My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, April 20, 2013

1106- A lesson from a mumbai rickshaw driver


 Be a Reason for Million Smiles…but Never be a reason for even a single Grudge…
  




Exact Narration by an auto-rickshaw passenger,

Suvendu Roy of Titan Industries, who shares his inspirational encounter with a rickshaw driver in Mumbai:-

"... One Sunday, my wife, kid, and I had to travel to Andheri from Bandra. When I waved at a passing auto rickshaw, little did I expect that this ride would be any different...

I looked in front and there was a small TV. The driver had put on the Doordarshan channel.

My wife and I looked at each other with disbelief and amusement. In front of me was a small first-aid box with cotton, dettol and some medicines.

This was enough for me to realize that I was in a special vehicle.

Then I looked round again, and discovered more - there was a radio, fire extinguisher, wall clock, calendar, and pictures and symbols of all faiths

- from Islam and Christianity to Buddhism, Hinduism and Sikhism.

There were also pictures of the heroes of 26/11- Kamte, Salaskar, Karkare and Unnikrishnan.

I realized that not only my vehicle, but also my driver was special.

I started chatting with him and the initial sense of ridicule and disbelief gradually diminished.

I gathered that he had been driving an auto rickshaw for the past 8-9 years; he had lost his job when his employer's plastic company was shut down.

He had two school-going children, and he drove from 8 in the morning till 10 at night.

No break unless he was unwell. "Sahab, ghar mein baith ke T.V dekh kar kya faida? Do paisa income karega toh future mein kaam aayega."

We realized that we had come across a man who represents Mumbai – the spirit of work, the spirit of travel and the spirit of excelling in life.

I asked him whether he does anything else as I figured that he did not have too much spare time.

He said that he goes to an old age home for women in Andheri once a week or whenever he has some extra income, where he donates tooth brushes, toothpastes, soap, hair oil, and other items of daily use.

He pointed out to a painted message below the meter that read: "25 per cent discount on metered fare for the handicapped.

Free rides for blind passengers up to Rs. 50."

My wife and I were struck with awe. The man was a HERO!

A hero who deserves all our respect!!!

Our journey came to an end;

45 minutes of a lesson in humility, selflessness, and of a hero-worshipping Mumbai, my temporary home.

We disembarked, and all I could do was
to pay him a tip that would hardly cover a
free ride for a blind man.

I hope, one day, you too have a chance to meet Mr Sandeep Bachhe in his auto rickshaw: MH-02-Z-8508."

(via Facebook/ Aurasoft )
_____________________________________________________

Labels: , , ,

1105- Dealing with a spirit that can kill



Alcoholism is a disease that may afflict just one person, but its disastrous consequences affect his whole family




Fire gives us warmth, but it also burns us. We use it to our advantage, but never get too close to it. Our sense of survival and self-preservation kicks in the moment it gets too close to us. How come that doesn’t happen with alcohol? In fact, alcohol doesn’t have the various benefits of fire but in terms of the ability to destroy it is as devastating, if not more. Certainly more treacherous!

Across the country, in every State, alcoholism has destroyed families. It’s a disease which afflicts maybe one member of the family but its symptoms, and the destruction it causes, affects the whole family. It contributes to domestic violence, affects the education of children, affects the ability of a family to spend on healthcare, and causes unemployment.

When I used the word ‘disease’ to describe alcoholism, it was not lightly. Studies have shown that it is, in fact, a disease and not a “bad habit” as most of us see it. Some of us are potential alcoholics, and when such people start to drink they find themselves getting drawn into it more and more, and try as they might they are unable to come out of it. It’s like a whirlpool which sucks you in. Unfortunately there is no medical test that can warn you of this.

There are four indications that you may be headed towards alcoholism. They can be easily remembered by way of the acronym, CAGE — Cut, Anger, Guilt and Eye-opener.
Ask yourself the following four questions. One “yes” response suggests an alcohol use problem. More than one is a strong indication that a problem exists.

1]Cut: Are people who are very close to you repeatedly telling you that you need to cut down on your drinking?

2]Anger: Are you getting angry and upset as a result of people close to you telling you that you should cut down on your drinking?

3]Guilt: Do you promise yourself not to go beyond a certain number of drinks, and once you start drinking are you unable to control yourself, leaving you feeling guilty and upset about not being able to stick to your resolution?

4]Eye-opener: Have you reached a stage in your life when you sometimes need alcohol to start your day? You wake up in the morning and you realise that you are unable to start your day, unable to function, without having a drink.

Unfortunately, there is no medicine that can cure us of this disease of alcoholism. But there is an organisation which can help us if we decide to seek it — Alcoholics Anonymous. Alcoholics Anonymous is a worldwide organisation and it has so far helped 300 million people. In India, too, they have many centres spread across the country. Following are their contact details: To reach AA by phone, call  +919022771011 . To reach AA by text message, type AAAA your name, address and contact number, and send the SMS to 56363.

Not everybody who consume alcohol becomes an alcoholic. In fact in India, as per experts, one in 20 — five per cent become alcoholics. But one in two, that is 50 per cent, indulge in what is called ‘hazardous drinking’you may not drink every day but when you do, you drink so much that you are no longer in your senses and you cause harm to yourself and to others. Or, you may consume just a little and still behave in a hazardous manner — for example, by driving a car.

How many times have I heard these lines from drunken person: “I’m not drunk, I can drive, I’m in my senses” or “Chill yaar , don’t stress, I’ve had just two drinks, I am totally in control”.

Hello?!!!

Every drunken person thinks he is the cat’s whiskers and a superhuman in every way! Absurd! A car is like a killing machine in the hands of a person who has consumed even a little alcohol! And if you have decided to sit in the driver’s seat after consuming any quantity of alcohol then you should be treated as a potential murderer.
40 to 60 per cent of all cases coming into emergency rooms of hospitals in India are alcohol related! Thirty-five per cent of those are people who have consumed alcohol and 65 per cent are people who have not consumed alcohol themselves, but have been injured by someone who has.

So guys, if we can live without alcohol nothing better than that. But if some of us want to drink, let’s at least be responsible about it!

While going through all the research material and interviews on this topic, I was completely shattered watching the testimony of Mr. Sumir Anand. The tragic story of how he and his wife, Gitika, lost their 14-year-old son, Curran, is really heartbreaking. It’s like a nightmare that every parent has a thousand times!

The first thing I did after watching the testimony was to call up my children Ira and Junaid, who are 13 and 18 respectively. I showed them Mr. Anand’s interview. And what I made them promise to me then is the promise that I think all of us ought to make to ourselves: -
NEVER drink and drive! And, NEVER sit in a car when the person driving has consumed even one drop of alcohol!
Make this a rule for life!
 
Jai Hind! Satyamev Jayate!
( Aamir Khan is an actor. His column will be published in The Hindu every Monday).

(The Hindu, OP-ED, 02:07:2012)
___________________________________________________

Labels: , , ,

1104- Give your 100%




via face book/ useful Info
____________________________________________________

Labels: , , ,

1103- ఆత్మీయ ఆలింగనం


మనిషి మనసు పలు రాగభావాల విపంచి. సరసంగా మీటినకొద్దీ సురాగాలు కొనసాగి 'మధువనిలా రసధునిలా' అనురాగ ప్రకంపనలొస్తాయి. వాటి సుతారపు తాకిడితో ఎదుటి వ్యక్తికి అవ్యక్త అనుభూతి, బిగి కౌగిలిలోకి చేరి ఆసాంతమూ కరిగిపోవాలన్నంత ఉల్లాస స్థితి! అసలీ ప్రపంచమే ప్రేమానందమయం అనుకుంటే- ప్రతి మాటా మధురాక్షరి, ప్రతి కదలికా రసరమ్య సుధా ఝరి. అంతమాత్రాన అది కేవలం ఆలూమగల ప్రేమో, ప్రేయసీప్రియుల ప్రణయమో కానక్కర్లేదు. తల్లీ తండ్రీ గురువూ బంధువూ మిత్రుడూ- వారూ వీరని కాదు, పెద్దలూ పిన్నలూ అందరినీ సర్వకాలాల్లోనూ కట్టిపడేసేది ప్రేమపాశమే. ప్రేమే మూలమన్న సూత్రానికి అంతా కట్టుబడి ఉండాలే కానీ, కవి కరుణశ్రీ భావించినట్టు 'యుగయుగాల మానవజాతికి ఉజ్జీవనం/ జగజగాల చైతన్యజ్యోతికి సంభావనం' ప్రేమైక భావనే. అదో హృదయ సంబంధీ, బాంధవ్యమే పరమావధిగా కలదీ. వరమై అలరించినా, గానమై మధురిమలు అందించినా బాధ్యత, భద్రత, ధీమా, ఉపశమనం... సమస్తమూ ప్రేమానుభవ సారాంశమే. అంతరంగాల లోతుల్లో వూరే సంతోషాల జల అదే. స్పర్శతోనో పరామర్శతోనో ధారలా పెల్లుబుకడం కూడా దాని పనే! అందుకే రాధకు మాధవుడు 'సరస సంగీత శృంగార చక్రవర్తి/ సకల భువనైక మోహన చారుమూర్తి' అయ్యాడు. అరణ్యవాస తరుణాన, భార్యామణి వూర్మిళ ఉన్న గదిలోకి వెళ్లిన లక్ష్మణుడు ఆమె దరిచేరి లేవనెత్తి అందించిందీ హృదయపూర్వక పరిష్వంగ మాధురినే! 'ఏల ఈ లీల శంక వహింపవలయు/ భయాందోళనమ్ము నీకేల బాల' అంటూ సమర సమయాన సతీ సులోచనను హత్తుకుని ధీరవచనాలు పలికిన ఇంద్రజిత్తుదీ రాగరంజిత తత్వమే!

మృదువుగా దగ్గరకు తీసుకుని, గాఢంగా గుండెలకు హత్తుకోవడమే కౌగిలింత ప్రత్యేకత. దేవి సరస్వతిని చుంబించిన చతుర్ముఖుడు అటు తరవాత ఆమెను బాహుబంధితురాల్ని చెయ్యడంలోనే ప్రణయ సృష్టి చాతుర్యం దాగుంది. మెట్టినింటికి సాగుతున్న ప్రియ తనయ శకుంతలను చేరదీసి తలమీద కరముంచి 'చిరాయువ'ని దీవించిన కణ్వమునిదీ ప్రేమపూరిత చింతన. మహర్షి గౌతముడు ఒక యువకుడి సత్యసంధతను మెచ్చుకుని కౌగిలించుకోవడంలోనూ వెల్లడైంది ప్రేమాభినందనే. పాపపు సొత్తు తీరు తెలిసిన చోరుడు అపరాధభావంతో తన పాదాలమీద వాలితే, అక్కున చేర్చుకుని స్వస్థత అందించాడో మునీంద్రుడు. కార్యసిద్ధి కోరుతూ ప్రణమిల్లిన కుమారుడు గరుడుడికి తల్లి వినత దీవెనా కౌగిలింతతోనే. బలరామకృష్ణుల్ని చూసినప్పటి ఆనందాన్ని, చేతులారా ఆలింగనం చేసుకుని మరీ ప్రకటించాడు నందుడు. 'గక్కున కౌగిలించి కరుణ నీపై నుంచి/ ఇక్కువగూడె శ్రీ వేంకటేశుడు నిన్ను' అని అలివేలుమంగను అన్నమయ్య ప్రస్తుతించడం భక్తి ప్రేమతత్వమే. సింహాచలేశ్వరుడి చందనోత్సవ సందర్భాన, భక్తులు కప్ప స్తంభాన్ని కావలించుకోవడమూ కోరికలు నెరవేర్చుకునే కృషే! మాటల్లో చెప్పలేని దయ, ఆప్యాయత, స్నేహం, వాత్సల్యం, ఆదరణ, మరెన్నో గుణగణాలు కౌగిలితో బహిర్గతమవుతాయి. పర్వదినాల్లో అభివాదాలు, ఆకాంక్షలు ప్రత్యక్షమయ్యేది ఒకరినొకరు దరిచేరడం వల్లనే. మురిపాలూ సరసాలూ అలరింపులూ గిలిగింతలూ, వీటితోపాటే అలకలూ కలతలూ ఉలికిపాట్లూ నిట్టూర్పులూ కలవరాలూ కల్లోలాలూ- కౌగిళ్లకు సమయ సందర్భాలు. ఎవరో బోధిస్తే ఎక్కడో నేర్పిస్తే వచ్చేవి కావివి. ప్రకృతి నేర్పే అతి సహజసిద్ధ జీవిత పాఠాలే ఇవన్నీ! ఎంతటి వేదననైనా మటుమాయం చేసే ప్రగాఢ శక్తి, నిగూఢ యుక్తి ఉన్నాయిందులో. సినారె ఉదాహరించినట్టు 'చేతులంటూ ఉంటే గభాలున పైకి లేచి/ ఎదిగిన నా మొక్క పుత్రికను గాఢంగా కౌగిలించుకునేదాన్ని- అనుకుంటుంది ధరిత్రి!'

అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు మానాలంటే? ఆ పసికందును గుండెలకు అదుముకుంటుంది తల్లి. పరీక్షలో కృతార్థులైన పిల్లకో పిల్లవాడికో అమ్మానాన్నల కౌగిలింతే మరింత స్ఫూర్తి. క్రీడాకారులకీ అదే విజయాభివాద దర్శిని. అరమరికలు లేని, అనవసర బిడియాలకు తావివ్వని 'దగ్గరితనం' ఎప్పుడూ ఆరోగ్యకరమే. పడుచుజంట కౌగిలి అందచందాల లోగిలి. అందుకే 'కులుకు బింకాలు పొంకాలు దాచి/ కోటి బాహువుల బంధించనీవే' అని జవ్వనితో అంటాడు ఆరుద్ర కథానాయకుడు. ప్రకృతితో గ్రామీణులది 'ఎన్నడూ వీడని కౌగిలి'. రాజస్థాన్‌లోని ఓ పల్లెలో రెండున్నర శతాబ్దాల కిందట చెట్ల కొట్టివేత విచ్చలవిడిగా సాగింది. ప్రాణసమానంగా పెంచుకుంటున్నవాటి ఉసురు తీయొద్దంటూ సిబ్బందిని ఓ తల్లి, ఆమె ముగ్గురు కూతుళ్లు విభిన్నంగా అడ్డుకున్నారు. గొడ్డళ్లు మీద పడకుండా ఆ చెట్లను వాటేసుకున్నారు వాళ్లు! ఫలితంగా అక్కడ ఆ కొట్టివేత ఆగిపోయింది. అనంతరం, పర్యావరణ సంరక్షకుడు సుందర్‌లాల్ బహుగుణ చేపట్టిన ఉద్యమం 'చిప్కో'కి అర్థం 'చెట్లను కౌగిలించుకో' అనే! యువజనుల తొలి కౌగిలి వెచ్చదనం, తొలి ముద్దు తీయదనం అనంతం. 'చెలి చేరే దారులు వెదకాలి/ చలి తీరగా కౌగిలి చేరాలి' అన్నదందుకే ఓ ప్రేమిక గళం. కౌగిలిదో గిలిగింత, అందులో వ్యక్తమయ్యేది నమ్మకమే... అంటున్నారు అమెరికాలోని వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రకారులు. ఆత్మీయుల్ని హత్తుకుంటే పెరిగే విశ్వాసం- మన రక్తపోటును అదుపుచేయడంతో పాటు జ్ఞాపక పటిమను పెంచుతుందంటున్నారు. నమ్మకస్తుల్ని వాటేసుకుంటే వూరే హార్మోన్ వారితో అనుబంధాన్ని తప్పక పెంచుతుందని చాటిచెప్పడమూ శుభ సమాచారమే మరి!

(ఈనాడు ,సంపాదకీయం , 03:02:2013)
_________________________________

Labels: , ,

Friday, April 19, 2013

1102- Mistakes, agreements & Quotes









via facebook/ Useful Info
________________________________________________________

Labels: ,

1101- శ్రీరామ నామాలు శతకోటి



   ' రామ' రెండే అక్షరాలు... కానీ ఎంత సాహిత్యం! 'రామ' అనే శబ్దాన్ని తిరగేసి పలికినా అక్షర జ్ఞానం లేని ఆటవికుడు ఆదికవిగా మారాడు! విశ్వానికి తొలి కావ్యాన్ని ప్రసాదించాడు. అది మొదలు ఎన్నో భాషల్లో ఎన్నో కావ్యాలు. పద్యాలుగా, పదాలుగా, పాటలుగా పల్లవించాయి. రామనామ గానామృతభాండాన్ని తరతరాలకూ తరగని సంపదగా అందిస్తున్నాయి. తెలుగు చలన చిత్రాల్లో సైతం రాముడి పాటలకు రత్నాల సింహాసనం మీద పట్టాభిషేకం జరిగింది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా 'పాలు మీగడల కన్న పంచదార చిలకల కన్న' ఎంతో రుచికరమైన కొన్ని పాటల్ని తీర్థప్రసాదాల్లా కళ్లకద్దుకొందాం...

రాముడి పాటలు అనగానే ఒక తరంవారికి వెంటనే గుర్తుకొచ్చే కవి సీనియర్ సముద్రాల. వాహిని వారి 'దేవత'లో 'రామ భజనే మోదజనకమురా' అని శ్రీరాముడిపై తొలిసారిగా రాసిన సముద్రాల... ఆ తరవాత 'భక్త పోతన'లో 'సర్వమంగళ నామా రామా...' లాంటి పాటలతో భజన గీతాల సంప్రదాయానికి సరికొత్త ఒరవడిని సృష్టించారు. 'భూకైలాస్'లో శ్రీరామచంద్రుడి అవతార భవిష్యద్దర్శనం చేస్తూ ఆయన రాసిన 'రాముని అవతారం...' పాట చిరస్థాయిగా నిలిచిపోయింది. 'లవకుశ', 'వాల్మీకి' చిత్రాల్లో సముద్రాల వారి రామకథా గీతాలు ఆపాత మధురాలు. వారి చిట్టచివరి సినిమా పాట సైతం రామాయణ గీతమే కావడం విశేషం. అది... 'శ్రీరామకథ'లోని 'రామకథా... శ్రీరామ కథా...' గీతం.

సీనియర్ సముద్రాల కలం వారసుడు జూనియర్ సముద్రాల కూడా తన రామభక్తిని అక్షరాల్లో చూపించారు. ఆయన 'శాంతినివాసం' చిత్రం కోసం 'శ్రీరఘురాం జయ రఘురాం...', 'జయసింహ'లో 'జయ జయ శ్రీరామా రఘువరా...' గీతాలు రాశారు.

పదములే చాలు:  

నీలమేఘ శ్యాముడిపై రాయడంలో దేవులపల్లి కృష్ణశాస్త్రిది మరో శైలి. భక్తీ, కరుణ, పరిపూర్ణ శరణాగతి, భావుకత రంగరించి దేవులపల్లి హృదయాల్ని తాకేలా రాశారు. 'ఏమి రామ కథ శబరీ...' (భక్త శబరి), 'వూరికే కొలను నీరు...' (సంపూర్ణ రామాయణం), 'పదములే చాలు రామా' (బంగారు పంజరం), 'ఈ గంగకెంత గుబులో' (శ్రీరామ పట్టాభిషేకం) లాంటి ఆణిముత్యాలతో ఆయన గీతార్చన చేశారు. రాముడి పాటల అల్లికలో ఆరుద్రది విశిష్ట ముద్ర అని చెప్పాలి. తిలక్, బాపు-రమణల చిత్రాల్లో ఆయన కలం నుంచి జాలువారిన రాముడి పాటలు సాహితీ విలువలతో వాసికెక్కాయి. 'అశోక వనమున సీతా...' (అత్తా ఒకింటి కోడలే), 'అందాలా రాముడు... ఇందీవర శ్యాముడు' (ఉయ్యాల జంపాల), 'పలుకే బంగారమాయెరా..' (అందాల రాముడు), 'శ్రీరామ జయరామ సీతారామ' (ముత్యాల ముగ్గు), 'రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా' (గోరంత దీపం), 'శ్రీకరమౌ శ్రీరామ నామం' (శ్రీరామాంజనేయ యుద్ధం) లాంటి పాటలు ఆయనవే. ఇక ఆరుద్ర రాసిన మరో ఆణిముత్యంలాంటి రామ గీతం 'మీనా' చిత్రంలో ఉంది. అదే... 'శ్రీరామ నామాలు శతకోటి'. ఈ గీతం నేటికీ జనాదరణ పొందుతూనే ఉంది.

మా వూరి దేవుడు:  

మన దేశంలో రాములవారి గుడి లేని వూరు ఉండదంటారు. కాబట్టే మన దర్శకులు అవకాశం వచ్చినప్పుడల్లా రామాలయాన్నీ, స్వామి విగ్రహాల్నీ తమ కథలో భాగం చేసుకొంటారు. అందుకు తగ్గ విధంగానే సాహిత్య విలువలున్న గీతాలూ రాయించుకొంటారు. ఆ పాట రాసే అవకాశం వచ్చినప్పుడల్లా మన కవులు భక్తి పారవశ్యంతో కలాన్ని పరుగులు తీయించారు. దాశరథి - 'రాముని రూపమే' (పెళ్లికూతురు), 'జగదభిరామా రఘుకులసోమా' (రామాలయం); సి.నారాయణరెడ్డి - 'మముబ్రోవమని చెప్పవే..' (అందాల రాముడు), శ్రీశ్రీ - 'శ్రీనగజాతనయం' (వాగ్ధానంలో హరికథ), కొసరాజు - 'శ్రీరామ నీ నామమెంతో రుచిరా' (ఇద్దరుమిత్రులు), 'రామయ తండ్రి...' (సంపూర్ణ రామాయణం); వేటూరి - 'మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు' (పంతులమ్మ), 'మా వూరి దేవుడు అందాల రాముడు' (అల్లుడా మజాకా); కులశేఖర్ - 'కోదండ రాముణ్ని చూడు...' (శీను వాసంతి లక్ష్మి) ఆ భక్తి గీతాల జాబితాలోనివే. ఇటీవల వచ్చిన 'శ్రీరామరాజ్యం'లో జొన్నవిత్తుల రాసిన గీతాలు, 'శ్రీరామదాసు'లో కీరవాణి స్వరపరచిన రామదాసు గీతాలను నవతరం శ్రోతలు విని తన్మయులయ్యారు.
- ఓలేటి శోభ

(ఈనాడు , సినిమా ,19:04:2013)
______________________________________

Labels: , , ,

1100- Value of things & Positive Life







via facebook/ Useful Info
_________________________________________________________________

Labels: ,

Wednesday, April 17, 2013

1099- కల్యాణ వైభోగమే...



ఇచ్చిపుచ్చుకొనే రెండు మనసులు మనువుతో ఒక్కటవడం... జీవితం. పువ్వూ తావీ, వాక్కూ అర్థమూ, గీతమూ రాగమూ అన్నట్టు ప్రేమా పెళ్లీ కూడా అవినాభావం. కళల చక్కదనం, కుసుమాల పరిమళం, చందనాల చలవ, తేనెల మాధురి అన్నీ అందులోనే , ఆ పొందులోనే. 'జల్లులై కొల్లకొల్లలై మెల్లమెల్ల/ పెల్లుబికి వెల్లివిరియు మీ యుల్లమెల్ల/ పసుపు పారాణి నూత్న దంపతులు మీరు/ముద్దుగా కాపురము తీర్చిదిద్దుకొనుడు' అని కవి శుభాక్షతలు చల్లారందుకే. ప్రతి మనిషీ ఆస్వాదించి తీరాల్సిన మధుర మనోహర సదానుభూతి ప్రేమ. అంతరంగాన్ని పరిపూర్ణ తరంగితంగా చేసే పరిణయ బంధం అపూర్వ దీప్తి, ఓ అపురూప స్ఫూర్తి. ఆ వలపు తలపుల జడిలో తడిసి ముద్దవని మది ఉండదు, అణువు అణువునా ఆ ప్రణయ మధువును నింపుకోవాలన్న తపనకి అంతూ కనిపించదు. లోలోన నాడుల తీగలపైన సాగే అనురాగాలాపనే ప్రేమంటే. అదే నిండితే పిడికిలంత గుండెలోనూ కడలి హోరు వినిపించి 'మహా ప్రేమ, శాశ్వతమైన ప్రేమ/ అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ/ నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల' అనిపించకా మానదు. నిధిగా, అనుబంధ వారధిగా నిలిచే ప్రేమభావనతో హృదయానికి కలిగే బాధ్యత, భద్రత, నిబద్ధత, క్రమబద్ధత... చెప్పలేనంత. ఆ కారణంగానే 'ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును/ ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును' అన్న గురజాడ వాణి పరమ రమణీయం, ప్రాతఃకాల స్మరణీయం. ప్రేమానురాగమే సృష్టి రహస్యమని, ఆ ఒక్క వస్తువూ లోపిస్తే లోకమంతా అల్లకల్లోలమేనని అంతా గ్రహించాల్సిందీ అందుకే.

కరుణశ్రీ గళం పలికినట్టు వివాహమంటే- 'బృందారకానంద మందార మకరంద బిందు నిష్యందాల విందు/ రంగారు ముంగారు బంగారు సరసాంత/ రంగాల సత్యనర్తనము'. అదే- వధువూ వరుడూ ద్వంద్వమై జీవన మధురిమ లందుకునే బృందావనారామ సీమ. అందరూ ప్రథమంగా ప్రధానంగా స్మరించాల్సింది సత్య సనాతన దంపతులైన పార్వతీ పరమేశ్వరులనే. తపోముద్రలోని ఆయన తన దరిచేరిన ఆమెని చూడనే చూశాడు. 'మేను పులకరింప వలపులు తొలకరింప' పాణితలాన్ని పట్టుకున్న ఆ భవుడిని 'ముద్దులొలికెడి పగడాల మోవిమీద చిరునవ్వు ముత్యాలు జాలువారుతుండ'గా సుతారంగా వారించిందా దేవేరి. పరిణయ బాంధవ్యాన్ని అంత మిన్నగా పండించుకున్నందునే, వారు ఆదిమూర్తులు. సీతారాముల కల్యాణవేళను తలచుకుంటే 'లక్ష్మి వంటి సీతామహాలక్ష్మి విజయ/లక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి' అయింది. 'ప్రాణసఖీ!' అని సతి వూర్మిళను సంబోధించిన లక్ష్మణుడిలో వ్యక్తమైందీ అనురక్తే. రామలక్ష్మణులతో యుద్ధానికి సంసిద్ధమవుతున్న ఇంద్రజిత్తుకి హితవు పలికింది భార్య సులోచన. 'నిండు చంద్రులు మీరు, వెన్నెలను నేను/ దివ్య భానులు మీరు, పద్మినిని నేను/ మీ పదాబ్జ సన్నిధియే స్వామీ, మదీయ/ జీవనమ్ము సమస్త సంభావనమ్ము' అనడంలో ప్రస్ఫుటమైంది- పతితో ఆమెకున్న గాఢానుబంధమే! మాధవ ప్రియ రాధాదేవిది సరాగ భావనారాధన. నవ్యజీవన దివ్యస్థలిలో విహారానికి రావాలన్న కృష్ణ కోరికను తలదాల్చిన ఆమె భాగ్యనౌకకు కాళింది నదిలో మరి ఎదురేముంటుంది? తనయ శకుంతలను సాగనంపుతూ తండ్రి కణ్వుడు చేసిందీ సతీపతులకు హితబోధే. ఆరాధనా సంపన్నులైన జంటకు 'లోకమొక స్వర్గమగు నవాలోకనమున' అన్నాడాయన. యశోధరా గౌతముల పాణిగ్రహణం నయనపర్వం, నవ నవోన్మేషం. ఆ ఇద్దరిదీ సుధాంశు కలం వెలువరించినట్టు 'హృదయ బంధనం'. బుద్ధుడికి స్వాగతమిచ్చిన రాజనర్తకి ఆమ్రపాలిది సైతం ముగ్ధహృదయం. ఆయన రాకతో ఆమె మానసం సరోవరంలా మారింది, అనిర్వచనీయ భావన సహస్ర పత్ర కమలంలా తేలింది. ఆ లలనామణిలో తాదాత్మ్యం సుకుమార సుగంధంలా ప్రసరించింది, ఆహ్లాదం మకరందంలా పొంగి ప్రవహించింది. ఆశల తోరణాలన్నా, కలల మెరుపులన్నా అవే కదా!

ప్రేమలూ పెళ్లిళ్లూ మహా భాగ్యదాయకాలు. అసలీ జగత్తుకు ప్రేమే ఆద్యంతాలుగా మారినప్పుడు- ఆనందం అర్ణవమవుతుంది, అనురాగం అంబరమవుతుంది. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడు అడుగులని మాత్రమేకాదు. అన్నీ మొత్తంగా కలిపి చూస్తే, నూరేళ్లు. నూరేళ్ల పంటే పెళ్లి.ధూవరులతో పాటు తల్లిదండ్రులు, ఇతర పెద్దలు, బంధుమిత్రులు, హితులు, సన్నిహితులు అందరినీ ఒకటిగా చేర్చే క్రతువు మనువు. కవిశ్రీ అన్నట్టు 'దంపతి తాంబూలంబులు/ చెంపలు దువ్వుటలు, పూలచెండ్లాటలు, క/వ్వింపులు, వదినల ముక్తా/యింపులు, నెచ్చెలుల హెచ్చరింపులవెన్నో'. కల్యాణపు బొట్టు పెట్టడం, మణిబాసికాన్ని నుదుటన కట్టడం, పారాణిని పాదాలకు పూయడం... ఇవన్నీ కాలక్రమంలో కొన్ని మార్పుచేర్పుల్ని సంతరించుకున్నా పెళ్లికళంటే కళే. పెళ్లి చేసుకోవడంలో, చేయడంలో, చేయించడంలో ఉన్న కళకళలే వేరు.'శ్రీరస్తు శుభమస్తు విజయోస్తు' అంటూ 'జయ మంగళం నిత్య శుభమంగళం' అనుకుంటూ ముహూర్తాలు నిర్ణయించుకున్నప్పుడు, వేదికమీద కనిపించే ప్రతి జంటా కన్నుల పంట. 'మాధవీ విలాసంలా మధువసంత హాసంలా/ సుధామధుర సుమసుగంధ సుందర సుస్నేహాంకిత'లా వివాహవేడుకను అభివర్ణించనూ వచ్చు.  ఈ సంతోషకర తరుణంలో 'మీరిద్దరు జంటయై, పులకరించిన పెద్దల నోము పంటయై' కలకాలం వర్థిల్లాలని ఆశీస్సుమాలందిస్తే సరి.



(ఈనాడు , సంపాదకీయం , 10:02:2013) 
__________________________________ 

Labels: ,

1098- Secrets of success





via facebook/ General Knowledge
___________________________________________________________

Labels: ,

1097-Oh my Guinness!

LIGHT ANGLE
By Anantha Narayan

Narendra Modi’s Guinness World Record offered us the perfect excuse to compile a list that even Ripley will find unbelievable. 


Long before Silk Smitha and Sachin Tendulkar, India just had one national obsession — the Guinness World Records. People used to chew light bulbs, gobble fire torches, grow serpentine nails, stand on one foot, jump from towers, and do the kookiest things to somehow etch their hollow names into the hallowed book. Fifty-seven years on, GWR still holds as much charm. Today, even the movers and shakers use it to puff up their résumé. Having seen record holders hog megawatts of undeserved limelight, the aam aadmi is straining every sinew to invent bizarre new ways of earning this accolade. Allow us to share eight whacked-out instances that will leave you breathless.

Longest Movie Watchathon
How many back-to-back movies can you pack into your life? Four? At best, five? Ashish Sharma watched 48 Bollywood flicks continuously by investing 120 hours and 23 minutes of his precious life with 10 minute breaks in between. That’s 5 days of non-stop viewing! Ashish’s blockbuster feat deserves to be celebrated with a film titled ‘ Is brat ki subah nahin ’.

Most People Skipping on the Same Rope
The best-in-class engineering colleges make a name for themselves by incubating Nobel Prize worthy ideas. College of Engineering, Pune, however believes in being the proverbial square peg in a round hole. That explains why, 292 students from the college took one small skip for mankind and a giant leap for their alma mater instead of a quantum jump for technology.

Most Consecutive One-Handed Claps
Zen masters have often raised a profound question: “What is the sound of one hand clapping?” Scholars like Simon and Garfunkel have interpreted it as ‘Sound of Silence’. But Abhinav Upadhyaya gave the koan an altogether physical dimension by actually clapping with one hand. Not once. Not twice. But a mind-boggling 310 times in one minute! You have to hand it to Abhinav for being zensational.

Most Joints Cracked Continuously
Shillong-based shoemaker James Syiemiong holds the world record for knuckling 26 different bone joints of his body in just 56.1 seconds. Now that’s one hell of a knucklehead, don’t you think?

Oldest Living Dad
This is the baap of all records. Nanu Ram Jogi celebrated the birth of his 21st child ‘Girija’ at the ripe old age of 90. Apparently, he began his quest for kids in 1943 and has been scoring quite incessantly without ever popping that god of small things we call Viagra.

Longest UN Speech
The illustrious V.K. Krishna Menon holds the unprecedented record for delivering the longest speech ever in the United Nations. He spoke for nearly eight hours defending India’s position on Kashmir. Some lampooned it as ‘epic filibustering’. Amartya Sen viewed it as eloquent evidence for the existence of the ‘Argumentative Indian’.

Most Letters to the Editor
We all know that penning epistles to the editor was the previous generation’s way of showing the middle finger to the establishment. That being the case, Pooran Chandra Pandey must have been their Che Guevara as he wrote a gobsmacking 456 letters to Dainik Jagran between the years 2000 and 2006.

Longest Book Title
They say, never judge a book by its cover. But when Dr. Sreenathachary Vangeepuram showed his cover to the Guinness folks they ended up anointing him as the guy who wrote the longest book title. To cut a long story short, the title apparently begins with the words ‘Handy Crystals’ but nobody knows how it ends as it has 1086 soporific words. Conclusion: If you want your two minutes of fame, flunk your précis writing course.

(the Hindu, magazine, 24:03:2013)
____________________________________

Labels: , ,

1096- జలాభివందనం


సకల భువన పావని మన భరతావని. గంగా తరంగాలు పొంగి పొరలే ఈ నేల జన హృదయాంతరంగ తరంగిణి. గరికిపాటివారన్నట్టు ఇక్కడ 'నీటిబొట్టున కేదియు సాటిరాదు'. సిరులు నిండించుకుంటూ, కలలు పండించుకుంటూ సాగే గంగానదీ జలప్రవాహంలోని ఒక్కో నీటిచుక్కా భారతీయత పాలిట ఆశాదీపిక. ఈ నదీమతల్లితో పాటు యమునా సరస్వతుల సంగమ స్థలమైన త్రివేణికి చేరి 'ఒక్క చుక్కను తలమీద చల్లుకున్నా చాలు' అనుకునేవారు ఎందరెందరో. వీరంతా అనేకానేక ప్రాంతాలనుంచి వందల్లో వేలల్లో లక్షల్లో... అన్నీ కలిపి కోట్ల సంఖ్యలో ఫిబ్రవరి నెలలో  అలహాబాద్‌కి బారులు తీరడమే మహా కుంభమేళా. ఏటా ఎన్ని పర్వదినోత్సవాలున్నా, ప్రతీ పన్నెండేళ్లకీ పుష్కరాలొస్తున్నా, నూట నలభైనాలుగేళ్ల బహు సుదీర్ఘకాలం తరవాత సాగిన భక్తజన ప్రభంజన విశ్వవిఖ్యాత మేళా ఇదే. 'అడుగులో అడుగులో అకలంక మంకమై/ అడుగు వేసినదయ్య అలల రాణి/ నడకలో నడకలో నయనాభిరామమై నడచి వచ్చినదయ్య నల్ల తరగ/ పరుగులో పరుగులో పరమార్ద్ర భావమై పరుగెత్తి వచ్చెనా నురుగు నవ్వు' అనుకున్నప్పుడు సంగమ స్థలిలో పుణ్యస్నానం అపూర్వమూ అపురూపమే కాదు, మహా విశేషం మహా విశిష్టం కూడా. కుంభరాశిలోకి దినకరుడు అడుగిడిన  సందర్భంలో రోజుల పర్యంతం కొనసాగిన ఈ స్నాన పరంపర భిన్న విధానాల విభిన్న సంప్రదాయాల ఏకైక సమ్మేళనం. నాగరికత, ధార్మికత, సంస్కృతుల మేలు కలయికగా భాసించిన ఇది అన్ని వయసులవారికీ ఉమ్మడి వేడుక.

'అఖిలాండకోటి బ్రహ్మాండనాథు డంతరంగమున/ నెలకొనియుండగ నిక గావలసినదేమి?' అన్న త్యాగయ్యకు సమాధానమా అన్నట్టు సాగుతుంటాయి మేళా స్నానాదికాలు. పోయిన నెల పదో తేదీన మహాశివరాత్రి తరుణంలోనూ ఎటుచూసినా ఎక్కడ విన్నా ఇక శివానంద లహరులే. ఎక్కడైనా ఎప్పుడైనా నదులే జాతి సజీవతకు సూచికలు, సుగతికీ త్వరితగతి ప్రగతికీ వీచికలు. గలగలా గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే పండేవి ఒక్క బంగారు పంటలేనా? ప్రజలందరి కలలూ కోరికలూ పండి... కవి అద్దేపల్లి అనుభవానికి వచ్చినట్టు 'నీళ్లు దోసిట్లోకి తీసుకుంటే అందులో సంస్కృతీ నిలబడుతుంది, గొంతులో పోసుకున్న నీళ్లతోపాటే చరిత్రా లోనికి ప్రవహిస్తుంది'. అదే రీతిన గంగమ్మను తలచుకున్నా 'తీర్థగమన ఫలంబెల్ల పుణ్యంబులకు విశేష'మన్న నన్నయకవి మాటా స్మృతిపథాన మెరవాలి. ఆ జలాల శుచి, శుభ్రత, రంగు, రుచి, వాసనలన్నీ ఇంపుగా ఉన్నప్పుడే- అక్కడి స్థితి సజావుగా ఉన్నట్టు. ఉత్తుంగ తరంగాల గంగకు ముకుళిత హస్తాలతో భక్తి నమస్కారాలు చేయాలే కానీ, వాటి స్థానే భయం కమ్ముకోకూడదు. 'అయ్యయొ! ముక్కు మూసుకొనుమయ్య!' అనేంతగా వాతావరణం ఉందంటే, అది కాలుష్య హారిణి కాదు- అక్షరాలా కాలుష్యకారిణే. వేదాలూ ఇతిహాసాల్లో చోటుచేసుకున్న నదీసంపదకు వర్తమానంలో ఎదురవుతున్న విపత్కర స్థితి అతి దుర్భరం. మన ఆశల ప్రశ్నలకు జవాబు కావాల్సిన కాలం మన ఆశయాలకే పెద్ద సవాలుగా మారుతుండటం- ఆరుద్ర చెప్పినట్టు 'కష్టాల కడగండ్ల నడుమ మొత్తంగా ఇరుక్కుపోవడం!' మామూలు రోజుల్లో పవిత్రత నిలపాల్సిన నదీస్నానాలు, ఘట్టాలు మహామేళా వంటి కీలక సమయాల్లో మరింత మెరుగ్గా ఉండితీరాలి.

దేశవిదేశాలవారు సందర్శించిన  కుంభమేళా స్థలి ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 17,ఆదివారం రథసప్తమి, 18 సోమవారం భీష్మాష్టమి కూడా ప్రధాన పుణ్యస్నానాల రోజులే. జనసందోహం పోటెత్తుండటంతో అసలు రూపురేఖలే మారిపోయే ఆ సంగమ ప్రదేశాన్ని పరిపూర్ణ అధ్యయనం చేసింది హార్వర్డ్ బృందం. 'చెదరిపోవునో శేషుని శిరములు/ బెదరిపోవునో దిక్కుంజరములు/ అదరిపోవునో అవనీతలమే' అన్నంతగా అలహాబాద్ నగర జీవనాన్ని చట్రంలో బందించిన వైనాన్ని  పరిశీలించారా సభ్యులు. జలమయం, జనమయం... రెండింటినీ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండటం 'ఏయే తీరము లూరడిల్లినవి తల్లీ! నీదు పొత్తిళ్లలో?/ ఏయే సారము లంతరించినవి మల్లీ! నీవు సాక్ష్యమ్ముగా?' అన్న ప్రశ్నల్ని వారిముందు ఉండడమూ సహజమే. పర్యావరణాన్నే కాక ప్రజారోగ్యం, సాంకేతిక సమాచార రంగాలనూ విశేషంగా ప్రభావితం చేసిన ఈ మేళా తదుపరి ఏర్పాటు 'కుంభమేళా' పేరిట ఉజ్జయిని కేంద్రంగా ఇక మళ్ళీ రెండేళ్లకే. అటు తరవాత క్రమంలో పూర్ణ కుంభమేళా నిర్వహణ ఉంటుంది. పేర్లు ఏవైనా, నిర్వహణ స్థలాలు ఎక్కడున్నా- అడివి బాపిరాజు ఆనాడే దర్శించినట్టు 'వడులలో గర్వాన/ నడలలో సుడులలో/ పరవళ్లు తొక్కుతూ ప్రవహించి' వస్తుంటుంది నదీమ తల్లి. ఆ జలదేవత ఒడిలో స్నానం ఎప్పుడైనా ఎక్కడైనా పరమ పవిత్రం, బహు ఆహ్లాదభరితం. ఇప్పుడు గంగమ్మతల్లినీ 'రసమయివై సదా హృదయ రంజనివై/ యనురాగ స్వర్ణ కుసుమిత వల్లివై, మధుర కోమల హాస విలాస రేఖవై' రమ్మని ఆహ్వానిస్తూనే ఎదురెళ్లడం చలచల్లని పాలవెల్లిలో జాబిల్లిని చూసినంత మధురం. మల్లెమొగ్గలను మెలమెల్లగా చల్లినంత మనోహరం కూడా. భక్తిశ్రద్ధలతో ఆ జననికి చేసే అభివందనం జనజీవితాల్లో విరిచందనం. 'జననీ! నీ అర్చనలు సర్వోదయశ్రీలు/ తల్లీ! నీ దీవనలు ధర్మవిజయశ్రీలు' అంటూ ముందుకు సాగడమే అందరి కర్తవ్యం. 

(ఈనాడు ,సంపాదకీయం , 17:02:2013)
____________________________________ 

Labels: , , , , ,

Tuesday, April 16, 2013

1095- Quotes of Bruce Lee





via facebook
___________________________________________

Labels:

1094- Apology


via facebook
_________________________________________________

Labels:

1093- Teachers

via facebook
_________________________________________________

Labels: , , ,

1092-సమర ధీర



వివిధ భావాల కలబోత వనిత. ఆగ్రహించినా, అనుగ్రహించినా ఆమే. ప్రణయినీ, ప్రళయ రూపిణీ నారీమణే. వెన్నెల కురిపించడమే కాదు, మంట రగిలించడమూ తెలిసినందునే అడివి బాపిరాజు ఉదాహరించినట్టు 'కిన్నెర్లు మీటించి శంఖాలు పూరించి' విలక్షణత చాటుకుంది తరుణి. ఆమె నవ్వితే సన్నజాజుల వాన జల్లు. కోపగిస్తే సాగర ఘోషణ, గగనాంగణ గర్జన. ఆరాధకులమీద కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసిన జగదంబ భవానీదేవే 'గండరగండడౌ మహిషు సర్వము కాలరాచిబ్ర/హ్మాండము దద్దరిల్ల మహా త్రిశూలమున' గుచ్చింది. ఆ జగత్కంటకుడి పీడ వదిలించాలన్న ఆర్తుల ప్రార్థన ఆ జగదేక మాత మదిని కదిలించిన పర్యవసానమే అది. సబలగా ప్రబలగా ఆ అంబిక మోగించిన సమర దుందుభి నభోమండలాన మోగిపోయిందానాడే! నరక సంహారానికి తరలివచ్చిన సాత్రాజితిదీ రౌద్ర రూపమే, భీకర నాదమే. సత్యసంగ్రామం తప్పదంటూ విజృంభించిన ఆ తల్లి ఆ లోక సంక్షేమ నిరోధినీ నిఖిల జీవ విరోధినీ సంహరించింది. గ్రామాల్ని దహించిన, పరకాంతల్ని చెరపట్టిన దురహంకారానికి తగిన శిక్ష అది. ఘటోత్కచుడితో మొదట పోరుకు సిద్ధమైంది సుభద్ర. తనయుడు అభిమన్యుడితో రథప్రయాణం సాగిస్తున్న ఆ నారీమతల్లి వరస తెలియక అడ్డుపడిన ఆ మంత్ర తంత్ర సేనా నేతతో ఒంటరిగానే తలపడింది. మాయావి ధాటికి కన్నకుమారుడు సొక్కి సోలిపోతే తానే ధనుర్బాణాలు ధరించిందామె. కరవాలధారిగా సంగ్రామ రంగాన దూకిన నాగమ్మది సైతం జయ స్ఫూర్తి.

విశాల భారత విమోచన పోరుసీమలోకి సుడిగాలిలా చొరబడిన ఝాన్సీ లక్ష్మీబాయిది పరాయి రాజుల పారదోలి స్వరాజ్యం నిలపాలన్న ఏకైక లక్ష్యం. ఒరలో తుపాకులూ నడుముకు కత్తులూ కట్టుకుని శిరస్త్రాణంతో, ఒళ్లంతా కవచంతో యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన ఆమె చాటిందొక్కటే- విజయం సాధించడం కంటే అందుకు పోరాడటంలోనే బలిమీ తెగువా ఉందని! వీరాంగన రుద్రమదేవిదీ శౌర్య ధైర్యాల గాథ. వీరవిహారం సాగించిన ఆమె అక్కడివారికి ప్రళయకాల మహోగ్ర భానుకిరణం, కల్పాంత కుపిత సాగర తరంగం. 'భండనమున చండప్రచండ మా/ ర్తాండమూర్తులై వెలగండోయ్/ కండకొవ్వుతో దండెత్తిన/ మొండి శిఖండుల చెండాడండోయ్' అంటూ సేనావాహినిని ఉరకలెత్తించిన ధీశాలి, సాహసశీలి ఆమె. శత్రుసేనల్ని తరిమితరిమికొట్టిన ఏకవీరాదేవిదీ సింహనాదమే. ఆ కాకతమ్మ భ్రుకుటిలో భీకర తరంగం, కంఠంలో కరాళ హుంకారం. పోరాటమంటే మాటలా? వీర విజృంభణకు మారుపేరుగా నిలుస్తుంది ధాత్రీతలంలోని పదాతిబలం. రంగత్తరంగ జలధిన సంఘటిత శక్తిగా సాగుతుంది నౌకాదళం. విహాయస వీధిలో మహోజ్జ్వలంగా కొనసాగి సంభ్రమాశ్చర్యాలు రేకెత్తిస్తుంది విమాన సేన. నేరుగా పోరు సాగించకున్నా, ఆ కుతూహల రాగాన్ని ఆలాపించిన స్త్రీలకూ కొదవ లేదు. కురుక్షేత్రానికి ముందు పాండవుల మంత్రాలోచన సందర్భం ఎంతో హృదయోద్వేగం. 'దుష్ట విధ్వంసన మాచరింప విలు దాల్పుడు, నిల్పుడు క్షాత్ర దీపికల్' అంటూ ఉద్బోధ చేస్తుంది పాంచాలి. విజృంభించి విరోధుల్ని నిరోధించాలని కుమారుడు అర్జునుడికి ప్రబోధిస్తుంది కుంతి. మంటలు రేపిన తుంటరుల్ని, చెలువల వలువలూడ్చిన తులువల్ని ఎంతమాత్రమూ మన్నించవద్దంటుంది. విజయశ్రీ కర్త వీక్షించినట్టు 'నరుడవై గాండీవ ధరుడవై నిరంకుశత్వాన్ని నిర్మూలించు' అంటుందా మాతృమూర్తి. మానవత్వాన్ని దోచుకున్న దానవత్వాన్ని ద్వేషించాలనీ, విజ్ఞానాన్ని ప్రదర్శించి అభిజ్ఞానాన్ని అందించాలనీ హనుమకు అమ్మ అంజన మార్గనిర్దేశం. గరుత్మాన్‌కి వినతా మాత సందేశం- చీకటింట స్వేచ్ఛాదీపం వెలిగించాలనే. అశక్తులైన అమరులకు స్వశక్తి అనుగ్రహించాలని, నక్తంచరుల చెర నుంచి అమరావతికి ముక్తి ప్రసాదించాలన్నది కన్నబిడ్డ శక్తిధరుడికి గౌరీ భవాని అనురాగపూర్వక విన్నపం.

ఒకరా ఇద్దరా... ఎందరో రణచరితలు. పతిభిక్ష కోరి యముణ్ని వెంబడించిన సతీ సావిత్రి ఆ దండధర గదాదండం బెండువోయేలా చేసింది. యమ దుర్గ ద్వారాలు బద్దలయ్యేలా, తన సతీ సామర్థ్యం మోత మోగేలా గర్జించిందా పడతి. 'మీర లవక్ర విక్రములు, మీ రణయాత్రలు చిత్రితమ్ములై/ భారత భారతీ కృతులపై నవకాంతి దనర్చు' అంటూ పతి అభిమన్యుణ్ని పద్మవ్యూహానికి సిద్ధపరుస్తుంది ఉత్తర. 'ఎదురొడ్డి నిలవడానికి మీరు జంకితే, నేనే పలనాడు రణాంగణానికి వెళ్తా'నంటూ బాలచంద్రుడికి ధైర్యసాహసాలు నూరిపోస్తుంది వీరపత్ని మాంచాల. శివాజీకి కర్తవ్యబోధ చేసిన తల్లి జిజియా, వీర మాతృపథమే తన ఇష్టార్థ సంసిద్ధి అంటుంది. ఆమె ఆరాధించిందీ జగజ్జనని దుర్గమ్మనే. ధర్మాచరణ దృష్టితో ప్రత్యర్థుల్ని ఎదిరించే యోధాగ్రేసరుల్ని ఏ శక్తీ ఆపలేదు. ముందుకు దూకే ఆ సమర శక్తి సంపన్నత కవి బాలగంగాధర తిలక్‌కి అగుపించినట్టు 'ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు/ సూర్యుడిని చూడు నా తలమీద పువ్వు' అనిపిస్తుంది ఎవరితోనైనా. వాయులీనం పైన కమాను లాంటిది కాలం. పలు రకాల భావాలు కలిగిస్తుంది, విభిన్న అనుభవాల్ని దరికి తెస్తుంది. ప్రతిభ, శక్తి, సామర్థ్యం కలగలిసిన స్థితిలో పురుషులతో ఎందులోనైనా పోటీపడి రాణిస్తున్నారు మహిళామణులు. సమర రంగంలో వనితల ప్రవేశం మీద ఇప్పటిదాకా ఉన్న విధి నిషేధాల్ని పక్కన పెట్టింది అమెరికా. ఇంతవరకూ సేవల రంగానికే పరిమితమైన లలనలు ముందుముందు ఆయుధాలు చేతపట్టి కదనానికి ఇదే అదనంటూ ఇక కదం తొక్కవచ్చు. నారీమణుల రణరంగ ప్రవేశం జయభేరి మోగించడంతో మొదలై, జైత్రయాత్ర సాగించడంతో పూర్తవుతుందన్న మాట. 


(ఈనాడు , సంపాదకీయం ,24:02:2913)
______________________________________

Labels: , ,

1091- What if Branson met Gandhi?

Stephen Manallack

They both used creative symbolism to propel their causes into the Spotlight — Mahatma Gandhiwith his spinning wheel and simple clothing, Sir Richard Branson with balloon flights and other challenges. But what if they met — would they have got on?


Mahatma Gandhi (1869-1948) is regarded in India as the Father of the Nation, leading the campaign for freedom from British rule, and Sir Richard Branson (1950-) is the British founder of the Virgin business empire, also known for humanitarian activism.

The quietly spoken Gandhi opens the discussion by reminding Branson: “The best way to find yourself is to lose yourself in the service of others.” 
Gandhi explains what this means for business: “A customer is the most important visitor on our premises; he is not dependent on us. We are dependent on him. He is not an interruption in our work. He is the purpose of it. He is not an outsider in our business. He is part of it. We are not doing him a favour by serving him. He is doing us a favour by giving us an opportunity to do so.”
Branson is nodding and interjects: “No company can train its front-end people to handle every situation, but you can strive to create an environment in which they feel at ease doing as they would be done by.”
As Gandhi continues with the cotton spinning wheel, Branson enthuses: “…it is necessary to give other people the space to thrive, to catch people doing something right, rather than getting things wrong.” Gandhi is vigorous in agreement: “Freedom is not worth having if it does not include the freedom to make mistakes.”
But what about choosing the right approach to life? Gandhi sets the scene with: “Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.” Branson, the enthusiast, responds: “Look for people who take their roles seriously and lead from the front, but who are not slow to see the lighter side of life.”

A Family
In response to Gandhi’s quizzical look, Branson continues: “A company should genuinely be a family, who achieve together, grow together and laugh together.”
Gandhi reminds his colleague that even in families, disputes can occur and anger can arise. He points out: “The weak can never forgive. Forgiveness is the attribute of the strong.” As Branson nods in agreement, Gandhi continues: “Anger and intolerance are the enemies of correct understanding.”
Branson wants to discuss creativity, leading with: “No one has a monopoly on good ideas or good advice, so as a leader you should always be listening. Be visible, note down what you hear and you’ll be surprised how much you learn.” Gandhi responds with wisdom: “The golden rule is to test everything in the light of reason and experience, no matter from where it comes.”
And leadership? Again, from Branson: “Nobody respects a leader who doesn’t know how to get his hands dirty and innovate personally.” This point of character was so important to Gandhi: “If you have no character to lose, people will have no faith in you”.
Gandhi warms to the theme: “I suppose leadership at one time meant muscles; but today it means getting along with people.” Branson can barely restrain his thoughts: “Having a personality of caring about people is important,” he says. “You can’t be a good leader unless you generally like people. That is how you bring out the best in them.”
But Gandhi wants to move from big picture to the individual, reminding Branson to: “Be the change you want to see in the world”.

Taking Pride
Reflecting on this point, Branson highlights the importance of being proud of what you do: “If you make something you are proud of, that filters down to your staff, as well as your customers.” But Gandhi is more impressed with action than words: “An ounce of practice is worth more than tons of preaching.” He reminds Branson that tolerance is a key human value, explaining that he has “…a tolerance for all faiths”.
Glancing at his enthusiastic visitor, Gandhi cannot resist stirring the pot: “There is enough in this world for everyone’s need, but not enough for everyone’s greed” and explains the real source of a happy life: “Happiness is when what you think, what you say, and what you do are in harmony.”
Branson relishes this shift in the conversation and expands on business in the community: “Take a look around at your community and you will likely see problems that need to be fixed – from reversing environmental degradation to creating local jobs. As an entrepreneur or business leader, you have a role to play in solving those problems.”

Coke deed
Inspired by the great man, Branson sets out a vision: “Coca-Cola sells 1.7 billion drinks every day, from Paris to Mumbai. If a fraction of those consumers were inspired to do something good each time they drank a Coke, the company really would be teaching the world to sing.”
Gandhi almost shudders at the mention of the fizzy western drink, removes his round glasses and his parting words linger in the mind of Branson as he flies home: “The things that will destroy us are: politics without principle; pleasure without conscience; wealth without work; knowledge without character; business without morality; science without humanity; and worship without sacrifice.”

The writer is the author of ‘Soft Skills for a Flat World, combining the best of India and the best of the west’.  
“Anger and intolerance are the enemies of correct understanding.”
(The Hindu, empower, 30:01:2013)
____________________________________________________________

Labels: , , ,

Monday, April 15, 2013

1090- శుభ 'కరం'



జీవ గంధం, భావ బంధం... జీవితమంటే అదే. మనిషి అణువణువునా కణకణానా తొణికిసలాడేది ఆ సుధా మధురిమే. నేల నుంచి నింగి దాకా విస్తరించిన భావనాశక్తితో కరుణశ్రీకి కనిపించినట్టు 'గాలి పటంబు జీవితము, కట్టిన దారము బుద్ధి, పుణ్య పాపాలవి గాలిపాటులు'. వాలుగాలిలో అలవోకగా సాగినా సుడిగాలికి తల్లడిల్లి తూలిపడినా, పతంగు గమనానికి మూలం మానవుల చేతులూ చేతలూ. జీవన రంగంలో మంచికి, చెడుకు అనుక్షణమూ సమరమే. వైరి నామస్మరణనైనా భరించలేని దానవాగ్రణి ఎదుట కన్నకుమారుడు ఆ స్తోత్రమే సాగించాడు! రెండుచేతులూ జోడించి 'కమలాక్షు నర్చించు కరములు కరములు' అనడం తండ్రి మండిపాటుకు మూలకారణం. ప్రహ్లాదకుమారుడి భక్తితత్పరత సహించని తత్వం అతడి మాత్సర్యాన్ని పెంచి చివరికి వినాశనానికే దారితీసింది. లోకకంటకుడి సంహారానికి తరలిన సాత్రాజితి 'సత్య సంగ్రామము తప్పదింక, నరకా! నరకాంతకు దోయిలింపరా' అని చేసిన హుంకారంతో అతడి చేతులకీ వణుకొచ్చింది. తపోదీక్షలోని హరుడు తనను చేరవచ్చిన పర్వతపుత్రి చేతినుంచి శాంతచిత్తంతో పూలూ ఫలాలూ అందుకున్నాడు. అదే సమయంలో తపోభంగానికి పొంచి ఉన్న మరుడు అతి పంతంతో సతి రతీదేవి చేతినుంచి విల్లందుకోవడం, రెండు శక్తుల పోరుకీ ఆరంభం. స్వయంవర సభాస్థలిలో ధనువును ఫెళఫెళ విరిచిన రఘుపతితో సీతాదేవి 'కన్నులు కరములు కలసిన వేళ' ఇతర రాచ వస్తాదుల్లో వెలవెల. పరీక్షించవచ్చిన దివ్యమూర్తి త్రయాన్ని తన వంటింట దోగాడే పసిబిడ్డల్ని చేసి గోరుముద్దలు, గుజ్జనగూళ్లు తినిపించిన సతీ అనసూయది చేతి తాలింపు కమ్మదనం.

పొత్తిళ్ల బిడ్డను పూలగుత్తులమీద పడుకోబెట్టి ఒత్తుకోకుండా చేతితో ఒత్తిచూసింది కుంతీకుమారి. లోకనిందను వూహించనైనా లేని ఆ లలామ తన చిట్టితండ్రిని బజ్జుండబెట్టిన పెట్టెను కంపించే చేతులతో నీటిలోకి వదిలింది. ఏటి కెరటాలలో అది సాగిపోతుంటే, చేతులు చాచి ఆమె చేసిన రోదన హృదయవిదారకమే. నాథుడి ప్రాణాన్ని వెంట తీసుకుపోతున్న యమధర్మరాజును వెంబడించి, పలువిధాలుగా అర్థించి సఫల మనోరథగా నిలిచిన సతీ సావిత్రిదీ విజయహస్తమే. ఇక కవి కృషీవలుడు పోతన చేతిలోది గంటమా, ములుగర్రా? ఆయన అరచేతులు వాచింది గంటపు రాత వల్లనా లేక నాగలి మేడి పట్టి సేద్యం చేసినందునా? అది మెత్తని చేయి, ఆయనది సుతిమెత్తని చిత్తం. అందులోనుంచి అంత సుందర భాగవతం వెలువడిందంటే 'ఎంత బంగారు హస్తమది!' అని కైమోడ్పులందించింది కవి గళం. 'కొసరి చల్దులు మెక్కు పిల్లల వేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు'ను తెలుగువారందరికీ రుచి చూపించిన ఆ కవితామృతకర్తకు జోహారు చేసేందుకే లేస్తాయి అందరి చేతులూ. ముకుళిత హస్తాలతో వందనాలందిస్తూ సాదరంగా ఎదురొచ్చిన అక్రూరుడిని చూసి పులకిస్తాడు కృష్ణుడు.భక్తజన వశంకరుడి కరాన కంకణం, కరతలాన వేణువు. వరాలనిచ్చే గణపతికి కరాలు జోడించి మొక్కుతారు ఆరాధకులు. 'భజించే హస్తాలే హస్తాలు, ఆ కరాలే స్వామి వశీకరాలు' అన్నది రామదాసు అనుభవం. 'శ్రీపతినే పూజించిన కరములు' అన్నమయ్యవి. సీతాసాధ్వి వినిర్మల అంతరంగానికి కళ్లు తడవని వాళ్లుండరు, మొక్కని చేతులూ ఉండవు. మరి కరకమలం సదా ఆనందప్రదమే, కరచాలనం బహుధా శుభదాయకమే. చేతివేళ్లతో సమంత్రంగా చేసేది కరన్యాసమైతే, చిత్తశుద్ధితో సాగించేది కరసేవ. భక్తిశ్రద్ధలతో ముందుకు సాగితే ఎన్ని విద్యలైనా ఎన్నెన్ని శాస్త్రాలైనా కరతలామలకం. చతుష్షష్టి కళల్లోనూ చేతులతో సాగించే చిత్ర, వాద్య ప్రక్రియలకు సమధిక ప్రాధాన్యముంది. వివేక వికాసాలు ప్రసాదించే పుస్తకాలు హస్తభూషణాలు. శుభాలూ సుఖాలూ కలిగించడమన్నది కొందరి హస్తవాసి. రణభూమికి వెళ్లక తనతో సరస సల్లాపాలు సాగిస్తున్న భర్త బాలచంద్రుడితో మాంచాల 'తమరింక చేతులన్ బంగరుగాజులన్ దొడిగి భద్రము గండిట చాటుమాటుగన్' అనడం అతడి కర్తవ్య శూరతను స్ఫురణకు తేవడమే!

రాధామాధవులు ప్రణయమయ నిత్య నూత్నమైన జంట. విహార తీరానికి కాస్తంత ఆలస్యంగా వచ్చిన ఆయన విరిదండ సంకెళ్లు, పూబంతుల తాకిళ్లు కోరితే 'సొక్కిసోలిన నీ మోము చూడగలనె? చేతులెట్లాడు నిన్ను శిక్షింప నాథ' అంటూ బాహువులతో ప్రేమ బంధితుణ్ని చేస్తుందామె. 'చక్కని గోపాలా! చేతికి చిక్కని గోపాలా!' అని మువ్వగోపాలుడితో మురిపాలాడటమూ అనురాగ సూచకమే. చేతులు కలిసిన తరుణంలో ఆనందాల హరివిల్లు వెల్లివిరియదూ? చెంత చేరి చేతులు చాచిన ప్రేయసీ ప్రియుల్లో అపార రసానుభూతి పొంగిపొర్లుతుంది. 'ప్రణమిల్లి యడుగుల బడుటయే కాని/ చేతులారంగ సేవ జేయనేలేదు' అన్న వేంకట పార్వతీశ కవుల భావ గాఢతా ఇక్కడ ఆపాదించదగ్గ సందర్భమే. కరములు కల్యాణ కరములే అయినా చేతులు ముడుచుకోవడం, కట్టేసుకోవడం, దులుపుకోవడం, చేతచిక్కడం, చేజారడం, చేయి విడవడం వంటివీ అనేకమున్నాయి. సుమకోమల హస్తాలే కాదు- భస్మాసుర హస్తాలూ ఉన్నాయి ఇలలో! మానవ పరిణామ చరిత్ర ప్రకారం 'చేతులున్నది పోరాటానికే' అంటోంది అమెరికాలోని యూటో విశ్వవిద్యాలయ అధ్యయన బృందం. పిడికిళ్లు బిగించి యుద్ధం చేసి ఆత్మరక్షణ, శత్రునిర్మూలన సాధించడమే కీలకాంశమంటున్నారీ శాస్త్రవేత్తలు. చేతులంటూ ఉన్నది అందుకు మాత్రమే కాదు, అవి చేసిందీ చేస్తోందీ చేయాల్సిందీ ఎంతెంతో అనుకోవడమే- సకల మానవాళికీ శ్రీకరమూ శుభకరమూ. 


(ఈనాడు , సంపాదకీయం , 20:01:2013)
__________________________________

Labels:

Sunday, April 14, 2013

Colour


via facebook / General Knowledge
____________________________________

Labels: , ,

Relationship



(via facebook / General Knowledge)
_______________________________________________________________

Labels:

Blood group & personality

(via face book / Useful info))
_______________________________________________

Labels: ,