My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, March 22, 2008

మాఫీచేసి చూడు

- శంకరనారాయణ
'అప్పిచ్చువాడు' పద్యం రాసిన కవి ఎంత గొప్పవాడు! ప్రజాస్వామ్య మూలతత్వం ఆమూలాగ్రం తెలిసినవాడు!! 'రుణానుబంధ రూపేణా' అనేది ఛాదస్తం కాదని, వేదాంతం అంతకన్నా కాదని 'రుణరంగం'లో 'సొమ్ములు తిరిగిన' మేధావులు (సన్నాయి) నొక్కి వక్కాణించే విషయం! 'ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ' అని పాట పాడినవాడు అమాయకుడు. తాను చేసిన రుణాలను మాఫీ చేయాలని అడిగి ఉంటే అతడి తెలివి తేటలకు తగినంత ఫలితం దక్కేది.

ఎప్పటికయ్యెది ప్రస్తుతమప్పటికా 'మూటలు' ఆడడంలో అధికారపక్షం వారు అందె వేసిన 'చెయ్యి'. ఎన్నికలకు ముందూ వెనకా వారి నటనా వైభవాన్ని బేరీజు వేసి చూస్తే 'మూక' మీద వేలు వేసుకోక తప్పదు. ఎన్నికల ముందు జనాభిప్రాయానికి పెద్దపీట వేస్తున్నట్టు గద్దె ఎక్కాక ఖజానాభిప్రాయానికి కంకణం కట్టుకున్నట్టు ఎటువంటి ముస్తాబు లేకపోయినా 'హవా'భావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగలరు. అప్పటి ఇందిరాగాంధీ హయాంలో రుణమేళాల పేరుతో 'రుణభేరి' మోగించినా, ఇప్పటి సోనియాగాంధీ జమానాలో 'మాఫీ వేదాంతం నూరిపోసినా నేపథ్య సంగీతమంతా 'ఓటు వాకా సాగరోరన్నదే'! అంత మాత్రాన పాలకపార్టీ వారికి ఆదా సంగతి తెలియదని అపార్థం చేసుకోకూడదు. రైతులు తాము మద్యం తాగడం మానేసి, అందువల్ల మిగిలే డబ్బుతో విద్యుత్‌ మీటర్లు బిగించుకోవచ్చునని కొంతకాలం క్రితం ఓ అమాత్యవర్యుడు అన్నాడు. ఇటువంటివన్నీ ఎన్నికలయ్యాక 'అవసరం' తీరాక రాజకీయ వెండి తెరమీద కనిపించిన విశేషాలు. అధినాయకులు అకస్మాత్తుగా మాఫీ మంత్రం అందుకున్నంత మాత్రాన వారు సర్కారు సొమ్ము దుబారా చేస్తున్నారనుకోవడం పొరపాటు. ప్రజాధనాన్ని దానం చేయడంలో కర్ణులని అనకూడదు. ఎప్పుడు డబ్బు ఎవరికోసం ఖర్చు పెట్టాలో వారికి ఎన్నికలతో పెట్టిన విద్య. వారు తలుచుకుంటే విద్యార్థుల ఫీజుల్ని కూడా మాఫీ చేయవచ్చు. కానీ పాలకులు అమాయకులు కాదు. విద్యార్థుల ఫీజుల్ని మాఫీ చేయడానికి ఆ అర్భకులకు ఓట్లు ఎక్కడున్నాయి? 'ప్రజాసేవ అన్నది ఓట్లు ఉన్న వాళ్లకోసమే గానీ ఓట్లు లేనివాళ్ల కోసం కాదు!' అన్నది నాయక పండితాభిప్రాయం.

'ఉచిత' విద్యుత్తుతో సహా ప్రభువులు దేనినీ 'ఉచితం'గా ఇవ్వడం లేదు. వారి జనస్వామ్యమంతా 'ఇచ్చిపుచ్చుకునే' ధోరణితోనే సాగుతోంది! ఎన్నికల ముందు తప్ప మన అధికార పక్ష నేతలకు కారుణ్యం ఉండదా? అని ప్రశ్నించుకోవచ్చు. దానికి తిరుగులేని జవాబు ఉంది. 'ఎంత దయో దోషులపై' అనే విమర్శ నేతల మీద ఉంది. వారి మీద ఎన్ని మాఫీలు చేశారు. కబ్జాలు చేసి భూమాతను 'అడుగు' అడుగునా సేవించుకున్న మహా 'పరుషులకు' ఎన్ని మాఫీలు ప్రసాదించలేదు? చెబితే శానా ఉంది, వింటే ఇంకా ఉంది అనిపించేంత 'వీర' గాథలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టుల్లో 'పారుతున్న' అవినీతి గలగలల విషయంలో ఎందరి తప్పులు మాఫీ కాలేదు! ఎన్నికల ముందు జనం నాయకులకు దేవతల్లాగా కనిపిస్తారు. తీరా ఆ ముచ్చట తీరాక నాయకులు జనానికి దేవతల్లాగా కనబడతారు. ఎంత ఓటుకు అంత గాలి! దేవుడికి నైవేద్యం పెడతాం. దాన్నేమయినా దేవుడు తింటున్నాడా? అలాగే ప్రజాస్వామ్య దేవతలకు నైవేద్యం పెట్టింది ఎన్నికలయ్యాక దానంతట అదే తిరిగి వస్తుంది! రుణాల మాఫీ చేసిన నాయకులు జనం నుంచి ఏమి కోరుకుంటున్నారన్నదే ప్రశ్న. రుణాల మాఫీ చేసి నాయకులు కోరుకునేది తమ 'దారుణాల మాఫీ'! హరియను రెండక్షరములు పాపాలను హరియించినా, హరియించపోయినా, మాఫీ అను రెండక్షరాలు తమ పాపాలను హరియిస్తాయన్నది మన నాయకుల నమ్మకం. ఎవరి నమ్మకానికి ఎంత అమ్మకం ఉందో రాగల ఎన్నికలకే ఎరుక!

రుణం లేకపోతే మాఫీ చేయలేం. మాఫీ చేయకపోతే ప్రజాసేవలేదు! అందువల్ల ప్రజాస్వామ్యానికి మూలం రుణమే అని ఏ గిరీశం అన్నా కాదనగలమా?

(Eenadu, 19:03:2008)

Labels:

Just joking -Getting Even

The nasty man gave his now ex-wife just 3 days to move out. She spent the first day packing her belongings into boxes, crates, and suitcases. On the second day, she had the movers come and collect her things. On the third day, she sat down for the last time at their beautiful dining room table by candlelight, put on some soft music, and feasted on a pound of shrimp, a jar of caviar, and a bottle of Chardonnay. When she had finished, she went into each and every room and deposited a few half-eaten shrimp shells dipped in caviar, into the hollow of the curtain rods. She then cleaned up the kitchen and left.

When her husband returned with his new girlfriend, all was bliss for the first few days. Then slowly the house began to smell. They tried everything; cleaning and mopping and airing the place out. Vents were checked for dead rodents, carpets were steamed cleaned. Air fresheners were hung everywhere. Exterminators were brought in to set off gas canisters, during which they had to move out for a few days, and in the end they even paid for to replace the expensive wool carpeting.

Nothing worked. People stopped coming over to visit ... repairmen refused to work in the house ... the maid quit ... Finally, they could not take the stench any longer and decided to move. A month later, even though they had cut their price in half, they could not find a buyer for their stinky house. Word got out, and eventually even the local realtors refused to return their calls. Finally they had to borrow a large sum of money from the bank to purchase a new place.

The ex-wife called the man, and asked how things were going. He told her the saga of the rotting house. She listened politely, and said that she missed her old home terribly and would be willing to reduce her divorce settlement in exchange for getting the house back ... knowing his ex-wife had no idea how bad the smell was, he agreed to the price that was about 1/10th of what the house had been worth ... but only if she were to sign the papers that very day. She agreed, and within the hour, his lawyer delivered the paperwork.

A week later, the man and his new girlfriend stood smirking as they watched the moving company pack everything to take to their new home ... including the curtain rods.

(Source: The Internet)
(The Hindu, Metro Plus, Chennai, 04:03:2008)
===============================

Labels:

Thursday, March 20, 2008

హేమలతా లవణం మృతి




విజయవాడ, న్యూస్‌టుడే:
ప్రముఖ కవి గుఱ్ఱం జాషువా కుమార్తె హేమలతా లవణం(76) గత కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం 3-50 నిమిషాలకు విజయవాడలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా వినుకొండలో గుఱ్ఱం జాషువా మరియమ్మలకు 1932 సంవత్సరం ఫిబ్రవరి 26న జన్మించారు. ఆమె హైస్కూల్‌ విద్య గుంటూరులో సాగింది. మద్రాసు యూనివర్సిటీ నుంచి డిగ్రీలో గోల్డ్‌ మెడల్‌ పొందారు. గోరా కుమారుడు లవణంతో(78) వివాహమైంది. విజయవాడ ప్రముఖ వైద్యుడు సమరం లవణానికి తమ్ముడు.

స్టూవర్టుపురం దొంగల పునరావాసం... సంస్కరణ, జోగినీ దురాచారంపై హేమలతా లవణం విశేషంగా కృషి చేశారు. 1977 దివిసీమ ఉప్పెనలో బాధితులకు పునరావాస సేవలందించారు. 1979లో ప్రకాశం, నెల్లూరు, 1996 తూర్పుగోదావరి జిల్లా తుపాను విపత్తు సమయంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మా నాన్న గారు జాషువా!, అహింసా మూర్తుల అమరగాథ, జీవనసాగరం, అనుభవ తరంగాలు, నేరస్తుల సంస్కరణ, జీవన ప్రభాతం, తాయెత్తులు గమ్మత్తులు పుస్తకాలను రచించారు. ఆమె సంఘసేవికగా చేసిన కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌, తానా ఎచ్చీవ్‌మెంట్‌, వరల్డ్‌ ఎచ్చీవ్‌మెంట్‌ అవార్డులు అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, చంద్రబాబు నుంచి తెలుగు ఆత్మగౌరవ అవార్డులు తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి నుంచి ఉగాది పురస్కారాన్ని, అంబేద్కర్‌ శతజయంతి సందర్భంగా భీమరత్న అవార్డును పొందిన ఏకైక మహిళ హేమలత. గుఱ్ఱం జాషువా ఫౌండేషన్‌ స్థాపించి దేశంలో తొమ్మిది మంది కవులకు పురస్కారాలు అందజేశారు. గుఱ్ఱం జాషువా, రచయిత డా|| సి. నారాయణరెడ్డిలంటే ఆమెకు ఎనలేని ప్రేమ. దళితుల సమస్యలను సామాజిక సమస్యలుగా పరిష్కారానికి కృషిచేసి, మానవ విలువలతో పనిచేసి దేశంలో అందరి ప్రతినిధిగా ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నాస్తిక కేంద్రం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని నాస్తిక కేంద్రం నిర్వాహకులు తెలిపారు.

సెషన్స్‌ మెట్రోపాలిటన్‌ జడ్జి ఐజక్‌ ప్రభాకర్‌, ఆకాశవాణి స్టేషన్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, ఆదిత్యప్రసాద్‌, కృష్ణకుమారిలు స్వాతంత్య్ర సమరయోధులు పరకాల పట్టాభిరామారావు, రావూరి అర్జునరావు, ధనలక్ష్మిలు, ఘంటశాల నృత్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ కె.వి. రెడ్డిలు హేమలత భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం వ్యక్తంచేశారు.
(Eenadu, 20:03@2008)
===============================

Labels:

సోగ్గాడు ఇక లేరు : ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు గుండెపోటుతో హఠాన్మరణం


ప్రపంచమే ఒక నాటక రంగం. ఇందులో ప్రతి వ్యక్తికీ తనదైన ప్రవేశం, నిష్క్రమణ ఉంటాయి'... ఇది ఆంగ్ల నాటకకర్త షేక్స్‌పియర్‌ మాట. దీనికి ఆంధ్రుల సోగ్గాడు శోభన్‌బాబు అందమైన ముగింపునిచ్చారు. 'ప్రవేశం ఎంత గొప్పగా ఉండాలో నిష్క్రమణా అంతే గొప్పగా ఉండాలి' అన్నది ఆయన చెప్పిన తత్వం. మరణంలో కాకపోయినా... నట జీవితంలో ఆయన దీన్నే ఆచరించి చూపించారు. విజయవంతమైన కథానాయకుడిగా ఉండగానే తెరమరుగయ్యారు. కుటుంబ కథా చిత్రాల్లో నటించిన ప్రభావమో ఏమోగానీ కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చారు. సోగ్గాడిగా తెలుగువారి మనసుల్లో తన రూపాన్ని శాశ్వతం చేసుకోవడానికి... కెమెరాలకూ ముఖం చాటేశారు. ఇప్పుడు ఆయన శాశ్వతంగా కనుమరుగయ్యారు. న్యాయవాది కాబోయి నటుడైన ఆయనకు నటనలోనే కాదు జీవితంలోనూ న్యాయంగానే జీవించిన వ్యక్తిగా పేరుంది. ఇలా శోభన్‌బాబుగా మారిన శోభనాచలపతిరావు చివరికి సోగ్గాడిగా స్థిరపడిపోయారు. అందుకే ఆయన మరణించినా ఆ స్థానం ఖాళీ కాలేద.

కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను సోగ్గాడిగా అలరించిన నటభూషణ శోభన్‌బాబు (71) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నై చూలైమేడులోని తన స్వగృహంలో ఉదయం 9 గంటల సమయంలో ఆయన కుర్చీలో కూర్చుని పత్రిక చదువుతుండగా... ఆయన భార్య అల్పాహారం తీసుకురావడానికి వెళ్లారు. ఇంతలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చి కుర్చీలోంచి నేలపై పడిపోయారు. ముక్కుచిట్లి రక్తస్రావమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కారులో అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శోభన్‌బాబును బతికించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 9.40 గంటలకు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. ఆయన మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి భౌతికకాయానికి నివాళులులర్పించారు. శోభన్‌బాబుకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కరుణాశేషు, కుమార్తెలు మృదుల, నివేదిత నగరంలోనే ఉంటున్నారు. మరో కుమార్తె ప్రశాంతి భర్తతో కలిసి ఆమెరికాలో ఉంటున్నారు. ఆమె వచ్చిన తర్వాత శుక్రవారం శోభన్‌బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన తండ్రి హఠాన్మరణం పాలవుతారని ఊహించలేకపోయామని కరుణాశేషు విలేకరులతో వ్యాఖ్యానించారు.

న్యాయశాస్త్రం ఆపేసి కథానాయకుడిగా...
శోభన్‌బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతిరావు. 1937 జనవరి 14న కృష్ణా జిల్లా మైలవరం సమీపంలోని చిన్ననందిగామలో ఆయన జన్మించారు. తండ్రి ఉప్పు సూర్యనారాయణరావు. తన అమ్మమ్మ ఊరైన కుంటముక్కలలో పదిహేనేళ్లు ఉన్నారు. మైలవరంలో చదువుకున్నారు. ఉంగుటూరు మండల పొట్టిపాడుకు చెందిన శాంతకుమారిని ప్రేమించి 1958లో వివాహం చేసుకున్నారు. విజయవాడలో విద్యాభ్యాసం తర్వాత శోభన్‌బాబు న్యాయశాస్త్రం చదవడానికి మద్రాసు వచ్చారు. అదే సమయంలో సినీరంగంలోకి ప్రవేశించడంతో న్యాయశాస్త్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆయన తొలిసారిగా వసంతకుమార్‌రెడ్డి దర్శకత్వంలో దైవబలం అనే సినిమాలో చిన్న పాత్ర వేశారు. అయితే తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం భక్తశబరి. 'వీరాభిమన్యు' చిత్రంతో గుర్తింపు పొందిన ఆయన... కార్తీకదీపం, స్వయంవరం, బలిపీఠం, మహరాజు, ఇల్లాలు ప్రియురాలు, దేవాలయం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో స్టార్‌గా మారారు. కుటుంబ కథాచిత్రాల ద్వారా భర్తంటే ఇలాగే ఉండాలి అనుకునేంతగా మహిళా ప్రేక్షకుల అభిమానం పొందారు. ఆయన మొత్తం 236 సినిమాల్లో నటించారు. చివరిసారిగా హలోగురు అనే చిత్రంలో నటించారు.


స్వగ్రామంలో విషాదం
శోభన్‌బాబు మరణంతో ఆయన పుట్టిపెరిగిన గ్రామాలైన చిననందిగామ, కుంటముక్కల విషాదంలో మునిగిపోయాయి. చెన్నైలో స్థిరపడిన తర్వాత కూడా ఆయన ఏడాదికోసారైనా ఇక్కడికి వచ్చి అందరినీ పలకరించేవారు. శోభన్‌బాబు మరణం విషయం తెలియగానే బంధుమిత్రులు వెంటనే చెన్నై బయలుదేరి వెళ్లారు. పలువురు ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. తన సినిమా విడుదల కాగానే ఫోన్‌చేసి 'ఎలా ఉంది బాబాయ్‌' అని అడిగేవారని శోభన్‌బాబు చిన్నాన్న ఉప్పు పెద వెంకటేశ్వరరావు (కృష్ణయ్య) 'న్యూస్‌టుడే'తో చెప్పారు. తనకు పెద్దమ్మ కుమారుడైన శోభన్‌బాబు తనను ఎంతో ఇష్టంగా చూసుకునేవారని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్‌బాబు తెలిపారు.

బహుదూరపు బాటసారి
''సినిమా అనేది ఓ కళ. నిజమే... కానీ ఇప్పుడు పరి'శ్రమ'గా మారింది. కాబట్టి విరామం, విశ్రాంతి తప్పవు'' అన్నది శోభన్‌బాబు అభిప్రాయం. నటన ఒక వృత్తేననీ, అందులో కూడా ఓ దశకు చేరాక విరమణ చేయాల్సిందేనని చెప్పేవారు. అరవయ్యేళ్లు వచ్చేసరికి సినిమాల నుంచి తప్పుకోవాలని ప్రగాఢంగా వాంఛించారు. అందుకు తగినట్లుగానే 59వ ఏటనే 'హలో గురూ' సినిమాతో నట జీవితానికి స్వస్తిచెప్పారు. ఆపై మళ్లీ వెండితెరపై కనిపించలేదు. ఈ విషయంలో ఎంత ప్రణాళికతో మెలిగారో... నటుడిగా ఉన్నప్పుడూ అంతే క్రమశిక్షణతో వ్యవహరించారు.

ఎన్టీఆర్‌ అండదండలు:
చెన్నై వచ్చిన మొదట్లో సినిమా అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగిన శోభన్‌బాబు 'వీరాభిమన్యు' చిత్రానికి ముందు ఓదశలో స్వగ్రామం వెళ్లిపోవాలనుకున్నారు. ఆ సినిమాలో అవకాశం రావడం, అది ఘనవిజయం సాధించడంతో తన నిర్ణయం మార్చుకున్నారు. అయితే ఆ తర్వాత అరకొర వేషాలే రావడం, కుటుంబ బాధ్యతలు పెరగడంతో అనేక కష్టాలు పడ్డారు. ఈ అనుభవాలే ఆయనకు ఆర్థిక పాఠాలు నేర్పాయి. పొదుపుగా జీవించడాన్ని అలవాటు చేశాయి. తొలినాళ్లలో శోభన్‌బాబుకి ఎన్టీఆర్‌ అండదండగా ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా కొన్ని అవకాశాలు ఇప్పించారు. దర్శకుడు వి.మధుసూదనరావుని శోభన్‌బాబు గాడ్‌ఫాదర్‌గా భావించేవారు.

లెక్కంటే లెక్కే:

శోభన్‌బాబు పారితోషికం విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. షూటింగ్‌ సమయంలో తన కోసం వచ్చే అతిథులకు నిర్మాణ సంస్థ కాఫీ, టీ, టిఫిన్లు అందిస్తే వాటి ఖర్చుని తన పారితోషికంలోంచి మినహాయించమని కచ్చితంగా చెప్పేవారు. అలాగే నిర్మాతకు సంబంధించిన ఫోన్‌ నుంచి ట్రంక్‌కాల్స్‌ లాంటివి చేసినా వాటి బిల్లుని అణాపైసలతో చెల్లించేవారు. సినీరంగంలో వారాంతపు సెలవుల్ని అమలు చేసిన తొలి హీరో శోభన్‌బాబే. భూమిని నమ్ముకొంటే తిరుగులేదని నమ్మి ఆయన విజయం సాధించారు. తన సంపాదనలో కొంత మొత్తాన్ని భూములు, భవనాలపై పెట్టుబడిగా పెట్టారు. అదే ఆయన్ని సంపన్నుణ్ని చేసింది. ఈ సూత్రాన్ని ఆచరించడమే కాకుండా సహనటులకు, సాంకేతిక నిపుణులకూ చెప్పేవారు. వ్యక్తిగత జీవితంలో ఇంట్లో ఏ శుభకార్యం చేసినా ముందుగా చెన్నైలోని కొన్ని అనాథాశ్రమాలకు వెళ్లి ఆర్థిక సాయాన్ని అందించేవారు. తన ఇంట్లో పనిచేసే సిబ్బందికి ఇంటి సమీపంలోనే వసతిగృహాలు నిర్మించి ఇచ్చారు.

ఓ సందర్భంలో శోభన్‌బాబు 'న్యూస్‌టుడే' ప్రతినిధితో మాట్లాడుతున్నప్పుడు జయలలిత ప్రస్తావన రాగా ''ఆమె అందం, అభినయం, వాక్‌చాతుర్యం, చురుకుదనం బాగా ఆకర్షించేలా ఉండేవి. నిప్పు లేనిదే పొగ రాదు కదా'' అని వ్యాఖ్యానించారు. (వీరిద్దరి సాన్నిహిత్యంపై తమిళనాడులో రకరకాల కథనాలు ఉన్నాయి) 'చంద్రమోహన్‌ పొట్టిగా ఉన్నందువల్ల అలా ఉన్నాడుగానీ.. ఎత్తు ఉన్నట్లయితే తెలుగు చిత్రసీమని ఓ తిప్పుతిప్పేవాడు' అని చమత్కరించారు.

విజయవంతమైన కథానాయకుడిగా ఉన్నప్పుడే శోభన్‌బాబు సినిమాల నుంచి తప్పుకోవడం చాలా మందికి అంతుచిక్కని ప్రశ్న. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ చిన్న సంఘటన కారణమని ఆయన చెప్పేవారు. ఓ సినిమాలో ఆయన న్యాయమూర్తిగా, ముద్దాయిలుగా కాంతారావు, రాజనాల నటించారు. నిజానికి వారిద్దరి పాత్రలు ఏమాత్రం ప్రాధాన్యం లేనివి. ఆర్థికంగా చితికిపోయిన కాంతారావు, రాజనాల ఆ పాత్రల కోసం షూటింగ్‌ వద్ద గంటల కొద్ది వేచి ఉండడం శోభన్‌బాబును కలచివేసింది. సినిమాల నుంచి గౌరవంగా, హుందాగా తప్పుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.

చెల్లెలు మరణించిన నెలరోజులకే
గంపలగూడెం, న్యూస్‌టుడే: శోభన్‌బాబు హఠాన్మరణం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని గుళ్లపూడిలోని అతని సోదరి కుటుంబంలో విషాదం నింపింది. శోభన్‌బాబు రెండో సోదరి ఝాన్సీలక్ష్మీభాయి ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ఇక్కడ చనిపోయారు. తన చెల్లెలిపై అమితమైన మమకారం కలిగిన శోభన్‌బాబు ఆమె మరణ వార్త తెలిసినప్పటి నుంచి మనోవ్యధకు లోనయ్యారని ఇక్కడి కుటంబసభ్యులు తెలిపారు. చెల్లెలు మృతి చెందిన నెల రోజులుకే అన్న చనిపోవటం గమనార్హం. చెల్లెలు మృతి చెందడంతో బాధపడుతూ ప్రతి రోజు ఇక్కడకి ఫోన్‌ చేసి గద్గద స్వరంతో ఆవేదన చెందేవారని, అది తట్టుకోలేకనే గుళ్లపూడిలో చెల్లెలి కర్మకాండలకు తన కుంటుంబ సభ్యుల్ని మాత్రమే పంపారని చెప్పారు. శోభన్‌బాబు కుటుంబానికి సంబంధించి నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవటం వారి బంధువుల్లో విషాదాన్ని నింపింది.

అజరామరుడు.. ఈ సోగ్గాడు

ఆగిపోయిన గడియారం కూడా ఇరవైనాలుగు గంటల్లో రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని అది పనిచేస్తోందనుకుంటే భ్రమే! ఈ విషయం అందరికన్నా శోభన్‌బాబుకి బాగా తెలుసు. భ్రమల్ని పటాపంచలు చేస్తూ వాస్తవిక దృక్పథంతో ఆయన ఆలోచించారు. వృత్తి జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ మధ్య స్పష్టమైన హద్దు ఏర్పరచుకుని... సరిహద్దులోనే మసలుకున్నారు. నలుగురూ అసూయపడేలా నాణ్యవంతమైన జీవితాన్ని కడదాకా కొనసాగించారు.

'పెదవులపైన సంగీతం.. హృదయంలోన పరితాపం. సెగలై రగిలే నా బతుకు.... చివరికి పాడెను ఈ గీతం'. - 'పుణ్యవతి' సినిమాలో శోభన్‌బాబు మీద చిత్రించిన పాట ఇది. దీని ప్రభావం ఆయన మీద ఎంత వరకూ ఉందో తెలీదుగానీ, తన కెరీర్‌కి అలాంటి ముగింపు రాకూడదని ఆయన గట్టిగా కోరుకునేవారు. ఇందులో రెండు కోణాలు. మొదటిది వాస్తవిక దృక్పథం... రెండోది మానసిక ఉద్వేగం... ''మనిషి యంత్రం కాదు.. కాకూడదు. రకరకాల మాస్కులు వేస్తూ.. తీస్తూ అనుక్షణం ఒత్తిడితో సావాసం చెయ్యకూడదు. ఉద్యోగంలో విరమణ ఎలా ఉంటుందో వృత్తిలోనూ అది ఉండాలి. కీళ్లు అరిగిపోయినా కీ ఇస్తే ఆడే మరబొమ్మలాగా మనిషి మారిపోకూడదు''.. ఇదీ శోభన్‌బాబు వాస్తవిక దక్పథం తాలూకు సారాంశం.
ఖాళీ చెక్‌ ఇచ్చినా:

ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయాలంటే భారీ స్కోర్‌ ఎంత అవసరమో వృత్తి జీవితాన్ని విరమించే వేళకి ఆర్థిక భద్రత అంతే అవసరం. అందుకే శోభన్‌బాబు దూరదృష్టితో భూమిని నమ్ముకున్నారు. మేకప్‌ చెరిపేసుకున్న పది సంవత్సరాల తరవాత కూడా ఆయన్ని కెమెరా ముందుకు రప్పించాలని ఎందరో ప్రయత్నించారు. వూహించని స్థాయిలో పారితోషికాలు వూరించినా తన నిర్ణయానికే ఆయన కట్టుబడి ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. 'అతడు'లో మహేష్‌బాబు తాత వేషం కోసం నిర్మాత మురళీమోహన్‌ బ్లాంక్‌ చెక్‌ ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. ఆకర్షణీయమైన సినీ ప్రపంచంలో అనిశ్చితి ఎలాంటిదో శోభన్‌బాబుకి బాగా తెలుసు. మళ్లీ వేషం వేయడం అంటే అనిశ్చితిని ఆవాహన చేసుకుంటూ ఒత్తిళ్లపొత్తిళ్లలో కేకలు పెట్టాల్సి ఉంటుందని భావించారు. ఆ జ్ఞాపకాలను కూడా వద్దనుకున్నారు. ఏదైనా ఛానెల్‌లో తను నటించిన సినిమా వస్తుంటే తట్టుకోలేక ఛానెల్‌ మార్చే ఉద్వేగపరుడాయన! ''సంపాదన కోసం రంగుపూసుకున్నాం. దట్సాల్‌. పేకప్‌ చెప్పిన తరవాత మళ్లీ నోటేకాఫ్‌''అనేవారు. తన పిల్లల్ని ఆ ఛాయలకు కూడా రానీయలేదు. శోభన్‌బాబు డబ్బు మనిషి అన్నవాళ్లూ లేకపోలేదు. పారితోషికాన్ని ముక్కు పిండి వసూలు చేసేవారన్న పేరూ ఉంది. అయితే కొంతమంది దగ్గర పారితోషికాన్ని తగ్గించుకున్న సందర్భాలూ లేకపోలేదు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా చెప్పుకొనేవారు కాదు. ఆయనతో తిలక్‌ అనే నిర్మాత 'సంసారం సంతానం' చిత్రాన్ని నిర్మించారు. రూ.5 లక్షలు పారితోషికం అన్నారు. సినిమా పూర్తయ్యే దశలో రూ.75 వేలు తగ్గించి తీసుకున్నారు. తిలక్‌ 'ఈనాడు సినిమా'తో మాట్లాడుతూ ''నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గ్రహించి ఆ సొమ్ము వదులుకున్నారు. ఆ సంగతి నేను ఎవరికి చెప్పినా నమ్మలేదు. నా కంటే ముందు ఛటర్జీ అనే నిర్మాత దగ్గరా పారితోషికం వదులుకున్నారు. నేను ఆర్థికంగా కుదుటపడ్డాక ఆ సొమ్ము ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరించి, మీ అమ్మాయిల పేరన ఏదైనా ఆస్తి కొనమని చెప్పిన మంచి మనిషి'' అన్నారు.

వైరాగ్యం అనుకున్నా:

తొలినాటి పాత్రల్లోని ఉద్వేగం, మానసిక సంఘర్షణ, ఒంటరితనం లాంటి లక్షణాలు శోభన్‌బాబు వ్యక్తిత్వంలోనూ కనిపిస్తాయనాలి. మనిషిలాగే మనసు కూడా నాజూకు! ఓ రకంగా ఆయన అంతర్ముఖుడు. ''జీవితం ఏవిఁటి?.. ఎందుకు?.. ఎప్పుడూ నలిగిపోవలసిందేనా?.. సంపాదించిన దాన్ని సంతోషంగా అనుభవించే రోజులు ఉండనవసరం లేదా?''.. ఇలాంటి తాత్విక దృక్పథం ఆయనలో ఉంది. దానితోపాటు 'సౌందర్య స్పృహ' వెన్నంటి ఉండటం మరో వైరుధ్యం. కళ్ల చుట్టూ వలయాలూ.. మొహం నిండా ముడతలూ.. గొంతులో వణుకూ.. తన గ్లామరస్‌ ఇమేజ్‌ని గడ్డపారతో పెకిలించిక ముందే.. ఎప్పటికీ వన్నెతరగని 'అందగాడు'గా శోభన్‌బాబు మిగిలిపోవాలనుకొన్నారు. అలాగే ప్రేక్షకులకు చిరాకు పుట్టించేవరకూ చిన్నచిన్న పాత్రల్లోకి చొరబడి నటించకూడదన్నదీ ఆయన ఉద్దేశం. షష్టిపూర్తికి ఓ ఏడాది ముందే సెలవు ప్రకటించేశారు. సినిమాల్లోకి ప్రవేశించడం కాదు నిష్క్రమించడమే ముఖ్యం. ''ఓ సినిమాలో నేను మేజిస్ట్రేట్‌ పాత్ర పోషిస్తున్నాను. నా పాత్ర నిడివి తక్కువే. తర్కాలు వింటూ మధ్యలో ఆర్డర్‌ అంటూ డైలాగులు చెప్పడం. అప్పుడు గత స్మృతులు మదిలో మెదిలాయి. నేను చిన్న నటుడిగా ఉన్నప్పుడు గొప్పవాళ్లుగా వెలిగినవాళ్లు తరవాతి కాలంలో బోనులో నిలబడే ముద్దాయి పాత్రల్లో కనిపించడం బాధ కలిగించింది. ఆ పరిస్థితి నాకు రాకూడదు అనుకున్నాను. ఆ క్షణమే రిటైర్మెంట్‌ ఆలోచన వచ్చింది'' అన్నారు శోభన్‌బాబు. ఎందుకు మీకింత వైరాగ్యం అని సన్నిహితులు చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యే స్థితిని కలలో కూడా వూహించుకోలేని మానసిక ఉద్వేగం శోభన్‌బాబుది. చిత్ర పరిశ్రమలోని వృత్తి జీవితాన్ని తామరాకు మీద నీటిబొట్టులాగా భావించే తాత్విక దృక్పథం ఆయనది. అందరూ అలా ఉండలేరు.. అందగాళ్లందరూ శోభన్‌బాబులు కాలేరు.
__________________________________________

''నేను హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు పాతాళభైరవి, దేవదాసు, మల్లీశ్వరి ఆంధ్రదేశాన్ని ఓ వూపు వూపాయి. మల్లీశ్వరి పాటలు వినని రోజంటూ లేదు. ఆ సినిమా అంటే ఎంత అభిమానమో తెలుసా... చదువుకొనే రోజుల్లోనే 22సార్లు చూశాను. ఇక పాతాళభైరవిలోని తోట రాముడి పాత్ర మనసులో చెరగని ముద్ర వేసింది. దేవదాసు కూడా అలాంటి అనుభూతినే ఇచ్చింది. ఆ మూడు చిత్రాలూ నా మీద ఎంతో ప్రభావాన్ని చూపాయి. సినిమాలపై ఆసక్తిని పెంచాయి''.


అప్పట్లో ప్రముఖ దర్శకులు చిత్రపు నారాయణమూర్తి 'భక్త శబరి' చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. శోభన్‌బాబు ఆయన్ని కలిసి ఫొటోలిచ్చి ఏదైనా వేషం ఇవ్వమన్నారు. నాలుగు రోజుల తరవాత పిలిచి ముని కుమారుడు 'కరుణ' పాత్ర ఇచ్చారు. ఆ సినిమాతోనే గుర్తింపు పొందారు. అందుకే తన కుమారుడికి కరుణ పేరు కలిసేలా కరుణ శేషు అనే పేరు పెట్టుకున్నారు.

_______________________________


కిరీటం పెట్టిన పాత్రలు..

పురాణ కథలకు ఎన్టీఆర్‌.. సామాజిక పాత్రలకు ఏఎన్నార్‌.. కుటుంబ కథలకు శోభన్‌బాబు... ఇలా విభజించి దర్శకనిర్మాతలు సినిమాలను తెరకెక్కించేవారు. అలాంటి తరుణంలో కూడా శోభన్‌బాబు నట జీవితంలో మరచిపోలేని పౌరాణిక పాత్రలూ ఉన్నాయి. తొలి అడుగులోనే 'భక్త శబరి'లో ముని కుమారుడు కరుణగా కనిపిస్తారు. నటుడిగా ఆయనకు పూర్తి గుర్తింపునిచ్చింది అభిమన్యుడి పాత్ర. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 'వీరాభిమన్యు' చిత్రంలో ఆ పాత్ర పోషించారు. ఆ తరవాతి కాలంలో 'సీతారామ కళ్యాణం'లో ఆయన లక్ష్మణుడి పాత్రను పోషించారు. 'సతీ అనసూయ', 'శ్రీకృష్ణావతారం' చిత్రాల్లో నారదుడిగా కనిపించారు. 'లవకుశ'లో శత్రుఘ్నుడు. 'నర్తనశాల'లో అభిమన్యుడు. 'బుద్ధిమంతుడు'లో కృష్ణుడు. 'సంపూర్ణరామాయణం'లో శ్రీరామచంద్రుడు. 'కురుక్షేత్రం' సినిమాలో మరోమారు శ్రీకృష్ణ పరమాత్ముడు. 'పరమానందయ్య శిష్యుల కథ'లో శివుడి పాత్రను పోషించారు. 'దేవాలయం' చిత్రంలో 'దేహమేరా దేవాలయం' అంటూ సాగే పాట శోభన్‌బాబు జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. ఇందులో ఆయన దశావతరాల్లో కనిపిస్తారు. ఈ చిత్ర షూటింగ్‌ సమయంలోనే తనకు బాగా కావల్సిన వాళ్ల పెళ్లికి ఆయన వెళ్లాల్సి వచ్చింది. మేకప్‌ తీసుకునేంత సమయం లేకపోవడంతో ఈ సినిమాలో పోషిస్తున్న పూజారి పాత్రలోనే ఆ పెళ్లికి హాజరయ్యారు.

మానవత్వమే మతం!

ఇలా వీలును బట్టి తనదైన శైలిలో పౌరాణిక పాత్రలకు న్యాయం చేసిన ఘనత శోభన్‌బాబు సొంతం. ఇక్కడో మరో విషయం చెప్పుకోవాలి. ఇంత మంది పురాణ పురుషుల పాత్రల్ని పోషించిన ఆయనకు విగ్రహారాధన, మత విషయాలపై నమ్మకం లేదు. సామ్యవాద భావాలు కలిగిన నటుడీయన. ఆయన సహ నటుడు మాదాల రంగారావు ఇలా చెప్పారు: ''శోభన్‌బాబు ఇంట్లో బుద్ధుడు చిత్రపటం ఉండేది. ఆయన బోధనల్ని తరచూ చదివేవారు. మానవత్వాన్ని మించిన మతం లేదనేవారు. అనాథలకీ, ఆపదల్లో ఉన్నవాళ్లకీ సాయం చేసేవారు. కానీ వాటి గురించి ఎక్కడా చెప్పేవారు కాదు. ప్రచారం కూడా కోరుకొనేవారు కాదు''.

శోభన్‌బాబు రింగు

డెభ్బైల్లో స్త్టెల్‌ అంటే శోభన్‌బాబుదే. వస్త్రాల నుంచి కేశాలంకరణ, నడక... అన్నింట్లోనూ తనదైన ముద్ర ఉండేలా చూసుకొనేవారు. 'సోగ్గాడు'లో శోభనాద్రి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందే. శోభన్‌బాబు తమ స్వగ్రామంలోని వ్యక్తి తాలూకు జీవన శైలినీ, పంచెకట్టునీ అనుసరించారు. ఆ వ్యక్తి ఎప్పుడూ సరదాగా, కులాసాగా ఉండేవారట. 'సోగ్గాడు' కథ చెప్పగానే అతన్నే గుర్తు చేసుకొని ఆ తరహాలోనే మేకప్‌ అదీ చేసుకున్నారు. ఆ చిత్ర శతదినోత్సవానికి ఆ వ్యక్తిని ప్రత్యేకంగా ఆహ్వానించి, మర్యాదలు చేశారు శోభన్‌బాబు. ఆ తరవాత వచ్చిన చిత్రాల్లోని ఆయన కేశాలంకరణ కూడా ఓ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా నుదిటి మీదకు వంకీలా పడేలా నాలుగు వెంట్రుకలు మరీ ఆకర్షణీయంగా ఉండేవి. దీన్ని శోభన్‌బాబు రింగు అనేవారు. ఆ మధ్య వచ్చిన 'నువ్వు నేను'లో కూడా ఓ పాత్రకు ఆ తరహా హెయిర్‌స్త్టెల్‌నే ఉంచి, శోభన్‌బాబు రింగు అనే డైలాగును కూడా చెప్పించారు.

తొలి సంగతులు

తొలి చిత్రం : కీలుగుర్రం
నటించిన తొలి చిత్రం : దైవబలం (చిన్న పాత్ర)
విడుదలైన తొలి చిత్రం : భక్త శబరి
తొలి చిత్ర దర్శకుడు : చిత్రపు నారాయణమూర్తి
తొలి చిత్ర నిర్మాత : బి.డి.నాయుడు
తొలి చిత్ర సంగీత దర్శకుడు: పెండ్యాల నాగేశ్వరరావు
తొలి శత దినోత్సవ చిత్రం : నర్తనశాల
హీరోగా తొలి 25 వారాల చిత్రం : మనుషులు మారాలి
తొలి కలర్‌ చిత్రం : కన్నవారి కలలు
తొలి ద్విపాత్రాభినయం : పొట్టి ప్లీడర్‌
విగ్‌లేకుండా నటించింది : కిలాడీ బుల్లోడు
తొలిసారి విదేశాలకు షూటింగ్‌కి వెళ్లింది: రాముడు పరశురాముడు


శోభన్‌బాబుకు పూర్తయిన అంత్యక్రియలు

చెన్నై: తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు శోభన్‌బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పూనమల్లిలోని శాంతినికేతన్‌ తోటలో శోభన్‌ భౌతికకాయానికి దహనసంస్కారాలు పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకువచ్చారు. భారీ వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ప్రజలు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. శోభన్‌ కుమారుడు కరుణ శేషు చితికి నిప్పంటించారు. తమ అభిమాన కథానాయకుడిని చివరిసారిగా చూసేందుకు జనం పెద్ద ఎత్తున శాంతినికేతన్‌కు వచ్చారు. శోభన్‌బాబుకు పూర్తయిన అంత్యక్రియలు

(Eenadu, 21:03:2008)
=============================

Labels: ,

క్లార్క్‌ అస్తమయం Arthur Clarke is dead

ప్రముఖ సైన్స్‌ కాల్పనిక రచయిత ఆర్థర్‌ క్లార్క్‌ బుధవారం కొలంబోలో కన్నుమూశారు. ఆయన అంతరిక్షం, సైన్స్‌, భవిష్యత్‌లో కమ్యూనికేషన్లు వంటి అంశాలపై పుస్తకాలు రాశారు.

కలల లోకంలోకి పయనమైన సైన్స్‌ భీష్ముడు


అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానంతో, కల్పనా చాతుర్యంతో ప్రపంచ ప్రజానీకాన్ని ఉర్రూతలూగించిన సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత ఆర్థర్‌ సి. క్లార్క్‌ బుధవారం తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 90 ఏళ్లు. బ్రిటన్‌కు చెందిన క్లార్క్‌ శ్రీలంకలో స్థిరపడ్డారు. సమకాలీన శాస్త్రప్రపంచంలో అపర భీష్మునిగా పేరొందిన ఆర్థర్‌ క్లార్క్‌ అనేక అద్భుత ఆవిష్కరణలకు ఆలోచనలను అందించారు. కొన్ని దశాబ్దాల ముందే ఆయన ఊహించి చెప్పిన విషయాలు నేడు మన కళ్ల ముందున్నాయి. సైన్స్‌నే ప్రేమించి, శ్వాసించిన క్లార్క్‌ తన యావత్‌ జీవితాన్ని శాస్త్ర సంబంధ సమస్యలను చేధించటానికే అంకితం చేశారు.

నేడు మన దైనందిన జీవితంలో భాగమైన టెలివిజన్‌, టెలిఫోన్‌ తదితర కమ్యూనికేషన్లకు ఆద్యుడు ఆర్థర్‌ క్లార్క్‌. భూమికి 22 వేల మైళ్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాలను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్లలో గొప్ప ప్రగతిని సాధించవచ్చని ఆయన ప్రపంచానికి తొలిసారిగా తెలియజేశారు. 1945లో వైర్‌లెస్‌ వరల్డ్‌ అనే అమెరికా పత్రికలో ఆయన రాసిన వ్యాసం శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను ఆలోచింపచేసింది. ఫలితంగా తర్వాత దశాబ్దాల్లో టెలివిజన్‌, టెలిఫోన్‌ విప్లవాలు సాధ్యమైనాయి. అంతరిక్ష రంగంలోనూ క్లార్క్‌ చేసిన ఊహలు వాస్తవమై నిలిచాయి. చంద్రునిపై మనిషి కాలుపెట్టటం ఖాయమని 1940లలో ఆయన వెల్లడించినప్పుడు చాలామంది సాధ్యంకాని ప్రతిపాదన అంటూ కొట్టిపారేశారు. కానీ, 1969లో అమెరికా వ్యోమగామి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై తొలి అడుగు వేశారు. అప్పుడు, అమెరికా ప్రభుత్వం క్లార్క్‌ ఇచ్చిన స్ఫూర్తే ఆ విజయానికి కీలకమని ప్రకటించింది. ఇంతటి ప్రతిభాశాలి అయిన క్లార్క్‌ ఏ విశ్వవిద్యాలయాల్లోనూ చదువుకోలేదంటే ఆశ్చర్యం వేస్తుంది.

రైతు కుటుంబం

క్లార్క్‌ 1917 డిసెంబర్‌ 16న ఇంగ్లండ్‌లో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్య తర్వాత యూనివర్సిటీల్లో చేరేందుకు అవసరమైన డబ్బులు లేకపోవటంతో చదువు ఆపేశారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటీష్‌ నౌకాదళంలో చేరి సేవలందించారు. యుద్ధం అనంతరం, మళ్లీ చదువు ప్రారంభించి కింగ్స్‌ కాలేజీ నుంచి డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత సైన్స్‌ రచయితగా జీవితాన్ని ఆరంభించారు. శాస్త్రరంగంలో జరుగుతున్న ప్రయోగాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ తన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చారు. 1937 నుంచీ మొదలైన రచనలు ఆయన జీవితపర్యంతమూ కొనసాగాయి. మొత్తమ్మీద 80కిపైగా పుస్తకాలు, 500 చిన్నకథలు, వ్యాసాలు రాశారు. '2001 : ఎ స్పేస్‌ ఒడిస్సీ' అనే నవలతో క్లార్క్‌ పేరు ప్రపంచమంతటా మార్మోగింది. ఈ నవల ఆధారంగా సినిమాలు కూడా వచ్చాయి. భవిష్యత్తులో మానవులు వివిద గ్రహాలపైకి వెళ్లిరావటం సాధారణ విషయమైతుందని, లిఫ్టు ద్వారా రోదసిలోకి మనుషులు వెళ్లగలుగుతారని క్లార్క్‌ ఊహించారు. అంతేకాదు, గ్రహాంతరజీవులపైన కూడా ఆయనకు విపరీతమైన నమ్మకం. సైన్స్‌ను ప్రేమించే క్లార్క్‌ సహజంగానే మిథ్యాసైన్స్‌పై, మూఢనమ్మకాలపై ధ్వజమెత్తేవారు. ''నైతికవిలువలను మతం హైజాక్‌ చేయటం కన్నా మించిన విషాదం మానవజాతి చరిత్రలో లేదు.'' అని ఆయన చేసిన వ్యాఖ్య మతంపై ఆయన దృక్పథాన్ని తెలియజేస్తుంది.



స్కూబా డైవింగ్‌పై ఆసక్తితో 1950లలో శ్రీలంకను పలుమార్లు సందర్శించిన క్లార్క్‌ అక్కడే స్థిరపడ్డారు. ఆ దేశంలో చెలరేగిన అంతర్యుద్ధం ఆయనను తీవ్రంగా కలచివేసేది. గత డిసెంబర్‌ 16న జరుపుకున్న తన చివరి పుట్టిన రోజున కూడా ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ, శ్రీలంకలో శాంతి నెలకొనాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, 1953లో మేరీలిన్‌ మేఫీల్డ్‌ అనే మహిళను క్లార్క్‌ వివాహం చేసుకున్నారు. అయితే, ఆరునెలల్లోపే వారు విడిపోయారు. ఆ తర్వాత ఆయన తిరిగి వివాహం చేసుకోలేదు.
(Eenadu, 20:03:2008)
__________________________

The man who saw tomorrow

Sir Arthur Charles Clarke, the science fiction writer who passed away in his adopted country of Sri Lanka, was a man who saw tomorrow. And the tomorrow he foresaw in the early 1940s is ours today. He was remarkably prescient, as we can understand now. He imagined geostationary communication satellites and space travel in much detail when scientists were still fiddling with rockets. And he also predicted clean power from “cold fusion” in the new millennium, which should give us hope. Curiously enough, Clarke often said he hated the term, “prediction”, and loved to use the word, “extrapolation”. In the long run, and often in the short one, the most daring prophecies seemed laughably conservative, he would say. This did not prevent him from making more of them. The vision-intoxicated Nostradamus in him sometimes overwhelmed the sceptical scientist and he even spoke about humankind discovering the secret of immortality by the end of the 21st century. But then he was not just a scientist but also a fiction writer and one among the best.

So he could very well fire slingshots from his imagination, which was probably overheated by his physical disability. Along with H.G. Wells and Isaac Asimov, Clarke formed the trilogy of visionary science fiction writers who captured the imagination of the common man with their novels and stories. Clarke’s Space Odyssey novels starting from “2001” are the staple of science fiction fans. He had a quirky way of looking at humans — (“Hello, Carbon-based bipeds”) was how he titled his autobiography — and critics complained that his characters were wooden. His machines, they said, were more alive than human beings. But the sci-fi veteran loved machines and did not carp at such critics. Clarke, who had been living in Sri Lanka for more than 50 years and had been wheelchair bound for 30 of them, recently said in a touchingly humble way that he would like to be remembered as a writer, “who entertained readers, and, hopefully, stretched their imagination as well.” His final novel, which he cleared for publication recently, is aptly titled (The Last Theorem). Probably the man who saw tomorrow also got a hint that it was time to bid goodbye to his favourite carbon-based bipeds.

(The Deccan Chronicle, Editorial, 20:03:2008)

_____________________________

PAGE 1 ANCHOR

He foresaw space, now joins the stars

The Washington Post

Posted online: Thursday, March 20, 2008 at 0013 hrs

Legendary science fiction writer Arthur C. Clarke, who gave the world 2001: A Space Odyssey, dies at 90

Arthur C Clarke at his home in Colombo.


WASHINGTON, MARCH 19 : Arthur C. Clarke, 90, the world-famous science-fiction writer, futurist and unofficial poet laureate of the space age, died of a respiratory ailment Tuesday at his home in Colombo, Sri Lanka.

Clarke co-wrote, with director Stanley Kubrick, the screenplay for 2001: A Space Odyssey, which is regarded by many as one of the most important science fiction films made. A prolific writer, with more than 100 published books, he was praised for his ability to foresee the possibilities of human innovation and explain them to non-scientific readers.

The most famous example is from 1945, when he first proposed the idea of communications satellites that could be based in geostationary orbits, which keep satellites in a fixed position relative to the ground.

Some scoffed, but the idea was proved almost a generation later with the launch of Early Bird, the first of the commercial satellites that provide global communications networks for telephone, television and high-speed digital communication. The orbit is now named Clarke Orbit by the International Astronomical Union.

“He had influenced the world in the best way possible,” writer Ray Bradbury said in Neil McAleer’s 1992 book “Arthur C. Clarke: The Authorized Biography.” “Arthur’s ideas have sent silent engines into space to speak in tongues. His fabulous communications satellite ricocheted about in his head long before it leaped over the mountains and flatlands of the Earth.”

In addition to his books, he wrote more than 1,000 short stories and essays. One of his short stories, “Dial F for Frankenstein” (1964), inspired British computer scientist Tim Berners-Lee to invent the World Wide Web in 1989.

Clarke also popularized the idea of a space elevator as an energy-efficient alternative to rockets. Conceived by a Russian engineer in 1960 and re-invented at least four times in the next decades, Clarke’s inclusion of the idea in a 1979 novel brought it to popular attention and helped launch a new field of study. He told New Scientist magazine last year that it would be built “50 years after everyone stops laughing.”

But it was his collaboration with Kubrick in the 1968 film that made him internationally famous. The screenplay for “2001: A Space Odyssey” was based on Clarke’s 1951 short story “The Sentinel,” and Clarke simultaneously wrote the companion novel, which was released three months after the film and was believed by many to be a more detailed explanation of the ideas in the film.

Clarke’s work inspired the names of spacecraft, an asteroid and a species of dinosaur. He joined American broadcaster Walter Cronkite as a commentator on the Apollo moonshots in the late 1960s. Two television series in the 1980s spread his ideas around the world.

He was knighted in 1998, nominated for the Nobel Peace Prize in 1994 and received the Franklin Institute gold medal, the United Nations Educational, Scientific and Cultural Organization-Kalinga Prize and other honors.

Clarke, a resident of Sri Lanka since 1956, worked with Jacques Cousteau and others to help perfect scuba equipment. He moved to the country, then known as Ceylon, to open a dive shop and explore the undersea world. Disabled by post-polio syndrome, the lingering effects of a disease that had paralyzed him for two months in 1959, Clarke said diving was as close as he could get to the weightless feeling of space.

“I’m perfectly operational underwater,” he once said.

His dive shop was destroyed in the 2004 tsunami.

Clarke’s marriage to Marilyn Mayfield ended in divorce. Survivors include a brother and sister, both of whom live in England.

According to a news release from the Arthur C. Clarke Foundation, Clarke reviewed the final manuscript of his latest science fiction novel, “The Last Theorem,” a few days ago. It is scheduled to be published later this year.

Although he rarely left Sri Lanka, he kept in touch with the rest of the world by using the satellite communication he predicted so long ago.

He told the Associated Press that he didn’t regret never going into space because he had arranged to have the DNA from his hair sent into orbit.

“Some day, some super civilization may encounter this relic from the vanished species and I may exist in another time,” he said.

In a 90th birthday video recorded in December, Clarke said he had only three last wishes: That someone find evidence of extraterrestrial life; that the world adopt clean energy sources; and that an end be found to the long civil war in Sri Lanka.

“I’m sometimes asked how I would like to be remembered. I’ve had a diverse career as a writer, underwater explorer, space promoter and science populariser,” he said. “Of all these, I want to be remembered most as a writer — one who entertained readers, and, hopefully, stretched their imagination as well.”
(The Indian express, 20:03:2008)
_____________________________



The knight of science fiction Anthony Tucker

Sir Arthur C. Clarke was a colossus in the worlds of science fact and fiction during the second half of the 20th century.


Among the giants of the imaginative promotion of the ideas of interplanetary travel, the colonising by man of nearby planets and the urgent need for peaceful exploration of outer space, Sir Arthur C. Clarke, who has died aged 90, was pre-eminent, because of his hard and accurate predictions of the detailed technologies of space flight and the use of near-Earth space for global communications. Yet, in spite of his deep seriousness, J.B. Priestley described him in the 1950s as the happiest writer he had ever known.

Tallish, bespectacled, rather big-eared and thinning on top, Clarke tended to be described by friends as a beaming and highly articulate shambles of a chap, a man to whom convention meant very little. Yet his mind was like a razor. Unlike earlier writers on space travel, his imagination and creativity sprang, not from fantasy, but from sharp scientific and technical insight, unfettered by the arbitrary limitations of the perceptions of his time. His amazing career was possible largely because he was never, in any ordinary sense, quite a part of this world. Indeed, he chose to live in Sri Lanka, partly because it helped him neutralise the influence of western culture.

As he approached 80, it seemed that he had done almost everything that was possible in a lifetime, for he had written dozens of books, plumbed the depths of the Indian Ocean, carried the imagination of mankind to the remotest parts of the galaxy, and gained honours in every corner of the globe. But he then declared that one of his many remaining ambitions was to observe the meeting of alien intelligence with intelligence on Earth, a declaration he qualified by adding with his usual smile — “if there is true intelligence on Earth.”

Life-changing book

The great American astronomer Carl Sagan, no less interested in alien intelligence, replied rapidly, if informally, that the existence of Clarke was proof enough. Sagan was one of the many post-war teenagers whose lives were changed profoundly by Clarke’s non-fiction book, Interplanetary Flight. This did more than spell out the technical case for space flight as a close and exciting reality; it embraced aspects of a new philosophy — in many ways Clarke’s lifelong philosophy — that sprang from the perceived and enormous spiritual need for exploratory adventures of a new kind which, by their magnitude and imagination, might pull and hold mankind together.

Written in 1949 and quickly published on both sides of the Atlantic, it was unique. The text, uncluttered by equations, is aimed at the general reader, yet all the relevant mathematics are gathered in an appendix. The arguments are clear and accessible.

Sagan says he found it modest, beautifully written, and stirring. “Most striking for me was the discussion of gravitational potential wells and the use in the appendices of differential and integral calculus to calculate propulsion requirements, staging and interplanetary trajectories. The calculus, it dawned on me, could be used for important things, not just to intimidate high-school students. Interplanetary Flight was a turning point in my scientific development.”

The turning point in Clarke’s career came slightly later with the publication in 1952 of The Exploration of Space, a non-fiction work that nevertheless became a bestseller on both sides of the Atlantic. As a writer, he was made.

Clarke’s stature and impact was probably greater than that accorded by popular acclaim, for he was highly critical, sometimes effectively, of the limitations and military basis of major space programmes. He was bitterly critical of the 1980s concept of Star Wars and, well before this emerged as U.S. policy, sent a personal appeal from his Physics and Space Institute in Sri Lanka to the U.S. Congress. His video statement, A Martian Odyssey, which was read into the congressional record, argued that money spent on intercontinental ballistic missiles could, to everyone’s benefit, be channelled into an international voyage to Mars to mark the 500th anniversary of the voyage of Columbus in search of the Americas in 1492. He did not predict an end to the cold war, but he always sought and fought for new bridges between cultures.

This underlying seriousness led him to view his creative participation in commercial, if poetic, other-worldly enterprises, such as the film in 1968 of his book 2001: A Space Odyssey as a kind of scenario writing, not to be taken as an example of his central work. In this, however, many would disagree, for 2001 (“a glorified screenplay,” according to Clarke) was in many ways so accurate and convincing that Alexei Leonov, the first spacewalking human, said he felt that it had carried him into space again.

Strangely, out of his huge corpus of non-fiction books, novels, short stories, plays, films, TV series and anthologies — the 1992 authorised biography by Neil McAleer lists 137 titles — Clarke had a special affection for his interstellar novel The Songs of Distant Earth. With its context and action entirely removed from and remote from Earth, it is the first of a new genre. Although not completed until 1985 — he had worked on it for more than 30 years — it was the novel in which he finally shook the last vestiges of earthly soil from his imagination, freeing his curiosity to probe the deepest recesses of the universe and allowing him to isolate and examine human relationships and emotions. Some might say that it was here, in the vastness and extraordinary beauty of space, that Clarke finally rediscovered his own humanity.

“Global village”

This was evident by his increasing belief in the use of communications to bring mankind together in what he called the “global village.” His lifetime thoughts on this were gathered in 1992 into a collection of ideas and idealistic possible futures published under the title How the World Was One: Beyond the Global Village, a dream that satellite communications would promote understanding and worldwide peace.

By this time, however, it was clear that, as with any other technology, the effect of communication satellites depends entirely on their use. Coverage of the wars of the late 20th century showed clearly that global TV, rather than bringing mankind together in peace, can transform the horror of war into exciting and technically interesting family entertainment.

However, this reality never appeared to sour the dreams that had driven Clarke for eight decades, for he never lost his smile or his enthusiasm.

Born in Minehead, Somerset, in the west of England, during the final battles of the first world war — in which his father suffered injuries that brought him to an early death 13 years later — Clarke went to Huish’s grammar school, Taunton, and at 19 into the civil service in London. His father was a telephone engineer who, disastrously, turned to farming after the war, and his mother Nora (Willis) was formerly a telegraphist. His was a communications family.

Like many boys at that time, Clarke became fascinated by American science-fiction magazines. But as he later wrote, the turning point of his life was the discovery, shortly before his father died, of Olaf Stapleton’s book Last and First Men. Its imagination, timescale of billions of years and grand perception of the scale of the universe provided a cosmic framework large enough to set Clarke’s imagination free. He began writing science fiction.

At 17 he joined the British Inter-planetary Society, an organisation then widely regarded as crackpot, but of which he was later to be treasurer, and eventually, chairman.

In the civil service his mathematical ability took him into auditing. But in 1941 he joined the RAF where, via electronics training, he became an instructor at radio school. Finally he went to work on the development of American ground control approach radar at Davidstow Moor in north Cornwall, in the south west of England. The head of the U.S. team was Nobel-prizewinning physicist Luis W. Alvarez — the first high-level scientist with whom Clarke had worked. As he described obliquely in his book Glide Path (1963), his only non-science fiction novel, this period shaped his decision to turn to science.

In 1945 he published his famous pioneering paper on the possibility and technical potential of geosynchronous satellite orbits in global and inter-planetary communications. On leaving the RAF in 1946, he went to King’s College London, gaining a first in physics and mathematics, and then sought a postgraduate degree in astronomy. The course was so boring that he became assistant editor of Science Abstracts (1949-50) so that he would have time to think and to write.

A legend

The rest is almost a legend of our time. In 1953, on a U.S. tour and with success already evident, he had a whirlwind romance with Marilyn Mayfield, a young and beautiful divorcee who described the then bearded and buccaneering Clarke as her own Errol Flynn. Eleven years later, after Clarke had chosen Sri Lanka as his working environment, the marriage was dissolved. His energy and momentum was at its height, taking him to the depths of the Indian Ocean and to the Great Barrier Reef as a scuba diver, and to every forum in the world where missiles and space flight were an issue. He spoke unwaveringly for collaboration and peace.

His last years were increasingly limited. Post-polio syndrome — he had an attack in 1962 — left him confined to his wheelchair, and much of his contact with the wider world was by telephone and videolink. He was often one of the celebrities exploited by NASA and other agencies to mark great moments in the exploration of space.

But he remained unsentimental, with a cheerful capacity for sending himself up. His confinement and age seemed not to trouble him, but in 1998 a British newspaper alleged that Sir Arthur — his knighthood had just been announced — had been involved in sexual predation upon the young. He refused to accept his honour until the authorities had investigated and cleared his name. His knighthood was awarded by the Prince of Wales on a visit to Sri Lanka in 2000.

Certainly, Clarke’s imagination was magical; from his near-Olympian heights, he could see more than ordinary men will ever see. Moreover, he possessed the power to carry anyone who wished to join him to these great heights of mystery and clarity. If the world believes the clarity to be deceptive, it is not the fault of Arthur C. Clarke.

(This obituary has been revised since Anthony Tucker’s death in 1998.)

* * * * *

Three laws of prediction

Apart from his huge output of books, Clarke left us his Three Laws, touched by the kind of eternal practicality that made his science fiction so effective, while revealing his inner convictions:

1. When a distinguished but elderly scientist says that something is possible, he is almost certainly right. When he states that something is impossible, he is very probably wrong.

2. The only way of discovering the limits of the possible is to venture a little way past them into the impossible.

3. Any sufficiently advanced technology is indistinguishable from magic.

Guardian Newspapers Limited, 2008

(The Hindu, 21:03:2008)
==================================

Labels:

విలక్షణమైన విలనీ ఇక లేదు




'శివ... శివ... ఎవడా శివ? ఆఫ్ట్రాల్‌ ఓ స్టూడెంట్‌! రెండు లారీల జనాన్ని తీసుకెళ్లి నరికేయండి' - ఈ డైలాగ్‌ 90వ దశకంలో తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొంది. అంతేకాదు ఆ సంభాషణలు పలికిన నటుడి హావభావాల్నీ, నటన శైలిని చూసి ఇటు ప్రేక్షక లోకం... అటు సినీ రంగం ఓ మంచి నటుడు మనకు దొరికాడు అనుకొంది. నిజానికీ ఆ ప్రతినాయకుడికి అది తొలి చిత్రం ఏమీ కాదు. అప్పటికే మన తెలుగువారికి అతని ముఖం పరిచయమే. 'పసివాడి ప్రాణం'లో వికలాంగుడైన విలన్‌ని చూసినప్పుడే అందరూ మంచి నటుడు అన్నారు. కానీ 'శివ' తరవాతే వరుసగా సినిమాలు చేశారు. అతనే రఘువరన్‌. విలనీకి ఆయన కొత్త అర్థాన్ని చెప్పారు. భయంకరమైన మేకప్పులు, అరుపులతో సాగిపోతున్న ప్రతినాయకుల ధోరణికి అడ్డుకట్ట వేశారు. ట్రెండ్‌కి అనుగుణమైన ఆహార్యంలో కనిపిస్తూ - ఆధునిక శైలిలో మాట్లాడుతూ తేనె పూసిన కత్తిలాంటి విలన్‌గా కనిపించడం ఆయన పద్ధతి.

సంభాషణ చతురుడు: చెన్నైకి చెందిన రఘువరన్‌ 1982లో సినీ రంగ ప్రవేశం చేశారు. 'ఏళావదు మణిదన్‌' ఆయన తొలి చిత్రం. అందులో కథానాయకుడిగా నటించారు. అయితే అనూహ్యంగా ప్రతినాయకుడిగా ఎదిగారు. తెలుగులో 'మిస్టర్‌ భరత్‌' రఘువరన్‌ మొదటి సినిమా. పూర్తి గుర్తింపుని తీసుకొచ్చింది మాత్రం 'పసివాడి ప్రాణం'. పోలియో వ్యాధిగ్రస్తుడైన ప్రతినాయకుడిగా కనిపిస్తారు. అతనికీ ఓ పసివాడికీ, చిరంజీవికీ మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. రఘువరన్‌ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం రామ్‌గోపాల్‌ వర్మ 'శివ'. అందులో భవానీ పాత్రలో ఒదిగిపోయిన తీరు పలు అవకాశాల్ని తీసుకొచ్చింది. రజనీకాంత్‌తో చక్కటి స్నేహబంధం ఉంది. ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాల్లో విలన్‌గా రఘువరన్‌ నటించారు. 'బాషా'లోని ఆంథోనీ పాత్ర తమిళ ప్రేక్షకుల్ని అలరించింది. ముత్తు, అరుణాచలం లాంటి సినిమాల్లో రజనీతో కలిసి నటించారు. 'ప్రేమికుడు', 'ఒకే ఒక్కడు', 'ఆజాద్‌', 'రక్షకుడు', 'మాస్‌' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆయన ప్రత్యేకతల్లో సంభాషణాచాతుర్యం ఒకటి. తన డైలాగుల్ని స్పష్టంగా వినిపించేలా పలికేవారు. మాటకీ మాటకీ మధ్య రెప్పపాటు గ్యాప్‌ ఇచ్చేవారు. ఈ పద్ధతి ప్రేక్షకులకు నచ్చింది. కేవలం విలన్‌ పాత్రలకే పరిమితం కాలేదు. కథను నడిపే కీలక పాత్రల్లో సైతం చక్కటి నటనను ప్రదర్శించారు. ఇందులో తొలుత చెప్పుకోవల్సింది 'అంజలి' చిత్రమే. మణిరత్నం రూపొందించిన ఈ సినిమాలో చిన్న పాపకు తండ్రిగా రఘువరన్‌ పలికించిన నటన అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలందుకొంది. అలాగే పవన్‌కల్యాణ్‌ తండ్రిగా 'సుస్వాగతం'లో ఆయన నటన చెప్పుకోదగ్గదే. 'రన్‌', 'నాగ', 'వాళ్లిద్దరి వయసూ పదహారే', 'ఆహా', 'చిరునామా' లాంటి చిత్రాల్లో తండ్రిగా, బావగా, అన్నగా మహిళా ప్రేక్షకుల్ని మెప్పించారు. తెలుగు ఆయన నటించిన చివరి చిత్రం 'మంజీరా'. విడుదల కావల్సి ఉంది.

ఒడిదొడుకుల జీవితం: నటి రోహిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. రఘువరన్‌ మద్యానికీ, మత్తు పదార్థాలకీ బానిస అయ్యారు. దీంతో మనస్పర్థలొచ్చి విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత రఘువరన్‌ కర్ణాటకలోని ఓ ఆశ్రమంలో చేరి చికిత్స పొందారు. తమిళంలో 'ఒరు మనిదనిన్‌ కతై' అనే బుల్లితెర ధారావాహికలో నటించారు. ఇందులో మద్యానికి బానిసైన వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఏం కోల్పోతాడో చూపించారు. ఈ కథ రఘువరన్‌ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఆయన మృతి చెందారన్న వార్త తమిళ, తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది. ఆయన నివాస గృహానికొచ్చి విజయ్‌కాంత్‌, శరత్‌కుమార్‌, విజయ్‌, సుహాసిని, మణిరత్నం, అజిత్‌, రాధిక తదితరులు నివాళులర్పించారు. విడాకులు పొందినా ఆయన భార్య రోహిణి, కుమారుడు సాయిరిషి వచ్చి మృతదేహం చెంత ఉండి కన్నీరుపెట్టుకున్నారు. రఘువరన్‌ మృతికి తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. - న్యూస్‌టుడే, చెన్నై (Eenadu, 20:03:2008)
_____________________________

Chennai, March 19: Raghuvaran, one of the most versatile actors in South Indian cinema, passed away early Wednesday at a private hospital here. The 49-year-old veteran of more than 80 films was ailing for sometime and was recently treated for an abscess on the leg. He was discharged but was rushed back to the hospital early on Wednesday when he developed complications. He died shortly afterwards, family sources said.

They said his estranged actor-wife Rohini was by his bedside when Raghuvaran breathed his last. Several film stars visited his house to pay their last respects. He was cremated in the evening. A product of the Film Institute, Raghuvaran made his debut as hero in the offbeat award-winning film Ezhavadhu Manidhan directed by ace filmmaker Hariharan. The tall-lanky actor turned a character artiste and villain, making an indelible impact with his casual screen presence and voice modulation. He had acted with top stars in Tamil, Telugu and Malayalam movies. His memorable films include Samsaram Adhu Minsaram, Badsha, Anjali, Mudhalvan, Sivapadhikaran and Sila Nerangalil.

His personal life suffered some rough times. His marriage ended in divorce and son Sai Rishi, whom he deeply loved, moved away to live with mother Rohini. Personal problems kept him away from the studios and hero Sarath Kumar managed to coax him back to work. “We will badly miss him,” said Sarath after placing flowers on the body. “He was an actor with a unique style and a fine human being too,” said the president of the South Indian Film Artistes’ Association. Star-politician Vijayakanth said Raghuvaran was an ‘incredible’ actor who treated everyone with respect.

(The Deccan Chronicle, 20:03:2008)

Raghuvaran, 59, was survived by his ex-wife Rohini and 8-year-old son Sai Rishi.

=============================

Labels:

Wednesday, March 19, 2008

Finger paintings, these are a must see

It'll take him four hours to do a hand. Then he photographs it for posterity.
I cannot imagine how he does the eyes so remarkably lifelike.
It took him 10 hours to do the two-handed Eagle in picture #1.





















(An email forward)
=====================================

Labels:

ఫన్‌కర్‌ ఫటాఫట్‌



* నేను ఒక అమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నా. అయినా ఇద్దరి ఐడియాలూ కలవడం లేదు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. పరిష్కారం చెప్పి పుణ్యం కట్టుకోండి.

అదేం పెద్ద సమస్య? ఇద్దరి సెల్‌ఫోన్లకూ ఐడియా కనెక్షన్లు తీసుకోండి. ఐడియాలు అవే కలుస్తాయి.
________________________________
* ఎంసెట్‌లాగా బీసెట్‌ పెట్టి అందులో ఉత్తీర్ణులైన వాళ్లనే వ్యాపారం చేయడానికి అనుమతిస్తే?

ఉత్తీర్ణులైన వాళ్లు ఏం'సెట్టు'లే హలా అంటారు. కానివాళ్లు 'ఎంట్రన్సు'లోనే ఆగిపోయి ఎంత'సెట్టు'కు అంత 'ధూళి' అని పాడుకోవాల్సిందే.
________________________________
*స్టాక్‌తత్వం ఒక్కముక్కలో చెప్పండి?

అంతా 'జోక్‌'!
________________________________
* బడా పారిశ్రామికవేత్తకైనా, రాజకీయ నాయకుడికైనా అవసరమైనవి?

'కోట్లు...' వరించడానికైనా, ధరించడానికైనా.
________________________________
* రామాయణంలోనూ, భారతంలోనూ వ్యాపారం ఉందా?

అప్పుడుందో, లేదో తెలీదు గాని, ఇప్పుడు మాత్రం రామాయణం మీద, భారతం మీద బోలెడంత వ్యాపారం జరుగుతోంది.
________________________________
* కల నిజం కావాలంటే ఏంచేయాలి?

పగలు నిద్రపోకుండా ఉంటే సరి.
________________________________
* కచ్చితంగా మరో జన్మ ఉండాలంటే ఏంచేయాలి?

ఇచ్చినవాడి దగ్గరల్లా అప్పులు చేసేయాలి. రుణాలు తీర్చుకోవడానికైనా వాడు మళ్లీ పుట్టాలని అప్పులవాళ్లు సామూహిక ప్రార్థనలు చేస్తారు.
_______________________________
*మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్లింది. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా?

బహుశా స్టాక్‌ మార్కెట్‌ పడిపోవచ్చు (ఈమధ్య ఎక్కడేం జరిగినా పడిపోతున్నది షేర్ల ధరలే కదా!)
_______________________________
* లక్షకారు లక్షణంగా ఉంటుందంటారా?

కొనేవాడు కోటీశ్వరుడైతే!
_____________________________

(Eenadu, 10:02:2008)
===============================

Labels:

జెండా వూంచా... రహే హమారా..

పూర్వకాలంలో వీరుల రథాలకు పైన జెండాలుండేవి. వాటిని ధ్వజాలనేవారు. ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేక చిహ్నం ఉండేది. ఆయా ధ్వజ చిహ్నాలతో కలిపి వీరులను సంబోధించడం పరిపాటి. భీష్ముడు- తాళధ్వజుడు, అర్జునుడు- కపిధ్వజుడు అలా... రణరంగంలో తీవ్రమైన పోరు జరిగే సమయంలో వీరులను గుర్తుపట్టేందుకు వారి రథాలపై ఎగిరే జెండాలే ఆధారం. ఫలానా వీరుడితో పోరాడాలి, రథం పోనిమ్మని రథికుడు ఆజ్ఞాపించేవాడు. వారి టెక్కెపు గుర్తులను సారథి పసిగట్టి, ఆ దిశగా రథం నడిపించేవాడు. భారతం ఉత్తర గోగ్రహణ ఘట్టంలో కౌరవవీరుల రథాలపై రెపరెపలాడే జెండాలను తిక్కన గొప్పగా వర్ణించాడు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాడు కలశజుండు... స్వర్ణమయ వేదిక గుర్తుగా ఉన్న జెండా ఎగురుతోందే... ఆ రథంలో అస్త్రవిద్యాగురువు ద్రోణాచార్యులవారు ఉంటారు.. మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి... మణులు కలిగిన మహాసర్పాన్ని సుయోధనుడు తన కేతనానికి చిహ్నంగా పెట్టుకున్నాడని అర్జునుడు మిగిలిన వీరుల ధ్వజ చిహ్నాల గురించీ ఉత్తర కుమారుడికి వివరిస్తాడు. అలా రథాలపై సగర్వంగా ఎగిరే జెండా ఆయా వీరుల శౌర్యప్రతాపాలకు ప్రతీక. పరాక్రమానికి చిహ్నం. పౌరుషానికి సంకేతం. కాలం పుటలపై వీరుల చరిత్రలను లిఖిస్తున్నాయా అన్నట్లుగా జెండాలు రెపరెపలాడుతుంటాయి. వారి విజయగాథలను ఆలపిస్తున్నాయా అన్నట్లుగా చిన్నగా సవ్వడి చేస్తుంటాయి. ప్రతి మహావీరుడికీ తన జెండా ప్రాణసమానం, జెండాను పడగొట్టడమంటే తలతెగ్గొట్టడమే! రథకేతనాన్ని విరవడం ద్వారా వీరుణ్ని నిర్వీర్యుణ్ని చేయడం యుద్ధవ్యూహంలో ఒక భాగం. వీరుల విషయంలో జెండా అంటే ఏదో మామూలు గుడ్డపీలిక ఎంతమాత్రమూ కాదు. అది పౌరుషచిహ్నం, సలసల కాగే రక్తం. సర్రున లేచే స్వాభిమానం, కణకణమండే తెగువ, కుప్పించి ఎగసే కసి. వీరుల కళ్లల్లో ప్రజ్వలించే అఖండ విజయకాంక్షకు ప్రతిరూపం జెండా!

దేశం విషయానికి వస్తే- అది జాతి స్వతంత్ర ప్రతిపత్తికి జయకేతనం. సర్వతంత్ర స్వతంత్ర భారతదేశ సార్వభౌమత్వానికి వైభవోపేతమైన చిహ్నం- మన జాతీయ జెండా! మనది త్రివర్ణపతాకం. జెండా అనే రెండక్షరాలకు, దానిలోని మూడురంగులకు- ప్రచండ మార్తాండమండల సహస్ర దుర్నిరీక్ష్య సహజ తేజోవిరాజితమైన ఘనచరిత్ర నేపథ్యంగా ఏర్పడి ఉంది. ఎందరో దేశభక్తుల త్యాగానికి వేదికగా, వారి గుండెచప్పుళ్ళ నివేదికగా భాసించింది. ఈ జాతిని ఉరకలెత్తించింది. ఉర్రూతలూగించింది. ఉత్సాహానికి ఊపిరులూదింది. కుంచెలను, కలాలను పరుగులెత్తించింది. గళాలను హోరెత్తించింది. మనజెండాను కీర్తించిన ప్రతిపదమూ, ప్రతిపద్యమూ, ప్రతిపాటా ఒక్కో జాతీయగీతమా అన్నంతగా ప్రాచుర్యం పొందాయి. జాతీయజెండా కనబడితే చాలు- పౌరులకు నాడు దేహం నిటారుగా నిలిచేది. చిన్నజెండాను చొక్కాగుండీకి గుచ్చిపెడితే, గుండెకే అతికించినంతగా స్పందింపజేసేది. థిల్లాంగ్‌ రాగచ్ఛాయలో హుందాగా సాగే మన వందేమాతర గీతం, గుండెల్లో గణగణగంటల సవ్వడిచేసే మన జనగణమన, నరనరాల్లో ఉత్తేజాన్ని నింపే మన మువ్వన్నెల జెండా... భారత జాతికి సౌభాగ్యం అనడం అతిశయోక్తి కాదు. గాంభీర్యం, ఔన్నత్యం, ఔజ్జ్వల్యం వంటి గొప్పపదాలకు సజీవప్రతీకగా ప్రకాశించేది మన మూడు రంగుల జెండా! ఆంధ్రుడు పింగళి వెంకయ్య రూపొందించిన ప్రస్తుత జాతీయజెండా స్వరాజ్య సమరోద్యమ చరిత్రలో సంచలనాలు సృష్టించింది. మన యోధులు సగర్వంగా ఎగరేసిన జెండాలను ఆంగ్లేయులు పీకి పారేసేవారు. అవి నేలను తాకరాదని, మట్టిపాలు కారాదని జాగృత కార్యకర్తలు నేలపై అడ్డంగా పడుకుని జెండా గౌరవాన్ని కాపాడ్డానికి ప్రాణాలకు తెగించి సాహసాలు చేసేవారు. తాము ప్రాణాధికంగా ప్రేమించడమే కాదు, జెండాను ఎవరైనా అవమానపరిస్తే సహించని లక్షణం కూడా ఆ తరంలో ఉండేది.

ఇటీవలి కొన్ని పరిణామాలు చూస్తుంటే ఒకవైపు ఆవేదన, మరోవైపు ఆందోళన కలుగుతున్నాయి. ఈ దేశానికి స్వేచ్ఛ లభించిన ఆగస్టు పదిహేనో తేదీని మనం స్వాతంత్య్ర దినోత్సవంగానే కాక, 'జెండా పండుగ'గానూ పిలుస్తాం. అలాంటి పర్వదినం రోజున త్రివర్ణపతాకాన్ని తలకిందులుగా ఎగరేస్తున్న అధికారులు కనిపిస్తున్నారు. ఒక సినిమాలో విలన్‌ పాత్రధారి జెండాను చేతిగుడ్డలా వాడుతూ- దీనితో తుడుచుకుంటాను, ఏం చేస్తావని మిలిటరీ అధికారిని పెడసరంగా ప్రశ్నించి తన్నులు తింటాడు. జెండాకు తన కాళ్ళు తగిలేలా నిర్లక్ష్యంగా కూర్చుంటుందొక క్రీడాకారిణి. ఒక మోడలైతే జెండా రంగులను తన చీర అంచుగా డిజైన్‌ చేయించుకుని విలాసాలను ఒలకబోస్తుంది. నాటికి, నేటికి ఎంత తేడా! త్యాగబుద్ధీ, దేశభక్తీ పడుగూ పేకలుగా నేసిన అపురూపమైన, పవిత్రమైన జెండా పట్ల ఈతరం చూపించవలసినంత శ్రద్ధ చూపించడం లేదనిపిస్తోంది. జెండాలు మోసేవారికే పార్టీ పదవులని మన రాజకీయ నాయకులు ప్రకటిస్తుంటారు. జెండా మోయడమంటే పార్టీకి సేవ చేయడమనే వారి భావన. జెండాకు, పార్టీకి తేడాలేదని వారి అభిప్రాయం. పార్టీ సిద్ధాంతాలపట్ల అంకిత భావం, నిబద్ధత కొరవడితే జెండా మోయాలన్న ఆలోచనే రాదన్నది వారి నమ్మకం. ఆ రకంగా పార్టీకి, జెండాకు తేడా లేదన్న సందేశాన్ని శ్రేణుల్లోకి జొప్పిస్తారు. జెండాల రూపకల్పనలో రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. తమ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రతిబింబించేలా జెండాల్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటిది- కొన్నితరాలుగా ఎంతో గొప్పగా ప్రభావితం చేస్తూవచ్చిన జాతీయ జెండా పట్ల ఉదాసీనత న్యాయమేనా?


జెండాయే కేంద్రబిందువుగా సంకల్పించిన ఇటీవలి 'తిరంగా రన్‌' వయోభేదం లేకుండా వేలమందిని ఉత్తేజభరితుల్ని చేసింది. జెండా ప్రభావంలో లోపం ఏమీలేదు. కొద్దిమంది నిర్లక్ష్యంవల్లనే కొన్ని బాధాకరమైన సంఘటనలు ఎదురవుతున్నాయంతే. ఇలాంటి అవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజానీకం చైతన్యవంతమై స్పందిస్తే- మళ్ళీ మన జాతీయజెండాకు పునర్వైభవ ధగధగలు తథ్యమే!
(Eenadu, Editorial, 10:02:2008)
==============================

Labels: ,

Monday, March 17, 2008

గుండెమంటలార్పే కన్నీళ్లు...

'ఏమిటమ్మా! అంత విచారంగా కూర్చున్నావు' అని తోడికోడలు మాటవరసకు పలకరిస్తే, 'ఏం చెప్పమంటావు అక్కా, ఈ వారం మొత్తంలో తృప్తిగా ఏడ్చే అవకాశం ఒక్కటీ దక్కలేదు... నా బాధ ఎవరితో చెప్పుకోను?' అని వాపోయే వనితలు ఈ లోకంలో పెద్దసంఖ్యలోనే ఉన్నారు. కొందరైతే ఏడవడం కోసమే తాము పుట్టినట్లు, అది తమ విధ్యుక్త ధర్మమన్నట్లు, దీక్షగా ఉద్యమిస్తారు. 'బాలానాం రోదనం బలం' అన్నారేగాని, 'ఏడుపు అతివలకు బలవర్థకం' అని ఎవరూ చెప్పలేదే భామా! కలకంఠి కంట కన్నీరొలికితే సిరి ఇంట్లో ఉండనంటుంది... ఇక నా మాట విని ఊరుకోవే అంటూ భర్తలు సతమతంకావడం మనం వింటూనే ఉన్నాం. ఏడవడం ఎరుగని సుకుమారిని చూసి ''ఆమె ముక్కెప్పుడును చీదినట్లు లేదు, హస్తమున సూదిమందెక్కినట్లు లేదు' అని ఉత్పలవారు తమ 'స్వప్నాల దుప్పటి' చాటున విస్తుపోయారు. ఎవరేమనుకున్నా- 'ఏడవడం తప్పేంకాదు... మనసును తేలికపరచే మానవ సహజ ప్రక్రియ అది... భావోద్వేగాలు అలా బయటపడటమే ఆరోగ్యానికి మంచిది... బలవంతంగా అణచిపెడితే కోపంగానో, చిరాకుగానో తర్జుమా అయ్యే ప్రమాదం ఉంది. ఒకోసారి నేరాన్ని ప్రేరేపించేంత బలంగానూ కూడా తయారవుతాయి... కనుక సిగ్గుపడకుండా, మనసు తేలికపడేలా ఏడవడమే మంచిది' అని మనస్తత్వవేత్తలు అంటున్నారు. 'ఆ సంగతి అలా ఉంచండి, తనకోసం కన్నీరుకార్చే స్త్రీ ఉండటం పురుషుడి భాగ్యం అని గ్రహించండి'- అన్నారు మహాకవి. ''నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన.. అంతకన్నా మహాభాగ్యం ఏముంది?'' అని ప్రశ్నించారు. ఈ రహస్యాన్ని గ్రహించినవాడు కాబట్టే రాయప్రోలువారి నాయకుడు 'ఈ తృణ కంకణంబు భరియింపుము... నీ ప్రణయ బాష్ప జలాంజలి నింతయిచ్చి, ఏ రీతిని వాడకుండ నలరింపుమ'ని ప్రాధేయపడ్డాడు.

భావోద్వేగాలు స్త్రీలకే సొంతమా, పురుషులకు మాత్రం ఉండవా అంటే- లేకేం, శ్రీరామచంద్రుడంతటివాడు సరయూ నదిని చూసేసరికి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ''ఈ తీరంలోనే మా అమ్మా నాన్న నా చేయి పట్టుకుని నడిపిస్తూ, నదీ సౌందర్యాన్ని పరిచయం చేశారు... మరి నేను వారి చేతులు పట్టుకుని నడిపిస్తూ వారికి ప్రాణసుఖం కలిగించేదెన్నాళ్ళకో!'' అని సీతతో చెప్పుకొని వాపోయింది- భావోద్వేగాలకు లోనుకావడంవల్లనే కదా అన్నాడొక రచయిత. అయినవాళ్ళు దూరమైనప్పుడు దుఃఖం కలగడం సర్వసహజం. దానికి స్త్రీ పురుష భేదంలేదు. నిజానికి ఉద్వేగం కారణంగా కన్నీరుపెట్టే జీవి ఈ సృష్టిలో మనిషి ఒక్కడే. అదే మనిషి ప్రత్యేకత. భార్యావియోగదుఃఖం నుంచి బయటపడే క్రమంలో 'వరలక్ష్మీ త్రిశతి' రచించారు విశ్వనాథ. కన్నతల్లి మరణం తీరని శోకాన్ని రగిల్చినప్పుడు 'నీవు మడిగట్టుకుని పోయినావు పండ్లు, పుష్పములు తీసికొని- దేవ పూజ కెటకొ! నేను నీ కొంగు పట్టుకు నీదువెంటపోవుటకు లేక కన్నీటిబొట్లు రాల్తు''నని విలపించారు నాయని సుబ్బారావు. ''ప్రియురాలు మరణింప ప్రియుడు కట్టించె కన్నీటి తలపోతగా తాజమహల్‌'' అని వివరించారో కవి. కావ్య నిర్మాణానికి ఉపక్రమించబోయే కవులంతా ''ఏడిచి ఎన్నాళ్ళయినదీ ఎద! అశ్రులు కనుమోసులందు ఓడిచి ఎన్నినాళ్ళయినదోయి'' అంటూ బాధపడతారని కవితా నిర్మాణ వ్యూహాలను వెల్లడించారు కృష్ణశాస్త్రి. ''రేయి కడుపున చీకటి చాయవోలె... నా విషాదమ్ములో దాగినాడ నేనె'' అని తన స్వవిషయమూ వెల్లడించారు. మొత్తంమీద ఎవరికైనా కన్నీరు సహజమేనని, గుండె బరువును తగ్గించేందుకు అది చాలా అవసరమని జనం అంతా నమ్ముతూ వచ్చారు. అలా అని కన్నీరే శాశ్వతంకాదు. ''గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు... ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు'' అని ఓదార్పుచెప్పారు మనసు కవి. 'ఏడవకండి ఏడవకండి' అని వెన్నుతట్టి ధైర్యం చెప్పారు మహాకవి.

కన్నీరు అందరికీ సహజమే గాని, అబ్బాయిలకంటే అమ్మాయిలు ఐదురెట్లు ఎక్కువగా కన్నీరు కారుస్తారు. ఏడ్చే సమయం సాధారణంగా ఒకటి రెండు నిమిషాలు... అంటున్నారు శాస్త్రజ్ఞులు. ''కన్నీళ్ళను బలవంతంగా అడ్డుకోవడం వల్లనే అబ్బాయిల విషయంలో ఒత్తిడి అధికంగా ఉంటోంది'' అంటున్నారు. ఆధునిక జీవనశైలిలో రెండు పదుల వయసులోనే కుటుంబాలకు దూరంగా ఉద్యోగ బాధ్యతలను నెత్తికెత్తుకున్న యువతరం తరచూ భావోద్వేగాలకు గురికాక తప్పదనీ, వాటిని సహచరులతో పంచుకోవడం మంచిదనీ సలహా ఇస్తున్నారు. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం- అబ్బాయిలు కూడా కన్నీటి అవసరం, ప్రయోజనం అర్థం చేసుకుంటున్నారు. ఈ తరం జీవనశైలిలో ఒదిగేందుకు సున్నితమైన లక్షణాలను అలవరచుకోవాలని వారు గుర్తిస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కన్నీరు మంచి ఔషధమన్న విషయం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. కష్టం వచ్చినప్పుడు ఓదార్పు కోసం భార్య ఒడిలో తలదాచుకుని, రెండు కన్నీటి చుక్కలు రాలిస్తే మగతనానికి వచ్చిన లోటేమీలేదని భావిస్తున్నారు. ప్రేమ విఫలంకావడం, అనుకున్న ఉద్యోగం రాకపోవడం వంటి విషయాల్లోనూ సాంత్వనకోసం అబ్బాయిలు కాసేపు ఏడవడానికే సిద్ధపడుతున్నారు. భావకవితా ఉద్యమం సమయంలో చాలామంది కవుల్లాగే- భావుకతను గౌరవిస్తున్న నేటి యువతరం సైతం సున్నితమైన భావాలను అలవరచుకోవడం, వాటికి స్పందించడం మంచిదే. ముద్దుముద్దుగానా లేక బావురుమని ఏడవడమా అనేది మాత్రం ఎవరికివారు తమకెదురైన పరిస్థితులను బట్టి తేల్చుకోవడం మేలు. మోతాదు ఎంతనేది కాదు, ఏడుపు బాపతు అవసరాన్ని గుర్తించడమే ముఖ్యం అంటున్నారు సామాజిక శాస్త్ర నిపుణులు.
(Eenadu, 03;02:2008)
____________________________

Labels:

The aboriginal butterfly

LIZA BEJOY

Let me recollect reading an experience in which a person used to watch and enjoy the wonderful transition of a pupa into a butterfly. The dirty worm undergoes serial changes and then tries hard to emerge from the cocoon. Each time it tries it fails... and each failure inspires it to give yet another try! Finally, the beautiful butterfly emerges, throwing the viewer into leaps of joy!

One day, the person decides to lend a helping hand so that the butterfly will have little struggle for the whole task. But, alas, the easy but premature emergence did only harm — the wings were not fully developed and the creature that emerged was a dull, wingless, helpless, good for nothing. The entire beauty of the butterfly was a virtue of its untiring efforts to exit from its shell.

The story of the Australian aborigines is almost the same. The ‘whites’ thought they were lending them a helping hand by enabling them to ‘act white, speak white and think white.’ How has it helped them? It would be better to ask ‘to what extent it has harmed them?’

Let us view this issue from a different perspective. There is a beautiful concept called ‘adaptation’ which refers to the changes that a living thing undergoes to adjust to its surroundings. The world has diverse environmental conditions. The inhabitants take their own time and adapt their own ways to live harmoniously with their environment. That is why a camel has a hump on the back (food conservation), the cactus has thorns instead of leaves (water conservation), a penguin has thick flaps instead of wings (heat conservation) and so on.

Same is the case with human beings also. The complexion, physique, language and lifestyle of a person or race are the virtues of their struggle to survive in their habitat. These are the hard-earned callosities they have acquired from life experiences. It would be foolish to down-trod a population as ‘black’ since this complexion itself is an adaptation to adverse climatic conditions.

It would be stupid to humiliate an age-old culture, as each civilisation has evolved and is evolving slowly at its own pace, to enable the population to live amicably with nature. And here comes the ‘white’ to the empire of the ‘black’ to civilise them and teach the ‘ways of the fair-complexioned’!

But they forget that the ways of the whites are only suited in the land of the whites. The whites have given a premature delivery to the ‘aboriginal butterfly’ thus giving birth to a ‘wingless, helpless’ population. Now a third perspective on this issue is the loads of agony showered on the aborigines. Who will answer the depressed mothers, the emotionally orphaned (though fostered) children, the frustrated youth, the broken families, the humiliated culture, the inhumaned humanity and above all, the broken rules of natural existence and adaptation?

From space, Astronaut Sunita Williams could see no borders — no political, social, racial, cultural or economic boundaries — only the serene blue waters laced by pearly surf and interspersed with brown and green land!

When will the human race awake to this wonderful spectacle?

(The hindu, 16:03:2008)
____________________________

Labels:

Romance and the Indian woman

HEMA SUBRAMANIAM
Many women in a marriage suffer from contempt bred from familiarity
---------------------


This article is written solely from a women’s perspective. As I write this, I sincerely hope that people who read this article are provoked — into thinking, into debates, and into action. Our society has always adopted a patronising attitude towards a woman’s need for romance after marriage, kids, etc. I find that many women in a marriage suffer from contempt bred from familiarity.

But let us start at the beginning. All of us have seen weddings. There is so much of hope and prayers that the couple should be happy. When you begin with such blessings, one would think that things can rarely go wrong. Initially in most cases, the euphoria continues. Then the individual expectations set in.

There are the usual “husband-wife” fights. Trivial things, when the making up is as much fun as the fighting. But that deteriorates. Children come in. And this is when the trap closes. Children play an ironic role here: they help parents bond over the their problems, health and future. They are also the reason that most couples agree to co-exist.

Simple problem

I had a close friend who had a very simple problem in her marriage. That of apathy. Her husband just took her for granted. He most certainly cared for her, but over time, he also treated her as a part of the furniture. Her frustration steadily gave way to anger and a need for attention, romance. Her in-laws were aghast at her talk of a separation.

They felt that unless a woman is beaten, tortured (physically/mentally) and cruelly treated, there is no need for such talk of separation/divorce. And what about the children? Well, my friend also felt that children should not be victims. So she chose to stay in the marriage, to co-exist with her inert husband.

I feel our society is evolving. I don’t see women continuing to placidly accept their “lot” in the marriage. I believe most of our menfolk (after the first few years of marriage) get married again. To their careers or to the television. Or something else. The wife morphs into just being the mother of the kids.

What if the woman chooses to demand more, but not get more? Would she continue to remain trapped in a superficial marriage? Would she try and seek romance elsewhere (now I am walking on thin ice…)? If she has her financial independence too (which is now common), would it not be dangerous to take her for granted?

Many times, as I have voiced this thought, men have asked me to spell out what has to be done. They are genuinely puzzled. What do their wives need? The word romance makes them squeamish and embarrassed. My only solution is to make them go down memory lane. What did they do during the engagement period, when they were wooing her? What about those heady initial days of marriage? I admit they cannot entirely re-construct that. It would be artificial too.

‘Smelly socks syndrome’

I believe that most Indian marriages are emotionally unfair to the woman. After all the attention of being a PYT (pretty young thing), then a bride, then a mother, and then… then nothing. Just the monotony of everyday life. A friend once told me that marriage and children kills all romance. That it is very difficult to be romantic about someone with whom you have lived for a decade. The “smelly socks syndrome.” So now, we have a discontented wife, who wants romance, but would start giggling if her husband of 15 years begins romancing her.

I believe that that apathy, emotional negligence and boredom in a marriage are going to stir up a small revolution of sorts. What is disturbing is that most men do not even acknowledge this as a serious issue. It is dismissed as something trivial. One told me pompously that there were larger issues in some marriages. But if they were to actually question this need to be romanced, actually pose this question to their wives, sisters, friends, they just might be surprised. Isn’t that reason enough to call for a change?

livechema@yahoo.co.in

(The hindu, 16:03:2008)
_____________________________

Between romance and responsibilities G. Muthuswamy

The article “Romance and the Indian woman” (Open Page, March 16) is thought provoking. The writer should be appreciated for her carefully worded article.

It may be true that romance is missing in the married life of many couples, especially in the middle class families. But the statement “many women in a marriage suffer from contempt bred from familiarity” may not be true. In fact, over a p eriod of time, intimacy and love between couples actually grow. But, practical romance may be eluding in many of the couples’ lives due to various demands of modern day life.

As the writer aptly puts it, most of our men folk after a few years of marriage ‘get married again to their careers...’ Men get wedded to their careers with a good intention, born out of love, to earn more to provide their wives and children with all modern day facilities — even luxuries. In the process, they may lose sight of the need for romance. But when a woman feels that romance is missing in her life, she must understand that her husband is equally missing the same.

The writer talked about children but did not go deep into the present day situation. She simply says: “They (children) are also the reason that most couples agree to co-exist.” In today’s situation, parents practically live for their children. In the present competitive environment, more than the children, parents are eager to make their children come up in life. Most of the middle class parents are ready to pay any price and to sacrifice all their pleasures for their children’s great future.

Moreover, when a daughter or son grows into teen age and above, the romance between the couple is naturally fading away. When the son or daughter is busy with long hours of study at home, stretching into midnight almost every day, how will the poor husband and wife get into a romance mood?

The writer raises the question: “Would she (the woman) try and seek romance elsewhere….? If she has her financial independence too (which is now common), would it not be dangerous to take her for granted?” Men are financially independent for generations together. Do all men, in spite of their various frustrations at home, seek romance outside the marriage? Character, discipline and integrity are purely individual attributes.

However, in a broad analysis, it is true that there is a need for every couple to enrich their married life with more romance, love and care. Such enrichment will do good to men and women in today’s stressful life. Even modern spiritual gurus claim that life is to be celebrated and enjoyed.

It may simply require an open talk between a husband and wife and a little time management to set right things at home and take time for romance. Careful handling of the grown-up children is an essential part of the game.

(The Hindu, 30:03:2008)

=============================

Labels: