My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, November 29, 2007

ధర్మం-విశ్వకల్యాణం

- ఎమ్‌.నాగేంద్రప్రసాద్‌

'బహుజన హితాయ బహుజన సుఖాయ' అన్నది భారతీయుల ఐక్యభావం. విశ్వకల్యాణానికై తపస్సు చేసి తపోధనులైన వారున్న పుణ్యభూమి ఈ భారతదేశం. లోకకల్యాణాన్ని కోరి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని భారతీయులు జీవనాన్ని గడపాలన్నది మన వేద సారాంశం.

శ్రుతి అంటే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. సమస్త ధర్మాలకు వేదమే మూలం. ఆ వేద ధర్మాన్ని ప్రతిపాదిస్తూ శాసించేది ధర్మశాస్త్రం. జీవితంలో వివిధ దశల్లో ఏ విధంగా వ్యవహరించాలి? సమాజంలోని రకరకాల వ్యక్తులతో ఎలా వ్యవహరించాలన్న ప్రవర్తన నియమావళిని తెలిపేదే స్మృతి. ఈ ధర్మశాస్త్రాలు చాలా ప్రాచీనమైనవి. 'చోదనా లక్షణో అర్థో ధర్మః' అని జైమిని అన్నాడు. ఒక వ్యక్తి చేయవలసిన విధుల్ని బోధించేది ధర్మం. సత్యం, అహింస, దయ, శౌచం వంటివి సామాన్య ధర్మాలు. మానవ సమాజంలోనే విశేష ధర్మాలు రూపొందాయి. సమాజం స్థాణువు కాదు పరిణామ శీలమైనది కాబట్టి ధర్మంలో కాలానుగుణమైన మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ధర్మానికి మూల పదం 'ధృ', ధరించి ఉంచేది ధర్మం. ధర్మమనగా ఆశింపదగిన గమ్యం. ఇది సౌఖ్యాన్ని, బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. భారతీయుని జీవనసరళికి ప్రధానమైనది ధర్మం. సర్వానికి ధర్మమే మూలం. 'యతో అభ్యుదాయ, నిశ్రేయ ససిద్ధిః సధర్మః'. ఏది అభ్యుదయాన్ని, మోక్షాన్ని, సిద్ధింపజేయగలదో అదే ధర్మం.

తిండి, నిద్ర, భయం, మైథునం మనుషులకు పశువులకు సమానమే కాని, వ్యత్యాసం ధర్మవర్తనమే! ధర్మం లేనివాడు పశువుతో సమానమే! ధర్మం చేతనే అర్థకామాలు సంపాదించాలని భారతం చెబుతోంది.

ధర్మమనేది ఒక పెద్ద వటవృక్షం. దాని నీడలో మానవులంతా విశ్రాంతి పొందగలరు. శాంతి, ఆనందాలతో జీవనం సాగించగలరు. ధర్మమనేది దేశ, కాలాలకు బందీకాదు. అది యావత్‌ ప్రపంచానికి వాస్తవమైన దారి చూపగలదు. ఈ సృష్టి అంతా ధర్మం మీదనే ఆధారపడి ఉంది. ధర్మం మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది తప్ప వారిని వేరు చేయదు. మానవత్వం, సమానత్వం, సహనతత్వం, అఖండత్వం ధర్మానికి మూలాధారాలు. జీవితాన్ని జీవింపజేసే కళే ధర్మం. ఆత్మ, పరమాత్మలను కట్టివేసేది, అనుసంధానం చేసేదే ధర్మం. ధర్మానికి పరీక్ష మానవత్వమే!

మన బంధువర్గం, మిత్రబృందం, పదవి-అధికారం, సార్వజన సమ్మానం మరింకేదైనా సరే మనల్ని ఒంటరిగా వదిలేస్తాయి కాని ధర్మం అలా కాదు. మనిషి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నా మనిషితోపాటు వెళ్తుంది ధర్మం. అందువలననే అది మనిషికి నిజమైన తోడు-నీడ. నిజమైన మిత్రుడు, సంబంధి, గురువు కూడా!

ధర్మాన్ని సర్వకాలాల్లో అనుష్టించి ప్రతిష్ఠించడానికే సీతాదేవిని, లక్ష్మణుణ్ని శ్రీరామచంద్రుడు వదిలిపెట్టవలసి వచ్చింది ధర్మం పాటించడానికి. స్వ, పర భేదం లేదని అందరికి ఒకే ధర్మం వర్తిస్తుందని నిరూపించి ధర్మాన్ని ఆయన నిలబెట్టాడు.

లోకంలో ధర్మ ప్రతిష్ఠాపన చేయడానికి శ్రీరామచంద్రుడు మానవరూపం దాల్చాడు. అందుకే రామావతారం మహత్తరమైంది. ధర్మాచరణకు అవకాశం ఉండటం వలననే మానవజన్మ శ్రేష్ఠమైనదని చెబుతారు.

ధర్మం మూలతత్వాన్ని అవగాహన చేసుకుని జీవితానికి కావలసిన సుఖ, శాంతుల్ని తృప్తిని చేకూర్చకొనగలం. అందుకే మనిషికి నిరంతరం తోడుగా నిలిచే ఈ ధర్మాన్ని నిత్యమూ అనుసరిస్తూ సేవించాలి.
(Eenadu, 27:11:2007)
_____________________________

Labels:

Can a woman be called ‘handsome’?

Yes, the word can be used with women as well.

When you call a woman handsome, you are not making fun of her; you are, in fact, paying her a compliment. What you mean is that she is very attractive.

Unlike a woman who is ‘pretty’, a handsome one is not built along very delicate lines. She is somewhat big built and her features are usually large and there is something about her which suggests strength of character. She has a strong dignified appearance. The word is only used with women and not with young girls.

*Revathi is an extremely handsome woman with a very sharp mind."

The word can also be used to refer to objects, such as gardens and buildings. For example, when you say that a building is handsome, what you mean is that it is large and attractive in an impressive sort of way.

S. UPENDRAN upendrankye@gmail.com
(The Hindu, 27:11:2007)
_________________________________

Labels:

Tuesday, November 27, 2007

ఆంగ్లం నేర్వండి ఆకలి తీర్చండి

ఓ చిన్న ఆలోచన...
వేల మంది బతుకులను నిలబెడుతోంది.
అమెరికాలో వచ్చిన ఆలోచన...
ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కడుపులను నింపుతోంది.
ఆ ఆలోచన... ఇంటర్నెట్‌ ముందు కూర్చొని ఆంగ్లపదాలతో
ఆటాడుకొని అన్నం పెట్టడం! ఆకలిచావు... ఈ మాట వినగానే ఒళ్లు జలదరిస్తుంది. ఏమీ చేయలేమా, పరిస్థితిని మార్చలేమా... అన్న ఆలోచనలతో మనసు బరువెక్కుతుంది. ఇది మామూలే. కానీ ఇకముందు అలా బాధపడనక్కర్లేదు. 'నేను సైతం...' అనుకుంటూ ఇంటర్‌నెట్‌ ముందు కూర్చొని
www.freerice.com వెబ్‌సైట్‌ ఓపెన్‌చేసి మీకు ఓపికున్నంతసేపు కూర్చుని సాధ్యమైనంత అన్నం పోగేయండి. దానంతట అదే ఆకలి కడుపులకు చేరిపోతుంది. ఇంటర్నెట్‌కూ అన్నానికీ సంబంధమేమిటా అని ఆశ్చర్యంగా ఉంది కదూ! నెట్‌లో ఏం చేస్తే ఏం ఇబ్బందో అని కంగారుగా కూడా ఉందా? మరేం ఫర్వాలేదు మీరు చేయాల్సిందల్లా ఆంగ్లంతో కాసేపు ఆడుకోవడమే.

ఏమిటీ ఆట
ఈ వెబ్‌సైట్‌ హోమ్‌ పేజీ ఓపెన్‌ చేయగానే ఓ ఆంగ్ల పదం, దాని కింద మరో నాలుగు పదాలు కనిపిస్తాయి. పై పదానికి కిందనున్న నాలుగింటిలో సమాన అర్థాన్నిచ్చే పదం మీద క్లిక్‌ చేయగానే 10 బియ్యపు గింజలు ఒక దగ్గర చేరతాయి. 'ఇంటర్‌నెట్‌లో ఇంగ్లీష్‌ ఆటా. మా ఆంగ్ల భాషా పరిజ్ఞానం అంతంతమాత్రమే' అని వెనకడుగు వేయకండి. స్కూల్‌ పిల్లల నుంచి ఇంగ్లిషు పరిజ్ఞానం బాగా ఉన్నవాళ్ల వరకూ ఆడుకోడానికి వీలున్న ఆట ఇది. వెుదట సాధారణ స్థాయి పదాలతో వెుదలవుతుంది. సమాధానాలు ఇస్తూ పోతుంటే కొత్త ప్రశ్నలు వాటంతట అవే వస్తుంటాయి. వరసగా మూడుసార్లు సరైన జవాబును క్లిక్‌ చేస్తే ప్రశ్నల స్థాయి పెరుగుతుంది. అంటే కాస్త కఠినమైన పదాలకు అర్థాలు కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఒక వేళ సమాధానం తప్పయిందనుకోండి... మరో ప్రశ్న ప్రత్యక్షమవుతుంది. అలా మనకు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవచ్చన్నమాట. దీన్లో వెుత్తం 50 స్థాయులున్నాయి! SAT, GRE, GMAT పరీక్షలు రాసే వారూ, ఉద్యోగులూ, గృహిణులూ, రిటైర్డ్‌ ఉద్యోగులూ... ఇలా అన్ని వర్గాల వారూ ఓ పక్క ఆంగ్లం నేర్చుకుంటూనే తమ పరిధిలో అన్నార్తులకు సాయం చేయెుచ్చు. కరెంటు పోవడం లేదా మరే కారణంతోనైనా సైట్‌ నుంచి బయటకు వచ్చేసినా అప్పటివరకూ పోగు చేసిన బియ్యపు గింజలు సరఫరాకి సిద్ధమయిపోతాయి. ఎన్ని బియ్యపు గింజలు పొందారో ఎప్పటికప్పుడు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అవన్నీ అప్పటికే మీ సర్వర్‌ నుంచి రిజస్టర్‌ అయిఉండటంతో ఆటోమేటిగ్గా చెల్లింపుల లెక్కలోకి వెళ్లిపోతాయి.

ఎవరు చెల్లిస్తారు?
ప్రశ్నలకు జవాబు ఎంపిక చేసేటపుడు వెబ్‌పేజ్‌ అడుగున స్పేస్‌ పొందే ప్రకటనకర్తలు ఆ బియ్యపు గింజలకు అవసరమయ్యే డబ్బు చెల్లిస్తారు. ఆంగ్ల పదజాలాన్ని నేర్పడం, ఆకలి తీర్చడం... ఒకేసారి రెండు లాభాలు కల్పిస్తోన్న ఈ సైట్‌లో ప్రకటనలిచ్చేందుకు ఆపిల్‌, తొషిబా వంటి అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇలా ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంలోనుంచి బియ్యానికి అవసరమయ్యే డబ్బును ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే ప్రపంచ ఆహార పథకం(డబ్ల్యూఎఫ్‌పీ) నిర్వాహకులకు అందిస్తారు.

పది గింజలతో... సాధ్యమే
ఈ ఏడాది అక్టోబరు 7న ప్రారంభమయిన ఈ వెబ్‌సైట్‌ ద్వారా వెుదటిరోజు కేవలం 830 బియ్యపు గింజలు మాత్రమే అందాయి. నెల తిరిగేసరికి లక్ష సరైన క్లిక్కులతో 20 టన్నుల బియ్యం సిద్ధమయ్యాయి. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో వెుదలయినట్టు దీనంతటికీ పునాది పది బియ్యపు గింజలే. అయినా ఇప్పుడు రోజూ 50 వేల మందికి ఆహారం అందుతోంది. అలాంటపుడు ఈ సాయం చిన్నదని ఎలా అనుకోగలం!

ఆలోచన వెనుక...
జాన్‌ బ్రీన్‌ అమెరికా దేశీయుడు... వెబ్‌సైట్ల రూపకల్పన ఇతడి వృత్తి. బ్రీన్‌ ఓసారి ఓ ఆన్‌లైన్‌ గేమ్‌ తయారుచేయాలనుకున్నాడు. ఏదో ఆషామాషీ గేమ్‌లా కాకుండా దానికో ప్రయోజనం కూడా ఉంటే బాగుణ్ననిపించింది బ్రీన్‌కు. తీవ్రంగా ఆలోచిస్తున్న అతడికి ఎదురుగా ఓ కాంపిటీటివ్‌ పరీక్షకు సీరియస్‌గా సిద్ధమవుతోన్న కొడుకు కనిపించాడు. వెంటనే బ్రీన్‌ బుర్రలో ఓ ఆలోచన మెరిసింది. 10 వేల ఆంగ్ల పదాలను తీసుకున్నాడు. 'ఫ్రీరైస్‌' సిద్ధం చేశాడు. 'ఆకలి, పేదరికం... అందోళన కలిగించే అంశాలివి. నేను ఏం చేసినా అది మన ఆందోళననూ వారి ఆకలినీ దూరం చేయాలి. అందుకే ఈ సైట్‌ రూపొందించాను' అంటాడు బ్రీన్‌.
ఒక్క ప్రశ్నకు సరైన సమాధానమిస్తే రెట్టింపు ఆనందం కలుగుతోంది అంటున్నారు నెటిజన్లు. వెుదటిది సరైన జవాబు చెప్పినందుకయితే రెండోది ఆకలి కడుపు నింపినందుకు!
బాగుంది కదూ, ఇంకెందుకు ఆలస్యం. ఫ్రీరైస్‌ రుచి చూడండి మరి.

(Eenadu, 25:11:2007)
______________________________________

ఈ సైట్లో నాకెదురుపడ్డ (మచ్చుకు) కొన్ని ఆంగ్ల పదాలు:-

ineluctable = unavoidable

erumpent = bursting out

simulacrum = image

contrail = aircraft vapour

basinet = medieval helmet

insouciant = carefree

profligate = dissolute

unwonted = rare

styptic = acting to stop bleeding

gnar = growl

concupiscence = passionate desire

conflate = blend

ilex = holly

zax = roofing hatchet

abaca = manila hemp

sidereal = astral

purport = intend

nous = mind

proglottid = tapeworm segment

margay = wildcat

tenebrous = dark

plangent = resounding

oubliette = dungeon

boscage = thicket

pelerine = woman’s cape

nostrum = cure-all

farci = stuffed with meat

durance = imprisonment

canorous = melodious

beatify = make happy

chatoyant = iridescent

meretricious = tawdry

foulard = silk

hebdomadal = weekly

aperient = laxative

remuda = herd of horses

muliebrity = womanhood

faience = earthenware

alidade = surveying instrument

ephemeris = astronomical table

______________________________________

Labels:

Monday, November 26, 2007

ఉన్నతాశయం

ప్రతి మనిషికీ ఒక ఆశయమంటూ ఉండాలి. అది ఉన్నతమైనదై ఉండాలి. అది శరీరానికి రాసుకున్న సుగంధద్రవ్యంలా కృత్రిమమైనది, తెచ్చిపెట్టుకుంటే వచ్చేదిగా కాక, పూవు పుట్టగానే వచ్చే పరిమళంలా సహజసిద్ధమైనదై ఉండాలి. అప్పుడే ఆ ఆశయం సిద్ధిస్తుంది. ఆ విషయంలో విజయం చేకూరుతుంది.

ఒక పిల్లవాడు బడికి వెళ్లే తోవలో ఒక సైనిక శిబిరం ఉంది. అక్కడ సైనికులను, వారి విన్యాసాలను ఆరాధనగా చూసేవాడా పిల్లవాడు. చూసి ముగ్ధుడయ్యేవాడు. ప్రతిరోజూ కాసేపు ఆ సైనికులతో గడిపేవాడు. ఆ పిల్లవాడి తల్లి బడిలో భోజన సమయంలో తినడానికి రకరకాల రుచికరమైన పదార్థాలను తయారుచేసి మూటకట్టి ఇచ్చేది. వాటిని ఆ కుర్రవాడు తీసుకుని వెళ్ళి తాను తినక ఆ సైనికులకిచ్చి బదులుగా వారిదగ్గరుండే దళసరి ముతక రొట్టెల్ని తీసుకుంటూండేవాడు.
అది చూసిన ఒక సైనికుడు ''ఇంత చిన్న కుర్రాడివి. రుచికరమైన పదార్థాలు మానేసి ముతక రొట్టెల్ని ఎలా తినగలుగుతున్నావు? అయినా నీకెందుకీ బాధ? హాయిగా మీ అమ్మ చేసే రుచికరమైన పదార్థాలనే తినవచ్చుకదా?'' అనడిగాడు. దానికా కుర్రవాడు ''నేను పెద్దవాడినయ్యాక సైనికుడిని కావాలనుకుంటున్నాను. ఇప్పుడు రుచికరమైన పదార్థాలు తినడానికి అలవాటుపడితే పెద్దయ్యాక ఆ ముతక రొట్టెల్ని తినలేక సైనికుణ్ని కావాలనే ఆశయాన్నే విడిచిపెట్టే అవకాశం ఉంది. అందుకనే ఇప్పట్నుంచే వీటిని తినడం అలవాటు చేసుకుంటున్నాను'' అన్నాడు. అతడే కాలాంతరంలో తన ఆశయాలను నెరవేర్చుకుని ఐరోపానంతటినీ గడగడలాడించిన ఫ్రాన్స్‌ దేశపు రాజు. అతడి పేరే నెపోలియన్‌. సహజసిద్ధమైన ఇటువంటి ఆశయాలున్నవారే తామనుకున్న స్థానానికెదుగుతారు.

'సింహశ్శిశురపి నిపతతి మదమవిన కపోల భిత్తిషు గజేతు,
ప్రకృతిరియం సత్త్వవతాం నఖలు వయస్తే జసాం హేతుః.
చిన్నదైనప్పటికీ సింహంపిల్ల సింహంపిల్లే. అది పసితనంలో ఉన్నప్పటికీ- మదజలం కారే చెక్కిళ్లతో నిక్కుతున్న ఏనుగు కుంభస్థలాన్ని చీల్చాలన్న కోరికతోనే దాని మీదకు ఎగురుతుంది. అది దాని స్వభావం. ఈ పరాక్రమం, ప్రతాపం అనేవి కొందరికి సహజసిద్ధంగానే వస్తాయి. దీనికి వయస్సుగాని, చిన్న పెద్ద అనే తారతమ్యం గాని ఉండవు.

నేడు పిల్లల ఆశయాలకు వ్యతిరేకంగా ఎందరో తలిదండ్రులు తమ ఆలోచనల్ని, ఆశల్ని వాళ్ళమీద బలవంతంగా రుద్దుతున్నారు. భయానికో, భక్తికో ఎదురు చెప్పలేక ఒప్పుకొన్నా ఆ రంగంలో ప్రవేశించినా దానిపట్ల అనురక్తిలేక శరీరానికి రాసిన పైపూతలాగానే అతి తొందరలో యథాస్థితికి వచ్చి అటూకాక ఇటూకాక చెడిపోతున్నారు.

ఎవరి సహజసిద్ధమైన ఆశయాలతో వారిని ఎదగనిస్తే అదే విజయానికి పునాది అవుతుంది. ఉన్నతమైన ఆశయాలు సహజసిద్ధంగా ఏర్పడాలి. ఒకరిపై ఆపాదించినా, కలిగించాలని చూసినా కుదరదు. సహజసిద్ధంగా ఏర్పడిన ఆ ఉన్నతాశయాలు ఆ వ్యక్తిని కచ్చితంగా ఉన్నతునిగా నిలబెడతాయి. - అయ్యగారి శ్రీనివాసరావు
(Eenadu, 26:11:2007)
__________________________________

Labels: ,

!!!Thank GOD it's Monday "Be Patient..."!!!

This is a true story which happened in the States.

A man came out of his home to admire his new truck. To his puzzlement, his three-year-old son
was happily hammering dents into the shiny paint of the truck. The man ran to his son, knocked him away, and hammered the little boy's hands into pulp as punishment. When the father calmed down, he rushed his son to the hospital.

Although the doctor tried desperately to save the crushed bones, he finally had to amputate the fingers from both the boy's hands. When the boy woke up from the surgery & saw his bandaged stubs, he innocently said, "Daddy, I'm sorry about your truck." Then he asked, "But when are
my fingers going to grow back?"

Many a times, we act in haste and repent in leisure.

Think about this story the next time someone steps on your feet or u wish to take revenge. Think first before u lose your patience/temper with someone u love.

Trucks can be repaired... Broken bones & hurt feelings often can't. Too often we fail to recognize the difference between the person and the performance. We forget that forgiveness is greater than revenge.

People make mistakes. We are allowed to make mistakes. But the actions we take while in a rage will haunt us forever.

Emotional management begins by stopping to act impulsively and starting to think patiently.

Celebrate Life ... Great Week ahead..

(An email forward)
_____________________________________

Labels:

Sunday, November 25, 2007

పుస్తక సమీక్ష

అమూల్యమైన సమాచారం

విస్తృతమైన పరిశోధానానుభవంతో అనేక ప్రాంతాలు తిరిగి దేవదాసీ వ్యవస్థకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించేందుకు జరిగిన ప్రయత్నం ఈ పుస్తకం. ప్రతి మాటా, పేర్కొన్న ప్రతి సందర్భం ప్రత్యక్ష వీక్షణమే అన్న తృప్తిని పాఠకులకు మిగిల్చేందుకు రచయిత్రులు పడ్డ తపన అణువణువునా కన్పిస్తుంది. దేవదాసీల జీవనంలోని చికటికోణాల ఆవిష్కరణ మనసులను ద్రవింపజేస్తుంది. చరిత్రను, ముఖ్యంగా స్త్రీ సంబంధ అంశాలపై నిత్యం కృషి చేసేవారి ఊహకు కూడా అందని విషయాలను ఇందులో చేర్చారు. దేవదాసీల కోణంలో మహిళల లైంగికత్వం మీద ఉండే కంట్రోళ్లను ఛేదించుకుని బయటకు వచ్చేందుకు జరిగిన పోరాటాలను చెప్పారు. వేశ్యలుగా, కులసతులుగా విభజించి వారిని సమాజం ఎలా నిర్వచించిందో చెబుతూ సాహిత్యంలో ఆ అంశం ప్రతిఫలించిన పరిస్థితులను ఉదాహరణలతో వివరించారు. ఆనాటి సాంఘిక, ఆర్థిక, సామాజిక కోణాలను చారిత్రక, మానవశాస్త్ర దృక్పథంతో చెబుతూ, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకోసం సాంఘిక, నైతిక సంస్కరణలు తెచ్చేందుకు ముత్తులక్ష్మీరెడ్డి పడ్డ ఆరాటాన్ని పేర్కొన్నారు. సమగ్రచర్చకు దారులుతెరిచే పుస్తకమిది.

దేవదాసీ వ్యవస్థ
రచన: వకుళాభరణం లలిత, మల్కాపల్లి ప్రమీలారెడ్డి
పేజీలు: 423; వెల: రూ.150/-
ప్రతులకు: అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌,
రోడ్‌ నం.6, ఈస్ట్‌మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌.

- తిరునగరి శ్రీనివాస్‌
__________________________________________
ఉర్దూ చరిత్ర

అత్యంత సన్నిహితమైన ఉర్దూ భాషా సాహిత్యాలను తెలిపే పుస్తకాలు తెలుగులో తక్కువే. అడపాదడపా జరిగిన కృషి అందుబాటులో లేని తరుణంలో సదాశివ 'ఉర్దూ సాహిత్యం' వచ్చింది. ప్రణాళికాబద్ధం కాకపోయినా ఉర్దూ భాషా సాహిత్యాల ఆవిర్భావ వికాసాల వివరాలెన్నో ఉన్నాయి. అమీర్‌ఖుస్రూ నుంచి హైదరాబాదీల వరకు సంప్రదాయం నుంచి ఆధునికం దాకా నవలా కథానికా ఇతర ప్రక్రియల వివరాలతో సహా ఉర్దూ సాహిత్య ప్రపంచాన్ని స్థూలంగా ఆవిష్కరించిన సాహిత్యచరిత్ర గ్రంథమిది. మతాతీతంగా మహత్తు చూపిన నజీర్‌ కవిత్వాన్ని అనువదించినా మీర్జాగాలిబ్‌ గజళ్ల అందచందాలను వివరించినా వెుహమ్మద్‌ ఇక్బాల్‌ను విశ్లేషించినా అధికారంతోపాటు అనునయంతో సదాశివ రచన ఆప్తవాక్యంలా సాగింది. ఉటంకించిన కవిత్వానికి దాదాపు అన్ని చోట్లా తన అనువాదం కూడా యిచ్చి సదాశివ గొప్ప సేవ చేశారు. ముఖ్యంగా సాహిత్యకారులంతా చదవాల్సిన పుస్తకం.

ఉర్దూ సాహిత్యం;
రచన: డా.ఎస్‌.సదాశివ
పేజీలు: 207; వెల: రూ.100/-
ప్రతులకు: తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌, సందేశ్‌భవన్‌
ఛత్తాబజార్‌, హైదరాబాద్‌-2.
- స.నా.మ.
(Eenadu, 25:11:2007)
_________________________________

Labels: ,

ఈరోజు... నవంబరు 25ని- ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ద ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ ఎగైనెస్ట్‌ విమెన్

[ఈరోజు...
నవంబరు 25... స్త్రీల పట్ల హింసను రూపుమాపే దిశగా చైతన్యం తెచ్చేందుకు అంతర్జాతీయంగా ఈరోజు నుంచి పదహారు రోజులపాటు పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. నవంబరు 25 ఎందుకంటే 1961లో ఇదే రోజున డొమినికన్‌ రిపబ్లిక్‌లో రాజకీయ కార్యకర్తలైన ముగ్గురు సోదరీమణులు(మీరాబాల్‌ సిస్టర్స్‌) హత్యకు గురయ్యారు. వారి గౌరవార్థం 1991నుంచీ సెంటర్‌ ఫర్‌ విమెన్స్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సంస్థ నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకూ పదహారు రోజుల పాటు కార్యక్రమాలు (సిక్స్‌టీన్‌ డేస్‌ ఆఫ్‌ యాక్టివిజం) నిర్వహిస్తోంది. 1999 నుంచి ఐక్యరాజ్యసమితి కూడా వీరితో చేరి నవంబరు 25ని ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ద ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ ఎగైనెస్ట్‌ విమెన్‌గా పరిగణిస్తోంది.]

స్త్రీస్వామ్యం:

ఆటవిక సమాజం నుంచి నాగరిక సమాజం ఉద్భవించింది.సంఘ జీవితంలో ఒక్కొక్క మార్పు ఒక కొత్త పరిణామానికి దారి తీసింది.ఏఏ మార్పులన్ని రావటానికి కొన్ని వందలూ వేల సంత్సరాలు పట్టింది.ఇప్పుడు మన నరనరాల్లో జీర్ణించిన నమ్మకాలూ, ఆచారాలూ, అలవాట్లూ పరిశీలిస్తే వీటికి కొన్నివేల సంత్సరాల చరిత్ర ఉంది............

ఆదిమ అటవిక సమాజానికి ముందువున్న సాంఘిక వ్యవస్థ (తల్లీబిడ్డల సంబంధాలు తప్ప మరింకేవి లేవు గనుక) మాతృపరమైనది, తోటలు వేసి పెంచటం, పంటలు కొద్దిగా పండించటం.వ్యవసాయాన్ని కనిపెట్టింది స్త్రీ. స్త్రీ పురుషుల ఆధిక్యతను సాంఘికంగా నిర్ణయించే ఆర్థిక కారణాలు లేకపోయినప్పటికీ సంతానాన్ని పెంచిపెద్దచేయవల్సిన ప్రముఖ బాధ్యత తల్లిది కనుక మాతృమూర్తిగా స్త్రీ గౌరవాన్ని పొందింది. స్వజాత్యాభివృద్దికి ఆమెది కీలక స్థానం. వ్యవసాయం చేసే తెగలలో మాతృస్వామికం ఉండేది. తిరువాంకూరు-కొచ్చిన్ ప్రాంతంలో నాగలికి జోడెద్దులను కట్టి వ్యవసాయం చేయటం ఆలస్యంగా వచ్చింది గనుక ఇక్కడ (నాయర్ కుటుంబాలలో) ఇటీవల వరకు మాతృస్వామికాచారాలు వర్థిల్లాయి. అస్సాములోని ఖాసి తెగలవారు వ్యవసాయంచెస్తారు, వేటాడుతారు, చేపలను పెంచుతారు. వరి ఎక్కువగా పండిస్తారు.కాని వీరికి నాగలితో పొలం దున్నటం తెలవదు. ఈ ఖాసీలది మాతృస్వామిక వ్యవస్థ. మాతృస్వామిక వ్యవస్థలో తల్లి కుటుంబానికి పెద్ద యజమానురాలు, ఆస్తి అంతా ఆవిడదే.తండ్రికి తన పిల్లలపై ఎట్టి అధికారం ఉండదు.పురుషుడు తన తల్లి కుటుంబానికి చెందుతాడు.పురుషుడు సంపాదించేదంతా అతని తల్లివైపువారికే చెందుతుంది.తన భార్య ఇంట్లొ అతను నివసించడు, తినడు.చీకటి పడిన తర్వాత మాత్రం భార్య వద్దకు వెళ్ళి వస్తూ ఉంటాడు.తండ్రి కుటుంబయజమాని అనే పద్దతికి అలవాటు పడిన మనకు మాతృస్వామిక ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.

వేటాడే దశలో ఉన్న తెగలలో పితృస్వామికం ఉండేది.

పశుపాలనచేసే దశలో ఉన్నవారిలో పితృస్వామికం ఉండేది.

పెద్ద ఎత్తున నాగలికి ఎడ్లను కట్టి దున్ని పంటలు పండించే దశకు సమాజంలోని తెగలు వచ్చినప్పుడు, లోహాలు వగైరా కనిపెట్టి పనిముట్లు వాడడం.చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినప్పుడు మళ్ళీ పితృస్వామికం వెలిసింది.

నీలగిరి కొండలలో నివసించే తోడాలు అనే తెగలో ఇప్పటికీ పితృస్వామికం అచ్చు ఆదికాలంనాడు ఎలా ఉండేదొ అలానే ఉంది. తోడాలు వ్యవసాయం చేయక, పశుపోషణ మాత్రమే చేసే మొదటి దశలో ఉన్నారు. పశువులను అరణంగా ఇచ్చి స్త్రీలను కొనుక్కునేవారు.పశువులను ఇచ్చి పుచ్చుకొని అన్ని వ్యాపార వ్యవహారాలను పరిష్కరించుకొనేవారు.

వేదకాలంనాడు పశుపోషణకున్నంత ప్రాముఖ్యం వ్యవసాయానికి లేదు. సాంఘికంగా, ఆర్థికంగా పురుషుని ప్రాబల్యం వేదకాలంలో విస్తరించింది.

అంటే వెనుకబడిన దశలో వున్న తెగలజాతులలొ పితృస్వామికం ఉండేది. అభివృద్ది చెందిన జాతుల తెగల ప్రజలలో మాతౄస్వామికం ఉండేది. స్త్రీ,పురుష సంబంధాలు, వారి వారి ఆధిక్యతలు- ఆ కాలంలోని ఉత్పత్తి విధానాలలోని మార్పుల్ని పురస్కరించుకొని మారుతూ ఉండేవి.


స్త్రీస్వామ్యం అణచివేత:

వేదకాలంనాడు పశుపోషణకున్నంత ప్రాముఖ్యం వ్యవసాయానికి లేదు, లేకపోగా ప్రారంభ దశలో వ్యవసాయవృత్తిని వారు చాల నీచంగా చూసి గర్హించారు. పశుపోషకులైన వేదకాలంనాటి ఆర్యుల దృక్పథం పురుషప్రధానమైనది. మాతృస్వామికాచారాలు గల ఆదిమ, ఆటవిక వ్యవసాయ సమాజాన్ని పితృస్వామికాచారాలుగల ఆర్యుల వైదిక సమాజం ధ్వంసం చేసింది. మెరుగుపడిన ఉత్పత్తి విధానాలు పురుషుల చేతులలోకి వెళ్ళిపోయాయి. పితృస్వామిక వ్యవస్థలో స్త్రీ మొదటిసారి ఆర్థికంగా విలువను కోల్పోయింది. స్త్రీ ప్రాధాన్యం అడుగంటి ఆమెద్వితీయ శ్రేణి పౌరురాలిగా, బానిసలా జీవించే స్థితికి దిగజారిపోయింది. .పశువులతో సమానమైపోయింది.

ఆర్యులు పితృస్వామికాచారాలు కలవారైనప్పటికి వేదకాలం ప్రారంభదశలో స్త్రీల పరిస్థితి మెరుగ్గా ఉండేది. సతీ, బాల్యవివాహాలు లేవు. స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు.

(వేదకాలంలో స్త్రీలు చదువుల్లో ముందున్నారు.గార్గి, మైత్రేయి, సులభ, కాత్యాయని మొదలైనవారు,ధర్మశాస్త్రాలను పుక్కిటపట్టారు.భార్యా, భర్తలు- ఇద్దరూ సమానమే.'సామ్రాజ్ఞి శ్వశురేభవ ' - గౄహిణి గృహానికి సామ్రాజ్ఞి.తైత్తిరీయ సంహితలో పత్నికి గృహం, గృహోపకరణాలపైఅధికారం ఉండేదని చెప్పారు.తల్లి పుట్టింటివారి ధనం కుమార్తెకే చెందుతుంది.అవివాహితకు ఆస్తిలొ నాలుగోభాగం ఇవ్వాలని మనువు చెప్పాడు.స్త్రీ పునర్వివాహానికి వేదకాలంలో అనుమతి ఉంది.'యా పూర్వంపతిం విత్త్వా ద్యానం విందతే వరం '.- పతిని కోల్పోయిన స్త్రీ తనకిష్టమైతే వేరొక పతిని పొందవచ్చు.నారద, వశిష్ట, యాజ్ఞవల్క్య, కాత్యాయన, పరాశర, బోధాయన, శతాపత స్మృతులన్నీ స్త్రీ పునర్వివాహాన్ని సమర్ధించాయి.)

ఆర్యబ్రాహ్మణమతం పితృస్వామికాన్ని బలపర్చటంకోసం స్త్రీల పట్ల చాల కుటిలంగా ప్రవర్తించింది.ఆటవికజాతుల సాంఘిక వ్యవస్థను విచ్చిన్నం చేయటానికి, ఆర్య బ్రాహ్మణమతాన్ని వ్యాపింప చేయటానికి మాతృస్వామికాచారాలు అడ్డుగా నిలిచాయి.సాంఘిక ప్రాధాన్యంకొరకు ఏర్పడిన పోటీలో పురుషులు స్త్రీలను అథ:పాతాళానికి అణచివేశారు. వారి వ్యక్తిత్వాన్ని వేయి నిలువుల గోతిలోవేసి కప్పి ఆ సమాధిపై హిందూ సంస్కృతి పేరిట నగిషీలు చెక్కారు.

మన దేశంలో మాతృస్వామికాచారాలనుండి మళ్ళించడానికి జరిగిన ప్రయత్నాలు విశేషంగా దౌర్జన్యపూరితమైనదని, ప్రపంచచరిత్రలో ఇటువంటి దౌర్జన్యాలు మరెక్కడా జరగలేదని ఎహరన్ ఫిల్స్ అనే పండితుడు అభిప్రాయ పడ్డాడు. పవిత్రమైన భారతదేశంలోస్త్రీని అమానుషంగా హింసించి ఆమెను ఘోరంగా అవమానించడం పరమ సిస్టమాటిగ్గా జరిగింది:-

*పురుషుడికో న్యాయం, స్త్రీకో న్యాయం అవతరించింది.

*సతీసహగమనం పేరిట నిండు ప్రాణాణ్ణి బలవంతంగా చచ్చిన మగవానితో కలిపి కాల్చి పారేసారు.

*పురుషాధిక్యతను చాటి చెప్పుకోడానికి పతి భక్తి సూత్రాన్ని పాతివ్రత్య ధర్మాలు కనిపెట్టారు.మాతృస్వామిక సామాజిక వ్యవస్థపై, ఆచారాలపై ఈ పతిభక్తి సూత్రంతో మొదటి దెబ్బ తీసారు.భర్తే దైవమని ఆమె వ్యక్తిత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేసి బానిసను చేసేసారు. పాతివ్రత్యంతోబాటు వ్యభిచారం కూడా పుట్టింది.

*బాల్యవివాహాల ద్వారా ముక్కుపచ్చలారని పసిపిల్లలకు వివావాహాలు చేసి వారికి ప్రాయం రాకముందే దురదృష్టవశాత్తు భర్త పోతే విధవలను చేసి బుర్రగొరిగించి అర్ధాకలితో మాడ్చి చంపేవారు.

*స్త్రీకి పునర్వివాహం పనికి రాదు.పురుషుడు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు.పతిభక్తితో పాటు వైధవ్యం కూడా వచ్చిచేరి స్త్రీల జీవితాలను దు:ఖ మయం చేసి పారేసాయి.

*పురుషుడు వ్యభిచరిస్తే అది అతని రసికత.స్త్రీ చేస్తే పొరబాటు.ఆమె పతిత, భ్రష్ట.

*సాంఘికన్యాయమనేది మంట కలిసి పోయింది.స్త్రీలు నిలుచుంటే తప్పు, కూచుంటే తప్పు.ఎవిరితోనైనా మాట్లాడితే తప్పు.నవ్వితే తప్పు. ఆవిడ బతకడమే తప్పు.

ఇంత హీన స్థితికిమతం పేరు చెప్పి,,ధర్మాలు వల్లించి, ,స్త్రీని దిగజార్చిన ఈ పితృస్వామిక వ్యవస్థ స్త్రీని గౌరవిస్తున్నట్లు నటిస్తుంది.అంతా భూటకం.


ఒక చెంపను స్త్రీని పాతివ్రత్య బంధాలతో కట్టిపడేసిన సమాజం వ్యాపారానికి ఆమె ప్రతి అవయవాన్ని వినియోగించుకొనటానికి సిద్ధమే! సిమెంటు బస్తాలు అమ్మటానికి, బీడీలు కొనమని చెప్పటానికి, ఫలాని వస్తువు వాడండి అని ప్రచారం చేయటానికి, వ్యాపారంలో ఆడదాని రికమండేషను కావాలి. ఆధునిక సమాజంలో స్త్రీ కేవలం ఒక భోగవస్తువుగా మారిపోయింది.


ఈ ప్రపంచం మగవారి ప్రపంచం:

స్త్రీ పురుషజాతులు ఒకరికొకరు విరోధులు కాకపోయినప్పటికీ, ఒకరు రెండవ వారికంటె అన్నివిధాలా తక్కువగా జీవించవలసి ఉన్నది. కొన్నివేల సంత్సరాలనుండీ ఈ ప్రపంచం పితృస్వామిక పద్ధతి జీవనానికి అలవాటు పడిపోయింది. దీనిని మార్చటమంటే ఒక పెద్ద విప్లవాన్ని ఆహ్వానించటమే! "స్త్రీకి సమానత్వం- స్వేచ్చ" అనే వాదనలను మనం తరుచుగా వింటూ ఉంటాము. పితృస్వామిక సమాజం స్త్రీకి ఎటువంటి స్థానం ఇవ్వదల్చుకొంటే అదేవారికి ప్రాప్తం! వారు కోరుతున్నది మరికాస్త దయగా చూడమని మాత్రమే! సాంఘిక న్యాయం స్త్రీపట్ల మొగ్గు చూపే విధంగా సంస్కరణలు జరగాలి.

[ఇది పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి "గౌరి" (హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1983) నుండి ఎత్తి రాయబడింది]

ఇటువంటి పితృస్వామిక సమాజం ద్వితీయ శ్రేణి పౌరురాలైన స్త్రీకి ఎటువంటి స్థానం ఇవ్వదల్చుకొంటే అదేవారికి ప్రాప్తం! కాబట్టి రాజరామమోహనరాయ్, కందుకూరివేఏరేశలింగం పంతులు,వెంకటరత్నం నాయుడు లాంటి మహాపురుషులే ముందుకొచ్చి స్త్రీలసంక్షేమానికి, సంస్కరణల బాటను వేసారు. సతీసహగమనం నిషేధించడం, వితంతూద్ధరణం,కన్యాశుల్కానికి ఎదురుగా, స్త్రీవిద్యాభివృద్ధికి, కళావంతుల సంస్కరణలకు పాటుబడ్డారు .అదేకోవలో చలం, మన సాహిత్యాన్ని, సంఘాన్ని ఆధునీకరించే ఉద్యమంలొ ముందు నిలిచి, సనాతన విశ్వాసాలపై ద్వజమెత్తి స్త్రీలకు సమాన ప్రతిపత్తి సాధించడానికి తన కలాన్ని ఉపయోగించారు. ఏవరేమన్నా, చలం తన రచనలతొ సంఘాన్ని ఓ గిల్లు గిల్లి, ఓ కుదుపు కుదిపి స్త్రీస్వాతంత్ర్యావశ్యకతను ఎలుగెత్తి చాటారు!

___________________________________________

Labels:

వాసనాత్రయం

- ఎర్రాప్రగడ రామకృష్ణ
జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది జ్ఞానా దేవతు కైవల్యమ్‌ అని శ్రుతులు చెప్పాయి. కనుక మన పెద్దలు జ్ఞానాన్ని మోక్ష సాధనంగా భావన చేశారు. మోక్షాన్ని సాధించే నిమిత్తం జ్ఞానాన్ని అలవరచుకొమ్మని బోధించారు. అదెలాగో కూడా ఎన్నో రకాలుగా వివరించారు. జ్ఞాన సాధనకు ఆటంకంగా నిలుస్తున్నవాటిని గుర్తించి, ఆ అడ్డంకుల విషయంలో జాగరూకత వహించవలసిందిగా చెప్పారు. అలాంటివాటిలో వాసనాత్రయం ముఖ్యమైనది. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అనే మూడింటివల్ల బ్రహ్మజ్ఞానం (విశ్వనాథ సత్యనారాయణ మాటల్లో అచ్చ తెలివి) మనిషికి దక్కకుండా పోతోందని హెచ్చరించారు.
లోకవాసన యాజస్తోః శాస్త్రవాసయా నచ
దేహవాసన యా జ్ఞానం యదావన్నైవ జాయతే
అని చెప్పిన ఉపనిషత్తును 'ముక్తి'కోపనిషత్తుగా సంభావించారు.

వాసనాత్రయంలో మొదటిది లోకవాసన. తన ఘనతను ఈ లోకం సరిగ్గా గుర్తించడంలేదని మథనపడుతూ, గుర్తింపు కోసం ఆరాటపడుతూ, ఈ లోకం పట్ల లోకంలోని వివిధ వస్తువుల పట్ల ఆకర్షణ పెంచుకుంటూ, అవన్నీ శాశ్వతాలని భ్రమిస్తూ, పోయేటప్పుడు అవన్నీ తన వెంట వస్తాయని నమ్ముతూ, అజ్ఞానంలో కూరుకుపోవడాన్ని- లోకవాసనగా మనం చెప్పుకోవచ్చు. ఇది జ్ఞానసాధనకు తీవ్రమైన ఆటంకంగా నిలుస్తుంది.

రెండోది శాస్త్రవాసన. శాస్త్ర పరిజ్ఞానం పట్ల విపరీతమైన మోజు పెంచుకుని తాను గొప్ప పండితుణ్నని విర్రవీగే మనిషి బలహీనతను శాస్త్రవాసనగా చెప్పారు. తర్కమూ, వాదన వంటి వాటిపట్ల ఇష్టం పెంచుకుని తన పాండిత్యంతో వాక్చాతుర్యంతో అవతలివాణ్ని ఓడించాలన్న తహతహ కలిగినవారంతా ఈ కోవలోకి వస్తారు. అసలైన జ్ఞానం సిద్ధించేవరకూ ఈ వ్యామోహం మనిషిని విడిచిపెట్టదు. అలాంటి నిజమైన స్థితి కలిగాకే, అంతవరకూ తన వివేకమూ జ్ఞానమూ- విషయ పరిజ్ఞానమనే చెత్తలో కూరుకుపోయాయనే సత్యం బోధపడుతుంది. ఫలితంగా మౌనం పట్ల ప్రీతి ఏర్పడుతుంది. జ్ఞానులు ఎక్కువ మంది మౌనులుకావడంలోని రహస్యమిదే!

ఇక మూడవది దేహవాసన. తన దేహంపై మనిషికి ఉండే మమకారం ఇంతా అంతా కాదు. శరీరం అనిత్యమన్న సత్యం మరిచిపోయి, దాని పోషణ విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. దాన్ని నిత్యమూ అలంకరించుకుని మురిసిపోతాడు. తన దేహాన్నే 'తాను'గా భ్రాంతిపడతాడు. దీన్నే దేహవాసన అన్నారు. నిజానికి మనిషి దేహం సజీవంగా కళకళలాడుతోందంటే- దానికి శివుడు కారణమని చెబుతారు. శివుడు శరీరంలో ఉన్నంతవరకే- దాన్ని ఎన్నిరకాలుగా అలంకరించినా, ప్రపంచ సుందరి వంటి గొప్ప గొప్ప బిరుదులు తగిలించినా! ఒక్కసారి ఆ దేహంలోంచి శివుడు తప్పుకొంటే- ఇక ఎప్పుడు దాన్ని తగలబెడదామా అని చూస్తారంతా! కనుక దేహాన్నికాక శివుణ్ని ధ్యానించమన్నారు. 'ధీ' అంటే బుద్ధి. 'యానం' అంటే ప్రయాణం. బుద్ధితో కలిసిచేసే ప్రయాణమే ధ్యానం. తద్వారా ధ్యానసిద్ధి కలిగి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. జన్మమృత్యురాహిత్య స్థితి కలుగుతుంది. అదే మోక్షం!

జన్మకు కారణం కాముడు (మన్మథుడు), మృత్యువుకు కారణం కాలుడు (యముడు). వీరిద్దరూ శివుడి చేతిలో హతమయ్యారని పురాణగాథ. శివధ్యానంతో ఆ రెండూ దూరమై మోక్షప్రాప్తి కలుగుతుందని ఆ కథకు అర్థం. వాసనాత్రయం నుంచి దూరమైతే జ్ఞానసిద్ధికీ మోక్షప్రాప్తికీ మార్గం సుగమం అవుతుందని సారాంశం.
(Eenadu, 25:11:2007)
____________________________________

Labels: ,

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

ఏటీఏంలలో నెలకు ఆరు లావాదేవీల ఉచితమట. పరిమితి దాటితే రుసుము చెల్లించాల్సిందేనట. ఇదెక్కడి ఫిటింగ్‌ సార్‌?

'ఆరే'సుకోబోయి ఏడేసుకున్నాను హరీ అంటే ఇదే మరి. ఇప్పుడు నడుస్తున్నది బ్యాం'కింగ్‌'ల రాజ్యం. మర్చిపోకండి. ఆమాత్రం 'ఫిటింగ్‌'లు ఉండకపోతే ఎలా?
__________________________________
బట్టల సబ్బుల ప్రకటనల్లో తెల్ల బట్టలే వాడతారెందుకు?

జాగ్రత్త! గట్టిగా అనకండి... 'రంగు పడుద్ది'
________________________________________
తలాతోకా లేకుండా వ్యాపారం చేయొచ్చా?

తల లేకపోయినా ఫర్వాలేదేమో గాని తోక మాత్రం కంపల్సరీ.
_________________________________
వ్యాపారంలో అదృష్టాన్ని నమ్ముకోవాలా? దురదృష్టాన్ని తిట్టిపోయాలా?

అదృష్టాన్ని 'అమ్ముకోవాలి'!
_______________________________


మనిషి కోతి నుంచి పుట్టాడన్న డార్విన్‌ సిద్ధాంతాన్ని నమ్మవచ్చంటారా?

ఎవరికి వాళ్లు అద్దంలో చూసుకుని నిర్ణయించుకోవాల్సిందే.
____________________________
నిన్న సైకిల్‌ మీద తిరిగిన నాయకుడు ఇవాళ ఏసీ కార్లలో తిరుగుతున్నాడు. ఏ వ్యాపారం చేసి పైకొచ్చాడో వూహించగలరా?

ఈమాత్రం దానికి ఊహించడం ఎందుకు? 'గాలి'కొట్టు శుభవేళ... మెడలో రత్నాల మాల...
_________________________________
ఎవరూ ధరించలేని వస్త్రాలు?

మీరు కట్టుకుని వదిలేసినవే!
______________________________
రాజకీయమే మంచి వ్యాపారమంటాను. మీరేమంటారు?

'ముంచు' వ్యాపారం అంటాను.
_____________________________
సీఎం, మాజీ సీఎంల 'అక్రమారోపణల'పై మీరే విచారణ జరపాల్సి వస్తే?

ఎవరు ఎక్కువ ముట్టజెబుతారో చూశాకే రిపోర్టు ఇస్తా.
______________________________
(Eenadu, 25:11:2007)
______________________________

Labels:

శేష ప్రశ్న


జననీ జన్మభూమి- అన్నారు. కన్నతల్లి మీదా ఉన్న వూరుపైనా ప్రేమాభిమానాలు ప్రతివారికీ ఉంటాయి. ఏ దేశంవారికి ఆ దేశమే ప్రపంచంలోకెల్లా గొప్పదనే అభిప్రాయం ఉంటుంది. ''సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక, ఓడల జండాలు ఆడునందాక, అందాకగల ఈ యనంత భూతలిని మనభూమివంటి చల్లని తల్లిలేదు'' అన్నారు రాయప్రోలు. రెండు దేశాలవారు ఒకచోట తారసపడ్డప్పుడు ఎవరికివారే తమదేశం గొప్పదని అవతలివారికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఓ ఇజననీ జన్మభూమి- అన్నారు. కన్నతల్లి మీదా ఉన్న వూరుపైనా ప్రేమాభిమానాలు ప్రతివారికీ ఉంటాయి. ఏ దేశంవారికి ఆ దేశమే ప్రపంచంలోకెల్లా గొప్పదనే అభిప్రాయం ఉంటుంది. ''సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక, ఓడల జండాలు ఆడునందాక, అందాకగల ఈ యనంత భూతలిని మనభూమివంటి చల్లని తల్లిలేదు'' అన్నారు రాయప్రోలు. రెండు దేశాలవారు ఒకచోట తారసపడ్డప్పుడు ఎవరికివారే తమదేశం గొప్పదని అవతలివారికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంటారు. ఓ ఇంగ్లిషాయన, అమెరికా పెద్దమనిషీ అనుకోకుండా ఒకచోట కలిశారు. ఇద్దరికీ ప్రపంచం మొత్తంమీద తమదేశమే గొప్పదనే అభిప్రాయం గాఢంగా ఉంది. ఆ విషయాన్ని అమెరికా పెద్దమనిషి తన మాటలద్వారా బయటపెట్టేశాడు. ఇంగ్లిషాయన బదులు చెప్పలేదు. ఒక్కమాట మాట్లాడకుండా నవ్వి వూరుకున్నాడు. ఆయనకు ఇంగ్లాండే గొప్పదేశమని ప్రపంచమంతటికీ తెలుసని గట్టినమ్మకం. ''దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనాను ఒక మేల్‌ కూర్చి జనులకు చూపవోయి'' అన్నారు మహాకవి. తన దేశభక్తిని గురించి పదేపదే చెప్పుకొనేకంటే తన దేశప్రజలకు మంచిని చేకూర్చే ఒక పనిని చేయటమే అసలైన దేశభక్తికి చిహ్నమంటారు. ముగ్గురు చైనా యువకులు తాము అంతరిక్షంలో షికారుచేసి వచ్చామని గొప్పలు చెప్పటం ప్రారంభించారు. ఆ మాటలు విన్న ఓ రష్యన్‌ పెద్దమనిషి- ''అదెలా సాధ్యమయ్యా? మీ దేశంలో రాకెట్లు లేవు అంతరిక్ష నౌకలు లేవు అటువంటప్పుడు మీరెలా అంతరిక్షంలోకి వెళ్ళారు?'' అని అడిగాడు. ''అవన్నీ మాకెందుకయ్యా. మా దేశస్థులంతా ఒకచోట కదలకుండా నుంచోగా ఒకరి భుజాలపై మరొకరం ఎక్కాం. అందరికంటే పైనున్న మేం ముగ్గురం అంతరిక్షంలో అడుగుపెట్టేశాం-'' అన్నారువాళ్లు!

''ఎక్కడివాడో యక్షతనయేందు జయంత వసంతకంతులన్‌ జక్కదనంబునన్‌ గెలువ జాలెడువాడు'' అంటూ నిర్మానుష్యమైన మంచుకొండలపై ప్రవరాఖ్యుడు కనపడినప్పుడు గంధర్వకన్య వరూధిని ఆశ్చర్యపోతుంది. పరదేశులు అకస్మాత్తుగా కనపడినప్పుడు ఆ విధమైన ఆశ్చర్యం కలగటం సహజమే. ఒక దేశం వారికీ మరొక దేశం వారికీ మధ్య అంతరాలు చాలా ఉంటాయి. ఆచారాలు, ఆకారాలు, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. పాతాళంలో ఉండే నాగలోకానికి చెందిన ఉలూచి అనే నాగకన్యక భూలోకానికి వచ్చి గంగానది ఒడ్డున జపం చేసుకుంటున్న అర్జునుని చూసి మోహించి మాయాబలంతో తన నగరానికి తీసుకుపోతుంది. తరవాత కళ్ళు తెరిచిన అర్జునుడు చుట్టూ చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఉలూచే- ''యో మదవతీ నవమన్మథ, ఈ జగంబు పాతాళము, నేనులూచి యనుదాన, భుజంగమరాజ కన్యకన్‌'' అంటూ తననూ పరిసరాలనూ పరిచయం చేస్తుంది. ఆపై ఉలూచి అర్జునుల పరిణయం జరిగి ఇలావంతుడు అనే కుమారుడు జన్మిస్తాడు. మానవ మాత్రుడికి, నాగకన్యకకు పుట్టిన ఆ బాలుడు ఏ జాతికి చెందినవాడు అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అర్జునుడు ఆ కుమారుణ్ని తల్లిదగ్గరే నాగలోకంలోనే వదిలి భూలోకానికి వెళ్ళిపోవటంతో అటువంటి సందేహాల సమస్యలు ఏర్పడలేదు. శాస్త్రవిజ్ఞానం అద్భుతంగా పెరిగిన ఈ రోజుల్లో మాత్రం అటువంటి సందేహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

''మీది రాజమహేంద్రవరం షండీ చెప్పారు కారు-'' అంటూ అప్పటివరకు గిరీశాన్ని చూసి ధుమధుమలాడిన అగ్నిహోత్రావధాన్లు. ఆ తరవాత ఎక్కడలేని ఆప్యాయతా ఒలకబోస్తాడు. ఒక ప్రాంతం లేదా ఒక వూరికి చెందినవారికి అదే ప్రాంతం లేదా అదే వూరికి చెందిన వారిపై ప్రత్యేక అభిమానం ఉండటం వింతకాదు. ఈ విషయం దేశాలకూ వర్తిస్తుంది. ''ఏ పూర్వపుణ్యమో ఏయోగ బలమొ జనియించినాడనీ స్వర్గఖండమున'' అంటూ భరత భూమిలో పుట్టినవారిని ప్రస్తుతించారు కవి. శాస్త్రవిజ్ఞానం బహుముఖాలుగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనుషులు చంద్రలోక విహారాలుచేసి వస్తున్నారు. ఇతర గ్రహాల్లోకి అడుగు పెడుతున్నారు. జాతీయత అన్నది పుట్టిన స్థలంపై ఆధారపడి ఉంటుంది. చంద్రునిపై జన్మించినవారి జాతీయతను నిర్ధారించటం ఎలా అనే మహత్తర సందేహం ప్రస్తుతం శాస్త్రజ్ఞులను కలవరపెడుతోంది. 1967వ సంవత్సరంలో కుదుర్చుకున్న అంతరిక్ష ఒప్పందం ప్రకారం చంద్రుణ్ని ఎవరూ తమ దేశానికే చెందిన గ్రహంగా పరిగణించే వీలులేదు. ఇతర గ్రహాలకు చెందిన ప్రాంతాన్నీ ఏ దేశంవారూ తమకే చెందిన ప్రాంతంగా అనుకొనే వీలులేదు. ఇతర గ్రహాల్లో మనుషులు స్థావరాలు ఏర్పాటు చేసుకొని పిల్లాపాపలను కనే రోజులు ఇప్పట్లో సాధ్యం కాకపోయినప్పటికీ అందుకు సంబంధించిన అనేక సందేహాలు మాత్రం శాస్త్రజ్ఞులను వేధిస్తున్నాయి. ఇటీవల వియన్నాలో జరిగిన అంతరిక్ష శాస్త్రజ్ఞుల సదస్సులో ఈ విషయమై చర్చలు జరిగాయి. ఒక అంగీకారానికి మాత్రం శాస్త్రవేత్తలు రాలేకపోయారు. ఇతర గ్రహాలపై జన్మించిన మనుషుల జాతీయత శేషప్రశ్నగానే మిగిలిపోతుందా అన్న సందేహం కలుగుతోంది. దీన్ని ఎప్పటికైనా అంతరిక్ష శాస్త్రవేత్తలే తీర్చాలి!
(Eenadu,25:11:2007)
_____________________________

Labels: