్రతాప్‌
------------------------------------
(Eenadu, 26:08:2007)
-------------------------------------

Labels: ,

చరిత్రలో ఈ వారం

సెప్టెంబరు 10,1893:
చికాగోలో తొలి సర్వమత సమ్మేళన సభ (వరల్డ్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ రెలీజియన్‌ కాన్ఫరెన్స్‌) జరిగింది. ఆ సభకు హాజరైన వివేకానందుడు 'సోదర సోదరీమణులారా...' అన్న సంబోధనతో అందరి మనసులూ గెల్చుకున్నాడు. నరేంద్రుడు ఉపన్యాసం ప్రారంభించి ఆ మాటలు అనగానే సభలో ఉన్న ఏడువేల మందీ ఉద్వేగంతో లేచినిలబడి దాదాపు మూడు నిమిషాలపాటు కరతాళధ్వనులు చేశారు.

సెప్టెంబరు 11,1906:
దక్షిణాఫ్రికాలో అహింసా ఉద్యమాన్ని సాగిస్తున్న గాంధీజీ 'సత్యాగ్రహం' అనే పేరును ఖాయం చేశారు. తొలుత దానికాయన పెట్టిన పేరు 'పాసివ్‌ రెసిస్టెన్స్‌'. అయితే ఆ మహా ఉద్యమానికి ఆంగ్లనామం ఏమిటన్న ఆలోచనతో చక్కటి పేరును సూచించిన వారికి బహుమతి ప్రకటించారు. అప్పుడు మగన్‌లాల్‌గాంధీ 'సదాగ్రహ్‌' అనే పేరును సూచించారు. దాన్ని గాంధీజీ 'సత్యాగ్రహ్‌'గా మార్చారు.



సెప్టెంబరు 13,1948:
భారతదేశంలో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉంటానని వెుండికేసిన నిజాం సంస్థానంపై పోలీసుచర్య వెుదలైంది. దీనికి ఆపరేషన్‌ పోలో అని పేరు. హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకొనే యత్నాలు చేసిన నిజాం ఆ ప్రయత్నాల్లో భాగంగా గుర్తింపుకోసం ఓ బృందాన్ని ఐక్యరాజ్యసమితికి కూడా పంపాడు. అత్యంత సుసంపన్నమైన హైదరాబాదు సంస్థానంపై పోలీసుచర్య విషయంలో నెహ్రూ, సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ మధ్య అభిప్రాయభేదాలుండేవి. పోలీసుచర్య వల్ల ముస్లిముల్లో తీవ్రవ్యతిరేకత వస్తుందనేది నెహ్రూ అభ్యంతరం. మౌంట్‌బాటెన్‌, రాజాజీ కూడా ఆయన్నే సమర్ధించారు. కానీ పటేల్‌ పట్టుపట్టారు. సెప్టెంబరు 13న ఆపరేషన్‌పోలో చేపట్టాలన్న పటేల్‌ ప్రతిపాదనకు భయపడిన నిజాం దాన్ని వాయిదా వెయ్యాల్సిందిగా రాజాజీని అభ్యర్థించారు. అందుకు రాజాజీ అంగీకరించినప్పటికీ... పోలీసు చర్య అప్పటికే వెుదలైపోయిందని పటేల్‌ ప్రకటించడంతో మిన్నకుండిపోయారు. ఆరోజు తెల్లవారుజామున మూడున్నరకు పోలీసుచర్య వెుదలైంది. భారతసైన్యమే ఈ చర్యను చేపట్టినప్పటికీ స్వంత భూభాగంపై సైన్యాన్ని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందన్న ప్రశ్నలు ఉద్భవిస్తాయన్న ఆలోచనతో ప్రభుత్వం దీన్ని పోలీసుచర్యగా ప్రకటించింది.


2001, సెప్టెంబరు 11:
న్యూయార్క్‌ ట్రేడ్‌సెంటర్‌ జంటహర్మ్యాలపై అల్‌ఖైదా విమానాలతో దాడిచేసి కూల్చేసింది. అమెరికా ఆయుధాగారం పెంటగాన్‌పైనా దాడి చేసింది. ఈ దుర్ఘటనలో దాదాపు మూడువేల మంది అసువులు బాశారు. ఆ రోజు జరిగిందిదీ... అల్‌ఖైదాకు చెందిన 19మంది తీవ్రవాదులు ఆ రోజు ఉదయాన్నే నాలుగు విమానాల్ని హైజాక్‌చేసి విధ్వంసానికి తెరతీశారు. స్థానిక కాలమానం ప్రకారం వెుదటి విమానం 'ఫ్త్లెట్‌-11' సరిగ్గా 08:46:30 సెకన్లకు వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నార్త్‌టవర్‌నూ దాదాపు 16 నిమిషాల తర్వాత 09:02:59 సెకన్లకు రెండో విమానం 'ఫ్త్లెట్‌-175' సౌత్‌టవర్‌నూ ఢీకొన్నాయి. మూడో విమానంతో 9:37 నిమిషాలకు పెంటగాన్‌పై దాడి చేశారు. నాలుగో విమానంలో ప్రయాణికులూ సిబ్బందీ ఎదురుతిరగడంతో పరిస్థితి గందరగోళమైంది. అది పెన్సిల్వేనియా సమీపంలో పొలాల్లో కూలిపోయింది. ఒక్కో విమానంలో దాదాపు 91వేల లీటర్ల ఇంధనం ఉండడంతో ప్రమాదతీవ్రత మరింతమంది ప్రాణాలు తీసింది. వెుత్తం 2,974 మంది ఆరోజు మరణించారు. ఇంకో వ్యక్తి పేలుడు తాలూకూ ధూళిని పీల్చి చాలారోజుల తర్వాత ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయాడు. మరో 24మంది అసలు కనిపించకుండా పోయారు. ప్రమాదం కారణంగా రగులుకున్న మంటల్లో బూడిదై ఉంటారని 911కమిషన్‌ ఊహించింది. ఈ దాడులతో వణికిన అమెరికా ప్రభుత్వం ఆ దేశ గడ్డపై మూడురోజులపాటు అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌ను నిషేధించింది.
(Eenadu,09:09:2007)
----------------------------------------------

Labels:

Many firsts to her credit

V.R. DEVIKA

Apart from being the prime mover of the Act that abolished the Devadasi system, Dr. Muthulakshmi Reddi was a part of many social movements of her time.



Tough act: Dr. Muthulakshmi Reddi.

“A mere girl has got 100 per cent in surgery…” This was Madras Medical College, in 1912, a time when some professors did not even allow women to sit in their class. They would ask junior lecturers to take classes for girls separately.

Muthulakshmi Ammal had earlier been advised not to appear for the very difficult M.B and C.M. course but she had prevailed and shocked everyone by getting the 100 per cent result in surgery and most of the merit medals and prizes of that year.

To top it she became the first woman doctor in India. Muthulakshmi was a timid girl and kept to herself. In her hearing other students would comment that a plain and frail girl like her would not pass the difficult exam.

Achievements

The timid girl also was a tough one. She was also the first woman to be nominated to the Madras Legislative Council, where she was elected Deputy Chairperson. She was the founder-president of the Indian Women’s Association and became the first Alderwoman (advisor to the Mayor) of the Madras municipal corporation. She was the prime mover behind the legislation that abolished the system of dedicating young girls to temples (devadasi) and played a role in raising the minimum marriage age for women. She founded the Cancer Institute (WIA) in Madras and Avvai Home, the first institute in Madras to admit and educate poor and destitute girls with no caste bias.

Dr. Muthulakshmi Reddi’s son, Dr. Krishnamurthy (now chairman of the Cancer Institute), recalls that she rehearsed arguments for the abolition of the Devadasi system at home with her husband and uncle as opponents. He was then 10 years old. While he was playing in their house, two young girls had come to see his mother. They had run away from being dedicated to the temple and wanted to know if there were any alternatives. She kept them in her house and told her sons, Ram Mohan and Krishnamurthy, to call them akka (elder sister). Muthulakshmi tried to admit the girls in schools nearby but they were refused admission because they were from the Devadasi community and could not officially furnish their father’s names. Avvai Home then became a school for poor and destitute girls. Krishnamurthy recalls that one of them became a doctor and the other a teacher.

Against the devadasi system

Dr. Muthulakshmi Reddi’s strong arguments against the system of dedication of girls lay in her personal history. This is seen not from her own autobiography but from another source. In his autobiography, yesteryear actor Gemini Ganesan wrote about how his grandfather Narayanaswamy married Chandramma from a backward (Devadasi?) community after losing his wife and two children. The orthodox Brahmin relatives of Narayanaswamy ostracised him but he gained respect as the principal of Maharaja’s College of Pudukkottai. Narayanaswamy educated his eldest daughter Muthulakshmi, the only girl in Pudukottai to study English and to play badminton. He also supported Muthulakshmi’s decision not to get married, despite her mother’s pleas and protest. But her resolve was broken when, impressed with her academic excellence, Dr. Sundar Reddi, a well-known surgeon and the first Indian doctor to become a Fellow of the Royal Society of Civil Surgeons (FRCS), approached Narayanaswamy for his daughter’s hand. He soon persuaded his daughter to marry Dr. Reddi in 1914. Muthulakshmi consented but not without a fight. She demanded that she be treated as an equal and be given the freedom to do what she wanted.

For women and children

In1936, Muthulakshmi Reddi leased land in Adyar village from the Arunachaleswarar temple of Tiruvannamalai for the Avvai Home. She trained many young girls including those from the Devadasi community as midwives and nurses.

With prohibition being introduced in 1948, Muthulakshmi Reddi got the toddy tappers of Adyar loans to buy buffalos and petty shops as alternate livelihoods. They were also encouraged to learn spinning and weaving. Muthulakshmi Reddi worked on raising the age for marriage of girls.

Having seen her young sister die of cancer, she was determined to make cancer treatment available in Madras. She went to England for her post-graduation and studied cancer treatment as well as gynaecology. Her son, Krishnamurthy, became a cancer specialist. She founded the Cancer Institute (WIA) now well known all over India.

Muthulakshmi wrote in her autobiography that her best pastime was looking after little children. Even while studying medicine, a neighbour’s child would be found in her lap.

This great passion for children found full expression in Avvai Home where many young women have found the means for formal education.

(The Hindu, 09:09:2007)

----------------------------------------

Labels:

అందివచ్చిన వూహాలోకం

మనిషికి కోరికలు అనేకం. వూహలు అనంతం. కోరికలే గుర్రాలైతే మనిషితో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయిస్తాయి. ''మనసు గుర్రమురోరి మనిసీ, మనసు కళ్ళెము లాగు మనిసీ, కళ్ళెమును వదిలితే కంచెలో బడద్రోయు కళ్ళు తేలేసేవు జనుడా, ఆపైని కార్యమేమున్నదిర జనుడా...'' అని తత్వం బోధిస్తుంది. అయినా చాలామంది కోరికలను అదుపులో ఉంచుకోలేరు. వూహలకు కళ్ళాలు వేసుకోలేరు. ఇలలో తమకు దొరకని అందాలను, ఆనందాలను కలల్లో తీర్చుకొని సంతృప్తిపడుతుంటారు. ''కలగంటి... కలగంటి'' అంటూ కలవరించిన ఓ వయారిభామ- ''కలువ రేకులవంటి కన్నులు కలసామి కనిపించెనమ్మా...'' అని సంతోషపడిపోతుంది. తెల్లారేసరికల్లా కల కరిగిపోయి చింతాకుల వంటి కళ్ళతో మిర్రిమిర్రి చూసే మొగుడే ప్రత్యక్షమై ఉసూరుమంటుంది. కలలో జరిగింది ఇలలో జరగదని సామెత. ''మా ఆయన నిద్రలో ఏవేవో పేర్లు కలవరిస్తుంటాడు. రోజూ ఇదే తంతు...'' అంటూ డాక్టరు దగ్గరకొచ్చి ఫిర్యాదు చేసింది తాయారమ్మ. ''ఆ అలవాటు మానేందుకు మందిమ్మంటారా?'' అని అడిగాడు డాక్టరు. ''వద్దు. ఆ పేర్లు స్పష్టంగా సరిగ్గా వినపడేలా కలవరించేట్లు మందియ్యండి చాలు. ఆ తరవాత సంగతి నేను చూసుకుంటాను'' అంది తాయారమ్మ పళ్ళు కొరుకుతూ. జీవితంలో తీరని, తీర్చుకోలేని కోరికలను కలల్లో తీర్చుకొని సంతృప్తిపడటం కొందరి నైజం. కలలు, వూహలు మనిషిని వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి.

తన వూహల్లో మెదిలే సుందర రాజకుమారుణ్ని కలలో దర్శించి ఆ అందగాణ్నే తీసుకువచ్చి తనకు అప్పగించమని పట్టుబడుతుంది బాణాసురుని కుమార్తె ఉషాసుందరి. ''కలలో జూచినట్టి నీటుగాని తోడితెమ్మనియేవు మరి యాతని వూరుపేరు తెలియుటెలాగు, అందమైన కొలని నీటియందు గానుపించు చందమామ నొడిసి పట్టు చందమెలాగే? యొప్పులాడి యద్దమునను గుప్పున కనినట్టి సుందరుని చేయిసాచి పట్టుకొనుట ఎలాగే?'' అని చెలికత్తె చిత్రరేఖ గోలపెట్టినా ఉషాకన్య వినిపించుకోదు. అతణ్ని తప్ప వేరొకర్ని వరించనని ఖండితంగా చెబుతుంది. చివరకు ఉషాసుందరి చెప్పిన పోలికలకు తన వూహలను జోడించి అనిరుద్ధుని చిత్రం గీసి ఆ సుందరుణ్ని తన మంత్రబలంతో ఉషాసుందరి శయన మందిరంలోకి చేరుస్తుంది చిత్రరేఖ. తరవాత అనేక ఉత్కంఠభరిత సన్నివేశాల అనంతరం ఉషాపరిణయం వైభవోపేతంగా జరుగుతుంది. కలలో చూసిన సుందరాంగుణ్ణి ఇలలోకి రప్పించి పెళ్ళాడిన ఘనతను ద్వాపరయుగంలోనే ఉషాసుందరి దక్కించుకొంది. కొంతమంది ఘనులు తమ మాటల చాతుర్యంతో జరగటానికి వీలుకాని విషయాలనే జరుగుతున్నట్టు కనుకట్టు చేస్తారు. ఈ విషయంలో ఘనుడు గిరీశం. తనకు ఉద్యోగం సద్యోగం ఏమీ లేకపోయినా, బాలవితంతువు బుచ్చమ్మను పెళ్ళాడే వీలు లేకపోయినా- ''మనం పెళ్ళాడతాం అనుకోండి... పెళ్ళాడింతర్వాత సంసారం సుఖంగా జరుపుకోవాలంటే లావుగా డబ్బుండాలికదా? ఉద్యోగం చేస్తేగాని డబ్బురాదే. నవాబుగారి దగ్గర నౌకరీ సంపాదిస్తాను. అలాగ ఉద్యోగం, ఇల్లూ వాకిలీ తోటా దొడ్డీ యార్పరుచుకునేటప్పటికి మనకు చిన్న పిల్లలు పుడతారు. మీరు బీరపువ్వుల్లాగ వొంటినిండా సరుకులు పెట్టుకొని చక్కగా పసుపూ కుంకం పెట్టుకొని మహాలక్ష్మిలాగ యింట్లో పెత్తనం చేస్తూ వుంటే ఆ సొగసు చూశారూ?...'' అంటూ బుచ్చమ్మ కళ్ళముందు ఇంద్రజాల ప్రపంచం సృష్టిస్తాడు. ఆ ఇంద్రజాలమే కన్యాశుల్కం నాటకాన్ని వూహించని మలుపులు తిప్పుతుంది.

''అదిగో నవలోకం వెలసె మనకోసం'' అని సరదా జీవులు పొంగిపోతూ తమకు నచ్చిన రూపంలో సుందర వూహాలోకంలో విహరించగల వీలు ఇంటర్నెట్‌ పుణ్యమా అని ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరుజన్మలోనైనా దక్కితే బాగుండునని నెరవేరని వూహలతో కాలం గడిపే అవసరం ఇకలేదు. తమ కోరికలు తీర్చుకోవటానికి మరో జన్మ అక్కరలేదు. ఈ జన్మలోనే రెండో జీవితం అనుభవించే వీలును ఇంటర్నెట్‌ లోకంలో '3-డి డిజిటల్‌ ఆన్‌లైన్‌ కమ్యూనిటీ' అందిస్తోంది. నమ్మశక్యంకాని ఈ వూహాలోకం ఫిలిప్‌ రోసెండెల్‌ అనే మేధావి సృష్టి. రెండో జీవితంగా అభివర్ణించే ఈ వూహాలోకంలో తాము ఇష్టపడే విధంగా తమ మొహాన్ని, శరీరాన్ని ఒంటి రంగును మార్చుకోవచ్చు. నల్లగా కాకిలా ఉండే కాంతామణి ఈ పద్ధతి ద్వారా అందాల రామచిలకమ్మగా వయ్యారాలు ఒలికించవచ్చు. ప్రత్యేక కంప్యూటర్‌, బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం సమకూర్చుకుని 'రెండో జీవితం కామ్‌'లోకి వెళ్ళి మౌస్‌ క్లిక్‌ చేస్తే చాలు- ప్రస్తుత జీవితంలోనే రెండో జీవితాన్ని అనుభవించవచ్చు. ఈ 3-డి వూహాలోకాన్ని నిర్మించేది, నిర్వహించేది అందులో చేరిన సభ్యులే. నిర్ణీత రుసుము చెల్లించిన వూహాలోక సభ్యుల ఎదుట అతిపెద్ద డిజిటల్‌ భూభాగం ప్రత్యక్షమవుతుంది. అందులో వూహాలోక ప్రజలుంటారు. అందమైన ఇళ్ళుంటాయి. అన్ని సౌకర్యాలు కళ్ళముందు కనిపిస్తాయి. ఒక చోట మౌస్‌ను క్లిక్‌ చేస్తే కొత్తగా సభ్యత్వం పుచ్చుకున్నవారు ఇల్లు కట్టుకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి అనువైన స్థలం కనిపిస్తుంది. ఆ స్థలం చుట్టూ అప్పటికే నిర్మాణమై ఉన్న ఇళ్ళూ ఆ ఇళ్ళల్లోనివారూ కనిపిస్తారు. వారితో స్నేహసంబంధాలు ఏర్పరచుకోవచ్చు. ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించవచ్చు. అవసరం అనుకుంటే తాము నిర్మించుకున్న ఇంటిని అమ్ముకోనూ వచ్చు. వూహా ప్రపంచంలో స్థలం దొరకదనే సమస్యలేదు. జనాభాకు అనుగుణంగా స్థల విస్తీర్ణం పెరుగుతుంటుంది. 2003 సంవత్సరంలో ఫిలిప్‌ రోసెండెల్‌ ఈ వూహాలోకాన్ని సృష్టించినప్పుడు 64 ఎకరాల విస్తీర్ణం ఇప్పుడు 65 వేల ఎకరాలకు విస్తరించింది. శాస్త్రవిజ్ఞానమూ బహుముఖాలుగా పెరిగిపోతుంటే- వూహాలోకాలు కళ్ళముందు సాక్షాత్కరించటంలో వింతేముంది?
(Eenadu, 09:09:2007)

Labels: