Wednesday, January 07, 2009
Tuesday, January 06, 2009
ఆకాశంలో అద్భుతం!

సీత జాడ వెతుకుతూ లంకలో ప్రవేశించిన హనుమంతుడికి నిద్రపోతున్న రావణాసురుడు కంటపడ్డాడు. రావణుడు ఎలా ఉన్నాడో చెబుతూ- మాషరాశి ప్రతీకాశం... మినుముల కొండలా ఉన్నాడని వాల్మీకి వర్ణించాడు. ఆ పోలికలో ఒక విశేషం ఉంది. మినుములు దేహానికి బాగా పటుత్వాన్నిస్తాయి. మినపసున్ని దానికి ఉదాహరణ. ఇనుము లోపంతోనో, కీళ్ళనొప్పులతోనో బాధపడేవారిచేత మన పెద్దలు మినుములు దానం చేయించడంలో రహస్యం అదే! అయితే మినుములు తింటే బుద్ధి క్షీణిస్తుంది. శరీర దారుఢ్యం బాగా ఉన్నవాడేగాని, సీతాపహరణం విషయంలో మాత్రం రావణుడు బుద్ధితక్కువగా ప్రవర్తించాడని అందులో ధ్వని. సముద్రాన్ని దాటేటప్పుడు చారణామార్గంలో వెళ్ళాడని హనుమ గురించి వాల్మీకి చేసిన వర్ణన యోగశాస్త్ర సంబంధిత సూచన. తిరిగి వచ్చేటప్పుడు నక్షత్రాల ప్రస్తావన- జ్యోతిషశాస్త్ర ప్రకర్ష. ఆవిధంగా శాస్త్ర పాండిత్యాన్ని కవిత్వంలో ప్రదర్శించగలవారిని పండితకవులనడం పరిపాటి. కావ్య గౌరవాన్ని శాస్త్ర పాండిత్యం అనేక రెట్లు పెంచుతుంది. వ్యాస మహర్షి భారతంలో ప్రదర్శించిన అపార శాస్త్రజ్ఞతను పండితలోకం విశేషంగా ప్రశంసించింది. భారతాన్ని సర్వశాస్త్ర సంగ్రహంగా నన్నయ వర్ణించాడు. శిశుపాలుని ఆగడాలను నారదుడి ద్వారా విని శ్రీకృష్ణుడు కుపితుడు కాగా భృకుటి ముడిపడింది. అలా ముడిపడిన కనుబొమను మాఘకవి 'ధూమకేతువులా ఉంది' అన్నాడు. తోకచుక్క ఆకారాన్ని మనం గుర్తు చేసుకుంటే- ఆ పోలికలోని సొగసు బోధపడుతుంది. తోకచుక్క వినాశకారి అని ప్రతీతి. అది కనపడితే ప్రజలు ఇప్పటికీ అశుభమని భావిస్తారు. కృష్ణుడి నుదుట పొడిచిన తోకచుక్క శిశుపాలుడి పాలిట యమపాశంగా మాఘుడు సూచించాడన్నమాట.
కావ్యంతో మాఘుడి జ్యోతిష శాస్త్ర ప్రావీణ్యం లోకానికి వెల్లడైంది. మాఘం(శిశుపాలవధ)లోని శాస్త్ర రహస్యాలను, మేఘం (కాళిదాసు మేఘసందేశం)లోని ధ్వని విశేషాలను గ్రహించేసరికి తన బతుకు తెల్లారిపోయిందన్నాడు- మల్లినాథ సూరి! సారావళిలో కల్యాణవర్మ మాదిరిగానే- శిశుపాలవధలో మాఘుడు ప్రస్తావించిన అనేక యోగాల్లో దురుధరాయోగం ప్రధానమైనది. దేవ గురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రుడు ఒకే రాశిలో చంద్రుడితో కలిసి ఉంటే ఆ జాతకుడు విశేష భాగ్యవంతుడవుతాడని జాతకాభరణంలో డుంఢిరాజు వర్ణించాడు. చంద్రునికి ఇరువైపులా అటు పన్నెండో ఇంట్లోను, ఇటు రెండో ఇంట్లోను శుభగ్రహాలుంటే అది దురుధరాయోగమని జ్యోతిష శాస్త్ర పరిభాష! శిశుపాలుడి దుండగాల గురించి చర్చిస్తూ... అటూ ఇటూ ఉద్దవుడు, బలరాములతో కృష్ణుడు వస్తుంటే- గురు శుక్రులతో కలిసిన చంద్రుడిలా ఉన్నాడంటాడు మాఘుడు. శ్రీకృష్ణుడు చంద్రవంశీయుడన్న ధ్వని అలా ఉంచి, అది శుభయోగం, కనుక వారి ఆలోచన ఫలిస్తుందని మాఘుడి సూచన. అలాగే రాజసూయ యాగసభకు వస్తుంటే కృష్ణుణ్ని భీమార్జునులు ఇరువైపులా అనుసరించారు. 'యోగం... ఉభయ గ్రహాంతర స్థితికారితం... దురుధరాఖ్యం ఇందునా...' అని మాఘుడు వర్ణించాడు. గురువు, శుక్రుడు, చంద్రుడు- ఈ శుభగ్రహ త్రయ యోగాన్ని 'శ్రేష్ఠవృత్తి యోగం' అని మరికొందరంటున్నారు. ఇదంతా జ్యోతిష శాస్త్ర పాండిత్య ప్రకర్షకు నిలువుటద్దం. మన కవుల అపార కృషికి నిదర్శనం.
జ్యోతిషం శాస్త్రమవునా కాదా, నమ్మవచ్చా లేదా- అనే వాదనను పక్కన పెడితే... పూర్వకవుల విశేష శాస్త్ర పరిజ్ఞానాన్ని, వారి కల్పనలలోని గొప్ప వూహాశాలితను మనం అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు ఉపకరిస్తాయి. ఆ మూడు శుభగ్రహాల కలయిక యోగదాయకమని జ్యోతిష శాస్త్రం చెబుతుంటే- 'అద్భుతం' అని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటీవల ఆకాశంలో సరిగ్గా అదే అద్భుతం ఆవిష్కృతమైంది. గురు శుక్ర గ్రహాలు- చంద్రుడికి ఇరువైపులా చేరి శాస్త్రజ్ఞులకు విశేష ఆసక్తి కలిగించాయి. నెలవంక వంపుతీరి నోరుగాను, ఆ గ్రహాలు రెండూ కాస్త పైన కళ్లు మాదిరిగాను కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వాస్తవానికి రాత్రిళ్ళు ఆకాశంలో మూడు నుంచి అయిదు గ్రహాలను నేరుగా చూడవచ్చు. అయితే గుర్తించడం కష్టం. ఈసారి మాత్రం గురు శుక్ర గ్రహాలు మరీ దగ్గరగా వచ్చి స్పష్టంగా కనపడ్డాయి. వచ్చే జనవరి రెండోవారం వరకు అలా కనిపించే అవకాశం ఉంది. వాటిలో బాగా కాంతిమంతమైనది శుక్రగ్రహం. రెండోది గురు గ్రహం. గురు శుక్ర గ్రహాలు అలా దగ్గరగా రావడం చాలా అరుదని, దాన్ని కంజెక్షన్ అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. శుభప్రదమనీ దేశానికి యోగకారకమనీ జ్యోతిష పండితులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశమనే చంద్రుణ్ని ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు భయంకర ఉగ్రవాదం రాహుకేతువుల్లా పట్టి పీడిస్తున్న తరుణంలో గురు శుక్రులు చంద్రుడికి ఇరువైపులా చేరి దురుధరాయోగమో- శ్రేష్ఠ వృత్తి యోగమో- పేరేదైనాగాని దేశానికి శుభం చేకూర్చగలిగితే అంతేచాలు... అని సామాన్యుడు గొణుక్కుంటున్నాడు. ఆకాశంలో అద్భుత దృశ్యాలను ఆసక్తిగా గమనించే యువతరానికి- వాటి వెనుక జ్యోతిష శాస్త్ర రహస్యాలుగాని, ఖగోళ శాస్త్ర విశేషాలుగాని తెలిస్తే- ఆ దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుందన్నది సత్యం.
(ఈనాడు, సంపాదకీయం, 07:12:2008)
_________________________________________________________
Labels: Life/telugu
దాంపత్య సౌభాగ్యం
తొలి దశలో మానవులది స్వేచ్ఛాశృంగారం. మనసైన ఆడది కంటపడితే 'తల్లో పూలు కొనిస్త... సేతులకు బందర్ గాజులేయిస్త... ఉప్పాడ చమ్కీ బుటా మల్లీమొగ్గల తెల్లకోక... ఇగో... ఈ మారెల్లి పట్కొస్తనే...' తరహాలో మగాడు ఎలాగోలా ప్రలోభపెట్టి తన కోరిక తీర్చుకునేవాడు. సరసత ఎరుగని మొరటువాడైతే రావణాసురుడి ఫక్కీలో పరస్త్రీలను చెరపట్టడం, బలాత్కరించడం కానిచ్చేవాడు. ఈ దశలోనే ఉద్దాలకుడనే ముని ఇంటికి వచ్చిన అతిథి- ముని భార్యతో పొందుకోరాడు. సాధ్వియైన తన తల్లిని అలా పరాయివాడు కామించడం కొడుకు శ్వేతకేతువు దుర్భరంగా తోచింది. గొప్ప తపశ్శాలియైన శ్వేతకేతువు ఉగ్రుడై 'ఇది మొదలుగా వివాహితలను పరులు కోరడానికి వీల్లేదు... మానవజాతికి ఈ రకమైన కట్టడిని నేను ఏర్పాటు చేస్తున్నాను' అని తీవ్రస్వరంతో ప్రకటించడాన్ని భారతం ఆదిపర్వం వివరించింది. అది నేపథ్యంగా భారతీయ వివాహవ్యవస్థలో ఒక స్పష్టత చోటుచేసుకుంది. కామం విషయంలో క్రమశిక్షణ మొదలైంది. భృగుని భార్య పులోమ గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను కామించిన రాక్షసుడొకడు పందిరూపంలో వచ్చి ఆమెను అపహరించబోయాడు. ఆ దురాగతాన్ని గమనించిన ఆమె కడుపులోని బిడ్డ తీవ్రక్రోధంతో గర్భం నుంచి వెలువడ్డాడు. ఆయన పేరు చ్యవనుడు. చ్యవనుడి తేజస్సుకే రాక్షసుడు కాలి బూడిదైపోయాడు. దాంపత్య ధర్మాన్ని నిష్ఠగా కొనసాగించేవారికి రక్షణ ఎలా లభిస్తుందో, పవిత్ర వైవాహిక జీవనఫలంగా లభించే సంతతికి ఎంతటి శక్తిసామర్థ్యాలు సమకూరతాయో భారతం కథలు కథలుగా వివరించి చెప్పింది.దాంపత్య జీవనానికి అన్యోన్య అనురాగం పునాది. పరస్పర అనురాగంతో బంధం బలపడ్డప్పుడు- భార్యావియోగం పురుషుడిలో ఎంతటి వేదనకు కారణమవుతుందో రామాయణం వివరించింది. భార్యకు ఏదైనా జరిగితే భర్తకు ఏమనిపిస్తుందో భారతం చెప్పింది. ద్రౌపదిని సైంధవుడు అపహరించుకుపోతే ఎక్కడో దూరంగా ఉన్న ధర్మజుడికి 'చేయిపెట్టి కలచినట్లయ్యెడు చిత్తంబు... తనువు నిశ్చేష్టమయ్యె...' అనిపించింది. చిక్కని అనురాగానికి చక్కని సంతానం వరంగా లభిస్తుంది. బిడ్డను చూడగానే తండ్రికి కలిగే ఆనందానుభూతిని వర్ణిస్తూ శకుంతల 'తాన తననీడ నీళ్లులలో ఏర్పడ చూచునట్లు... మహానందము పొందు...' అంది భారతంలో. హాలీవుడ్ అందాలతార ఏంజెలీనా జోలీ మాతృత్వపు మహానందాన్ని ఇటీవలే గొప్పగా వర్ణించి చెప్పింది. తల్లిని కావడంవల్ల తన అందం మరింత పెరిగిందంది. పండును రుచి చూడగానే చెట్టుసారం తెలిసినట్లు- పిల్లల ప్రవర్తన చూడగానే లోకం వారి తల్లిదండ్రుల దాంపత్య సారం అర్థం చేసుకుంటుంది. తమలపాకుతో నీవొకటిస్తే, తలుపుచెక్కతో నే రెండిస్తా... తరహా సరసాలు మనలో చాలామందివి. అదే బాధ! నిజానికి ఇల్లంటే ఒక గుడి. దానిలో వీలైనంత ఎక్కువసేపు గడపాలనిపించడం మంచి ఇంటి లక్షణం. దాని విషయంలో ఈ జాతి నిర్లక్ష్యం వహిస్తోంది. సత్‌సంతానం కోసమే దాంపత్య భోగం అనే సత్యాన్ని విస్మరిస్తోంది. 'కుమారసంభవ ప్రమాదమెరుగని అనవరత రతి మన సమాజం ద్రుతగతి...' అని కాళోజీ బాధపడ్డారు. కలయికలు అసమభోగాలై ఫలితాన్ని తారుమారు చేస్తున్నాయి. వేపవిత్తు నాటితే రసాల మామిడి మొలుస్తుందా మరి! చివరికి 'ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు.. ముద్ద పెట్టుమనగ గుద్దెనేడు...' అని తల్లిదండ్రులు వాపోవడం మిగులుతోంది. దాంపత్యాన్ని అద్భుతమైన ఒకానొక కళగా నిర్వహించకపోవడం వల్ల చెడు పరిణామాలివి!
దంపతుల్లో అనురాగం స్థానే అహంకారం చోటు చేసుకున్నప్పుడు, విడివిడిగా ఎవరి వ్యక్తిత్వాలకు వారు ప్రత్యేక విలువలను ఆపాదించుకున్నప్పుడు దాంపత్య సమతౌల్యం దెబ్బతింటుంది. మనిషిలో వివేకం మేలుకోవలసింది అప్పుడే! తల్లిదండ్రులైతే ఈ అవసరం మరింత ఎక్కువ. అరమరికలకు దూరంగా- ఆత్మీయత అనురాగం పునాదులుగా నిలిచిన దాంపత్యం సమాజానికి మంచి పౌరులను కానుక చేస్తుంది. దాంపత్య భాగ్యమే నిజమైన సౌభాగ్యం! సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకోవాలని మనిషి తహతహలాడితే- ఆ ఇల్లు స్వర్గం. కాకపోతే అది కేవలం మకాం. ఇంటిలోని పోరు ఇంతింత గాదయా... అనే దుస్థితి ఏర్పడితే దానికి ఇద్దరూ బాధ్యులే. తల్లిదండ్రుల బాంధవ్యాల్లో నిర్లిప్తత, నైరాశ్యం పెరిగితే అది పిల్లల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయమై మానవీయమైన తీర్పు వెలువరించింది. పిల్లలకోసమని తల్లిదండ్రులు తమలోని వైరుధ్యాలను సమీక్షించుకోవాలని కోరింది. అవగాహన లోపాల్ని అధిగమించాలంది. 'కలిసి ఉండటానికి అనుకూలమైన దారులన్నీ పూర్తిగా మూసుకుపోయాక మాత్రమే తల్లిదండ్రులు విడిపోవడం గురించి ఆలోచించాలి' అని ఆదేశించింది. భార్యాభర్తలు ఘర్షణ పడవచ్చు, విడిపోనూవచ్చు. తల్లిదండ్రులు ఆ పనిచేస్తే పిల్లలకు ద్రోహం జరుగుతుంది. విడిపోవడానికేముంది! ఒక్క కాగితమూ, రెండు సంతకాలూ చాలు. కలవడానికే మూడు ముళ్లూ, ఏడడుగులూ అవసరం. 'ఇరవై నెలల బిడ్డను నానుంచి విడాకులు వేరుచేశాయి. ఇన్నాళ్ళ నా వేదన తీరి, ఎదురుచూపులు ఫలించి దేవుడు కరుణించి అత్యున్నత న్యాయస్థానం ద్వారా నాకు అనుగ్రహం ప్రసాదించాడు' అని ఆ తల్లి నిట్టూర్చింది. అర్థం కావలసినవారికి ఆ మాటలు సరిగ్గా అర్థం అయితే అంతే చాలు!
(Eenadu, editorial, 30:11:2008)
_________________________________________
Labels: Life/telugu
Monday, January 05, 2009
TID BITS

The magnificent color of butterfly wings does not come from pigmentation directly on the wing, but from the tiny scales that hang on the wing like shingles on a house roof. These scales are so small they look like powder when rubbed onto the fingers.
Each King in a deck of playing cards represents a great king from history. Spades - King David; Clubs - Alexander the Great; Hearts - Charlemagne; and Diamonds - Julius Caesar.
Chewing gum was invented by a dentist, named William Semple - as a way to exercise your jaws.
111 111 111 x 111 111 111 = 12345678987654321
Our eyes can distinguish as many as 10 million distinct color variations.
There are more insects in a single square mile of fertile soil than there are people on the entire earth.
The carrots you munch on weren’t orange always. Carrots started out red, white and purple and are believed to have been grown in Afghanistan in the seventh century, with purple exteriors and yellow pulp. The Dutch developed the orange carrot and the French cultivators are said to have developed its elongated shape.
There is a word in the English language with only one vowel, which occurs six times: Indivisibility.
The deepest location on Earth is Mariana Trench, about 11km deep in the North Pacific ocean.
When glass breaks, the cracks move at speeds of more than 4,500 km/h (3,000 miles)
Earth is the only planet not named after a Roman or Greek god.
A neutron star is the strongest magnet in the universe.
The ice-cream cone was invented in 1904 at the St Louis World Fair (USA). An ice cream vendor ran out of paper cups and asked a nearby waffle stall to make some thin ones that would hold his ice-cream scoops.(An email forward)
___________________________________________________
Labels: Amazing
Present scene

(An email forward)_____________________________________________
Labels: Management
Saturday, January 03, 2009
రాజకీయ 'క్రీడాభిరామం'

మనిషికి మనిషి తోడు లేకుండా రోజు గడవదు. ప్రతి మనిషీ తన అవసరాల నిమిత్తం మరో మనిషిపై ఆధారపడక తప్పదు. మనిషి సంఘజీవి- అనే తీర్మానానికి పునాది అదే! 'నా కొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు' అనే కవి నిరాశలోంచి తొంగిచూసే అవసరం- మానసికమైనది. నలుగురినీ మంచి చేసుకోమని పెద్దలు చెప్పేది- మనిషి చివరిరోజు భౌతికమైన అవసరాలకు చెందినది. జీవన ప్రవాహంలో ఎక్కడెక్కడినుంచో నెట్టుకొచ్చిన వ్యక్తులతో సమూహాలు ఏర్పడతాయి. అవసరాలు నేపథ్యంగా వారి మధ్య ఒక కట్టుబాటు మొదలవుతుంది. వారిది ఒక సంఘం అవుతుంది. 'మానింది మందు, బతికింది ఊరు' అనే సామెత ఆ పాదులోంచే పుట్టింది. ప్రతి సంఘాన్నీ అవసరాలే నడిపిస్తాయనుకోవడం పొరపాటు. ఉద్యమాల నిర్వహణకోసం కొన్ని సంఘాలు రూపుదిద్దుకుంటాయి. ఉదాత్త లక్ష్యాలకోసం మరికొన్ని. సమాజమన్నాక, రకరకాల వారు ఉంటారు. కొందరిని ఆశయాలు నడిపిస్తాయి. మరికొందరిని ఆశలు నడిపిస్తాయి. చాలామందిని అవసరాలు పరుగెత్తిస్తాయి. స్వరాజ్య ఉద్యమాన్ని అప్పట్లో ఆశయం ఉత్తేజపరచింది. రాజకీయ నిరుద్యోగ సంఘాలను ఇప్పట్లో ఆశ ప్రేరేపిస్తున్నది. కడుపు నింపుకొనేందుకు కష్టజీవులు సైతం కలిసి సంఘాలుగా ఏర్పడతారు. 'కూలన్నల సంగమూ- కూడుతున్న సంగము... రైతన్నల సంగమూ- రగులుతున్న సంగము, పేదోళ్ళంతా పెడదామిక సంగం... సంగం... సంగం... రండిరో... లెండిరో... సంగం పెడదాం' అనే గీతం కష్టజీవులను ఉత్తేజపరచి సంఘటితం చేసే లక్ష్యంగా వెలువడింది. సభ్యుల బలాన్ని, ఆశయాలను బట్టి సంఘాలకు గుర్తింపు దొరుకుతుంది.
ఉదాత్త ఆశయాలకోసం ఉద్యమాలు నిర్మిస్తామని నినదించే నేతలు సైతం- తమ తమ కుల సంఘాలతో రహస్య సమావేశాలు జరపడం ఈ దేశంలో సహజం. అదొక చేదు నిజం! సూదికి కలపడం లక్ష్యం. కత్తెరకు విడదీయడం నైజం. వ్యక్తులను ఉద్యమాలు దగ్గర చేస్తాయి. కులాలు చీలుస్తాయి. పగలంతా పత్రికల్లో, ఛానెళ్లలో పడి తిట్టుకుని, రాత్రిళ్లు ఒకరినొకరు 'మనోడే' అంటూ కావలించుకోవడం చూసేవాళ్ళకు జుగుప్సగా తోచినా, అది నేతల నిత్యకృత్యమైపోయింది. 'మనోడే' అనే మాటకు అర్థమేమిటో ఈ దేశంలో పసిపిల్లవాడిని అడిగినా చెబుతాడు. అదే విషాదం! రాబోయే రోజుల్లో కులాల పేరుతోనే నేరుగా రాజకీయ పార్టీలు ఏర్పడినా ఏమీ ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కులం పేరు చెప్పి రహస్యంగా సీట్లు, ఓట్లు దేబిరిస్తున్న వారంతా అప్పుడు బాహాటంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటారు. భారతదేశ రాజకీయ ముఖచిత్రం ఇలా కులం పేరుతో దుర్వాసన కొడుతుంటే- అక్కడక్కడా సజ్జన సంఘాలు చక్కని పరిమళాలను వెదజల్లుతుంటాయి. 'మతం వేరయితేను ఏమోయి! మనసులొకటై మనుషులుంటే, జాతి అన్నది లేచి పెరిగి, లోకమున రాణించునోయి' అన్న మహాకవి ప్రబోధాన్ని మకుటంగా స్వీకరించిన సత్పురుషులు ఇంకా ఈ నేలమీద ఉన్నారు. వాళ్ళెవరూ మనకు కుల సంఘాల్లో తగలరు. మనం వెతికితే వాహ్యాళి బృందాల్లో, ఆధ్యాత్మిక సేవా సంఘాల్లో, గ్రంథాలయ పాఠక సమితుల్లో, సత్సంగాల్లో, కవుల వేదికల్లో, కళాకారుల సదస్సులలో కనబడతారు. వారిని గుర్తుపట్టడానికి సులువైన దారి ఏమంటే- వారు మనుషుల్లా జీవిస్తారు, మనుషుల్ని ప్రేమిస్తారు. ఆత్మీయత, ఆపేక్ష, బెంగ, కన్నీరు, జాలి, దయ... వంటి కొన్ని మానవ సహజమైన చిహ్నాలు వారిలో గోచరిస్తాయి.
దేవుడు ప్రత్యక్షమై 'ఏం కావాలో కోరుకో' అని అడిగితే '...నితాంత అపార భూతదయను ప్రసాదించు' అని కోరాడు సుదాముడు. భూతదయ అంటే కేవలం మానవులకే పరిమితమైనది కాదు. పశువూ పక్షీ చెట్టూ చేమా... అన్నింటినీ ప్రేమించగల లక్షణం అది. శ్రీరమణ 'బంగారు మురుగు' కథలో బామ్మ ఈ స్వభావాన్ని చాలా సరళంగా చెప్పింది. 'చెట్టుకు చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకు నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం...' అంది. ఈ తరహా భూతదయను మనం ఈవేళ పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవలసి వస్తోంది. కుల సంఘాలతో మనం ఇక్కడ కొట్టుకు చస్తుంటే- పాశ్చాత్యులు మాత్రం ప్రకృతి ప్రేమికుల సమాజం, పర్యావరణ సంరక్షణ సమితి, జంతు ప్రేమికుల పార్టీ, మానవ హక్కుల పరిరక్షణ సంఘం... వంటి మానవీయ కోణంతో కూడిన సంక్షేమ సంఘాలతో ముందుకొస్తున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీలు పెట్టదలచినా- అలాంటివారే మంచి పార్టీల స్థాపనకు అర్హులు. మన దేశానికీ జాలి, దయ కలిగి శీలంతో వ్యక్తిత్వంతో ఆకట్టుకోగలిగే సామాజిక నేతలు కావాలి, రాజకీయ నాయకులు కాదు. సూది, కత్తెరల్లాగ- కలిపి కుట్టే దిశగా కళా సంఘాలు, కలత పెట్టే దిశగా కుల సంఘాలతో మనం ఇక్కడ సతమతం అవుతుంటే- ఒక ఆస్ట్రేలియన్ పెద్దమనిషికి విలక్షణమైన ఆలోచన తోచింది. రసికులకోసం రాజకీయ పార్టీ స్థాపిస్తే తప్పేముందని ఫియోనా పాటెన్‌కు అనిపించింది. 'ద ఆస్ట్రేలియన్ సెక్స్ పార్టీ' పేరుతో ఈ మధ్యనే ఆయన రాజకీయ సంస్థను స్థాపించాడు. శృంగారంపట్ల ఆసక్తిగలవారంతా తమ సంఘంలో చేరతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. వారి మద్దతుతో ఎన్నికల్లో కొన్ని స్థానాలూ గెలవొచ్చని ఆయన నమ్మకం. దానికి తగ్గట్టే రసవత్తరమైన ఎన్నికల ప్రణాళికను సైతం ఆయన ప్రకటించాడు. ఆ పేరునుబట్టి మిగిలిన వివరాలన్నింటినీ మనం ఊహించుకోవడం తేలికే! మరి దానికి ఏపాటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.
(Eenadu, editorial, 23:11:2008)
_______________________________________
Labels: Life/telugu
Oneness principle in the elegant universe
15 Dec 2008, 0000 hrs IST, MANI BHAUMIK
Can one be a person of both devotion and science?
Is there room in a universe of inherent quantum uncertainty for the presence of a stabilisingforce?
Is there an architect behind the magnificent structure we call natural law?
The answer to all of these questions could be 'yes'.
Science and spirituality are indeed two sides of the same coin. Our consciousness is the window that allows us to perceive all reality. We realise spiritual experience through consciousness. The same consciousness also facilitates harvesting of cherished and profound scientific knowledge. So there is the strong possibility that there is a deep, hidden relationship between those two experiential comprehensions. How do we bring together the apparently disparate perceptions garnered by our consciousness so that we reconcile science and spirituality? See things in an entirely new light. But because of the counter-intuitive ideas and esoteric maths involved in recent mind-expanding revelations in quantum physics and cosmology, the implications have not yet permeated public awareness.
Consider the following evidence:
1. The underpinning of our daily world is significantly different from what we see as reality. Paradoxically, the primary aspects of our existence are totally abstract.
2. This unimaginably vast universe came from a tiny nugget of space much, much smaller than even an atom.
3. The total energy this enormous, busy universe is, has been, and always will be zero.
4. The immensely huge cosmos is amazingly consistent. The same natural laws apply in every corner of the universe.
5. Despite nature's seemingly immense diversity, science is ever coming closer to proving that all that exists derives from a single source.
6. Despite the built-in quantum uncertainty in the bedrock of reality and all the chaos in our daily world, the universe fundamentally appears to be an orderly place.
The above seem to indicate the existence of a higher power providing a guiding hand. If there was no purpose for this universe or our lives, if there was nothing guiding this entire universe, why then is everything not just in utter disorder, rather than being so exquisitely coordinated on an unimaginably vast scale?
One could argue this mystery away by presuming that there are innumerable other universes, each with different possibilities of natural laws and other factors. Our universe merely happens to be the one that where everything is "just right" for the elegantly systematic works that allow for the emergence of intelligent beings like us. The problem with such a line of reasoning is that there does not appear to be even a hint yet of a possibility of validating the existence of any other universe than the only one we know. Our scientific knowledge thus seems to support the belief in a higher power that is at the core of all spiritual traditions. Problems arise only when the higher power is conceived as a person or gets mixed up with detrimental superstitions.
Some scientists now go boldly where very few have gone before. Roger Penrose and Albert Einstein wondered why the universe has developed in obedience to laws that our consciousness seems designed to grasp. Could this imply that our consciousness is a fundamental reality that is intertwined with the universe and the higher power behind it? In the backdrop of recent scientific discoveries, it could be asserted that man and Creator indeed comprise an inseparable oneness. Perceiving ourselves as part of this much larger entity appears necessary for an abiding happiness.
The writer is author of 'Code Name God' and 'The Cosmic Detective'.
(Times Of India, The Speaking Tree, 15:12:2008)
_________________________________________
Labels: Religion




















