ఫన్‌కర్ ఫటాఫట్
*కరెన్సీ నోటు మీద కూడా వాణిజ్య ప్రకటనలు ముద్రిస్తే?
చిదంబరానికి ఓ లెటరు రాయరాదూ...! ఆయనకు ఖజానా, మీకు జేబూ నిండుతాయి(వారిచ్చే పారితోషికంతో).
-----------------------------------
* ముకేశ్ అంబానీ తన పదవిని మీకిచ్చాడనుకోండి... మీరెలా ఫీలవుతారు?
నేను 'ఫీల్' అవడానికి ఏముంది? ఆ తర్వాత ఆయనే 'ఫీల్' అవ్వాల్సి వస్తుంది.
---------------------------------
* ఉదయం రూ.10 డిపాజిట్ చేస్తే సాయంత్రానికి రూ.1,000 ఇచ్చే పెట్టుబడి ఉంటుందా?
దాని సంగతి తెలియదు గాని, మీ ఇంటావిడకి పొద్దున్న ఓ రూ.1000 ఇచ్చి చూడండి. సాయంత్రానికి అది రూ.10 అవ్వకపోతే నామీద ఒట్టే.
-----------------------------------
* ఎవరైనా మిమ్మల్ని చూసి 'టాటా' అంటే?
నేను మాత్రం వెనక్కి తగ్గుతానా? వాళ్లను చూసి 'బిర్లా' అంటాను.
-----------------------------------
* నా స్నేహితుడు ఓ 'కడుపు మండే' రోగి. అతగాడికి 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' రావాలంటే?
'మండే'నాడు ప్రయత్నించాలి.
-----------------------------------
* జేబు నిండితే ఆనందం ఎక్కువ కలుగుతుందా? కడుపు నిండితే ఆనందం ఎక్కువ కలుగుతుందా?
ఈ రెండూ కాదు. ఎదుటివాళ్ల జేబూ, కడుపూ ఖాళీగా ఉంటే సంతోషించే జనాలున్నప్పుడు.
------------------------------------
* చెవిటివాడి ఇంటికి అదృష్ట లక్ష్మి వచ్చి తలుపు తడితే... ఆయన ఏమంటాడు?
తను చెప్పిందే వినమంటాడు.
-----------------------------------
* వ్యాపారం అభివృద్ధి కావాలంటే ప్రతిభ అవసరమా?
'పర్సెంటేజీ'లు ఇచ్చే ప్రతిభ ఉండాలి.
----------------------------------
* ఏమి చదువుకుంటే పైకొస్తాను?
స్కామాయణం చదివితే సరి. ఆటోమేటిగ్గా పైకొచ్చేయొచ్చు.
__________________________________
(Eenadu, 06:01:2008)
Labels: pun/telugu